టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా లాంటి చేతకాని దద్దమ్మను తాను ఎక్కడా చూడలేదని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే , మాజీ మంత్రి కొలుసు పార్థసారధి విమర్శించారు. అసత్యారోపణలు మానకుంటే మాజీ మంత్రి నాలుక కోస్తానంటూ ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్‌లపై విరుచుకుపడ్డారు. అధికారంలో ఉన్న ఐదేళ్లు రాష్ట్రాన్ని తండ్రీకొడుకులిద్దరూ దివాళా తీయించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.