మంత్రి దేవినేని ఉమ అవినీతి బట్టబయలైందని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు.
వరద కాలువ కోసం మంత్రికి ఏడుకోట్లు
Published Sun, Oct 16 2016 12:44 PM | Last Updated on Fri, May 25 2018 9:20 PM
ప్రొద్దుటూరు వరద కాలువ టెండర్‌ల విషయంలో మంత్రి దేవినేని ఉమ అవినీతి భాగోతం బట్టబయలైందని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. వరద కాలువ టెండర్‌ల విషయంలో అవినీతికి పాల్పడిన మంత్రికి సుమారు రూ. ఏడు కోట్ల వరకు ముట్టాయని ఆయన ఆరోపించారు. ఈ రోజు కడపలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షులతో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి చర్యలు మానుకోకపోతే.. దేవినేని చాంబర్ ఎదుట నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు.
Advertisement
Advertisement