
ఇనగలూరులో సీఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఎంపీ, కలెక్టర్, ఓఎస్డీ తదితరులు
తొండూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 25వ తేదీన వైఎస్సార్ జిల్లాకు రానున్నారు. తొండూరు మండలం ఇనగలూరులో జరిగే ఎరుకుల నాంచారమ్మ దేవర (జాతర)కు హాజరవుతారు. ఈ నేపథ్యంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, కలెక్టర్ హరికిరణ్ సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను సోమవారం సమీక్షించారు. గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ సెంటర్, పలు అభివృద్ధి పనులకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపనలు చేస్తారని ఈ సందర్భంగా వారిద్దరూ తెలిపారు.
దేవరకు సంబంధించి సీఎం షెడ్యూల్‌పై ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డితో కలెక్టర్, ఎంపీ చర్చించారు. 136 ఏళ్ల తర్వాత జరుగుతున్న దేవరకు సీఎం రానుండటంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేయనున్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
(చదవండి: ఉగాది వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్)