దేవినేని ఉమ చిత్తుగా ఓడిపోవడానికి రెడీగా ఉండు.. | Vasantha Nageswara Rao Lashes Out At Devineni Uma | Sakshi
Sakshi News home page

దేవినేని ఉమ చిత్తుగా ఓడిపోవడానికి రెడీగా ఉండు..

Published Fri, Jun 8 2018 8:16 PM | Last Updated on Fri, Jun 8 2018 8:23 PM

Vasantha Nageswara Rao Lashes Out At Devineni Uma - Sakshi

సాక్షి, నందిగామ: ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుపై మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన శుక్రవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ...‘దేవినేని ఉమ నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండు. హత్యా రాజకీయాలు, ఆర్థిక నేరాలు చేసింది నీవే. వంగవీటి మోహనరంగా హత్యకేసులో మీ అన్న దేవినేని వెంకట రమణ ముద్దాయి కాదా?. నీ గురించి నీ అన్న గురించి ప్రజలకు తెలుసు. 2019 ఎన్నికలలో మైలవరం నియోజకవర్గం నుంచి వసంత కృష్ణప్రసాద్‌ చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోవడానికి సిద్ధంగా ఉండు. నీ వదిన ప్రణీతను చంపి నువ్వు రాజకీయాల్లోకి వచ్చిన సంగతి అందరికీ తెలుసు. జలవనరుల శాఖా మంత్రిగా వ్యవహరిస్తున్నదేవినేని ఉమా కనీసం తన ప్రాంత ప్రజలకు సాగునీటిని కూడా అందించలేకపోతున్నారు. ’ అంటూ ధ్వజమెత్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement