Krishna Prasad
-
మళ్ళీ కోహ్లి హవా ... ఒక్క మ్యాచ్ తో మారిన తీరు
ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి కొద్ది రోజుల ముందు వరుకూ భారత్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి క్రికెట్ కెరీర్ పై ఎన్నో విమర్శలు చెలరేగాయి. ముఖ్యంగా ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లీ ఘోర వైఫల్యం ఇందుకు ప్రధాన కారణం. అయితే రోజులు ఎప్పుడూ ఒకేలాగా ఉండవు. ఒక్క మ్యాచ్ తో పరిస్థితి అంతా మారిపోయింది. గత ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో అజేయంగా నిలిచిన విరాట్ కోహ్లీ, భారత్ బ్యాటింగ్ లో తన మునుపటి వైభవాన్ని పునరుద్ధరించుకున్నాడు.పాకిస్తాన్ మ్యాచ్ అంటే విజృంభించి ఆడే కోహ్లీ ఇవేమీ కొత్తేమీ కాదు. అయితే న్యూజిలాండ్‌తో ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ భారత్ ఆఖరి లీగ్ మ్యాచ్ కోహ్లీ కి చాల ప్రత్యేకం. ఇది కోహ్లీకి 300వ వన్డే మ్యాచ్. ఈ మైలురాయిని చేరుకున్న భారత్ ఆటగాళ్లలో కోహ్లీ ఏడవ వాడు. గతంలో లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్, మాజీ కెప్టెన్లు సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, ఎంఎస్ ధోని వంటి హేమాహేమీలు ఈ రికార్డ్ సాధించిన వారిలో ఉన్నారు.రికార్డుల వేటలో కోహ్లి..కోహ్లీ తన 300వ వన్డేకు చేరుకుంటున్న తరుణంలో, భారత బ్యాటర్ కేఎల్ రాహుల్ ప్రశంసలతో ముంచెత్తాడు. భారత క్రికెట్‌పై కోహ్లీ ప్రభావం ఎంత ఉందో మాటల్లో చెప్పడానికి చాలా కష్టం అని రాహుల్ ప్రశంసలతో ముంచెత్తాడు. రాహుల్ కోహ్లీని తానూ క్రికెట్లో ఎల్లప్పుడూ ఆరాధించే "ముఖ్యమైన సీనియర్ ఆటగాడు" అని ప్రశంసించాడు. "300 వన్డే మ్యాచ్‌లు... కోహ్లీ భారత క్రికెట్‌కు ఎంత గొప్ప సేవకుడో వ్యక్తీకరించడానికి మాటలు సరిపోవు" అని రాహుల్ మ్యాచ్‌కు ముందు విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించాడు.కోహ్లీ ఈ మ్యాచ్ తో మరో రికార్డ్ సాధించాలన్న ఆశయంతో ఉన్నాడు. 36 ఏళ్ల కోహ్లీ న్యూజిలాండ్‌పై 3000 కంటే ఎక్కువ అంతర్జాతీయ పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో చేరడానికి ఇంకా 85 పరుగులు మాత్రమే కావాల్సి ఉంది. గతంలో సచిన్ టెండూల్కర్ (3345), రికీ పాంటింగ్ (3145), జాక్వెస్ కల్లిస్ (3071) మరియు జో రూట్ (3068) తర్వాత ఈ మైలురాయిని చేరుకున్న ఐదవ బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ చరిత్ర సృష్టిస్తాడు. న్యూజిలాండ్‌పై కోహ్లీ ఇంతవరకూ 55 వన్డే మ్యాచ్‌ల్లో 47.01 సగటుతో 2915 పరుగులు సాధించాడు. ఇందులో 9 సెంచరీలు మరియు 15 అర్ధ సెంచరీలు ఉన్నాయి.కోహ్లీ పై బ్రేస్‌వెల్ ప్రశంసలు "ఇది చాలా పెద్ద విజయం" అని ప్రత్యర్థి న్యూజిలాండ్ జట్టు ఆల్ రౌండర్ మైఖేల్ బ్రేస్‌వెల్ సైతం కోహ్లీ మైలురాయి గురించి ప్రశంసలు గుప్పించాడు. "ఒక క్రికెటర్ కెరీర్లో 300 వన్డే మ్యాచ్ లు ఆడటం చాల గొప్ప విషయం. అదీ ఒకే ఫార్మాట్లో. కోహ్లీ తన తన కెరీర్‌ను ఎలా ముందుకు తీసుకెళ్లాడనే దానికి ఇది నిదర్శనం అని నేను భావిస్తున్నాను." అని బ్రేస్‌వెల్ వ్యాఖ్యానించాడు.2023 ఐపీఎల్ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో కోహ్లీతో కలిసి బ్రేస్‌వెల్ ఆడాడు. అతనికి కోహ్లీ గురించి ప్రత్యక్ష అవగాహన ఉంది. "ఆర్సిబిలో అతను ప్రతి మ్యాచ్‌కు ఎలా సిద్ధమయ్యాడో నేను ప్రత్యక్షంగా చూశాను. భారత్ జట్టు లో చాల మంది అగ్రశ్రేణి ఆటగాళ్లు ఉన్నారు. అందులో కోహ్లీ ఒకడు. భారత్ తో ఎదురయ్యే సవాలు ఎదుర్కోవటానికి మేము ఏంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాం," అని బ్రెసెవెల్ అన్నాడు.న్యూజిలాండ్ రికార్డ్ ఐసిసి టోర్నమెంట్లలో న్యూజిలాండ్ భారత్ పై ఆధిపత్యం చెలాయించింది. హెడ్-టు-హెడ్ రికార్డ్ లో న్యూజీలాండ్ 10-5 ( డబ్ల్యూ టి సి ఫైనల్‌తో సహా) తో ఆధిపత్యం లో ఉంది. అయితే ఈ రెండు జట్ల మధ్య జరిగిన వన్డేల్లో అయితే భారత్ 60-58 తో ఆధిక్యంలో ఉంది. న్యూజిలాండ్ తో జరిగే మ్యాచ్ లో భారత్ సీనియర్ పేస్ బౌలర్ మహమ్మద్ షమీ ఆడటం అనుమానంగానే ఉంది. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మహమ్మద్ షమీ కాలి మడమ నొప్పితో ఇబ్బంది పడిన విషయం తెలిసిందే.ఈ కారణంగా షమీ స్థానంలో ఎడమచేతి వాటం పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను భారత్ ఈ మ్యాచ్ లో ఆడించే అవకాశముంది. న్యూజిలాండ్ లైనప్‌లో ఐదుగురు ఎడమచేతి వాటం బ్యాటర్ ఉండటం కూడా ఇందుకు ఒక కారణం. శుక్రవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్ లో బౌలింగ్ కోచ్ మోర్న్ మోర్కెల్ పర్యవేక్షణలో అర్ష్‌దీప్ 13 ఓవర్లు ఫుల్ రన్-అప్‌తో బౌలింగ్ చేయగా, షమీ 6-7 ఓవర్లు మాత్రమే కుదించబడిన రన్-అప్‌తో బౌలింగ్ చేశాడు. ఫిబ్రవరి 23న పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తన మూడవ ఓవర్ వేసిన వెంటనే షమీ ఫిజియోల నుండి తన కుడి కాలుకు చికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. ముఖ్యమైన సెమీ-ఫైనల్స్‌కు ముందు భారత్ షమీకి విరామం ఇచ్చే అవకాశం లేకపోలేదు.చదవండి: యువీ స్పిన్ మ్యాజిక్.. రాయుడు మెరుపులు! సౌతాఫ్రికాను చిత్తు చేసిన భారత్ -
Champions Trophy 2025: దాయాదుల సమరం.. చరిత్ర ఏం చెబుతుందంటే..?
భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఏ వేదికపై జరిగినా ప్రపంచ క్రీడాభిమానుల దృష్టిని ఆకర్షిస్తుంది. వన్డే ప్రపంచ కప్ పోటీల్లో భారత్, పాకిస్తాన్ వరుసగా ఎనిమిది సార్లు తలపడగా భారత్ తన పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించి అన్ని మ్యాచ్ ల్లో విజయం సాధించింది. మరో మారు ఈ రెండు జట్లు ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ లో తలపడనున్న నేపథ్యంలో ఈ మ్యాచ్ ల వివరాలు మీ కోసం.1992, (సిడ్నీ): భారత్ 43 పరుగుల తేడాతో విజయంఆశ్చర్యకరంగా అనిపించినప్పటికీ, భారత్ మరియు పాకిస్తాన్ ప్రపంచ కప్ మొదటి నాలుగు ఎడిషన్లలో ఎదురెదురుపడలేదు. సిడ్నీ క్రికెట్ మైదానంలో భారత్ పాకిస్తాన్‌ను ఎదుర్కొన్నప్పుడు మొదట బ్యాటింగ్ చేసిన భారత్ తన తొలి ప్రపంచ కప్ ఆడుతున్న సచిన్ టెండూల్కర్ 62 బంతుల్లో 54 పరుగులుతో రాణించడంతో 49 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. 217 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్తాన్ 48.1 ఓవర్లలో 173 పరుగులకే ఆలౌటైంది. కపిల్ దేవ్, మనోజ్ ప్రభాకర్, జవగల్ శ్రీనాథ్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. సచిన్, వెంకటపతి రాజు రాణించారు. పాక్ ఆటగాడు అమీర్ సోహైల్ 95 బంతుల్లో 62 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జావేద్ మియాందాద్ 40 పరుగులు చేసి ఔటయ్యాడు.1996, (బెంగళూరు): భారత్ 39 పరుగుల తేడాతో విజయం1996లో జరిగిన ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్లో భారత్, పాకిస్తాన్‌లు రెండోసారి తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో గాయం కారణంగా వసీం అక్రమ్ లేకపోవడం రెండు జట్లకు డూ-ఆర్-డై అనే అంశంగా మారింది. నవజ్యోత్ సిద్ధు 115 బంతుల్లో 93 పరుగులు చేసి భారత్‌కు సరైన ఆరంభం ఇచ్చాడు. వకార్ యూనిస్‌పై అజయ్ జడేజా చేసిన ఎదురు దాడి భారత్-పాకిస్తాన్ క్రికెట్ చరిత్ర లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. జడేజా డెత్ ఓవర్లలో విజృంభించడంతో భారత్ 50 ఓవర్లలో 287/8 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా, సయీద్ అన్వర్, సోహైల్ తమ జట్టుకు అద్భుతమైన ఆరంభాన్ని అందించారు, పాకిస్తాన్ 10 ఓవర్లలో 84/0తో చెలరేగింది. సోహైల్ తొందరబాటుతో వెంకటేష్ ప్రసాద్ ని కవ్వించడం తో మ్యాచ్ అనూహ్యమైన మలుపు తిరిగింది. వెంకటేష్ ప్రసాద్ పాకిస్తాన్ ఓపెనర్ మిడిల్ స్టంప్‌ను పడగొట్టి ప్రతీకారం తీర్చుకోవడంతో పాకిస్తాన్ పతనం ప్రారంభమైంది. ప్రసాద్, అనిల్ కుంబ్లే వారి సొంత గడ్డ అయిన బెంగళూరులో బాగా రాణించడంతో పాకిస్తాన్ 248/9 తో ఇన్నింగ్స్ ముగించింది. దీనితో భారత్ సెమీఫైనల్‌కు చేరుకుంది.1999, (మాంచెస్టర్): భారత్ 47 పరుగుల తేడాతో విజయంఈ భారత్ xపాకిస్తాన్ మ్యాచ్ మరే ఇతర మ్యాచ్ కి తీసిపోని భావోద్వేగంగా జరిగింది. భారత్, పాకిస్తాన్ మధ్య కార్గిల్ యుద్ధం జరిగిన సమయంలోనే ప్రపంచ కప్ ప్రారంభమైంది, కానీ మాంచెస్టర్‌లోని చారిత్రాత్మక ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో పోటీ మ్యాచ్ వరకే పరిమితం అయ్యే విధంగా చూసుకోవడంలో రెండు జట్లు బాగా కృషి చేశాయి. సచిన్ టెండూల్కర్ 45 పరుగులతో భారత్‌ను ఆదుకున్నాడు. ఆ తర్వాత రాహుల్ ద్రవిడ్ మరియు కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ చెరో అర్ధ సెంచరీతో భారత్‌ను 227/5 స్కోరుకు చేర్చారు. అన్వర్ మరోసారి రాణించినప్పటికీ 36 పరుగులకే ప్రసాద్ అతన్ని వెనక్కి పంపాడు. ఆ తర్వాత, పాకిస్తాన్ పతనమైంది.ప్రసాద్ ఐదు వికెట్లు, జవగల్ శ్రీనాథ్‌తో కలిసి మిడిల్ ఆర్డర్‌ను దెబ్బతీసి పాకిస్తాన్‌ను 27 బంతులు మిగిలి ఉండగానే 180 పరుగులకు ఆలౌట్ చేశాడు.2003, (సెంచూరియన్): భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయంఇది భారత్ xపాకిస్తాన్ ప్రపంచ కప్ మ్యాచ్‌ల్లో అత్యుత్తమ మ్యాచ్‌గా పరిగణించబడుతుంది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను రాజకీయ ఉద్రిక్తతలు తలెత్తిన సమయంలో, భారత్ మరియు పాకిస్తాన్ 2003 ప్రపంచ కప్‌లో సెంచూరియన్‌లో తలపడ్డాయి. సచిన్ టెండూల్కర్ కి బహుశా అతని కెరీర్లో అత్యుత్తమ ప్రపంచ కప్ ఇన్నింగ్స్ గా నిలిచిపోతుంది. అతని 98 పరుగులు చేసి మైమరిపించింది. 273 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి భారత్‌కు అవసరమైన స్కోర్ రేట్ ని అందించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 273/7 స్కోర్ సాధించగా, బదులుగా భారత్ 45.4 ఓవర్లలో నాలుగు వికెట్లకే లక్ష్యాన్ని సాధించింది.2011, (మొహాలీ): భారత్ 29 పరుగుల తేడాతో విజయంసొంత గడ్డ పై జరిగిన కీలకమైన ప్రపంచ కప్ సెమీఫైనల్ మ్యాచ్ లో మళ్ళీ సచిన్ టెండూల్కర్ విజృభించి భారత్ తరఫున అత్యధిక స్కోరు సాధించాడు. కానీ సచిన్ నాలుగు సార్లు క్యాచ్ లు జారవిడవడంతో తప్పించుకొని 85 పరుగులు చేయగా సురేష్ రైనా అజేయంగా 36 పరుగులు చేయడంతో భారత్ స్కోర్ 260/6కి చేరుకుంది. దీనికి సమాధానంగా, ఐదుగురు భారత బౌలర్లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. దీనితో పాకిస్తాన్ 231 పరుగులకు ఆలౌట్ కావడంతో భారత్ ఫైనల్‌కు చేరుకుంది.2015, (అడిలైడ్): భారత్ 76 పరుగుల తేడాతో విజయంఅడిలైడ్లో జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ కి విరాట్ కోహ్లీ అండగా నిలిచాడు. విరాట్ కోహ్లీ తన రెండవ ప్రపంచ కప్ సెంచరీని సాధించాడు. శిఖర్ ధావన్ మరియు సురేష్ రైనా అర్ధ సెంచరీలతో కలిసి భారత్ 7 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. మహమ్మద్ షమీ నాలుగు వికెట్లు పడగొట్టడంతో పాకిస్తాన్ చివరికి 224 పరుగులకే ఆలౌట్ అయింది.2019, (మాంచెస్టర్): భారత్ 89 పరుగుల తేడాతో విజయం ప్రపంచ కప్ చరిత్రలో రెండు ప్రత్యర్థి దేశాలు ఒకదానితో ఒకటి తలపడటం ఇది 7వ సారి. ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో వర్షం కారణంగా ప్రభావితమైన మ్యాచ్‌లో, భారత్ మరోసారి పాకిస్తాన్‌పై తమ ఆధిపత్యాన్ని పునరుద్ఘాటించింది. రోహిత్ శర్మ అసాధారణంగా 140 పరుగులు చేయడం ద్వారా భారత్ 336/5 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. వర్షం అంతరాయం కారణంగా, పాకిస్తాన్ లక్ష్యాన్ని 40 ఓవర్లలోపు 302 పరుగులకు సర్దుబాటు చేశారు. కానీ వారు లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. మొత్తం 212/6తో 89 పరుగుల తేడాతో ఓడిపోయారు.2023, ( అహ్మదాబాద్): భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయంప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ మైదానమైన నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగింది. కెప్టెన్ బాబర్ అజామ్ మరియు మహ్మద్ రిజ్వాన్ రాణించడంతో పాకిస్తాన్ ఓ దశలో వేగంగా పరుగులు సాధించి 155-2 కి చేరుకుంది. కానీ ఆ తర్వాత వరుసగా వికెట్లు పడడంతో 42.5 ఓవర్లలో 191 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్ రోహిత్ శర్మ 63 బంతుల్లో 86 పరుగులు చేయడంతో భారత్ ఏడు వికెట్లతో విజయం సాధించింది.ఛాంపియన్స్ ట్రోఫీ లో పాకిస్తాన్ మెరుగైన ఫలితాలు అయితే ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ లో అందుకు భిన్నంగా పాకిస్తాన్ మెరుగైన ఫలితాలు సాధించింది. ఛాంపియన్స్ ట్రోఫీ లో భారత్ పాకిస్తాన్‌తో ఐదుసార్లు తలపడింది, ఇందులో పాకిస్తాన్ మూడు మ్యాచ్‌లలో గెలిచింది మరియు భారత్ రెండు మ్యాచ్‌లలో విజేతగా నిలిచింది.2004 (ఎడ్జ్‌బాస్టన్): పాకిస్తాన్ 3 వికెట్ల తేడాతో విజయంభారత్ మరియు పాకిస్తాన్ మొదటిసారి సెప్టెంబర్ 19న బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో తలపడ్డాయి, పాకిస్తాన్ టాస్ గెలిచి భారత్ ని ముందుగా బ్యాటింగ్‌కు పంపింది. భారత్ 49.5 ఓవర్లలో 200 పరుగులు చేసింది మరియు పాకిస్తాన్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పాకిస్తాన్‌కు చెందిన మహ్మద్ యూసుఫ్‌ను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ప్రకటించారు, అతను 114 బంతుల్లో 81 పరుగులు చేశాడు.2009 (సెంచూరియన్): పాకిస్తాన్ 54 పరుగుల తేడాతో విజయం2009 ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ దశ మ్యాచ్ కోసం సెప్టెంబర్ 26న సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో ఈ రెండు జట్లు తలపడ్డయి. పాకిస్తాన్ మళ్ళీ టాస్ గెలిచింది కానీ ఈసారి వారు మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు. పాకిస్తాన్ 50 ఓవర్లలో 302/9 పరుగులు చేయగా భారత్ ఆ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది, 44.5 ఓవర్లలో 248 పరుగులకు తమ ఇన్నింగ్స్‌ను ముగించింది. 126 బంతుల్లో 128 పరుగులు చేసిన షోయబ్ మాలిక్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.2013 (ఎడ్జ్‌బాస్టన్): భారత్ 8 వికెట్ల తేడాతో విజయం2013 ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జూన్ 15న బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్ మరియు పాకిస్తాన్ తలపడ్డాయి. ఈసారి భారత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. పాకిస్తాన్ ఇన్నింగ్స్ సమయంలో వాతావరణ మార్పుల కారణంగా, మ్యాచ్‌ను 40 ఓవర్లకు కుదించారు. పాకిస్తాన్ 39.4 ఓవర్లలో 165 పరుగులు చేయగలిగింది.మళ్ళీ వర్షం వచ్చింది. ఫలితంగా, భారత ఇన్నింగ్స్‌ను అదనంగా 22 ఓవర్లకు కుదించారు.102 పరుగుల సవరించిన లక్ష్యంతో. 19.2 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత, డిఎల్ఎస్ పద్ధతి ద్వారా పాకిస్తాన్‌పై భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ లో తొలి విజయాన్ని సాధించింది. 8 ఓవర్లలో 2 వికెట్లు తీసిన భువనేశ్వర్ కుమార్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.2017 (ఎడ్జ్‌బాస్టన్): భారత్ 124 పరుగుల తేడాతో విజయంజూన్ 4న బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో గ్రూప్ బి ఛాంపియన్స్ ట్రోఫీ -దశ ఘర్షణలో భారత్ తమ ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఎదుర్కొంది. పాకిస్తాన్ ఈసారి కూడా టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. భారత్ ఇన్నింగ్స్‌లో మ్యాచ్‌ను 48 ఓవర్లకు తగ్గించారు. భారత్ 319/3 స్కోరు చేసింది. పాకిస్తాన్ లక్ష్యాన్ని 41 ఓవర్లలో 289 పరుగులుగా సవరించగా, పాకిస్తాన్ 33.4 ఓవర్లలో 9 వికెట్లకు 164 పరుగులు చేసింది. డి ఎల్ ఎస్ పద్ధతి ప్రకారం భారత్‌ను విజేతగా ప్రకటించారు. ఛాంపియన్స్ ట్రోఫీ లో పాకిస్తాన్‌పై భారత్ సాధించిన రెండవ విజయం ఇది. యువరాజ్ సింగ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.2017 (ఓవల్): పాకిస్తాన్ 180 పరుగుల తేడాతో విజయం2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్‌లో భారత్ పాకిస్తాన్‌ను రెండో సారి ఎదుర్కొంది. ఈ మ్యాచ్ జూన్ 18న లండన్‌లోని ది ఓవల్‌లో జరిగింది. టాస్ గెలిచి పాకిస్తాన్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఫఖర్ జమాన్ చేసిన అద్భుతమైన తొలి వన్డే సెంచరీతో పాకిస్తాన్ 50 ఓవర్లలో 389 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది మరియు భారత్ 30.3 ఓవర్లలో 158 పరుగులు చేసింది. ఈ ఫైనల్స్‌లో భారత్ పై విజయంతో పాకిస్తాన్‌కు తొలిసారి ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది. -
రోహిత్, కోహ్లి, జడేజా లపైనే ఛాంపియన్స్ ట్రోఫీ భారం
దాదాపు పదేళ్ల విరామం తర్వాత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని రెండోసారి గెలుచుకోవాలనే భారత జట్టు గట్టి పట్టుదలతో ఉంది. గతంలో 2013లో ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్ లో జరిగిన ఫైనల్ లో ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని భారత్ జట్టు ఐదు పరుగుల తేడాతో ఇంగ్లాండ్ పై విజయసాధించి ఈ ట్రోఫీని చేజిక్కించుకుంది. మళ్ళీ ఇప్పటి దాకా భారత్ ఈ ట్రోఫీని గెలుచుకోలేక పోయింది. 2017 జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్తాన్ జట్టు భారత్ పై 180 పరుగుల తేడాతో భారీ విజయం సాధించి ట్రోఫీ ని దక్కించుకుంది. మళ్ళీ ఈ ట్రోఫీ ని సాధించాలంటే భారత్ తన సత్తా చావాల్సిందే. ఈ నేపథ్యంలో పాకిస్తాన్, దుబాయ్ లలో ఈ నెల 19 వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ కి ఎంతో ప్రాముఖ్యముంది.ప్రధాన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా లేని భారత్ జట్టు ఫిబ్రవరి 20వ తేదీన దుబాయ్‌లో బంగ్లాదేశ్‌తో తన తొలి మ్యాచ్ ఆడుతుంది. తర్వాత ఫిబ్రవరి 23న ఇదే వేదిక పైన తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ని ఎదుర్కొంటుంది. ఆ తర్వాత మెన్ ఇన్ బ్లూ మార్చి 2న న్యూజిలాండ్‌తో తలపడనుంది.ఇంగ్లండ్‌పై స్వదేశంలో భారత్ ఇటీవల 3-0 తేడాతో వన్డే సిరీస్‌ను చేజిక్కించుకోవడంతో అభిమానుల్లోనూ, జట్టు ఆటగాళ్లలోనూ ఆత్మవిశ్వాసం పెరిగింది. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ గతేడాది వెస్టిండీస్ లో జరిగిన టి20 ప్రపంచ కప్ లో ఆడిన రీతి లో మళ్ళీ రాణించి మరో ఐసీసీ ట్రోఫీ ని భారత్ కి తెస్తారని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.రోహిత్, కోహ్లి, జడేజా లకు చివరి అవకాశం?గత సంవత్సరం టీ 20 ప్రపంచ కప్ సాధించిన తర్వాత భారత్ జట్టు ముంబై వాంఖడే స్టేడియం సమీపంలోని వీధుల్లో ఓపెన్ బస్సు లో పరేడ్ చేసింది. మళ్ళీ అలాంటి దృశ్యం రిపీట్ కావాలంటే కెప్టెన్ రోహిత్, కోహ్లీ మళ్ళీ తమ మునుపటి ఫామ్ ని కనిపించడం తప్పనిసరి.అయితే ఆస్ట్రేలియా పర్యటన లో ఘోరంగా విఫలమైన ఈ ఇద్దరు టాప్ ఆర్డర్ బ్యాటర్ ఇంగ్లాండ్ సిరీస్ లో పరుగులు సాధించి ఆత్మవిశ్వాసం తో ఉన్నారు. ఇంగ్లాండ్‌తో జరిగిన కటక్ వన్డేలో రోహిత్ 90 బంతుల్లో 119 పరుగులు చేశాడు. కోహ్లీ అహ్మదాబాద్‌లో జరిగిన చివరి వన్డే లో తన 73వ అర్ధ సెంచరీ నమోదు చేసుకున్నాడు. ఇది వారిద్దరికీ తాత్కాలిక ఉపశమనం కలిగించి ఉండవచ్చు కానీ ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ లో ఈ అగ్రశ్రేణి క్రికెటర్లు ఇద్దరూ తమ మునుపటి ఫామ్ ని చూపించక తప్పదు.వన్డే చరిత్రలో 14,000 పరుగులు చేసిన మూడవ బ్యాటర్‌గా నిలిచేందుకు కోహ్లీకి 37 పరుగులు అవసరం, మరో వైపు 11,000 పరుగులు పూర్తి చేసిన పదో బ్యాట్స్‌మన్‌గా నిలిచేందుకు రోహిత్‌కు కేవలం 12 పరుగులు మాత్రమే అవసరం. కానీ భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవకుండా వీరిద్దరూ ఈ వ్యక్తిగత రికార్డులు సాధించినా పెద్దగా ప్రయోజనం ఉండదు.భవిష్యత్తు పై చర్చ ఐసిసి మెగా ఈవెంట్‌కు ముందు, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా వంటి సీనియర్ ఆటగాళ్ల భవిష్యత్తు పై చర్చ జరుగుతోంది. గత సంవత్సరం టి 20 ప్రపంచ కప్ గెలుచుకున్న తర్వాత ఈ ముగ్గురూ ఇప్పటికే అంతర్జాతీయ టి 20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇటీవలి ఆస్ట్రేలియా పర్యటనలో విఫలమైన తర్వాత జట్టులోని సీనియర్ ఆటగాళ్ల ఇక రిటైర్మెంట్ ప్రకటించవచ్చని పుకార్లు వ్యాపించాయి. అయితే, ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినట్లయితే ఈ ముగ్గురు సీనియర్లు ఆటగాళ్లు మరికొంత కాలం ఆడే అవకాశం ఉందని, భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సూచించాడు. "ఈ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత మరో ఐసీసీ టోర్నమెంట్ మరో రెండు, మూడు ఏళ్ళ వరకు లేదు.వచ్చే ఏడాది టి 20 ప్రపంచ కప్ ఉన్నప్పటికీ ఈ ముగ్గురు ఇప్పటికే టి 20ల నుంచి రిటైర్ అయ్యారు. ఇక 2027 లో జరిగే వన్డే ప్రపంచ కప్ కి చాల కాలం ఉంది. అప్పటి దాకా వీరు ముగ్గురూ వన్డే క్రికెట్ లో కొనసాగడం కష్టంగానే కనిపిస్తోంది. ఈ నేపధ్యంలో రోహిత్, విరాట్, జడేజా లకు ఇదే చివరి ఐసీసీ టోర్నమెంట్ కావచ్చని, చోప్రా వ్యాఖ్యానించాడు.యువ ఆటగాళ్ల కు అద్భుత అవకాశంవన్డే వైస్ కెప్టెన్‌గా యువ బ్యాటర్ శుభమాన్ గిల్‌కు పెద్ద ప్రమోషన్ వచ్చింది. పైగా ఈ ఫార్మాట్లో దాదాపు 61 సగటు ఉన్న ఈ బ్యాట్స్‌మన్ ఛాంపియన్స్ ట్రోఫీలో విజృభించి తన సత్తా చాటాలని ఎంతో ఆసక్తి గా ఉన్నాడు. గాయం కారణంగా బుమ్రా లేకపోయిన కారణంగా అర్ష్‌దీప్ సింగ్ , హర్షిత్ రాణా వంటి యువ బౌలర్లకు ఇది అద్భుత అవకాశం. ఈ నేపధ్యం లో గిల్, శ్రేయాస్ అయ్యర్, కె ఎల్ రాహుల్ వంటి బ్యాటర్, అర్ష్‌దీప్ సింగ్, రాణా వంటి యువ ఆటగాళ్లకి అంతర్జాతీయ వేదిక పై తమ సత్తా చాటేందుకు ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ఒక అద్భుత అవకాశంగా కనిపిస్తోంది. మరి ఈ యువ ఆటగాళ్లు రాణించి భారత్ కి మరో ఐసీసీ ట్రోఫీ తెస్తారేమో చూడాలి. -
Champions Trophy 2025: రాణా మెరుపులు మెరిపిస్తాడా?
గత సంవత్సరం టి20 ప్రపంచ కప్‌లో విజయం తర్వాత రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత జట్టు పెద్దగా చెప్పుకోదగ్గ విజయాలు సాధించలేదు. ఈ నేపథ్యంలో దుబాయ్, పాకిస్తాన్లలో ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీపై భారత్ గురి పెట్టింది. తమ తొలి మ్యాచ్‌లో భారత్ ఈ నెల 20వ తేదీన బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది.ఈ టోర్నమెంట్ కోసం భారత క్రీడాకారులు ఇప్పటికే దుబాయ్ చేరుకున్నారు. భారత్ జట్టు ఎంపికపై పెద్దగా వివాదం లేకపోయినా, జట్టులోని ప్రధాన ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వెన్ను నొప్పితో టోర్నమెంట్ కి దూరం కావడంతో అతని స్తానం లో జట్టులోకి వచ్చిన ఢిల్లీ పేసర్ హర్షిత్ రాణాపైనే ఆసక్తి రేకెత్తుతోంది. సిరాజ్‌ను మినహాయించడం ఆశ్చర్యకరంసిరాజ్ను జట్టు నుంచి మినహాయించడం చాలా ఆశ్చర్యకరం కలిగించింది. సిరాజ్ ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో జట్టు మేనేజిమెంట్ ఆశించిన స్థాయిలో రాణించకపోయినప్పటికీ, మరీ దారుణంగా విఫలం కాలేదు. పైగా రాణా తో పోలిస్తే సిరాజ్ చాలా అనుభవం గడించాడు. సిరాజ్ ఇప్పటివరకు 44 వన్డేలు ఆడాడు. 24.04 సగటు తో 5.18 ఎకానమీతో 71 వికెట్లు పడగొట్టాడు.సిరాజ్ దాదాపు 2022 ప్రారంభం నుండి 2024 చివరి వరకు భారత్ తరఫున వన్డే ల్లో అత్యధిక వన్డే వికెట్లు తీసిన బౌలర్‌గా ఖ్యాతి గడించాడు. ఈ నేపధ్యంలో జట్టు మేనేజిమెంట్ కి సిరాజ్ స్థానంలో రాణా ఎందుకు మెరుగ్గా కనిపించాడు..?ఛాంపియన్స్ ట్రోఫీ కోసం తాత్కాలిక జట్టుని ప్రకటించిన సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ .."సిరాజ్ ఆడకపోవడం దురదృష్టకరమని అన్నాడు. బుమ్రా లేకపోవడంతో డెత్-బౌలింగ్ నైపుణ్యం ఉన్న ఎడమచేతి వాటం బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ అవకాశం కల్పించామని తెలిపాడు. షమీ ఫిట్నెస్ సాధించడంతో సిరాజ్ కి చోటు కల్పించలేక పోయామని చెప్పాడు. అయితే సిరాజ్ డెత్ బౌలింగ్ సరిగ్గా చేయలేకపోయిన కారణంగానే జట్టుకి దూరమయ్యాడనేది వాస్తవం.ఇంగ్లాండ్ సిరీస్‌లో రాణించిన రాణా ఇక రాణా విషయానికొస్తే, ఇంగ్లాండ్ సిరీస్‌కు ముందు రోహిత్ ఈ విషయం పై స్పష్టత ఇచ్చాడు. "బుమ్రా లేని కారణంగా జట్టు ఫాస్ట్ బౌలింగ్ కి కొత్తదనం కావాలి. రాణాలో మాకు ఆ సామర్ధ్యం కనిపించింది. ఇంగ్లాండ్ సిరీస్ మొదటి మ్యాచ్‌లో రాణా తన తొలి ఓవర్లో 11 పరుగులు ఇచ్చాడు. రెండవ ఓవర్ మెయిడెన్ వేసిన తర్వాత మూడవ ఓవర్లో ఫిల్ సాల్ట్ ఏకంగా 26 పరుగులు సాధించాడు. అయితే సాల్ట్ అవుటైన తర్వాత మళ్ళీ బౌలింగ్ కి వచ్చిన రాణా వెంటనే తన 6'2" అడుగుల ఎత్తుని అనువుగా ఉపయోగించుకొని ప్రతి దాడి చేసాడు.140kph కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేసి తన ప్రభావం చూపడం ప్రారంభించాడు. బెన్ డకెట్‌ను అవుట్ చేసి వన్డేల్లో తన తొలి వికెట్‌ను నమోదు చేసుకున్నాడు. 22 ఏళ్ల వయసులో ఉన్న రాణా తన నైపుణ్యానికి ఇంకా మెరుగులు దిద్దు కుంటున్నాడు. పేస్ బౌలర్ గా రాణించడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్ లో రాణా చెప్పుకోదగ్గ రీతిలో రాణించాడు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ లో ఎలా రాణిస్తాడన్నదాని పైనే జట్టులో రాణాని కొనసాగించడం ఆధారపడి ఉంటుంది.ఈ దశలోనే సిరాజ్ కి భారత్ జట్టు ద్వారాలు మూసుకొని పోయాయని చెప్పడం కష్టమే. బుమ్రా, షమీ లను మినహాయిస్తే సిరాజ్ ని సవాలు చేయగల సత్తా ప్రస్తుత భారత్ జట్టులో చాలా తక్కువ మందికి ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ బెంచ్ సభ్యులలో ఒకడైన సిరాజ్ మళ్ళీ త్వరలోనే జట్టులోకి వస్తే ఆశ్చర్యం లేదు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ లో రాణా ఎలా రాణిస్తాడనేదే ప్రస్తుతం ఆసక్తి కలిగించే విషయం. -
రాహుల్ పై 'గంభీర్' నమ్మకం.. ఛాంపియన్స్ ట్రోఫీలో మెరుస్తాడా?
ఆస్ట్రేలియా పర్యటన లో ఘోర వైఫల్యం తర్వాత భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ లో కొన్ని కీలకమైన మార్పులు చేసాడు. ఛాంపియన్స్ ట్రోఫీ కి ముందు ఇంగ్లండ్ తో జరిగిన సిరీస్ లో ఇందుకోసం తన ఫార్ములా ని పరీక్షించేందుకు ఉపయోగించుకున్నాడు.భారత్ జట్టులోని కీలక బ్యాటర్ కూడా సొంత గడ్డపై మళ్ళీ తమ మునుపటి ఫామ్ ని అందుకున్నారు. ప్రతిష్టాత్మకమైన ఛాంపియన్స్ ట్రోఫీ కి జట్టులోని ప్రధానబ్యాటర్లు అందరూ మానసికంగా సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్్ కోహ్లీ, ఓపెనర్ శుభమన్ గిల్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ వంటి ఆటగాళ్లు పరుగులు సాధించి ఆత్మవిశ్వాసంతో ఉన్నారు.రాహుల్ వైపే గంభీర్ మొగ్గు..అయితే గంభీర్ తీసుకొచ్చిన మరో పెద్ద మార్పు. రిషబ్ పంత్ స్థానంలో భారత్ నెంబర్ 1 వికెట్ కీపర్ గా కె ఎల్ రాహుల్ ని ఎంచుకోవడం. రాహుల్ కి పంత్ కి చాలా వ్యత్యాసం ఉంది. ఇద్దరి బ్యాటింగ్ విధానంలో చాలా తేడా ఉంది. పంత్ భారీ షాట్లతో కొద్దిసేపటి లోనే మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉన్నవాడు. రాహుల్ అందుకు భిన్నంగా ఆచి తూచి ఆడతాడు. క్రీజులో నిలదొక్కుకోవడానికి సమయం తీసుకుంటాడు. టెక్నికల్ గా రాహుల్ సమర్ధుడైన బ్యాటర్ అయినప్పటికీ, అతను స్వతహాగా ఆచి తూచి ఆడే స్వభావం గల బ్యాటర్.ఇక్కడ మ్యాచ్ లో పరిస్థితులని బట్టి వీరిద్దరినీ ఉపయోగించుకోవాలి. టాప్ ఆర్డర్ బ్యాటర్ బాగా రాణించి స్కోర్ బాగా చేసినట్టయితే,అలాంటి పరిస్థితుల్లో శరవేగంగా మరిన్ని పరుగులు సాధించడానికి పంత్ సరిగ్గా సరిపోతాడు. అయితే పంత్ బ్యాటింగ్ శైలి వల్ల అతను నిలకడ రాణించగలడన్న గ్యారెంటీ లేదు.కానీ రాహుల్ అందుకు భిన్నంగా, క్రీజులో నిలదొక్కుకుంటే తనదైన శైలిలో నేర్పుగా పరుగులు రాబట్టగలడు. ఇంత వైరుధ్యం గల ఇద్దరు వికెట్ కీపర్లలలో ఒకరిని ఎంచుకోవడం సామాన్య విషయం కాదు. ఎందుకంటే ఇద్దరూ వ్యక్తిగతంగా ఎంతో సామర్ధ్యం గల బ్యాట్స్‌మన్. ఇలాంటి క్లిష్టమైన విషయంలో కోచ్ గంభీర్ తన ప్రధాన వికెట్ కీపర్ గా రాహుల్ నే ఎంచుకోవడం. ఎందుకంటె రాహుల్ చాల నిలకడైన బ్యాటర్ కావడమే.రాహుల్ బ్యాటింగ్ ఆర్డర్అయితే ఈ నిర్ణయం చాల మందికి రుచించలేదు. ఇక్కడ మరో విషయం ఉంది. అది రాహుల్ బ్యాటింగ్ ఆర్డర్. రాహుల్ సాధారణంగా టాప్ ఆర్డర్ లో బ్యాటింగ్ కి వస్తాడు. కానీ ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్ లోని తొలి రెండు వన్డేల్లో రాహుల్ ఆరో నెంబర్ బ్యాట్స్‌మన్ గా రంగంలోకి వచ్చాడు. “ప్రస్తుతానికి, కెఎల్ మాకు నంబర్ 1 వికెట్ కీపర్. ప్రస్తుతానికి అతను జట్టు తరపున అద్భుతంగా రాణిస్తున్నాడు" అని గంభీర్ అహ్మదాబాద్ మ్యాచ్ అనంతరం వ్యాఖ్యానించాడు. "జట్టులో ఇద్దరు వికెట్ కీపర్లు ఉన్నప్పుడు, ఇద్దరు వికెట్ కీపర్లను ఆడించడం సాధ్యం కాదు. భారత్ జట్టులోని ఇతర బ్యాట్స్‌మన్ నైపుణ్యం, వారి అపార అనుభవం దృష్ట్యా చూస్తే, ఇది సాధ్యమయ్యే విషయం కాదు. ఇక పంత్ విషయానికి వస్తే అతను అవకాశం వచ్చిన్నప్పుడు ఆడటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ప్రస్తుతానికి నేను ఈ విషయం గురించి అంతే చెప్పగలను,," అని గంభీర్ తన నిర్ణయాన్ని తేటతెల్లం చేసాడు.ఎడమచేతి వాటం బౌలర్ అక్షర్ పటేల్‌ను ఐదో స్థానంలో బ్యాటింగ్ కి బ్యాటింగ్ కి పంపించాలన్న గంభీర్ తీసుకున్న నిర్ణయం కూడా చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఫలితంగా, మొదటి రెండు మ్యాచ్‌లలో రాహుల్ ప్రదర్శన నిరాశపరిచింది - మొదటి రెండు మ్యాచ్‌లలో రాహుల్‌లో కేవలం రెండు, పది పరుగులు మాత్రమే చేసాడు. చేసాడు. అయితే మూడో మ్యాచ్ లో రాహుల్ తనకి అనుకూలంగా ఉండే ఐదో స్థానంలో బ్యాటింగ్ కి వచ్చి 29 బంతుల్లో 40 పరుగులు చేశాడు.“రాహుల్‌ను ఆరో స్థానంలో బ్యాటింగ్ కి పంపించి అతనిని వృధా చేస్తున్నారు,” అని భారత మాజీ స్టంపర్ పార్థివ్ పటేల్ వ్యాఖ్యానించాడు. రికార్డులను చూడనని చెబుతూ గంభీర్ అలాంటి సూచనలను తోసిపుచ్చాడు. దుబాయ్‌లో రాహుల్ ఆరవ స్థానంలో కొనసాగాల్సి రావచ్చని కూడా గంభీర్ స్పష్టం చేశాడు. .రాహుల్ ప్రపంచ కప్ రికార్డ్ 2023 ప్రపంచ కప్ కి ముందు పంత్ గాయపడ్డాడు. ఆ దశలో రాహుల్ భారత్ జట్టు కి అండగా నిలిచి రాణించాడు. రాహుల్ ఐదో స్థానంలో బ్యాటింగ్ కి వచ్చి 75.33 సగటుతో 452 పరుగులు చేశాడు భారత్ ఫైనల్ కి చేర్చడంలో కీలక భూమిక పోషించాడు.పైగా రాహుల్ భారత్ మిడిల్ ఆర్డర్‌ను పటిష్టంగా ఉంచాడు. ప్రస్తుతం కోచ్ గంభీర్ కూడా రాహుల్ నుంచి అదే ఆశిస్తున్నాడు. వికెట్ కీపింగ్ బాధ్యతలతో పాటు మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ ని కూడా పటిష్టంగా ఉంచి జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ సాధించడంలో తోడ్పడుతాడని భావిస్తున్నాడు. మరి గంభీర్ వ్యూహం ఫలిస్తుందేమో చూడాలి. -
కోహ్లి ఫామ్‌లోకి వస్తే భారత్‌కు తిరుగులేదు..
ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో టెస్ట్ నుండి పేలవమైన ఫామ్ కారణంగా వైదొలిగిన భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆ తర్వాత జరిగిన రంజీ ట్రోఫీ టోర్నమెంట్ లో కూడా ఆశించిన విధంగా రాణించలేక పోయాడు. ఈ నేపధ్యం లో ప్రతిష్టాత్మకమైన ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ ముందు రోహిత్ మళ్ళీ ఫామ్ లోకి రావడం చాల ముఖ్యమైన విషయం.వరుసగా పది ఇన్నింగ్స్‌ల లో ( తొమ్మిది టెస్టులు, ఒక వన్డే) విఫలమైన రోహిత్ చివరికి ఆదివారం కటక్‌లో జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో తన మునుపటి ఫామ్ ని ప్రదర్శించి సిక్సర్ల మోత మోగించాడు. రోహిత్ కటక్ ప్రేక్షకులను నిజంగా అలరించాడు, 12 ఫోర్లు మరియు 7 సిక్సర్లు తో వన్డేల్లో తన 32వ సెంచరీ సాధించి, భారత్ ఈ మూడు మ్యాచ్ ల సిరీస్ చేజిక్కించుకునేందుకు తన వంతు పాత్ర పోషించాడు. జట్టు రధ సారధి లాగా ముందుండి నడిపించాడు.ఈ సెంచరీతో, రోహిత్ 30 ఏళ్లు నిండిన క్రికెటర్లలో అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు చేసిన భారత క్రికెటర్ గా రికార్డ్ నమోదు చేసాడు. లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ గతంలో 35 సెంచరీలు తో చేసిన రికార్డును రోహిత్ అధిగమించాడు. భారత్ తరపున ఓపెనర్‌గా అత్యధిక పరుగులు చేసిన వారి లో రోహిత్ ఇప్పుడు రెండో స్థానానికి చేరుకున్నాడు. రోహిత్ అన్ని ఫార్మాట్లలో ఓపెనర్‌గా 15,404 పరుగులు సాధించాడు. గతంలో సచిన్ టెండూల్కర్ 15,335 పరుగులతో సాధించిన మరో రికార్డును కూడా రోహిత్ ఈ మ్యాచ్ తో అధిగమించాడు. వీరేంద్ర సెహ్వాగ్ 15,758 పరుగులతో ఈ జాబితా లో అగ్ర స్థానం లో ఉన్నాడు. "చాలా సంవత్సరాలుగా నేను క్రికెట్ ఆడుతున్నాను. నేను ఏమి చేయాలో నాకు తెల్సు. నా నుండి ఏమి అవసరమో నాకు అర్థమైంది. పిచ్ లోకి వెళ్లి నేను చేసింది అదే" అని రోహిత్ మ్యాచ్ అనంతరం వ్యాఖ్యానించాడు.రోహిత్ మళ్ళీ ఫామ్ లోకి రావడంతో భారత్ జట్టు మానేజిమెంట్ కి పెద్ద తలనొప్పి తగ్గింది. ఇక మూడో వన్డేలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా సెంచరి సాధించినట్టయితే ఛాంపియన్స్ ట్రోఫీ కి ముందు భారత్ బ్యాటింగ్ గాడి లో పడినట్టే. బ్యాటింగ్ స్థానం లో మార్పులుఅయితే భారత్ బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు పై పలువురు మాజీ ఆటగాళ్లు జట్టు మేనేజిమెంట్ పై దుమ్మెత్తి పోస్తున్నారు. ఆల్ రౌండర్ అక్షర్ పటేల్‌ను వికెట్ కీపర్ బ్యాటర్ కెఎల్ రాహుల్ కంటే ముందుగా పంపడం పై పెద్ద దుమారమే చెలరేగుతోంది. టాప్ ఆర్డర్ బ్యాటర్ అయిన రాహుల్ జట్టు అవసరాల అనుగుణంగా బ్యాటింగ్ స్థానాన్ని మార్చడం పై జట్టు మేనేజిమెంట్ పలు విమర్శలు ఎదుర్కొంటోంది."అక్షర్ పటేల్ మళ్ళీ కెఎల్ రాహుల్ కంటే ముందుగా బ్యాటింగ్ రావడమేమిటి? నాకు మాటలు కూడా రావడం లేదు. రాహుల్ లాంటి నైపుణ్యమైన బాట్స్మన్ ని ఆరో స్థానానికి నెట్టడం చాల దారుణం. అక్షర్‌ను రాహుల్ కన్నా ముందుగా బ్యాటింగ్ పంపడం. అదీ ఇలాంటి పిచ్ పై సరైన నిర్ణయం కాదు, అని భారత్ మాజీ ఆటగాడు దొడ్డ గణేష్ వ్యాఖ్యానించాడు. -
శ్రేయాస్ జోరు మరి విరాట్ పరిస్థితి ఏమిటి?
ఇంగ్లండ్ తో గురువారం జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో నిజానికి భారత్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ ఆడే పరిస్థితి లేదు. దానికి ముందు రోజు రాత్రి వరకు దీని పై స్పష్టత లేదు. శ్రేయాస్ అయ్యర్ ఏదో సినిమా చూస్తూ నిబ్బరముగా ఉన్నాడు. ఈ లోగా కెప్టెన్ రోహిత్ శర్మ నుంచి ఫోన్ వచ్చింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి గాయం కావడంతో అతను ఆడటం కష్టమని. అందువల్ల మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉండమని కోరాడు. దాంతో సినిమా ఆపేసి మ్యాచ్ కి ముందు విశ్రాంతి కోసం నిద్రకు ఉపక్రమించాడు శ్రేయాస్ అయ్యర్. "విరాట్ మోకాలి నొప్పి కారణంగా ఆడే అవకాశం లేనందున నువ్వు ఆడే అవసరం రావచ్చు అని కెప్టెన్ (రోహిత్ శర్మ) నుండి నాకు కాల్ వచ్చింది" అని అయ్యర్ స్వయంగా వెల్లడించాడు."నేను నా గదికి తిరిగి వెళ్లి వెంటనే నిద్ర పోయాను." గురువారం మ్యాచ్ లో శ్రేయాస్ అయ్యర్ క్రీజులోకి అడుగు పెట్టే సమయానికి భారత్ 19 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి చిక్కుల్లో ఉంది. ఇంగ్లాండ్ పేసర్లు జోఫ్రా ఆర్చర్ మరియు సాకిబ్ మహమూద్ నిలకడగా బౌలింగ్ చేస్తూ భారత్ ని పరుగులు కొట్టకుండా నిల్వరిస్తున్నారు.ఆ దశలో రంగ ప్రవేశం చేసిన అయ్యర్ ఇంగ్లాండ్ బౌలర్ల సవాలును ఎదుర్కొన్నాడు. అయ్యర్ రెండు సిక్సర్లు, తొమ్మిది ఫోర్లతో 36 బంతుల్లో 59 పరుగులు చేశాడు. తన అద్భుతమైన ఎదురుదాడి ఇన్నింగ్స్‌తో మ్యాచ్ ని మలుపు తిప్పాడు. ఫలితంగా భారత్ తొలి వన్డేలో ఇంగ్లాండ్‌పై భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించగా, శ్రేయాస్ అయ్యర్ తన 19వ అర్ధ సెంచరీతో రాణించాడు. ఈ మ్యాచ్ లో మరో విషయం వెల్లడైంది. యశస్వి జైస్వాల్ ఓపెనర్ గా వస్తే శుభ్‌మాన్ గిల్ మూడో స్థానంలో బ్యాటింగ్ కి వస్తాడు. విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో ఉంటాడు. ఎడమచేతి వాటం అక్షర్ తదుపరి బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది, ఆట స్థితిని బట్టి కే ఎల్ రాహుల్ లేదా హార్దిక్ పాండ్యా తర్వాత బ్యాటింగ్ చేస్తారు. అయితే కోహ్లీ గాయం లేకపోతే అయ్యర్ కి స్తానం లేదా అన్నది ఇక్కడ ప్రధానాంశం. "కోహ్లీ ఫిట్ గా ఉంటే అయ్యర్ ఆడటం సాధ్యం కాదన్న విషయం గురుంచే నేను తదేకంగా ఆలోచిస్తున్నాను. 2023 ప్రపంచ కప్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ 500 కి పైగా పరుగులు చేసిన తొలి భారత్ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్.అటువంటి నైపుణ్యం ఉన్న బ్యాట్స్‌మన్ ని మీరెలా బెంచ్ మీద కూర్చో బెట్ట గలరు? అని భారత్ మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా జట్టు మేనేజ్మెంట్ పై విరుచుకు పడ్డాడు. భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో శ్రేయాస్ అయ్యర్ ని సమర్ధించాడు."శ్రేయస్ తన నైపుణ్యాన్ని ఇప్పటికే నిరూపించుకున్నాడు. అతను ప్రపంచ కప్‌లో పరుగుల ప్రవాహం సృష్టించాడు. ఒక ఆటగాడు ఇన్ని పరుగులు చేసినప్పుడు, అతనికి అవకాశాలు లభిస్తాయని భావించడంలో తప్పేం ఉంది. అతను అతని దృష్టిలో అత్యుత్తమ బ్యాట్స్‌మన్. అందుకే దేవుడు కూడా అలాగే భావించాడు. అతను చేసిన 50 పరుగులు, మ్యాచ్ రూపురేఖలను మార్చాయి," అని హర్భజన్ అయ్యర్ పై ప్రశంసలు కురిపించాడు. -
విదేశాలకు విస్తరిస్తున్న ఐపీఎల్ ఫ్రాంచైజీలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభం నుంచి భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డుకు లాభాల పంట పండిస్తోంది. అందుకే ఐపీఎల్ ఫ్రాంచైజీల కోసం బడా వ్యాపారవేత్తలు అప్పట్లో ఎగబడ్డారు. ఇప్పుడు ఐపీఎల్ ఫ్రాంచైజీలు తమ వ్యాపారాన్ని విదేశాలకు కూడా విస్తరిస్తున్నారు. వివిధ దేశాల్లో నిర్వహిస్తున్న ఐపీఎల్ తరహా టోర్నమెంట్లలో పెట్టుబడులు పెట్టేందుకు క్యూ లు కడుతున్నారు. తాజాగా ఐపీఎల్లో హైదరాబాద్ వేదికగా పోటీ పడుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు నిర్వహిస్తున్న 'ది హండ్రెడ్' టోర్నమెట్లోకి రంగ ప్రవేశం చేసింది.మూడో ఐపీఎల్ ఫ్రాంచైజీబుధవారం నార్తర్న్ సూపర్‌చార్జర్స్‌ను కొనుగోలు కోసం నిర్వహించిన వేలంలో కళానిధి మారన్ యాజమాన్యంలోని సన్ గ్రూప్ పాల్గొని మొత్తం వంద శాతం వాటాను కొనుగోలు చేసింది. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు యొక్క 49 శాతం వాటాను, ఈ క్లబ్ నిర్వాహకులైన యార్క్‌షైర్ యొక్క 51 శాతం వాటాను కొనుగోలు చేయడానికి అంగీకారాన్ని పొందింది. దీంతో 'ది హండ్రెడ్' టోర్నమెంట్ లో 100% వాటాను పొందిన తొలి ఫ్రాంచైజ్ గా నిలిచింది. ఈ టోర్నమెంట్ లో వాటాలు చేజిక్కించుకున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడో ఫ్రాంచైజీ కావడం విశేషం. సూపర్‌చార్జర్స్ కొనుగోలు కోసం సన్ గ్రూప్ ఏకంగా 100 మిలియన్ పౌండ్లు వెచ్చించినట్టు తెలుస్తోంది. నాలుగో స్థానంలో సూపర్చార్జర్స్యార్క్షైర్కు వేదికగా పోటీ పడుతున్న సూపర్‌చార్జర్స్ గత సీజన్లో పురుషులు మరియు మహిళల టోర్నమెంట్లలో నాలుగో స్థానంలో నిలిచింది. సూపర్‌చార్జర్స్ పురుషుల జట్టుకు ఇంగ్లాండ్ మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుత ఇంగ్లాండ్ జట్లు లో సభ్యుడైన హ్యారీ బ్రూక్ ఈ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు.లక్నో సూపర్ జెయింట్స్ నిర్వాహకులైన ఆర్ పి ఎస్ జి గ్రూప్, ముంబై ఇండియన్స్ నిర్వాహకులైన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 'ది హండ్రెడ్' టోర్నమెంట్ లో పోటీ పడుతున్న జట్ల స్టాక్లను కొనుగోలు చేసిన కొన్ని రోజుల తర్వాత సన్ గ్రూప్ కూడా ఈ టోర్నమెంట్ లో పెట్టుబడి పెట్టింది.ప్రారంభంలో లండన్ స్పిరిట్ కొనుగోలు హక్కులను దక్కించుకోవడంలో విఫలమైన ఆర్ పి ఎస్ జి గ్రూప్ తర్వాత మాంచెస్టర్ ఒరిజినల్స్‌లో వాటాను కొనుగోలు చేసింది. రాబోయే రోజుల్లో ది హండ్రెడ్‌లో మరో ఐపీఎల్ క్లబ్ కూడా పెట్టుబడి పెట్టే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల కథనం.మొదటి స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ టాటా గ్రూప్ 2024-2028 సంవత్సరానికి ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్‌ను దాదాపు 2,500 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది. ఇది మునుపటి ఒప్పందం కంటే దాదాపు 50 శాతం అధికం. ఇక ఐపీఎల్ ఫ్రాంచైజీల విషయానికొస్తే, 231.0 మిలియన్ డాలర్లతో చెన్నై సూపర్ కింగ్స్ అత్యంత విలువైన ఫ్రాంచైజీ గా కొనసాగుతోంది. గత సంవత్సరం ఈ క్లబ్ తొమ్మిది శాతం వృద్ధి రేటు ని సాధించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 227.0 మిలియన్ డాలర్లతో రెండవ స్థానంలో ఉంది. గత సంవత్సరం ఐపీఎల్ విజేత అయిన కోల్‌కతా నైట్ రైడర్స్ వ్యాపార వృద్ధి లో 19.3 శాతం పెరుగుదలతో మొదటి స్థానాన్ని ఆక్రమించింది. ముంబై ఇండియన్స్ 204.0 మిలియన్ డాలర్లతో బ్రాండ్ విలువతో నాలుగో స్థానంలో ఉంది. తరువాత సన్‌రైజర్స్ హైదరాబాద్ (132 మిలియన్ డాలర్లు), రాజస్థాన్ రాయల్స్ (113 మిలియన్ డాలర్లు) ఉన్నాయి.లాభాల పంటవాణిజ్య ప్రకటనల ద్వారా ఐపీఎల్ ఫ్రాంచైజీలు విపరీతంగా లాభాలు ఆర్జిస్తున్నాయి. దాదాపు ప్రతి జట్టుకు 5 మిలియన్ డాలర్ల నుండి 12 మిలియన్ డాలర్ల వరకు స్పాన్సర్షిప్ ఆదాయం లభించడమే కాక టెలివిజన్ హక్కుల ద్వారా కూడా గణనీయమైన ఆదాయం సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మూడేళ్ల ఒప్పందం కోసం ఖతార్ ఎయిర్వేస్ దాదాపు 175 కోట్ల రూపాయలతో ఒప్పందం ఖరారు చేసుకుందంటే ఐపీఎల్ ఫ్రాంచైజీల ఆదాయం ఏ స్థాయిలో ఉందో అర్థంచేసుకోవచ్చు. -
హర్షిత్ రాణా రంగప్రవేశం టీమిండియాకు శుభపరిణామం
పూణేలో ఇంగ్లాండ్‌తో శుక్రవారం జరిగిన నాలుగో మ్యాచ్‌లో శివం దుబే స్థానంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్ గా అసాధారణ పరిస్థితుల్లో హర్షిత్ రాణా (Harshit Rana) భారత్ తరఫున తన టీ20 అరంగేట్రం చేసాడు. భారత్ క్రికెట్ జట్టు తీసుకున్న ఈ నిర్ణయం పెద్ద దుమారాన్నే రేకెత్తించింది. ఒక ఆల్ రౌండర్ స్థానంలో పేసర్‌ను జట్టులోకి తీసుకోవడాన్ని క్రికెట్ నిపుణులు, ముఖ్యంగా ఇంగ్లాండ్ మాజీ ఆటగాళ్లు నిశితంగా విమర్శించారు. ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ రూపొందించిన నియమావళికి విరుద్ధమని ఇంగ్లాండ్ నిపుణుల వాదన. దీనికి భారత్ మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వంటి వాళ్ళు కూడా సమర్ధించడం విశేషం. ఎందుకంటే ఐసీసీ నియమావళి ప్రకారం దూబే స్థానం లో 'లైక్-ఫర్-లైక్' ప్రత్యామ్యాయ ఆటగాడ్ని ఎంచుకోవాలి. రాణా రావడంతో భారత్ జట్టుకి మేలు చేకూరింది. అదనపు బౌలింగ్ ఆప్షన్ లభించింది.ఐసీసీ నియమావళి ప్రకారం కంకషన్ సబ్ స్టిట్యూట్ ఆటగాడిగా దాదాపు ఒకే తరహా ఆటగాళ్లను మాత్రమే ఎంచుకోవాలి. ఈ విషయం పై మాజీ ఇంగ్లాండ్ క్రికెటర్, క్రికెట్ వ్యాఖ్యాత కెవిన్ పీటర్సన్ భారత్ జట్టు నిర్ణయాన్ని దుయ్యబట్టారు. " ఐసీసీ నిబంధలు ప్రకారం కంకషన్ లేదా అనుమానిత కంకషన్‌కు గురైన ఆటగాడికి సమానమైన వారిని మాత్రమే ప్రత్యామ్నాయంగా జట్టులోకి తీసుకోవాలని పీటర్సన్ వ్యాఖ్యానించాడు. హర్షిత్ రాణా పూర్తి స్థాయి పేస్ బౌలర్ కాగా, దుబే బ్యాటింగ్ ఆల్ రౌండర్ కాబట్టి భారత్ ఈ మ్యాచ్ లో తప్పనిసరిగా 12 మంది ఆటగాళ్లతో పోటీ కి దిగిందని భావించాల్సి వస్తుందని పీటర్సన్ పేర్కొన్నాడు.అంతకుముందు శివమ్ దూబే 34 బంతుల్లో 53 పరుగులు చేశాడు. క్లిష్ట సమయంలో భారత్ ని ఆదుకుని జట్టు గౌరవప్రదమైన స్కోర్ సాధించేందుకు తన వంతు పాత్ర పోషించాడు. భారత్ ఇన్నింగ్స్ చివరి ఓవర్లో జేమీ ఓవర్టన్ వేసిన బంతి హెల్మెట్‌కు తగలడం తో దూబే గాయం కారణంగా వైదొలిగాడు. దూబే స్తానం లో వచ్చిన రాణా నాలుగు ఓవర్లలో మూడు వికెట్లు పడగొట్టాడు.ఐపీఎల్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ కి ప్రాతినిధ్యం వహించే రాణా ఇంగ్లాండ్ 12వ ఓవర్లో లియామ్ లివింగ్‌స్టోన్‌ను అవుట్ చేశాడు. ఆ తర్వాత 16వ ఓవర్లో జాకబ్ బెథెల్‌ను కేవలం 6 పరుగులకే వెనక్కి పంపి ఇంగ్లాండ్‌పై మరో దెబ్బ వేసాడు. 18వ ఓవర్లో జామీ ఓవర్టన్ను 19 పరుగులకు క్లీన్ బౌలింగ్ చేసి భారత్ కి విజయం ఖాయం చేశాడు. రాణా 33 పరుగులకు 3 వికెట్లు పడగొట్టి అంతర్జాతీయ క్రికెట్లో తనదైన శైలి లో అరంగ్రేటం చేసాడు.ఈ వివాదం ఎలా ఉన్న రాణా తన ఈ మ్యాచ్ లో తన ఆటతీరు చాల సంతృప్తినిచ్చిందని, తనకు కలల అరంగేట్రం లభించిందని చెప్పాడు. "ఇది నాకు ఇప్పటికీ కలల అరంగేట్రం. దుబే గాయంతో వైదొలగడం తో రెండు ఓవర్ల తర్వాత నేను కంకషన్ ప్రత్యామ్నాయంగా ఆడబోతున్నాని సమాచారం అందింది. నేను చాలా కాలంగా భారత్ జట్టు తరుఫున ఆడాలని ఎదురు చూస్తున్నాను. నా నైపుణ్యాన్ని నిరూపించుకోవాలనుకున్నాను. నేను ఐపీఎల్లో బాగానే బౌలింగ్ చేసాను.ఇక్కడ కూడా అదే రీతిలో ఆడుతున్నానని రాణా పూణే మ్యాచ్ అనంతరం చెప్పాడు.8వ ఓవర్లో మైదానంలోకి దిగిన రాణా, ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ఇచ్చిన క్యాచ్ కూడా పట్టుకుని అతన్ని అవుట్ చేయడంలో కీలకమైన పాత్ర పోషించాడు. అయితే రాణాను ప్రత్యామ్నాయంగా ఎంపిక చేయడం చాలా మంది అభిమానులకు నచ్చలేదు. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ తన సోషల్ మీడియాలో ఈ విషయం పై స్పందిస్తూ “పార్ట్ టైమ్ బౌలింగ్ చేసే బ్యాట్స్‌మన్ స్థానంలో పూర్తి స్థాయి బౌలర్ అయిన రాణా ని ఎలా తీసుకుంటారు అని ప్రశ్నించాడు. రమణ్‌దీప్ (సింగ్) దూబేకు సమానమైన ప్రత్నామ్యాయం అని వ్యాఖ్యానించాడు.దీని పై భారత్ మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా విమర్శించడం గమనార్హం. "ఇదేమీ ఆట? దూబే స్థానంలో రాణా ప్రత్నామ్యాయ అతగాడి రంగ ప్రవేశం చేయడం ఇది ఐపీఎల్ మ్యాచ్ లో సూపర్‌సబ్ వ్యవహారం లాగా ఉంది ”అని అశ్విన్ వ్యాఖ్యానించాడు. ఈ వివాదం అటుంచితే ఛాంపియన్స్ ట్రోఫీ వంటి ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్ ముందు హర్షిత్ రాణా రాణించడం భారత్ కి శుభపరిణామం. ఇప్పటికే భారత్ ప్రధాన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వెన్నునొప్పి నుంచి పూర్తిగా కోలుకోక పోవడం, సీనియర్ పేస్ బౌలర్ మహమ్మద్ షమీ ఫిటినెస్ పై అనుమానాలు రేకెత్తుతున్న సమయంలో రాణా రంగప్రవేశం భారత్ కి కొంత ఉపశమనాన్నిస్తుదనడంలో సందేహం లేదు. -
నేను డోపీని కాదు
న్యూఢిల్లీ: తెలుగు షట్లర్ గరగ కృష్ణప్రసాద్ డోపీగా తేలడంతో నాలుగేళ్ల నిషేధానికి గురయ్యాడు. అయితే తను మాత్రం డోపీని కానే కాదని, తన ఒంట్లో ఎలాంటి నిషేధిత ఉత్ప్రేరకాలకు చోటే లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. 2022లో థామస్ కప్‌లో టైటిల్ గెలిచిన భారత జట్టులో కృష్ణ ప్రసాద్ సభ్యుడిగా ఉన్నాడు. అతను సాయిప్రతీక్తో జోడీగా పురుషుల డబుల్స్‌లో పోటీపడ్డాడు. అయితే గతేడాది అతని రక్త,మూత్ర నమూనాలను పరిశీలించగా అందులో నిషిద్ధ ఉత్ప్రేరకం “హ్యూమన్ క్రొనిక్ గొనడొట్రొపిన్ (హెచ్‌సీజీ) ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) తాజాగా అతనిపై నాలుగేళ్ల నిషేధం విధించింది. నిజానికి గత సెప్టెంబర్‌లోనే ‘నాడా’ చర్యలు తీసుకోవాల్సి ఉండగా... తెలుగు షట్లర్ అప్పీలుకు వెళ్లాడు. ఇటీవలే అప్పీలును తిరస్కరించడంతో కృష్ణ ప్రసాద్‌పై సస్పెన్షన్ వేటు పడింది. 2019లో జరిగిన దక్షిణాసియా క్రీడల్లో కృష్ణ ప్రసాద్ డబుల్స్ టైటిల్ సాధించాడు. అతనితో పాటు శ్వేతపర్ణ పండాపై కూడా “నాడా’ వేటు పడింది. కోవిడ్ సమయంలో వాడిన దగ్గు టానిక్‌లో నిషిద్ధ ఉత్ప్రేరకాలు ఉండటంతో అప్పట్లో కూడా ఇలాంటి ఆరోపణల్నే కృష్ణ ప్రసాద్ ఎదుర్కొన్నాడు. అయితే నేరుగా కావాలని తీసుకోకపోవడంతో అప్పుడు తేలిగ్గానే బయటపడ్డాడు. ఈసారి మాత్రం నిషేధానికి గురయ్యాడు. ‘నాపై విధించిన నిషేధంపై భారత బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు హిమంత బిశ్వ శర్మ సార్‌ను సంప్రదించాలని అనుకుంటున్నాను. ఈ కేసు, సమస్యపై ఆయనకే వివరిస్తాను’ అని కృష్ణప్రసాద్ అన్నాడు. సాధారణంగా హార్మోన్ల సమతూకం లోపించినపుడు కూడా హెచ్‌సీజీ నివేదికలో తేడాలొస్తాయని అతను వాదిస్తున్నాడు. మరోవైపు శ్వేతపర్ణ తన సస్పెన్షన్‌పై స్పందించేందుకు తిరస్కరించింది. ఆమె సోదరి రుతుపర్ణ కూడా షట్లరే! ఇద్దరు ఇంటా బయటా జరిగిన పలు టోర్నీల్లో రాణించారు. -
బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు.. కోటక్‌కు ఇది అగ్ని పరీక్షే
ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ బ్యాటర్లు ఘోరంగా విఫలమవడంతో భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు పరిస్థితిని చక్కదిద్దేందుకు నడుం కట్టింది. ఈ చర్యల్లో భాగంగా దేశవాళీ పోటీల్లో క్రికెటరలందరూ పాల్గొనాలని, విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడు పాటించాల్సిన మార్గదర్శకాలు విడుదల చేసింది. సౌరాష్ట్ర మాజీ బ్యాటర్ సితాన్షు కోటక్‌ను జట్టు బ్యాటింగ్ కోచ్‌గా నియమించింది.ఈ పదవికి పోటీ పడ్డ వాళ్ళు చాలామందే ఉన్నారు. ప్రఖ్యాత ఇంగ్లండ్ బ్యాటర్, వ్యాఖ్యాత కెవిన్ పీటర్సన్ తన సోషల్ మీడియా ద్వారా బహిరంగంగా తన సంసిద్ధతను వ్యక్తం చేసాడు. అయితే బీసీసీఐ ముందే ఈ విషయం పై ఒక నిర్ణయం తీసుకుంది. దేశవాళీ పోటీల్లో పరుగుల ప్రవాహం సృష్టించిన సితాన్షు కోటక్‌ను బ్యాటింగ్ కోచ్ గా నియమించింది. కోటక్ దేశవాళీ క్రికెట్లో 10,000 పరుగులు పైగా సాధించాడు కానీ అంతర్జాతీయ స్థాయిలో ఎప్పుడూ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించలేదు. 2013లో క్రికెట్ కి గుడ్ బై చెప్పిన తర్వాత, కోటక్ కోచింగ్ రంగంలోకి దిగి తన కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించాడు. 2020లో సౌరాష్ట్ర రంజీ ట్రోఫీ టైటిల్ సాధించడానికి మార్గనిర్దేశం చేశాడు. 2019 నుండి నేషనల్ క్రికెట్ అకాడమీలో బ్యాటింగ్ కోచ్‌గా పనిచేశాడు. ఇటీవలి కాలంలో భారత్ వైట్-బాల్ సిరీస్‌లో వివిఎస్ లక్ష్మణ్‌కు సహాయ కోచ్‌గా సేవలందించాడు . బుధవారం ఇంగ్లాండ్‌తో స్వదేశంలో జరగబోయే టి20 సిరీస్‌తో కోటక్ తన బాధ్యతలు చేపట్టనున్నాడు. కోటక్ నియామకం తప్పనిసరిఇటీవల స్వదేశం, విదేశాలలో జరిగిన సిరీస్‌ల్లో భారత్ బ్యాటర్లు పేలవంగా ఆడిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన సిరీస్‌లో యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ మినహా మిగిలిన ప్రధాన బ్యాటర్లు అందరూ ఘోరంగా విఫలమయ్యారు. అయితే అంతకుముందు స్వదేశంలో న్యూజిల్యాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో స్పిన్‌కు అనుకూలమైన పిచ్ ల పై సైతం భారత బ్యాటర్లు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఫలితంగా న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్ లో భారత్ జట్టు 0-3 తేడాతో పరాజయం పాలైంది. అప్పుడే బీసీసీఐ బ్యాటింగ్ కోచ్ ని నియమించి వుంటే ఆస్ట్రేలియా సిరీస్ లో కొద్దిగా పరువు దక్కేది. ఈ నేపథ్యంలో కోటక్ నియామకం కొద్దిగా ఆలస్యమైనా సరైన నిర్ణయం గా కనిపిస్తోంది.బ్యాటింగ్ కోచ్‌గా అనుభవం..అంతర్జాతీయ స్థాయిలో భారత్ కి ఎప్పుడూ ప్రాతినిధ్యం వహించకపోయినా, కోటక్ రెండు దశాబ్దాల పాటు దేశవాళీ పోటీల్లో రాణించాడు. ఫస్ట్-క్లాస్ మరియు లిస్ట్ ఎ ఫార్మాట్లలో కలిపి 10,000 పైగా పరుగులు సాధించాడు. కోటక్ వార్విక్షైర్తో కౌంటీ క్రికెట్లో కూడా కొంతకాలం ఆడాడు. కోటక్ 130 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో 15 సెంచరీలు మరియు 55 అర్ధ సెంచరీలతో 41.76 సగటుతో 8,061 పరుగులు చేశాడు. ఇంకా 89 లిస్ట్ ఎ మ్యాచ్ లలో మూడు సెంచరీలు, 26 అర్ధ సెంచరీలతో 42.23 సగటుతో 3,083 పరుగులు సాధించాడు.అన్ని ఫార్మాట్లలో కోచింగ్ సమర్ధతకోటక్ బీసీసీఐ, వేల్స్ క్రికెట్ బోర్డు నుండి లెవల్ 1 మరియు లెవల్ 2 కోచింగ్ పరీక్షలు పూర్తిచేసాడు. జాతీయ క్రికెట్ అకాడమీలో ఇండియా ఎ ఆటగాళ్లకు శిక్షణ ఇవ్వడంలో అనుభవం గడించిన కోటక్ కొంతకాలం భారత పరిమిత ఓవర్ల జట్టుకి సహకారం కూడా అందించాడు. కోటక్ ఐపీల్ లో 2016లో గుజరాత్ లయన్స్‌కు సహాయ కోచ్‌గా పనిచేశాడు. సురేష్ రైనా, ప్రస్తుత ఇంగ్లాండ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ వంటి ఆటగాళ్లతో కలిసి పనిచేసి రాటుదేలాడు.ఇటీవలి కాలంలో కోటక్ భారత జట్టుతో కలిసి పలు పర్యటనలకు వెళ్ళాడు. రాహుల్ ద్రవిడ్, గౌతం గంభీర్ అందుబాటులో లేని సమయంలో వీవీఎస్ లక్ష్మణ్ కి సహాయ కోచ్ గా పని చేశాడు. 2023లో జస్ప్రిత్ బుమ్రా నేతృత్వంలో భారత్ జట్టు ఐర్లాండ్ పర్యటనలో మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడినప్పుడు కోటక్ ప్రధాన కోచ్‌గా ఉన్నాడు. అన్ని ఫార్మాట్ల అవసరాలకు అనుగుణంగా బ్యాటింగ్ లో మార్పులు చేయగల ప్రజ్ఞాపాటవాలు కోటక్ కి పుష్కలంగా ఉన్నాయి. అయితే జట్టులోని ఎంతో అనుభవజ్ఞులైన కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి బ్యాట్స్‌మన్ కి కొత్తగా కోచింగ్ ఇవ్వాల్సిన అవసరమేమీ లేదు. పేస్ బౌలింగ్ అనుకూలంగా ఉండే ఆస్ట్రేలియా వంటి పిచ్ ల పై భారత్ బ్యాట్స్‌మన్ రాణించిన సందర్భాలు తక్కువే. అయితే ఇటీవల కాలంలో లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, లక్ష్మణ్, సౌరవ్ గంగూలీ వంటి హేమాహేమీలు వచ్చిన తర్వాత భారత బ్యాటర్లు విదేశీ పర్యటనలలో కూడా రాణించగలమని నిరూపించుకున్నారు. ప్రస్తుతం న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్ ల లో ఎదురుదెబ్బలు తగిలిన నేపథ్యంలో బీసీసీఐ జట్టు లోపాల్ని సరిదిద్దడానికి నడుం కట్టింది. ఇందులో భాగంగా కోటక్ ని బ్యాటింగ్ కోచ్ గా నియమించారు. అయితే ఇది సత్ఫలితాలను ఇస్తుందా లేదా అన్న విషయం రాబోయే ఇంగ్లాండ్ పర్యటన, ఛాంపియన్స్ ట్రోఫీ సిరీస్ తో తేలిపోతుంది. కోటక్ కి ఇది అగ్ని పరీక్షే! -
‘డోపీ’ కిరణ్ బలియాన్
న్యూఢిల్లీ: భారత మహిళా షాట్‌పుట్ క్రీడాకారిణి కిరణ్ బలియాన్ డోప్ టెస్టులో విఫలమైంది. అమె నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు పరీక్షల్లో తేలడంతో జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) ఆమెపై చర్యలు చేపట్టింది. కాగా ఈ డోపీల జాబితా నుంచి స్టార్ రెజ్లర్, టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత బజరంగ్ పూనియాను తప్పించారు. నిజానికి అతను డోపీగా ఏ టెస్టులోనూ నిరూపణే కాలేదు. కానీ మార్చిలో జరిగిన సెలక్షన్ ట్రయల్స్‌లో పాల్గొన్న బజరంగ్ మూత్ర నమూనాలు ఇవ్వలేదన్న కారణంతో ‘నాడా’ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఏప్రిల్ 23న అతన్ని సస్పెండ్ చేసింది. తాజా నిర్ణయంతో బజరంగ్‌కు పెద్ద ఊరట లభించినట్లయ్యింది. 25 ఏళ్ల కిరణ్ గతేడాది చైనాలో జరిగిన ఆసియా క్రీడల్లో కాంస్య పతకం సాధించింది. తద్వారా షాట్‌పుట్‌లో పతకం గెలిచిన రెండో మహిళా అథ్లెట్‌గా ఆమె గుర్తింపు పొందింది.జాతీయ ఇంటర్ స్టేట్ చాంపియన్íÙప్ (2023)లో బంగారు పతకం గెలిచిన ఆమె ఈ ఏడాది ఫెడరేషన్ కప్‌లో రజతం చేజిక్కించుకుంది. ‘నాడా’ నిర్వహించిన డోపింగ్ (శాంపిల్–ఎ) పరీక్షలో ఆమె నిషేధిత స్టెరాయిడ్ తీసుకున్నట్లు తేలడంతో తాత్కాలిక నిషేధం విధించారు. ‘బి’ శాంపిల్ పరీక్షలోనూ విఫలమైతే ఆమెపై గరిష్టంగా నాలుగేళ్ల నిషేధం పడే అవకాశముంది. షట్లర్ కృష్ణ ప్రసాద్ కూడా... ఆంధ్రప్రదేశ్ షట్లర్, డబుల్స్ స్పెషలిస్ట్ గరగ కృష్ణ ప్రసాద్ కూడా డోపింగ్‌లో దొరికిపోయాడు. రెండేళ్ల క్రితం జరిగిన థామస్ కప్ (2022)లో స్వర్ణ పతకం గెలిచిన భారత పురుషుల జట్టులో సభ్యుడైన కృష్ణ ప్రసాద్ నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలింది. అతని నుంచి సేకరించిన రక్త, మూత్ర నమూనాల్లో హ్యూమన్ కొరియోనిక్ గొనడొట్రొపిన్ (హెచ్‌సీజీ) పాజిటివ్ రిపోర్టు వచి్చంది. దీంతో అతనిపై తాత్కాలిక వేటు పడింది. 2014 ఇంచియోన్ ఆసియా క్రీడల్లో కాంస్యం నెగ్గిన హ్యామర్ త్రోయర్ మంజుబాలా డోపీగా తేలడంతో ఆమెపై కూడా చర్యలు తీసుకున్నారు. వీరితో పాటు ఫెడరేషన్ కప్‌లో రజతం నెగ్గిన షాలిని చౌదరి (డిస్కస్ త్రో), చావి యాదవ్ (రన్నర్), డీపీ మనూ (జావెలిన్ త్రోయర్), దీపాన్షి (రన్నర్), పర్వేజ్ ఖాన్ (రన్నర్), ఆర్జు (రెజ్లింగ్), వుషు ప్లేయర్లు మేనకా దేవి, మన్జిందర్ సింగ్, గౌతమ్ శర్మలు కూడా డోపింగ్‌లో పట్టుబడ్డారు. -
జాతీయస్థాయిలో సత్తాచాటిన సాక్షి ఫొటోగ్రాఫర్లు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్)/ నాగాయలంక/తిరుపతి కల్చరల్: అంత ర్జాతీయ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ఫొటో జర్నలిస్ట్ అసోసి యేషన్ (ఏపీపీజేఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయస్థాయి ఫొటో కాంపిటీషన్ ఫలితాలను జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు విడుదల చేశారు. గురువారం విజయవాడలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఏపీపీజేఏ అధ్యక్షుడు సీహెచ్‌వీఎస్ విజయ భాస్కర రావు, ప్రధాన కార్యదర్శి వి.రూబెన్ బెసాలి యల్‌తో కలిసి కలెక్టర్ ఫలితాలను విడుదల చేశారు. పోటీల్లో జనరల్ కేటగిరీలో ఎండీ నవాజ్ (సాక్షి, వైజాగ్) ద్వితీయ బహుమతి గెలుచుకున్నారు. ఫొటో జర్నలిజం కేటగిరీలో సాక్షి ఫొటోగ్రాఫర్లు పి.లీలా మోహన్‌రావు (వైజాగ్), వి. శ్రీనివాసులు (కర్నూలు), కందుల చక్రపాణి (విజయవాడ), పి.మను విశాల్ (విజయవాడ), కె.శివకుమార్ (యాదాద్రి), కె.జయ శంకర్ (శ్రీకాకుళం), కేతారి మోహన్‌కృష్ణ (తిరుపతి), ఎస్.లక్ష్మీ పవన్ (విజయవాడ) కన్సొలేషన్ బహుమ తులు గెలుచుకున్నారు. జనరల్ కేటగిరీలో సాక్షి ఫొటోగ్రాఫర్ ఎస్ లక్ష్మీపవన్ (విజయ వాడ) కన్సొలేషన్ బహుమతి గెలుచుకు న్నాడు. ఈ సందర్భంగా ఏపీపీజేఏ అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ పోటీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన పత్రికా ఫొటోగ్రాఫర్ల నుంచి 700 ఎంట్రీలు వచ్చాయన్నారు. విజేతలకు ఈనెల 19న విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వ హించే కార్యక్రమంలో బహుమతులు ప్రదానం చేస్తామన్నారు. జాతీయ ఫొటో పోటీల్లో కృష్ణప్రసాద్‌కు మెరిట్ అవార్డు వరల్డ్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా నిర్వ హించిన నేషనల్ ఫొటో కాంటె స్ట్–2023లో కృష్ణాజిల్లా నాగాయ లంకకు చెందిన ఫొటోగ్రాఫర్ సింహాద్రి కృష్ణప్రసాద్ పంపిన ఛాయా చిత్రానికి సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్ అవార్డు దక్కింది. ఫొటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా (పీఏఐ), ఇండియా ఇంటర్నే షనల్ ఫొటోగ్రాఫిక్ కౌన్సిల్ (ఐఐపీసీ) ఆధ్వర్యంలో జాతీయస్థా యిలో నిర్వహించిన ఫొటో పోటీల్లో స్పెషల్ థీమ్ మ్యాని ఫెస్టేషన్స్ ఆఫ్ నేచర్‌లో అండర్ స్టాండింగ్ ది క్లౌడ్స్ విభాగంలో ఆయన పంపిన ‘క్లౌడ్స్ అంబరిల్లా టూ గాడ్’ ఛాయచిత్రం ప్రథమ సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్ అవార్డు దక్కించుకుంది. -
కేపీ చౌదరితో ఎవరెవరికి లింక్?
సాక్షి, సిటీబ్యూరో: డ్రగ్స్ కేసులో అరెస్టయిన కబాలి తెలుగు సినిమా నిర్మాత కృష్ణ ప్రసాద్ చౌదరి అలియాస్ కేపీ చౌదరితో ఇంకా ఎవరెవరికి సంబంధాలున్నాయనే కోణంలో సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే బిగ్‌బాస్ తెలుగు షో ఫేం, మరో ఇద్దరు నటీమణులతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గోవా, బిహార్ వంటి ఇతర రాష్ట్రాలకు చెందిన పలువురు వ్యాపారవేత్తలు, క్రీడాకారులు, వైద్యులతో చౌదరికి సంబంధాలున్నాయని పోలీసులు గుర్తించిన సంగతి తెలిసిందే. ఈమేరకు రిమాండ్ రిపోర్ట్‌లోనూ ఆ 12 మంది అనుమానితుల పేర్లు, ఫోన్ కాల్స్ వివరాలు, బ్యాంకు లావాదేవీలను సైతం జతపరిచారు. వీరంతా కేపీ చౌదరి నుంచి కొకై న్ కొనుగోలు చేసి సేవించారా? లేక ఇతరుల కోసం కొనుగోలు చేశారా? అనే అంశాలను నిర్ధారించేందుకు పోలీసులు దర్యాప్తును సాగిస్తున్నారు. ఆయా అంశాలపై పూర్తి ఆధారాలను సేకరించేందుకు నిందితుడు కేపీ చౌదరి ఏడాది కాలం నుంచి జరిపిన ఫోన్ కాల్స్, వాట్సాప్ సందేశాలు, బ్యాంకు లావాదేవీలను ప్రత్యేక దర్యాప్తు బృందం విశ్లేషిస్తోంది. ఆధారాల సేకరణ పూర్తయ్యాక 12 మంది అనుమానితుల వాంగ్మూలం కూడా సేకరించనున్నారు. ఈమేరకు త్వరలోనే వారికి నోటీసులు జారీ చేసి విచారించనున్నట్లు ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. -
డ్రగ్స్ కేసులో సెలబ్రిటీలకు నోటీసులు!
సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్ కేసులో అరెస్టయిన కబాలి తెలుగు నిర్మాత కృష్ణ ప్రసాద్ చౌదరి (కేపీ చౌదరి).. పలువురు సినీనటులు, క్రీడాకారులు, వైద్యులు, వ్యాపారస్తులకు కొకైన్ సరఫరా చేసినట్టు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొనడం ఆయా వర్గాల్లో అలజడి మొదలైంది. కేపీ చౌదరి దందా, డ్రగ్స్ కొన్నవారి జాబితా, బ్యాంకు లావాదేవీలు, ఫోన్ సంభాషణలు, వాట్సాప్ చాటింగ్‌లు, డ్రగ్స్ పార్టీల ఫొటోలను నిందితుడు కేపీ చౌదరి గూగుల్ డ్రైవ్‌లో భద్రపరుచుకోగా.. వాటిని పోలీసులు వెలికితీసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సదరు సెలబ్రిటీలు, ఇతర వ్యక్తులకు నోటీసులు జారీ చేసి విచారించాలని పోలీసులు యోచిస్తున్నారు. ఈనెల 14న కేపీ చౌదరి గోవా నుంచి హైదరాబాద్‌కు 100 గ్రాముల కొకైన్ తీసుకురాగా.. అందులో 12 గ్రాముల కొకైన్‌ను విక్రయించానని పోలీసులకు చెప్పారు. దానిని ఎవరికి అమ్మాడనేది తేల్చడంపై పోలీసులు దృష్టిపెట్టారు. మిగతా 88 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అవన్నీ అవాస్తవాలు: అషురెడ్డి కేపీ చౌదరి వ్యవహారంపై అషురెడ్డి ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించారు. ‘‘కొందరు వ్యక్తులతో నాకు సంబంధాలు ఉన్నాయంటూ వస్తున్న కథనాలు అవాస్తవం. నాపై అలా దుష్ప్రచారం ఎందుకు చేస్తున్నారో అర్థం కావటం లేదు. నా ఫోన్ నంబర్‌ను బహిరంగంగా పోస్ట్ చేయడం కూడా సరికాదు’’అని పేర్కొన్నారు. ఓ క్రీడాకారిణి నివాసంలో డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్టుగా పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించగా.. కొద్దిరోజులు అద్దె కోసం కేపీ చౌదరి ఇంటిని అడిగాడని, అంతేతప్ప ఆ ఇంట్లో వారేం చేశారనేది తనకు తెలియదని చెప్పారు. -
కేపీ చౌదరి డ్రగ్స్ కేసులో సెలబ్రిటీలు
సాక్షి, హైదరాబాద్: కబాలీ తెలుగు సినిమా నిర్మాత కృష్ణ ప్రసాద్ చౌదరి అలియాస్ కేపీ చౌదరి డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. సెలబ్రిటీల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. బిగ్ బాగ్ తెలుగు రియాల్టీ షో కంటెస్టెంట్ అషురెడ్డితో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు, పలువురు ప్రముఖులు, వ్యాపార సంస్థల యజమానులకు కేపీ చౌదరి డ్రగ్స్‌ను సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. వారం రోజుల క్రితం గోవా నుంచి హైదరాబాద్‌కు కొకైన్‌ను సరఫరా చేసి విక్రయించే క్రమంలో మాదాపూర్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ), రాజేంద్రనగర్ పోలీసులు కిస్మత్పూర్ క్రాస్ రోడ్ వద్ద అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. చౌదరి సెల్ఫోన్లను స్వాదీనం చేసుకున్న పోలీసులు వాట్సాప్ చాటింగ్స్, ఫొటోలు, బ్యాంకు లావాదేవీలను విశ్లేషించారు. ఆయా అంశాలపై స్పష్టత కోసం చౌదరిని రెండురోజులు కస్టడీలోకి తీసుకొని విచారించారు. అనంతరం ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్ రిపోర్ట్‌లో పలు సంచలన విషయాలను పేర్కొన్నారు. 12 మందికి కొకైన్ విక్రయం పోలీసుల విచారణలో కేపీ చౌదరి.. సెలబ్రిటీలు, రాజకీయ నేతల కుమారులు, ప్రముఖులు 12 మందికి కొకైన్ విక్రయించినట్లు ఒప్పుకున్నాడు. వివిధ ప్రాంతాలకు చెందిన బెజవాడ భరత్, వందనాల అనురూప, చింతా సాయి ప్రసన్న, చింతా రాకేష్ రోషన్, నల్లా రతన్ రెడ్డి, ఠాగోర్ విజ్ అలియాస్ ఠాగోర్ ప్రసాద్ మోటూరి, తేజ్ చౌదరి అలియాస్ రఘు తేజ, వంటేరు శవన్ రెడ్డి, సనా మిశ్రా, శ్వేత, సుశాంత్, నితినేష్ వీరిలో ఉన్నారు. సెలబ్రిటీల కాంటాక్ట్‌లు, పార్టీ ఫొటోలను కేపీ చౌదరి గూగుల్ డ్రైవ్‌లో భద్రపరుచుకున్నాడు. వాటిని పోలీసులు డీకోడ్ చేశారు. వందలాది ఫోన్ కాల్స్.. ఈ ఏడాది మేలో కేపీ చౌదరి, తన స్నేహితుడు బెజవాడ భరత్‌తో కలిసి బెంగళూరుకు వెళ్లి అక్కడ డ్రగ్స్ పార్టీ నిర్వహించాడు. ఈ సమయంలో సురేష్ రాజు, రతన్ రెడ్డి, గోవాలోని మీరాజ్ క్లబ్ మేనేజింగ్ పార్ట్నర్ దీక్షయ్, సినీ ఆర్టిస్టు జ్యోతి, డాక్టర్ సుధీర్లతో కేపీ చౌదరి వందలాది ఫోన్ కాల్స్ మాట్లాడినట్లు గుర్తించారు. పెద్దసంఖ్యలో ఫోన్‌కాల్స్ ఎందుకు చేశారని చౌదరిని ప్రశ్నించగా.. స్పష్టమైన సమాధానం చెప్పలేదని పోలీసులు తెలిపారు. ఇతర రాష్ట్రాల్లోనూ డ్రగ్స్ కస్టమర్లు.. పలు ఇతర రాష్ట్రాలలో కూడా చౌదరికి డ్రగ్స్ కస్టమర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాలలో 11 అనుమానాస్పద లావాదేవీలు జరిపాడు. వీటిపైనా సరైన వివరణ ఇవ్వలేదు. అమెరికాలో ఉంటున్న దుగ్గిరాల అమర్ రూ.లక్షల్లో, గోవాలో రెస్టారెంట్ నిర్వాహకుడు మనీష్ సాహా రూ.85 వేలు, షేక్ ఖాజా అనే వ్యక్తి రూ.2 లక్షలు, బిహార్‌కు చెందిన కిన్షుక్ అగర్వాల్ రూ.16 వేలు, టి.సుజాత అనే మహిళ రూ.లక్ష నగదును కేపీ చౌదరి బ్యాంకు ఖాతాకు బదిలీ చేసినట్లు వివరించారు. -
ఒక డైరెక్టర్, ఇద్దరు హీరోయిన్లు!
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ పరిశ్రమలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. కబాలీ తెలుగు సినిమా నిర్మాత కృష్ణ ప్రసాద్ చౌదరి అలియాస్ కేపీ చౌదరి గోవా నుంచి హైదరాబాద్‌కు 82.75 గ్రాముల కొకైన్‌ను సరఫరా చేస్తూ సైబరాబాద్ పోలీసులకు చిక్కిన సంగతి తెలిసిందే. నిందితుడు కేపీ చౌదరి నుంచి స్వాదీనం చేసుకున్న నాలుగు సెల్ఫోన్లలోని డేటా ఆధారంగా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలతో ఫొటోలు, పార్టీ వీడియోలను పోలీసులు గుర్తించారు. గోవాతో పాటు హైదరాబాద్‌లో కిస్మత్‌పూర్‌లోని విల్లాలో కూడా ప్రైవేట్ పార్టీలు నిర్వహించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో ఆయా ప్రముఖులు, సెలబ్రిటీల జాబితాను పోలీసులు సిద్ధం చేస్తున్నారు. ఎలా దొరికాడంటే..: గత నెల 5న మాదాపూర్ స్పెషల్ ఆపరేషన్ టీం, రాయదుర్గం పోలీసు లు నానక్‌రాంగూడ సమీపంలో 300 గ్రాముల కొకైన్‌ను స్వాదీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితు డు రాకేష్ రోషన్ వాట్సాప్ ద్వారా కేపీ చౌదరి లావాదేవీలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అతని కదలికలపై నిఘా పెట్టిన సైబరాబాద్ పోలీసులు.. బుధవారం కిస్మత్పూర్ క్రాస్ రోడ్లో కొకైన్‌ను సరఫరా చేస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 900 మందికిపైగా కస్టమర్లు: రాకేష్, కేపీ చౌదరిల నుంచి స్వాధీనం చేసుకున్న 9 సెల్ఫోన్లను పోలీసులు విశ్లేషిస్తున్నారు. వీటిల్లో 900 మందికి పైగా కస్టమర్లతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. ఒక డైరెక్టర్, ఇద్దరు హీరోయిన్లు, నలుగురు మహిళా ఆర్టిస్టులతో వాట్సాప్ చాటింగ్‌లు, పలు లావాదేవీలు సైతం జరిపినట్లు పోలీసులు గుర్తించారు. కేపీ చౌదరికి డ్రగ్స్ సరఫరా చేసిన నైజీరియాకు చెందిన గ్యాబ్రియల్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
ప్రాణం ఖరీదు రూ.లక్ష!.. సూది మందు వికటించి వ్యక్తి మృతి
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పరుగులు తీస్తున్న నేటి రోజుల్లో రాతియుగం నాటి అనాగరిక సంస్కృతికి తెరలేపారు కొందరు. వైద్యం వికటించి వ్యక్తి మృతి చెందితే... రూ.లక్ష పరిహారం చెల్లించేలా దుప్పటి పంచాయితీ చేశారు. పెద్దల పంచాయితీకి వైద్యాధికారులు, పోలీసులూ తలొగ్గారు. ఆదివారం నిశిరాత్రి జరిగిన ఈ దారుణం సోమవారం తెల్లారేసరికి గుట్టుచప్పుడు కాకుండా తొక్కేశారు. సాక్షి, గుత్తి రూరల్: సూది మందు వికటించి ఓ వ్యక్తి మృతి చెందాడు. బాధిత కుటుంబసభ్యులు తెలిపిన మేరకు... గుత్తి మండలం తొండపాడుకు చెందిన నల్లబోతుల రంగయ్య (45), సునీత దంపతులు. వీరికి ముగ్గురు కుమారులు ఉన్నారు. ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ రంగయ్య కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. జ్వరంతో బాధపడుతున్న రంగయ్య ఆదివారం రాత్రి కుమారుడు సాయంతో గుత్తిలో ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ కృష్ణప్రసాద్ నిర్వహిస్తున్న ప్రైవేట్ క్లినిక్‌కు వెళ్లి చికిత్స చేయించుకున్నాడు. డాక్టర్ సూది మందు వేసిన కాసేపటికి రంగయ్య అపస్మారకస్థితికి చేరుకున్నాడు. దీంతో వైద్యుడి సూచన మేరకు వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి కుటుంబసభ్యులు తీసుకెళ్లారు. అప్పటికే రంగయ్య మృతి చెందాడు. దీంతో డాక్టర్ కృష్ణప్రసాద్ వైద్యం సరిగా చేయకపోవడం వల్లనే రంగయ్య మృతి చెందాడంటూ బంధువులు, కుటుంబసభ్యులు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు. అప్పటికే అక్కడకు చేరుకున్న డాక్టర్ కృష్ణప్రసాద్‌పై దాడికి యత్నించారు. సకాలంలో అక్కడకు చేరుకున్న సీఐ వెంకటరామిరెడ్డి, సిబ్బంది వెంటనే ఆందోళనకారులను చెదరగొట్టారు. చదవండి: (అందం చూసి అనుమానం.. నవ వివాహితను చంపిన సైకో భర్త) డ్యూటీ సమయంలోప్రైవేట్ క్లినిక్‌లో ఇటీవల బదిలీపై గుత్తి ప్రభుత్వాస్పత్రిలో వైద్యుడిగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ కృష్ణప్రసాద్.. స్థానికంగానే ఓ ప్రైవేట్ క్లినిక్ నిర్వహిస్తూ అదనపు ఆదాయంపై దృష్టిసారించారు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి కాల్ డ్యూటీలో ఉన్న ఆయన... తన సొంత క్లినిక్‌లో పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న రంగయ్య కుటుంబసభ్యులు నేరుగా ప్రైవేట్ క్లినిక్‌కు చేరుకున్నారు. పరీక్షించిన డాక్టర్ కృష్ణాప్రసాద్ సూది మందు వేసిన కాసేపటికి రంగయ్య అపస్మారక స్థితికి చేరుకున్నాడు. పరిస్థితి చేజారుతున్నట్లు గమనించిన డాక్టర్ వెంటనే... ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాలని రోగి కుటుంబసభ్యులకు సూచించినట్లు తెలిసింది. ఘటనపై డాక్టర్ కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. జ్వర తీవ్రత కారణంగానే రంగయ్య మృతి చెందాడని పేర్కొన్నారు. రోగి ప్రాణాలు కాపాడేందుకు తాను చేసిన ప్రయత్నాలు వివరించారు. పంచాయితీ పెద్దలు పోలీసులేనా? రంగయ్య మృతికి డాక్టర్ కృష్ణ ప్రసాద్‌నే కారణమంటూ పోలీసులకు కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేయాల్సిన పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ దుప్పటి పంచాయితీకి తెరలేపినట్లు సమాచారం. వైద్యుడిని కాపాడే క్రమంలో బాధిత కుటుంబసభ్యులను రాజీ చేసి రూ.లక్ష పరిహారాన్ని డాక్టర్ కృష్ణప్రసాద్ చెల్లించేలా ఒప్పందం చేసినట్లు తెలిసింది. దీంతో వివాదం సద్దుమణిగినట్లు సమాచారం. -
బీజేపీలోకి హైకోర్టు న్యాయవాది రచనారెడ్డి!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, హైకోర్టున్యాయవాది రచనారెడ్డి ఆదివారం బీజేపీలో చేరనున్నట్లు తెలిసింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో వీరు బీజేపీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. విశ్రాంత ఐపీఎస్ అధికారి కృష్ణప్రసాద్ కూడా బీజేపీలో చేరేందుకు మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. కాగా, ఆగస్టు 2 నుంచి బండి సంజయ్ మూడో విడత పాదయాత్ర చేపట్టనున్నారు. యాదగిరిగుట్ట నుంచి ఆయన పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా బీజేపీలో చేరతారని కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందుకోసమే ఆయన తన మద్దతుదారులతో మంతనాలు జరుపుతున్నారని వార్తలు వస్తున్నాయి. మరోపక్క కాంగ్రెస్ కూడా ఆయనను బుజ్జగించే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. (క్లిక్: డైలమా, వెనకడుగు నా రక్తంలోనే లేదు: కోమటిరెడ్డి) -
టైటిల్ పోరుకు విష్ణువర్ధన్–కృష్ణప్రసాద్ జంట
పారిస్: తమ సంచలన ప్రదర్శన కొనసాగిస్తూ ఓర్లియాన్స్ మాస్టర్స్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల డబుల్స్ విభాగంలో పంజాల విష్ణువర్ధన్ గౌడ్–గారగ కృష్ణప్రసాద్ జంట ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో హైదరాబాద్‌కు చెందిన విష్ణువర్ధన్ గౌడ్–కృష్ణప్రసాద్ ద్వయం 21–17, 21–17తో కాలమ్ హెమ్మింగ్–స్టీవెన్ స్టాల్‌వుడ్ (ఇంగ్లండ్) జోడీపై గెలిచింది. నేడు జరిగే ఫైనల్లో బెన్ లేన్–సీన్ క్యాండీ (ఇంగ్లండ్) జంటతో విష్ణువర్ధన్–కృష్ణప్రసాద్ ద్వయం ఆడుతుంది. మహిళల సింగిల్స్‌లో భారత స్టార్ సైనా నెహ్వాల్ పోరాటం ముగిసింది. సెమీఫైనల్లో సైనా 17–21, 17–21తో లైన్ క్రిస్టోఫర్సన్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయింది. మహిళల డబుల్స్ సెమీఫైనల్లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) జోడీ 18–21, 9–21తో టాప్ సీడ్ జాంగ్‌కోల్ఫాన్–రవింద ప్రజోగ్‌జాయ్ (థాయ్‌లాండ్) జంట చేతిలో ఓటమి చవిచూసింది. మిక్స్డ్ డబుల్స్ సెమీఫైనల్లో అశ్విని పొన్నప్ప–ధ్రువ్ కపిల (భారత్) ద్వయం 9–21, 23–21, 7–21తో నోర్ నిక్లాస్–అమేలియా (డెన్మార్క్) జోడి చేతిలో పరాజయం పాలైంది. -
ప్రజలకు కావాల్సింది విమర్శలు కాదు.. భరోసా
-
ప్రణవ్–కృష్ణ ప్రసాద్ జంట పరాజయం
బార్సిలోనా (స్పెయిన్): బార్సిలోనా స్పెయిన్ మాస్టర్స్ వరల్డ్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల డబుల్స్ విభాగంలో ప్రణవ్ చోప్రా–గారగ కృష్ణ ప్రసాద్ (భారత్) జంట తొలి రౌండ్లోనే ఓటమి చవిచూసింది. మంగళవారం జరిగిన మొదటి రౌండ్ మ్యాచ్‌లో ప్రణవ్–కృష్ణ ప్రసాద్ ద్వయం 21–19, 16–21, 7–21తో బెన్ లేన్–సీన్ వెండీ (ఇంగ్లండ్) జోడీ చేతిలో పరాజయం పాలైంది. నేడు జరిగే పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో డారెన్ లియు (మలేసియా)తో హెచ్ఎస్ ప్రణయ్; వైగోర్ కోల్హో (బ్రెజిల్)తో పారుపల్లి కశ్యప్; క్రిస్టో పొపోవ్ (ఫ్రాన్స్)తో అజయ్ జయరామ్; శుభాంకర్ డేతో కిడాంబి శ్రీకాంత్; లుకాస్ క్లియర్‌బౌట్ (ఫ్రాన్స్)తో సమీర్ వర్మ తలపడతారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో వైవోని లీ (జర్మనీ)తో సైనా నెహ్వాల్ ఆడుతుంది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో మథియాస్ క్రిస్టియాన్సెన్–అలెగ్జాండ్రా బోయె (డెన్మార్క్) జోడీని సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా జంట ‘ఢీ’కొంటుంది. -
మైలవరం పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్తత
-
కృష్ణ ప్రసాద్–ధ్రువ్ కపిల జంటకు టైటిల్
ఆర్ఎస్ఎల్ ఖార్కివ్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ యువ ఆటగాడు గారగ కృష్ణ ప్రసాద్ పురుషుల డబుల్స్ టైటిల్‌ను గెల్చుకున్నాడు. ఉక్రెయిన్‌లో జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో కృష్ణ ప్రసాద్–ధ్రువ్ కపిల (భారత్) ద్వయం 21–19, 21–16తో డానియల్ హెస్–జాన్స్ పిస్టోరియస్ (జర్మనీ) జోడీపై గెలిచింది. మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో సౌరభ్–అనౌష్క జోడీ 18–21, 21–19, 22–20తో పావెల్ స్మిలోస్కి–మగ్దలీనా (పోలాండ్) జంటపై నెగ్గి టైటిల్ సొంతం చేసుకుంది. -
ఐఏఎస్సా.. ఐపీఎస్సా?
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీకి త్వరలోనే కొత్త ఎండీ రానున్నారు. ఓ యువ ఐఏఎస్ అధికారిని పూర్తిస్థాయి ఎండీగా నియమించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని సమాచారం. ఆర్టీసీ ఎండీ రమణారావు పదవీకాలం మేలో పూర్తయింది. తరువాత ఆ స్థానంలో ఎవరినీ నియమించలేదు. కానీ, ఆ బాధ్యతలను ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మకు అప్పగించారు. రోడ్లు–భవనాలు, రవాణాశాఖకు ఆయన కమిషనర్‌గా వ్యహరిస్తూనే.. ఆర్టీసీ బాధ్యతలను కూడా నిర్వర్తిస్తున్నారు. ఆర్టీసీ బాధ్యతలనుంచి తనను తప్పించాల్సిందిగా శర్మ ప్రభుత్వాన్ని కొంతకాలంగా విన్నవిస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో యువ ఐఏఎస్ అధికారి రాహుల్ బొజ్జా పేరును, మరో డీజీపీ ర్యాంకు స్థాయి ఐపీఎస్ అధికారి కృష్ణ ప్రసాద్ పేర్లు తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. గతంలో పలు జిల్లాలకు కలెక్టర్‌గా పనిచేసిన రాహుల్ బొజ్జా పరిపాలన దక్షత కలిగిన అధికారిగా మంచిపేరు సంపాదించారు. ప్రస్తుతం రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్‌గా ఉన్న కృష్ణ ప్రసాద్‌కు రోడ్డు రవాణారంగంపై మంచి పట్టు ఉంది. ప్రస్తుతానికి ప్రభుత్వం ఎవరినీ ఖరారు చేయలేదు. వీరిద్దరిలో ఒకరి పేరు ఖరారు చేస్తూ త్వరలోనే ఆదేశాలు రావొచ్చని ఆర్టీసీలో చర్చ నడుస్తోంది. -
దేవినేని ఉమ చిత్తుగా ఓడిపోవడానికి రెడీగా ఉండు..
సాక్షి, నందిగామ: ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుపై మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన శుక్రవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ...‘దేవినేని ఉమ నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండు. హత్యా రాజకీయాలు, ఆర్థిక నేరాలు చేసింది నీవే. వంగవీటి మోహనరంగా హత్యకేసులో మీ అన్న దేవినేని వెంకట రమణ ముద్దాయి కాదా?. నీ గురించి నీ అన్న గురించి ప్రజలకు తెలుసు. 2019 ఎన్నికలలో మైలవరం నియోజకవర్గం నుంచి వసంత కృష్ణప్రసాద్ చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోవడానికి సిద్ధంగా ఉండు. నీ వదిన ప్రణీతను చంపి నువ్వు రాజకీయాల్లోకి వచ్చిన సంగతి అందరికీ తెలుసు. జలవనరుల శాఖా మంత్రిగా వ్యవహరిస్తున్నదేవినేని ఉమా కనీసం తన ప్రాంత ప్రజలకు సాగునీటిని కూడా అందించలేకపోతున్నారు. ’ అంటూ ధ్వజమెత్తారు. -
కుటుంబంతో హాయిగా నవ్వుకోవచ్చు
‘‘ఓ హీరోయిన్ నిజ జీవితంలోనూ ఓ సాధారణ యువకుడితో ప్రేమలో పడటం చాలా సందర్భాల్లో జరిగాయి. ప్రతి ఇండస్ట్రీలో ఇలాంటి ప్రేమకథలుంటాయి. ‘సీతామాలక్ష్మి, రంగీలా, శివరంజని’ సినిమాలు ఇదే నేపథ్యంలో వచ్చాయి. మా ‘సమ్మోహనం’ సినిమా కూడా ఇదే బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది’’ అని నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ అన్నారు. సుధీర్‌బాబు, అదితీరావు హైదరీ జంటగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ‘సమ్మోహనం’ ఈ నెల 15న విడుదలవుతోంది. ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ– ‘‘పెయింటింగ్ వేసే ఓ సాధారణ మధ్య తరగతి యువకునికి సినిమా వాళ్లంటే కొంత చిన్నచూపు ఉంటుంది. అలాంటి యువకుడికి ఓ స్టార్ హీరోయిన్ ఎలా పరిచయమైంది? వారి మధ్య ప్రేమ ఎలా పుట్టింది? చివరకు ఎలాంటి మజిలీ చేరుకుందన్నదే ‘సమ్మోహనం’ కథ. ఇంద్రగంటితో 2016లో ‘జెంటిల్మన్’ సినిమా చేశా. సరిగ్గా రెండేళ్ల తర్వాత ‘సమ్మోహనం’ చేశా. గత ఏడాది ఆయన నాకు ‘సమ్మోహనం’ కథ చెప్పారు. కుటుంబంతో హాయిగా నవ్వుకుని చూసే ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ ఇది. మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. కథకు తగ్గట్టే ఇంద్రగంటి ‘సమ్మోహనం’ టైటిల్ పెట్టారు. ఓసారి పనిచేసిన దర్శకుడితో మరో సినిమా చేయాలంటే మొహమాటపడేవాణ్ణి. ఇంద్రగంటితో వరుసగా రెండు సినిమాలు చేశాను. నాతో వరుసగా మరో సినిమా చేద్దామనే ప్రపోజల్ కూడా ఆయనదే. ఈ పాత్రకు అదితీరావు హైదరీ బావుంటుందని ఇంద్రగంటి చెప్పారు. ప్రస్తుతం రెండు కథలు సిద్ధంగా ఉన్నాయి. నెక్ట్స్ ఎవరితో అనేది ఇంకా అనుకోలేదు’’ అన్నారు. -
వైఎస్సార్సీపీలోకి ‘వసంత’ కుటుంబం
సాక్షి, అమరావతి బ్యూరో : మాజీ హోం మంత్రి, ఆప్కాబ్ మాజీ చైర్మన్ వసంత నాగేశ్వరరావు, ఆయన కుమారుడు కృష్ణ ప్రసాద్‌లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం ఉదయం కృష్ణా జిల్లా మండవల్లి మండలం గన్నవరంలో పాదయాత్ర సాగిస్తున్న ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని వారు కలిశారు. వారితోపాటు మైలవరం నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో నేతలు, అభిమానులు, కార్యకర్తలు ర్యాలీగా తరలివచ్చారు. వసంత నాగేశ్వరరావు, కృష్ణ ప్రసాద్‌లకు జగన్.. కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వీల్‌ఛైర్‌పై వచ్చిన నాగేశ్వరరావుతో జగన్ ప్రత్యేకంగా మాట్లాడారు. తమ కుటుంబాల మధ్య ఉన్న అనుబంధాన్ని ప్రస్తావించారు. అనంతరం నాగేశ్వరరావు మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అందించిన సంక్షేమ పాలన మళ్లీ వైఎస్ జగన్‌తోనే సాధ్యమని చెప్పారు. కృష్ణా జిల్లాలో అన్ని స్థానాల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ విజయానికి సమష్టిగా కృషి చేస్తామన్నారు. కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన అనంతరం ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని చంద్రబాబు దుర్వినియోగం చేశారని విమర్శించారు. జగన్ ప్రజా సంకల్ప యాత్ర మహోద్యమంగా మారుతోందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మచిలీపట్నం, విజయవాడ పార్లమెంటరీ పార్టీ జిల్లా అధ్యక్షులు కొలుసు పార్థసారథి, సామినేని ఉదయభాను, పార్టీ నేతలు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, దూలం నాగేశ్వరరావు, కోటగిరి శ్రీధర్, మొండితోక జగన్మోహనరావు, పేర్ని నాని, జోగి రమేష్, యలమంచిలి రవి, ఉప్పాల రామ్‌ప్రసాద్, కాజా రాజకుమార్, హనుమాల సు«ధాకరరావు, ఎం.నరసింహారావు, కోయి సుబ్రహ్మణ్యం, మాగంటి రామారావు, కోటేరు గణేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
డచ్ ఓపెన్‌లో రన్నరప్ కృష్ణ ప్రసాద్ జంట
హైదరాబాద్: డచ్ ఓపెన్ అంతర్జాతీయ జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ గారగ కృష్ణ ప్రసాద్ జంట రజత పతకాన్ని సాధించింది. నెదర్లాండ్స్‌లోని హార్లీమ్ నగరంలో ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో కృష్ణ ప్రసాద్–ధ్రువ్ కపిల (భారత్) ద్వయం 13–21, 19–21తో సు లీ వీ–యో హోంగ్ వీ (చైనీస్ తైపీ) జోడీ చేతిలో ఓడిపోయింది. మరోవైపు పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ లక్ష్య సేన్ (భారత్) 19–21, 15–21తో చెన్ చీ టింగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయి కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు. మహిళల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ అమ్మాయి ప్రాషి జోషి మూడో రౌండ్లో 26–28, 17–21తో ఐరా శర్మ (భారత్) చేతిలో ఓటమి చవిచూసింది. -
ఉత్సాహంగా ఎడ్ల బండలాగుడు పోటీలు
గుంటూరు జిల్లా గురజాలలో రెండో రోజు ఎడ్ల బండలాగుడు బలప్రదర్శన పోటీలు ఉత్సాహభరితంగా సాగుతున్నాయి. స్థానిక పాతపాటేశ్వరి ఆలయం 417వ తిరునాళ్ల సందర్భంగా గ్రామ రైతు కమిటీ ఈ పోటీలను నిర్వహిస్తోంది. సోమవారం జరుగుతున్న వ్యవసాయ విభాగం 6 పళ్ల ఎడ్ల జతల పోటీలకు పెద్ద సంఖ్యలో రైతులు తమ ఎడ్లతో తరలివచ్చారు. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా రామకృష్ణ ప్రసాద్, మోహన్‌రావు వ్యవహరిస్తున్నారు. -
వెన్ను నొప్పా..అశ్రద్ధ చేస్తే మిగిలేది వైకల్యమే
వెన్ను పూస ఒక పవర్ హౌస్ లాంటిది. భవనానికి పిల్లర్స్ ఏవిధంగా ఉంటాయో అలగే మానవ శరీరానికి వెన్ను పూస పిల్లర్ లాంటిది. కొన్ని కొన్ని కారణాల వల్ల ఒక్కొక్కసారి ఈ పవర్ హౌస్ నిర్జీవం అవుతుంది. దీనివల్ల మెడ, భుజం, తల, కాళ్ళు, చేతులు, వెన్ను భాగంలో మొద్దుబారినట్లు, జిల్ జిల్ మని కరెంట్ షాక్ కొట్టినట్టు, బలహీన పడినట్లు చురకలు, పోట్లు, మంటలు మొదలవుతాయి. మరికొంత మందికి లైంగిక సమస్యలు కూడా తలెత్తవచ్చు. ఇలాంటి నిర్జీవమైన పవర్ హౌస్‌కి తిరిగి శక్తిని ఇవ్వాలంటే అదేమి ఆషామాషి చికిత్సలతో కాకుండా కేవలం కేరళ పంచకర్మ చికిత్సలు, ఔషధాలతోనే సాధ్యం అంటున్నారు ప్రముఖ ఆయుర్వేద పంచకర్మ స్పెషలిస్ట్ డా ॥పి.కృష్ణప్రసాద్. అసలు ఏమైంది? ఒకరోజు హాస్పిటల్లో బాగా బిజీగా ఉన్న సమయంలో ఒక పేషెంట్‌కి సంబంధించిన బంధువులు ఇక్కడికి వచ్చి డాక్టర్ గారిని కలిశారు. పేషెంట్‌కి ఏమయిందని డాక్టర్ గారు అడిగితే వారి బంధువులు ఈ విధంగా చెప్పారు. ‘నడుము, మెడ నొప్పులు బాగా తీవ్రంగా ఉంటాయి బెడ్ పై ఏ పక్కకు తిరిగిన కాళ్లల్లో, చేతుల్లో, భుజాలు, నడుము అంతా కరెంట్ షాక్‌లు వచ్చినట్టు ఉంటుంది, పట్టుమని ఐదు నిమిషాలు కూడా కూర్చోలేడు, నిల్చోలేడు, పడుకొని కుడి, ఎడమలకు తిరిగితే జిల్లుమని కరెంట్ షాక్‌లు కొట్టినట్టు ఉండేది, నడుముతో పాటు మెడ ప్రాంతంలో కూడా తీవ్రమైన నొప్పి వచ్చేది. రెండు చేతులు, కాళ్లు తిమ్మిర్లు, సూదులు గుచ్చుతున్నట్లు పోట్లు, మంటలు, నడిస్తే తల తిరిగి ఎక్కడ పడిపొతాడోనన్న భయం, చేతులతో ఏ వస్తువులు ఎత్తలేని పరిస్థితితో ఇలా ఈ సమస్యల చాలా కాలంగా ఉండటంతో జీవితం ఇలా అయిందేమిటన్న డిప్రెషన్లో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయాడు’ అని చెప్పారు. ప్రత్యక్షంగా పేషెంట్‌ని, రిపోర్ట్స్ క్షుణ్ణంగా చూసిన తర్వాత అతనికి వెన్నుపూసలో లంబార్ వర్టిబ్రా లోని ఔ2, ఔ4, ఔ5, ఔ1 మధ్య ఉండాల్సిన జ్చఞ తగ్గి అక్కడ ఉన్న డిస్క్‌లు బయటకు వచ్చి నరాల మీద బాగా ఒత్తిడి పడుతుంది, అలాగే మెడ ప్రాంతానికి వస్తే ఇ3, ఇ4, ఇ5, ఇ6 మధ్య కూడా ఇదే సమస్య ఉన్నట్టు నిర్ధారించారు. పవర్ హౌస్‌కి చికిత్స: ఈ సమస్య గురించి పెయిన్ కిల్లర్స్, బెడ్‌రెస్ట్, ఫిజియోథెరపీ సర్జరీ అనేది శాశ్వత పరిష్కారం కాదు అని ఇట్లాంటి పరిస్థితుల్లో డాక్టర్ గారు పేషెంట్ యొక్క శారీరక, మానసిక స్థితిని దృష్టిలో పెట్టుకొని చికిత్సను ప్రారంభించారు. కేరళ పంచకర్మతో: ఎన్ని చికిత్సలు చేసిన తగ్గని వెన్ను నొప్పులకు ఆయుర్వేదంతో మంచి నాణ్యత కలిగిన, అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమైన నానో రకేణువులతో కూడిన నూనెలు, ఔషధాలతో ప్రత్యేకంగా చికిత్సలు చేయటం జరిగింది. పంచకర్మ చికిత్సలతో అతిముఖ్యమైన అభ్యంగనం, తైలధార, కటిబస్తీ, గ్రీవబస్తీ, విరోచనం, వస్తి చికిత్సలు అందించారు. ఇలా మొదటి పది రోజులు తరువాత అరగంట సేపు కూర్చోవటం అతనిలో విపరీతమైన ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. పక్కమీద ఎటు తిరిగినా జిల్లుమన్న కరెంట్ షాక్‌లు ఇప్పుడు లేవు ఇప్పుడు నొప్పి ఉన్నా స్థిరంగా నడవ సాగుతున్నారు. మెడపై ఉంటే ఒత్తిడి బాగాతగ్గింది ఇంకొక 2 వారాలు తర్వాత నడుము గట్టిగా పిసికేసినట్టు ఉన్న నొప్పి అంతగా లేదు. చేతులు, కాళ్లు చాలా తేలికయ్యాయి, తిమ్మిర్లు, పోట్లు, మంటలు చాలా వరకు తగ్గుముఖం పట్టి అన్ని పనులు చేసుకోవచ్చన్న ఆత్మవిశ్వాసం పెరిగింది ఇలా 25 రోజులు అత్యంత శక్తివంతమైన కేరళ పంచకర్మ చికిత్సలు, ఔషధాలు ఇచ్చి, ఇంకొక మూడు నెలల పాటు కొన్ని ఔషధాలు ఇచ్చి సూచించిన వ్యాయామాలు చేయమని, మలబద్ధకం లేకుండా చూసుకోమని చెప్పారు. ఇప్పటికి ఆరునెలల గడిచాయి నొప్పి అన్న మాటే లేదు, ఒక ప్రముఖ సాప్ట్వేర్ కంపెనీలో టీమ్ లీడర్‌గా పనిచేస్తూ జాగ్రత్తలు తీసుకుంటూ చిన్న, చిన్న వ్యాయామాలు చేస్తూ చాలా సంతోషంగా ఉన్నాడు. -
హత్య కేసులో ముగ్గురికి యావజ్జీవ శిక్ష
వెల్దుర్తిపాడు(పెనుగంచిప్రోలు) : హత్య కేసులో ముగ్గురికి యావజ్జీవ శిక్ష విధిస్తూ నందిగామలోని 16వ జిల్లా అదనపు కోర్టు జడ్జి జి.రామకృష్ణ బుధవారం తీర్పు ఇచ్చినట్లు ఎస్.ఐ. నాగప్రసాద్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండలంలోని వెల్దుర్తిపాడుకు చెందిన ముచ్చు నర్సయ్యను భార్య ధనలక్ష్మి, ముచ్చు కృష్ణ ప్రసాద్ కలిసి హత్య చేసి ఖమ్మం జిల్లా మధిర ఏటిలో పూడ్చారు. వీరికి గ్రామానికే చెందిన పుల్లారావు సహకరించారు. దీనిపై అప్పటి గ్రామ వీఆర్వో రామారావు పోలీసుకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ సత్యనారాయణ కేసు నమోదు చేయగా, సీఐ బీ సాంబశివరావు దర్యాప్తు చేశారు. కేసుకు సంబంధించి జడ్జి మొత్తం 24 మందిని విచారించారన్నారు. నేరం రుజువు కావటంతో 235(2)సీఆర్పీసీ సెక్షన్ ప్రకారం నిందితులు కృష్ణప్రసాద్‌కు రూ.2వేలు, ధనలక్ష్మికి రూ.1500, పుల్లారావులకు రూ.1000లతో పాటు యావజ్జీవ శిక్ష విధించినట్లు ఎస్.ఐ. నాగప్రసాద్ పేర్కొన్నారు. -
కృష్ణప్రసాద్ అరెస్టులో రాజకీయ ప్రమేయం లేదు
నందిగామ, న్యూస్‌లైన్ : కుటుంబాల మధ్య వివాదాల నేపథ్యంలోనే తన భర్త హత్య జరిగిందని, ఈ ఘటనలో ఏ రాజకీయ పార్టీ ప్రమేయం లేదని పొదిల రవి సతీమణి మాధవి స్పష్టం చేశారు. పట్టణంలోని తన నివాసంలో శనివారం సాయంత్రం తన తండ్రి మండేపూర్తి వెంకట నరసయ్య, కుమారులిద్దరితో కలిసి ఆమె విలేకరుల సమావేశంలో పాల్గొన్నా రు. గత ఏడాది తన భర్త హత్యకు దారితీసిన పరిస్థితుల ను ఈ సందర్భంగా ఆమె వివరించారు. వసంత కృష్ణప్రసాద్ కుట్ర ఫలితంగానే పోసాని కోటేశ్వరరావు ఆధ్వర్యంలో తన భర్త హత్యకు పథకం రూపకల్పన జరిగిందన్నారు. ఆ మేరకే తన భర్తను కోనాయపాలెం సమీపంలో హత్య చేశారని పేర్కొన్నారు. ఈ ఘటనకు కృష్ణప్రసాద్ కారణమని ఆరోజే పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. అప్పటి సీఐ భాస్కరరావు తనపై ఒత్తిడి తెచ్చి ఫిర్యాదు ఉపసంహరించుకునేలా చేశారని ఆరోపించారు. అప్పటినుంచి పోలీసు ఉన్నతాధికారుల చుట్టూ తిరుగుతూ ఫిర్యాదు చేయగా జిల్లా ఎస్పీ స్పందించి కేసు విచారణకు నందిగామ డీఎస్పీని ఆదేశించారన్నారు. ఆ మేరకు సెక్షన్ 164 కింద జగ్గయ్యపేట కోర్టులో తన వాంగ్మూలాన్ని నమోదు చేశారని తెలి పారు. అనంతరం ఎస్పీ ఆదేశాల మేరకు కృష్ణప్రసాద్‌ను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారన్నారు. రాజకీయ లబ్ధికి యత్నం హత్య కేసులో అరెస్టును వివాదాస్పదం చేసి రాజకీయ లబ్ధి పొందేందుకు కృష్ణప్రసాద్ యత్నిస్తున్నారని మాధవి ఆరోపించారు. ఈ ఘటనలో ఏ రాజకీయ పా ర్టీ, ఏ నాయకుడి ప్రమేయం లేదని ఆమె స్పష్టం చేశారు. ఈ కేసులో పూర్తిగా న్యాయం జరిగేందుకు రాష్ట్ర గవర్నర్ నరసింహన్, కేంద్ర మానవ హక్కుల కమిషన్‌ను కలిసి విజ్ఞప్తి చేస్తానన్నారు. -
హత్యకేసులో ‘వసంత’ తనయుడి అరెస్టు
నందిగామ, న్యూస్‌లైన్ : ఉపాధ్యాయుడు పొదిల రవి హత్య కేసులో కుట్రదారునిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్ర హోంశాఖ మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు కుమారుడు కృష్ణప్రసాద్‌ను శుక్రవారం వేకువజామున పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణప్రసాద్, పొదిల రవి కుటుంబాల మధ్య ఆస్తులకు సంబంధించి వివాదాలు ఉన్నాయి. వసంత నాగేశ్వరరావు మేనల్లుడు మద్దాలి హనుమంతరావు (చిన్నపుల్లయ్య) రెండేళ్ల కిందట హత్యకు గురయ్యాడు. ఈ ఘటనపై పుల్లయ్య భార్య, బావమరిది రవి, మరికొందరిపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో రవిని 2013 జూన్ 12న కోనాయపాలెం వద్ద కొందరు హత్య చేశారు. ఈ ఘటనపై చందర్లపాడు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదవగా, ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ హత్యకు కృష్ణప్రసాద్ సూత్రధారి అని కేసులో ఒకటి, రెండు నిందితులుగా ఉన్న సాంబ, మంగలి బాబు విచారణ సందర్భంగా చెప్పారు. తన భర్త హత్యకు కృష్ణప్రసాద్ కారణమని పేర్కొంటూ పొదిల రవి భార్య మాధవి రెండు నెలల కిందట జిల్లా ఎస్పీకి అర్జీ అందజేసింది. దీనిపై జగ్గయ్యపేట మేజిస్ట్రేట్ వద్ద వాంగ్మూలం కూడా ఇచ్చింది. ఎస్పీ ఆదేశాల మేరకు దీనిపై నందిగామ డీఎస్పీ విచారణ జరిపారు. ఆయన ఆదేశాల మేరకు నందిగామ రూరల్ సీఐ రామ్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు శుక్రవారం కృష్ణప్రసాద్‌ను అరెస్టు చేశారు. అనంతరం నందిగామ కోర్టులో హాజరుపరిచారు. టీడీపీ నేతల ధర్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పన్నిన కుట్రలో భాగంగానే వసంత కృష్ణప్రసాద్‌ను ఎన్నికల సమయంలో అరెస్టు చేశారని నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు తంగిరాల ప్రభాకరరావు, శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య), దేవినేని ఉమామహేశ్వరరావు, ఆ పార్టీ విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని ఆరోపించారు. ఈ సంఘటనను నిరసిస్తూ వారు ధర్నా చేశారు. వైఎస్సార్ సీపీకి వసంత రాజీనామా తన కుమారుడి అరెస్టుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కారణమని ఆరోపిస్తూ మాజీ మంత్రి, పార్టీ నాయకుడు వసంత నాగేశ్వరరావు శుక్రవారం పార్టీకి రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. -
మాజీమంత్రి కుమారుడు కృష్ణ ప్రసాద్ అరెస్ట్
నందిగామ : హత్య కేసుల్లో మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు కుమారుడు, టీడీపీ నేత కృష్ణ ప్రసాద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణాజిల్లా చందర్లపాడు కోనాయిపాలెంలో 2013 సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగి పుల్లయ్య దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హత్య చేసింది పుల్లయ్య బావమరిది రవినే అని పోలీసులు గుర్తించారు. దాంతో హత్య కేసులో రవిని ప్రధాన నిందితుడిగా చేర్చారు. ఆ తరువాత సరిగ్గా ఏడాదికి రవిన కూడా దారుణ హత్యకు గురయ్యాడు.ఈ రెండు హత్యలు కృష్ణ ప్రసాద్ చేయించాడంటూ, మృతుడు రవి భార్య మాధవి హైకోర్టును ఆశ్రయించింది. ఈ రెండు హత్యలపై విచారణ జరపాలని హైకోర్డు ఆదేశాలు జారీ చేయడంతో కృష్ణప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
టీడీపీలో ఎల్బీనగర్ చిచ్చు
తెలుగుదేశం పార్టీకి ఎల్బీ నగర్ నియోజకవర్గం చుక్కలు చూపిస్తోంది. నగర శివార్లలో ఎక్కువగా సీమాంధ్ర సెటిలర్లు ఉండే ఈ నియోజకవర్గం టికెట్ కోసం టీడీపీ తరఫున ఇన్నాళ్ల నుంచి పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న కృష్ణప్రసాద్‌తో పాటు, ఎన్నాళ్లుగానో పార్టీని అంటిపెట్టుకుని ఉన్న సామా రంగారెడ్డి కూడా గట్టిగా ప్రయత్నించారు. అయితే, బీసీ వర్గం ఓట్లను దండుకోడానికి ఆర్.కృష్ణయ్యను పార్టీలో చేర్చుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఆయనను ఎల్బీనగర్ నుంచి పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. ఇది ఒక్కసారిగా అటు కృష్ణప్రసాద్, ఇటు సామా రంగారెడ్డి ఇద్దరికీ తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఇన్నాళ్ల నుంచి పార్టీ జెండాను మోస్తూ, అధికారంలో లేకపోయినా ఈ నియోజకవర్గానికి పార్టీ ఇన్చార్జి బాధ్యతలు నిర్వర్తిస్తూ ఈ ప్రాంతంలో పార్టీ ఉనికిని ఇన్నాళ్లుగా కాపాడుకుంటూ వస్తున్న కృష్ణప్రసాద్ ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జెండా మోసినవాళ్లను కాదని, టికెట్లు అమ్ముకుంటున్నారంటూ ఆయన వర్గీయులు మండిపడుతున్నారు. తనకు టికెట్ ఇవ్వకపోవడంతో టీడీపీకి రాజీనామా చేసిన కృష్ణప్రసాద్.. ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచే స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఇక ఎన్నాళ్ల నుంచో పార్టీని అంటిపెట్టుకుని, ఈ ప్రాంతంతో చిరకాల అనుబంధం ఉన్న సామా కుటుంబానికి చెందని నాయకుడు సామా రంగారెడ్డి కూడా చంద్రబాబు నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఆయన వర్గీయులైతే ఏకంగా ఆర్.కృష్ణయ్య వాహనంపై దాడికి దిగారు. ఆయనను నామినేషన్ దాఖలు చేయకుండా అడ్డుపడేందుకు కూడా ప్రయత్నించారు. చివరకు సామా రంగారెడ్డి కూడా ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. -
అభ్యర్థులకు చుక్కలు చూపిస్తున్న ఎల్బీనగర్
ఎల్బీనగర్ నియోజకవర్గం రాజకీయ నాయకులకు చిత్ర విచిత్రాలు చూపిస్తోంది. ఇక్కడ నుంచి బరిలోకి దిగుదామనుకున్న చాలా పార్టీల్లో అభ్యర్థుల విషయంలో గందరగోళం నెలకొంది. తాజాగా తెలుగుదేశం పార్టీ నుంచి బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యకు టికెట్ కేటాయించారు. అయితే, ఇన్నాళ్ల నుంచి పార్టీ జెండాను మోస్తూ, అధికారంలో లేకపోయినా ఈ నియోజకవర్గానికి పార్టీ ఇన్చార్జి బాధ్యతలు నిర్వర్తిస్తూ ఈ ప్రాంతంలో పార్టీ ఉనికిని ఇన్నాళ్లుగా కాపాడుకుంటూ వస్తున్న కృష్ణప్రసాద్ దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జెండా మోసినవాళ్లను కాదని, టికెట్లు అమ్ముకుంటున్నారన్న అపప్రథ ఇప్పటికే టీడీపీ విషయంలో గట్టిగా వినవస్తోంది. ఇప్పుడు తాజా పరిణామాలతో ఇది మరోసారి రుజువైందని స్థానిక నాయకులు మండిపడుతున్నారు. తనకు టికెట్ ఇవ్వకపోవడంతో టీడీపీకి రాజీనామా చేసిన కృష్ణప్రసాద్.. ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచే తాను రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు సమాచారం. ఇదే జరిగితే ఆర్.కృష్ణయ్యకు టీడీపీ కేడర్ ఎంతవరకు సహకరిస్తుందన్నది అనుమానమే. కేవలం బీసీ సంఘాల కార్యకర్తల బలంతోనే కృష్ణయ్య ఇక్కడి నుంచి అనేది అంత సులభం కాదు. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ విషయంలో కూడా ఇలాగే జరిగింది. ఇక్కడ సిటింగ్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని కాదని, తన సొంత మనిషి ముద్దసాని రామ్మోహన్ గౌడ్‌కు టికెట్ ఇప్పించుకోవాలని మల్కాజిగిరి ఎంపీ సర్వే సత్యనారాయణ విశ్వప్రయత్నాలు చేశారు. అయితే, సుధీర్ రెడ్డి ఢిల్లీ స్థాయిలో మంతనాలు జరిపి, తన టికెట్ ఖరారు చేయించుకున్నారు. దీంతో రామ్మోహన్ గౌడ్ తీవ్ర నిరాశకు గురయ్యారు. స్వతంత్ర అభ్యర్థిగానైనా ఎల్బీనగర్ బరిలోకి దిగాలనుకున్నారు. సరిగ్గా ఇక్కడే సర్వే చక్రం తిప్పారు. ఏం చేశారో తెలియదు గానీ.. తెల్లవారేసరికి టీఆర్ఎస్ జాబితాలో రామ్మోహన్ గౌడ్ పేరు కనిపించింది. సోమవారం వరకు కాంగ్రెస్ పార్టీలో ఉండి, ఆ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన ఆయన అసలు ఎప్పుడు టీఆర్ఎస్లో చేరారో, ఎప్పుడు టికెట్ కోసం ప్రయత్నించారో, ఎలా సాధించారో ఎవ్వరికీ తెలియలేదు. టికెట్ మాత్రం ఇట్టే వచ్చేసింది. -
జిల్లాకు రెండు ర్యాంకులు
సాక్షి, నెల్లూరు: వీఆర్ఓ ఫలితాల్లో జిల్లాకు రెండు రాష్ట్ర స్థాయి ర్యాంకులు లభించాయి. ఈ నెల 2న జరిగిన వీఆర్ఓ, వీఆర్ఏ పరీక్షలకు సంబంధించి శనివారం ఫలితాలు వెలువడ్డాయి. వీఆర్ఓలకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో 20 లోపు జిల్లాకు రెండు ర్యాంకులు దక్కాయి. నెల్లూరుకు చెందిన టీవీఎం కృష్ణప్రసాద్ (హాల్‌టికెట్:109116967) 98 మార్కులతో జిల్లాలో ప్రథమ, రాష్ట్ర స్థాయిలో 18వ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నారు. పొదలకూరు మండలం ప్రభగిరిపట్నానికి చెందిన గోగుల రమేష్ (109110704) 98 మార్కులతో జిల్లాలో రెండో స్థానాన్ని, రాష్ట్రస్థాయిలో 19వ ర్యాంక్‌ను దక్కించుకున్నారు. వీఆర్ఏ ఫలితాల్లో కావలి రూరల్ మండలానికి చెందిన వి.అనిల్‌కుమార్‌రెడ్డి (209100191) 89 మార్కులతో జిల్లాలో ప్రథమస్థానాన్ని కైవసం చేసుకున్నారు. వీఆర్ఓ పరీక్షలకు జిల్లా నుంచి 35,608 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 31,932 మంది పరీక్షకు హాజరయ్యారు. వీఆర్ఏ పరీక్షకు 2,352 మంది దరఖాస్తు చేసుకోగా 2,045 మంది హాజరయ్యారు. ఫలితాలు చూసుకునేందుకు అభ్యర్థులు పోటీపడ్డారు. అయితే వెబ్సైట్లో ఓపెన్కాక ఫలితాలు కోసం ఇంటర్నెట్ల వద్ద ఎదురుచూశారు. రోస్టర్ ఆధారంగా... ర్యాంకులు సాధించిన అభ్యర్థులకు మార్కులతోపాటు రోస్టర్ ఆధారంగా జిల్లా వారీగా ర్యాంకులను ప్రకటిస్తారు. అనంతరం ఆ ర్యాంకుల ఆధారంగా అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. శనివారం రాత్రి నుంచే జిల్లా ప్రభుత్వ యంత్రాంగం ఈ ప్రక్రియకు కసరత్తు ప్రారంభించింది. అభ్యర్థులు జిల్లాలో తమ మార్కులు, కుల ప్రాతిపదికన ర్యాంకుల కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. భర్తీకానున్న 48 వీఆర్ఓ పోస్టులు జిల్లాలో 48 వీఆర్ఓ పోస్టులు భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించి 1:2 ప్రకారం 96 మంది అభ్యర్థులకు కాల్‌లెటర్లు పంపనున్నారు. 25వ తేదీ నుంచి కలెక్టరేట్లో సర్టిఫికెట్లను పరిశీలిస్తారు. వీఆర్ఏ అభ్యర్థులను క్లస్టర్ స్థాయిలో మెరిట్ ఆధారంగా ఎంపిక చేయనున్నారు. అభ్యర్థులు ఒర్జినల్ సర్టిఫికెట్స్, జెరాక్స్ కాపీలు, పాస్ పోర్టు సైజు ఫొటోలతో హాజ రు కావాల్సి ఉంటుంది. వీఆర్ఓలకు సంబంధించి మెరిట్ సాధించిన 98 మంది అభ్యర్థుల జాబితాను ఆదివారం కలెక్టరేట్లో ప్రచురిస్తారు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరుడాట్కామ్ వెబ్సైట్లో అభ్యర్థుల జాబితా పొందుపరిచారు. -
మెయిన్ డ్రాకు కృష్ణప్రసాద్
జింఖానా, న్యూస్‌లైన్: అఖిల భారత సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్ టోర్నీలో అండర్-15 బాలుర సింగిల్స్‌లో ఆంధ్రప్రదేశ్ కుర్రాడు కృష్ణప్రసాద్ మెయిన్ డ్రాకు చేరుకున్నాడు. కడపలో జరుగుతున్న ఈ టోర్నీలో గురువారం జరిగిన క్వాలిఫయింగ్ ఫైనల్ రౌండ్లో కృష్ణప్రసాద్ 15-10, 15-13తో హర్యానాకు చెందిన తరుణ్‌పై గెలుపొందాడు. మరో మ్యాచ్‌లో శ్రీకృష్ణ సాయి కుమార్ 15-12, 15-12తో నవనీత్ (ఏపీ) పై నెగ్గగా... శ్రీ దత్తాత్రేయ రెడ్డి 15-10, 9-15, 15-12తో జయరాజ్ (అస్సాం)పై గెలిచాడు. అయితే మరో వైపు బషీర్ 12-15, 13-15తో ఆకాశ్ (బీహార్) చేతిలో, చంద్రజ్ పట్నాయక్ 12-15, 13-15తో అమన్ రైక్వార్ (మధ్యప్రదేశ్) చేతిలో పరాజయం పాలయ్యారు. బాలికల విభాగంలో షబానా బేగం 15-10, 15-13తో శివాని (కర్ణాటక)ని ఓడించి మెయిన్ డ్రాకు అర్హత సాధించింది. ఇతర ఫలితాలు: అండర్-13 బాలుర విభాగం: సాయి చరణ్ 15-10, 15-8తో జయంత్ సిసోడియా (మధ్యప్రదేశ్)పై, అనిరుధ్ పర్వత రె డ్డి 15-7, 15-10తో భవ్య అగర్వాల్ (మహారాష్ట్ర)పై నెగ్గారు. అండర్-15 బాలుర డబుల్స్: వరప్రసాద్- ఎం తరుణ్ జోడి 21-13, 21-11తో సాయి రోహిత్-ఆకాశ్ చంద్రన్ జోడిపై, విష్ణువర్ధన్- శ్రీకృష్ణ సాయి కుమార్ జోడి 15-12, 16-14, 15-12తో నవనీత్-తరుణ్ కుమార్ జోడిపై గెలిచారు. -
గ్రాన్యూల్స్ ఇండియా చేతికి ఆక్టస్ ఫార్మా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా సంస్థ గ్రాన్యూల్స్ ఇండియా తాజాగా ఆక్టస్ ఫార్మాను కొనుగోలు చేయనుంది. ఇందుకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. అయితే, ఈ డీల్ విలువ సుమారు రూ. 120 కోట్లు ఉంటుంది. కొనుగోలు ప్రక్రియ పూర్తి కావడానికి 3-6 నెలలు పట్టవచ్చని గ్రాన్యూల్స్ ఇండియా ఎండీ కృష్ణప్రసాద్ తెలిపారు. ఔషధంలో కీలక భాగంగా ఉండే యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్ (ఏపీఐ) తయారు చేసే ఆక్టస్ ఫార్మాకి.. వైజాగ్‌లోని ఫార్మా సిటీలోను హైదరాబాద్‌లోను ప్లాంట్లు ఉన్నాయి. వైజాగ్‌లోని ఆక్టస్ ప్లాంటుకు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఏతో పాటు ఇతర దేశాల నియంత్రణ సంస్థల నుంచి కూడా అనుమతులు ఉన్న నేపథ్యంలో ఈ కొనుగోలు తమకు మరింతగా ఉపయోగకరంగా ఉండగలదని కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. ఆక్టస్ పోర్ట్‌ఫోలియోలో ప్రస్తుతం 12 ఏపీఐలు ఉన్నాయి. 50 దేశాల్లోని కస్టమర్లకు విక్రయిస్తోంది. మరోవైపు, జనరిక్ ఏపీఐలను అభివృద్ధి చేసేందుకు హైదరాబాద్‌లో 10,000 చ.అ. ఆర్అండ్డీ కేంద్రాన్ని ప్రారంభించినట్లు గ్రాన్యూల్స్ ఇండియా పేర్కొంది.