‘డోపీ’ కిరణ్‌ బలియాన్‌ | Indian shot putter took banned stimulants | Sakshi
Sakshi News home page

‘డోపీ’ కిరణ్‌ బలియాన్‌

Sep 19 2024 2:48 AM | Updated on Sep 19 2024 2:48 AM

Indian shot putter took banned stimulants

నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్న భారత షాట్‌పుట్‌ క్రీడాకారిణి

గత ఏడాది ఆసియా క్రీడల్లో కాంస్యం నెగ్గిన కిరణ్‌  

న్యూఢిల్లీ: భారత మహిళా షాట్‌పుట్‌ క్రీడాకారిణి కిరణ్‌ బలియాన్‌ డోప్‌ టెస్టులో విఫలమైంది. అమె నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు పరీక్షల్లో తేలడంతో జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా) ఆమెపై చర్యలు చేపట్టింది. కాగా ఈ డోపీల జాబితా నుంచి స్టార్‌ రెజ్లర్, టోక్యో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత బజరంగ్‌ పూనియాను తప్పించారు. నిజానికి అతను డోపీగా ఏ టెస్టులోనూ నిరూపణే కాలేదు. 

కానీ మార్చిలో జరిగిన సెలక్షన్‌ ట్రయల్స్‌లో పాల్గొన్న బజరంగ్‌ మూత్ర నమూనాలు ఇవ్వలేదన్న కారణంతో ‘నాడా’ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఏప్రిల్‌ 23న అతన్ని సస్పెండ్‌ చేసింది. తాజా నిర్ణయంతో బజరంగ్‌కు పెద్ద ఊరట లభించినట్లయ్యింది. 25 ఏళ్ల కిరణ్‌ గతేడాది చైనాలో జరిగిన ఆసియా క్రీడల్లో కాంస్య పతకం సాధించింది. తద్వారా షాట్‌పుట్‌లో పతకం గెలిచిన రెండో మహిళా అథ్లెట్‌గా ఆమె గుర్తింపు పొందింది.

జాతీయ ఇంటర్‌ స్టేట్‌ చాంపియన్‌íÙప్‌ (2023)లో బంగారు పతకం గెలిచిన ఆమె ఈ ఏడాది ఫెడరేషన్‌ కప్‌లో రజతం చేజిక్కించుకుంది. ‘నాడా’ నిర్వహించిన డోపింగ్‌ (శాంపిల్‌–ఎ) పరీక్షలో ఆమె నిషేధిత స్టెరాయిడ్‌ తీసుకున్నట్లు తేలడంతో తాత్కాలిక నిషేధం విధించారు. ‘బి’ శాంపిల్‌ పరీక్షలోనూ విఫలమైతే ఆమెపై గరిష్టంగా నాలుగేళ్ల నిషేధం పడే అవకాశముంది.  

షట్లర్‌ కృష్ణ ప్రసాద్‌ కూడా... 
ఆంధ్రప్రదేశ్‌ షట్లర్, డబుల్స్‌ స్పెషలిస్ట్‌ గరగ కృష్ణ ప్రసాద్‌ కూడా డోపింగ్‌లో దొరికిపోయాడు. రెండేళ్ల క్రితం జరిగిన థామస్‌ కప్‌ (2022)లో స్వర్ణ పతకం గెలిచిన భారత పురుషుల జట్టులో సభ్యుడైన కృష్ణ ప్రసాద్‌ నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలింది. 

అతని నుంచి సేకరించిన రక్త, మూత్ర నమూనాల్లో హ్యూమన్‌ కొరియోనిక్‌ గొనడొట్రొపిన్‌ (హెచ్‌సీజీ) పాజిటివ్‌ రిపోర్టు వచి్చంది. దీంతో అతనిపై తాత్కాలిక వేటు పడింది. 2014 ఇంచియోన్‌ ఆసియా క్రీడల్లో కాంస్యం నెగ్గిన హ్యామర్‌ త్రోయర్‌ మంజుబాలా డోపీగా తేలడంతో ఆమెపై కూడా చర్యలు తీసుకున్నారు. 

వీరితో పాటు ఫెడరేషన్‌ కప్‌లో రజతం నెగ్గిన షాలిని చౌదరి (డిస్కస్‌ త్రో), చావి యాదవ్‌ (రన్నర్‌), డీపీ మనూ (జావెలిన్‌ త్రోయర్‌), దీపాన్షి (రన్నర్‌), పర్వేజ్‌ ఖాన్‌ (రన్నర్‌), ఆర్జు (రెజ్లింగ్‌), వుషు ప్లేయర్లు మేనకా దేవి, మన్‌జిందర్‌ సింగ్, గౌతమ్‌ శర్మలు కూడా డోపింగ్‌లో పట్టుబడ్డారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement