banned drug
-
‘డోపీ’ కిరణ్ బలియాన్
న్యూఢిల్లీ: భారత మహిళా షాట్‌పుట్ క్రీడాకారిణి కిరణ్ బలియాన్ డోప్ టెస్టులో విఫలమైంది. అమె నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు పరీక్షల్లో తేలడంతో జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) ఆమెపై చర్యలు చేపట్టింది. కాగా ఈ డోపీల జాబితా నుంచి స్టార్ రెజ్లర్, టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత బజరంగ్ పూనియాను తప్పించారు. నిజానికి అతను డోపీగా ఏ టెస్టులోనూ నిరూపణే కాలేదు. కానీ మార్చిలో జరిగిన సెలక్షన్ ట్రయల్స్‌లో పాల్గొన్న బజరంగ్ మూత్ర నమూనాలు ఇవ్వలేదన్న కారణంతో ‘నాడా’ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఏప్రిల్ 23న అతన్ని సస్పెండ్ చేసింది. తాజా నిర్ణయంతో బజరంగ్‌కు పెద్ద ఊరట లభించినట్లయ్యింది. 25 ఏళ్ల కిరణ్ గతేడాది చైనాలో జరిగిన ఆసియా క్రీడల్లో కాంస్య పతకం సాధించింది. తద్వారా షాట్‌పుట్‌లో పతకం గెలిచిన రెండో మహిళా అథ్లెట్‌గా ఆమె గుర్తింపు పొందింది.జాతీయ ఇంటర్ స్టేట్ చాంపియన్íÙప్ (2023)లో బంగారు పతకం గెలిచిన ఆమె ఈ ఏడాది ఫెడరేషన్ కప్‌లో రజతం చేజిక్కించుకుంది. ‘నాడా’ నిర్వహించిన డోపింగ్ (శాంపిల్–ఎ) పరీక్షలో ఆమె నిషేధిత స్టెరాయిడ్ తీసుకున్నట్లు తేలడంతో తాత్కాలిక నిషేధం విధించారు. ‘బి’ శాంపిల్ పరీక్షలోనూ విఫలమైతే ఆమెపై గరిష్టంగా నాలుగేళ్ల నిషేధం పడే అవకాశముంది. షట్లర్ కృష్ణ ప్రసాద్ కూడా... ఆంధ్రప్రదేశ్ షట్లర్, డబుల్స్ స్పెషలిస్ట్ గరగ కృష్ణ ప్రసాద్ కూడా డోపింగ్‌లో దొరికిపోయాడు. రెండేళ్ల క్రితం జరిగిన థామస్ కప్ (2022)లో స్వర్ణ పతకం గెలిచిన భారత పురుషుల జట్టులో సభ్యుడైన కృష్ణ ప్రసాద్ నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలింది. అతని నుంచి సేకరించిన రక్త, మూత్ర నమూనాల్లో హ్యూమన్ కొరియోనిక్ గొనడొట్రొపిన్ (హెచ్‌సీజీ) పాజిటివ్ రిపోర్టు వచి్చంది. దీంతో అతనిపై తాత్కాలిక వేటు పడింది. 2014 ఇంచియోన్ ఆసియా క్రీడల్లో కాంస్యం నెగ్గిన హ్యామర్ త్రోయర్ మంజుబాలా డోపీగా తేలడంతో ఆమెపై కూడా చర్యలు తీసుకున్నారు. వీరితో పాటు ఫెడరేషన్ కప్‌లో రజతం నెగ్గిన షాలిని చౌదరి (డిస్కస్ త్రో), చావి యాదవ్ (రన్నర్), డీపీ మనూ (జావెలిన్ త్రోయర్), దీపాన్షి (రన్నర్), పర్వేజ్ ఖాన్ (రన్నర్), ఆర్జు (రెజ్లింగ్), వుషు ప్లేయర్లు మేనకా దేవి, మన్జిందర్ సింగ్, గౌతమ్ శర్మలు కూడా డోపింగ్‌లో పట్టుబడ్డారు. -
భారత అథ్లెట్స్‌పై దిగ్గజ లాంగ్ జంపర్ సంచలన ఆరోపణలు
భారత అథ్లెటిక్స్ ఫెడరేషన్ (ఏఎఫ్ఐ) వైస్ ప్రెసిడెంట్.. లెజెండరీ లాంగ్ జంపర్.. 2003 వరల్డ్ అథ్లెట్స్ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత అంజు బాబీ జార్జ్ భారత అథ్లెట్స్‌పై సంచలన ఆరోపణలు చేసింది. దేశంలో బ్యాన్ చేసిన చాలా రకాల నిషేధిత డ్రగ్స్‌ను కొందరు అథ్లెట్లు విదేశాల నుంచి తీసుకొచ్చి పంచుతున్నారని ఆరోపించింది. ఢిల్లీ వేదికగా ఆదివారం జరిగిన ఏఎఫ్ఐ రెండు రోజుల వార్షిక సర్వసభ్య సమావేశంలో అంజూ జార్జీ ఈ వ్యాఖ్యలు చేసింది. ''భారతదేశంలో నిషేధించబడిన అనేక డ్రగ్స్ పదార్థాలను విదేశాల నుంచి కొందరు అథ్లెట్లు విరివిగా తీసుకువస్తున్నారు. తాము వాడడమే కాకుండా మిగతా అథ్లెట్లకు నిషేధిత డ్రగ్స్ పంచడం దారుణం. వద్దని చెప్పాల్సిన కోచ్‌లే దగ్గరుండి డ్రగ్స్ అందజేస్తున్నారు. తమ ప్రదర్శనను మెరుగుపరుచుకునేందుకే కొందరు అథ్లెట్లు ఇలాంటి నిషేధిత డ్రగ్స్ వాడుతున్నారు. దేశంలో అథ్లెట్స్ నిషేధిత డ్రగ్స్ వాడకంలో పెరుగుదల ఆందోళనకరమైన విషయం'' అని పేర్కొంది. కాగా ఏఎఫ్ఏ అధ్యక్షుడు ఆదిల్ సుమరివాలా మాట్లాడుతూ.. ''అంజూ బాబీ జార్జీ ఆరోపణను తీవ్రంగా పరిగణిస్తున్నాము. అథ్లెట్ల పరీక్షకు సంబంధించిన డోపింగ్ టెస్ట్‌ను మరింత కఠినతరం చేస్తాము. ఇప్పటికే ఈ విషయాన్ని నేషనల్ యాంటీ-డోపింగ్ ఏజెన్సీ (నాడా)కి ఈ విషయాన్ని తెలియజేశాం. డోపింగ్ పరీక్షలను మరింత పకడ్బందీగా నిర్వహించాలని వారిని కోరాం అని తెలిపారు. -
శంషాబాద్‌లో 20 కేజీల మాదక ద్రవ్యం పట్టివేత
హైదరాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం నిషేధిత మాదకద్రవ్యం ఎఫెడ్రిన్‌ను అక్రమంగా తరలిస్తున్నదక్షిణాఫ్రికా మహిళను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. రన్లీద (30) అనే మహిళ 20 కేజీల ఎఫెడ్రిన్‌తో దక్షిణాఫ్రికాకు వెళ్లే ప్రయత్నంలో ఉండగా ఆమెను ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆమె వద్ద ఉన్న 20 కేజీల ఎఫెడ్రిన్‌ను స్వాధీనం అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.