shot put
-
‘డోపీ’ కిరణ్ బలియాన్
న్యూఢిల్లీ: భారత మహిళా షాట్‌పుట్ క్రీడాకారిణి కిరణ్ బలియాన్ డోప్ టెస్టులో విఫలమైంది. అమె నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు పరీక్షల్లో తేలడంతో జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) ఆమెపై చర్యలు చేపట్టింది. కాగా ఈ డోపీల జాబితా నుంచి స్టార్ రెజ్లర్, టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత బజరంగ్ పూనియాను తప్పించారు. నిజానికి అతను డోపీగా ఏ టెస్టులోనూ నిరూపణే కాలేదు. కానీ మార్చిలో జరిగిన సెలక్షన్ ట్రయల్స్‌లో పాల్గొన్న బజరంగ్ మూత్ర నమూనాలు ఇవ్వలేదన్న కారణంతో ‘నాడా’ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఏప్రిల్ 23న అతన్ని సస్పెండ్ చేసింది. తాజా నిర్ణయంతో బజరంగ్‌కు పెద్ద ఊరట లభించినట్లయ్యింది. 25 ఏళ్ల కిరణ్ గతేడాది చైనాలో జరిగిన ఆసియా క్రీడల్లో కాంస్య పతకం సాధించింది. తద్వారా షాట్‌పుట్‌లో పతకం గెలిచిన రెండో మహిళా అథ్లెట్‌గా ఆమె గుర్తింపు పొందింది.జాతీయ ఇంటర్ స్టేట్ చాంపియన్íÙప్ (2023)లో బంగారు పతకం గెలిచిన ఆమె ఈ ఏడాది ఫెడరేషన్ కప్‌లో రజతం చేజిక్కించుకుంది. ‘నాడా’ నిర్వహించిన డోపింగ్ (శాంపిల్–ఎ) పరీక్షలో ఆమె నిషేధిత స్టెరాయిడ్ తీసుకున్నట్లు తేలడంతో తాత్కాలిక నిషేధం విధించారు. ‘బి’ శాంపిల్ పరీక్షలోనూ విఫలమైతే ఆమెపై గరిష్టంగా నాలుగేళ్ల నిషేధం పడే అవకాశముంది. షట్లర్ కృష్ణ ప్రసాద్ కూడా... ఆంధ్రప్రదేశ్ షట్లర్, డబుల్స్ స్పెషలిస్ట్ గరగ కృష్ణ ప్రసాద్ కూడా డోపింగ్‌లో దొరికిపోయాడు. రెండేళ్ల క్రితం జరిగిన థామస్ కప్ (2022)లో స్వర్ణ పతకం గెలిచిన భారత పురుషుల జట్టులో సభ్యుడైన కృష్ణ ప్రసాద్ నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలింది. అతని నుంచి సేకరించిన రక్త, మూత్ర నమూనాల్లో హ్యూమన్ కొరియోనిక్ గొనడొట్రొపిన్ (హెచ్‌సీజీ) పాజిటివ్ రిపోర్టు వచి్చంది. దీంతో అతనిపై తాత్కాలిక వేటు పడింది. 2014 ఇంచియోన్ ఆసియా క్రీడల్లో కాంస్యం నెగ్గిన హ్యామర్ త్రోయర్ మంజుబాలా డోపీగా తేలడంతో ఆమెపై కూడా చర్యలు తీసుకున్నారు. వీరితో పాటు ఫెడరేషన్ కప్‌లో రజతం నెగ్గిన షాలిని చౌదరి (డిస్కస్ త్రో), చావి యాదవ్ (రన్నర్), డీపీ మనూ (జావెలిన్ త్రోయర్), దీపాన్షి (రన్నర్), పర్వేజ్ ఖాన్ (రన్నర్), ఆర్జు (రెజ్లింగ్), వుషు ప్లేయర్లు మేనకా దేవి, మన్జిందర్ సింగ్, గౌతమ్ శర్మలు కూడా డోపింగ్‌లో పట్టుబడ్డారు. -
Paralympics: సచిన్‌కు రజతం.. 21కి చేరిన పతకాల సంఖ్య
ప్యారిస్ పారాలింపిక్స్-2024లో భారత్ మరో పతకం సాధించింది. ప్రపంచ చాంపియన్ సచిన్ ఖిలారి పురుషుల షాట్‌పుట్ ఎఫ్46 ఈవెంట్లో రజతం గెలిచాడు. బుధవారం నాటి ఈ ఈవెంట్లో కెనడాకు చెందిన గ్రెగ్ స్టువర్ట్ 16.38 మీటర్ల దూరం షాట్ విసిరి స్వర్ణం గెలవగా.. సచిన్ 16.32 మీటర్ల దూరంవిసిరి రెండో స్థానంలో నిలిచాడు.తద్వారా పారాలింపిక్స్ తాజా ఎడిషన్‌లో భారత్ ఖాతాలో 21వ మెడల్ చేరింది. ఇక ఇదే ఈవెంట్లో సచిన్‌తో పాటు పోటీ పడిన భారత అథ్లెట్లు మొహ్మద్ యాసిర్, రోహిత్ కుమార్ వరుసగా 8, 9వ స్థానాల్లో నిలిచారు. కాగా ప్యారిస్ పారాలింపిక్స్‌లో భారత్ ఇప్పటి వరకు మూడు స్వర్ణాలు, 8 రజతాలు, 10 కాంస్య పతకాలు గెలిచింది.ప్యారిస్ పారాలింపిక్స్-2024లో ఇప్పటి వరకు పతకాలు గెలిచిన భారత అథ్లెట్లు👉శరద్ కుమార్- మెన్స్ హై జంప్ టీ63- రజతం👉అజీత్ సింగ్- మెన్స్ జావెలిన్ త్రో- రజతం👉మరియప్పన్ తంగవేలు- మెన్స్ హై జంప్ టీ63- కాంస్యం👉సుందర్ సింగ్ గుర్జార్- మెన్స జావెలిన్ త్రో ఎఫ్46- కాంస్యం👉దీప్తి జివాంజి- వుమెన్స్ 400 మీటర్ల టీ20 పరుగు- కాంస్యం👉సుమిత్ ఆంటిల్- మెన్స్జావెలిన్ త్రో ఎఫ్64- స్వర్ణం👉సుహాస్ యతిరాజ్- బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్స్ ఎస్ఎస్64- రజతం👉తులసిమతి మురుగేశన్- బ్యాడ్మింటన్ వుమెన్స్ సింగిల్స్ ఎస్‌యూ45- రజతం👉మనీషా రామదాస్- బ్యాడ్మింటన్ వుమెన్స్ సింగిల్స్ ఎస్‌యూ45- కాంస్యం👉నిత్యశ్రీ సుమతి శివన్- బ్యాడ్మింటన్ వుమెన్స్ సింగిల్స్ ఎస్‌హెచ్6- కాంస్యం👉శీతల్ దేవి- రాకేశ్ కుమార్- మిక్స్డ్ కాంపౌండ్ ఓపెన్ ఆర్చరీ- కాంస్యం👉యోగేశ్ కతూనియా- మెన్స్ డిస్కస్ త్రో ఎఫ్56- రజతం👉నితేశ్ కుమార్- బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్స్ ఎస్ఎల్3- స్వర్ణం👉అవని లేఖరా- వుమెన్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్1- స్వర్ణం👉మోనా అగర్వాల్- వుమెన్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్1- కాంస్యం👉ప్రీతి పాల్- వుమెన్స్ 100 మీటర్ల పరుగు టీ35- కాంస్యం👉మనీశ్ నర్వాల్- పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్1- రజతం👉రుబీనా ఫ్రాన్సిస్- వుమెన్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ స్టాండింగ్ ఎస్‌హెచ్1- కాంస్యం👉ప్రీతి పాల్- వుమెన్స 200 మీటర్ల పరుగు టీ35- కాంస్యం👉నిషద్ కుమార్- మెన్స్ హై జంప్ టీ47- రజతం👉సచిన్ ఖిలారి- పురుషుల షాట్‌పుట్ ఎఫ్46- రజతం -
పారా ఒలింపిక్స్‌కు అనకాపల్లి వాసి
విజయవాడ స్పోర్ట్స్: పారిస్‌లో ఈ నెల 28 నుంచి ప్రారంభమయ్యే పారా ఒలింపిక్స్‌కు అనకాపల్లి జిల్లా కె.కోటపాడుకు చెందిన రొంగలి రవి ఎంపికయ్యారు. షాట్‌పుట్ విభాగంలో రవి భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన రవి.. ఎన్నో అవమానాలు, ఆటుపోట్లను అధిగమించి అంతర్జాతీయ క్రీడాకారుడిగా ఎదిగాడు. ఇందుకోసం అతని తల్లిదండ్రులు మంగ, బాబు తమ వ్యవసాయ భూమిని సైతం అమ్మేశారు. తల్లిదండ్రులు, కోచ్‌లు ఇచ్చిన స్ఫూర్తితో రవి ఇప్పటివరకు దాదాపు 25కు పైగా పతకాలు సాధించి ప్రపంచ క్రీడా వేదికలపై మువ్వన్నెల జెండా ఎగురవేశాడు. ఆదాయ పన్ను విభాగ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న రవి మాట్లాడుతూ.. పారా ఒలింపిక్స్‌లో భారత్‌కు బంగారు పతకం అందించడమే తన లక్ష్యమని తెలిపాడు. కాగా, రవిని ఆంధ్రప్రదేశ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గోనుగుంట్ల కోటేశ్వరరావు, వి.రామస్వామి అభినందించారు. -
ఆసియా పారా క్రీడల్లో ‘రవి’ ప్రభంజనం
కె.కోటపాడు (అనకాపల్లి జిల్లా): అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలానికి చెందిన తెలుగోడు చైనాలో జరుగుతున్న ఆసియా పారా క్రీడల్లో తన సత్తా చాటాడు. సిల్వర్ మెడల్ సొంతం చేసుకుని అందరి ప్రశంసలు పొందాడు. అనకాపల్లి జిల్లా, కె.కోటపాడు మండలం వారాడ శివారు చిరికివానిపాలెం గ్రామానికి చెందిన రొంగలి రవి ఆసియా పారా క్రీడల షాట్‌పుట్ విభాగంలో రజత పతకం సాధించాడు. చైనాలోని హాంగ్జౌలో ఆసియా పారా క్రీడా పోటీలు జరుగుతున్న విషయం తెలిసిందే. మంగళవారం జరిగిన పోటీల్లో ఎఫ్–40 షాట్‌పుట్ విభాగంలో పాల్గొన్న రవి 9.92 మీటర్ల దూరం విసిరి సిల్వర్ మెడల్ గెలుచుకున్నాడు. ఈ పోటీల కోసం ఏడాదిన్నరగా బెంగళూరులోని సాయి అకాడమీలో శిక్షణ పొందినట్టు రవి ‘సాక్షి’కి తెలిపాడు. పతకం సాధించడం ఎంతో ఆనందంగా ఉందన్నాడు. ఈ పోటీలో ఇరాక్ దేశానికి చెందిన క్రీడాకారునికి గోల్డ్ మెడల్ దక్కిందని తెలిపాడు. స్వగ్రామంలో ఆనందం దేశం మెచ్చేలా రవి సిల్వర్ మెడల్ సాధించడంతో సొంత గ్రామం చిరికివానిపాలెంలో సందడి చోటుచేసుకుంది. అందరిలా ఎత్తుగా లేనన్న భావన మనసులోకి రానివ్వకుండా చిన్నప్పటి నుంచి డ్వార్్ఫ(దివ్యాంగుల క్రీడలు) క్రీడల్లో ఉత్తమ ప్రతిభను చాటేందుకు నిరంతరం శ్రమించేవాడని గ్రామస్థులు తెలిపారు. తల్లిదండ్రులు రొంగలి దేముడుబాబు, మంగ వ్యవసాయం చేసుకుంటూనే కుమారుడు క్రీడల్లో పాల్గొనేందుకు ప్రోత్సాహించారు. రవి చైనా నుంచి ఈనెల 28న దేశానికి రానున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రధాని అభినందన రవిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్(ట్విట్టర్) ద్వారా అభినందించారు. అతడిని స్ఫూర్తిగా తీసుకొని క్రీడల్లో రాణించాలని సూచించారు. కేంద్ర క్రీడా శాఖమంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా రవికి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. -
Asian Games 2023: పతకాల వేటలో దూసుకుపోతున్న భారత్.. మరో 2 స్వర్ణాలు
ఏషియన్ గేమ్స్ 2023లో పతకాల వేటలో భారత్ దూసుకుపోతుంది. ఆదివారం టీమిండియా ఖాతాలో మరో 2 స్వర్ణ పతకాలు చేరాయి. 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో అవినాశ్ సాబ్లే.. షాట్‌పుట్‌లో తజిందర్‌పాల్ సింగ్ తూర్ స్వర్ణాలతో మెరిశారు. ఈ రెండు మెడల్స్‌తో ప్రస్తుతం భారత్ ఖాతాలో 13 బంగారు పతకాలు చేరాయి. మొత్తంగా ఈ క్రీడల్లో భారత్ పతకాల సంఖ్య 45కు (13 గోల్డ్, 16 సిల్వర్, 16 బ్రాంజ్) చేరింది. 13th Gold Medal for India 🇮🇳 in Asian Games. - Tajinderpal Singh Toor is a hero.pic.twitter.com/dIfl9NN0DB — Johns. (@CricCrazyJohns) October 1, 2023 పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. చైనా 233 పతకాలతో (124 గోల్డ్, 71 సిల్వర్, 38 బ్రాంజ్) అగ్రస్థానంలో దూసుకుపోతుంది. రిపబ్లిక్ ఆఫ్ కొరియా 122 పతకాలతో (30, 34, 58) రెండో స్థానంలో, జపాన్ 110 మెడల్స్‌తో (29, 40, 41) మూడో స్థానంలో ఉన్నాయి. Avinash Sable - the hero of India today in Asian Games!A Gold Medal in record time in 3000m Steeplechase.pic.twitter.com/EpLjVD83YF— Mufaddal Vohra (@mufaddal_vohra) October 1, 2023 రికార్డు బద్దలు కొట్టిన సాబ్లే.. 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో స్వర్ణ పతకం సాధించిన అవినాశ్ సాబ్లే 8:19:50 సెకెన్లలో పరుగును పూర్తి చేసి ఏషియన్ గేమ్స్ రికార్డును బద్దలు కొట్టాడు. రేస్ పూర్తియ్యే సరికి సాబ్లే దరిదాపుల్లో కూడా ఎవరు లేకపోవడం విశేషం. ఈ పతకం ప్రస్తుత ఎడిషన్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణ పతకం. నాలుగో షాట్‌పుటర్.. షాట్‌పుట్‌లో స్వర్ణంతో మెరిసిన తజిందర్ పాల్ సింగ్ తూర్ వరుసగా రెండో ఏషియన్ గేమ్స్‌లో (2018, 2023) గోల్డ్ మెడల్స్ సాధించిన నాలుగో షాట్‌పుటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. గతంలో పర్దుమాన్ సింగ్ బ్రార్ (1954, 1958), జోగిందర్ సింగ్ (1966, 1970), బహదూర్ సింగ్ చౌహాన్ (1978, 1982) ఈ ఘనత సాధించారు. ప్రస్తుత క్రీడల్లో తూర్ సాధించిన పతకం భారత్‌కు ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్‌లో రెండోది. దీనికి కొద్దిసేపటి ముందే అవినాశ్ సాబ్లే 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో స్వర్ణ పతకం సాధించాడు. -
పారుల్, తజిందర్‌లకు స్వర్ణ పతకాలు
బ్యాంకాక్: ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో మూడో రోజు భారత్‌కు మూడు పతకాలు లభించాయి. ఇందులో రెండు స్వర్ణాలు, ఒక రజత పతకం ఉన్నాయి. మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్ ఈవెంట్లో పారుల్ చౌధరీ విజేతగా నిలిచి పసిడి పతకం సొంతం చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన పారుల్ 9 నిమిషాల 38.76 సెకన్లలో గమ్యానికి చేరి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. సుధా సింగ్ (2013, 2017), లలితా బబర్ (2015) తర్వాత ఆసియా చాంపియన్‌షిప్‌లో 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో స్వర్ణం నెగ్గిన మూడో భారతీయ అథ్లెట్‌గా పారుల్ నిలిచింది. మహిళల లాంగ్‌జంప్ ఈవెంట్లో ఉత్తరప్రదేశ్‌కే చెందిన 19 ఏళ్ల శైలీ సింగ్ రజత పతకం గెలిచింది. శైలీ సింగ్ 6.54 మీటర్ల దూరం దూకి రెండో స్థానంలో నిలిచింది. పురుషుల షాట్‌పుట్ ఈవెంట్లో తజిందర్‌పాల్ సింగ్ తూర్ తన టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. పంజాబ్‌కు చెందిన 28 ఏళ్ల తజిందర్‌పాల్ ఇనుప గుండును 20.23 మీటర్ల దూరం విసిరి బంగారు పతకాన్ని గెల్చుకున్నాడు. బిలాల్ సాద్ ముబారక్ (ఖతర్), ఘరీబ్ అల్ జిన్కావి (కువైట్) తర్వాత ఆసియా చాంపియన్‌షిప్‌లో వరుసగా రెండుసార్లు షాట్‌పుట్ ఈవెంట్లో స్వర్ణ పతకాలు నెగ్గిన మూడో అథ్లెట్‌గా తజిందర్‌పాల్ గుర్తింపు పొందాడు. మూడో రోజు పోటీల తర్వాత భారత్ ఐదు స్వర్ణాలు, ఒక రజతం, మూడు కాంస్యాలతో తొమ్మిది పతకాలతో మూడో స్థానంలో ఉంది. -
Asian indoor athletics championships: షాట్‌పుట్‌లో తజీందర్ పాల్‌కు స్వర్ణం
అస్తానా (కజకిస్తాన్): ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తొలి రోజే భారత్ నాలుగు పతకాలతో అదరగొట్టింది. పురుషుల షాట్‌పుట్‌లో తజీందర్ పాల్ సింగ్ తూర్ పసిడి పతకం గెలిచాడు. తజీందర్ ఇనుప గుండును 19.49 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానంలో నిలిచాడు. కరణ్వీర్ సింగ్ 19.37 మీటర్లతో రెండో స్థానంలో నిలిచి భారత్‌కు రజతం అందించాడు. ట్రిపుల్ జంప్‌లో ప్రవీణ్ చిత్రావెల్ 16.98 మీటర్ల దూరం గెంతి జాతీయ ఇండోర్ రికార్డు నెలకొల్పడంతోపాటు రజత పతకం సాధించాడు. మహిళల పెంటాథ్లాన్‌లో స్వప్నా బర్మాన్ 4119 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకం సొంతం చేసుకుంది. -
‘స్వర్ణ పతకం’ అందుకునేవాడే... కానీ ఆలస్యంగా వచ్చాడని..
టోక్యో: పాపం జియాద్... పారాలింపిక్స్లాంటి ప్రతిష్టాత్మక వేదికపై వరుసగా రెండో స్వర్ణం సాధించాడన్న అతని ఆనందం కొద్ది సేపట్లోనే ఆవిరైంది. దురదృష్టం వెంట రావడంతో బంగారు పతకం కూడా ముఖం చాటేసింది! మలేసియా చెందిన ముహమ్మద్ జియాద్ జుల్‌కెఫ్లీ షాట్‌పుట్ ఎఫ్20 క్లాస్‌లో మొదటి స్థానంలో నిలిచాడు. రియో పారాలింపిక్స్‌లో కూడా స్వర్ణం గెలిచిన అతను దానిని నిలబెట్టుకున్నట్లు కనిపించాడు. అయితే పోటీలు జరిగే వేదిక వద్దకు జియాద్ ఆలస్యంగా వచ్చాడని, ఇది నిబంధనలకు విరుద్ధమంటూ ఉక్రెయిన్ జట్టు ఫిర్యాదు చేసింది. నిజానికి ‘అధికారిక ప్రకటన’ తర్వాత జియాద్ మూడు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా... ఏదో తగిన కారణం ఉంటుందని భావించిన నిర్వాహకులు అతడిని అనుమతించారు. పోటీల అనంతరం విచారణ చేయగా... ‘అనౌన్స్మెంట్ సరిగా వినిపించలేదని, భాష అర్థం కాలేదని’ అతను చెప్పాడు. దాంతో ఇది సరైన కారణం కాదంటూ వరల్డ్ పారా అథ్లెటిక్స్ కమిటీ జియాద్ విజయాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించి అతని పేరు వద్ద డిడ్ నాట్ స్టార్ట్ (డీఎన్ఎస్) అని పెట్టేసింది. ఈ ఈవెంట్లో స్వర్ణ, రజతాలు ఉక్రెయిన్‌కు దక్కగా, గ్రీస్ అథ్లెట్ మూడో స్థానంలో నిలిచాడు. చదవండి: పతకాల వేటకు విరామం -
Tajinder Toor: ఒలింపిక్స్‌కు తజిందర్ అర్హత
పాటియాలా: ఇండియన్ గ్రాండ్‌ప్రి–4 అథ్లెటిక్స్ మీట్లో మూడు జాతీయ రికార్డులు బద్దలయ్యాయి. పురుషుల షాట్‌పుట్ ఈవెంట్లో తజిందర్ పాల్ సింగ్ తూర్ కొత్త జాతీయ రికార్డు, ఆసియా రికార్డు నెలకొల్పాడు. అంతేకాకుండా టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. ఈ మీట్లో పంజాబ్‌కు చెందిన 26 ఏళ్ల తజిందర్ ఇనుప గుండును 21.49 మీటర్ల దూరం విసిరాడు. ఈ క్రమంలో టోక్యో ఒలింపిక్స్ అర్హత ప్రమాణం 21.10 మీటర్లను అతను అధిగమించాడు. 20.92 మీటర్లతో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును తజిందర్ సవరిం చాడు. తజిందర్ ధాటికి 12 ఏళ్ల ఆసియా రికార్డు కూడా తుడిచి పెట్టుకుపోయింది. 21.13 మీటర్లతో 2009లో సుల్తాన్ అబ్దులుమ్ అల్ హెబ్షీ (సౌదీ అరేబియా) సాధించిన ఆసియా రికార్డును తజిందర్ బద్దలు కొట్టాడు. ద్యుతీ చంద్ కూడా... మహిళల 100 మీటర్ల విభాగంలో ఒడిశా స్టార్ స్ప్రింటర్ ద్యుతీ చంద్ కూడా కొత్త జాతీయ రికార్డు సృష్టించింది. ఆమె 11.17 సెకన్లలో రేసును ముగిం చి 11.21 సెకన్లతో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును సవరించింది. 4్ఠ100 మీటర్ల రిలేలో ద్యుతీ చంద్, హిమా దాస్, ధనలక్ష్మి, అర్చనలతో కూడిన భారత ‘ఎ’ జట్టు 43.37 సెకన్లలో గమ్యానికి చేరి కొత్త జాతీయ రికార్డు నెలకొల్పింది. 43.42 సెకన్ల తో 2016లో మెర్లిన్, జ్యోతి, శ్రావణి ద్యుతీ బృం దం చేసిన జాతీయ రికార్డును బద్దలు కొట్టింది. జాతీయ రికార్డే కానీ... మహిళల డిస్కస్ త్రోలో కమల్‌ప్రీత్ సింగ్ కూడా కొత్త జాతీయ రికార్డు ప్రదర్శనను నమోదు చేసింది. కమల్‌ప్రీత్ డిస్క్‌ను 66.59 మీటర్ల దూరం విసిరింది. గత మార్చిలో ఫెడరేషన్ కప్‌లో కమల్‌ప్రీత్ 65.06 మీటర్లతో జాతీయ రికార్డు నెలకొల్పింది. అయితే కమల్‌ప్రీత్ తాజా ప్రదర్శనను జాతీయ రికార్డుగా గుర్తించడం లేదు. రికార్డుగా గుర్తించాలంటే నిబంధనల ప్రకారం ఒక కేటగిరీలో కనీసం ముగ్గురు బరిలో ఉండాలి. సోమవారం జరిగిన మీట్లో కమల్‌ప్రీత్ కేటగిరీలో ఆమె ఒక్కరే పాల్గొన్నారు. -
కొడుకు స్వర్ణ పతకాన్ని చూడకుండానే..
మోగా: ఆసియా క్రీడల్లో తన కొడుకు సాధించిన బంగారు పతకాన్ని చూడకుండానే కన్నుమూశాడు షాట్ పుట్టర్ తేజిందర్ పాల్ సింగ్ తండ్రి. షాట్ పుట్లో బంగారు పతకం సాధించి చరిత్రలో నిలిచిన తేజిందర్.. తన తండ్రికి తాను సాధించిన పతకాన్ని చూపించాలని ఎంతో ఆశపడ్డాడు. బంగారు పతకం సాధించిన విజయంతో, ఎంతో సంతోషంగా దానిని తండ్రికి చూపిద్దామని ఆశతో విమానశ్రయంలో దిగిన తేజిందర్ పాల్‌కు చేదు వార్త స్వాగతం పలికింది. తేజిందర్ తండ్రి కరమ్ సింగ్ రెండు సంవత్సరాలుగా క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. అయినప్పటికీ కొడుకుని ఆసియా క్రీడలకు పంపడం కోసం ఆయన ఎన్నో త్యాగాలను చేశారు. ప్రతి విజయంలో తోడుగా ఉన్న తండ్రికి తాను సాధించిన బంగారు పతకాన్ని చూపిద్దామని ఎన్నో ఆశలతో జకార్తా నుంచి ఢిల్లీ విమానాశ్రయంలో దిగగానే తండ్రి పరిస్థితి విషమంగా ఉందన్న వార్త తెలిసింది. తేజిందర్ పంజాబ్‌లోని మోగాకు ఢిల్లీ నుంచి రోడ్డు మార్గం ద్వారా పయనమయ్యాడు. కానీ, ఇంకా ఇంటికి కొద్ది దూరంలో ఉండగానే తండ్రి చనిపోయిన విషయం తెలిసింది. ‘తాను బంగారు పతకం సాధించలన్నది నా తండ్రి చివరి కోరిక. కానీ ఇప్పుడు పతకాన్ని తండ్రికి చూపించి ఆ కోరిక తీర్చాలనుకుంటే, దేవుడు ఆ కోరిక తీరకుండా చేశాడు' అని తేజిందర్ కన్నీరుమున్నీరవుతున్నాడు. చదవండి: బంగారు గుండు -
షాట్‌పుట్‌లో స్వర్ణం సాధించిన తేజీందర్‌పాల్
ఆసియా క్రీడల అథ్లెటిక్స్ విభాగంలో భారత్ బోణీ చేసింది. ఆసియా నంబర్‌వన్ షాట్‌పుటర్‌గా తనపై ఉన్న అంచనాలను నిలబెట్టుకుంటూ పంజాబీ బిడ్డ తేజీందర్‌పాల్ సింగ్ తూర్ బంగారు పతకంతో మెరిశాడు. 7 కేజీల 260 గ్రాముల బరువు ఉండే ఇనుప గుండును ఏకంగా 20.75 మీటర్ల దూరం విసిరి ఆసియా క్రీడల్లో కొత్త రికార్డుతో సత్తా చాటాడు. తాజా విజయంతో కలిపి మన స్వర్ణాల సంఖ్య ఏడుకు చేరగా... స్క్వాష్‌లో మరో మూడు కాంస్యాలు దక్కడంతో శనివారం నాలుగు పతకాలు భారత్ ఖాతాలో పడ్డాయి. మొత్తంగా 29 పతకాలతో భారత్ ఎనిమిదో స్థానంలో ఉంది. జకార్తా: ఆసియా క్రీడల్లో వరుసగా ఏడో రోజు కూడా పతకాలు సాధించిన జట్ల జాబితాలో భారత్ నిలిచింది. 24 ఏళ్ల తేజీందర్‌పాల్ సింగ్ తూర్ విసిరిన గుండు బంగారాన్ని తెచ్చి పెట్టింది. పురుషుల షాట్‌పుట్‌లో తేజీందర్ స్వర్ణం సాధించడంతో అథ్లెటిక్స్‌లో మన ఖాతాలో మొదటి పతకం చేరింది. ఆరు ప్రయత్నాల్లో అత్యుత్తమంగా షాట్‌పుట్‌ను 20.75 మీటర్ల దూరం విసిరిన తేజీందర్ అగ్రస్థానంలో నిలిచాడు. ఈ ఈవెంట్లో ల్యూ యాంగ్ (19.52 మీటర్లు–చైనా), ఇవాన్ ఇవనోవ్ (19.40 మీటర్లు–కజకిస్తాన్) రజత, కాంస్యాలు గెలుచుకున్నారు. ఐదో ప్రయత్నంలో... ఆసియా క్రీడల్లో పతకం గెలుచుకునే క్రమంలో తేజీందర్ పాల్ ఆరేళ్ల క్రితం నాటి జాతీయ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. 2012లో ఓంప్రకాశ్ కర్హానా 20.69 మీటర్లతో నెలకొల్పిన జాతీయ రికార్డును తేజీందర్ తెరమరుగు చేశాడు. శనివారం జరిగిన ఈవెంట్లో తేజీందర్ తొలి ప్రయత్నంలో 19.96 మీటర్లు గుండు విసరగా, రెండో ప్రయత్నంలో అది తగ్గి 19.15 మీటర్లకు చేరింది. మూడో ప్రయత్నం ‘ఫౌల్’గా తేలింది. నాలుగోసారి కూడా 19.96 మీటర్లే విసిరిన తేజీందర్... తర్వాతి ప్రయత్నంలో తన పవర్ చూపించాడు. రికార్డు స్థాయిలో 20.75 మీటర్లు గుండు దూసుకెళ్లింది. చివరిసారి అతను 20.00 మీటర్లకే పరిమితమయ్యాడు. అయితే దానిని అందుకోవడం ల్యూ వల్ల కాకపోగా...ఈసారి అతను ఫౌల్ చేశాడు. దాంతో భారత షాట్ పుటర్కు స్వర్ణం ఖాయమైంది. హిమ దాస్ కొత్త రికార్డు... అథ్లెటిక్స్‌లో మరో భారత జాతీయ రికార్డు బద్దలైంది. మహిళల 400 మీటర్ల పరుగు (క్వాలిఫయింగ్)లో హిమ దాస్ 51.00 సెకన్ల టైమింగ్ నమోదు చేసి ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ క్రమంలో 2004లో మన్జీత్ కౌర్ (51.05 సెకన్లు) నెలకొల్పిన రికార్డును హిమ చెరిపేసింది. హిమ దాస్తోపాటు భారత్‌కే చెందిన నిర్మల కూడా ఫైనల్‌కు అర్హత పొందింది. మహిళల 100 మీ. పరుగు సెమీఫైనల్‌కు ద్యుతీచంద్ అర్హత సాధించింది. హీట్స్‌లో ఆమె 11.38 సెకన్లలో పరుగు పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచింది. ఇతర అథ్లెట్లలో మొహమ్మద్ అనస్, రాజీవ్ అరోకియా (400 మీ.), ఎం. శ్రీశంకర్ (లాంగ్‌జంప్), చేతన్ బాలసుబ్రహ్మణ్య (హైజంప్) కూడా ఫైనల్‌కు క్వాలిఫై అయ్యారు. అయితే మహిళల 10 వేల మీటర్ల పరుగులో సూరియా లోగనాథన్ (ఆరో స్థానం), సంజీవని బాబూరావు (9వ స్థానం), సరితా సింగ్ (హ్యామర్ త్రో–ఐదో స్థానం) విఫలమై నిరాశగా వెనుదిరిగారు. గుండె నిబ్బరంతో... తేజీందర్‌పాల్ తండ్రి కరమ్ సింగ్ గత రెండేళ్లుగా క్యాన్సర్‌తో బాధ పడుతున్నాడు. అయితే ఇలాంటి స్థితిలోనూ అతని కుటుంబం, సన్నిహితులు అండగా నిలిచి లక్ష్యం దిశగా తేజీందర్ను ప్రోత్సహించారు. తండ్రి ఆస్పత్రిలో ఉన్న సమయంలో దగ్గరుండి చూసుకోవాల్సిన అవసరం లేకుండా మిత్రులే అన్ని రకాలుగా సహకారం అందించారు. అతనిపై ఎలాంటి ఒత్తిడి లేకుండా, ఏకాగ్రత కోల్పోకుండా ప్రాక్టీస్ చేసే విధంగా అండగా నిలిచారు. ఈ నేపథ్యంలో తేజీందర్ సాధించిన స్వర్ణం అతడికి ఎంతో ప్రత్యేకమైంది. ‘నా గెలుపు వెనక ఎంతో మంది త్యాగం ఉంది. ధర్మశాలలో ప్రాక్టీస్ కారణంగా ఇంటి కోసం, నాన్న కోసం సమయం కేటాయించలేకపోయాను. కానీ నా వాళ్ల కారణంగా ఈ గెలుపు సాధ్యమైంది. అందుకే నా జీవితంలో ఇది అతి పెద్ద విజయంగా భావిస్తున్నా. పతకంతో వెళ్లి నాన్నను కలుస్తా’ అని 6 అడుగుల 4 అంగుళాల ఎత్తు, 135 కేజీల బరువున్న తేజీందర్ ఉద్వేగంగా చెప్పాడు. గత ఏడాది జూన్‌లో జాతీయ అథ్లెటిక్స్ ఈవెంట్ ఫెడరేషన్ కప్‌లో 20.40 మీటర్ల దూరం షాట్‌పుట్ విసరడం తేజీందర్కు మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. కొద్ది రోజులకే ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించి అతను సత్తా చాటాడు. తుర్క్మెనిస్తాన్లో జరిగిన ఆసియా ఇండోర్ చాంపియన్‌షిప్‌లో కూడా రెండో స్థానంలో నిలిచాడు. అయితే ఈ ఏడాది కామన్వెల్త్ క్రీడల్లో 19.42 మీటర్ల దూరం మాత్రమే గుండు విసిరి ఎనిమిదో స్థానంలో నిలవడంతో తీవ్రంగా నిరాశ చెందిన తేజీందర్... ఇప్పుడు ఆసియా క్రీడల్లో స్వర్ణంతో లెక్క సరి చేశాడు. శనివారం ఈవెంట్లో 21 మీటర్లు దాటాలనే లక్ష్యంతో బరిలోకి దిగానన్న ఈ అథ్లెట్... గత కొన్నేళ్లుగా జాతీయ రికార్డును బద్దలు కొట్టాలనే ప్రయత్నం ఇప్పుడు నిజమైనందుకు సంతోషం వ్యక్తం చేశాడు. 9 ఆసియా క్రీడల చరిత్రలో పురుషుల షాట్‌పుట్ ఈవెంట్లో భారత అథ్లెట్‌కు స్వర్ణం లభించడం ఇది తొమ్మిదోసారి. గతంలో మదన్‌లాల్ (1951), పార్థుమన్ సింగ్ బ్రార్ (1954, 1958), జోగీందర్ సింగ్ (1966, 1970), బహదూర్ సింగ్ చౌహాన్ (1978, 1982), బహదూర్ సింగ్ సాగూ (2002) ఈ ఘనత సాధించారు. హిమ -
షాట్‌పుట్‌లో భారత్‌కు స్వర్ణం
జకార్త : ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం వరించింది. పురుషుల షాట్‌పుట్ విభాగంలో తజిందర్‌పాల్ సింగ్ తూర్ పసిడిని సొంతంచేసుకున్నాడు. హోరాహోరీగా సాగిన పోటీలో తజిందర్‌పాల్ గుండును 20.75 మీటర్లు విసిరి ఆసియా క్రీడల్లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. తద్వారా అథ్లెటిక్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణం అందజేశాడు. తొలి ప్రయత్నంలో గుండును 19.96 మీటర్లు విసిరిన తజిందర్ రెండో ప్రయత్నంలో 19.15 మీటర్లు విసిరాడు. మూడో సారి విఫలమయ్యాడు. నాలుగోసారి 19.96, ఐదోసారి 20.75 మీటర్లు విసిరాడు. ఆరోసారి 20 మీటర్లకు పరిమితం అయ్యాడు. చైనా ఆటగాడు లియూ యంగ్ 19.52 మీటర్లతో రజతం, కజకిస్థాన్ అథ్లెట్ ఇవనోవ్ ఇవాన్ 19.40తో కాంస్యం అందుకున్నారు. ఏషియన్ గేమ్స్ చరిత్రలో పురుషుల షాట్‌పుట్ విభాగంలో భారత్‌కు ఇది 8వ మెడల్. -
గుండ్లు లేవు... బోండాలతో షాట్‌పుట్!
గోల్డ్‌కోస్ట్: అన్నీ ఉన్నా అడుగు ముందుకేయని క్రీడాకారులున్నారు. కానీ కుక్ ఐలాండ్స్కు చెందిన ఓ మహిళా అథ్లెట్ మాత్రం సదుపాయాలు, సరైన క్రీడాసామాగ్రి లేకపోయినా కామన్వెల్త్ గేమ్స్‌లో పోటీ పడేందుకు సై అంటోంది. కుక్ ఐలాండ్స్ 15 దీవుల సముదాయం కాగా ఇందులో రరోతొంగకు చెందిన పోలీసు ఆఫీసర్ టెరీపి టపొకి ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్. షాట్‌పుట్, డిస్కస్‌త్రోలో పోటీపడుతుంది. వారి దీవుల్లో డిస్క్, షాట్పుట్కు వినియోగించే ఇనుప గుండ్లు లేవట. దీంతో ఆమె కొబ్బరి బోండాలనే విసురుతూ ప్రాక్టీస్ చేసింది. 33 ఏళ్ల టపొకి 2004 ఏథెన్స్, 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో పోటీపడింది. 2006 మెల్బోర్న్ కామన్వెల్త్ గేమ్స్‌లోనూ రెండు ఈవెంట్లలో తలపడింది. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన ఆమె గర్భం కారణంగా 2010 ఢిల్లీ, 2014 గ్లాస్గో గేమ్స్‌కు దూరమైంది. -
షాట్‌పుట్ విజేత హసన్ హష్మి
జాతీయ అథ్లెటిక్స్ మీట్ సాక్షి, హైదరాబాద్: ఎఎస్ఐఎస్సీ జాతీయ అథ్లెటిక్స్ మీట్లో హసన్ హష్మి షాట్‌పుట్ విభాగంలో విజేతగా నిలిచాడు. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరుగుతోన్న ఈ పోటీల్లో హష్మి గుండును 12.84మీ. విసిరి అగ్రస్థానంలో నిలిచాడు. వినీత్ పవన్ (బిహార్, 12.29మీ.), రక్షత్ తోమర్ ( ఉత్తర్ ప్రదేశ్, 12.09మీ.) తర్వాత స్థానాల్ని దక్కించుకున్నారు. మరోవైపు 1500మీ. స్ప్రింట్ జూనియర్ బాలుర విభాగంలో అకాంక్షిత్, సుమిత్, రెహమాన్ తొలి మూడు స్థానాల్లో నిలిచారు. సీనియర్ బాలుర విభాగంలో సాహెబ్ జీత్ సింగ్ తొలి స్థానాన్ని దక్కించుకోగా... గురుప్రీత్ సింగ్, అభిజిత్ రెండు, మూడు స్థానాల్ని సంపాదించారు.