
షాట్‌పుట్ విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్న రవి
విజయవాడ స్పోర్ట్స్: పారిస్‌లో ఈ నెల 28 నుంచి ప్రారంభమయ్యే పారా ఒలింపిక్స్‌కు అనకాపల్లి జిల్లా కె.కోటపాడుకు చెందిన రొంగలి రవి ఎంపికయ్యారు. షాట్‌పుట్ విభాగంలో రవి భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన రవి.. ఎన్నో అవమానాలు, ఆటుపోట్లను అధిగమించి అంతర్జాతీయ క్రీడాకారుడిగా ఎదిగాడు. ఇందుకోసం అతని తల్లిదండ్రులు మంగ, బాబు తమ వ్యవసాయ భూమిని సైతం అమ్మేశారు.
తల్లిదండ్రులు, కోచ్‌లు ఇచ్చిన స్ఫూర్తితో రవి ఇప్పటివరకు దాదాపు 25కు పైగా పతకాలు సాధించి ప్రపంచ క్రీడా వేదికలపై మువ్వన్నెల జెండా ఎగురవేశాడు. ఆదాయ పన్ను విభాగ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న రవి మాట్లాడుతూ.. పారా ఒలింపిక్స్‌లో భారత్‌కు బంగారు పతకం అందించడమే తన లక్ష్యమని తెలిపాడు. కాగా, రవిని ఆంధ్రప్రదేశ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గోనుగుంట్ల కోటేశ్వరరావు, వి.రామస్వామి అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment