టోక్యో: పాపం జియాద్... పారాలింపిక్స్‌లాంటి ప్రతిష్టాత్మక వేదికపై వరుసగా రెండో స్వర్ణం సాధించాడన్న అతని ఆనందం కొద్ది సేపట్లోనే ఆవిరైంది. దురదృష్టం వెంట రావడంతో బంగారు పతకం కూడా ముఖం చాటేసింది! మలేసియా చెందిన ముహమ్మద్ జియాద్ జుల్‌కెఫ్లీ షాట్‌పుట్ ఎఫ్20 క్లాస్‌లో మొదటి స్థానంలో నిలిచాడు. రియో పారాలింపిక్స్‌లో కూడా స్వర్ణం గెలిచిన అతను దానిని నిలబెట్టుకున్నట్లు కనిపించాడు. అయితే పోటీలు జరిగే వేదిక వద్దకు జియాద్ ఆలస్యంగా వచ్చాడని, ఇది నిబంధనలకు విరుద్ధమంటూ ఉక్రెయిన్ జట్టు ఫిర్యాదు చేసింది.
నిజానికి ‘అధికారిక ప్రకటన’ తర్వాత జియాద్ మూడు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా... ఏదో తగిన కారణం ఉంటుందని భావించిన నిర్వాహకులు అతడిని అనుమతించారు. పోటీల అనంతరం విచారణ చేయగా... ‘అనౌన్స్‌మెంట్ సరిగా వినిపించలేదని, భాష అర్థం కాలేదని’ అతను చెప్పాడు. దాంతో ఇది సరైన కారణం కాదంటూ వరల్డ్ పారా అథ్లెటిక్స్ కమిటీ జియాద్ విజయాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించి అతని పేరు వద్ద డిడ్ నాట్ స్టార్ట్ (డీఎన్‌ఎస్) అని పెట్టేసింది. ఈ ఈవెంట్‌లో స్వర్ణ, రజతాలు ఉక్రెయిన్‌కు దక్కగా, గ్రీస్ అథ్లెట్ మూడో స్థానంలో నిలిచాడు.
చదవండి: పతకాల వేటకు విరామం
Comments
Please login to add a commentAdd a comment