
గోల్డ్‌కోస్ట్: అన్నీ ఉన్నా అడుగు ముందుకేయని క్రీడాకారులున్నారు. కానీ కుక్ ఐలాండ్స్‌కు చెందిన ఓ మహిళా అథ్లెట్ మాత్రం సదుపాయాలు, సరైన క్రీడాసామాగ్రి లేకపోయినా కామన్వెల్త్ గేమ్స్‌లో పోటీ పడేందుకు సై అంటోంది. కుక్ ఐలాండ్స్ 15 దీవుల సముదాయం కాగా ఇందులో రరోతొంగకు చెందిన పోలీసు ఆఫీసర్ టెరీపి టపొకి ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్. షాట్‌పుట్, డిస్కస్‌త్రోలో పోటీపడుతుంది.
వారి దీవుల్లో డిస్క్, షాట్‌పుట్‌కు వినియోగించే ఇనుప గుండ్లు లేవట. దీంతో ఆమె కొబ్బరి బోండాలనే విసురుతూ ప్రాక్టీస్ చేసింది. 33 ఏళ్ల టపొకి 2004 ఏథెన్స్, 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో పోటీపడింది. 2006 మెల్‌బోర్న్ కామన్వెల్త్ గేమ్స్‌లోనూ రెండు ఈవెంట్లలో తలపడింది. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన ఆమె గర్భం కారణంగా 2010 ఢిల్లీ, 2014 గ్లాస్గో గేమ్స్‌కు దూరమైంది.
Comments
Please login to add a commentAdd a comment