
భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఏ వేదికపై జరిగినా ప్రపంచ క్రీడాభిమానుల దృష్టిని ఆకర్షిస్తుంది. వన్డే ప్రపంచ కప్ పోటీల్లో భారత్, పాకిస్తాన్ వరుసగా ఎనిమిది సార్లు తలపడగా భారత్ తన పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించి అన్ని మ్యాచ్ ల్లో విజయం సాధించింది. మరో మారు ఈ రెండు జట్లు ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ లో తలపడనున్న నేపథ్యంలో ఈ మ్యాచ్ ల వివరాలు మీ కోసం.
1992, (సిడ్నీ): భారత్ 43 పరుగుల తేడాతో విజయం
ఆశ్చర్యకరంగా అనిపించినప్పటికీ, భారత్ మరియు పాకిస్తాన్ ప్రపంచ కప్ మొదటి నాలుగు ఎడిషన్లలో ఎదురెదురుపడలేదు. సిడ్నీ క్రికెట్ మైదానంలో భారత్ పాకిస్తాన్‌ను ఎదుర్కొన్నప్పుడు మొదట బ్యాటింగ్ చేసిన భారత్ తన తొలి ప్రపంచ కప్ ఆడుతున్న సచిన్ టెండూల్కర్ 62 బంతుల్లో 54 పరుగులుతో రాణించడంతో 49 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. 217 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్తాన్ 48.1 ఓవర్లలో 173 పరుగులకే ఆలౌటైంది. కపిల్ దేవ్, మనోజ్ ప్రభాకర్, జవగల్ శ్రీనాథ్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. సచిన్, వెంకటపతి రాజు రాణించారు. పాక్ ఆటగాడు అమీర్ సోహైల్ 95 బంతుల్లో 62 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జావేద్ మియాందాద్ 40 పరుగులు చేసి ఔటయ్యాడు.
1996, (బెంగళూరు): భారత్ 39 పరుగుల తేడాతో విజయం
1996లో జరిగిన ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్‌లో భారత్, పాకిస్తాన్‌లు రెండోసారి తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో గాయం కారణంగా వసీం అక్రమ్ లేకపోవడం రెండు జట్లకు డూ-ఆర్-డై అనే అంశంగా మారింది. నవజ్యోత్ సిద్ధు 115 బంతుల్లో 93 పరుగులు చేసి భారత్‌కు సరైన ఆరంభం ఇచ్చాడు. వకార్ యూనిస్‌పై అజయ్ జడేజా చేసిన ఎదురు దాడి భారత్-పాకిస్తాన్ క్రికెట్ చరిత్ర లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.
జడేజా డెత్ ఓవర్లలో విజృంభించడంతో భారత్ 50 ఓవర్లలో 287/8 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా, సయీద్ అన్వర్, సోహైల్ తమ జట్టుకు అద్భుతమైన ఆరంభాన్ని అందించారు, పాకిస్తాన్ 10 ఓవర్లలో 84/0తో చెలరేగింది. సోహైల్ తొందరబాటుతో వెంకటేష్ ప్రసాద్ ని కవ్వించడం తో మ్యాచ్ అనూహ్యమైన మలుపు తిరిగింది. వెంకటేష్ ప్రసాద్ పాకిస్తాన్ ఓపెనర్ మిడిల్ స్టంప్‌ను పడగొట్టి ప్రతీకారం తీర్చుకోవడంతో పాకిస్తాన్ పతనం ప్రారంభమైంది. ప్రసాద్, అనిల్ కుంబ్లే వారి సొంత గడ్డ అయిన బెంగళూరులో బాగా రాణించడంతో పాకిస్తాన్ 248/9 తో ఇన్నింగ్స్ ముగించింది. దీనితో భారత్ సెమీఫైనల్‌కు చేరుకుంది.
1999, (మాంచెస్టర్): భారత్ 47 పరుగుల తేడాతో విజయం
ఈ భారత్ xపాకిస్తాన్ మ్యాచ్ మరే ఇతర మ్యాచ్ కి తీసిపోని భావోద్వేగంగా జరిగింది. భారత్, పాకిస్తాన్ మధ్య కార్గిల్ యుద్ధం జరిగిన సమయంలోనే ప్రపంచ కప్ ప్రారంభమైంది, కానీ మాంచెస్టర్‌లోని చారిత్రాత్మక ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో పోటీ మ్యాచ్ వరకే పరిమితం అయ్యే విధంగా చూసుకోవడంలో రెండు జట్లు బాగా కృషి చేశాయి. సచిన్ టెండూల్కర్ 45 పరుగులతో భారత్‌ను ఆదుకున్నాడు.
ఆ తర్వాత రాహుల్ ద్రవిడ్ మరియు కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ చెరో అర్ధ సెంచరీతో భారత్‌ను 227/5 స్కోరుకు చేర్చారు. అన్వర్ మరోసారి రాణించినప్పటికీ 36 పరుగులకే ప్రసాద్ అతన్ని వెనక్కి పంపాడు. ఆ తర్వాత, పాకిస్తాన్ పతనమైంది.ప్రసాద్ ఐదు వికెట్లు, జవగల్ శ్రీనాథ్‌తో కలిసి మిడిల్ ఆర్డర్‌ను దెబ్బతీసి పాకిస్తాన్‌ను 27 బంతులు మిగిలి ఉండగానే 180 పరుగులకు ఆలౌట్ చేశాడు.
2003, (సెంచూరియన్): భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం
ఇది భారత్ xపాకిస్తాన్ ప్రపంచ కప్ మ్యాచ్‌ల్లో అత్యుత్తమ మ్యాచ్‌గా పరిగణించబడుతుంది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను రాజకీయ ఉద్రిక్తతలు తలెత్తిన సమయంలో, భారత్ మరియు పాకిస్తాన్ 2003 ప్రపంచ కప్‌లో సెంచూరియన్‌లో తలపడ్డాయి. సచిన్ టెండూల్కర్ కి బహుశా అతని కెరీర్‌లో అత్యుత్తమ ప్రపంచ కప్ ఇన్నింగ్స్ గా నిలిచిపోతుంది. అతని 98 పరుగులు చేసి మైమరిపించింది. 273 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి భారత్‌కు అవసరమైన స్కోర్ రేట్ ని అందించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 273/7 స్కోర్ సాధించగా, బదులుగా భారత్ 45.4 ఓవర్లలో నాలుగు వికెట్లకే లక్ష్యాన్ని సాధించింది.
2011, (మొహాలీ): భారత్ 29 పరుగుల తేడాతో విజయం
సొంత గడ్డ పై జరిగిన కీలకమైన ప్రపంచ కప్ సెమీఫైనల్ మ్యాచ్ లో మళ్ళీ సచిన్ టెండూల్కర్ విజృభించి భారత్ తరఫున అత్యధిక స్కోరు సాధించాడు. కానీ సచిన్ నాలుగు సార్లు క్యాచ్ లు జారవిడవడంతో తప్పించుకొని 85 పరుగులు చేయగా సురేష్ రైనా అజేయంగా 36 పరుగులు చేయడంతో భారత్ స్కోర్ 260/6కి చేరుకుంది. దీనికి సమాధానంగా, ఐదుగురు భారత బౌలర్లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. దీనితో పాకిస్తాన్ 231 పరుగులకు ఆలౌట్ కావడంతో భారత్ ఫైనల్‌కు చేరుకుంది.
2015, (అడిలైడ్): భారత్ 76 పరుగుల తేడాతో విజయం
అడిలైడ్‌లో జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ కి విరాట్ కోహ్లీ అండగా నిలిచాడు. విరాట్ కోహ్లీ తన రెండవ ప్రపంచ కప్ సెంచరీని సాధించాడు. శిఖర్ ధావన్ మరియు సురేష్ రైనా అర్ధ సెంచరీలతో కలిసి భారత్ 7 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. మహమ్మద్ షమీ నాలుగు వికెట్లు పడగొట్టడంతో పాకిస్తాన్ చివరికి 224 పరుగులకే ఆలౌట్ అయింది.
2019, (మాంచెస్టర్): భారత్ 89 పరుగుల తేడాతో విజయం
ప్రపంచ కప్ చరిత్రలో రెండు ప్రత్యర్థి దేశాలు ఒకదానితో ఒకటి తలపడటం ఇది 7వ సారి. ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో వర్షం కారణంగా ప్రభావితమైన మ్యాచ్‌లో, భారత్ మరోసారి పాకిస్తాన్‌పై తమ ఆధిపత్యాన్ని పునరుద్ఘాటించింది. రోహిత్ శర్మ అసాధారణంగా 140 పరుగులు చేయడం ద్వారా భారత్ 336/5 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. వర్షం అంతరాయం కారణంగా, పాకిస్తాన్ లక్ష్యాన్ని 40 ఓవర్లలోపు 302 పరుగులకు సర్దుబాటు చేశారు. కానీ వారు లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. మొత్తం 212/6తో 89 పరుగుల తేడాతో ఓడిపోయారు.

2023, ( అహ్మదాబాద్): భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం
ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ మైదానమైన నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగింది. కెప్టెన్ బాబర్ అజామ్ మరియు మహ్మద్ రిజ్వాన్ రాణించడంతో పాకిస్తాన్ ఓ దశలో వేగంగా పరుగులు సాధించి 155-2 కి చేరుకుంది. కానీ ఆ తర్వాత వరుసగా వికెట్లు పడడంతో 42.5 ఓవర్లలో 191 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్ రోహిత్ శర్మ 63 బంతుల్లో 86 పరుగులు చేయడంతో భారత్ ఏడు వికెట్లతో విజయం సాధించింది.
ఛాంపియన్స్ ట్రోఫీ లో పాకిస్తాన్ మెరుగైన ఫలితాలు
అయితే ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ లో అందుకు భిన్నంగా పాకిస్తాన్ మెరుగైన ఫలితాలు సాధించింది. ఛాంపియన్స్ ట్రోఫీ లో భారత్ పాకిస్తాన్‌తో ఐదుసార్లు తలపడింది, ఇందులో పాకిస్తాన్ మూడు మ్యాచ్‌లలో గెలిచింది మరియు భారత్ రెండు మ్యాచ్‌లలో విజేతగా నిలిచింది.
2004 (ఎడ్జ్‌బాస్టన్): పాకిస్తాన్ 3 వికెట్ల తేడాతో విజయం
భారత్ మరియు పాకిస్తాన్ మొదటిసారి సెప్టెంబర్ 19న బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో తలపడ్డాయి, పాకిస్తాన్ టాస్ గెలిచి భారత్ ని ముందుగా బ్యాటింగ్‌కు పంపింది. భారత్ 49.5 ఓవర్లలో 200 పరుగులు చేసింది మరియు పాకిస్తాన్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పాకిస్తాన్‌కు చెందిన మహ్మద్ యూసుఫ్‌ను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ప్రకటించారు, అతను 114 బంతుల్లో 81 పరుగులు చేశాడు.
2009 (సెంచూరియన్): పాకిస్తాన్ 54 పరుగుల తేడాతో విజయం
2009 ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ దశ మ్యాచ్ కోసం సెప్టెంబర్ 26న సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో ఈ రెండు జట్లు తలపడ్డయి. పాకిస్తాన్ మళ్ళీ టాస్ గెలిచింది కానీ ఈసారి వారు మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు. పాకిస్తాన్ 50 ఓవర్లలో 302/9 పరుగులు చేయగా భారత్ ఆ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది, 44.5 ఓవర్లలో 248 పరుగులకు తమ ఇన్నింగ్స్‌ను ముగించింది. 126 బంతుల్లో 128 పరుగులు చేసిన షోయబ్ మాలిక్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.
2013 (ఎడ్జ్‌బాస్టన్): భారత్ 8 వికెట్ల తేడాతో విజయం
2013 ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జూన్ 15న బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్ మరియు పాకిస్తాన్ తలపడ్డాయి. ఈసారి భారత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. పాకిస్తాన్ ఇన్నింగ్స్ సమయంలో వాతావరణ మార్పుల కారణంగా, మ్యాచ్‌ను 40 ఓవర్లకు కుదించారు. పాకిస్తాన్ 39.4 ఓవర్లలో 165 పరుగులు చేయగలిగింది.మళ్ళీ వర్షం వచ్చింది. ఫలితంగా, భారత ఇన్నింగ్స్‌ను అదనంగా 22 ఓవర్లకు కుదించారు.102 పరుగుల సవరించిన లక్ష్యంతో. 19.2 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత, డిఎల్ఎస్ పద్ధతి ద్వారా పాకిస్తాన్‌పై భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ లో తొలి విజయాన్ని సాధించింది. 8 ఓవర్లలో 2 వికెట్లు తీసిన భువనేశ్వర్ కుమార్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.
2017 (ఎడ్జ్‌బాస్టన్): భారత్ 124 పరుగుల తేడాతో విజయం
జూన్ 4న బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో గ్రూప్ బి ఛాంపియన్స్ ట్రోఫీ -దశ ఘర్షణలో భారత్ తమ ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఎదుర్కొంది. పాకిస్తాన్ ఈసారి కూడా టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. భారత్ ఇన్నింగ్స్‌లో మ్యాచ్‌ను 48 ఓవర్లకు తగ్గించారు. భారత్ 319/3 స్కోరు చేసింది. పాకిస్తాన్ లక్ష్యాన్ని 41 ఓవర్లలో 289 పరుగులుగా సవరించగా, పాకిస్తాన్ 33.4 ఓవర్లలో 9 వికెట్లకు 164 పరుగులు చేసింది. డి ఎల్ ఎస్ పద్ధతి ప్రకారం భారత్‌ను విజేతగా ప్రకటించారు. ఛాంపియన్స్ ట్రోఫీ లో పాకిస్తాన్‌పై భారత్ సాధించిన రెండవ విజయం ఇది. యువరాజ్ సింగ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.
2017 (ఓవల్): పాకిస్తాన్ 180 పరుగుల తేడాతో విజయం
2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్‌లో భారత్ పాకిస్తాన్‌ను రెండో సారి ఎదుర్కొంది. ఈ మ్యాచ్ జూన్ 18న లండన్‌లోని ది ఓవల్‌లో జరిగింది. టాస్ గెలిచి పాకిస్తాన్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఫఖర్ జమాన్ చేసిన అద్భుతమైన తొలి వన్డే సెంచరీతో పాకిస్తాన్ 50 ఓవర్లలో 389 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది మరియు భారత్ 30.3 ఓవర్లలో 158 పరుగులు చేసింది. ఈ ఫైనల్స్‌లో భారత్ పై విజయంతో పాకిస్తాన్‌కు తొలిసారి ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment