మాజీమంత్రి కుమారుడు కృష్ణ ప్రసాద్ అరెస్ట్ | TDP leader vasantha krishna prasad arrested in murder case | Sakshi
Sakshi News home page

మాజీమంత్రి కుమారుడు కృష్ణ ప్రసాద్ అరెస్ట్

Published Fri, May 2 2014 2:20 PM | Last Updated on Sat, Sep 29 2018 4:52 PM

TDP leader vasantha krishna prasad arrested in murder case

నందిగామ : హత్య కేసుల్లో మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు కుమారుడు, టీడీపీ నేత కృష్ణ ప్రసాద్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణాజిల్లా చందర్లపాడు కోనాయిపాలెంలో 2013 సంవత్సరంలో  ప్రభుత్వ ఉద్యోగి పుల్లయ్య దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హత్య చేసింది పుల్లయ్య బావమరిది రవినే అని పోలీసులు గుర్తించారు.

దాంతో హత్య కేసులో రవిని ప్రధాన నిందితుడిగా చేర్చారు. ఆ తరువాత సరిగ్గా ఏడాదికి రవిన కూడా దారుణ హత్యకు గురయ్యాడు.ఈ రెండు హత్యలు కృష్ణ ప్రసాద్ చేయించాడంటూ, మృతుడు రవి భార్య మాధవి హైకోర్టును ఆశ్రయించింది. ఈ రెండు హత్యలపై విచారణ జరపాలని  హైకోర్డు ఆదేశాలు జారీ చేయడంతో కృష్ణప్రసాద్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement