vasanta nageswara rao
-
సంపూర్ణేశ్ బాబుకు తృటిలో తప్పిన ప్రమాదం
ఓ సినిమా చిత్రీకరణ సమయంలో జరిగిన ప్రమాదంలో నటుడు సంపూర్ణేశ్ బాబు తృటిలో తప్పించుకున్నాడు. ఎలాంటి గాయాలు కాకపోవడంతో చిత్రబృందం ఊపిరి పీల్చుకుంది. ఈ సంఘటన ‘బజార్ రౌడీ’ అనే సినిమా షూటింగ్లో జరిగింది. హైదరాబాద్ శివారులో జరుగుతున్న షూటింగ్లో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. సంపూర్ణేశ్ హీరోగా వసంత నాగేశ్వర రావు దర్శకత్వంలో సందిరెడ్డి శ్రీనివాస్ నిర్మిస్తున్న సినిమా బజార్ రౌడీ. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ శివారులో జరుగుతున్నట్టు సమాచారం. అయితే షూటింగ్లో భాగంగా సంపూర్ణేశ్ బైక్‌ను పైకి లేపి సంచుల మధ్య నుంచి కిందకు దూకాలి. ఆ సీన్ తీస్తుండగా బైక్‌పై సంపూర్ణేశ్ లేచి కిందకు దిగుతుండగా అదుపు తప్పింది. తాడుతో బైక్‌ను కిందకు దింపే సమయంలో అదుపు తప్పి ప్రమాదం జరిగింది. బైక్‌తో పాటు సంపూ కింద పడిపోయాడు. లేవడానికి ప్రయత్నించగా కుదరలేదు. దీంతో వెంటనే అప్రమత్తమైన అక్కడున్న వారు సంపూను పైకి లేపారు. హృదయ కాలేయంతో సంపూర్ణేశ్ బాబు సడన్ స్టార్‌గా గుర్తింపు పొందాడు. సింగం 123, కొబ్బరిమట్ట, కరెంట్ తీగ, బందిపోటు, జ్యోతిలక్ష్మి తదితర సినిమాల్లో నటించాడు. తెలుగు బిగ్‌బాస్ షోలో కూడా పాల్గొన్న విషయం తెలిసిందే. -
‘నీకు, నీ అన్నకు రాజకీయ భిక్ష పెట్టింది నేనే’
కృష్ణా జిల్లా: మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై మాజీ హోం మంత్రి వసంత నాగేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం నాగేశ్వర రావు విలేకరులతో మాట్లాడుతూ.. ఓటమి భయంతోనే దేవినేని ఉమ మతి భ్రమించి మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. గణపవరంలో తనపై మంత్రి ఉమా వ్యంగ్యంగా మాట్లాడారని అన్నారు. కొంగర మల్లయ్య అనే పదం వాడే ముందు నీ(ఉమ) రాజకీయ చరిత్ర గుర్తు చేసుకోవాలని సూచించారు. నీకు(ఉమ), నీ అన్నకు రాజకీయ భిక్ష పెట్టింది తానేనని గుర్తు చేశారు. తనకు కాళ్లు లేకపోయినా మాట్లాడే సత్తా ఉంది ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. కొంగర మల్లయ్య లేస్తే మనిషిని కాదు అన్నాడేమో కానీ వసంత నాగేశ్వర రావు లేస్తే దేవినేని ఉమ పాలిట భయంకరుడని సమాధానమిచ్చారు. స్టీఫెన్ హకింగ్ అనే ప్రపంచ ఫ్రఖ్యాతి గాంచిన ఖగోళ శాస్త్రవేత్తకు కూడా కాళ్లు లేవని, కానీ ఖగోళ శాస్త్రంలో ఆయన అద్భుతాలు కనిపెట్టాడని గుర్తు చేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న జైపాల్ రెడ్డిని కూడా ఈ విషయంలో గుర్తుపెట్టుకోవాలని సూచించారు. తనకు ఒకప్పుడు కాళ్లు ఉండేవి.. దేవినేని కుటుంబానికి ఊతం ఇచ్చి ఇప్పుడు కాళ్లు లేకుండా చేసుకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు కాళ్లు ఉన్నా లేకపోయినా తాను చేయాల్సిన పాత్ర తాను చేస్తానని చెప్పారు. తన గురించి ఇంత మాట్లాడుతున్నా వంటే ఈ కాళ్లు లేనోడిని చూసి భయపడి ప్రతిసారీ తన ప్రస్తావన ఎందుకు తీసుకు వస్తున్నావని ప్రశ్నించారు. దేవినేని ఉమ ఓటమి భయంతోనే ఏం మాట్లాడుతున్నాడో అర్ధం కావడం లేదన్నారు. మైలవరం నియోజకవర్గం ప్రజలు నిన్ను(దేవినేని ఉమ) ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారని, నువ్వు కూడా తట్టా బుట్టా సర్దుకుని వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. -
మాజీమంత్రి కుమారుడు కృష్ణ ప్రసాద్ అరెస్ట్
నందిగామ : హత్య కేసుల్లో మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు కుమారుడు, టీడీపీ నేత కృష్ణ ప్రసాద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణాజిల్లా చందర్లపాడు కోనాయిపాలెంలో 2013 సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగి పుల్లయ్య దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హత్య చేసింది పుల్లయ్య బావమరిది రవినే అని పోలీసులు గుర్తించారు. దాంతో హత్య కేసులో రవిని ప్రధాన నిందితుడిగా చేర్చారు. ఆ తరువాత సరిగ్గా ఏడాదికి రవిన కూడా దారుణ హత్యకు గురయ్యాడు.ఈ రెండు హత్యలు కృష్ణ ప్రసాద్ చేయించాడంటూ, మృతుడు రవి భార్య మాధవి హైకోర్టును ఆశ్రయించింది. ఈ రెండు హత్యలపై విచారణ జరపాలని హైకోర్డు ఆదేశాలు జారీ చేయడంతో కృష్ణప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.