
ఓ సినిమా చిత్రీకరణ సమయంలో జరిగిన ప్రమాదంలో నటుడు సంపూర్ణేశ్ బాబు తృటిలో తప్పించుకున్నాడు. ఎలాంటి గాయాలు కాకపోవడంతో చిత్రబృందం ఊపిరి పీల్చుకుంది. ఈ సంఘటన ‘బజార్ రౌడీ’ అనే సినిమా షూటింగ్‌లో జరిగింది. హైదరాబాద్ శివారులో జరుగుతున్న షూటింగ్‌లో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
సంపూర్ణేశ్ హీరోగా వసంత నాగేశ్వర రావు దర్శకత్వంలో సందిరెడ్డి శ్రీనివాస్ నిర్మిస్తున్న సినిమా బజార్ రౌడీ. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ శివారులో జరుగుతున్నట్టు సమాచారం. అయితే షూటింగ్‌లో భాగంగా సంపూర్ణేశ్ బైక్‌ను పైకి లేపి సంచుల మధ్య నుంచి కిందకు దూకాలి. ఆ సీన్ తీస్తుండగా బైక్‌పై సంపూర్ణేశ్ లేచి కిందకు దిగుతుండగా అదుపు తప్పింది. తాడుతో బైక్‌ను కిందకు దింపే సమయంలో అదుపు తప్పి ప్రమాదం జరిగింది. బైక్‌తో పాటు సంపూ కింద పడిపోయాడు. లేవడానికి ప్రయత్నించగా కుదరలేదు. దీంతో వెంటనే అప్రమత్తమైన అక్కడున్న వారు సంపూను పైకి లేపారు.
హృదయ కాలేయంతో సంపూర్ణేశ్ బాబు సడన్ స్టార్‌గా గుర్తింపు పొందాడు. సింగం 123, కొబ్బరిమట్ట, కరెంట్ తీగ, బందిపోటు, జ్యోతిలక్ష్మి తదితర సినిమాల్లో నటించాడు. తెలుగు బిగ్‌బాస్ షోలో కూడా పాల్గొన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment