నందిగామ, న్యూస్‌లైన్ : కుటుంబాల మధ్య వివాదాల నేపథ్యంలోనే తన భర్త హత్య జరిగిందని, ఈ ఘటనలో ఏ రాజకీయ పార్టీ ప్రమేయం లేదని పొదిల రవి సతీమణి మాధవి స్పష్టం చేశారు. పట్టణంలోని తన నివాసంలో శనివారం సాయంత్రం తన తండ్రి మండేపూర్తి వెంకట నరసయ్య, కుమారులిద్దరితో కలిసి ఆమె విలేకరుల సమావేశంలో పాల్గొన్నా రు. గత ఏడాది తన భర్త హత్యకు దారితీసిన పరిస్థితుల ను ఈ సందర్భంగా ఆమె వివరించారు.
వసంత కృష్ణప్రసాద్ కుట్ర ఫలితంగానే పోసాని కోటేశ్వరరావు ఆధ్వర్యంలో తన భర్త హత్యకు పథకం రూపకల్పన జరిగిందన్నారు. ఆ మేరకే తన భర్తను కోనాయపాలెం సమీపంలో హత్య చేశారని పేర్కొన్నారు. ఈ ఘటనకు కృష్ణప్రసాద్ కారణమని ఆరోజే పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. అప్పటి సీఐ భాస్కరరావు తనపై ఒత్తిడి తెచ్చి ఫిర్యాదు ఉపసంహరించుకునేలా చేశారని ఆరోపించారు.
అప్పటినుంచి పోలీసు ఉన్నతాధికారుల చుట్టూ తిరుగుతూ ఫిర్యాదు చేయగా జిల్లా ఎస్పీ స్పందించి కేసు విచారణకు నందిగామ డీఎస్పీని ఆదేశించారన్నారు. ఆ మేరకు సెక్షన్ 164 కింద జగ్గయ్యపేట కోర్టులో తన వాంగ్మూలాన్ని నమోదు చేశారని తెలి పారు. అనంతరం ఎస్పీ ఆదేశాల మేరకు కృష్ణప్రసాద్‌ను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారన్నారు.
రాజకీయ లబ్ధికి యత్నం
హత్య కేసులో అరెస్టును వివాదాస్పదం చేసి రాజకీయ లబ్ధి పొందేందుకు కృష్ణప్రసాద్ యత్నిస్తున్నారని మాధవి ఆరోపించారు. ఈ ఘటనలో ఏ రాజకీయ పా ర్టీ, ఏ నాయకుడి ప్రమేయం లేదని ఆమె స్పష్టం చేశారు. ఈ కేసులో పూర్తిగా న్యాయం జరిగేందుకు రాష్ట్ర గవర్నర్ నరసింహన్, కేంద్ర మానవ హక్కుల కమిషన్‌ను కలిసి విజ్ఞప్తి చేస్తానన్నారు.
కృష్ణప్రసాద్ అరెస్టులో రాజకీయ ప్రమేయం లేదు
Published Sun, May 4 2014 2:52 AM | Last Updated on Mon, Sep 17 2018 5:10 PM
Advertisement
Advertisement