టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 న్యూస్‌ | Top10 Telugu Latest News Morning Headlines 28th June 2022 | Sakshi
Sakshi News home page

టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 న్యూస్‌

Published Tue, Jun 28 2022 11:50 AM | Last Updated on Tue, Jun 28 2022 12:36 PM

Top10 Telugu Latest News Morning Headlines 28th June 2022 - Sakshi

1. తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల
తెలంగాణలో ఇంటర్‌ ఫలితాలు విడుదయ్యాయి. ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం ఉదయం 11 గంటలకు విడుదల చేశారు. ఒకే క్లిక్‌లో ఇంటర్‌ ఫస్టియర్‌, సెంకడ్‌ ఇయర్‌ ఫలితాల‌ను సాక్షిఎడ్యుకేష‌న్‌.కామ్‌ (www.sakshieducation.com)లో చూడొచ్చు.
పూర్తికథనం కోసం క్లిక్‌ చేయండి 

2. మహా సర్కార్‌కు గవర్నర్‌.. గవర్నర్‌కు షిండే వర్గం లేఖ!
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగు.. తూనే ఉంది. ఈ తరుణంలో డబుల్‌ ట్విస్ట్‌ చోటుచేసుకుంది. గవర్నర్‌ చుట్టూరా రాజకీయం తిప్పాలనే ఆలోచనలో ఉన్నాయి బీజేపీ, షిండే వర్గం. బలనిరూపణకు సిద్ధం కావాలని బీజేపీ, షిండే వర్గం భావిస్తుండగా.. ఆరోపణలు వెల్లువెత్తడంతో గవర్నర్‌ భగత్‌సింగ్‌ కొష్యారీ ప్రభుత్వానికి ఓ లేఖ రాశారు. 
పూర్తికథనం కోసం క్లిక్‌ చేయండి 

3. థాంక్యూ సీఎం జగన్‌ సార్‌
తిత్లీ నష్ట పరిహారం చెల్లించి ఈ ప్రాంత రైతులను ఆదుకున్నందుకు  ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డికి నియోజక వర్గ నాలుగు మండలాల నాయకులు, కార్యకర్తలు, రైతులు కృతజ్ఞతలు తెలియజేశారు.
పూర్తికథనం కోసం క్లిక్‌ చేయండి  

4. తొమ్మిది నెలల తర్వాత రాజ్‌భవన్‌కు సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు మంగళవారం ఉదయం రాజ్‌భవన్‌లో అడుగుపెట్టారు. దాదాపు తొమ్మిది నెలల తర్వాత ఆయన గవర్నర్‌ అధికారిక భవనానికి రావడం గమనార్హం. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా తమిళిసైతో మాటామంతి కలిపారు కేసీఆర్‌.
పూర్తికథనం కోసం క్లిక్‌ చేయండి 

5. అమెరికాలో వలస విషాదం.. 42 మంది మృతి
అగ‍్రరాజ్యం అమెరికాలోని టెక్సాస్‌ నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. శాన్‌ ఆంటోనియోలో ట్రక్కులో వెళ్తున్న మృతుల్లో దాదాపు 46కి చేరింది.  ఈ మేరకు లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి తెలిపారు.
పూర్తికథనం కోసం క్లిక్‌ చేయండి 

6. ఏపీ పాలిటిక్స్‌లో ‘మూడు ముక్కలాట’
రాజకీయ సిద్ధాంతాలు వేరైనా రహస్య ఎజెండా ఒకటిగా పెట్టుకొని విపక్ష పార్టీలు వ్యవహరిస్తున్నాయి. బీజేపీ ఛీ కొడుతున్నా.. టీడీపీ అంతర్గతంగా సహకరిస్తూ లోపాయికారి రాజకీయం చేస్తోంది. బద్వేల్, ఆత్మకూరు ఉప ఎన్నికల్లో ఈ తెర చాటు రాజకీయం తెరపైకి వచ్చింది.
పూర్తికథనం కోసం క్లిక్‌ చేయండి  

7. బిజినెస్‌ టైకూన్‌ పల్లోంజీ మిస్త్రీ కన్నుమూత
బిజినెస్‌ టైకూన్‌, షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ చైర్మన్ పల్లోంజీ మిస్త్రీ (93)  కన్నుమూశారు. ముంబైలోని తన నివాసంలో సోమవారం రాత్రి తుది శ్వాస విడిచారు. నిద్రలోనే ఆయన కన్నుమూసినట్టు తెలుస్తోంది. 18.4 శాతం వాటాతో టాటా గ్రూప్‌లో అతిపెద్ద వ్యక్తిగత వాటాదారుగా  ఉన్నారు పల్లోంజీ.
పూర్తికథనం కోసం క్లిక్‌ చేయండి  

8. టీ20 ప్రపంచకప్‌.. సెహ్వాగ్‌ టాప్‌3లో కోహ్లికి నో ఛాన్స్‌..!
ఈ ఏడాది ఆక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా టాప్‌ 3 బ్యాటర్లను భారత మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ ఎంచుకున్నాడు. ఈ మెగా టోర్నీలో టీమిండియా టాప్‌ త్రీలో ఇషాన్‌ కిషన్‌, కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మలు ఉండాలని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.
పూర్తికథనం కోసం క్లిక్‌ చేయండి  

9. క్రేజీ రూమర్‌.. మహేష్‌ 30 ఆ డైరెక్టర్‌తోనే!
రాజమౌళి గురించి తెలిసి కూడా మహేశ్‌ బాబు కొత్తసినిమా పై ఇప్పుడే ఫోకస్ పెట్టడం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. మహేశ్‌ కెరీర్ లో తెరకెక్కే 30 చిత్రానికి దర్శకుడు ఎవరూ అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 
పూర్తికథనం కోసం క్లిక్‌ చేయండి  

10. ప్రపంచంలోనే అందవిహీనమైన ముఖం.. కదిలించే కథ
అది ప్రపంచంలోనే అత్యంత విహీనమైన ముఖంగా గుర్తింపు దక్కింది. ప్రత్యేకించి పోటీల్లో సైతం నెగ్గింది. కానీ, హృదయ విదారకరమైన దాని కథే న్యాయనిర్ణేతలను కదిలించింది. మిస్టర్‌ హ్యాపీ ఫేస్ గురించి తెలిస్తే.. ఎవరి కళ్లు అయినా చెమ్మగిల్లడం ఖాయం.
పూర్తికథనం కోసం క్లిక్‌ చేయండి  


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement