
బార్సిలోనా (స్పెయిన్): బార్సిలోనా స్పెయిన్ మాస్టర్స్ వరల్డ్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో పురుషుల డబుల్స్ విభాగంలో ప్రణవ్ చోప్రా–గారగ కృష్ణ ప్రసాద్ (భారత్) జంట తొలి రౌండ్‌లోనే ఓటమి చవిచూసింది. మంగళవారం జరిగిన మొదటి రౌండ్ మ్యాచ్‌లో ప్రణవ్–కృష్ణ ప్రసాద్ ద్వయం 21–19, 16–21, 7–21తో బెన్ లేన్–సీన్ వెండీ (ఇంగ్లండ్) జోడీ చేతిలో పరాజయం పాలైంది. నేడు జరిగే పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో డారెన్ లియు (మలేసియా)తో హెచ్‌ఎస్ ప్రణయ్; వైగోర్ కోల్హో (బ్రెజిల్)తో పారుపల్లి కశ్యప్; క్రిస్టో పొపోవ్ (ఫ్రాన్స్)తో అజయ్ జయరామ్; శుభాంకర్ డేతో కిడాంబి శ్రీకాంత్; లుకాస్ క్లియర్‌బౌట్ (ఫ్రాన్స్)తో సమీర్ వర్మ తలపడతారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో వైవోని లీ (జర్మనీ)తో సైనా నెహ్వాల్ ఆడుతుంది. మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్‌లో మథియాస్ క్రిస్టియాన్సెన్–అలెగ్జాండ్రా బోయె (డెన్మార్క్) జోడీని సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా జంట ‘ఢీ’కొంటుంది.
Comments
Please login to add a commentAdd a comment