Barcelona
-
ఈ స్టార్ హీరో ఓ సాహసి.. స్పెయిన్ బార్సిలోనా ఎఫ్ 1 రేసులో అజిత్ కుమార్ (ఫొటోస్)
-
అనధికారిక ఫారెక్స్ ప్లాట్‌ఫాంలపై నిఘా పెంచాలి..
న్యూఢిల్లీ: అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌ల విషయంలో అప్రమత్తత వహించాలని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ సూచించారు. కొందరు వ్యక్తులు, సంస్థలు వీటిలో లావాదేవీలు నిర్వహించేందుకు నిధుల కోసం బ్యాంకింగ్ మాధ్యమాన్ని ఉపయోగించుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ తరహా ప్లాట్‌ఫామ్‌లలో జరుగుతున్న మోసాలపై ఫిర్యాదులు వస్తుండటంతో వాటిల్లో ట్రేడింగ్ చేయరాదంటూ ఆర్బీఐ ఇప్పటికే సూచన జారీ చేసినట్లు దాస్ చెప్పారు. బార్సెలోనాలో జరిగిన ఎఫ్‌ఐఎంఎండీఏ–పీడీఏఐ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ అంశాలు వివరించారు. మరోవైపు, రూపీ డెరివేటివ్స్‌లో భారతీయ బ్యాంకుల పాత్ర మరింతగా పెరగాలని దాస్ సూచించారు. -
లైంగిక వేధింపుల కేసులో స్టార్ ఫుట్‌బాలర్‌కు జైలు శిక్ష.. భారీ జరిమానా
లైంగిక వేధింపుల కేసులో స్టార్ ఫుట్‌బాలర్‌కు జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించింది స్పానిష్ కోర్టు. ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన కేసులో బ్రెజిల్ మాజీ ఫుట్‌బాలర్ డానీ అల్వెస్‌కు (40) నాలుగున్నర సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ. 13 కోట్ల జరిమానా విధించింది స్పెయిన్‌లోని బార్సిలోనా కోర్టు. 2022 డిసెంబర్ 31న అల్వెస్.. సదరు మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో (నైట్ క్లబ్లో) పాటు అనుమతి లేకుండా లైంగిక చర్యకు పాల్పడ్డాడని రుజువు కావడంతో కోర్టు ఈ తీర్పునిచ్చింది. ఈ కేసులో అల్విస్ను ఈ ఏడాది జనవరి 20న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటినుంచి అతను రిమాండ్‌లోనే ఉన్నాడు. అల్విస్ బెయిల్ ప్రయత్నాలను కోర్టు తిరస్కరించింది. తాను నిరపరాధినన్న వాదనను కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో అల్వెస్ భార్య స్టేట్మెంట్ను కూడా కోర్టు పట్టించుకోలేదు. అల్వెస్ ఫుట్‌బాల్ కెరీర్ విషయానికొస్తే.. 2006 నుంచి 2022 వరకు బ్రెజిల్ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన అల్వెస్.. 126 మ్యాచ్‌లు ఆడి 8 గోల్స్ చేశాడు. అల్వెస్.. రైట్ బ్యాక్ స్థానంలో ఆడతాడు. ఇతను వివిధ సమయాల్లో బార్సిలోనా, పీఎస్జీ, జువెంటస్, సాపాలో క్లబ్‌ల తరఫున ఆడాడు. అల్వెస్.. 2022 ఫిఫా వరల్డ్‌కప్‌లో చివరిసారిగా బ్రెజిల్‌కు ప్రాతినిథ్యం వహించాడు. -
హ్యాట్రిక్ గోల్స్.. భారత మహిళల ఘన విజయం
బార్సిలోనా: స్పానిష్ హాకీ ఫెడరేషన్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా జరుగుతున్న టోర్నీలో భారత మహిళల జట్టుకు తొలి విజయం దక్కింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 3–0 గోల్స్ తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. భారత్ తరఫున అన్నీ గోల్స్ తానే సాధించిన లాల్రెమ్సియామి ‘హ్యాట్రిక్’ నమోదు చేయడం విశేషం. మ్యాచ్ 13వ, 17వ, 56వ నిమిషాల్లో ఆమె మూడు ఫీల్డ్ గోల్స్ కొట్టింది. మొదటి, రెండో క్వార్టర్లో ఒక్కో గోల్ సాధించిన భారత్ చివరి క్వార్టర్లో మరో గోల్‌తో ముగించింది. ఈ టోరీ్నలో రౌండ్ రాబిన్ లీగ్ దశలో ఇంగ్లండ్, స్పెయిన్లతో తొలి రెండు మ్యాచ్‌లను భారత్ ‘డ్రా’గా ముగించింది. సవితా పూనియా నాయకత్వంలోని మన జట్టు తమ తర్వాతి పోరులో నేడు స్పెయిన్‌తో తలపడుతుంది. -
మాజీ బాయ్‌ఫ్రెండ్ మొహం చూడకూడదని గోడ కట్టించింది
పాప్ సింగర్ షకీరా, స్పెయిన్ ఫుట్‌బాల్ స్టార్ గెరార్డ్ పీక్ మధ్య 12 ఏళ్ల బంధం ముగిసిన సంగతి తెలిసిందే. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో గతేడాది వైవాహిక జీవితానికి స్వస్తి పలికారు. అప్పటినుంచి షకీరా, పీక్‌లు ఒకే ఇంట్లో ఉంటున్నా వేర్వేరుగా ఉంటున్నారు. పీక్, షకీరాలు కలిసి బార్సిలోనా ఏరియాలో రెండంతస్తుల ఇల్లును కొన్నారు. షకీరా నుంచి విడిపోయిన తర్వాత పీక్ తన తల్లిదండ్రులతో అదే ఇంట్లో పై అంతస్తులో ఉంటున్నాడు. తాజాగా షకీరా తన మాజీ బాయ్‌ఫ్రెండ్ మొహం చూడకూడదని అడ్డుగా గోడ కట్టించింది. బార్సిలోనా ఏరియాలో ఉన్న షకీరా ఇంటికి సిమెంట్ మిక్సర్ కాంక్రీట్ లారీ రావడం టీవీ కెమెరాల్లో రికార్డు కావడంతో ఈ విషయం బయటికి వచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇన్ని గొడవల మధ్య వాళ్లతో కలిసి ఉండలేనని అందుకే గోడ కట్టిస్తున్నట్లు షకీరా పేర్కొంది. అయితే షకీరా వ్యవహారశైలిపై పీక్ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పీక్ తల్లి మాంటిసెరాట్ బెర్నాబ్యూ.. గోడను తీసేయాలని షకీరాను అడిగినప్పటికి ఆమె నుంచి ఎలాంటి సమాధానం రాలేదని సమాచారం. ఇక గెరార్డ్ పీక్ 2009 నుంచి స్పెయిన్ ఫుట్‌బాల్ టీంకు ఆడుతున్నాడు. గెరార్డ్ పీక్ జట్టులో బ్యాక్ సెంటర్ ఆటగాడిగా ఉన్నాడు. ఇక మాంచెస్టర్ యునైటెడ్, బార్సిలోనా క్లబ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. చదవండి: 71 కాస్తా 74.. మూడేళ్ల శపథం నుంచి పెళ్లి వరకు షార్ట్ టెంపర్‌కు మారుపేరు.. అభిమానిపై తిట్ల దండకం -
భర్తతో నయన్ వెకేషన్.. ఫోటోలు వైరల్
కోలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ నయనతార- విగ్నేశ్ శివన్ వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. మహాబలిపురంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే పెళ్లి తర్వాత కూడా ఇద్దరూ సినిమాలతో బిజీ అయిపోయారు. తాజాగా ఈ కొత్తజంట పని నుంచి బ్రేక్ తీసుకొని హనీమూన్‌కు చెక్కేశారు. స్పెయిన్‌లో బార్సిలోనాలో వెకేషన్‌కు వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలను విగ్నేశ్ శివన్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇందులో నయన్ తాళిబొట్టుతో కనిపించడం విశేషం. మోడ్రన్ డ్రెస్సుల్లోనూ నయన్ తాళిబొట్టుతో మెస్మరైజ్ చేస్తుంది. నయన్ తాళిని ఫ్యాషన్ ట్రెండ్‌గా క్రియేట్ చేస్తుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
మెస్సీ కన్నీళ్లు తుడిచిన టిష్యూ పేపర్ ధర రూ. ఏడున్నర కోట్లు
Lionel Messi.. సెలబ్రిటీలు ఏం చేసినా దానిని ఒక వార్తగా చూడడం ఈ మధ్య బాగా అలవాటైపోయింది. లేచినా.. పడుకున్నా.. తిన్నా.. ఇలా ఏది చేసినా దాన్ని ప్రత్యేకంగా చూస్తుంటారు. ఇంకొందరు మరింత ముందుకెళ్లి సెలబ్రిటీలు వాడిన వస్తువులను ఆన్లైన్లో వేలం వేయడం చూస్తుంటాం. ఎంతైనా ఒక సెలబ్రిటీ కాబట్టి దానికి మంచి ధర పలికే అవకాశం ఉంటుంది. తాజాగా అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ ఈ జాబితాలో చేరిపోయాడు. ఇటీవలే కాంట్రాక్ట్ పొడిగింపులో వచ్చిన సమస్యల వల్ల మెస్సీ స్పానిష్ ఫుట్‌బాల్ క్లబ్ బార్సిలోనాకు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. గత ఆదివారం(ఆగస్టు 8న) జరిగిన ఫేర్వెల్ వేడుకలో తన అనుభవాలను పంచుకుంటూ కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఈ సందర్భంగా మెస్సీ ఒక టిష్యూ పేపర్‌తో ఉబికి వస్తున్న కన్నీళ్లతో పాటు ముక్కును తుడుచుకున్నాడు. సాధారణంగా వాడేసిన టిష్యూ పేపర్‌కు విలువ ఉండదు. ఇక్కడ టిష్యూను వాడింది మెస్సీ.. ఇంకేముంది అతను వాడిన టిష్యూ పేపర్‌ను తీసుకొని ఒక ప్రబుద్ధుడు ఇంటర్నేషనల్ ఈ-కామర్స్ ఫ్లాట్‌ఫాం ఎమ్‌ఈకెడో లో వేలానికి పెట్టాడు. అయితే ఫుట్‌బాల్ దిగ్గజం కన్నీళ్లు తుడిచిన ఆ టిష్యూ పేపర్‌కు సదరు వ్యక్తి ఫిక్స్ చేసిన ధర ఎంతో తెలుసా.. అక్షరాల రూ. ఏడున్నర కోట్లు ( 1 మిలియన్ డాలర్లు). ఇంకేముంది ఇది తెలుసుకున్న అభిమానులు ''వార్ని.. మెస్సీ వాడి పడేసిన టిష్యూ పేపర్‌కు ఇంత ధర'' అంటూ నోరు వెళ్లబెట్టారు. 13 ఏళ్ల వయసులో 2000 సంవత్సరంలో బార్సిలోనాతో మొదలైన మెస్సీ ప్రయాణం దాదాపు రెండు దశాబ్దాల పాటు సాగింది. 17 సీజన్ల పాటు బార్సిలోనాతోనే ఉన్న మెస్సీ.. ఆ క్లబ్ తరఫున అత్యధిక మ్యాచ్‌లు, అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. బార్సిలోనా క్లబ్‌ను వీడిన మెస్సీ తాజాగా పారిస్ సెయింట్ జర్మన్ ఫుట్‌బాల్ క్లబ్ (పీఎస్జీ)కి ఆడనున్నాడు. ఈ మేరకు అతడు ఫ్రెంచ్ క్లబ్ పారిస్ సెయింట్ జెర్మయిన్ (పీఎస్జీ)తో రెండేళ్ల ఒప్పందం కుదుర్చుకున్నాడు. రెండేళ్ల కాలానికి మెస్సీకి దాదాపు 7 కోట్ల యూరోలు (రూ. 610 కోట్లు) చెల్లించనున్నట్లు సమాచారం. we cant take this man 😭💔 The #GOAT🐐 crying 😭 #MESSI pic.twitter.com/bqNVPcjKmq — MaayoNᴮᵉᵃˢᵗ😎🎩💫 (@itz_satheesh4) August 8, 2021 -
Lionel Messi: రెండేళ్ల కాంట్రాక్ట్.. దాదాపు 610 కోట్లు!
పారిస్: బార్సిలోనా ఫుట్‌బాల్ క్లబ్‌ను వీడిన అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లయెనల్ మెస్సీ ఇక ఫ్రాన్స్ ఫుట్‌బాల్ టోర్నీ లీగ్–1లో కనిపించనున్నాడు. ఈ మేరకు అతడు ఫ్రెంచ్ క్లబ్ పారిస్ సెయింట్ జెర్మయిన్ (పీఎస్జీ)తో రెండేళ్ల ఒప్పందం కుదుర్చుకున్నాడు. రెండేళ్ల కాలానికి మెస్సీకి దాదాపు 7 కోట్ల యూరోలు (రూ. 610 కోట్లు) చెల్లించనున్నట్లు సమాచారం. మెస్సీ ఒప్పందానికి సంబంధించి నేడు అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కాగా ఆర్థికపరమైన ఇబ్బందుల వల్ల మెస్సీతో కాంట్రాక్ట్ రెన్యువల్ చేసుకునేందుకు సుముఖంగా లేమని బార్సిలోనా ఫుట్‌బాల్ క్లబ్ గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఆకస్మిక ప్రకటన నేపథ్యంలో అభిమానులు షాక్‌కు గురయ్యారు. ప్రతిష్టాత్మక కోపా అమెరికా 2021లో అర్జెంటీనా విజయం తర్వాత సెలవుల్లో ఉన్న మెస్సీ.. క్లబ్లో చేరిన మరుసటి రోజే ఈ మేరకు ప్రకటన జారీకావడం గమనార్హం. మెస్సీతో బార్సిలోనా క్లబ్.. కాంట్రాక్ట్ రెన్యువల్ ఉండొచ్చని భావించగా ఈ హఠాత్పరిణామంతో ఫ్యాన్స్ విస్మయానికి గురయ్యారు. -
బార్సిలోనాకు గుడ్‌బై చెప్పిన మెస్సీ.. ఫేర్వెల్ సందర్భంగా కంటతడి
బార్సిలోనా: స్పానిష్ ఫుట్‌బాల్ క్లబ్ బార్సిలోనాతో తనకున్న రెండు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకున్నాడు అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సీ. ఆదివారం జరిగిన ఫేర్వెల్ సందర్భంగా మెస్సీ మాట్లాడుతూ.. క్లబ్‌ను వీడుతానని ఎన్నడూ ఊహించలేదంటూ భావోద్వేగానికిలోనై కంటతడి పెట్టాడు. కెరీర్ ముగిసేంతవరకు బార్సిలోనాతోనే ఉందామని నిర్ణయించుకున్నానని, అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల తాను క్లబ్‌ను వీడాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయాడు. అయితే, ఎప్పుడో ఒకసారి తాను మళ్లీ తిరిగి వస్తానని పేర్కొన్నాడు. తన జీవితం బార్కాలోనే ప్రారంభమైందని, ఇక్కడే చాలా నేర్చుకున్నానని, ఇప్పుడీ స్థాయిలో తానుండటానికి బార్కానే కారణమని అన్నాడు. This is the word of Leo #Messi: pic.twitter.com/k0btQ7k1py — FC Barcelona (@FCBarcelona) August 8, 2021 కాగా, క్లబ్ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో మెస్సీతో కాంట్రాక్ట్‌ను కొనసాగించడం లేదని గురువారం బార్సిలోనా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, 17 సీజన్ల పాటు బార్సిలోనాతోనే ఉన్న మెస్సీ.. ఆ క్లబ్ తరఫున అత్యధిక మ్యాచ్‌లు, అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. 13 ఏళ్ల వయసులో 2000 సంవత్సరంలో బార్సిలోనాతో మెస్సీ ప్రయాణం మొదలైంది. -
ఊహించని పరిణామం: 21 ఏళ్ల బంధానికి గుడ్‌బై
Lionel Messi: ఫుట్‌బాల్ అభిమానులకు, మెస్సీ ఫ్యాన్స్‌కు మింగుడుపడని వార్త ఇది. స్టార్ ఆటగాడు, ప్రపంచంలోనే రిచ్చెస్ట్ ప్లేయర్ లియోనెల్ మెస్సీకి ఊహించని పరిణామం ఎదురైంది. 21 ఏళ్ల సుదీర్ఘ బార్సిలోనా క్లబ్(Catalan club) పయనం ముగిసింది. ఇకపై ఈ స్పెయిన్ క్లబ్ తరపున మెస్సీ ఆడబోవడం లేదు. ఆర్థికపరమైన ఇబ్బందుల వల్ల ఆయనతో కాంట్రాక్ట్ రెన్యువల్ చేసుకునేందుకు సుముఖంగా లేమని క్లబ్ ప్రకటించింది. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం క్లబ్ తరపు అధికారిక సమాచారం వెలువడింది. దీంతో సాకర్ అభిమానులు నివ్వెరపోతున్నారు. నిజానికి క్లబ్‌తో మెస్సీ కాంట్రాక్ట్ ముగిసి చాలా రోజులే అవుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని క్లబ్‌లు పోటాపోటీ పడగా.. అర్జెంటీనా ఫుట్‌బాల్ మాంత్రికుడు తమతోనే కొనసాగుతాడని క్లబ్ చెబుతూ వస్తోంది. ఇదిలా ఉంటే కోపా అమెరికా 2021 అర్జెంటీనా విక్టరీ తర్వాత.. మెస్సీ సెలవుల్లో ఉన్నాడు. తిరిగి బుధవారం క్లబ్లో చేరాడు. దీంతో ఈ వారాంతంలో కాంట్రాక్ట్ రెన్యువల్ ఉండొచ్చని కథనాలు వెలువడ్డాయి. ఇంతలోపే మెస్సీతో బంధం ముగిసిందని బార్సిలోనా ప్రకటించడం ఫుట్‌బాల్ అభిమానుల్ని విస్మయానికి గురి చేసింది. చదవండి: ఏం తమాషాగా ఉందా? అయితే వ్యక్తిగత కారణాలతో కిందటి ఏడాదే మెస్సీ.. బార్సిలోనా నుంచి బయటకు వచ్చేయాలని ప్రయత్నించాడు. అయితే అప్పుడే క్లబ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు తీసుకున్న జోవాన్ లపోర్టా.. మెస్సీని బతిమాలి కొనసాగేలా చూశాడు. తిరిగి ఈ ఏడాది జూన్ 30న మెస్సీ -బార్సిలోనా క్లబ్ ఒప్పందం ముగియగా.. 1 బిలియన్ డాలర్ల అప్పుల్లో క్లబ్ కూరుకుపోవడం, పైగా కరోనా దెబ్బకి ఆర్థికంగా కుదేలుకావడంతో కాంట్రాక్ట్ రెన్యువల్ అయ్యేనా? అనే అనుమానాలు తలెత్తాయి. అయితే లపోర్టా మాత్రం మరో ఐదేళ్లు మెస్సీ తమతోనే కొనసాగుతాడంటూ కాన్ఫిడెంట్‌గా ప్రకటనలు ఇచ్చాడు. ఈ తరుణంలో నిన్న(గురువారం) ఉదయం క్యాంప్‌నౌ స్టేడియం దగ్గర జరిగిన చర్చల అనంతరం.. మెస్సీ కాంట్రాక్ట్ ముగిసినట్లు క్లబ్ ఈ ప్రకటన చేయడం విశేషం. 50 శాతం కోతలు, ఒప్పందంలో క్లబ్ కండిషన్లకు మెస్సీ విముఖత వ్యక్తం చేయగా.. కాంట్రాక్ట్ రద్దుకే క్లబ్ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. 13 ఏళ్ల వయసులో బార్సిలోనా క్లబ్ యూత్ వింగ్‌లో చేరిన మెస్సీ.. 16 ఏళ్లకు క్లబ్ జట్టులో చేరాడు. ఈ స్పెయిన్ క్లబ్ తరపున 778 మ్యాచ్‌లు ఆడి.. 672 గోల్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇదిలా ఉంటే బార్సిలోనా నుంచి తన ఎగ్జిట్‌పై మెస్సీ ఎలా స్పందిస్తాడో చూడాలి. ప్రస్తుతం ఫ్రీ ఏజెంట్‌గా ఉన్న మెస్సీ.. ఏ క్లబ్లో చేరేది త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. -
సగం జీతం కట్! మరో ఐదేళ్లకు ఒప్పందం?
ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఫుట్‌బాలర్‌గా పేరున్న లియోనెల్ మెస్సీ.. రాజీకి సిద్ధపడినట్లు తెలుస్తోంది. స్పానిష్ ఫుట్‌బాల్ క్లబ్ బార్సిలోనాతో మెస్సీ కాంట్రాక్ట్ ఇటీవలె ముగిసిందన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతని భవితవ్యం ఏంటన్న దానిపై చర్చ మొదలైంది. అయితే ఊహాగానాలకు తెరదించుతూ మెస్సీ మరోసారి బార్సిలోనా కాంట్రాక్ట్‌కే మొగ్గుచూపించినట్లు తెలుస్తోంది. మరో ఐదేళ్లపాటు బార్సిలోనా క్లబ్‌తో ఒప్పందం చేసుకోబోతున్న మెస్సీ.. 50 శాతం జీతం కట్టింగ్‌కు సైతం సిద్ధపడినట్లు గోల్.కామ్ బుధవారం ఒక కథనం ప్రచురించింది. రీ-సైన్ నేపథ్యంలో వార్షికాదాయంలో ఈ కట్టింగ్లు పోతాయని, దీనిపై క్లబ్ త్వరలోనే అధికార ప్రకటన చేయనుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే గత కొంత కాలంగా బార్సిలోనా క్లబ్ నష్టాల్లో ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు లాక్డౌన్ ప్రభావంతో ఆటగాళ్లకు పూర్తిస్థాయిలో రెమ్యునరేషన్లు ఇవ్వలేకపోతోంది కూడా. ఈ నేపథ్యంలో క్లబ్‌కు ఊరట ఇచ్చేలా మెస్సీ తన జీతంలో త్యాగానికి సిద్ధపడినట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ విషయంలో మెస్సీ మాస్టర్ ప్లాన్ అమలుచేస్తున్నాడని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే మెస్సీకి బార్సిలోనా కంటే ఎక్కువ జీతం ఆఫర్ చేస్తున్నాయి కొన్ని క్లబ్‌లు. అయితే పలు బ్రాండ్లకు అంబాసిడర్‌గా ఉన్న మెస్సీ.. వాటి ద్వారా గణనీయమైన ఆదాయం వెనకేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే మెస్సీ వేరే క్లబ్‌లకు వెళ్తే గనుక.. విశ్వసనీయత దెబ్బతిని ఆ ఆదాయానికి గండి పడే అవకాశం ఉందని భావిస్తున్నాడు. అందుకే బార్సిలోనా ఆఫర్‌కు తలొగ్గడం లాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోగలిగాడని విశ్లేషకుల అభిప్రాయం. ఇదిలా ఉంటే ఈ అర్జెంటీనా ఫుట్‌బాల్ మాంత్రికుడు 2004 నుంచి బార్సిలోనాతో కొనసాగుతున్నాడు. Messi in call with his fam after he got his champion’s medal  😍🔟📱🥇#Argentina #LeoMessi #LionelMessi #MessiTHEGOAT #ArgentinavsBrazil #CopaAmerica2021 #CopaAmerica #ARGBRA #ArgentinaBrazil #Messi #MessiCampeon pic.twitter.com/ChZeNPbyZZ — Leo Messi (@xlionelmessix) July 11, 2021 గత ఐదేళ్ల కాంట్రాక్ట్ కోసం 550 మిలియన్ల యూరోస్తో మెస్సీ ఒప్పందం చేసుకుని.. ప్రపంచంలోనే కాస్ట్లీ ప్లేయర్‌గా రికార్డ్ సృష్టించాడు. తాజాగా కాంట్రాక్ట్ ముగిశాక ‘పారిస్ సెయింట్ జెర్మాయిన్, మాంచెస్టర్ సిటీ, ఇంటర్ మిలన్లు మెస్సీకు బంపరాఫర్లు ప్రకటించాయి కూడా. ప్రస్తుత కథనాలు నిజమైతే 2026 వరకు మెస్సీ బార్సిలోనాతోనే కొనసాగుతాడు. -
29 ఏళ్ల రికార్డు బద్దలైంది
ఓస్లో (నార్వే): ప్రపంచ చాంపియన్... ప్రపంచ రికార్డును బద్దలుకొట్టాడు. 29 ఏళ్ల ఘనమైన రికార్డుకు పాతరేశాడు. ఇక్కడ జరుగుతున్న డైమండ్ లీగ్ మీట్లో భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి జరిగిన పురుషుల 400 మీటర్ల హర్డిల్స్‌లో రెండు సార్లు ప్రపంచ చాంపియన్ అయిన కార్స్టెన్ వార్హోమ్ (నార్వే) పోటీని అందరికంటే ముందు గా 46.70 సెకన్లలో పూర్తి చేశాడు. ఈ క్రమంలో అతని వేగానికి దాదాపు మూడు దశాబ్దాల పాటు చెక్కుచెదరని రికార్డు చెదిరిపోయింది. 1992 బార్సిలోనా ఒలింపిక్స్‌లో అమెరికా అథ్లెట్ కెవిన్ యంగ్ (46.79 సె.) నెలకొల్పిన రికార్డు తెరమరుగైంది. నార్వే అథ్లెట్ ఈ సారి తప్పకుండా ఒలింపిక్స్‌లో చాంపియన్‌గా నిలుస్తానని చెప్పాడు. వేగం పెరిగిన తన ప్రదర్శనతోఒలింపిక్ రికార్డుపై కన్నేసినట్లు చెప్పాడు. గత రియో ఒలింపిక్స్ (2016)లో అతనికి నిరాశ ఎదురైంది. కెరీర్లో తొలిసారి పాల్గొన్న మెగా ఈవెంట్లో అతను పదో స్థానంలో నిలిచాడు. 25 ఏళ్ల కార్స్టెన్ 2017 నుంచి ట్రాక్‌పై అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఆ ఏడా ది ఇంగ్లండ్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్ 400 మీటర్ల హర్డిల్స్‌లో విజేతగా నిలిచాడు. పోలండ్ ఆతిథ్యమిచ్చిన యూరోపియన్ అండర్– 23 చాంపియన్‌షిప్‌లో 400 మీ.హర్డిల్స్‌తో పాటు 400 మీ. పరుగులో సత్తాచాటుకున్నాడు. హర్డిల్స్ లో స్వర్ణం సాధించిన కార్స్టెన్, పరుగులో రజతం నెగ్గాడు. మళ్లీ దోహా (2019) ప్రపంచ చాంపియన్‌షిప్‌లో హర్డిల్స్ టైటిల్ నిలబెట్టుకున్నాడు. -
చెత్త టీం-చెత్త ఆఫర్లు.. ఏం తమాషాగా ఉందా?
ప్రపంచంలోనే ఖరీదైన ఫుట్‌బాల్ ఆటగాడిగా లియోనెల్ మెస్సీ(34)కి ఘనత ఉంది. అయితే తాజాగా బార్సిలోనాతో అతని కాంట్రాక్ట్ ముగిసింది. దీంతో మెస్సీ పయనమెటు? గందరగోళంలో మెస్సీ? అనే శీర్షికలతో చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో చిన్న టీంల నుంచి చెత్త టీంల దాకా ప్రతీ ఒక్క క్లబ్‌లు మెస్సీకి బంపరాఫర్లు ప్రకటిస్తున్నాయి ఇప్పుడు. లియోనెల్ మెస్సీ.. ఇప్పుడు ఫ్రీ ఏజెంట్. బార్సిలోనాతో నాలుగేళ్ల ఒప్పందం జూన్ 30 అర్థరాత్రితో ముగిసింది. దాదాపు 500 మిలియన్ల డాలర్ల ఒప్పందంగా.. ప్రపంచంలోనే కాస్ట్లీ ప్లేయర్ కాంట్రాక్ట్‌ల్లో ఒకటిగా నిలిచింది. ఎన్బీఎ, నేషనల్ ఫుట్‌బాల్ లీగ్, బేస్‌బాల్ లీగ్‌లోనూ ఏ ఆటగాడితో ఇంతటి కాస్ట్లీ కాంట్రాక్ట్‌లు జరగలేదు. ఇదిలా ఉంటే బ్రెజిల్ ఐబిస్ స్పోర్ట్ క్లబ్ నుంచి వచ్చిన మెస్సీకి ఆఫర్ గురించి పెద్ద ఎత్తున్న చర్చ నడుస్తోంది. É OFICIAL! 🚨 Hoje é o último dia do contrato de Messi com o Barcelona. A partir de amanhã ele já terá um novo clube. Assina, MESSI ✒️📄🤝@betsson_brasil #MessiNoÍbis pic.twitter.com/tJKMOrqnLD — Íbis Sport Club (@ibismania) June 30, 2021 ప్రపంచంలోనే చెత్త ఫుట్‌బాల్ టీంగా ఐబిస్ స్పోర్ట్ క్లబ్ పేరుంది. అంతేకాదు. డెబ్భై నుంచి ఎనభై దశకాల మధ్య దాదాపు నాలుగేళ్లపాటు ఒక్క గేమ్ కూడా గెల్వని రికార్డ్ ఈ క్లబ్ సొంతం. ఇక అలాంటి క్లబ్ మెస్సీకి కొన్ని షరతుల మీద ఒప్పంద పత్రాన్ని ప్రకటించింది. పదిహేనేళ్ల కాంటాక్ట్, అదీ మెరిట్ బేస్ మీద జీతం, గోల్స్ చేయకుంటే కాంట్రాక్ట్ రద్దు చేసి క్లబ్ నుంచి తొలగించడం, కాంటాక్ట్ రద్దైతే తర్వాత ఛాంపియన్ అనే ట్యాగ్‌ను తీసేయడం, పదో నెంబర్ జెర్సీ వేసుకోవద్దని.. అది తమ లెజెండ్ మారో షాంపూకి మాత్రమే సొంతమని , ఇక క్లబ్లో చేరే ముందు మారడోనా కంటే పీలే గొప్పోడని అద్దం ముందు మూడుసార్లు ప్రతిజ్క్ష చేయాలనే కండిషన్.. ఇలా చిత్రమైన ఒప్పందాలతో మెస్సీకి ఆహ్వానం ఆఫర్ ప్రకటించింది ఆ క్లబ్. దీంతో మండిపడుతున్నారు అతని ఫ్యాన్స్. ఇక మెస్సీ పీఆర్ టీం కూడా ఈ వ్యవహరంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఇలాంటి వ్యవహారాలను పట్టించుకునేంత తీరిక మెస్సీకి లేదని ప్రకటించింది. ఇక ఈ ఫ్రీ ఏజెంట్ కోసం.. చిన్నచితకా క్లబ్‌లు సైతం పోటీ పడుతున్నాయి. మెస్సీ స్వస్థలం రోసారియో నుంచి నెవెల్స్ ఓల్డ్ బాయ్స్ క్లబ్ ఆసక్తి చూపిస్తోంది. సొంత జట్టుకు వచ్చేయమంటూ ట్విటర్ ద్వారా అతనికి ఆహ్వానం కూడా పలికింది. ఎస్టాడియో మార్సెలో బైస్లా స్టేడియం వద్ద మెస్సీ.. పేరుతో పెద్ద కట్ అవుట్లు(మ్యూరాల్స్) ఏర్పాటు చేయించింది కూడా. ఇక తన కెరీర్ చివర్లో తాను సొంత గూటికే వెళ్తానని చాలాసార్లు మెస్సీ ప్రస్తావించిన విషయం తెలిసిందే. దీంతో ఆశలు పెట్టుకుంది ఓల్డ్ బాయ్స్. ఇక నెదర్లాండ్స్‌కు చెందిన వోలెన్డామ్ క్లబ్, రియల్ సాల్ట్ లేక్(అమెరికా) కూడా మెస్సీకి ఆహ్వానం పలకడం విశేషం. మరి మెస్సీ మనసులో.. సాధారణంగా బార్సిలోనా ఈ సాకర్ మాంత్రికుడి కాంట్రాక్ట్ రెన్యువల్కోసమే ప్రయత్నిస్తుంది. కానీ, 1 బిలియన్ డాలర్ల అప్పుల్లో క్లబ్ కూరుకుపోవడం, పైగా కరోనా దెబ్బకి ఆర్థికంగా కుదేలుకావడంతో కాంట్రాక్ట్ రెన్యువల్ అయ్యేనా? అనే అనుమానాలు ఉన్నాయి. అయితే క్లబ్ ప్రెసిడెంట్ జోవాన్ లపోర్టా స్పందించాడు. అతను మాతో ఉండాలనే మేం అనుకుంటున్నాం. అతనూ కోరుకుంటున్నాడు. అంతా సవ్యంగానే ఉందని వ్యాఖ్యానించాడాయన. మరి మెస్సీ మనసులో ఏముందో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే. ⚽EL MURAL DEL 🔟 EN LA CIUDAD😍 👏Así va quedando el mural en homenaje a Lionel #Messi que se pinta en Buenos Aires y Azara, una de las esquinas del barrio natal de La Pulga en Rosario. La obra de arte será presentada este jueves 1 de julio. 📸Increíbles imágenes de @rosdrone pic.twitter.com/iY1VSy866X — Rosario3.com (@Rosariotres) June 30, 2021 చదవండి: యూరో 2020.. కరోనా అంటించుకున్న ఆ దేశ అభిమానులు -
ప్రపంచలోనే ఖరీదైన ప్లేయర్, ధర తెలుసా?
బార్సిలోనా (స్పెయిన్): అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టు స్టార్ ప్లేయర్, బార్సిలోనా క్లబ్ ఆటగాడు లయనెల్ మెస్సీ ఒప్పందం విలువ ఎంతో బయటపడింది. అతను ఈ ప్రపంచంలోనే అతి ఖరీదైన ప్లేయర్ అని తేలిపోయింది. ఎవరి ఊహకందని మొత్తం అతను అందుకుంటున్నట్లు స్పెయిన్‌కు చెందిన ఎల్ మండో పత్రిక కథనాన్ని ప్రచురించింది. బార్సిలోనా క్లబ్‌తో అతను నాలుగు సీజన్లు ఆడేందుకు 55 కోట్ల 50 లక్షల యూరోలు (రూ. 4,906 కోట్లు) మొత్తం అందుకుంటున్నాడు. ఈ డీల్‌కు సంబంధించిన సమాచారం (డాక్యుమెంట్) లభించడంతో ఈ పత్రిక మెస్సీకి ఏడాదికెంత మొత్తం లభిస్తోంది, అతను ఎంత మొత్తంలో పన్నులు కడుతున్నాడో కూడా వెల్లడించింది. 2017లో కుదిరిన ఈ భారీ ఒప్పందంలో సీజన్‌కు 13 కోట్ల 80 లక్షల యూరోలు (రూ.1,217 కోట్లు) చొప్పున మెస్సీకి పారితోషికం లభిస్తుంది. ఇందులో ఫిక్స్డ్ సాలరీ (జీతం)తో పాటు ఇతరత్రా అలవెన్సులు అన్నీ కలిసే ఉంటాయని ఆ పత్రిక వివరించింది. దాదాపు రూ. ఐదు వేల కోట్ల ఒప్పంద విలువలో మెస్సీ సగం మొత్తాన్ని స్పెయిన్‌లో పన్నుల రూపేణా చెల్లిస్తున్నాడని ఆ పత్రిక తన కథనంలో పేర్కొంది. లయనెల్ మెస్సీ ఒప్పందం విలువ బహిర్గతం కావడంపై బార్సిలోనా క్లబ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎల్ మండో పత్రికపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. మెస్సీ కూడా ఎల్ మండో పత్రికపై చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నట్టు స్థానిక వార్తాసంస్థల సమాచారం. -
మెస్సీ ప్రపంచ రికార్డు
బార్సిలోనా (స్పెయిన్): ఫుట్‌బాల్ క్రీడలో 46 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న ప్రపంచ రికార్డును బార్సిలోనా స్టార్ ప్లేయర్, అర్జెంటీనా జట్టు కెప్టెన్ లయనెల్ మెస్సీ బద్దలు కొట్టాడు. ఒకే క్లబ్ జట్టు తరఫున అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్‌గా 33 ఏళ్ల మెస్సీ గుర్తింపు పొందాడు. ఇప్పటిదాకా 643 గోల్స్‌తో బ్రెజిల్ దిగ్గజం పీలే పేరిట ఉన్న రికార్డును గత ఆదివారం మెస్సీ సమం చేశాడు. పీలే 1957 నుంచి 1974 వరకు బ్రెజిల్‌లోని సాంటోస్ క్లబ్ తరఫున ఆడిన పీలే 643 గోల్స్ సాధించాడు. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన స్పానిష్ లీగ్‌లో రియల్ వాలాడోలిడ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో బార్సిలోనా జట్టు 3–0తో గెలిచింది. ఆట 65వ నిమిషంలో మెస్సీ గోల్ చేసి పీలే రికార్డును అధిగమించాడు. ప్రొఫెషనల్ ఫుట్‌బాల్‌లో మెస్సీ 2004 నుంచి బార్సిలోనా క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. పీలే 643 గోల్స్‌ను 757 మ్యాచ్‌ల్లో చేయగా... మెస్సీ 644 గోల్స్‌ను 749 మ్యాచ్‌ల్లో సాధించాడు. ఈ జాబితాలో గెర్డ్ ముల్లర్ (బయెర్న్ మ్యూనిక్–564 గోల్స్) మూడో స్థానంలో... ఫెర్నాండో పెరోటియో (స్పోర్టింగ్ లిస్బన్–544 గోల్స్) నాలుగో స్థానంలో... జోసెఫ్ బికాన్ (స్లావియా ప్రాగ్–534 గోల్స్) ఐదో స్థానంలో ఉన్నారు. -
బార్సిలోనాతో ముదిరిన మెస్సీ వివాదం
బార్సిలోనా: ‘ఇక జట్టుతో కలిసి ఆడలేను... నన్ను విడుదల చేయండంటూ గత కొన్ని రోజులుగా మొత్తుకుంటూ వస్తోన్న తమ జట్టు ఆటగాడు లియోనెల్ మెస్సీ విషయంలో నిన్నటి దాకా మౌనంగా ఉన్న బార్సిలోనా... తాజాగా నోరు విప్పింది. మెస్సీ జట్టును వీడాలనుకుంటే... ఒప్పందంలో ఉన్న విడుదల షరతు ప్రకారం 700 మిలియన్ యూరోల (దాదాపు రూ. 6 వేల కోట్లు)ను చెల్లించాలంటూ ఆదివారం ఒక ప్రకటనను విడుదల చేసింది. అప్పుడే తాము మెస్సీతో ఉన్న కాంట్రాక్టును రద్దు చేసుకుంటామని బార్సిలోనా స్పష్టం చేసింది. వాస్తవానికి మెస్సీ కాంట్రాక్టు వచ్చే ఏడాదితో ముగుస్తుంది. అయితే ఏడాది ముందుగానే జట్టును వీడాలనుకున్న మెస్సీ... ఆ విషయాన్ని జట్టుకు తెలిపాడు. అందుకు ఒప్పందంలో ఉన్న ‘రద్దు నిబంధన’ను సైతం సూచించాడు. (చదవండి: సంయుక్త విజేతలుగా భారత్, రష్యా) దాని ప్రకారం మెస్సీ... ఒప్పందం గడువు కంటే ముందే జట్టును వీడాలనుకుంటే ఆ విషయాన్ని ఈ ఏడాది జూన్ 10 లోపు బార్సిలోనా యాజమాన్యానికి తెలియజేయాలి. అయితే మెస్సీ ఈ నెలలో జట్టును వీడతానని చెప్పడంతో... రద్దు నిబంధన చెల్లదంటూ బార్సిలోనా పేర్కొంది. అయితే ఈ విషయంలో మెస్సీ లాయర్ల వాదన మరోలా ఉంది. కరోనా వల్ల ‘ల లీగ’ తాజా సీజన్ జూలై వరకు జరగడంతో... ఆగస్టు 31 వరకు రద్దు నిబంధనను ఉపయోగించే వీలు మెస్సీకి ఉందని లాయర్లు పేర్కొంటున్నారు. ఈ వివాదంలో ‘ల లీగ’ బార్సిలోనాకే మద్దతు పలకడం విశేషం. తాజా పరిస్థితుల నేపథ్యంలో బార్సిలోనాను వీడాలనుకుంటున్న మెస్సీకి ఇప్పుడు రెండే దార్లు ఉన్నాయి. అందులో ఒకటి... అతడు 700 మిలియన్ యూరోలను చెల్లించడం... రెండోది అతడి కోసం వేరే జట్టు ఆ మొత్తాన్ని బార్సిలోనాకు చెల్లించడం. 20 ఏళ్లుగా తమకు సేవలు అందించిన మెస్సీ పట్ల బార్సిలోనా ఇంత కఠినంగా వ్యవహరించడం మంచిది కాదంటూ అతడి అభిమానులు పేర్కొంటున్నారు. కరోనా పరీక్షకు మెస్సీ దూరం 2020–21 ‘ల లీగ’ ఫుట్‌బాల్ లీగ్‌లో భాగంగా... బార్సిలోనా జట్టు ప్రీ సీజన్ ట్రయినింగ్ క్యాంపును ఏర్పాటు చేసింది. అందులో భాగంగా తమ ఆటగాళ్లందరికీ కరోనా పరీక్షలు నిర్వహించగా... మెస్సీ మాత్రం అందుకు దూరంగా ఉన్నాడు. అతడు మాత్రమే కరోనా పరీక్ష చేయించుకోలేదని ఆ జట్టు అధికారి ఒకరు తెలిపారు. ఈ క్యాంపు నేటి నుంచి ఆరంభం కానుంది.(చదవండి: హామిల్టన్‌కే టైటిల్) -
అభిమానులకు షాకిచ్చిన మెస్సీ
అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ తన అనూహ్య నిర్ణయంతో ఫుట్‌బాల్ ప్రపంచానికి షాకిచ్చాడు. దాదాపు రెండు దశాబ్దాల పాటు బార్సిలోనా క్లబ్‌కు ఆడిన ఈ ఫుట్‌బాల్ దిగ్గజం.. ఆ జట్టును వీడుతున్నట్లు తెలిపాడు. ఈ విషయాన్ని జట్టు యాజమాన్యం కూడా ధృవీకరించింది. మెస్సీ తన నిర్ణయాన్ని బ్యూరోఫాక్స్ ద్వారా తెలియజేశాడని, వెంటనే బోర్డు మీటింగ్‌కు పిలుపునిచ్చామని తెలిపింది. అయితే 11 రోజుల క్రితం చాంపియన్స్‌లీగ్‌లో ఎదురైన ఘోరపరాజయంతోనే మెస్సీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లీగ్ క్వార్టర్ ఫైనల్లో మెస్సీ నేతృత్వంలోని బార్సీలోనా జట్టు 2-8తో బేర్న్ మునిచ్ చేతిలో చిత్తుగా ఓడింది. ఇది మెస్సీ కెరీర్లోనే అత్యంత ఘోర పరాజయంగా చెప్పొచ్చు. అంతేకాకుండా 2007-08 సీజన్ నుంచి టైటిల్స్ గెలుస్తున్న ఆ జట్టుకు ఇది ఘోరపరాభావం. బార్సిలోనా క్లబ్‌కు మెస్సీ పంపిన పత్రం సీజన్ ముగింపులో క్లబ్ వీడొచ్చనే నిబంధనను పేర్కొన్నాడు. అయితే ఆ రూల్ గడువు జూన్‌లోనే ముగిసిందని, దీనిపై న్యాయ సలహా తీసుకుంటామని క్లబ్ ప్రకటించింది. బార్సిలోనా క్లబ్‌కు చెందిన మాసియా యూత్ అకాడమీలో 2001లో చెరిన మెస్సీ.. 2003లో 16 ఏళ్ల వయసులో క్లబ్ తరఫున అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి బార్సిలోనాకు మొత్తం 34 టైటిళ్లు అందించాడు. లియోనల్ మెస్సీ.. క్లబ్‌లోనే అత్యధిక వ్యక్తిగత రికార్డు ఉన్న ఆటగాడు. క్లబ్ తరపున 731 మ్యాచ్‌లు ఆడి 634 గోల్స్ చేశాడు.(చదవండి : మెస్సీ ఎట్ 700) -
బార్సిలోనా లెజెండ్‌కు కరోనా పాజిటివ్
ప్రముఖ మాజీ ఫుట్ బాల్ క్రీడాకారుడు, పుట్‌బాట్ క్లబ్ బార్సిలోనా లెజెండ్ జేవి హెర్నాండెజ్ కరోనా బారినపడ్డారు. తనకు కోవిడ్-19 పాజిటివ్ వచ్చిందని స్పెయిన్ స్టార్, మాజీ మిడ్ ఫీల్డర్ జేవీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌లో పెట్టారు. అదృష్టవశాత్తూ తాను బాగానే ఉన్నాననీ, కానీ ప్రోటోకాల్ ప్రకారం క్వారంటైన్లో ఉన్నట్టు వెల్లడించారు. ఆరోగ్య పరిస్థితి చక్కబడిన తరువాత, అధికారుల అనుమతితో మాత్రమే తిరిగి తను విధుల్లోకి చేరతానని ఖతార్ స్టార్స్ లీగ్ జట్టు అల్ సాద్ ప్రస్తుత మేనేజర్ జేవీ ప్రకటించారు. తాను కోలుకునేవరకు రిజర్వ్ కోచ్ డేవిడ్ ప్రాట్స్ తన స్థానంలో బాధ్యతలను స్వీకరిస్తారని వెల్లడించారు. కాగా 40 ఏళ్ల అతను తన ఫుట్‌బాల్ ఆట కెరీర్లో చివరి నాలుగు సంవత్సరాలు క్లబ్లో గడిపాడు. అనంతరం బార్సిలోనాను విడిచిపెట్టి 2015లో క్లబ్లో చేరాడు. చాలా పరిణామాల తరువాత ఈ నెల (జూలై 5న) ఖతార్ స్టార్స్ లీగ్ జట్టు మేనేజర్‌గా బాధ్యతలు చేపట్టాడు. 2021జూన్ వరకు ఈ పదవిలో కొనసాగనున్నాడు. ఇంతలోనే ఆయన కరోనా బారిపడటంతో ఈ వారాంతంలో అల్ ఖోర్తో అల్సద్ ఆడనున్న తదుపరి ఆటకు హాజరు కాలేకపోవచ్చని భావిస్తున్నారు. మరోవైపు కోవిడ్-19 మహమ్మారి కారణంగా మార్చిలో ఖతార్ స్టార్స్ లీగ్ (క్యూఎస్ఎల్) శుక్రవారం తిరిగి ప్రారంభమైంది. View this post on Instagram Avui no podré acompanyar el meu equip en la tornada a la competició oficial. David Prats, entrenador del filial de l’@alsaddsc, ocuparà el meu lloc com a cap de l’equip tècnic. Fa uns dies, seguint el protocol de @qsl, vaig donar positiu en l’últim test COVID19. Afortunadament em trobo perfectament, però seguint el protocol, continuaré aïllat fins que ho hagi superat. Quan els serveis mèdics m’ho permetin, m’incorporaré a la meva rutina i feina diàries amb més ganes que mai. Agraeixo a totes les autoritats, especialment als responsables de @qsl, @qfa i d’ @alsaddsc per posar a la nostra disposició tots els mitjans per a una detecció precoç que eviti més contagis i garanteixi el desenvolupament normal de la competició. Una abraçada i ens veiem aviat als camps de futbol! ⚽ _____ Hoy no podré acompañar al equipo en la vuelta a la competición oficial. En mi lugar y a la cabeza del staff técnico estará David Prats - entrenador del equipo filial de @alsaddsc - Hace unos días y siguiendo el protocolo de @qsl di positivo en el último test COVID19 que me realizaron. Afortunadamente me encuentro en perfecto estado pero, siguiendo el protocolo, aislado hasta que lo haya superado. Cuando las autoridades sanitarias me lo permitan, me incorporaré a mi rutina y trabajo diarios con más ganas que nunca. Agradezco a todas las autoridades y en especial a los responsables de @qsl, @qfa y de @alsaddsc el poner a nuestra disposición todos los medios para una detección precoz que evite mayores contagios y garantice un desarrollo normal de la competición. Un abrazo y nos vemos pronto en los campos de fútbol! ⚽️ A post shared by Xavi (@xavi) on Jul 25, 2020 at 2:02am PDT -
అరె.. స్పెడర్ మ్యాన్‌ను మించిపోయాడుగా!
-
అరె.. స్పెడర్ మ్యాన్‌ను మించిపోయాడుగా
బార్సీలోనా : బార్సీలోనా నగరంలో ఒక వ్యక్తి అచ్చం స్పైడర్ మ్యాన్‌ను తలపించేలా 145 మీటర్ల (475 అడుగులు) ఎత్తులో ఉన్న భవనాన్ని కేవలం 25 నిమిషాల్లోనే అవలీలగా ఎక్కేశాడు.చూసినవారంతా అతని సాహసానికి మెచ్చుకోవడం జరిగింది. అయితే ఇదంతా సినిమా షూటింగ్ అనుకుంటే మాత్రం మీరు పొరబడినట్లే. ప్రసుత్తం కరోనా వైరస్ ప్రపంచదేశాల్ని గడగడలాడిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ కంటే అది ఎక్కడ వస్తుందేమోనన్న భయమే జనాల్లో ఎక్కువయిపోయింది. జనాల్లో ఆ భయాన్ని వదిలించాలంటే ఏదైనా సాహసం చేయాలని బార్సిలోనాకు చెందిన 57 ఏళ్ల అలేన్ రాబర్ట్ అనుకున్నాడు. అందుకు స్పెడర్ మ్యాన్‌లాగా ఎత్తైన భవనాన్ని ఎక్కి ప్రజల్లో భయాన్ని వదిలించాలని భావించాడు. అందుకు బార్సీలోనాలో దాదాపు 475 అడుగుల ఎత్తులో ఉన్న టోర్ అగ్బర్ ఆఫీస్ భవనాన్ని ఎంచుకున్నాడు. అందరూ చూస్తుండగానే భవనం మొత్తం ఎక్కడానికి 25 నిమిషాలు, మళ్లీ కిందకు దిగడానికి 23 నిమిషాలు తీసుకున్నాడు. అతని సాహసాన్ని చూసిన ప్రతీ ఒక్కరూ.. భయం అనేది లేకుండా ఎలా ఎక్కుతున్నాడని తదేకంగా చూస్తు ఉండిపోయారు. రాబర్ట్ కిందకు వచ్చిన తర్వాత పోలీసులు అరెస్టు చేసినా అతని సాహసాన్ని మాత్రం అందరూ మెచ్చుకున్నారు.(ఆ ఇద్దరికి కరోనా లేదు : మంత్రి ఈటల) ఇదే విషయమై అలేన్ రాబర్ట్ మాట్లాడుతూ.. 'ప్రసుత్తం ప్రజలందరూ కరోనా వైరస్‌ను ఒక భూతంలా చూస్తున్నారు. దాదాపు 300 కోట్ల మంది కరోనా వైరస్‌కు భయపడుతున్నారు. నా దృష్టిలో కరోనా అనేది వారికి భయం రూపంలో కనిపిస్తుంది. వారి భయాన్ని కొంతైనా పోగొట్టాలనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నా. నిజానికి నాకు ఆ భవనాన్ని ఎక్కేటప్పుడు చాలా భయమనిపించింది. కానీ నేను ముందు భయాన్ని వదిలేసాను.. దాంతో నాకు భవనం ఎక్కడం పెద్ద కష్టమనిపించలేదు. ఇప్పుడు కరోనా పట్ల కూడా ప్రజలు అలానే ఉన్నారు. వారిలో భయాన్ని పోగొట్టాలనేది నా ద్యేయం.. ' అని చెప్పుకొచ్చాడు. (కరోనా దెబ్బకు కుప్పకూలిన ‘ఫ్లైబీ’) అలేన్ రాబర్ట్ అంత ఎత్తున్న భవనాలను ఎక్కేందుకు చేతిలో చాక్ పౌడర్, క్లైంబింగ్ షూస్ మాత్రమే వాడుతుంటాడు. ఇప్పటివరకు రాబర్ట్ అలేన్ 100 రకాల ఎత్తైన బిల్డింగ్‌లను అవలీలగా ఎక్కేశాడు. అందులో దుబాయ్‌లోని బూర్జు ఖలీఫా, మలేషియాలోని పెట్రోనాస్ ట్విన్ టవర్స్, సిడ్నీ ఒపెరా హౌస్ వంటివి ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 3200 మంది కరోనా బారీన పడి మృతి చెందగా, 90వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. -
సైనాకు చుక్కెదురు
బార్సిలోనా: బార్సిలోనా స్పెయిన్ మాస్టర్స్ టోర్నమెంట్లో భారత షట్లర్ సైనా నెహ్వాల్‌కు చుక్కెదురైంది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ సైనా 20–22, 19–21తో బుసానన్ ఒంగ్బామ్రుంగ్ఫాన్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడి ఇంటిదారి పట్టింది. పురుషుల విభాగంలో మాత్రం అజయ్ జయరామ్ (భారత్) సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. క్వార్టర్స్ పోరులో అతను 21–14, 21–15తో థామస్ రౌజెల్ (ఫ్రాన్స్)పై గెలుపొందాడు. మరో మ్యాచ్‌లో సమీర్ వర్మ (భారత్) 21–17, 17–21, 12–21తో కున్లావుట్ విటిడ్సర్న్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడాడు. -
ప్రణవ్–కృష్ణ ప్రసాద్ జంట పరాజయం
బార్సిలోనా (స్పెయిన్): బార్సిలోనా స్పెయిన్ మాస్టర్స్ వరల్డ్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల డబుల్స్ విభాగంలో ప్రణవ్ చోప్రా–గారగ కృష్ణ ప్రసాద్ (భారత్) జంట తొలి రౌండ్లోనే ఓటమి చవిచూసింది. మంగళవారం జరిగిన మొదటి రౌండ్ మ్యాచ్‌లో ప్రణవ్–కృష్ణ ప్రసాద్ ద్వయం 21–19, 16–21, 7–21తో బెన్ లేన్–సీన్ వెండీ (ఇంగ్లండ్) జోడీ చేతిలో పరాజయం పాలైంది. నేడు జరిగే పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో డారెన్ లియు (మలేసియా)తో హెచ్ఎస్ ప్రణయ్; వైగోర్ కోల్హో (బ్రెజిల్)తో పారుపల్లి కశ్యప్; క్రిస్టో పొపోవ్ (ఫ్రాన్స్)తో అజయ్ జయరామ్; శుభాంకర్ డేతో కిడాంబి శ్రీకాంత్; లుకాస్ క్లియర్‌బౌట్ (ఫ్రాన్స్)తో సమీర్ వర్మ తలపడతారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో వైవోని లీ (జర్మనీ)తో సైనా నెహ్వాల్ ఆడుతుంది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో మథియాస్ క్రిస్టియాన్సెన్–అలెగ్జాండ్రా బోయె (డెన్మార్క్) జోడీని సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా జంట ‘ఢీ’కొంటుంది. -
ప్రపంచ మొబైల్ కాంగ్రెస్‌కు అమెజాన్ ‘నో’
న్యూఢిల్లీ : స్పెయిన్‌లోని బార్సిలోనాలో ఫిబ్రవరి 24వ తేదీ నుంచి 28వ తేదీ వరకు కొనసాగనున్న ‘మొబైల్ వరల్డ్ కాంగ్రెస్–2020’ నుంచి తప్పుకుంటున్నట్లు తాజాగా అమెరికా దిగ్గజ ఆన్‌లైన సంస్థ అమెజాన్, జపాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్ సంస్థలు తాజాగా సోమవారం ప్రకటించాయి. ఇప్పటికే ఈ కాంగ్రెస్‌కు హాజరు కావడం లేదని దక్షిణ కొరియాకు చెందిన ఎల్జీ ఎలక్ట్రానిక్స్, స్విడ్జర్లాండ్‌కు చెందిన ఎరిక్సన్, అమెరికాకు చెందిన చిప్ కంపెనీ ఎన్వీడియా కంపెనీలు ఇదిరవరకే ప్రకటించాయి. అందరి భయం ఒక్కటే. కరోనా వైరస్. ఇప్పటికే స్పెయిన్‌లో నలుగురికి ఈ వైరస్ సోకినట్లు నిర్ధారించారు. ఈ వైరస్ వెలుగులోకి వచ్చిన చైనాలో వుహాన్ పట్టణంలో ఎక్కువ మంది స్పెయిన్ ప్రజలు ఉండడం, వైరస్ గురించి తెలియగానే వారంతా స్పెయిన్ వచ్చేయడంతో ప్రపంచ దిగ్గజ కంపెనీలు కూడా అక్కడికి వెళ్లేందుకు భయపడుతున్నాయి. ప్రపంచ మొబైల్ సమ్మేళనం నిర్వాహకులు వుహాన్ రాజధానిగా ఉన్న చైనాలోని హుబీ రాష్ట్రం నుంచి ఏ కంపెనీ కూడా సమ్మేళనంకు రాకుండా ముందుగానే నిషేధం విధించింది. ఐదు దిగ్జజ కంపెనీలు సమ్మేళనంకు రాకపోయినా తాము మాత్రం సమ్మేళనాన్ని కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు. -
34వ హ్యాట్రిక్‌తో అరుదైన ఘనత
మాడ్రిడ్: అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ అరుదైన మైలురాయిని సాధించాడు. ప్రతిష్టాత్మక స్పెయినీష్ లీగ్ లాలీగా టోర్నమెంట్లో భాగంగా సెల్టా విగోతో జరిగిన మ్యాచ్‌లో బార్సిలోనా తరఫున ఆడుతున్న మెస్సీ హ్యాట్రిక్ గోల్స్‌తో అదరగొట్టాడు. ఫలితంగా బార్సిలోనా 4-1 తేడాతో సెల్టా విగోపై విజయం సాధించి పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచింది. కాగా, ఈ మ్యాచ్‌లో మెస్సీ హ్యాట్రిక్ గోల్స్ సాధించడంతో పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో సరసన నిలిచాడు. ఓవరాల్ లా లీగా టోర్నమెంట్లో అత్యధికంగా హ్యాట్రిక్ గోల్స్ సాధించిన జాబితాలో ఇప్పటివరకూ రొనాల్డ్ ఉండగా, ఇప్పుడు మెస్సీ కూడా చేరిపోయాడు. లాలీగా టోర్నీలో మెస్సీకి ఇది 34వ హ్యాట్రిక్. తొలి అర్థభాగంలో ఫ్రీకిక్ ద్వారా గోల్ సాధించిన మెస్సీ.. రెండో అర్థ భాగంలో మరో రెండు గోల్స్ సాధించి హ్యాట్రిక్ గోల్స్ ఘనతను ఖాతాలో వేసుకున్నాడు. ఇక గేమ్ చివర్లో సెర్గియో బస్య్కూట్ గోల్ సాధించడంతో బార్సిలోనా ఘన విజయం సాధించింది. కాగా, చివరి మూడు గేమ్‌ల్లో బార్సిలోనాకు ఇది తొలి విజయం. -
బార్సిలోనా భగ్గుమంటోంది..
బార్సిలోనా భగ్గుమంటోంది. కటాలోనియా వేర్పాటు వాదులకు జైలు శిక్ష విధించడాన్ని నిరసిస్తూ గత ఐదు రోజులుగా కొనసాగుతున్న ఆందోళన శుక్రవారం కాస్త ప్రజ్వరిల్లింది. ముసుగులు ధరించిన యువతీ యువకులు వీధుల్లోకి వచ్చి రోడ్లపైన అగ్గిని రాజేసి అగ్ని కీలలను సష్టించారు. చెత్తా చెదారాన్ని మండే వస్తువులను పోగేసి తగులబెట్టారు. కొన్ని చోట్ల స్పానిష్ పోలీసులతో వీధి పోరాటాలకు కూడా దిగారు. కటాలోనియా స్వాతంత్య్రాన్ని కోరుతూ నినాదాలు చేశారు. కటాలోనియాలో గత ఐదు రోజులుగా దాదాపు 50 లక్షల మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి ఇలా ఆందోళన నిర్వహిస్తున్నారు. 2017లో స్వతంత్య్ర రిఫరెండమ్‌ను ప్రకటించినందుకు తొమ్మిది మంది కటాలోనియా వేర్పాటు వాదులకు స్పానిష్ సుప్రీం కోర్టు గత సోమవారం జైలు శిక్ష విధించింది. ఈ శిక్షలను వ్యతిరేకిస్తూ ప్రజలు ఆ రోజు నుంచి ఆందోళనలకు దిగారు. గతంలో జమ్మూ కశ్మీర్‌కు ఉన్నట్లుగానే కొంత స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రాంతం కటాలోనియా. స్పానిష్ ఆధీనంలో ఉన్న ఈ ప్రాంతంలో దాదాపు 75 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. వారు సుదీర్ఘకాలంగా స్వానిష్ నుంచి సంపూర్ణ స్వాతంత్య్రాన్ని కోరుకుంటున్నారు.