నెయ్మార్కు ఊరట | Spanish court drops fraud investigation against Neymar | Sakshi
Sakshi News home page

నెయ్మార్కు ఊరట

Published Fri, Jul 8 2016 8:12 PM | Last Updated on Mon, Sep 4 2017 4:25 AM

నెయ్మార్కు ఊరట

నెయ్మార్కు ఊరట

మాడ్రిడ్: అవినీతి, చీటింగ్ కేసుల్లో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రెజిల్ సాకర్ కెప్టెన్, బార్సిలోనా స్ట్రైకర్ నెయ్మార్కు ఊరట లభించింది. నెయమార్ పై వచ్చిన ఆరోపణల్ని మాడ్రిడ్ కోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. అతను ఏ విధమైన నేరపూరిత చర్యకు పాల్పడలేదంటూ కోర్టు పేర్కొంది. దీంతోపాటు అతని తండ్రి, ఏజెంట్లపై మోపబడిన అభియోగాల్ని కూడా కోర్టు కొట్టివేసింది. ఒకవేళ నెయమార్ క్రీడాపరమైన నిబంధల్ని ఉల్లంఘించాడని భావిస్తే ఆ పరిధిలోనే తేల్చుకోవాలని సాంటోస్ కు స్పష్టం చేసింది.


2013లో  బ్రెజిలియన్ క్లబ్ సాంటోస్ నుంచి స్పానిష్ క్లబ్ బార్సిలోనా జట్టుకు నెయ్మర్ మారాడు. దీనిలో భాగంగా బార్సిలోనా, సాంటోస్ జట్లకు నెయమార్ ఒప్పందం విషయంలో వివాదాలు తలెత్తాయి. దీనిపై 'డీఐఎస్' కంపెనీ ఇందుకు సంబంధించి దావా వేసింది. నేయ్మర్ కు చెల్లిస్తున్న దాదాపు 620 కోట్ల రూపాయల్లో డీఐఎస్ సంస్థకు 40 శాతం బార్సిలోనా క్లబ్ నుంచి చట్టపరంగా రావాల్సి ఉందని దావాలో పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement