
లైంగిక వేధింపుల కేసులో స్టార్ ఫుట్‌బాలర్‌కు జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించింది స్పానిష్ కోర్టు. ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన కేసులో బ్రెజిల్ మాజీ ఫుట్‌బాలర్ డానీ అల్వెస్‌కు (40) నాలుగున్నర సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ. 13 కోట్ల జరిమానా విధించింది స్పెయిన్‌లోని బార్సిలోనా కోర్టు.
2022 డిసెంబర్ 31న అల్వెస్.. సదరు మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో (నైట్ క్లబ్‌లో) పాటు అనుమతి లేకుండా లైంగిక చర్యకు పాల్పడ్డాడని రుజువు కావడంతో కోర్టు ఈ తీర్పునిచ్చింది. ఈ కేసులో అల్విస్‌ను ఈ ఏడాది జనవరి 20న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అప్పటినుంచి అతను రిమాండ్‌లోనే ఉన్నాడు. అల్విస్ బెయిల్ ప్రయత్నాలను కోర్టు తిరస్కరించింది. తాను నిరపరాధినన్న వాదనను కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో అల్వెస్ భార్య స్టేట్‌మెంట్‌ను కూడా కోర్టు పట్టించుకోలేదు.
అల్వెస్ ఫుట్‌బాల్ కెరీర్ విషయానికొస్తే.. 2006 నుంచి 2022 వరకు బ్రెజిల్ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన అల్వెస్.. 126 మ్యాచ్‌లు ఆడి 8 గోల్స్ చేశాడు. అల్వెస్.. రైట్ బ్యాక్ స్థానంలో ఆడతాడు. ఇతను వివిధ సమయాల్లో బార్సిలోనా, పీఎస్‌జీ, జువెంటస్, సాపాలో క్లబ్‌ల తరఫున ఆడాడు. అల్వెస్.. 2022 ఫిఫా వరల్డ్‌కప్‌లో చివరిసారిగా బ్రెజిల్‌కు ప్రాతినిథ్యం వహించాడు.