Star footballer
-
లైంగిక వేధింపుల కేసులో స్టార్ ఫుట్‌బాలర్‌కు జైలు శిక్ష.. భారీ జరిమానా
లైంగిక వేధింపుల కేసులో స్టార్ ఫుట్‌బాలర్‌కు జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించింది స్పానిష్ కోర్టు. ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన కేసులో బ్రెజిల్ మాజీ ఫుట్‌బాలర్ డానీ అల్వెస్‌కు (40) నాలుగున్నర సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ. 13 కోట్ల జరిమానా విధించింది స్పెయిన్‌లోని బార్సిలోనా కోర్టు. 2022 డిసెంబర్ 31న అల్వెస్.. సదరు మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో (నైట్ క్లబ్లో) పాటు అనుమతి లేకుండా లైంగిక చర్యకు పాల్పడ్డాడని రుజువు కావడంతో కోర్టు ఈ తీర్పునిచ్చింది. ఈ కేసులో అల్విస్ను ఈ ఏడాది జనవరి 20న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటినుంచి అతను రిమాండ్‌లోనే ఉన్నాడు. అల్విస్ బెయిల్ ప్రయత్నాలను కోర్టు తిరస్కరించింది. తాను నిరపరాధినన్న వాదనను కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో అల్వెస్ భార్య స్టేట్మెంట్ను కూడా కోర్టు పట్టించుకోలేదు. అల్వెస్ ఫుట్‌బాల్ కెరీర్ విషయానికొస్తే.. 2006 నుంచి 2022 వరకు బ్రెజిల్ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన అల్వెస్.. 126 మ్యాచ్‌లు ఆడి 8 గోల్స్ చేశాడు. అల్వెస్.. రైట్ బ్యాక్ స్థానంలో ఆడతాడు. ఇతను వివిధ సమయాల్లో బార్సిలోనా, పీఎస్జీ, జువెంటస్, సాపాలో క్లబ్‌ల తరఫున ఆడాడు. అల్వెస్.. 2022 ఫిఫా వరల్డ్‌కప్‌లో చివరిసారిగా బ్రెజిల్‌కు ప్రాతినిథ్యం వహించాడు. -
పరిచయం లేని యువతికి ముద్దులు.. పరువు తీసుకున్న ఫుట్‌బాలర్
మాంచెస్టర్ సిటీ ఫుట్‌బాలర్ కైల్ వాకర్ తన అసభ్య ప్రవర్తనతో వార్తల్లో నిలిచాడు. తాగిన మత్తులో పరిచయం లేని యువతిని ముద్దులతో ముంచెత్తడమే గాక ఆమెను తన కౌగిలిలో బంధించి ఇబ్బంది పెట్టాడు. ఈ తతంగం అంతా సీసీటీవీ ఫుటేజీలో రికార్డవడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే ఆదివారం మాంచెస్టర్ సిటీ, న్యూ కాసిల్ మధ్య ప్రీమియర్ లీగ్ మ్యాచ్ జరిగింది. మ్యాచ్‌లో మాంచెస్టర్ సిటీ 2-0 తేడాతో న్యూ కాసిల్‌ను ఓడించింది. మ్యాచ్ ముగిసిన అనంతరం కైల్ వాకర్ తన స్నేహితులతో కలిసి మాంచెస్టర్ బార్‌కు వెళ్లాడు. ఫూటుగా మద్యం తాగిన కైల్ వాకర్.. తన పక్కనే ఉన్న ఇద్దరు యువతులో మాట్లాడాడు. అయితే కాసేపటికే మద్యం మత్తులో ఇద్దరిలో ఒక యువతిని దగ్గరికి తీసుకొని ముద్దుల్లో ముంచెత్తాడు. ఆ తర్వాత ఆమెను తన చేతులతో దగ్గరికి తీసుకొని తాకరాని చోట తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. సదరు యువతి కూడా మద్యం మత్తులో ఉండడంతో ఆమె కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఇదంతా సీసీటీవీలో రికార్డు కావడంతో బార్ యాజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న చెషైర్ పోలీసులు బార్‌కు వచ్చి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఆ తర్వాత కైల్ వాకర్‌ను పిలిచి విచారణ జరిపారు. సదరు యువతిని కూడా విచారించగా.. ఆమె మాట్లాడుతూ ''మద్యం మత్తులో ఇలా జరిగి ఉంటుంది.. అతను అలా చేస్తున్నప్పుడు నేను కూడా మద్యం మత్తులో ఉన్నా.. అందుకే ఏమి చేయలేకపోయా.. అతను నన్ను బలవంతం చేయలేదు'' అని పేర్కొంది. కైల్ వాకర్‌పై ఎలాంటి ఫిర్యాదు రాకపోవడంతో అతన్ని అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు. కేవలం వార్నింగ్‌తో సరిపెట్టామని.. కైల్ వాకర్ ప్రవర్తనకు సంబంధించిన వీడియోనూ మాంచెస్టర్ సిటీ ఫ్రాంచైజీకి అందించినట్లు తెలిపింది. మొత్తానికి మద్యం మత్తులో అసభ్యంగా ప్రవర్తించి అనవసరంగా పరువు తీసుకున్నాడంటూ అభిమానులు కామెంట్స్ చేశారు. [🎥] Video of the Kyle Walker alleged incident. #ManCity [@SunSport] pic.twitter.com/dzifyi0aW9 — City Zone (@City_Zone_) March 8, 2023 చదవండి: ఆసక్తికర పోస్ట్.. ఎవరిని టార్గెట్ చేశాడు? Pele: ఆస్తుల పంపకం.. 30 శాతం మూడో భార్యకు; 70 శాతం పిల్లలకు -
ఫ్రాన్స్ స్టార్ ఎంబాపె కొత్త చరిత్ర..
ఫ్రాన్స్ ఫుట్‌బాల్ సంచలనం కైలియన్ ఎంబాపె చరిత్ర సృష్టించాడు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పారిస్-సెయింట్ జెర్మెన్(పీఎస్జీ) జట్టు తరపున ఆల్‌టైమ్ లీడింగ్ గోల్ స్కోరర్‌గా నిలిచాడు. శనివారం అర్థరాత్రి నాంటెస్ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎంబాపె ఈ ఫీట్ నమోదు చేశాడు. ఆట (90+2వ నిమిషం) అదనపు సమయంలో గోల్ కొట్టిన ఎంబాపెకు ఇది 201వ గోల్ కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఎంబాపె పీఎస్జీ తరపున అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాడిగా రికార్డులెక్కాడు. ఈ క్రమంలో ఇప్పటివరకు పీఎస్జీ తరపున 200 గోల్స్‌తో అగ్రస్థానంలో ఉన్న ఎడిసన్ కవానీని వెనక్కి నెట్టిన ఎంబాపె తొలిస్థానాన్ని అధిరోహించాడు. ఎడిసన్ కవానీ 2013 నుంచి 2022 వరకు పీఎస్జీ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇక ఎంబాపె అనగానే ముందుగా గుర్తుకువచ్చేది గతేడాది డిసెంబర్లో జరిగిన ఫిఫా వరల్డ్‌కప్ 2022. అర్జెంటీనాతో జరిగిన ఫైనల్లో హ్యాట్రిక్ గోల్స్‌తో మెరిసిన ఎంబాపె ప్రత్యర్థి జట్టుకు ముచ్చెమటలు పట్టించాడు. ఒకానొక దశలో ఫ్రాన్స్‌ను గెలుపు తీరాలకు చేర్చినప్పటికి అదనపు సమయంలో మ్యాచ్ డ్రాగా ముగియడం.. పెనాల్టీ షూటౌట్లో మెస్సీ సేన విజయం సాధించడం జరిగిపోయింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే పారిస్-సెయింట్ జెర్మెన్(పీఎస్జీ) నాంటెస్ క్లబ్‌పై 4-2 తేడాతో విజయం సాధించింది. పీఎస్జీ తరపున మెస్సీ(12వ నిమిషం), జావెన్ హజమ్(17వ నిమిషం), డానిల్లో పెరీరా(60వ నిమిషం), కైలియన్ ఎంబాపె(90+2 వ నిమిషం)లో గోల్స్ చేయగా.. నాంటెస్ క్లబ్ తరపున లుడోవిక్ బ్లాస్(31వ నిమిషం), ఇగ్నాషియస్ గాంగో(38వ నిమిషం) గోల్స్ చేశారు. An evening for the history books! ✨❤️💙#𝐊EEP𝐌AKINGHIS𝟕ORY pic.twitter.com/eu664c1Bk0 — Paris Saint-Germain (@PSG_English) March 5, 2023 -
టర్కీ భూకంపం.. శిథిలాల కింద స్టార్ ఫుట్‌బాలర్
టర్కీ, సిరియా దేశాల్లో సంభవించిన భూకంపం ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. పావుగంట వ్యవధిలో రెండుసార్లు భూమి కంపించడంతో వేలాది మంది శిథిలాల కింద చిక్కుకొని ప్రాణాలు వదిలారు. తాజా సమాచారం ప్రకారం.. 4800కు పైగా మృతదేహాలను శిథిలాల నుంచి రెస్క్యూ టీంలు వెలికి తీశాయి. వందల సంఖ్యలో భారీ బిల్డింగ్లు కూలిపోవడం, అర్ధరాత్రి కావడంతో గాఢనిద్రలో ఉండడంతో ప్రజలు బయటకు పరుగులు తీసేందుకు కూడా వీల్లేకుండా పోయింది. వేలాది మంది ఇంకా శిథిలాలే కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది.టర్కీ, సిరియాలో ఎంతెంత మంది మరణించారనే సమాచారంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఘనా స్టార్ ఫుట్‌బాల్ క్రిస్టియన్ అట్సు ప్రాణాలతో భయటపడ్డాడు. ప్రస్తుతం అతను టర్కీష్ సూపర్ క్లబ్ హట్సేపోర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. భూకంపం సంభవించిన సమయంలో క్రిస్టియన్ అట్సు సదరన్ ప్రావిన్స్ ఆఫ్ హటే ప్రాంతంలో శిథిలాల కింద చిక్కుకున్నాడు. అయితే దేవుని దయవల్ల అతనికి ఏం జరగలేదు. రెస్క్యూ టీమ్ వచ్చి అట్సూను శిథిలాల నుంచి బయటికి తీసి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం బాగానే ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ఘనాకు చెందిన రేడియో కమ్యూనికేషన్ స్టేషన్ మార్నింగ్ బులెటిన్‌లో వెల్లడించింది. ''మీకొక గుడ్‌న్యూస్. మాకు అందిన సమాచారం ప్రకారం ఘనా స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియన్ అట్సూ ప్రాణాలతో బయటపడ్డాడు. భూకంపం సంభవించిన టర్కీలోని సదరన్ ప్రావిన్స్ ఆఫ్ హటేలో అతను ఉంటున్న బిల్డింగ్ కూలింది. దీంతో శిథిలాల కింద చిక్కుకున్నాడు. రెస్క్యూ సిబ్బంది అతన్ని రక్షించారు.'' అంటూ పోస్ట్ చేసింది. ఇక అట్సు చెల్సియా ఫుట్‌బాల్ క్లబ్‌కు కూడా గతంలో ప్రాతినిధ్యం వహించాడు. న్యూక్యాసిల్కు ఐదేళ్ల పాటు ఆడిన క్రిస్టియన్ అట్సు 2021లో సౌదీ అరేబియా క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇటీవలే టర్కీష్ ఫుట్‌బాల్ క్లబ్‌కు మారాడు. ఇక ఘనా తరపున 65 మ్యాచ్‌లాడిన అట్సూ 9 గోల్స్ చేశాడు. Update: We've received some positive news that Christian Atsu has been successfully rescued from the rubble of the collapsed building and is receiving treatment. Let’s continue to pray for Christian🙏🏽 — Ghana Football Association (@ghanafaofficial) February 7, 2023 చదవండి: ఎటు చూసినా గుండె పగిలే దృశ్యాలు -
Ballon D'Or: 1998లో జిదానే.. ఇప్పుడు కరీమ్ బెంజెమా
ఫుట్‌బాల్ స్టార్ కరీమ్ బెంజెమా పురుషుల విభాగంలో ప్రతిష్టాత్మక బాలన్ డీ ఓర్ అవార్డును గెలుచుకున్నాడు. భారత కాలమాన ప్రకారం సోమవారం అర్థరాత్రి పారిస్ వేదికగా జరిగిన వేడుకలో బెంజెమా ఈ అవార్డు అందున్నాడు. 1998లో ఫ్రాన్స్ ఫుట్‌బాల్ దిగ్గజం జినదిన్ జిదానే బాలన్ డీ ఓర్ అవార్డును అందుకోగా.. ఆ తర్వాత ఈ అవార్డు అందుకున్న రెండో ఫ్రాన్స్ ఫుట్‌బాలర్‌గా కరీమ్ బెంజెమా రికార్డులకెక్కాడు. ఈ ఏడాది రియల్ మాడ్రిడ్ తరపున అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన బెంజెమాకు అవార్డు రావడం అతని అభిమానులను సంతోషంలో ముంచెత్తింది. ఈ ఏడాది మాడ్రిడ్ తరపున 46 మ్యాచ్‌ల్లో 44 గోల్స్ స్కోర్ చేశాడు. ఇందులో 15 గోల్స్ చాంపియన్స్ లీగ్‌లో చేయడం విశేషం. అంతేకాదు రియల్ మాడ్రిడ్ చాంపియన్స్ లీగ్, లాలిగా టైటిల్స్ గెలవడంలో బెంజెమా కీలకపాత్ర పోషించాడు. ఇక చాంపియన్స్ లీగ్‌లో భాగంగా రౌండ్ ఆఫ్ 16లో పారిస్ సెయింట్ జర్మన్‌తో జరిగిన మ్యాచ్‌లో 17 నిమిషాల వ్యవధిలో హ్యాట్రిక్ గోల్స్‌తో మెరిశాడు. అవార్డు అందుకోవడంపై బెంజెమా స్పందించాడు. ''బాలన్ డీ ఓర్ అవార్డు రావడం గర్వకారణం. అవార్డు అందుకోవడానికి అన్ని విధాలుగా కష్టపడ్డాను.. ఎప్పుడు ఓడిపోవడానికి సిద్ధపడలేదు. నా జీవితంలో ఇద్దరు రోల్ మోడల్స్ ఉన్నారు. ఒకరు జినదిన్ జిదానే.. మరొకరు రొనాల్డో. వారి ప్రభావం నాపై స్పష్టంగా ఉంది. ఫ్రాన్స్ జట్టుకు లేని సందర్భాల్లో చాలా కష్టపడాల్సి వచ్చింది. ఫుట్‌బాల్‌ను మాత్రం ఎంజాయ్ చేస్తూనే ఉంటాను. ఈ అవార్డు రావడం వెనుకు ఎంతో కష్టం ఉంది. అందుకు గర్వంగా ఉంది.'' అంటూ ముగించాడు. ఇక మహిళల విభాగంలో బార్సిలోనాకు ఆడుతున్న అలెక్సియా పుటెల్లాస్ వరుసగా రెండోసారి అవార్డును నిలబెట్టుకుంది. ఇక కోపా అవార్డును బార్సిలోనాకు చెందిన బార్సిలోనాకు చెందిన గవి సొంతం చేసుకున్నాడు. గెర్డ్ ముల్లర్ అవార్డును బార్సిలోనాకు ఆడుతున్న రాబర్ట్ లెవాన్‌డోస్కీ కైవసం చేసుకోగా.. రియల్ మాడ్రిడ్‌కు చెందిన తిబుట్ కోర్టొయిస్ను యషిన్ ట్రోఫీ.. సోక్రెట్స్ అవార్డును సాడియో మానీ(లివర్‌పూల్) సొంతం చేసుకున్నారు. ఇక క్లబ్ ఆఫ్ ది ఇయర్ అవార్డును మాంచెస్టర్ సిటీ గెలుచుకుంది. 🏅 ¡ENHORABUENA, @Benzema! 🏅#ballondor pic.twitter.com/2RuoJE3ZN5 — Real Madrid C.F. (@realmadrid) October 17, 2022 -
గర్ల్‌ఫ్రెండ్ నుంచి ఖరీదైన గిఫ్ట్ అందుకున్న స్టార్ ఫుట్‌బాలర్
పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో తన గర్ల్‌ఫ్రెండ్ నుంచి ఖరీదైన గిఫ్ట్‌ను బహుమతిగా అందుకున్నాడు. ఫిబ్రవరి 5న రొనాల్డో పుట్టినరోజు పురస్కరించుకొని రొనాల్డో గర్ల్‌ఫ్రెండ్ జార్జినా రోడ్రిగేజ్ రూ.1.2 కోట్ల విలువైన బ్లాక్ కాడిల్లాక్ ఎస్యూవీ మోడల్ కారును గిఫ్ట్‌గా అందించింది. గర్ల్‌ఫ్రెండ్ కారు ఇచ్చిన మరుక్షణమే రొనాల్డో అదే కారులో మాంచెస్టర్ యునైటెడ్ గ్రౌండ్‌కు వెళ్లాడు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియోనూ జార్జినా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. నా జీవితంలో ముఖ్యమైన వ్యక్తి 37వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. కార్లంటే పిచ్చి ఉన్న వ్యక్తికి ఒక మంచి గిఫ్ట్‌ను ఇవ్వడం సంతోషం కలిగించింది. నాకు ఒక మంచి భర్తను.. పిల్లలకు మంచి తండ్రిని రొనాల్డో రూపంలో అందించినందుకు దేవుడికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు. రొనాల్డోను మించిన పర్ఫెక్షనిస్ట్ మరొకరు లేరు. తనే నాకు ఆదర్శం అంటూ ఎమెషనల్‌గా రాసుకొచ్చింది. కాగా సోషల్ మీడియా యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో రొనాల్డో ఫాలోవర్ల సంఖ్య 400 మిలియన్ల మార్క్‌ను టచ్ చేసిన సంగతి తెలిసిందే. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన తొలి వ్యక్తిగా రొనాల్డో రికార్డులెక్కాడు. చదవండి: Cristiano Ronaldo: రొనాల్డో అరుదైన ఘనత.. సోషల్ మీడియాను వదల్లేదు View this post on Instagram A post shared by Georgina Rodríguez (@georginagio) -
వేల్స్ వండర్
యూరోలో సెమీస్‌కి... క్వార్టర్స్‌లో 3-1తో బెల్జియంపై విజయం యూరో కప్ అరంగేట్రంలోనే వేల్స్ జట్టు అనూహ్య రీతిలో అదరగొడుతోంది. ఇప్పటిదాకా తాము సాధించిన విజయాలు గాలివాటం కాదని నిరూపిస్తూ ఏకంగా ప్రపంచ రెండో ర్యాంకర్ బెల్జియంను క్వార్టర్స్‌లోనే ఇంటిముఖం పట్టించింది. స్టార్ ఫుట్‌బాలర్ గ్యారెత్ బేల్ మెరుపులు మెరిపించకున్నా సమష్టి ఆటతీరుతో అన్ని విభాగాల్లో రాణించిన వేల్స్ సగర్వంగా సెమీఫైనల్లోకి ప్రవేశించి కొత్త చరిత్రను సృష్టించుకుంది. లిల్లే: ఓ పెద్ద టోర్నీలో 58 ఏళ్ల తర్వాత ఆడుతున్న వేల్స్ జట్టు ఎవరి అంచనాలకూ అందని రీతిలో యూరో కప్ సెమీఫైనల్లో ప్రవేశించింది. మిడ్‌ఫీల్డర్ హల్ రాబ్సన్ కను కళ్లుచెదిరే గోల్ సహా యంతో శుక్రవారం జరిగిన క్వార్టర్ఫైనల్లో ఫేవరెట్ బెల్జియంపై 3-1తో వేల్స్ నెగ్గింది. వేల్స్ నుంచి అష్లే విలియమ్స్ (31వ నిమిషంలో), రాబ్సన్ (55), వోక్స్ (86) గోల్స్ చేయగా బెల్జియం నుంచి రడ్జా నైన్గోలన్ (13) ఏకైక గోల్ సాధించాడు. 2014 ప్రపంచకప్‌లోనూ బెల్జియం క్వార్టర్స్‌లోనే వెనుదిరిగింది. ఈనెల 6న పోర్చుగల్‌తో జరిగే సెమీఫైనల్లో వేల్స్ తలపడుతుంది. తమ సరిహద్దుకు కేవలం వంద కి.మీ దూరంలోనే ఉన్న ఈ స్టేడియంలో మ్యాచ్‌ను తిలకించేందుకు బెల్జియం నుంచి ఏకంగా లక్షా 50 వేల మంది లిల్లే నగరానికి వచ్చారు. స్టేడియంలో మెజారిటీ అభిమానుల మద్దతుతో ఆరంభంలో బెల్జియం చెలరేగి ఆడింది. మ్యాచ్ తొలి 20 నిమిషాలు బెల్జియందే హవా నడిచింది. ఈ సమయంలో థామస్ మునియర్, యానిక్ కరాస్కో, ఈడెన్ హజార్డ్ గోల్స్ ప్రయత్నాలు తృటిలో తప్పాయి. అయితే 13వ నిమిషంలో హజార్డ్ ఇచ్చిన పాస్‌ను అందుకున్న రడ్జా 30 గజాల దూరం నుంచి టాప్ లెఫ్ట్ కార్నర్ ద్వారా బెల్జియం కు ఆధిక్యాన్నిచ్చాడు. ఈ షాక్ నుంచి త్వరగానే కోలుకున్న వేల్స్ 31వ నిమిషంలో స్కోరును సమం చేసింది. ఆరోన్ రామ్సే రైట్ వింగ్ కార్నర్ నుంచి ఇచ్చిన పాస్‌ను అష్లే విలియమ్స్ హెడర్ ద్వారా గోల్ చేసి జట్టులో సంతోషం నింపాడు. ఇక ఇక్కడి నుంచి బెల్జియం వ్యూహాలు ఏమాత్రం పనిచేయలేదు. ముఖ్యంగా వీరి బ్యాక్‌లైన్ సమన్వయలోపాన్ని వేల్స్ సొమ్ము చేసుకుంది. ద్వితీయార్ధం 55వ నిమిషంలో ఔరా అనే రీతిలో రాబ్సన్ చేసిన వరల్డ్ క్లాస్ గోల్ ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఇంగ్లిష్ సెకండ్ టైర్ క్లబ్లో ఆడే ఈ ఆటగాడు... రామ్సే క్రాస్‌ను అందుకుని పెనాల్టీ ఏరియాలో బెల్జియం ముగ్గురు డిఫెండర్లను వెనక్కీ ముందుకు ఏమార్చుతూ బంతిని అతి వేగంగా నెట్లోకి పంపడంతో వేల్స్ సంబరాలు మిన్నంటాయి. అనంతరం 64వ నిమిషంలో బెల్జియంకు ఫ్రీకిక్ లభించినా వినియోగించుకోలేకపోయింది. 75వ నిమిషంలో ఆరోన్ రామ్సే ఎల్లో కార్డ్ అందుకోవడంతో తను సెమీస్‌కు దూరం కానున్నాడు. ఇక చివర్లో క్రిస్ గుంటర్ ఇచ్చిన క్రాస్ షాట్‌ను గాల్లోనే అందుకున్న వోక్స్ తలతో చేసిన గోల్‌తో వేల్స్ ఆధిక్యం మరింత పెరిగింది. ఇంజ్యూరీ సమయంలో హజార్డ్ ప్రయత్నాలు విఫలం కావడంతో బెల్జియం పరాజయం ఖాయమైంది. 1ఓ మేజర్ టోర్నీలో సెమీస్‌కు చేరడం వేల్స్‌కు ఇదే తొలిసారి 2 స్వీడన్ (1992లో) అనంతరం అరంగేట్రంలోనే సెమీస్‌కు చేరిన రెండో జట్టు వేల్స్. 3ఈ మ్యాచ్‌లో వేల్స్ తరఫున గోల్స్ చేసిన ముగ్గురూ ఇంగ్లండ్‌లోనే జన్మించారు