Manchester City's Kyle Walker exposes himself, kisses and grinds up another woman - Sakshi
Sakshi News home page

Kyle Walker: పరిచయం లేని యువతికి ముద్దులు.. పరువు తీసుకున్న ఫుట్‌బాలర్‌

Published Thu, Mar 9 2023 5:26 PM | Last Updated on Thu, Mar 9 2023 7:03 PM

Footballer Kyle Walker-Expose-Himself-Kisses-Grinds Up-Another-Woman - Sakshi

మాంచెస్టర్‌ సిటీ ఫుట్‌బాలర్‌ కైల్‌ వాకర్‌ తన అసభ్య ప్రవర్తనతో వార్తల్లో నిలిచాడు.  తాగిన మత్తులో పరిచయం లేని యువతిని ముద్దులతో ముంచెత్తడమే గాక ఆమెను తన కౌగిలిలో బంధించి ఇబ్బంది పెట్టాడు. ఈ తతంగం అంతా సీసీటీవీ ఫుటేజీలో రికార్డవడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే ఆదివారం మాంచెస్టర్‌ సిటీ, న్యూ కాసిల్‌ మధ్య ప్రీమియర్‌ లీగ్‌ మ్యాచ్‌ జరిగింది. మ్యాచ్‌లో మాంచెస్టర్‌ సిటీ 2-0 తేడాతో న్యూ కాసిల్‌ను ఓడించింది. మ్యాచ్‌ ముగిసిన అనంతరం కైల్‌ వాకర్‌ తన స్నేహితులతో కలిసి మాంచెస్టర్‌ బార్‌కు వెళ్లాడు. ఫూటుగా మద్యం తాగిన కైల్‌ వాకర్‌.. తన పక్కనే ఉన్న ఇద్దరు యువతులో మాట్లాడాడు. అయితే కాసేపటికే మద్యం మత్తులో ఇద్దరిలో ఒక యువతిని దగ్గరికి తీసుకొని ముద్దుల్లో ముంచెత్తాడు.

ఆ తర్వాత ఆమెను తన చేతులతో దగ్గరికి తీసుకొని తాకరాని చోట తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. సదరు యువతి కూడా మద్యం మత్తులో ఉండడంతో ఆమె కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఇదంతా సీసీటీవీలో రికార్డు కావడంతో బార్‌ యాజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న చెషైర్‌ పోలీసులు బార్‌కు వచ్చి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఆ తర్వాత కైల్‌ వాకర్‌ను పిలిచి విచారణ జరిపారు.

సదరు యువతిని కూడా విచారించగా.. ఆమె మాట్లాడుతూ ''మద్యం మత్తులో ఇలా జరిగి ఉంటుంది.. అతను అలా చేస్తున్నప్పుడు నేను కూడా మద్యం మత్తులో ఉన్నా.. అందుకే ఏమి చేయలేకపోయా.. అతను నన్ను బలవంతం చేయలేదు'' అని పేర్కొంది. కైల్‌ వాకర్‌పై ఎలాంటి ఫిర్యాదు రాకపోవడంతో అతన్ని అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు. కేవలం వార్నింగ్‌తో సరిపెట్టామని.. కైల్‌ వాకర్‌ ప్రవర్తనకు సంబంధించిన వీడియోనూ మాంచెస్టర్‌ సిటీ ఫ్రాంచైజీకి అందించినట్లు తెలిపింది. మొత్తానికి మద్యం మత్తులో అసభ్యంగా ప్రవర్తించి అనవసరంగా పరువు తీసుకున్నాడంటూ అభిమానులు కామెంట్స్‌ చేశారు.

చదవండి: ఆసక్తికర పోస్ట్‌.. ఎవరిని టార్గెట్‌ చేశాడు?

Pele: ఆస్తుల పంపకం.. 30 శాతం మూడో భార్యకు; 70 శాతం పిల్లలకు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement