Manchester city
-
పరిచయం లేని యువతికి ముద్దులు.. పరువు తీసుకున్న ఫుట్‌బాలర్
మాంచెస్టర్ సిటీ ఫుట్‌బాలర్ కైల్ వాకర్ తన అసభ్య ప్రవర్తనతో వార్తల్లో నిలిచాడు. తాగిన మత్తులో పరిచయం లేని యువతిని ముద్దులతో ముంచెత్తడమే గాక ఆమెను తన కౌగిలిలో బంధించి ఇబ్బంది పెట్టాడు. ఈ తతంగం అంతా సీసీటీవీ ఫుటేజీలో రికార్డవడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే ఆదివారం మాంచెస్టర్ సిటీ, న్యూ కాసిల్ మధ్య ప్రీమియర్ లీగ్ మ్యాచ్ జరిగింది. మ్యాచ్‌లో మాంచెస్టర్ సిటీ 2-0 తేడాతో న్యూ కాసిల్‌ను ఓడించింది. మ్యాచ్ ముగిసిన అనంతరం కైల్ వాకర్ తన స్నేహితులతో కలిసి మాంచెస్టర్ బార్‌కు వెళ్లాడు. ఫూటుగా మద్యం తాగిన కైల్ వాకర్.. తన పక్కనే ఉన్న ఇద్దరు యువతులో మాట్లాడాడు. అయితే కాసేపటికే మద్యం మత్తులో ఇద్దరిలో ఒక యువతిని దగ్గరికి తీసుకొని ముద్దుల్లో ముంచెత్తాడు. ఆ తర్వాత ఆమెను తన చేతులతో దగ్గరికి తీసుకొని తాకరాని చోట తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. సదరు యువతి కూడా మద్యం మత్తులో ఉండడంతో ఆమె కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఇదంతా సీసీటీవీలో రికార్డు కావడంతో బార్ యాజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న చెషైర్ పోలీసులు బార్‌కు వచ్చి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఆ తర్వాత కైల్ వాకర్‌ను పిలిచి విచారణ జరిపారు. సదరు యువతిని కూడా విచారించగా.. ఆమె మాట్లాడుతూ ''మద్యం మత్తులో ఇలా జరిగి ఉంటుంది.. అతను అలా చేస్తున్నప్పుడు నేను కూడా మద్యం మత్తులో ఉన్నా.. అందుకే ఏమి చేయలేకపోయా.. అతను నన్ను బలవంతం చేయలేదు'' అని పేర్కొంది. కైల్ వాకర్‌పై ఎలాంటి ఫిర్యాదు రాకపోవడంతో అతన్ని అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు. కేవలం వార్నింగ్‌తో సరిపెట్టామని.. కైల్ వాకర్ ప్రవర్తనకు సంబంధించిన వీడియోనూ మాంచెస్టర్ సిటీ ఫ్రాంచైజీకి అందించినట్లు తెలిపింది. మొత్తానికి మద్యం మత్తులో అసభ్యంగా ప్రవర్తించి అనవసరంగా పరువు తీసుకున్నాడంటూ అభిమానులు కామెంట్స్ చేశారు. [🎥] Video of the Kyle Walker alleged incident. #ManCity [@SunSport] pic.twitter.com/dzifyi0aW9 — City Zone (@City_Zone_) March 8, 2023 చదవండి: ఆసక్తికర పోస్ట్.. ఎవరిని టార్గెట్ చేశాడు? Pele: ఆస్తుల పంపకం.. 30 శాతం మూడో భార్యకు; 70 శాతం పిల్లలకు -
తారాస్థాయికి గొడవ.. కొట్టుకున్న ఆటగాళ్లు
మాంచెస్టర్ సిటీ, క్లబ్ అమెరికా మధ్య బుధవారం అర్థరాత్రి జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్ రసాభాసగా మారింది. మెక్సికో లెజెండరీ గోల్ కీపర్ గిల్లెర్మో ఓచోవా, మాంచెస్టర్ సిటీ మిడ్‌ఫీల్డర్ జాక్ గ్రీలిష్ దాదాపు కొట్టుకున్నంత పని చేశారు. ఆట 25వ గోల్ కొట్టే సమయంలో జాక్ గ్రీలిష్కు ఓచోవా అడ్డువచ్చాడు. దీంతో చిర్రెత్తికొచ్చిన జాక్ గ్రీలిష్కు కిందకు తోశాడు. ఉద్దేశపూర్వకంగానే అడ్డుకున్నావని.. ప్రత్యర్థి జట్టుకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఇలా చేశాడంటూ వాదించాడు. కిందపడిన ఒచోవాను చూస్తూ పైకి లే అంటూ జాక్ గ్రీలిష్ కోపంగా అన్నాడు. దీంతో ఒచోవా.. జాక్ కాలర్ పట్టుకొని అడిగే ప్రయత్నంలో ఉండగానే తోటి ఆటగాళ్లు వచ్చి ఇద్దరిని విడదీశారు. అప్పటికి శాంతించని గ్రీలిష్ ఒచోవాను తిడుతూనే ఉన్నాడు. దీంతో ఒచోవా జాక్‌పై కి దూసుకొచ్చే ప్రయత్నం చేశాడు. కానీ ఇరుజట్ల ఆటగాళ్లు వచ్చి వారిద్దరిని విడదీశారు. ఆ తర్వాత ఆట రెండో భాగంలోనూ జాక్ గ్రీలిష్ మరోసారి గొడవపడ్డాడు. ఈసారి క్లబ్ అమెరికా డిఫెండర్ బ్రూనో వాల్డెజ్ బంతి తన్నే ప్రయత్నంలో జాక్ గ్రీలిష్‌ను కింద పడేశాడు. కోపంతో పైకి లేచిన జాక్.. వాల్డెజ్‌తో గొడవకు దిగగా.. ఇంతలోనే క్లబ్ అమెరికన్ జట్టులోని కొంతమంది ఆటగాళ్లు జాక్‌ను నెట్టివేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ ఫ్రెండ్లీ మ్యాచ్‌లో మాంచెస్టర్ సిటీ 2-1 తేడాతో క్లబ్ అమెరికాపై విజయం అందుకుంది. మాంచెస్టర సిటీ మిడ్ ఫీల్డర్ కెవిన డిబ్రూయెన్ ఆట మొదటి హాఫ్‌లో ఒకటి.. రెండో సగంలో మరొక గోల్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు. Grealish already having a scrap 😅 pic.twitter.com/bvXiUaAL5m — Álvarez¹⁹ (@19Alvarez_) July 21, 2022 The best of the action from our pre-season friendly against Club America 🎥 📍 NRG Stadium, Houston pic.twitter.com/XKBTQPatXx — Manchester City (@ManCity) July 21, 2022 Bruno Valdez to Jack Grealish: “This is for your chirp at Almiron!” pic.twitter.com/JdnBmaqRiK — Roberto Rojas (@RobertoRojas97) July 21, 2022 చదవండి: Shreyas Iyer: జోరుగా వర్షం.. టీమిండియా ఆటగాడి కోసం రెండు గంటల నిరీక్షణ -
ఫుట్‌బాల్ మైదానంలో బాలీవుడ్ స్టార్ వింత ప్రవర్తన
బాలీవుడ్ సూపర్‌స్టార్ రణ్వీర్ సింగ్ ఫుట్‌బాల్ మైదానంలో సందడి చేశాడు. అయితే మ్యాచ్ చూడడానికి వచ్చిన రణ్వీర్ తన వింత ప్రవర్తనతో అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. విషయంలోకి వెళితే.. క్రిస్టల్ పాలెస్ ప్రీమియర్ లీగ్ వర్సెస్ మాంచెస్టర్ సిటీ మధ్య బుధవారం మ్యాచ్ జరిగింది. కాగా ఈ ప్రీమియర్ లీగ్‌కు రణ్వీర్ సింగ్ అంబాసిడర్ పాత్ర పోషించాడు. మ్యాచ్ హాఫ్ టైమ్ ముగిసిన తర్వాత రణ్వీర్ తన ఫుట్‌బాల్ నైపుణ్యం ప్రదర్శించాడు. పెనాల్టీ చాలెంజ్ పేరుతో నిర్వహించిన ఫన్ గేమ్‌లో రణ్వీర్.. తన కాలికున్న బూట్లను తీసేసి.. కేవలం తన కాళ్లతోనే బంతిని గోల్‌పోస్ట్‌లోకి తరలించాడు. అనంతరం ఫుట్‌బాల్ స్టార్స్ చేసుకునే సెలబ్రేషన్‌తో మెరిశాడు. రణ్వీర్ సింగ్ చేష్టలు అభిమానులకు కాస్త వింతగా అనిపించినా.. సూపర్‌గా ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను క్రిస్టల్ ప్యాలెస్ లీగ్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ''హాఫ్ టైమ్ పెనాల్టీ చాలెంజ్‌ను రణ్వీర్ విజయవంతంగా పూర్తి చేశాడు.. కంగ్రాట్స్'' అంటూ క్యాప్షన్ జత చేసింది. తాజాగా ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇక 2017 నుంచి రణ్వీర్ సింగ్ ఫుట్‌బాల్ ప్రీమియర్ లీగ్‌కు భారత్ నుంచి అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. భారత్‌లో ఫుట్‌బాల్‌ను ప్రోత్సహించడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఫుట్‌బాల్‌కు భారత్ నుంచి క్రీడాకారులు రావాలని కోరుకుంటున్నారు. ఇక ఇప్పటికే అంబాసిడర్ పాత్రలో ఇంగ్లండ్‌లోని ఓల్డ్ ట్రాఫర్డ్, టోటెన్హమ్ హాట్స్పుర్ స్టేడియాలకు రణ్వీర్ సింగ్ వెళ్లి వచ్చాడు. ఇక క్రిస్టల్ ప్యాలెస్ లీగ్, మాంచెస్టర్ సిటీ మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. చదవండి: AUS vs PAK: 'మా గుండె ఆగినంత పనైంది'.. అప్పుడు తిట్టినోళ్లే ఇవాళ పొగుడుతున్నారు ICC Test Rankings: దుమ్మురేపిన శ్రేయాస్ అయ్యర్, బుమ్రా Cool as you like 🤣@RanveerOfficial completes the Selhurst Park half-time penalty challenge 👏#CPFC pic.twitter.com/pBj1YBwlmO — Crystal Palace F.C. (@CPFC) March 15, 2022 -
లైవ్మ్యాచ్లో కన్నీటి పర్యంతమైన ఉక్రెయిన్ ఫుట్‌బాలర్
Ukraine-Russia Crisis: రష్యా-ఉక్రెయిన్ల యుద్ధం ప్రపంచంలోని ప్రతీ ఒక్కరిని కదిలిస్తోంది. తమ స్వలాభం కోసం యుద్ధం చేస్తూ ఉక్రెయిన్‌లోని అమాయక ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న రష్యా వైఖరిని తీవ్రంగా తప్పుబడుతున్నారు. క్రీడాలోకం సైతం ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలుస్తూ తమ సంఘీభావాన్ని ప్రకటిస్తున్నారు. తాజాగా శనివారం ప్రీమియర్ లీగ్‌లో భాగంగా మాంచెస్టర్ సిటీ, ఎవర్టన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఉక్రెయిన్‌కు చెందిన ఒలెక్సాండర్ జించెంకో మాంచెస్టర్ సిటీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మ్యాచ్ మధ్యలో తమ దేశం పరిస్థితి గుర్తుకువచ్చిందేమో.. ఢిఫెండర్ ఒలెక్సాండర్ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యాడు. అతను వెక్కి వెక్కి ఏడ్వడం మ్యాచ్ చూడడానికి వచ్చిన అభిమానులను కలిచివేసింది. దీంతో రెండు జట్ల అభిమానులు ఆ ఆటగాడికి ఓదార్పునిస్తూ.. సంఘీభావంగా లేచి నిలబడి అతనికి మద్దతిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా మ్యాచ్ ప్రారంభానికి ముందు మాంచెస్టర్ సిటీ ఆటగాళ్లు.. ఉక్రెయిన్‌పై జరుగుతున్న దాడిని నిరసిస్తూ తమ టీషర్ట్‌పై ఉక్రెయిన్ జెండాను ముద్రించుకొని ..'' నో వార్'' అని సంఘీభావం తెలపగా.. మరోవైపు ఎవర్టన్ ఆటగాళ్లు ఉక్రెయిన్ జెండాను కప్పుకొని మద్దతిచ్చారు. చదవండి: Russia Ukraine War: 'యుద్ధం ఆపేయండి'.. సొంత దేశాన్ని ఏకిపారేసిన టెన్నిస్ స్టార్ Ukrainian footballer Zinchenko brought to tears as Everton and Man City players show support for Ukraine. pic.twitter.com/qxvHoItDxz — Richard Chambers (@newschambers) February 26, 2022 -
'నన్ను అనుభవించాలనుకున్నాడు.. మాట విననందుకు'
మాంచెస్టర్ సిటీ ఫుట్‌బాల్ క్లబ్ ఆటగాడు మాసన్ గ్రీన్‌వుడ్‌పై సంచలన ఆరోపణలు వచ్చాయి.గ్రీన్వుడ్ మాజీ గర్ల్‌ఫ్రెండ్‌ను అని చెప్పుకుంటూ తనను లైంగికంగా అనుభవించడానికి ప్రయత్నించాడని.. మాట వినకపోవడంతో తనపై దాడికి పాల్పడ్డాడంటూ ఆమె ఆరోపణలు చేసింది. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు మాంచెస్టర్ క్లబ్లో పెద్ద దుమారమే రేపుతుంది. చదవండి: Rafel Nadal: అప్పుడు జొకోవిచ్‌తో.. ఇప్పుడు మెద్వెదెవ్‌తో ఇక విషయంలోకి వెళితే.. హారిట్ రాబ్సన్ అనే యువతి మాసన్ గ్రీన్‌వుడ్‌కు మాజీ గర్ల్‌ఫ్రెండ్ అంటూ చెప్పుకుంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. తనతో శృంగారంలో పాల్గొనాలని చెప్పాడని.. మాట విననందుకు తన శరీర భాగాలపై దాడి చేశాడంటూ.. అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. ఆ తర్వాత హారిట్- గ్రీన్‌వుడ్‌కు మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియో టేపును కూడా రిలీజ్ చేయడం సంచలనం రేపింది. ఆ ఆడియో టేప్‌లో మాసన్ గ్రీన్వుడ్ తన మాజీ గర్ల్‌ఫ్రెండ్‌ను శృంగారం కోసం అడగడం.. అందుకు ఆమె నిరాకరించడంతో.. బలవంతంగా ఆమెను అనుభవించడం వినిపించింది. కాగా ఈ విషయంలో మాసన్ గ్రీన్వుడ్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. మాంచెస్టర్ సిటీ క్లబ్ కూడా నిజానిజాలు తేలిన తర్వాతే మాసన్ గ్రీన్‌వుడ్‌పై వచ్చిన ఆరోపణలపై చర్య తీసుకుంటామని ఒక ప్రకటనలో తెలిపింది. Mason Greenwood forcing his ex girlfriend to have sex with him recorded… this is genuinely sickening to hear pic.twitter.com/t5hkvfv4HJ — ً (@erlingtxt) January 30, 2022 -
అమ్మ బాబోయి.. 17 కిమీ దూరానికి ఉబర్‌లో ధరెంతో తెలిసి షాక్ అయిన కస్టమర్?
సాదారణంగా మనం ఉబర్ క్యాబ్‌ల ప్రయాణించినప్పుడు ధరలు ఇతర వాటితో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉంటాయి. మహా అయితే ఈ ధరలు ఒక వంద రూపాయలో లేదా 2 వందలో ఎక్కువగా ఉంటుంది. అయితే, ఇప్పుడు మన చెప్పుకోబోయే స్టోరీ గురుంచి తెలిస్తే షాక్ అవుతారు.. డిసెంబర్ 27న, మాంచెస్టర్ సిటీకి చెందిన సామ్ జార్జ్ అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి పార్టీకి నైట్ క్లబ్ కు వెళ్లాడు. ఆ రాత్రి అతనికి చాలా ఆలస్యమైంది. చాలా రాత్రి కావడంతో తను ఇంటికి క్యాబ్‌లో వెళ్లాలని అనుకున్నాడు. అతని ఇల్లు నైట్ క్లబ్ నుంచి సుమారు 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే, అర్ధరాత్రి కవడంతో క్యాబ్‌లు ఎక్కువగా అందుబాటులో లేవు. దీంతో సామ్ స్నేహితులు అనేక సంస్థలకు చెందిన క్యాబ్‌ల కోసం ప్రయత్నించారు. కానీ, ఏదీ అందుబాటులో లేకపోవడంతో సామ్ ఉబర్ క్యాబ్ సేవలను వినియోగించుకోవాలని భావించాడు. ఆ రాత్రి తను, అతను ఫ్రెండ్స్ కలిసి ఉబెర్ ఎక్స్ఎల్ లేదా ఎస్యువి కారులో అర్థరాత్రి ఇంటికి తిరిగి వచ్చారు. రాత్రి తాగిన మందు కిక్ దిగిన తర్వాత మరుసటి రోజు యాప్ లో క్యాబ్ ఛార్జీలను చూసి ఒక్కసారిగా అతను ఆశ్చర్యపోయాడు. క్యాబ్ సంస్థ ఆ యువకుడికి కేవలం 17 కిలోమీటర్ల ప్రయాణానికి రూ.10,000 వసూలు చేసింది. అర్థరాత్రి సమయంలో ఇంటికి చేరుకోవడానికి అరగంట కంటే తక్కువ సమయం పడుతుంది. పార్టీకి అయిన ఖర్చుతో పోలిస్తే క్యాబ్‌కు అయిన ఖర్చు ఎక్కువ. ముందుగానే, ఈ ప్రయాణానికి సంబంధించిన ధరలను యాప్ లో చూపించినట్లు ఉబెర్ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, ఆ యువకుడు చాలా మత్తులో ఉండటంతో క్యాబ్ ధరంతో తెలియలేదు. (చదవండి: 17 లక్షల యూజర్లకు భారీ షాక్ ఇచ్చిన వాట్సాప్..!) -
'మా ఇంట్లో దొంగలు పడ్డారు; నన్ను కొట్టి.. నా ఫ్యామిలీని'
మాంచెస్టర్ సిటీ యునైటెడ్ ఆటగాడు.. పోర్చుగల్ సాకర్ ప్లేయర్ జావో క్యాన్సెల్లో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విషయంలోకి వెళితే.. జావో క్యాన్సెల్లో ఇంటికి నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి అతనిపై దాడికి పాల్పడ్డారు. ఇంట్లోని విలువైన వస్తువులు, నగలు దోచుకెళ్లారు. అడ్డువచ్చిన కుటుంబసభ్యులను ఇంట్లో బంధించి వెళ్లారు. ఈ దాడిలో జావో క్యాన్సెల్లో ముఖానికి గాయాలయ్యాయి. వీటన్నింటిని జావో తన ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్పుకొచ్చాడు. చదవండి: Cristiano Ronaldo: ఫుట్‌బాల్ స్టార్ రొనాల్డోకు భారత్‌లో అరుదైన గౌరవం ''నిజంగా ఈరోజు నా జీవితంలో అత్యంత దురదృష్టకరం. ఎవరో నలుగురు పిరికివాళ్ల మా ఇంటికి వచ్చి నాపై దౌర్జన్యం చేశారు. అడ్డువచ్చిన నా ఫ్యామిలీకి హాని కలిగించాలని చూశారు. నేను ప్రతిఘటించడంతో నా ముఖంపై భౌతిక దాడికి దిగారు. ఆ తర్వాత ఇంట్లో కనిపించిన వస్తువులు.. బంగారం ఎత్తుకెళ్లారు. ఇక్కడ అదృష్టం ఏంటంటే నా ఫ్యామిలీలో అందరూ బాగానే ఉన్నారు.. ఎవరికి ఏం కాలేదు.. అది సంతోషం. ఇలాంటివి నాకు కొత్తేం కాదు.. జీవితంలో ఇలాంటివి ఎన్నో ఎదుర్కొన్నా.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న మాంచెస్టర్ సిటీ యునైటెడ్ క్లబ్ క్యాన్సెల్లోపై జరిగిన దాడిని ఖండించింది. క్యాన్సెల్లో దాడి మాకు షాక్‌తో పాటు దిగ్భ్రాంతి చెందాము. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నాం. కేసు నమోదు చేసి విచారణ చేయమని పోలీసులకు చెప్పినట్లు తెలిపింది. జావో క్యాన్సెల్లో 2019లో జువెంటస్ క్లబ్ నుంచి మాంచెస్టర్ సిటీ యునైటెడ్‌కు మారాడు. చదవండి: 55 నిమిషాల పాటు నరకం అనుభవించా: స్టీవ్ స్మిత్ -
లైంగిక వేధింపుల కేసు.. స్టార్ ఫుట్‌బాలర్‌పై వేటు
Benjamin Mendy.. ఫ్రాన్స్ స్టార్ ఫుట్‌బాలర్.. ప్రస్తుతం మాంచెస్టర్ సిటీ క్లబ్‌కు ఆడుతున్న అతనిపై సస్పెన్షన్ వేటు పడింది. మెండీపై వచ్చిన అత్యాచార ఆరోపణలు నిజమేనని పోలీసులు పేర్కొనడంతో ప్రీమియర్ లీగ్ చాంపియన్ అతన్ని మాంచెస్టర్ సిటీ క్లబ్ నుంచి సస్పెండ్ చేసింది. 27 ఏళ్ల మెండీపై నాలుగు అత్యాచారాలతో పాటు ఒక లైంగిక వేధింపుల కేసులు నమోదైనట్లు ఫ్రాన్స్ ఇంటర్నేషనల్ కోర్టు స్పష్టం చేసింది. మెండీపై ఫిర్యాదు చేసిన ముగ్గురి వయస్సు 16 ఏళ్లు అని.. అక్టోబర్ 2020 నుంచి ఆగస్టు 2021 మధ్య ఇది జరిగినట్లు వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా మెండీపై కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు. కాగా నేడు(ఆగస్టు 27న) మెండీని చెస్టర్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నారు. ఇక ఫ్రాన్స్ ఫుట్‌బాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న బెంజమిన్ మెండీ 2018లో ఫిఫా వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఇక 2017 నుంచి మాంచెస్టర్ సిటీ క్లబ్ తరపున ఆడుతున్న మెండీ మొత్తంగా 75 మ్యాచ్‌ల్లో పాల్గొన్నాడు. చదవండి: Mohammed Siraj: సిరాజ్ స్కోరెంత.. ఇంగ్లండ్ ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే కౌంటర్ -
మెస్సీ కావాలంటే...రూ. 6 వేల కోట్లు
బార్సిలోనా (స్పెయిన్): అర్జెంటీనా ఫుట్‌బాల్ సూపర్ స్టార్ లయోనల్ మెస్సీ బార్సిలోనా క్లబ్ వీడేందుకు సిద్ధంగా ఉన్నాడు. కానీ అతను కావాలంటే మాత్రం అందుకోవాల్సిన జట్టు వేల కోట్లు రాసులుగా పోయాల్సిందే! మాంచెస్టర్ సిటీ అతనిపై ఆసక్తి కనబరుస్తోంది. అయితే బార్సిలోనాతో కుదిరిన ఐదేళ్ల కాంట్రాక్టు గడువుకు ఇంకా ఏడాది మిగిలుంది. ఈ మధ్యలోపే బదిలీ కావాలనుకుంటే మాత్రం కాంట్రాక్టు క్లాజ్ ప్రకారం 70 కోట్ల యూరోలు అంటే భారత కరెన్సీలో అక్షరాలా రూ.6,070 కోట్లు మాంచెస్టర్ సిటీ వెచ్చించాలి. అప్పుడే బార్సిలోనా జట్టు 33 ఏళ్ల మెస్సీని విడుదల చేస్తుంది. అయితే మాంచెస్టర్ సిటీ మాత్రం మెస్సీపై ఆశలు పెట్టుకుంది. ఈ మొత్తంపై బేరసారాలు జరిపి అయినా సరే అతన్ని దక్కించుకోవాలనే నిశ్చయంతో ఉంది. ఈ వ్యవహారం జరిగిపోతే ప్రొఫెషనల్ మేనేజర్ పెప్ గార్డియోలా నేతృత్వంలో మెస్సీ ఆడతాడు. మాంచెస్టర్ సిటీ జట్టుకు పెప్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు. యూరోపియన్ సాకర్ వర్గాల ప్రకారం కొత్త ఒప్పందం ప్రకారం మూడేళ్లు సిటీకి ఆడితే... మరో రెండేళ్లు న్యూయార్క్ ఎఫ్‌సీ తరఫున ఆడాల్సివుంటుంది. ఈ న్యూయార్క్ ఎఫ్‌సీ కూడా మాంచెస్టర్ సిటీకే చెందిన సిటీ ఫుట్‌బాల్ గ్రూప్ (సీఎఫ్‌జీ) జట్టే. -
అద్భుతం : 30 ఏళ్ల నిరీక్షణకు తెర
ఫుట్‌బాల్ చరిత్రలో గురువారం రాత్రి ఒక అద్భుతం చోటుచేసుకుంది. ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ ఫుట్‌బాల్ టైటిల్‌ను గెలవడం కోసం 30 ఏళ్లుగా నిరీక్షిస్తున్న లివర్‌పూల్ కల నెరవేరింది. గురువారం రాత్రి మాంచెస్టర్ సిటీతో జరిగిన మ్యాచ్‌లో చెల్సియా జట్టు 2-1 తేడాతో విజయం సాధించడంతో లివర్‌పూల్ మొదటిసారి ఇంగ్లీష్ ప్రీమియర్ టైటిల్‌ను ఎగురేసుకుపోయింది. అయితే ఒక దశలో జుర్గెన్ క్లోప్ ఆధ్వర్యంలోని లివర్‌పూల్ టైటిల్ గెలవడానికి మరో మ్యాచ్‌కోసం ఎదురుచూడాల్సి వస్తుందేమోనన్న అనుమానం కలిగింది. కానీ చెల్సియా జట్టులోని క్రిస్టియన్ పులిసిక్, విలియమ్ సీల్డ్ ఆఖరి నిమిషంలో గోల్స్ చేయడంతో చెల్సియా జట్టు 2-1 తేడాతో మాంచెస్టర్ సిటీని ఓడించింది. మరోవైపు మాంచెస్టర్ సిటీ నుంచి కెవిన్ డిబ్రూయిన్ ఒక గోల్ చేశాడు. (మైదానంలోకి రోహిత్ శర్మ) ఈ విజయం చెల్సియాకు తరువాతి సీజన్లో జరగనున్న ఛాంపియన్స్ లీగ్‌లో స్థానం సాధించడంతో జట్టును మరింత బలోపేతం చేసింది. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది బ్లూస్(చెల్సియా) అభిమానులు ఈ ఫలితంతో సంతోషంగా ఉన్నారు. మరోవైపు లివర్‌పూల్ క్లబ్ మొదటిసారి ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ టైటిల్ గెలవడం వెనుక చెల్సియా మ్యాచ్ ఎంతగానో ఉపయోగపడిందని లివర్‌పూల్ అభిమానులు పేర్కొన్నారు. 30 ఏళ్ల నిరీక్షణ తర్వాత వారి కల సాకారం అయినందుకు లివర్‌పూల్ క్లబ్ అభిమానులు ఆనందంగా ఉన్నారు. కాగా లివర్‌పూల్ తరువాతి మ్యాచ్‌లో మాంచెస్టర్ సిటీని ఎదుర్కోనుంది. గార్డ్ ఆఫ్ ఆనర్ కింద ఈ మ్యాచ్ జరగనుంది. -
డేట్ కోసం రూ 40 వేలతో హోర్డింగ్..
లండన్ : వాలెంటైన్స్ డే దగ్గర పడటంతో సింగిల్స్ జోడీ కోసం వెతుకులాట చేపట్టారు. మనసు మెచ్చిన మగువ కోసం వెరైటీ పద్ధతులను ఆశ్రయిస్తున్నారు. డేటింగ్ యాప్స్ వర్కవుట్ కాలేదో..మరి ఏమనుకున్నాడో ఓ సింగిల్ ఏకంగా తనతో డేటింగ్‌కు సింగిల్స్ కావాలంటూ హోర్డింగ్పైనే ప్రకటన ఇచ్చేశాడు. రూ 40 వేలు ఖర్చు చేసి బిజీ రోడ్లో బిల్‌బోర్డుపై తన ఫోటోతో ఫోజిచ్చాడు. తాను మోస్ట్ ఎలిజిబుల్ సింగిల్‌ను అంటూ మాంచెస్టర్ సెంటర్లో ఈ ప్రకటనతో ముందుకొచ్చాడు. డేటింగ్ యాప్స్ పనిచేయకపోవడంతో ఓ బిల్బోర్డును కొనుగోలు చేసి వైవిధ్యంగా ప్రయత్నిస్తూ డేట్ కోసం పరితపిస్తున్నానని మార్క్ తన ట్విటర్ ఖాతాలో చేసిన పోస్ట్‌కు భారీ స్పందన వస్తోంది. వినూత్న ప్రకటనతో తనతో డేటింగ్ కోసం దరఖాస్తులు వస్తున్నాయని మార్క్ సంబరపడుతున్నాడు. బిల్‌బోర్డు ఒక్కటే కాకుండా ఏదో ఒక రాయి తగలకపోతుందా అంటూ డేటింగ్ మార్క్ పేరిట మార్క్ (30) ఓ వెబ్‌సైట్‌ను కూడా క్రియేట్ చేశాడు. చదవండి : పెళ్లయిన వారూ పేట్రేగుతున్నారు.. -
మద్యం మత్తులో టైర్లులేని కారులో..
న్యూఢిల్లీ: కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా మద్యం ప్రియులు కొంత మంది ఎక్కువగా తాగడం, నిషేధం ఉన్నప్పటికీ తాగి కారు నడుపుకుంటూ పోవడం, మధ్యలో పోలీసులకు పట్టుపడడం తెల్సిందే. ఇంగ్లండ్‌లోని గ్రేటర్ మాంచెస్టర్ సమీపంలో జనవరి ఒకటవ తేదీ తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో రెనాల్ట్ క్లియో కారును నడుపుకుంటూ వచ్చిన ఓ డ్రైవర్‌ను ఎంత తాగాడో చెక్ చేసిన మాంచెస్టర్ పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. బ్రీత్ అనలైజర్‌లో వంద మిల్లీ లీటర్లకుగాను 196 ఎంజీ ఆల్కహాల్ ఉండడమే అందుకు కారణం. ఇంగ్లండ్‌లో వంద ఎంఎల్‌కు 35 ఎంజీ ఆల్కహాల్‌ను మాత్రమే అనుమతిస్తారు. అలాంటిది అంతకు ఏకంగా ఆరు రెట్లు ఎక్కువ ఆల్కహాల్ తాగడం, కారు నడపడం చూసి పోలీసు అధికారులకే దిమ్మ తిరిగిపోయింది. ఆ తర్వాత కారు ముందు టైర్లను చూసిన ఆ అధికారులకు మూర్ఛ వచ్చినంత పనయింది. కారు ముందు రెండు చక్రాలకు టైర్లు లేకపోవడమే అందుకు కారణం. పీకలదాకా తాగి కారు నడిపిన సదరు కారు యజమాని పేరు బహిర్గతం చేయడానికి నిరాకరించిన ట్రాఫిక్ పోలీసు అధికారులు టైర్లు లేని నీలిరంగు రెనాల్ట్ క్లియో కారు చక్రాల ఫొటోలను తీసి ఆన్లైన్లో పోస్ట్ చేయగా, ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అంతగా తాగాడు సరే, టైర్లు లేకుండా చక్రాలపై కారును ఎలా నడిపాడబ్బా? అంటూ నెటిజెన్లు విస్తుపోతున్నారు. అసలు ఆయన అదే తన కారని ఎలా గుర్తించారు? ఎలా స్టార్ట్ చేశారు? టైర్లు ఊడిపోయినప్పుడే కారు పల్టీ కొట్టాలికదా! అంటూ విస్తుపోతున్నవాళ్లు ఉన్నారు. -
మాంచెస్టర్‌లో కత్తిపోట్లు.. ఐదుగురికి గాయాలు
లండన్ : ఓ అగంతకుడు జరిపిన కత్తిపోట్లకు అయిదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఇగ్లాండ్‌లోని మాంచెస్టర్ నడిబొడ్డున ఉన్న అర్ండాలే షాపింగ్ కాంప్లెక్స్‌లో చోటు చేసుకుంది. ఈ సంఘటనపై తీవ్రవాద నిరోధక అధికారులు దర్యాప్తు చేస్తున్నారని పోలీసులు శుక్రవారం తెలిపారు. దాడిలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించామని పేర్కొన్నారు. కొందరు కత్తి పట్టుకొని అనేక మందిపై దాడికి వచ్చారని, అందులో ఒకతను తన షాప్‌లోకి వచ్చి అయిదుగురిపై దాడికి పాల్పడ్డాడని ప్రత్యేక్ష సాక్షి అయిన దుకాణం యాజమాని తెలిపారు. గాయపడిన వారిలో ఇద్దరు మహిళలు, ఒక వ్యక్తి ఆరోగ్యం నిలకడగా ఉండగా, తీవ్ర గాయాలతో మరో వ్యక్తి చికిత్స పొందుతున్నారని పోలీసులు వెల్లడించారు. అయితే ఇప్పటికీ కత్తిపోట్లు జరిపింది ఎవరనే దానిపై స్పష్టత రాలేదు. కాగా 40 ఏళ్ళ ఓ వ్యక్తిని దాడి పాల్పడినట్లు అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. విచారణ అనంతరం మిగతా వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. -
‘తను మాకు దేవుడిచ్చిన బహుమతి’
నవ మాసాలు మోసి కన్న తల్లికి బిడ్డ రంగు, రూపు గురించి పట్టింపు ఉండదు. వీటన్నింటికతీతంగా పిల్లల్ని ప్రేమించగలిగేది తల్లి మాత్రమే. ఆరోగ్యంగా ఉన్న పిల్లలకంటే వైకల్యంతో పుట్టిన పిల్లల పట్లనే తల్లికి ఎక్కువ ప్రేమ, సంరక్షణ ఉంటాయి. లోకమంతా వారిని ఎగతాళి చేసినా, అసహ్యించుకున్నా.. తల్లి మాత్రం వారిని కడుపులో పెట్టి చూసుకుంటుంది. తనను ఏమన్నా ఊరుకుంటుంది కానీ తన పిల్లలను తక్కువ చేసి మాట్లాడితే మాత్రం అస్సలు ఊరుకోదు. వారికి తగిన విధంగా సమాధానం చెప్పి నోరు మూయిస్తుంది. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. వైకల్యంతో పుట్టిన తన చిన్నారిని కామెంట్ చేస్తున్నవారికి ఆ తల్లి చెప్పిన సమాధానం నెటిజన్ల మనసు గెలవడమే కాక ట్రోలర్స్ నోరు మూయించింది. వివరాలు.. మాంచెస్టర్‌కు చెందిన నఫ్ఫి, రాచెలి గోల్మాన్ అనే దంపతులకు కూతురు జన్మించింది. అయితే ఆ బిడ్డ పుట్టడమే అరుదైన వ్యాధితో జన్మించింది. చూపు లేదు, వినపడదు.. కనీసం తనకు తానుగా శ్వాసించలేదు కూడా. అంతేకాక ఆ చిన్నారి కళ్లు ఉబ్బిపోయి.. తల కూడా అసమానంగా ఉండంటమే కాక వెన్నెముక కూడా సరిగా లేదు. కూతుర్నిని చూడగానే ముందు ఆమె తండ్రి కూడా భయపడ్డాడంట. కానీ అది కాసేపే.. వెంటనే చిన్నారిని తన చేతుల్లోకి తీసుకుని గుండెలకు హత్తుకున్నాడట. తమకు ఇలాంటి బిడ్డ పుట్టిందని ఆ తల్లిదండ్రులు బాధపడలేదంట. ఎందుకంటే.. గర్భంలో ఉన్నప్పుడే ఆ చిన్నారికి ఇలాంటి సమస్యలు ఉన్నాయని.. అబార్షన్ చేయించుకోమని సలహా ఇచ్చారంట వైద్యులు. కానీ వారు ఆ మాటలు పట్టించుకోలేదు. బిడ్డను భూమ్మీదకు తీసుకురావాలనే నిర్ణయించుకున్నారు. చిన్నారి జన్మించిన తరువాత ఆ సంతోషాన్ని నలుగురితో పంచుకోవడం కోసం తమ చిన్నారి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో వారిని విపరీతంగా ట్రోల్ చేయడం ప్రారంభించారు నెటిజన్లు. ‘దెయ్యం’, ‘చంపేయండి’ అంటూ కామెంట్ చేశారు. ఈ ట్రోలింగ్కి ముందు బాధపడినా.. తరువాత కామెంట్ చేసేవాళ్లకు తగిన సమాధానం ఇచ్చారు. ‘ఈ చిన్నారిని జాగ్రత్తగా చూసుకోవడం మాకు కష్టమే. కానీ తనను సృష్టించిన భగవంతుని మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. దేవుడెప్పుడు తప్పులు చేయడు. ఆయన మాకు కానుకగా ఇచ్చిన ఈచిన్నారిని ప్రేమగా సంరక్షిస్తాము’ అంటూ సమాధానమిచ్చారు. -
'భారత్ టాలెంట్ అదుర్స్.. అవకాశాలకు గొప్ప నిలయం'
సాక్షి, ముంబయి : భారత గొప్ప అవకాశాలకు నిలయం అని మాంచెస్టర్ నగర ఫుట్‌బాట్ కప్ సీఈవో ఫెర్రాన్ సోరియానో అన్నారు. ముఖ్యంగా ఫుట్‌బాల్‌కు ఆధరణ నానాటికి ఇండియాలో పెరుగుతోందని భవిష్యత్‌లో మరింత అభివృద్ధిచెందుతుందన్నారు. శుక్రవారం జంషెడ్ పూర్, ముంబయికి మధ్య జరిగిన హీరో ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ కప్ మ్యాచ్‌ను స్వయంగా తిలకించేందుకు వచ్చిన ఆయన భారత్‌లో ఫుట్‌బాల్ క్రీడకు పెరుగుతున్న క్రేజ్పట్ల సంతోషం వ్యక్తం చేశారు. భారత్‌లో ఫుట్‌బాల్ మార్కెట్ మరింత పెరుగుతుందనడంలో తనకు ఏ మాత్రం సందేహం లేదని, చాలా సానుకూల పరిస్థితులు ఇక్కడ ఉన్నాయన్నారు. 'ఫుట్‌బాల్‌కు భారత్ గొప్ప అవకాశ నిలయం అని మేం భావిస్తున్నాం. ఇక్కడ ఎంతో టాలెంట్, ప్యాషన్ ఉన్నవాళ్లున్నారు. భారత్‌లో ఫుట్‌బాల్ అభివృద్ధిపై మేం చాలా సానుకూలంగా ఉన్నాం. అందుకే మేం ఈ రోజు ఇక్కడ ఉన్నాం. ఇక్కడ కొన్ని ఐఎస్ఎల్ మ్యాచ్‌లను చూడాలని, ప్రజలను కలుసుకోవాలని క్రీడాకారులను చూడాలని అనుకుంటున్నాం' అని ఆయన అన్నారు. ఫెర్రాన్ మాంచెస్టర్ సిటీ ఫుట్‌బాల్ కప్ సీఈవో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు ఆరు ఫుట్‌బాల్ క్లబ్బులు కూడా ఉన్నాయి. -
ముగ్గురు పాక్ ఎయిర్‌హోస్టెస్ అరెస్ట్
పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ) కు చెందిన ముగ్గురు ఎయిర్ హోస్టెస్‌ను బ్రిటన్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఆ విషయాన్ని పాకిస్థాన్ ఉన్నతాధికారులు ధృవీకరించారు. బ్రిటన్ మహిళ ఇచ్చిన పిర్యాదు మేరకు ఆ ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు వారు వివరించారు. మాంచెస్టర్‌లోని ఓ హోటల్లో ఉన్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వారిని బ్రిటన్ పోలీసు అధికారులు విచారిస్తున్నారన్నారు. పాకిస్థాన్‌కు చెందని ముగ్గురు ఎయిర్‌హోస్టెస్‌లను ఎందుకు అరెస్ట్ చేసింది అనేదానిపై ఇంకా తమకు సమాచారం అందలేదన్నారు. ఆ అంశంపై బ్రిటన్‌తో చర్చిస్తున్నామని పాక్ అధికారులు తెలిపారు.