Mason Greenwood: Ex-Girlfriend Accuses Domestic Abuse And Sexual Assault On Footballer - Sakshi
Sakshi News home page

ఫుట్‌బాల్‌ ఆటగాడిపై ఆరోపణలు.. సంచలనం రేపుతున్న ఆడియో క్లిప్‌

Jan 30 2022 9:50 PM | Updated on Jan 31 2022 12:18 PM

Footballer Ex-Girlfriend Accuses Domestic Abuse And Sexual Assault - Sakshi

మాంచెస్టర్‌ సిటీ ఫుట్‌బాల్‌ క్లబ్‌ ఆటగాడు మాసన్‌ గ్రీన్‌వుడ్‌పై సంచలన ఆరోపణలు వచ్చాయి.గ్రీన్‌వుడ్‌ మాజీ గర్ల్‌ఫ్రెండ్‌ను అని చెప్పుకుంటూ తనను లైంగికంగా అనుభవించడానికి ప్రయత్నించాడని.. మాట వినకపోవడంతో తనపై దాడికి పాల్పడ్డాడంటూ ఆమె ఆరోపణలు చేసింది. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు మాంచెస్టర్‌ క్లబ్‌లో పెద్ద దుమారమే రేపుతుంది. 

చదవండి: Rafel Nadal: అప్పుడు జొకోవిచ్‌తో.. ఇప్పుడు మెద్వెదెవ్‌తో

ఇక విషయంలోకి వెళితే.. హారిట్‌ రాబ్‌సన్‌ అనే యువతి మాసన్‌ గ్రీన్‌వుడ్‌కు మాజీ గర్ల్‌ఫ్రెండ్‌ అంటూ చెప్పుకుంటూ కొన్ని ఫోటోలు సోషల్‌ మీడియాలో రిలీజ్‌ చేసింది. తనతో శృంగారంలో పాల్గొనాలని చెప్పాడని.. మాట విననందుకు తన శరీర భాగాలపై దాడి చేశాడంటూ.. అందుకు సంబంధించిన ఫోటోలను షేర్‌ చేసింది. ఆ తర్వాత హారిట్‌- గ్రీన్‌వుడ్‌కు మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియో టేపును కూడా రిలీజ్‌ చేయడం సంచలనం రేపింది.

ఆ ఆడియో టేప్‌లో మాసన్‌ గ్రీన్‌వుడ్‌ తన మాజీ గర్ల్‌ఫ్రెండ్‌ను శృంగారం కోసం అడగడం.. అందుకు ఆమె నిరాకరించడంతో.. బలవంతంగా ఆమెను అనుభవించడం వినిపించింది. కాగా ఈ విషయంలో మాసన్‌ గ్రీన్‌వుడ్‌ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. మాంచెస్టర్‌ సిటీ క్లబ్‌ కూడా నిజానిజాలు తేలిన తర్వాతే మాసన్‌ గ్రీన్‌వుడ్‌పై వచ్చిన ఆరోపణలపై చర్య తీసుకుంటామని ఒక ప్రకటనలో తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement