audio clip
-
‘‘రేయ్.. నీ కథ చూస్తా!’’ జేసీ బెదిరింపులు వెలుగులోకి
అనంతపురం, సాక్షి: కూటమి సర్కార్ అండతో తాడిపత్రి టీడీపీ మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి(JC Prabhakar Reddy) రెచ్చిపోతూనే ఉన్నారు. అధికారులు, రాజకీయ నేతలు ఎవరనేది చూడకుండా దురుసుగా ప్రవర్తిస్తూ నిత్యం వార్తల్లోక్కి ఎక్కుతున్నారు. తాజాగా మరోసారి ఆయన వివాదంలో నిలిచారు. ఓ దళిత నేతను ఫోన్లో బెదిరించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పైగా ఇది ఇక్కడితోనే ఆగలేదు. దళిత సంఘం నేత రాంపుల్లయ్య మున్సిపల్ సమావేశాలకు హాజరు కావడం లేదు. ఈ విషయంపై ఆయన్ని ఫోన్లో బెదిరించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పిలిచినా మీటింగ్‌కు రాకపోవం ఏంటని జేసీ ప్రశ్నించగా.. ఆ ఆహ్వానం గౌరవంగా ఉండాలని రాంపుల్లయ్య అన్నారు. ఆ సమాధానం తట్టుకోలేని జేసీ ‘‘నేను పిలిస్తే రావా.. రేయ్.. నీ కథ చూస్తా’’ అంటూ చిందులు తొక్కాతూ ఫోన్ పెట్టారు. అయితే.. ఈ బెదిరింపుల వ్యవహారాన్ని తాడిపత్రి(Tadipatri) సీఐ సాయి ప్రసాద్ దృష్టికి ఫోన్ ద్వారా రాంపుల్లయ్య తీసుకెళ్లారు. ఈ క్రమంలో.. సీఐ కూడా జేసీకి మద్దతుగా రాం పులయ్యనే దూర్భాషలాడారు. పరస్పర దూషణలతో కూడిన ఆ ఆడియో క్లిప్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇదీ చదవండి: ఏపీ రాజకీయాలకు సరిగ్గా సరిపోయే సామెత! -
మరో వివాదంలో ఆదిమూలం.. ఆడియో లీక్
తిరుపతి జిల్లా, సాక్షి: తిరుపతి జిల్లా సత్యవేడు టీడీపీ బహిష్కృత ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆడియో క్లిప్ కలకలం రేపుతోంది. అసభ్య పదజాలంతో మాట్లాడిన ఓ ఆడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల వరలక్ష్మీ అనే మహిళపై లైంగిక దాడి ఘటన మరువక ముందే ఆదిమూలం మరో వివాదంలో చిక్కుకున్నారు.‘‘ కలర్ మారిపోయావు. పర్సనాలిటీ పెరిగిపోయింది. అప్పటికి ఇప్పటికి బ్యూటిఫుల్‌గా ఉన్నావు. అప్పటికి ఇప్పటికీ సూపర్ ఉన్నావు. చాలా అందంగా ఉన్నావు’’ అంటూ ఓ మహిళతో మాట్లాడిన ఆడియో క్లిప్ సోషల్ మీడియా లో వైరల్‌గా మారింది. ఇలా అసభ్యకరంగా మహిళతో సంభాషిస్తూ అడ్డంగా దొరికిపోయారు. గత నెలలో వరలక్ష్మి అనే మహిళపై లైంగిక దాడి ఘటనలో అడ్డంగా దొరికిపోయినా.. ఆయన మళ్లీ అదే పంథాను అనుసరిస్తున్నారు. తాజాగా బయటపడిన ఆడియో క్లిప్ విషయంలో.. ఎమ్మెల్యే తీరుపై నియోజవర్గం ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. గత నెలలో టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనపై లైంగిక దాడి చేయడమే కాకుండా.. తన వర్గీయులతో వేధిస్తున్నారంటూ కేవీబీ పురం మండల టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరలక్ష్మి ఆరోపించిన విషయం తెలిసిందే. బాధిత మహిళ పట్ల సానుభూతి చూపించకుండా.. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిస్తున్నారంటూ వాపోయింది. ఫిర్యాదు చేసినా చంద్రబాబు, లోకేశ్ న్యాయం చేయకపోవడంతో.. ఇక ‘ఆత్మహత్య చేసుకుంటున్నా’నంటూ సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్ట్ తీవ్ర దుమారం రేపింది.చదవండి: ‘మాట మార్చడంలో బాబు తరువాతే ఎవరైనా’ -
హీరోయిన్ ఆడియో క్లిప్ లీక్.. మండిపడుతున్న నెటిజన్స్!
బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్లో వాల్తేరు వీరయ్య, ఏజెంట్ చిత్రాల్లో ప్రత్యేక సాంగ్స్‌లో మెరిసింది. ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న ఎన్బీకే 109లోనూ కనిపించనుంది. అంతేకాకుండా బ్లాక్ రోజ్ అనే మరో తెలుగు సినిమా కూడా ఆమె చేస్తోంది. అయితే తాజాగా బాలీవుడ్లో ఆమెజేఎన్యూ: జహంగీర్ నేషనల్ యూనివర్సిటీ చిత్రంలో నటిస్తోంది.అయితే తాజాగా ఊర్వశి రౌతేలా తన మేనేజర్‌తో మాట్లాడుతున్న కాల్ ఆడియో నెట్టింట వైరల్‌గా మారింది. తన మేనేజర్‌తో ఇటీవల బాత్రూమ్ వీడియో లీక్ కావడంపై ఆమె మాట్లాడింది. అసలు ఈ వీడియో బయటకు ఎలా వచ్చింది? ఆ వీడియో మీరు చూశారా? అని ఊర్వశి రౌతేలా ప్రశ్నించింది. దీనిపై మేనేజర్ స్పందిస్తూ.. మన టీమ్ సోషల్ మీడియా నుంచి ఆ వీడియో డిలీట్ చేయడానికి ప్రయత్నిస్తుందని చెబుతారు. అసలు ఇదంతా ఎలా జరిగిందని అసహనం వ్యక్తం చేస్తుంది. అయితే ఈ కాల్ రికార్డ్ సైతం నెట్టింట లీక్ కావడంతో నెటిజన్స్ మండిపడుతున్నారు. వీడియోతో పాటు కాల్ రికార్డింగ్ కూడా బయటకు రావడంతో మరింత హాట్ టాపిక్‌గా మారింది.అయితే ఇదంతా ఊర్వశి రౌతేలా పబ్లిషిటీ స్టంట్ అంటూ నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ చీప్‌గా పబ్లిషిటీ స్టంట్స్ చేస్తారా అంటూ నిలదీస్తున్నారు. త్వరలోనే జేఎన్‌యూ మూవీ రిలీజ్ ఉండడంతో ఇదంతా ప్రమోషన్లలో భాగమేనని భావిస్తున్నారు. అయితే ఆడియో లీక్ కావడంపై ఊర్వశి రౌతేలా ఇంకా స్పందించలేదు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
రాహుల్ గాంధీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం! ఆడియో వైరల్
ఇటీవల కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ ఉపయోగించి తయారు చేస్తున్న డీప్ ఫేక్ వీడియోలు కలకలం సృష్టిస్తున్నాయి. సినీ రాజకీయ ప్రముఖులకు డీప్ ఫేక్ వీడియోలు తలనొప్పిగా మారుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా రాహుల్ గాంధీకి సంబంధించిన ఏఐ జనరేటెడ్ వాయిస్ క్లిప్ ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. అయితే రాహుల్ గాంధీ.. ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లు ఆ వాయిస్ క్లిప్ విపిస్తుంది. ఏఐ వాయిస్‌తో పాటు.. మ్యూజిక్, ఢిల్లీలోని ఎర్రకోట దృష్యాలు కూడా ఉన్నాయి. అయితే ఈ ఆడియో క్లిప్‌ను కొందరు కాంగ్రెస్ మద్దతుదారులు షేర్ చేయటంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.The day is soon… on June 4… The Prime Minister will be Rahul Gandhi… pic.twitter.com/ymrLZC447q— Aaron Mathew (@AaronMathewINC) April 25, 2024 ఒకవైపు లోక్‌సభ ఎన్నికల ప్రచారం జోరుగా జరుగుతున్న వేళ.. రాహుల్ గాంధీ ప్రమాణం చేసినట్లు ఆడియో క్లిప్ వైరల్ కావటంతో నెటిజన్లు తమ నేతకు మద్దతుగా కామెంట్లు పెడుతూ వీడియో క్లిప్ షేర్ చేస్తున్నారు.‘ఆ రోజు త్వరలోనే రానుంది.. అది జూన్ 4’, ‘రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు’అని నెటిజన్లు కామెంట్లు పెట్టారు. అయితే ఈ ఆడియో క్లిప్.. ఏఐ వాయిస్ క్లోన్ అని కొన్ని డిటెక్షన్ టూల్స్ నిర్ధారణ చేశాయి. ఆడియో, వీడియో రెండు వేరుగా చేసి.. ఫ్యాక్ట్ చేయగా ఈ క్లిప్ ఏఐ జనరేటెడ్‌గా తేలిందని పేర్కొంటున్నాయి. ఇది ఫేక్ ఆడియో క్లిప్ అని తేల్చాయి. ఇక.. ఇటీవల ఇదే తరహాలో కాంగ్రెస్ నేత కమల్‌నాథ్ ఏఐ వాయిస్ క్లోన్ క్లిప్ ఒకటి వైరల్‌గా మారింది. అందులో ఆయన ఆర్టికల్ 370 గురించి మాట్లాడినట్టు ఉంది. -
‘హలో.. నేను మీ జయలలితను మాట్లాడుతున్నా’
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత మరణించి ఏడేళ్లు అవుతోంది. నేడు(శనివారం) ఆమె 76వ జయంతి సందర్భంగా ఏఐఏడీఎంకే జనరల్ సెక్రటరీ ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్), పలువురు సీనియర్ నేతలు, కార్యకర్తలు జయలలిత(అమ్మ)కు నివాళులు అర్పించారు. అయితే ఈసారి వినూత్నంగా ‘అమ్మ’ జయంతిని పురస్కరించుకొని.. పార్టీ కేడర్‌లో ఉత్సాహం నింపడానికి ఏఐఏడీఎంకే సరికొత్తగా ఆలోచించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో తయారుచేసిన ‘అమ్మ’వాయిస్ క్లిప్‌ను పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా ‘అమ్మ’తో ఉన్న అనుబంధాన్ని నేతలు గుర్తు చేసుకున్నారు. ఏఐ వాయిస్ క్లిప్‌లో అచ్చం ‘అమ్మ’నే పార్టీ నేతలు, కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడినట్టు ఉండటం విశేషం. ఆ ఏఐ క్లిప్‌లో దివంగత నేత జయలలిత ప్రసంగం ఇలా ఉంది... ‘హలో.. నేను మీ జయలలితను మాట్లాడుతున్నా. ఈ సాంకేతికతకు నా కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఎందుకుంటే నేను మీతో మాట్లాడే అవకాశం ఇచ్చింది. మన పార్టీ చాలా ఎత్తుపల్లాలను చూసింది. మనం అధికారంలో ఉన్నో సమయంలో మహిళలు, విద్యార్థులకు అనేక సంక్షేమ పథకలు ప్రవేశపెట్టి అమలు చేశాం. மாண்புமிகு இதயதெய்வம் புரட்சித்தலைவி அம்மா அவர்களின் 76வது பிறந்தநாள் விழாவினை முன்னிட்டு, மாண்புமிகு கழக பொதுச்செயலாளர் புரட்சித்தமிழர் @EPSTamilNadu அவர்களின் வழிகாட்டுதலின்படி இன்றைக்கு தகவல் தொழில்நுட்பத்தின் உச்சமாகக் கருதப்படும் செயற்கை நுண்ணறிவு (Artificial Intelligence)… pic.twitter.com/APuSq7u6AW — AIADMK (@AIADMKOfficial) February 24, 2024 ...ప్రస్తుతం ఒకవైపు మనకు ద్రోహం చేసే కేంద్ర ప్రభుత్వం ఉంది. మరోవైపు అవినీతితో నిండిపోయిన పనికిరాని రాష్ట్ర ప్రభుత్వం ఉంది. నా పుట్టిన రోజు సందర్భంగా ఒకటి చెబుతున్నా.. మన పార్టీ నేతృత్వంలో ప్రజల ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలి. మన కార్యకర్తలంతా నా మార్గంలో పార్టీ కోసం నడవాలని కోరుతున్నా. పార్టీకి, సోదురుడు ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్) మద్దతుగా నిలవాలి. ఈపీఎస్ నాయకత్వాని బలోపేతం చేయాలి. ఎందుకంటే మనం ప్రజల కోసమే ఉన్నాం’ అని జయలలిత స్వయంగా మాట్లాడినట్లు వాయిస్ వచ్చింది. దీంతో జయలలిత ఏఐ వాయిస్ క్లిప్ విన్న కార్యకర్తలంతా తమ అధినేత్రి జీవించి ఉన్నట్లుగానే అనిపించిందని భావోద్వేగం వ్యక్తం చేశారు. ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్) 2022లో ఏఐఏడీఎంకేకు నాయకత్వం వహిస్తున్నారు. పన్నీర్ సెల్వం పార్టీ నుంచి తొలగించబడిన అనంతరం ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్) పార్టీ చీఫ్‌గా కొనసాగుతున్నారు. -
Karnataka Assembly election 2023: భూమిపుత్రున్ని: ఖర్గే
కలబురిగి: అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసిన వేళ కర్ణాటక ప్రజలనుద్దేశించి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే భావోద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు. సోమవారం కలబురిగిలో బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘‘నన్నెవరైనా చంపితే చంపొచ్చు గాక! తుదిశ్వాస దాకా పేదల కోసం, వారి ప్రయోజనాల పరిరక్షణ కోసం పోరాడుతూనే ఉంటా’’ అని స్పష్టం చేశారు. ‘‘నేను కన్నడ భూమిపుత్రున్ని. అందుకు ఎంతగానో గర్వపడతా’’ అన్నారు. ఖర్గేను, ఆయన భార్యాపిల్లలను చంపేందుకు బీజేపీ అభ్యర్థి మణికంఠ రాథోడ్ కుట్ర పన్నారని కాంగ్రెస్ ఆరోపించడం, అందుకు రుజువుగా ఆడియో రికార్డు విడుదల చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. అది కచ్చితంగా బీజేపీ అగ్ర నేతల మనసు లోంచి పుట్టుకొచ్చిన ఆలోచనే అయ్యుంటుందని ఆరోపించారు. వారి దన్ను లేనిదే ఎవరూ అలాంటి వ్యాఖ్యలు చేయరన్నారు. ‘‘చిన్నతనంలోనే కుటుంబం మొత్తాన్ని పోగొట్టుకుని ఒంటరిగా మిగిలాను. వాళ్లేమైనా చేసుకోవచ్చు. కానీ ఇలాంటి బెదిరింపులకు భయపడను. నన్ను కాపాడేందుకు అంబేడ్కర్ అందించిన రాజ్యాంగముంది. కర్ణాటక ప్రజలంతా నా వెనక ఉన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టాక దేశ ప్రజలంతా నా వెనకే ఉన్నారు. మన దేశంలో సగటు ఆయు ప్రమాణం 70 ఏళ్లే. నాకు 81 ఏళ్లు. అంటే ఇప్పటికే బోనస్ పీరియడ్‌లో ఉన్నా. మహా అయితే మరో ఎనిమిదేళ్లు బతుకుతానేమో. నన్నూ, నా కుటుంబాన్నీ తుడిచి పెట్టొచ్చు గాక. భయపడేది లేదు. నా స్థానంలో మరొకరు పుట్టుకొస్తారు’’ అన్నారు. ‘‘ప్రధాని మోదీ కూడా పదేపదే నా కుమారుని గురించి మాట్లాడుతున్నారు. అతనిది మోదీ స్థాయి కాదు. నా గురించి మాట్లాడితే అర్థం చేసుకోవచ్చు’’ అన్నారు. ‘‘తాను భూమిపుత్రున్నని గుజరాత్లో మోదీ చెప్పుకుంటారు. తన కోసం బీజేపీని గెలిపించాలని ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను కోరారు. అలాగే కర్ణాటక భూమిపుత్రుడినైన నా కోసం కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరుతున్నా’’ అన్నారు. తాను కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉండగా రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు సహకరించాలని కోరారు. బెంగళూర్‌లో రాహుల్ బస్సు ప్రయాణం బనశంకరి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి చివరి రోజైన సోమవారం కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ బెంగళూరులో హల్చల్ చేశారు. కన్నింగ్‌హాం రోడ్డులో కాఫీ డేలో కాసేపు గడిపారు. అక్కడ కాఫీ రుచి చూశాక దగ్గర్లోని లోకల్ బస్టాప్‌లో కాలేజీ విద్యార్థులు, వర్కింగ్ విమెన్‌తో మాటలు కలిపారు. స్టూడెంట్లతో సెల్ఫీ దిగారు. తర్వాత లోకల్ బస్సెక్కి ప్రయాణికురాళ్లతో మాట్లాడారు. లింగరాజపురంలో బస్సు దిగి బస్టాప్‌లో మహిళలతో మరోసారి ముచ్చటించారు. ‘ధరల పెరుగుదల, ఇంటి పెద్ద అయిన ప్రతి మహిళకూ నెలకు రూ.2,000 ఇస్తామన్న కాంగ్రెస్ హామీ, ఉచిత బస్సు ప్రయాణం తదితరాలపై వారు నాతో లోతుగా చర్చించారు’’ అని చెప్పుకొచ్చారు. -
అందుకే అలా మాట్లాడా.. నాకు వేరే ఉద్దేశం లేదు: కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. టీపీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్, ఆయన కుమారుడు డాక్టర్ సుహాస్‌ను తన వాళ్లు చంపేస్తారంటూ బెదిరింపులకు పాల్పడిన ఫోన్‌కాల్ రికార్డింగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో, రాజకీయంగా ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. వెంకట్‌రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. నేను భావోద్వేగంతో చేసిన వ్యాఖ్యలే.. వేరే ఉద్దేశం లేదు. నా 33 ఏళ్ల రాజకీయ జీవితంలో నేను ఎవరినీ దూషించలేదు. శత్రువును కూడా దగ్గరకు తీసే తత్వం నాది. చెరుకు సుధాకర్‌పై పీడీ యాక్ట్ పెడితే నేనే కొట్లాడాను. నాపై విమర్శలు వద్దనే సుధాకర్ కుమారుడికి చెప్పాను. నా మాటలను కట్ చేశారు. కొన్ని అంశాలు మాత్రమే లీక్ చేశారు. ఫోన్ రికార్డు చేస్తున్న విషయం నాకు కూడా తెలుసు. కాంగ్రెస్ పార్టీలో చేరిన నాటి నుంచి చెరుకు సుధాకర్ నన్ను తిడుతున్నాడు. ఎందుకు తిడుతున్నావని అడిగాను. నన్ను తిట్టొదు అని మాత్రమే సుహాస్‌కు చెప్పాను. నన్ను సస్పెండ్ చేయాలి అనడం, తిట్టడం వల్లే బాధతో అలా మాట్లాడాను’ అని తెలిపారు. ఇదిలా ఉండగా.. కోమటిరెడ్డి ఆడియో క్లిప్‌లో ‘మీ నాన్న వీడియో చూసినవా? ఇప్పటికే నన్ను వందసార్లు తిట్టిండు. నెలరోజుల నుంచి ఓపిక పడుతున్నా. నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చి నన్ను విమర్శిస్తాడా? వాడిని వదిలేది లేదు. వాడు (చెరుకు సుధాకర్) క్షమాపణ చెప్పకపోతే మా వాళ్లు చంపుతరు. నా అభిమానులు వంద కార్లల్లో బయల్దేరారు. ఇంటి పార్టీ ఏందిరా? వాడు పీడీ యాక్ట్ కేసులో జైల్లో పడితే నేను ఒక్కడినే వెళ్లి పరామర్శించిన. కౌన్సిలర్‌గా గెలవనోడు నన్ను విమర్శిస్తాడా? 25 ఏండ్ల నా రాజకీయ జీవితంలో లక్షల మందిని బతికించిన. వారిలో చాలామంది ఇప్పటికే వాడి మీద కోపంతో చంపుతామంటూ బయల్దేరారు. నేను ఎంతమందినని ఆపుతా. నిన్ను కూడా చంపేస్తరు. నీ హాస్పిటల్ ఉండదు. వారంలో వాడిని చంపేస్తారు’ అని సీరియస్ అయ్యారు. చెరుకు సుధాకర్ సీరియస్.. ఈ ఆడియోను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్చార్జి మాణిక్‌రావు థాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి పంపించానని సుధాకర్ తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే దృష్టికి కూడా తీసుకెళ్తానన్నారు. ఎంపీ కోమటిరెడ్డి.. తనపై చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై అధిష్టానమే చర్యలు తీసుకోవాలన్నారు. మరోవైపు.. కోమటిరెడ్డిపై సుహాస్ నల్లగొండ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు కోమటిరెడ్డి నుంచి ప్రాణభయం ఉన్నదని, రక్షణ కల్పించి ఆయన్ను వెంటనే అరెస్టు చేయాలని కోరారు. -
మరణానికి ముందు డాక్టర్లపై జయలలిత ఆగ్రహం.. ఆడియో క్లిప్ వైరల్
సాక్షి, చెన్నై: దాదాపు ఏడేళ్లు కావొస్తున్నా.. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి కేసులో అనుమానాలు మాత్రం తొలగడం లేదు. జయలలిత మరణంపై దర్యాప్తు చేసిన జస్టిస్ ఆర్ముగస్వామి కమిటీ.. ఇటీవల ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక సైతం సంచలనంగా మారింది. తాజాగా జయలలిత మృతి కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. మరణానికి ముందు చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఆమె మాట్లాడిన ఓ ఆడియో క్లిప్ వైరల్‌గా మారింది. నేను బాధ పడుతుంటే మీరు పట్టించుకోవడం లేదంటూ ఆపోలో సిబ్బందిపై జయలలిత ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను పిలిచినపుడు మీరెందుకు రాలేదంటూ డాక్టర్లపై జయలలిత మండిపడ్డారు. చికిత్స సమయంలో ఆమె తీవ్రంగా దగ్గుతుండటం, డాక్టర్లపై చిరాకు పడుతున్నట్లు స్పష్టమవుతోంది. జయలలిత ఆడియోను ఆస్పత్రి సిబ్బందిలోని ఓ వ్యక్తి రికార్డ్ చేశారు. జయలలిత మరణంపై దర్యాప్తు చేసిన జస్టిస్ ఆర్ముగస్వామి నివేదికతో ఆడియో బయటకు వచ్చింది. #Jayalalithaa's audio clip goes viral #JayalalithaaDeath pic.twitter.com/beG7zS3xCj — Janardhan Veluru (@JanaVeluru) October 20, 2022 విదేశాలకు అవసరమా? అదే విధంగా 2017లో చెన్నైలో తన ప్రెస్ మీట్ అనంతరం డాక్టర్ రిచర్డ్ బిల్ మాట్లాడిన వీడియో కూడా వైరల్‌గా మారింది. జయలలిత వైద్యం కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం ఉందా? అని శశికళ ప్రశ్నించగా.. ఆమె తప్పక వెళ్లాలని డాక్టర్ చెప్పడంతో వారు అంగీకరించారు. కానీ ఆ తర్వాత జయలలితే స్వయంగా చికిత్స కోసం విదేశాలకు వెళ్లేందుకు ఇష్టపడలేదని డాక్టర్ రిచర్డ్ బిల్ పేర్కొన్నారు. చదవండి: జయలలిత మరణం...శశికళను విచారణకు ఆదేశించాలన్న కమిషన్ ఆర్ముగస్వామి నివేదిక ఏం చెబుతోంది ఇదిలా ఉండగా జయలలిత మరణంపై జస్టిస్ ఆర్ముగ స్వామి కమిషన్ 608 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన విషయం తెలిసిందే. ఈ కమిషన్ ఇచ్చిన నివేదికను మంగళవారం అసెంబ్లీ ముందుకొచ్చింది. ఇందులో కమిషన్ సూచించిన పలు కీలక అంశాలను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రస్తావించింది. ఈ నివేదికలోనూ పలు అంశాలు శేష ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. మాజీ ముఖ్యమంత్రి మరణించిన సమయంలో తేడా ఉండటం, జయలలితకు లండన్, అమెరికా వైద్యులు యాంజియో చికిత్సకు సిఫార్సు చేసినా చివరి వరకు అందించకపోవడంపై ఆర్ముగస్వామి కమిషన్ పలు అనుమానాలు వ్యక్తం చేస్తోంది. శశికళ విచారణకు ఆదేశం సమగ్ర సమాచారం కోసం చిన్నమ్మ శశికళతోపాటు ఏడుగురు కీలక వ్యక్తులను పూర్తి స్థాయిలో ప్రశ్నించాలని కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించడం గమనార్హం. శశికళ, జయలలిత వ్యక్తిగత డాక్టర్ శివ కుమార్, మాజీ సీఎస్ రామ్మోహన్రావు, మాజీ ఆరోగ్యశాఖ మంత్రి విజయ భాస్కర్, మాజీ ఆరోగ్య కార్యదర్శి రాధాకృష్ణన్ వంటి పేర్లను ప్రత్యేకంగా సూచిస్తూ వీరిని విచారణ పరిధిలోకి తీసుకురావాలని కోరింది. ఇక జయలలిత, శశికళ మధ్య గతంలో నెలకొన్న గొడవల వివరాలను సైతం నివేదికలో పొందుపరిచింది. విచారణకు తనను ఆదేశించడంపై శశికళ స్పందించారు. నివేదికను ఊహాగానాలతో రూపొందించారని.. జయలలిత మరణాన్ని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఇక దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత డిసెంబర్ 2016న మృతి చెందిన విషయం తెలిసిందే. -
డాడీ.. మంచి ఒక ముచ్చట జెప్పవే!
బహుశా.. ఆ పోరడు సంబురంగా ఇంటికి చేరే ఉంటడు. మధ్యల ఆగి షాపుల కొత్త బట్టలు కొనుక్కునే ఉంటడు. ముక్కవాసనొచ్చే దుప్పట్లు, ఇడిసిన బట్టలు ఉతికించుకుని కూడా ఉంటడు. అట్లే.. అమ్మ చేసిన గారెలు, కారప్పుస తింటూ.. సరదాగా దోస్తులతో ఆడుకుంట.. బాంబులు పేల్చుకుంట.. డాడీ చేతిల తన్నులు వడుకుంట ఉండాలనే కోరుకుందం. ఎందుకంటే ఆ పోరడు అవ్వయ్యలను అంతగా ఒర్రిచ్చిండు కావట్టి. పండుగలొస్తే సొంత ఊళ్లకు బయలుదేరే జోష్‌లో మునిగిపోతుంటారు అంతా. కానీ, హాస్టల్ స్టూడెంట్స్‌కు మాత్రం అవి భావోద్వేగాలతో నిండిన క్షణాలనే చెప్పొచ్చు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎప్పుడెప్పుడు వస్తారా? అనే ఎదురుచూపులు వర్ణణాతీతం. అలాంటి పిలగాడి ఆడియో క్లిప్ ఒకటి ‘హాస్టల్ తిప్పలు’ పేరుతో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ‘‘డాడీ.. నాకు మనసొప్పుతదలేదే..’’ అంటూ మొదలుపెట్టిన ఆ చిన్నారి.. తన తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడిన ఆడియో క్లిప్ ఒకటి గత రెండు మూడు రోజులుగా విపరీతంగా వైరల్ అవుతోంది. వాట్సాప్ మొదలు.. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇలా ఎక్కడ చూసినా ఈ క్లిప్ సందడి చేస్తోంది. ‘‘డాడీ.. ఒక మంచి ముచ్చట చెప్పవే.. అన్నీ సర్దుకుని రెడీగా ఉండమంటూ’’ తల్లిదండ్రులు చెప్పాల్సిన మాటలను కూడా తనే చెప్పి.. వాళ్లకు విసుగు తెప్పించాడు ఆ చిన్నారి. అంతేకాదు ఆ తండ్రితో పాటు తల్లి కూడా అతన్ని సముదాయించేందుకు చెప్పిన మాటలు, పదే పదే ఫలానా డేట్‌కు కన్ఫర్మ్ వస్తరు కదా అని అడగడం, గిదే లాస్ట్ అంటూ చివర్లో ఆ చిన్నారి పలికిన పలుకులు నవ్వులు పూయిస్తున్నాయి. అయితే.. అదే సమయంలో ఊపిరి తీయకుండా ఆ చిన్నారి మాట్లాడిన మాటలు, అతనిలోని బాధ-ఆందోళన.. అన్నింటికి మించి సున్నితత్వాన్ని ప్రతిబింబించాయని చాలామంది అభిప్రాయపడుతున్నారు. హాస్టల్లో ఉంటేనే.. అలాంటి కష్టాలు తెలుస్తాయని కామెంట్లు చేస్తున్నారు. దసరా సెలవులంటే.. బహుశా ఇది ఈ మధ్య సంభాషణ అయి ఉండొచ్చు. ఆడియో క్లిప్ ఉద్దేశం ఏదైనా.. వైరల్ మాత్రం విపరీతంగా అయ్యింది. మరి.. అనుకున్నట్లు ఆ తల్లిదండ్రులు ఆ పిలగాడి దగ్గరకు వెళ్లారా? ఇంటికి తీసుకువెళ్లారా? అనే ఆత్రుతతో ప్రశ్నించే వాళ్లే కామెంట్ బాక్స్‌లో ఎక్కువైపోయారు. మొత్తానికి ఆ ఫ్యామిలీ ఎవరో.. ఎక్కడుంటారో!. Video Credits: pranks telugu -
కర్ణాటక మంత్రి ఆడియో కలకలం.. సీఎం బొమ్మైకి కొత్త చిక్కులు!
బెంగళూరు: కర్ణాటకలో మరోమారు ముఖ్యమంత్రి మార్పు ఉండనుందనే ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో ఆ రాష్ట్ర మంత్రి ఆడియో లీక్ కావటం కలకలం సృష్టిస్తోంది. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి కొత్త చిక్కులు తెచ్చి పెట్టింది. ‘తాము ప్రభుత్వాన్ని నడపటం లేదు.. మేనేజ్ చేస్తున్నాం’ అంటూ న్యాయ, పార్లమెంటరీ వ్యవహరాలశాఖ మంత్రి జేసీ మధుస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే మంత్రి వ్యాఖ్యలతో జరిగిన నష్టాన్ని పూడ్చే ప్రయత్నం చేశారు బొమ్మై. ఆ వ్యాఖ్యలు వేరే ఉద్దేశంతో చేసినవిగా సీఎం పేర్కొన్నారు. కాగా మంత్రి జేసీ మధుస్వామి చేసిన వ్యాఖ్యలతో కొందరు మంత్రులు విమర్శలు గుప్పించారు. పదవి నుంచి మధుస్వామి తప్పుకోవాలని ఉద్యానవన శాఖ మంత్రి మునిరత్నం సూచించారు. ఈ క్రమంలో మంత్రులతో తాను మాట్లాడనున్నట్లు సీఎం చెప్పారు. మధుస్వామిపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఆయన(మధుస్వామి) వేరే ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేశారు. ఆయనతో మాట్లాడతాను. తన ఉద్దేశం వేరు. ఆ మాటలను తప్పుడు ఉద్దేశంతో చూడకూడదు. పరిస్థితులు సరిగానే ఉన్నాయి. ఎలాంటి సమస్య లేదు. ఇతర మంత్రులతోనూ మాట్లాడతాను.’ అని పేర్కొన్నారు. కర్ణాటక మంత్రి మధుస్వామి, చెన్నపట్నానికి చెందిన సామాజిక కార్యకర్త భాస్కర్ మధ్య జరిగిన సంభాషణ ఆడియో శనివారం వైరల్‌గా మారింది. రైతుల సమస్యలను సూచిస్తూ కోఆపరేటివ్ బ్యాంకుపై భాస్కర్ ఫిర్యాదు చేసిన క్రమంలో..‘ఇక్కడ మేము ప్రభుత్వాన్ని నడపటం లేదు, కేవలం మేనేజ్ చేస్తున్నాం. మరో 7-8 నెలలు లాక్కొస్తాం.’ అని మధుస్వామి పేర్కొన్నారు. వచ్చే ఏడాది రాష్ట్రంలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మరోమారు ముఖ్యమంత్రి మార్పు చేసేందుకు బీజేపీ ఆలోచిస్తోందన్న ఊహాగానాల నేపథ్యంలో ఈ ఆడియో లీక్ కలకలం సృష్టిస్తోంది. ఇదీ చదవండి: బాలుడి హత్య.. కాంగ్రెస్‌లో ముసలం, ఎమ్మెల్యే రాజీనామా -
బీఎస్ఎన్ఎల్కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్
ఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికాం ఆపరేటర్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్)కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. మెరుగైన ప్రదర్శన ఇవ్వకపోతే పరిణామాలు తీవ్రంగానే ఉంటాయని కేంద్ర టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్.. 62 వేల మంది బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బీఎస్ఎన్ఎల్కు కేంద్రం ఈమధ్యే కోటి 64 లక్షల రూపాయల ప్యాకేజీ ప్రకటించింది. ఈ సందర్భంగా.. ఇకపై బీఎస్ఎన్ఎల్ మెరుగైన ప్రదర్శన కనబర్చాలని.. ఒకవేళ పని చేతకాకుంటే ఇళ్లకు వెళ్లిపోవాలని, లేకుంటే పంపించేయాల్సి ఉంటుందని ఉద్యోగులను ఉద్దేశించి వ్యాఖ్యానించారాయన. ఇదేం చిన్నకేటాయింపు కాదు. పునరుద్ధరణ ప్యాకేజీని రూపొందించిన విధానం.. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్నంత భారీ రిస్క్ ప్రపంచంలో మరే ప్రభుత్వం చేపట్టలేదు అంటూ వ్యాఖ్యలు చేశారు. ► ప్రతీ నెలా పనికి సంబంధించి నేనే సమీక్ష నిర్వహిస్తా. పని చేయనివాళ్లు, చేతకానీ వాళ్లు స్వచ్చందంగా విరమణ తీసుకుని ఇళ్లకు వెళ్లిపోండి. లేదంటే.. రైల్వేలో జరిగినట్లుగా స్వచ్ఛంద పదవీ విరమణ పొందేలా చేస్తాం. ► BSNL ఆర్థికంగా నిలదొక్కుకోవడానికే కేంద్ర కేబినెట్ భారీ ప్యాకేజీని ప్రకటించింది. మేము చేయవలసింది చేశాం. ఇక ఇప్పుడు చేయాల్సింది మీరే. పని చేయండి లేదంటే వెళ్లిపోండి. ► ఈ పోటీ పరిశ్రమలో మీ పనితీరు మాత్రమే మిమ్మల్ని కాపాడుతుంది. నేను రాబోయే 24 నెలల్లో మంచి ఫలితాలను చూడాలనుకుంటున్నా. నేనే మీ పనితీరుపై నెలవారీ నివేదిక చూస్తా అంటూ ఆయన మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడారు. గురువారం బీఎస్ఎన్ఎల్ సీనియర్ మేనేజ్మెంట్తో భేటీ అయ్యారు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్. ఈ సందర్భంగా అక్కడ జరిగిన భేటీకి సంబంధించిన ఆడియో క్లిప్ ఒకటి ఇప్పుడు లీక్ అయ్యింది. అయితే ఆ ఐదు నిమిషాల క్లిప్ ఒరిజినల్‌దే అనేది నిర్ధారణ కావాల్సి ఉంది. అదనంగా.. ఇదిలా ఉంటే.. భారత్ బ్రాడ్‌బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్ (BBNL)ని BSNLతో విలీనం చేసే ప్రతిపాదనను కూడా మంత్రివర్గం ఆమోదించింది. ఈ విలీనం ద్వారా, BSNL దేశంలోని 1.85 లక్షల గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేసిన 5.67 లక్షల కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్‌ను అదనంగా పొందుతుంది. ప్రస్తుతం, బీఎస్ఎన్ఎల్కు 6.83 లక్షల కిలోమీటర్లకు పైగా ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్వర్క్ ఉంది. ఇదీ చదవండి: ఈ ప్యాకేజీలో ఇచ్చిందేమిటి? వచ్చిందేమిటి? -
దుప్పటి కప్పుకున్నా అశ్లీలంగానే కనిపిస్తుంది : శ్రావణ భార్గవి
Okapari Okapari Sravana Bhargavi: టాలీవుడ్ సింగర్ శ్రావణ భార్గవి పేరు కొంతకాలంగా నెట్టింట హల్చల్ చేస్తుంది. తాజాగా ఆమె రిలీజ్ చేసిన ఓ పాటపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. అన్నమయ్య కీర్తనను అపహాస్యం చేసిందంటూ అన్నమయ్య వంశస్తులు మండిపడుతున్నారు. వెంకటేశ్వర స్వామికి అభిషేకం కైంకర్యం చేస్తూ భక్తి భావంతో పాడిన కీర్తనను శ్రావణ భార్గవి వివిధ భంగిమల్లో కనిపిస్తూ, కాళ్లు ఊపుతూ పాటను చిత్రీకరించడం పట్ల అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా తనపై వస్తోన్న విమర్శలపై సింగర్ శ్రావణ భార్గవి స్పందించింది. తాను పాడిన పాటలో ఎలాంటి తప్పులేదని, మీరు చూసే చూపులోనే తప్పుందని ఘాటుగా బదులిచ్చింది. 'ఆ వీడియోలో అశ్లీలత ఎక్కడ కనిపించింది? నేను ఆ పాటను ఎంత భక్తితో పాడానో నాకు తెలుసు. ఈ పాటలో మీకు తెలుగుదనం తప్పా ఇంకేదైనా కనిపిస్తే అది మీ చూపులో లోపం. నా ప్రాబ్లం కాదు.మీరు చూసే చూపులో లోపం ఉంటే దుప్పటి కప్పుకుని కూర్చున్నా అశ్లీలంగా కనిపిస్తుంది. నేనేం లిరిక్స్ మార్చి పాడలేదు. నా అంతరాత్మకి తెలుసు నేను తప్పుచేయలేదని. నిజంగా ఈ పాట తప్పు అంటే.. దేవుడే ఆ పాటని తీయించేస్తాడు. మగ గాయకులు ఆల్బమ్స్ రిలీజ్ చేసినప్పుడు ఎలాంటి వివాదాలు ఉండవు. కానీ అదే ఆడవాళ్లు రిలీజ్ చేసినప్పుడే ఇలాంటి వివాదాలు సృష్టిస్తారు' అంటూ శ్రావణ భార్గవి కౌంటర్ ఇచ్చింది. -
Vismaya Case: నాన్నా! భయమేస్తోంది.. వచ్చేయాలనుంది
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విస్మయ వరకట్న వేధింపుల హత్య కేసులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. భర్త కిరణ్‌ను దోషిగా ప్రకటించింది కొల్లాం న్యాయస్థానం. అంతేకాదు కీలక ఆధారం ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది. 22 ఏళ్ల విస్మయ అత్తింటి వేధింపులు భరించలేక.. తన ఇంటికి ఫోన్ చేసిన మాట్లాడిన ఆడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాను కుదిపేస్తోంది. ‘‘నన్ను బలవంతంగా ఇక్కడ ఉంచాలని చూస్తే.. మీరు నన్ను మళ్లీ చూడలేరు. నేను ఏదో ఒకటి చేస్తాను. ఇంక భరించలేను. అచా (నాన్న).. నాకు వెనక్కి వచ్చేయాలని ఉంది. నన్ను కొడతారని భయంగా ఉంది’’ అంటూ ఆమె కన్నీటి పర్యంతమైన వాయిస్ ఆ క్లిప్‌లో(మలయాళంలో) ఉంది. అయితే తండ్రి ఆమెను సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ.. ఆమె మాత్రం ఏడుస్తూనే ఉంది. కేరళ కొల్లాంలో ఆయుర్వేద మెడిసిన్ డిగ్రీ స్టూడెంట్ అయిన విస్మయ నాయర్.. కిందటి ఏడాది జూన్ 21న కొల్లాం సస్తమ్కొట్ట సమీపంలోని సస్తమనాదాలో ఉన్న అత్తగారింట్లో విగతజీవిగా కనిపించింది. అదనపు కట్న వేధింపులే ఆమె మృతికి కారణమనే ఆరోపణలు ఉన్నాయి. వరకట్న వేదింపులతో పాటు గృహ హింస కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. ఐపీసీలోని సెక్షన్లతో పాటు వరకట్న వేధింపుల చట్టంలోని సెక్షన్లు చార్జ్‌షీట్‌లో పొందుపర్చారు. ఈ వ్యవహారంతో విస్మయ భర్త కిరణ్ ప్రభుత్వ ఉద్యోగం కూడా ఊడింది. ఇంతకాలం బెయిల్ మీద బయట ఉన్నాడతను. ఇక మోటార్ వెహికిల్ డిపార్ట్మెంట్లో పని చేసే కిరణ్‌కి.. కొల్లాంకు చెందిన విస్మయ వీ నాయర్‌ను ఇచ్చి అంగరంగ వైభవంగా వివాహం చేశారు పెద్దలు. అయితే అదనపుకట్నం కోసం ఆమెను వేధించసాగాడు కిరణ్. అప్పటికీ కొత్త కారు కొనిచ్చినప్పటికీ.. తాను ప్రభుత్వ ఉద్యోగినని, వేరే మోడల్ కారు కావాలంటూ ఆమెను చిత్రహింసలకు గురి చేశాడు. ఈ క్రమంలో.. ఆమె ఉరికొయ్యకు వేలాడుతూ కనిపించడం విషాదాన్ని నింపడంతో పాటు దేశవ్యాప్తంగా వరకట్న మరణాలపై చర్చకు దారి తీసింది. ఇక విస్మయ కేసులో.. ఇవాళ (సోమవారం, మే 23) తీర్పు నేపథ్యంలో.. అతని బెయిల్ రద్దు అయ్యింది. దీంతో అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కొల్లాం అదనపు సెషన్స్ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ కేసులో ఆడియో, తాను వేధింపులకు గురైనట్లు ఫొటోలు పంపిన విస్మయ.. కీలక ఆధారాలను అందించినట్లు అయ్యింది. ఈ సాక్ష్యాల ఆధారంగా కోర్టు అతన్ని దోషిగా ప్రకటించింది. మంగళవారం అతనికి విధించబోయే శిక్షను ఖరారు చేయనుంది. ఈలోపే అధికారికమో, కాదో క్లారిటీ లేని ఈ ఆడియో క్లిప్ వైరల్ అవుతుండడం గమనార్హం. -
‘ఐజీకి ఎంత లంచమిచ్చావు? ఇక్కడ అన్నీ నేనే’
యశవంతపుర(బెంగళూరు): చిక్కమగళూరు జిల్లా మూడిగెరె బీజేపీ ఎమ్మెల్యే ఎం.పి. కుమారస్వామి ఒక ఎస్ఐకి ఫోన్ చేసి దూషించారు. ఇటీవల మల్లందూరు పోలీసుస్టేషన్‌కు కొత్తగా నియమితుడైన ఎస్ఐ రవీశ్‌కు ఎమ్మెల్యే ఫోన్ చేసి తిట్లందుకున్నారు. ఆ స్టేషన్‌కు రావద్దని ముందుగానే చెప్పా కదా. వాపస్ వెళ్లిపో. నా కాల్‌ను రికార్డు చేసుకున్నా పర్వాలేదు. రేపే అక్కడ నుంచి బదిలీ చేయిస్తా. ఇక్కడకి రావడానికి ఐజీకి ఎంత లంచం ఇచ్చావు. ఐజీ ఎవరు? మూడిగెరెకి అన్నీ నేనే. నన్ను కలవడానికి వస్తే ఉతికి పంపుతా అని మరికొన్ని మాటలతో అసభ్యంగా దూషించారు. ఈ ఆడియో వ్యాప్తి చెందింది. ఎస్ఐని తిట్టిన మాట వాస్తవమని ఎమ్మెల్యే చెప్పారు. అవినీతిపరుడు తన నియోజకవర్గానికి అవసరం లేదని అన్నారు. మరో ఘటనలో.. డీవైఎస్పీ కార్యాలయం ముందు ధర్నా దొడ్డబళ్లాపురం: నిందితులను అరెస్టు చేయాల్సిన పోలీసులు వారికి రక్షణ కల్పిస్తున్నారంటూ దొడ్డ పట్టణంలో డీవైఎస్పీ కార్యాలయం ముందు ప్రజా విమోచనా చళువళి (పీవీసీ) కార్యకర్తలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన పీవీసీ కార్యకర్తలు దొడ్డ తాలూకా కనకేనహళ్లిలో మూడు రోజుల క్రితం దళితులు నివసిస్తున్న గుడిసెలకు ముత్తురాజేగౌడ, ఈయన కుమారుడు మధు అనుచరులతో కలిసి నిప్పంటించారన్నారు. ఇందుకు సంబంధించి సాక్ష్యాలతో దొడ్డబెళవంగల పోలీసులకు ఫిర్యాదు చేస్తే బాధితులను బయట నిల్చోబెట్టి, నిందితులను లోపల కుర్చీలు వేసి కూర్చోబెట్టారని ఆరోపించారు. వినతిపత్రం స్వీకరించిన డీవైఎస్పీ నాగరాజు నిందితులను తప్పకుండా అరెస్టు చేస్తామని హామీ ఇచ్చారు. చదవండి: రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. లోకోపైలెట్ అప్రమత్తమైనప్పటికీ.. -
పొరపాటున నోరు జారా.. క్షమాపణలు కోరుతున్నా: ఎమ్మెల్సీ పట్నం
సాక్షి, హైదరాబాద్: తాండూరు సీఐను దూషించింనందుకు విచారం వ్యక్తం చేస్తున్నట్లు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తెలిపారు. పొరపాటున నోరు జారానని అన్నారు. ఆడియో క్లిప్పులతో పోలీసుల మనసు నొప్పిస్తే అది తనకు బాధకరంగా ఉంటుందని అన్నారు.తన వ్యాఖ్యల వల్ల పోలీసులు బాధపడితే క్షమాపణలు కోరుతున్నట్లు తెలిపారు. కాసేపట్లో సీఐను కలవనున్నట్లు ఎమ్మెల్సీ తెలిపారు. ‘పోలీసు సోదరులంతా నా కుటుంబ సభ్యులతో సమానం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి, అభివృద్ధి, శాంతిభద్రతలలో వారి కృషి అభినందనీయమన్నారు. నిన్నటి నుంచి విస్తృతంగా ప్రచారం అవుతున్న ఆడియో క్లాప్‌లు ఆవేశంగా మాట్లాడిన నేపథ్యంలో పొరపాటున నోరుజారి కొంత మంది మిత్రులు, పోలీసులు భాధపడితే తీవ్రంగా విచారం వ్యక్తం చేస్తున్నాను.రు. పోలీసులంటే నాకు ఎనలేని గౌరవం’ అని గురువారం ఓప్రకటనలో తెలిపారు. కాగా ‘రౌడీషీటర్లకు కార్పెట్ వేస్తావా..? ఎంత ధైర్యం? నీ అంతు చూస్తా!’ అంటూ తాండూరు సీఐపై ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన భావిగి భద్రేశ్వర జాతరకు ముందుగా మహేందర్‌రెడ్డి హాజరయ్యారు. అరగంట తర్వాత ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి వచ్చారు. దాంతో మరో కార్పెట్ వేసి ఎమ్మెల్యేను కూర్చోబెట్టారు. ఇదే మహేందర్‌రెడ్డి ఆగ్రహానికి కారణమైంది. ప్రొటోకాల్ ఎందుకు పాటించలేదని సీఐ రాజేందర్ రెడ్డికి ఫోన్ చేసి మహేందర్‌రెడ్డి బూతులు తిట్టారు. ‘నా ముందే రౌడీషీటర్లకు కార్పెట్ ఎలా వేస్తావు’ అని సీఐని నిలదీశారు. ‘రౌడీషీటర్లు ఎవరు ?’ అని సీఐ ప్రశ్నించగా.. ఎమ్మెల్యే పక్కన ఉన్నవారంతా వారేనంటూ దుర్భాషలాడారు. ఎమ్మెల్యే రౌడీషీటరా అంటూ సీఐ ప్రశ్నించగా.. ఎమ్మెల్సీ మళ్లీ తీవ్ర పదజాలం ఉపయోగించారు. మంచిగా మాట్లాడాలని సీఐ ఎమ్మెల్సీని కోరగా.. ‘నువ్వు ఇసుక అమ్ముకొంటలేవా?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ అమ్ముకొంటున్నానని సీఐ ప్రశ్నించగా.. త్వరలో పట్టిస్తానని ఫోన్ కట్ చేశారు. సీఐని దూషించిన కేసులో మహేందర్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్టు వికారాబాద్ ఎస్పీ తెలిపారు. . ఈ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మరడంతో ఆయన వివాదంలో చిక్కుకున్నారు. చదవండి👉వారసులొస్తున్నారు.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రెడీ అంటూ.. ఇదిలా ఉండగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డిపై మరో కేసు నమోదైంది. ఓ ప్రభుత్వ కార్యక్రమంలో యాలాల ఎస్సైపై మహేందర్ రెడ్డిపై నోరు జారినందుకు ఈ కేసుపెట్టారు. సీఐని దూషిస్తూ. ఇష్టం వచ్చినట్లు బూతులు తిట్టారు. కాగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తనతో అనుచితంగా వ్యవహరించారని ఎస్సై అరవింద్ ఆరోపించారు. తీవ్ర పరుష పదజాలాన్ని వాడారని, తనకు నచ్చని వాళ్లను స్టేజి పైనుంచి కిందకు దించాలంటూ బూతులు తిట్టారని అన్నారు. అరేయ్ ఎస్సై.. తమాషాలు చేస్తున్నావా అని తిట్టాడని. పబ్లిక్‌లో తిట్టడం అవమానకరంగా ఉందన్నారు. మహేందర్‌రెడ్డిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. -
కరీంనగర్: మహిళా కానిస్టేబుల్ ఆడియో కలకలం
సాక్షి, కరీంనగర్: పోలీసు విభాగంలో స్పౌస్ బదిలీల విషయంలో ఇటీవల ఓ కానిస్టేబుల్ పోలీసు వాట్సాప్ గ్రూపుల్లో పంపించిన ఆడియో సంచలనమైంది. తాజాగా ఓ మహిళా కానిస్టేబుల్ బదిలీ అయ్యి, తన భర్తకు దూరంగా ఉంటూ చాలా ఇబ్బందులు పడుతున్నాననే ఆడియో ‘సాక్షి’కి అందింది. అందులో రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, డీజీపీ గారికి నమస్కారం సార్.. అంటూ మొదలుపెట్టి, 317 జీవోలో రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి జగిత్యాల జిల్లాకు ట్రాన్స్ఫర్ అయినట్లు.. తన భర్త ఒకచోట, తానొక చోట ఉంటున్నామని చెప్పింది. స్పౌస్ ట్రాన్స్ఫర్ దరఖాస్తు చేసి, నాలుగు నెలలవుతోందని.. తనకు మూడు సంవత్సరాల బాబు ఉన్నాడని.. బాబును పట్టుకొనే డ్యూటీకి వెళ్తున్నట్లు తెలిపింది. ఇటీవల భద్రాచలం బందోబస్తుకు తీసుకెళ్లడంతో అనారోగ్యానికి గురయ్యాడని వాపోయింది. పట్టుకునే వారు ఎవరూ లేరు సార్.. తాను తన కొడుకు ఏదో ఒకటి చేసుకొని, రెండు మూడు రోజుల్లో చచ్చిపోతామని ఆవేదన వ్యక్తం చేసింది. తన సమస్యకు పరిష్కారం చూపాలని ఆడియోలో వేడుకుంది. -
త్రివిక్రమ్‌పై సంచలన వ్యాఖ్యలు.. ఆడియో లీక్‌పై స్పందించిన బండ్లగణేష్
Bandla Ganesh Clarity On Audio Leak : నటుడు, నిర్మాత బండ్ల గణేష్ పవన్‌కల్యాణ్‌కు వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే. ఇక ఆయన సినిమా ఫంక్షన్లకి బండ్ల గణేష్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. అయితే రీసెంట్గా పవన్ నటించిన భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి తనను రాకుండా త్రివిక్రమ్ అడ్డకుంటున్నారంటూ బండ్ల గణేష్ మాట్లాడిన ఓ ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇందులో త్రివిక్రమ్‌ని దూషిస్తూ బండ్ల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లోనూ చర్చనీయాంశమయ్యాయి. అయితే తాజాగా ఈ ఆడియో క్లిప్‌పై స్పందించిన బండ్ల గణేష్.. అది తన గొంతు కాదని, ఎవరో కావాలనే ఇలా క్రియేట్ చేశారంటూ కొట్టి పారేశారు. అయితే దీనిపై అఫీషియల్‌గా ఓ స్టేట్మెంట్ ఇచ్చేందుకు మాత్రం ఆయన ఇష్టపడకపోవడం గమనార్హం. కాగా పవన్ కల్యాణ్, రానా మల్టీస్టారర్లుగా నటించిన భీమ్లా నాయక్ చిత్రం ఈనెల 25న రిలీజ్ కానుంది. -
'నన్ను అనుభవించాలనుకున్నాడు.. మాట విననందుకు'
మాంచెస్టర్ సిటీ ఫుట్‌బాల్ క్లబ్ ఆటగాడు మాసన్ గ్రీన్‌వుడ్‌పై సంచలన ఆరోపణలు వచ్చాయి.గ్రీన్వుడ్ మాజీ గర్ల్‌ఫ్రెండ్‌ను అని చెప్పుకుంటూ తనను లైంగికంగా అనుభవించడానికి ప్రయత్నించాడని.. మాట వినకపోవడంతో తనపై దాడికి పాల్పడ్డాడంటూ ఆమె ఆరోపణలు చేసింది. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు మాంచెస్టర్ క్లబ్లో పెద్ద దుమారమే రేపుతుంది. చదవండి: Rafel Nadal: అప్పుడు జొకోవిచ్‌తో.. ఇప్పుడు మెద్వెదెవ్‌తో ఇక విషయంలోకి వెళితే.. హారిట్ రాబ్సన్ అనే యువతి మాసన్ గ్రీన్‌వుడ్‌కు మాజీ గర్ల్‌ఫ్రెండ్ అంటూ చెప్పుకుంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. తనతో శృంగారంలో పాల్గొనాలని చెప్పాడని.. మాట విననందుకు తన శరీర భాగాలపై దాడి చేశాడంటూ.. అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. ఆ తర్వాత హారిట్- గ్రీన్‌వుడ్‌కు మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియో టేపును కూడా రిలీజ్ చేయడం సంచలనం రేపింది. ఆ ఆడియో టేప్‌లో మాసన్ గ్రీన్వుడ్ తన మాజీ గర్ల్‌ఫ్రెండ్‌ను శృంగారం కోసం అడగడం.. అందుకు ఆమె నిరాకరించడంతో.. బలవంతంగా ఆమెను అనుభవించడం వినిపించింది. కాగా ఈ విషయంలో మాసన్ గ్రీన్వుడ్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. మాంచెస్టర్ సిటీ క్లబ్ కూడా నిజానిజాలు తేలిన తర్వాతే మాసన్ గ్రీన్‌వుడ్‌పై వచ్చిన ఆరోపణలపై చర్య తీసుకుంటామని ఒక ప్రకటనలో తెలిపింది. Mason Greenwood forcing his ex girlfriend to have sex with him recorded… this is genuinely sickening to hear pic.twitter.com/t5hkvfv4HJ — ً (@erlingtxt) January 30, 2022 -
భారత్‌పే ఎండీకి ఉద్వాసన! అసలేం జరుగుతోందంటే..
ఫిన్‌టెక్ కంపెనీ భారత్‌పే ఎండీ, సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్‌కు ఉద్వాసన దిశగా కంపెనీ నిర్ణయం తీసుకోనుందా? తాజా పరిణామాలు అవుననే సంకేతాలు ఇస్తున్నప్పటికీ.. తెర వెనుక వ్యవహారం మరోలా ఉందని తెలుస్తోంది. కొటక్ మహీంద్రా బ్యాంక్ ఉద్యోగిని ఫోన్‌కాల్‌లో దుర్భాషలాడుతూ.. అష్నీర్ గ్రోవర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఒక క్లిప్ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో న్యాయపరమైన చర్యలకు దిగిన కొటాక్ మహీంద్రా, భారత్‌పే ఎండీకి నోటీసులు సైతం పంపింది. దీంతో కంపెనీ అష్నీర్‌ను హడావిడిగా సెలవుల మీద బయటికి పంపింది. తాజాగా మార్చి చివరినాటి వరకు ఆయన సెలవుల్ని పొడిగిస్తున్నట్లు భారత్‌పే ఒక ప్రకటనలో పేర్కొంది. శాశ్వతంగా..? ‘ఇది పూర్తిగా అష్నీర్ తీసుకున్న నిర్ణయం.. కంపెనీ, ఉద్యోగులు, ఇన్వెస్టర్లు, కస్టమర్ల ప్రయోజనాల దృష్ట్యా అష్నీర్ నిర్ణయంతో మేం ఏకీభవిస్తున్నాం’ అని ప్రకటనలో పేర్కొంది కంపెనీ. అయితే అష్నీర్ లాంగ్ లీవ్ వెనుక బోర్డు ఒత్తిడి ఉన్నట్లు ఓ ప్రచారం నడుస్తోంది. ప్రస్తుతం అష్నీర్ స్థానంలో సీఈవో సుహాయిల్ సమీర్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా శక్తివంతమైన మేనేజ్మెంట్ టీంతో ముందుకు వెళ్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటన విడుదల చేయడం ఆసక్తిని రేకెత్తించింది. మరోవైపు సెలవుల పరిణామంపై స్పందించేందుకు అష్నీర్ విముఖత వ్యక్తం చేయడంతో.. భారత్‌పే ఎండీ ఉద్వాసన దాదాపు ఖరారైనట్లేనని జోరుగా ప్రచారం సాగుతోంది. అలాంటిదేం లేదు! 3 బిలియన్ డాలర్ల విలువ ఉన్న భారత్‌పేలో ఇలాంటి విషపూరిత సంప్రదాయం మంచిది కాదనే ఉద్దేశానికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వచ్చినట్లు సమాచారం. బోర్డు సభ్యులతో పాటు ఇన్వెస్టర్లుగా సెకోయియా ఇండియా, రిబ్బిట్ క్యాపిటల్, కోవాట్యు మేనేజ్మెంట్తో పాటు పలువురు బ్యాంకింగ్ దిగ్గజాలు ఉన్నారు. వీళ్లంతా ప్రతిపాదించినందునే.. అష్నీర్ లాంగ్ లీవ్ మీద వెళ్లాడే తప్ప.. ఉద్వాసన లాంటి పరిణామం ఏం లేదని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపినట్లు ఓ ప్రముఖ మీడియాహౌజ్ కథనం ప్రచురించింది. ‘బోర్డుకు ఆయన్ని తొలగించే ఉద్దేశం లేదు. కానీ, మీడియా ఊహాగానాల్ని దూరం చేయాలన్న ఉద్దేశంతో మాత్రం ఉంది. ఇది పూర్తిగా ఆయన వ్యక్తిగత వ్యవహారం. ప్రొఫెషనల్‌కి సంబంధించింది కాదు’.. అంటూ బోర్డులోని ఓ కీలక సభ్యుడు వెల్లడించాడు. నైకా ఐపీవో సంబంధిత షేర్ల కేటాయింపులో కొటక్ మహీంద్రా బ్యాంక్ విఫలమైందని అష్నీర్ గ్రోవర్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఆపై 500 కోట్ల రూపాయలకు కొటక్ మహీంద్రా మీద దావా వేశారు. అంతటితో ఆగకుండా అష్నీర్, ఆయన భార్య మాధురి.. కాల్లో బ్యాంక్ ప్రతినిధిని అసభ్యంగా దూషించడంతో.. కొటక్ మహీంద్రా బ్యాంక్ లీగల్ నోటీసులు పంపింది. సంబంధిత వార్త: 500 కోట్ల పరిహారం.. ఆపై భార్యతో ఫోన్లో బండబూతులు! -
500 కోట్లకు దావా.. అదనంగా ఫోన్‌కాల్‌లో అసభ్య పదజాలం!
కొటక్ మహీంద్రా బ్యాంక్, ఫిన్‌టెక్ కంపెనీ ‘భారత్‌పే’ ఎండీ అష్నీర్ గ్రోవర్ మధ్య వివాదం మరింత ముదురుతోంది. నైకా ఐపీవో సంబంధిత షేర్ల కేటాయింపులో కొటక్ మహీంద్రా బ్యాంక్ విఫలమైందని అష్నీర్ గ్రోవర్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ వివాదం మరో మలుపు తిరిగింది. కొటక్ బ్యాంక్ నుంచి నష్టపరిహారం కోరుతూ 500 కోట్ల రూపాయలకు దావా కూడా వేశాడు అష్నీర్ గ్రోవర్. అయితే తాజాగా ఈ పరిణామంలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. అష్నీర్, ఆయన భార్య మాధురి ఫోన్‌కాల్‌లో తమ ప్రతినిధిని అసభ్యంగా దూషించారని ఆరోపిస్తూ న్యాయపరమైన చర్యలకు సిద్ధమైంది కొటక్ మహీంద్రా బ్యాంక్. ఈ మేరకు ఆదివారం ఆ జంటకు నోటీసులు సైతం పంపింది. అష్నీర్ గ్రోవర్-కొటక్ బ్యాంక్ మధ్య వివాదం మరింత ముదురుతోంది. అష్నీర్ జంట నుంచి అక్టోబర్ 30న లీగల్ నోటీసులు అందుకున్నట్లు ఒప్పుకున్న కొటక్ మహీంద్రా బ్యాంక్.. అది ఎందుకనో స్పష్టత ఇవ్వలేదు. కాకపోతే టైంకి మాత్రం బదులు ఇచ్చినట్లు వెల్లడించింది. అయితే గ్రోవర్ ఆడియో కాల్లో తమ ప్రతినిధిని ఉద్దేశించి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై మాత్రం న్యాయపరమైన చర్యలకు వెళ్తున్నట్లు కొటక్ మహీంద్రా బ్యాంక్ హెడ్ క్వార్టర్ ఒక మీడియా స్టేట్మెంట్లో వెల్లడించింది. నా గొంతు కాదు ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో గతవారం ఒక ఆడియో క్లిప్ విపరీతంగా వైరల్ అయ్యింది. ఒక బ్యాంక్ రిలేషన్షిప్ మేనేజర్‌తో దురుసుగా ఒక జంట మాట్లాడిన క్లిప్ అది. ఆ కాల్లో ఒక వ్యక్తి అసభ్య పదజాలం ఉపయోగిస్తుండగా.. అవతలి వ్యక్తి అతన్ని శాంతింపజేసే ప్రయత్నం చేస్తుంటాడు. అయితే ఆ క్లిప్‌లో గొంతు భారత్‌పే ఎండీ అష్నీర్ గ్రోవర్దే అంటూ కథనాలు వెలువడ్డాయి. కానీ, అష్నీర్ అది తన గొంతు కాదని ఖండించాడు కూడా. మరోవైపు లీగల్ నోటీసులు స్పందించేందుకు భారత్‌పే నిరాకరించింది. -
"థింక్ బి ఫోర్ యూ డయల్"
బ్రిటన్: ప్రతి దేశంలో ప్రజలకు అత్యవసర సమయంలో పోలీస్ సేవలు అందుబాటులో ఉండటం కోసం ఆయ దేశాల ప్రభుత్వాలు కొన్ని ప్రత్యేక ఫోన్ నెంబర్లను కేటాయిస్తాయి. ఆ ఫోన్ నెంబర్లు అందరికి గుర్తుండేలా ఫ్యాన్సీ నెంబర్లా త్రి డిజిట్ రూపంలో ఉంటుంది. వీటిని ప్రజలు అత్యవసర సమయాల్లో వినయోగించుకునేందుకు వీలుగా ఏర్పాటు చేస్తే కొంతమంది తెలిసి చేస్తారో తెలియక చేస్తారో గానీ అనవసరమైన వాటి గురించి కాల్ చేసి మరీ విసిగిస్తారు. (చదవండి: ఎర్త్‌షాట్ ప్రైజ్ గెలుచుకున్న భారత్) దీంతో పోలీస్ అధికారులు పరిస్థతి ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేం కదా. అయినా అవి ప్రజల సంరక్షణార్థం ఏర్పాటు చేస్తే వాటిని ప్రశ్నార్థకం చేసేలా అనవసరమైన వాటికి కాల్ చేసి విసిగిస్తే ఎవ్వరికైన కోపం రాకుండా ఉండదు కదా. అచ్చం అలాంటి సంఘటనే యూకేలోని థేమ్స్ వ్యాలీ పోలీస్ అధికారులకు ఎదురైంది. ఇంతకీ విషయం ఏమిటంటే ఒక వ్యక్తి పోలీస్ ఎమర్జెన్సీ కాల్ 999 (వృద్ధుల సహాయ నిమిత్తం ఏర్పాటు చేసింది)కి కాల్ చేసి "నేను ఒక సూపర్ మార్కెట్‌కి వెళ్లి కుళ్లిపోయిన చికెన్ కొనుగోలు చేసి ఫ్రిజ్‌లో నేరుగా పెట్టేశాను. ఆ తర్వాత చూస్తే కుళ్లిపోయిందని, తాను ఆ విషయం గురించి సూపర్ మార్కెట్ అధికారులోతో చెప్పాను. నాకేం ఏంచేయాలో తెలియడం లేదా ఏదైన సలహ ఇవ్వండి" అని కూడా చెబుతాడు. దీంతో ఆ పోలీస్ అధికారి ఇది వృద్ధుల సహాయ నిమిత్తం ఏర్పాటు చేసింది, క్రైమ్‌కి సంబంధించిన ఫిర్యాదులను మాత్రమే స్వీకరిస్తామని చెప్పి కాల్ కట్ చేసేస్తాడు. పైగా ఇలాంటి పిచ్చి పిచ్చి కాల్స్ నిరంతరం వస్తుండటంతో సదరు పోలీస్ అధికారులు వీటికి వెంటనే చెకపెట్టాల్సిందే అని అనుకున్నారు. దీంతో సదరు అధికారులు అనుకున్నదే తడువుగా ఆ కాల్ క్లిప్‌ని రికార్డు చేసిన వీడియో తోపాటు "డయల్ చేసే ముందు కాస్త ఆలోచించండి" అనే ట్యాగ్‌లైన్ జోడించి ఫేస్ బుక్‌లో షేర్ చేశారు. ప్రస్తతం ఇది కాస్త నెట్టింట తెగ వైరల్ అయ్యింది. దీంతో ఆ ఆడియా క్లిప్‌కి లక్షలో వ్యూస్‌లు, లైక్‌లు వచ్చాయి. మీరు కూడా వినండి. (చదవండి: "అవాక్కయేలా చేద్దాం అనుకుంటే అరెస్ట్ అయ్యాడు!") -
ఈ రాత్రికి నేను సజీవంగా ఉంటానో లేదో: మహిళ ఆడియో సంచలనం
తిరువనంతపురం: కేరళలో మహిళలపై వేధింపులు, హింస కేసుల నమోదు రోజురోజుకు తీవ్రమవుతోంది. నిన్నగాక మొన్న వివాహితను దారుణంగా హత్య చేశాడో ఉన్మాది. తాజాగా అత్తింటి వేధింపులతో కేరళలోని కన్నూర్ జిల్లా పయ్యన్నూర్‌కు చెందిన సునీషా ఉరి వేసుకుని చనిపోయిన ఘటన కలకలం రేపింది. అయితే ఈ రాత్రికి తాను ప్రాణాలతో ఉంటానో లేదో అనుమానమే అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న సునీషా (26) తన సోదరుడితో మాట్లాడిన ఆడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. సునీషా ఒకటిన్నర సంవత్సరాల క్రితం విజేష్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ ఆదివారం అత్తమామల ఇంట్లో ఉరివేసుకుని అనుమానాస్పద రీతిలో శవమై తేలింది. అయితే ఆమె చనిపోవడానికి కొన్ని రోజుల ముందు సోదరుడు సుధీష్‌తో భర్త, అత్తమామల వేధింపులు, తాను అనుభవిస్తున్నమానసిక క్షోభ గురించి ఫోన్ ద్వారా మొరపెట్టుకుంది. భర్త తీవ్రంగా కొట్టడం, అత్త జుట్టుపట్టుకుని లాగడం లాంటి విషయాలను చెప్పుకుంది. అలాగే మామ కూడా హెల్మెట్‌తో తనపై దాడి చేశాడని కూడా బాధితురాలు వాపోయింది. అంతేకాదు ఈ రాత్రి నేను సజీవంగా ఉంటానా డౌటే అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఆడియో ఇపుడు స్థానిక మీడియాలో వైరల్‌గా మారింది. భర్త కొడుతుండగా సునీషా మరో ఆడియో రికార్డు చేసింది. తన అత్త కొడుతున్నపుడు, మామ తనతో అసభ్యంగా ప్రవర్తించినపుడు ఎందుకు మాట్లాడలేదని భర్తని ప్రశ్నించడం, అలాగే తనను కొడుతున్న విజువల్స్ కూడా రికార్డ్ చేస్తానని సునీషా చెప్తే.. ఏం చేసుకుంటావో..చేసుకో పో అని విజేష్ చెప్పడం లాంటివి ఇందులో రికార్డైనాయి. దీంతో మొదట సునీషాది ఆత్మహత్యగా భావించినా, అత్తింటి వారే ఆమెను హత్యచేసి వుంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చదవండి : మహిళపై రెచ్చిపోయిన ఉన్మాది,15 కత్తి పోట్లు, చివరికి.. మరోవైపు తాము ఎన్ని ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడం వల్లనే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. పెళ్లైన దగ్గర్నుంచీ విజేష్, అతని తల్లిదండ్రులు సునీషాను వేధించారన్నాని సోదరుడు తెలిపాడు. దీంతో ఆమెను ఇంటికి తీసుకుపోవాలని చాలాసార్లు ప్రయత్నించినా, ఇందుకు విజేష్ సుతరామూ అంగీకరించ లేదన్నాడు. ఆమెను తీసుకెళ్లేందుకు వచ్చేటపుడు ఒంటరిగా రావద్దని, రాజకీయ పలుకుబడి ఉన్న అత్తింటివాళ్లు ఏదైనా చేస్తారని కూడా తనను హెచ్చరించిందని సుధీష్ తెలిపాడు. ఆమెను అక్కడినుంచి తీసుకొచ్చేందుకు పయ్యన్నూర్ పోలీసులను ఆశ్రయిస్తే.. ఆ కుటుంబంతో మాట్లాడి రేపు వస్తుంది, మాపు వస్తుంది కావాలనే తాత్సారం చేశారని ఆరోపించాడు. సునీషాను బయటకు అనుమతించకుండా కట్టడి చేశారని ఒక్కోసారి ఆమెకు తిండికూడా పెట్టేవారు కాదని వాపోయాడు. కాగా అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసినట్లు పయ్యన్నూర్ పోలీసులు తెలిపారు. -
కర్ణాటకలో ఆడియో క్లిప్ కలకలం: ‘జూలై 26న సీఎం మార్పు’
Nalin Kumar Kateel Audio Clip బెంగళూరు: కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా మారుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా బీఎస్ యడియూరప్పను ముఖ్యమంత్రిగా తప్పించబోతున్నారనే వార్తలు తెగ ప్రచారం అవుతున్నాయి. ఈ క్రమంలో సీఎం మార్పుకు సంబంధించి కర్ణాటక బీజేపీ ప్రెసిడెంట్ నలిన్ కుమార్ కతీల్దిగా భావిస్తోన్న ఆడియో క్లిప్ ఒకటి ఆదివారం అంతా సోషల్ మీడియాలో తెగ వైరలయ్యింది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం 47 సెకన్ల నిడివి ఉన్న ఈ ఆడియో క్లిప్‌లో కతిల్‌గా భావిస్తున్న వ్యక్తి మరొకరితో తులు భాషలో మాట్లాడినట్లు ఉంది. కతిల్‌గా భావిస్తున్న వ్యక్తి ‘‘దీని గురించి ఎవరికీ చెప్పవద్దు. మేము ఈశ్వరప్ప, షెట్టర్ బృందాన్ని తొలగిస్తాము. ఆ స్థానంలో కొత్త బృందాన్ని ఏర్పాటు చేస్తున్నాము. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అంతా మన నియంత్రణలో ఉంటుంది. మూడు పేర్లు పరిశీలనలో ఉన్నాయి.. వారిలో ఒకరిని ఎప్పుడైనా ప్రకటించవచ్చు. ఢిల్లీ ఆఫీసు కొత్త సీఏం పేరును ప్రకటిస్తుంది’’ అని ఉంది. ఈ ఆడియో క్లిప్ వైరల్‌గా మారడంతో కతీల్ దీనిపై స్పందించారు. ‘‘ఇది ఫేక్ ఆడియో క్లిప్.. పార్టీలో కలహాలు సృష్టించడం కోసం ఎవరో నా గొంతును అనుకరించారు. దీనిపై సీఎం లోతైన దర్యాప్తు చేయాలని కోరాను’’ అన్నారు. సీఎం యడియూరప్ప స్థానంలో జూలై 26 న, బీజేపీ ఎమ్మెల్యేలు కొత్త కర్ణాటక ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. నాయకత్వ మార్పుపై ముఖ్యమంత్రి యడియూరప్ప స్పందించిన సంగతి తెలిసిందే. కర్ణాటక సీఎంగా కొనసాగాలని బీజేపీ కేంద్ర నాయకత్వం తనను కోరిందని యడియూరప్ప వెల్లడించారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదన్నారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షా, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో జరిగిన భేటీల్లో రాష్ట్రంలో నాయకత్వ మార్పిడి అంశమే చర్చకు రాలేదని స్పష్టం చేశారు. కానీ రాష్ట్రంలో మాత్రం ఇందుకు భిన్నమైన వార్తలు వినిపిస్తున్నాయి. -
లీకైన కౌశిక్‌రెడ్డి మరో ఆడియో క్లిప్
-
విద్యార్థి ముఖం పగలకొడతానన్న ఎమ్మెల్యే.. ఆడియో క్లిప్ వైరల్
తిరువనంతపురం: సాయం చేయాల్సిందిగా కోరుతూ ఓ పదవ తరగతి విద్యార్థి తన నియోజకర్గ ఎమ్మెల్యేకు కాల్ చేశాడు. సాయం సంగతి దేవుడేరుగు.. కనీసం మర్యాదగా కూడా మాట్లాడలేదు. ‘‘నా నంబర్ ఎవరు ఇచ్చారు.. ఇప్పుడు నువ్వు నా ఎదురుగా ఉండుంటే నీ ముఖం పగలకొట్టేవాడిని’’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశాడు ఆ ఎమ్మెల్యే. వీరి సంభాషణకు సంబంధించిన ఆడియో క్లిప్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సదరు ఎమ్మెల్యేపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ వివరాలు.. కేరళ, కొల్లాం సీపీఐ (ఎం) ఎమ్మెల్యే, నటుడు ఎం. ముఖేష్‌కు రెండు రోజుల క్రితం అతడి నియోజకవర్గానికి చెందిన ఓ పదవి తరగతి విద్యార్థి కాల్ చేశాడు. తను ఎదుర్కొంటున్న ఓ సమస్య గురించి చెప్పి.. ఎమ్మెల్యేను సాయం చేయాల్సిందిగా కోరాడు. ఆగ్రహించిన ఎమ్మెల్యే నా నంబర్ నీకు ఎవరిచ్చారని ప్రశ్నించాడు. దానికి ఆ విద్యార్థి స్నేహితుడి వద్ద నుంచి తీసుకున్నానని చెప్పగా.. ముఖేష్ ఆగ్రహంతో ‘‘నీ స్నేహితుడి ముఖం పగలకొట్టాలి.. ఈ సమయంలో నీవు నా ఎదురుగా ఉంటే.. క్యాన్ తీసుకుని నీ ముఖం పగలకొట్టేవాడిని’’ అంటూ దురుసుగా మాట్లాడాడు. విద్యార్థి సమస్య ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయలేదు.. చెప్పుకునే అవకాశం ఇవ్వలేదు. ఎమ్మెల్యే ప్రవర్తనకు భయపడిన సదరు విద్యార్థి తప్పయ్యింది సార్.. క్షమించండి అని కోరాడు. కానీ ముఖేష్ విద్యార్థి మాటలు వినకుండా.. అతడిపై మండి పడ్డాడు. ఎమ్మెల్యే-విద్యార్థి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎమ్మెల్యే ముఖేష్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే ముఖేష్ దీనిపై వివరణ ఇస్తూ.. ఫేస్బుక్లో ఓ వీడియో పోస్ట్ చేశారు. దీనిలో ముఖేష్ మాట్లాడుతూ.. ‘‘ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి నాకు అవిరామంగా కాల్స్ వస్తూనే ఉన్నాయి. గంటలో నా ఫోన్ చార్జింగ్ అయిపోతుంది. ఎవరేవరో నాకు కాల్ చేసి.. మా ఏరియాలో కరెంట్ లేదు.. రైళ్లు ఎందుకు సక్రమంగా తిరగడంలేదని.. ఏవేవో ప్రశ్నలు వేస్తూ విసిగిస్తున్నారు.. ప్లాన్ ప్రకారం నన్ను ఇబ్బంది పెట్టడానికే ఇలా కాల్ చేస్తున్నారు.. కానీ ఇప్పటి వరకు వారికి ఆ అవకాశం లభించలేదు. ఇక ఆ రోజు కూడా నేను జూమ్ మీటింగ్‌లో ఉండగా ఓ విద్యార్థి నాకు కాల్ చేసి ఇలానే మాట్లాడాడు. నేను ముఖ్యమైన మీటింగ్‌లో ఉన్నాను. ఆ విద్యార్థి నాకు కాల్ చేస్తూనే ఉన్నాడు. సమావేశం డిస్టర్బ్ అయ్యింది. ఆ కోపం, విసుగులోనే నేను సదరు విద్యార్థిని కోడతాను అన్నాను అంతే తప్ప వేరే ఉద్దేశంతో కాదని’’ ఎమ్మెల్యే ముఖేష్ తెలిపారు.