న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) చైర్మన్ రజనీష్ కుమార్‌పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన ఆడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆడియో క్లిప్ ప్రకారం.. రుణవితరణ పెరగకపోవడానికి .. ముఖ్యంగా అస్సాం తేయాకు తోటల్లో పనిచేసే వారికి రుణాలు లభించకపోవడానికి ప్రధాన కారణం ఆయనేనంటూ నిర్మలా సీతారామన్ తీవ్ర పదజాలంతో తప్పుపట్టారు.
ఎస్‌బీఐ జాలి లేని బ్యాంకంటూ ఆక్షేపించారు. ఒక్క మాటలో చెప్పాలంటే రజనీష్ కుమార్‌ను నిర్మలా సీతారామన్ ఘోరంగా అవమానించినట్లు ఆడియో క్లిప్ ద్వారా తెలుస్తోంది. ఫిబ్రవరి 27న గువాహటిలో ఎస్‌బీఐ నిర్వహించిన కార్యక్రమంలో ఈ ఉదంతం చోటుచేసుకున్నట్లు భావిస్తున్నారు. మరోవైపు, రజనీష్‌పై ఆర్థిక మంత్రి వ్యాఖ్యలను అఖిల భారత బ్యాంక్ ఆఫీసర్ల సమాఖ్య (ఏఐబీవోసీ) ఖండించింది. ఎస్‌బీఐ ప్రతిష్టను దెబ్బతీసేందుకే గుర్తుతెలియని వారెవరో ఆడియో క్లిప్‌ను వైరల్ చేశారని, దీనిపై తక్షణం విచారణ జరపాలని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment