slammed
-
కోల్‌కతా వైద్యురాలి ఉదంతం.. ప్రతిపక్షాలవి చిల్లర రాజకీయాలు: మమతా
కోల్‌కతాలోని వైద్యురాలి హత్యాచార ఘటన దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో గత శుక్రవారం తెల్లవారుజామున వైద్యారాలిపై అత్యాచారం చేసి హత్య చేసిన ఉదంతం దేశం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ కేసును రాష్ట్ర పోలీసుల నుంచి కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ తమ ఆధీనంలోకి తీసుకొని దర్యాప్తు ప్రారంభించింది.మరోవైపు ట్రైనీ వైద్యురాలిపై హత్యాచారానికి నిరసనగా వైద్య విద్యార్ధులు, డాక్టర్లు పశ్చిమబెంగాల్, ఢిల్లీతో సహా దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. నిందితుడిని కఠినంగా శిక్షించి, బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అత్యాచారం-హత్య కేసులో బెంగాల్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ కేసులో సీఎం మమత నిందితులను రక్షించాలని ప్రయత్నిస్తున్నారని, ముఖ్యమంత్రి పదవికి ఆమె రాజీనామా చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.అయితే వైద్యురాలిపై హత్యచారం ఉదంతాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేయడాన్ని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విపక్ష బీజేపీ నాయకులు చౌకబారు రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. బెంగాల్లో బంగ్లాదేశ్ తరహా ఆందోళనలు సృష్టించేందుకు బీజేపీ, సీపీఎం ప్రత్ని ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.‘బాధిత కుటుంబానికి అండగా నిలబడాల్సింది పోయి.. వామపక్షాలు, బీజేపీ చౌకబారు రాజకీయాలకు పాల్పడుతున్నాయి. వారు ఇక్కడ ఓ బంగ్లాదేశ్‌ను చేయగలమని భావిస్తున్నారు. అయితే నేనేం అధికారం కోసం అత్యాశతో లేను. ఈ కేసులో అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వ తీరును కొందరు తప్పుపడుతున్నారు. ఈ కేసులో మేం ఏం చేయలేదా? ఎలాంటి చర్యలు తీసుకోలేదా? సంఘటన గురించి తెలిసిన వెంటనే పోలీసు కమిషనర్‌తో మాట్లాడాను. బాధిత మహిళ తల్లిదండ్రులతోనూ మాట్లాడాను. అత్యాచారం చేసిన వ్యక్తిని ఉరితీస్తానని వారితో చెప్పాను. దానికి నేను కట్టుబడి ఉన్నాను.ఘటజన జరిగిన రాత్రంతా కేసును పర్యవేక్షిస్తున్నాను. దహన సంస్కారాలు జరిగే వరకు పోలీసులతో టచ్‌లో ఉన్నాను. పోలీసులు ఆమె కుటుంబంతోనే ఉన్నారు. అంతేగాక 12 గంటల్లో హంతకుడిని అరెస్టు చేశారు. బాధితురాలి మృతదేహాన్ని తీసుకెళ్లడం, డీఎన్ఏ టెస్టు చేయడం, సీసీటీవీ ఫుటేజీ, సమగ్ర దర్యాప్తు అన్నింటిని పోలీసులు పూర్తి చేశారు.ఏదైనా విచారణ కోసం ముందు సమయం ఇవ్వాలి. నేను ఆదివారం వరకు పోలీసులకు గడువు విధించాను. సరైన విచారణ చేయకుండా ఎవరిపైనా చర్యలు తీసుకోలేరు. నేను సీనియర్, జూనియర్ డాక్టర్లను గౌరవిస్తాను. సరైన విచారణ లేకుండా నేను వ్యక్తులను అరెస్టు చేయలేను’అని తెలిపారు.ఈ వ్యవహారంలో కలకత్తా హైకోర్టు జోక్యం చేసుకోవడంతో కేసును మంగళవారం సీబీఐకి అప్పగించిన విషయం తెలిసిందే. అయితే సీబీఐ దర్యాప్తుపై మమతా మాట్లాడుతూ.. తాము పూర్తిగా హైకోర్టు మార్గదర్శకాలను అనుసరిస్తామని, సీబీఐ దర్యాప్తుకు సహరిస్తున్నామని తెలిపారు. కేసును త్వరగా పరిష్కరించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ కేసులో ఇప్పటికే ముప్పై నాలుగు మందిని పోలీసులు విచారించారని, మరికొంతమందిని విచారించాల్సి ఉందన్నారు. అయితే ఈ లోపే హైకోర్టు జోక్యం చేసుకుని కేసును సీబీఐకి బదిలీ చేసిందని చెప్పారు. -
‘ఐ డోంట్ కేర్’! ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యాఖ్యలపై విమర్శలు
ప్రముఖ ఆర్థికవేత్త, భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ దేశ పురోగతికి సంబంధించి వెలుబుచ్చిన అభిప్రాయాలపై విమర్శలు వ్యక్తమయ్యాయి. భారతదేశం అగ్రరాజ్యంగా మారుతుందనే భావనను ప్రశ్నిస్తూ రాజన్ చేసిన ప్రకటన తీవ్ర చర్చకు దారితీసింది. ఓ వార్తా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న రాఘురామ్ రాజన్ తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. తాను దేశ ఆర్థిక మంత్రి లేదా ప్రధానమంత్రి అయితే రాబోయే దశాబ్దంలో దేశ అభివృద్ధిలో తన పాత్ర ఎలా ఉండబోతుంది అని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ భారతదేశం సూపర్ పవర్ హోదాను పొందడం పట్ల ఉదాసీనతను వ్యక్తం చేశారు. జాతిపిత మహాత్మాగాంధీ దార్శనికతకు అనుగుణంగా ప్రతి భారతీయుడి ఆకాంక్షలను నెరవేర్చడంపైనే తన దృష్టి ఉందని ఆయన ఉద్ఘాటించారు. అది నాకు అసలు విషయమే కాదు.. ‘భారతదేశం సూపర్ పవర్ (అగ్రరాజ్యం)గా ఉండటం గురించి నేను పట్టించుకోను, అది నాకు అసలు విషయమే కాదు. జాతిపిత కోరుకున్నట్లు ప్రతి భారతీయుడిని సంతోషంగా ఉంచడమే నా కర్తవ్యం’ అని రఘురామ్ రాజన్ అన్నారు. రఘురామ్ రాజన్ వెలుబుచ్చిన ఈ అభిప్రాయంపై వివిధ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా యూజర్లు రాజన్ దృక్పథాన్ని తీవ్రంగా ఖండించారు. సూపర్ పవర్ స్థితిని సాధించడం అంటే పేదరికాన్ని తగ్గించడం, ఆరోగ్య సంరక్షణను, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం కాదా అని ప్రశ్నించారు. దేశ మొబైల్ ఫోన్ ఎగుమతులపైనా రఘురామ్ రాజన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలక్ట్రానిక్స్ సప్లై చెయిన్లు, సెమీకండక్టర్స్‌కు సంబంధించిన వ్యవహారాలపై రఘురామ్ రాజన్‌కు సరైన అవగాహన లేదని మండిపడ్డారు. ఇదీ చదవండి: ఎన్పీఎస్ నుంచి నెలవారీ ఆదాయం Raghuram Rajan: "I don't care about India being a superpower, to me that's not the point. It's about what the father of the nation wanted." Being a superpower means lesser poverty, healthier lives, longer life spans, less suffering for a Billion people but of course Rajan… pic.twitter.com/PxzFF9uBjI — Cogito (@cogitoiam) June 18, 2023 -
ఎస్బీఐ చీఫ్‌ను అవమానించిన ఆర్థిక మంత్రి!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్మన్ రజనీష్ కుమార్‌పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన ఆడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆడియో క్లిప్ ప్రకారం.. రుణవితరణ పెరగకపోవడానికి .. ముఖ్యంగా అస్సాం తేయాకు తోటల్లో పనిచేసే వారికి రుణాలు లభించకపోవడానికి ప్రధాన కారణం ఆయనేనంటూ నిర్మలా సీతారామన్ తీవ్ర పదజాలంతో తప్పుపట్టారు. ఎస్బీఐ జాలి లేని బ్యాంకంటూ ఆక్షేపించారు. ఒక్క మాటలో చెప్పాలంటే రజనీష్ కుమార్‌ను నిర్మలా సీతారామన్ ఘోరంగా అవమానించినట్లు ఆడియో క్లిప్ ద్వారా తెలుస్తోంది. ఫిబ్రవరి 27న గువాహటిలో ఎస్బీఐ నిర్వహించిన కార్యక్రమంలో ఈ ఉదంతం చోటుచేసుకున్నట్లు భావిస్తున్నారు. మరోవైపు, రజనీష్‌పై ఆర్థిక మంత్రి వ్యాఖ్యలను అఖిల భారత బ్యాంక్ ఆఫీసర్ల సమాఖ్య (ఏఐబీవోసీ) ఖండించింది. ఎస్బీఐ ప్రతిష్టను దెబ్బతీసేందుకే గుర్తుతెలియని వారెవరో ఆడియో క్లిప్‌ను వైరల్ చేశారని, దీనిపై తక్షణం విచారణ జరపాలని పేర్కొంది. -
‘మీ పిల్లలను డాక్టర్లు చేస్తారా లేక కాపలాదారులా?’
ఢిల్లీ: ‘మీ పిల్లలను డాక్టర్లను చేస్తారా లేక కాపలాదారులను చేస్తారా’ అని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఓటర్లను ప్రశ్నించారు. ‘‘మోదీ ఈ దేశాన్ని కాపలాదార్లతో నింపేయాలనుకుంటున్నారు. మీరు మీ పిల్లలను కాపలాదారులను చేయాలనుకుంటే మోదీకి ఓటేయండి. మీ పిల్లలకు సరైన విద్యతో డాక్టర్లు, ఇంజినీర్లను చేయాలనుకుంటే చదువుకున్న, నిజాయితీ గల ఆప్‌కు ఓటేయాలి’’ అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. రఫేల్ స్కాంలో ప్రధాని మోదీని విమర్శిస్తూ.. ఆయన ‘చౌకీదార్’ కాదు.. చోర్ (దొంగ) అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు కౌంటర్‌గా బీజేపీ #నేనూ కాపలాదారునే (మే భీ చౌకీదార్) అని ప్రచారాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ప్రచారం నేపథ్యంలో ప్రధాని మోదీ సహా కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, పలువురు నేతలు ట్విటర్లో తమ పేర్లకు ముందు చౌకీదార్ అని చేర్చుకున్నారు. దీనిపై విపక్ష కాంగ్రెస్‌తో సహా పలు పార్టీల నాయకులు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అటు నెటిజన్లు కూడా బీజేపీ చౌకీదార్ ప్రచారాన్ని తప్పుబడుతున్నారు. -
'హరీష్‌రావు ఓ బచ్చా' : షబ్బీర్ అలీ
-
'హరీష్‌రావు ఓ బచ్చా'
హైదరాబాద్: రాజకీయాల్లో హరీష్ రావు ఓ బచ్చా అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్‌ను పార్టీని టీఆర్ఎస్ కడిగేయడం కాదు.. ప్రజలే టీఆర్ఎస్ను కడిగేసే సమయం ముందుందని ఆయన హెచ్చరించారు. టీఆర్ఎస్ మ్యానిఫెస్టోపై చర్చించడానికి హరీష్ సిద్ధమా అని సవాల్ విసిరారు. సమయం, వేదిక ఎక్కడైనా తాను రావడానికి సిద్ధం అని అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రభుత్వానికి దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టాలని, ఎవరు ఎవరిని కడిగి పారేస్తారో అప్పుడు తెలుస్తుందని అన్నారు. టీఆర్ఎస్ ఎంత రెచ్చగొట్టినా.. కాంగ్రెస్ రెచ్చిపోదని.. తొడలు కొట్టి, సవాళ్లు చేసి మాట్లాడటం.. తరవాత తోక ముడుచుకొని పారిపోవడం టీఆర్ఎస్కు అలవాటేనని ఎద్దేవా చేశారు. మ్యానిఫెస్టోలో చెప్పిన వాగ్దానాలలో ఐదు శాతం కూడా పూర్తి కాలేదని అన్నారు. 10 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తామని చెప్పిన టీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకూ కనీసం 10 మెగావాట్లు కూడా ఉత్పత్తి చేయలేదని విమర్శించారు. -
మోసం చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య
పరకాయ ప్రవేశం చేయడంలో చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యని, దానిని అమలు చేయడంలో ఆయనకు సాటి మరొకరు ఉండరని మాజీ మంత్రి శైలజానాథ్ విమర్శించారు. మంగళవారం విజయవాడ ఇందిరాభవన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఆర్డీఏ చైర్మన్ గా ఒకపక్క తనకు అవసరమైన డాక్యుమెంట్లపై సంతకాలు చేసుకుంటున్న బాబు మరో పక్క ముఖ్యమంత్రిగా అక్కడి నుంచి వచ్చే డాక్యుమెంట్లను వేగంగా, సమర్ధంగా అమలు చేయడంలో ముందుటున్నారన్నారు. ప్రభుత్వ భూములను సింగపూర్ కంపెనీలకు ఇస్తూ రూ.5,500 కోట్లతో మౌలిక వసతులను కల్పించడంలో అనేక మందితో కుదుర్చుకున్న ఒప్పందాల విషయంలో ఆరోపణలు ఉన్నాయన్నారు. రాజధానిని ప్రాజెక్టు నుంచి సింగపూర్ సంస్థను తొలగిస్తే అపరాధ రుసుం కింద 20 శాతం చెల్లించాలనే నిబంధనను సవరించాలనే ఆర్ధికశాఖ అభ్యంతరానికి బాబు ఎందుకు మిన్నకుండిపోయారని ప్రశ్నించారు. రైతులను బెదిరించి పోలీసులు, తహశీల్దార్లు, ఆర్డీవోలను ఉపయోగించి బలవంతంగా భూములను సేకరిస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో హైదరాబాద్ ను పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంచగా, తన స్వార్ధం కోసం ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్నారన్నారు. -
ఢిల్లీ ప్రభుత్వంపై మండిపడిన కోర్టు
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో రోజురోజుకూ పెరుగుతున్న వాతావరణ కాలుష్యంపై నేషనల్ గ్రీన్ కోర్టు మండిపడింది. వాయు కాలుష్యం ఇంత తీవ్రస్థాయిలో ఉన్నాఎందుకు చర్యలు చేపట్టడం లేదంటూ ఢిల్లీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. విషవాయువులు వెదజల్లుతున్న కాలుష్యంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తక్షణమే నివేదిక సమర్పించాలని ఆదేశించింది. నగరంలో కాలుష్య తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, వారం రోజుల్లోగా నిరోధక చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఇటీవల నగరాన్ని కప్పేస్తున్న కాలుష్యంతో వాహనదారులు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కనీసం వంద అడుగుల ముందు ఏముందో కూడా కనపడని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కోర్టు సీరియస్‌గా స్పందించింది. డీజిల్, పెట్రోల్‌తో నడిచే కాలం చెల్లిన వాహనాలు దేశ రాజధాని ఢిల్లీ నగర రోడ్లపై తిరగడానికి వీల్లేదని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్పష్టమైన ఆదేశాలు జారీచేసినా ప్రభుత్వాలు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ప్రశ్నించింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఛైర్ పర్సన్ జస్టిస్ స్వతంత్ర కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. నగరంలోని వాయు కాలుష్య నివారణ చర్యల మాటేంటి? కాలుష్యం లేదని చెప్పగలరా.. ఢిల్లీలో కాలుష్య గాఢతతో జనం ఇబ్బందులు పడుతున్నారంటూ ధ్వజమెత్తింది. పర్యావరణాన్ని తీవ్ర విఘాతం కలిగిస్తున్న ఈ వ్యవహారాన్ని ఉపేక్షించబోమని పేర్కొంది. ఈ నేపథ్యంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అధ్యక్షుడు, జస్టిస్ స్వతంత్ర కుమార్ ఆధ్వర్యంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో గురువారం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పర్యావరణ, అటవీశాఖ, ఆరోగ్య శాఖ, ఢిల్లీ కాలుష్య నియంత్రణ మండలి తదితర శాఖల ముఖ్య కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. దీంతోపాటు వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని వాయునాణ్యత, కాలుష్యం, వాతావరణ కాలుష్య నివారణ చర్యలు, తదితర వివరాలతో పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డును ఆదేశించింది.