'హరీష్‌రావు ఓ బచ్చా'
'హరీష్‌రావు ఓ బచ్చా'
Published Fri, Dec 9 2016 5:31 PM | Last Updated on Wed, Sep 5 2018 3:24 PM
హైదరాబాద్: రాజకీయాల్లో హరీష్ రావు ఓ బచ్చా అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్‌ను పార్టీని టీఆర్ఎస్ కడిగేయడం కాదు.. ప్రజలే టీఆర్‌ఎస్‌ను కడిగేసే సమయం ముందుందని ఆయన హెచ్చరించారు. టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టోపై చర్చించడానికి హరీష్ సిద్ధమా అని సవాల్ విసిరారు. సమయం, వేదిక ఎక్కడైనా తాను రావడానికి సిద్ధం అని అన్నారు.
శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రభుత్వానికి దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టాలని, ఎవరు ఎవరిని కడిగి పారేస్తారో అప్పుడు తెలుస్తుందని అన్నారు. టీఆర్‌ఎస్ ఎంత రెచ్చగొట్టినా.. కాంగ్రెస్ రెచ్చిపోదని.. తొడలు కొట్టి, సవాళ్లు చేసి మాట్లాడటం.. తరవాత తోక ముడుచుకొని పారిపోవడం టీఆర్‌ఎస్‌కు అలవాటేనని ఎద్దేవా చేశారు.
మ్యానిఫెస్టోలో చెప్పిన వాగ్దానాలలో ఐదు శాతం కూడా పూర్తి కాలేదని అన్నారు. 10 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తామని చెప్పిన టీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకూ కనీసం 10 మెగావాట్లు కూడా ఉత్పత్తి చేయలేదని విమర్శించారు.
Advertisement
Advertisement