![Woman Constable Audio Viral Over Spouse Transfer In Karimnagar - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2022/04/17/BOY.jpg.webp?itok=BqC4DwPn)
సాక్షి, కరీంనగర్: పోలీసు విభాగంలో స్పౌస్ బదిలీల విషయంలో ఇటీవల ఓ కానిస్టేబుల్ పోలీసు వాట్సాప్ గ్రూపుల్లో పంపించిన ఆడియో సంచలనమైంది. తాజాగా ఓ మహిళా కానిస్టేబుల్ బదిలీ అయ్యి, తన భర్తకు దూరంగా ఉంటూ చాలా ఇబ్బందులు పడుతున్నాననే ఆడియో ‘సాక్షి’కి అందింది. అందులో రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, డీజీపీ గారికి నమస్కారం సార్.. అంటూ మొదలుపెట్టి, 317 జీవోలో రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి జగిత్యాల జిల్లాకు ట్రాన్స్‌ఫర్ అయినట్లు.. తన భర్త ఒకచోట, తానొక చోట ఉంటున్నామని చెప్పింది.
స్పౌస్ ట్రాన్స్‌ఫర్ దరఖాస్తు చేసి, నాలుగు నెలలవుతోందని.. తనకు మూడు సంవత్సరాల బాబు ఉన్నాడని.. బాబును పట్టుకొనే డ్యూటీకి వెళ్తున్నట్లు తెలిపింది. ఇటీవల భద్రాచలం బందోబస్తుకు తీసుకెళ్లడంతో అనారోగ్యానికి గురయ్యాడని వాపోయింది. పట్టుకునే వారు ఎవరూ లేరు సార్.. తాను తన కొడుకు ఏదో ఒకటి చేసుకొని, రెండు మూడు రోజుల్లో చచ్చిపోతామని ఆవేదన వ్యక్తం చేసింది. తన సమస్యకు పరిష్కారం చూపాలని ఆడియోలో వేడుకుంది.
Comments
Please login to add a commentAdd a comment