woman constable
-
కాళేశ్వరం: తుపాకీతో బెదిరించి మహిళా కానిస్టేబుల్‌పై ఎస్ఐ అత్యాచారం!
పోలీసులు అంటే ఒక నమ్మకం.. ప్రజల మాన, ప్రాణాలు కాపాడేవారని భరోసా. కానీ ఓ సబ్ ఇన్స్పెక్టర్ని చూస్తే ఆ స్టేషన్‌లోని వారికే ఒక చిరాకు.. స్త్రీలోలుడు.. గతంలో పనిచేసిన చోటా ఇదే పని.. కన్నేసిన ఆడవారిని అనుభవించేదాకా వదలడు. అందుకు ఎంతదూరమైనా వెళ్తాడు. తన సర్వీస్ రివాల్వర్‌తో బెదిరించి మరీ తన కామవాంఛ తీర్చుకుంటాడు. అలాంటి ఘటనే ఇది. సొంత స్టేషన్‌లోని మహిళా కానిస్టేబుల్‌పై అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు. ఆమె ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఈ పోలీస్ కామాంధుడి అరాచకాలు ఆ సబ్ డివిజన్లో హాట్‌టాపిక్‌గా మారాయి. వరంగల్‌క్రైం: ఆ సబ్ ఇన్స్పెక్టర్ పేరులోనే దేవత ఉంటుంది. కానీ అతను.. మహిళలంటే కేవలం కోరికలు తీర్చే వస్తువు అనుకుంటాడు. అతను పనిచేసేది జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం సబ్ డివిజన్లోని ఓ స్టేషన్లో. ఇరవై రోజుల క్రితం తనకు కాలు విరిగింది.. ఇంటికి వచ్చి సాయం చేయమని తన స్టేషన్‌లోని మహిళా కానిస్టేబుల్‌ను వేడుకోగా, తను మానవత్వంతో ఇంటికి వెళ్తే తుపాకీతో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయట తెలిస్తే చంపేస్తానని బెదిరించడంతో ఆమె బిక్కుబిక్కుమంటూ గడుపుతోంది. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం మళ్లీ ఆమె ఇంటికి వచ్చిన సదరు ఇన్స్పెక్టర్ మరోసారి అత్యాచారానికి పాల్పడ్డాడు. తనకు జరుగుతున్న ఈ అన్యాయాన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆమె తనలో తాను కుంగిపోతోంది. సదరు సబ్ఇన్స్పెక్టర్ రాసలీలలే కాదు.. మరిన్ని బాగోతాలు ఉన్నట్లు కాటారం డివిజన్లో చర్చ జరుగుతోంది. ఇతని వ్యవహారశైలిపై ‘సాక్షి’కి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు.. అతను నోరు తెరిస్తే బూతు పురాణం. పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయాలంటే మహిళలకు వణుకు పుడుతుంది. తన ఎదురుగా వెళ్తే నోటికొచ్చిన మాట అనేయడం ఆయనకు సర్వసాధారణం. గతంలో ఫిర్యాదుదారులతో నోటికి వచ్చినట్లు మాట్లాడి పలుమార్లు ఉన్నతాధికారుల చేతుల్లో చీవాట్లు తిన్నా ఆయన ప్రవర్తనలో ఎలాంటి మార్పూ రాలేదు. చీవాట్లు తప్ప కఠిన చర్యలు తీసుకునే వారు లేరన్న ధీమాతో ఆయన తిట్లకు అడ్డూఅదుపు లేకుండా పోయింది.చికెన్ కోసం చిల్లర బుద్ధి..ఆయన పనిచేస్తున్న పోలీస్ స్టేషన్ పరిధిలో 15 చికెన్ సెంటర్లు ఉన్నాయి. రోజూ ఒక సెంటర్ పావుకిలో చికెన్ తనకు వంతుల వారీగా పంపించాలని సమావేశం పెట్టి మరీ హుకుం జారీ చేయడం గమనార్హం. ఇక ఆ స్టేషన్ పరిధిలో బెల్ట్ షాపులు, ఇసుక ట్రాక్టర్లు, వేబ్రిడ్జి కాంటాల యజమానులకు ఫోన్లు చేసి మామూళ్లు వసూలు చేయడంతో ఆయనకు సాటి లేరు. ఆటోడ్రైవర్లు, చిల్లర వ్యాపారులు, ఇలా ఎవరినీ వదలడు. ఆయన వసూళ్లు రూ.100 నుంచి మొదలవుతాయంటే ఎంతగా దిగజారాడో తెలిసిపోతోంది. ఖాకీ చొక్కాను అడ్డుపెట్టుకుని అక్రమ వసూళ్లకు కేరాఫ్‌గా మారాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా, విషయం తెలియడంతో డీఎస్పీ సదరు స్టేషన్‌కు వెళ్లి విచారణ జరిపినట్లు తెలిసింది. ఆ ఎస్‌ఐనుంచి రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అతనిపై ఎస్టీ, ఎస్టీ అట్రాసిటి, లైంగిక వేధింపుల కేసు నమోదు చేయనున్నట్లు తెలిసింది.పనిచేసిన ప్రతీచోట రాసలీలలుప్రజల ప్రాణాలు కాపాడాలని ప్రభుత్వం ఇచ్చిన సర్వీస్ రివాల్వర్‌ను అడ్డుపెట్టుకుని రాసలీలలు చేయడంలో తనకు తనే సాటి. గతంలో పనిచేసిన మంచిర్యాల జిల్లాలో ఓ మహిళపై అసభ్యకరంగా ప్రవర్తించి సస్పెండ్ అయిన ఘన చరిత్ర ఆయనది. తన దగ్గర పనిచేసే మహిళా సిబ్బందిని డబుల్ మీనింగ్ డైలాగ్‌లతో ఇబ్బందికి గురిచేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ‘నేను అందంగా లేనా... నన్ను వద్దంటావా...? కారణం చెప్పవా.. అనే మాటలు ఆయన దగ్గర పనిచేసే మహిళా సిబ్బంది, ఫిర్యాదుదారులు ఒక్కసారైనా ఎదుర్కోవాల్సిందే. అవసరం లేకున్నా రాత్రి వరకు మహిళా సిబ్బందిని స్టేషన్లో ఉంచుకుని హింసపెట్టడం తన దినచర్యలో భాగం.నేను మంత్రి మనిషిని.. ఆయన నోట తరచూ వినిపించే పదం నేను మంత్రి మనిషిని.. నాకేం కాదు. ఇది చెప్పుకుంటూ పై అధికారులను మొదలుకొని కింది సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇతగాని బెదిరింపులు భరించలేక ఆ స్టేషన్లో పనిచేస్తున్న ఓ ఏఎస్సై, ఓ హెడ్ కానిస్టేబుల్, మరో కానిస్టేబుల్ బదిలీ చేసుకుని వెళ్లినట్లు సమాచారం. చోటామోటా నాయకులు స్టేషన్‌కు వస్తే చాలు... అందరికి వినిపించేలా ‘బాబన్న బాగుండా.. నాకు ఇంతకుముందే ఫోన్ చేసిండు’ అంటూ తనకు తానే డప్పు కొట్టుకోవడం కనిపిస్తుంటుంది. ఆ జిల్లాకు చెందిన ఓ మంత్రి పేరుతో పోలీస్ అధికారులను, సిబ్బందిని ఇబ్బందులకు గురిచేస్తున్న రాసలీలల ఘనుడి విషయం ఉన్నతాధికారులకు తెలిసినా చర్యలు తీసుకోకపోవడంతో... తన కామవాంఛలను పనిచేసిన ప్రతీచోట మహిళా సిబ్బందిపై తీర్చుకుంటూ పోతున్నాడు. ఇలాంటి ఖాకీచకులపై పోలీస్‌శాఖ చర్యలు తీసుకోకుంటే మహిళలు ఆ శాఖకు రావాలంటేనే భయపడే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో దృష్టి పెడితే ఇలాంటి ఘనుల బాగోతం వెలుగు చూసే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
Calcutta High Court: వారిని డార్లింగ్ అనడం లైంగిక వేధింపే
కోల్‌కతా: ఫూటుగా తాగి మహిళా కానిస్టేబుల్‌ను డార్లింగ్ అని పిలిచిన ఓ వ్యక్తిని దోషిగా తేలుస్తూ కలకత్తా హైకోర్టు తీర్పు వెలువరిచింది. పరిచయం లేని మహిళను అలా పిలవడడాన్ని ‘లైంగిక వేధింపు నేరం’గా పరిగణిస్తామని హైకోర్టు స్పష్టంచేసింది. ఈ సందర్భంగా ఇదే కేసులో గతంలో కింది కోర్టు ఇచి్చన తీర్పును హైకోర్టు సమర్థించింది. భారతీయ శిక్షాస్మృతిలోని 354ఏ (మహిళా గౌరవాన్ని భంగపరచడం), 509 సెక్షన్ల కింద అతడిని దోషిగా తేలి్చంది. మహిళా కానిస్టేబుల్‌ను మద్యం మత్తులో డార్లింగ్ అని పిలిచిన జనక్ రామ్ అనే వ్యక్తికి గతంలో పడిన శిక్షను సమరి్థస్తూ జస్టిస్ జై సేన్ గుప్తా నేతృత్వంలోని ఏకసభ్య హైకోర్టు ధర్మాసనం తాజా తీర్పును వెలువరిచింది. ‘‘ పరిచయంలేని మహిళను తాగిన/తాగని వ్యక్తి నడి వీధిలో డార్లింగ్ అనే పిలిచే ధోరణి భారతీయ సమాజంలో లేదు. నిందితుడు మద్యం మత్తులో ఉంటే అప్పుడు నేరాన్ని మరింత తీవ్రమైనదిగా పరిగణిస్తాం’ అని జడ్జి వ్యాఖ్యానించారు. అండమాన్ నికోబార్ ద్వీపంలోని మాయాబందర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జనాన్ని అదుపు చేస్తున్న మహిళా కానిస్టేబుల్‌ను ‘చలాన్ వేయడానికి వచ్చావా డార్లింగ్?’ అంటూ జనక్‌రామ్ వేధించాడు. -
అనుమానాస్పద స్థితిలో మహిళా కానిస్టేబుల్ మృతి
ఖమ్మంఅర్బన్: ఖమ్మం 4వ డివిజన్ బాలాజీనగర్‌లో నివాసముంటూ భద్రాది కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న మీగడ స్వాతి (29) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఖమ్మం అర్బన్ ఎస్ఐ పి.వెంకన్న కథనం ప్రకారం.. స్వాతి రెండేళ్ల కిందట ఖమ్మంలో విధులు నిర్వర్తిస్తున్న సమయాన రాజీవ్‌నగర్‌గుట్టకు చెందిన కారుడ్రైవర్ ప్రవీణ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొన్ని నెలలు పాటు దాంపత్య జీవితం సజావుగానే సాగింది. వీరికి 19 నెలల కుమారుడు ఉన్నాడు. కొంతకాలంగా వరకట్నం తీసుకురావాలని ప్రవీణ్ వేధిస్తుండడంతో స్వాతి అప్పు చేసి రూ.9 లక్షలు, తండ్రి నుంచి మరో రూ.14 లక్షలకు పైగా ఇప్పించింది. అయినా సంతృప్తి చెందని ప్రవీణ్ మద్యం సేవిస్తూ ఏపని చేయకుండా నిత్యం వేధించేవాడు. ఈ క్రమంలోనే గురువారం ఇంట్లో స్వాతి, ప్రవీణ్ ఘర్షణ పడినట్లు తెలుస్తుండగా పెద్దగా శబ్దాలు వచ్చాయని స్థానికులు తెలిపారు. దీంతో సమీపంలోనే ఉండే స్వాతి సోదరి కవిత వచ్చేసరికి స్వాతి కిందపడుకుని, ఉందని, ఏమైందని ఆరా తీస్తే ఉరి వేసుకుందని ప్రవీణ్ చెప్పాడని కవిత వెల్లడించింది. అనంతరం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని తెలిపారు. కాగా, ప్రవీణ్ ఉరి వేసి స్వాతిని హత్య చేసినట్లు తమకు అనుమానాలు ఉన్నాయని కవిత ఇచ్చిన ఫిర్యాదుతో శుక్రవారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మహిళా కానిస్టేబుల్‌కు నివాళి ముదిగొండ: భద్రాద్రి జిల్లా లక్ష్మీదేవిపల్లి పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న మహిళా కానిస్టేబుల్ మీగడ స్వాతి ఖమ్మంలో గురువారం మృతి చెందింది. ఆమె మృతదేహాన్ని స్వగ్రామమైన ముదిగొండ గోకినేపల్లికి శుక్రవారం తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్, ఎస్ఐలు సంతోష్, నరేశ్, పోలీస్ అసోసియేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి వెంకటేశ్వర్లు, సంయుక్త కార్యదర్శి జానీమియా తదితరులు స్వాతి మృతదేహం వద్ద నివాళులర్పించారు. -
మహిళా కానిస్టేబుల్ మృతి! భర్తే హత్య చేశాడా?
ఖమ్మం: ఖమ్మం 4వ డివిజన్ బాలాజీనగర్‌లో నివాసముంటూ భద్రాది కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న మీగడ స్వాతి (29) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఖమ్మం అర్బన్ ఎస్ఐ పి.వెంకన్న కథనం ప్రకారం.. స్వాతి రెండేళ్ల కిందట ఖమ్మంలో విధులు నిర్వర్తిస్తున్న సమయాన రాజీవ్‌నగర్‌గుట్టకు చెందిన కారుడ్రైవర్ ప్రవీణ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొన్ని నెలలు పాటు దాంపత్య జీవితం సజావుగానే సాగింది. వీరికి 19 నెలల కుమారుడు ఉన్నాడు. కొంతకాలంగా వరకట్నం తీసుకురావాలని ప్రవీణ్ వేధిస్తుండడంతో స్వాతి అప్పు చేసి రూ.9 లక్షలు, తండ్రి నుంచి మరో రూ.14 లక్షలకు పైగా ఇప్పించింది. అయినా సంతృప్తి చెందని ప్రవీణ్ మద్యం సేవిస్తూ ఏపని చేయకుండా నిత్యం వేధించేవాడు. ఈ క్రమంలోనే గురువారం ఇంట్లో స్వాతి, ప్రవీణ్ ఘర్షణ పడినట్లు తెలుస్తుండగా పెద్దగా శబ్దాలు వచ్చాయని స్థానికులు తెలిపారు. దీంతో సమీపంలోనే ఉండే స్వాతి సోదరి కవిత వచ్చేసరికి స్వాతి కిందపడుకుని, ఉందని, ఏమైందని ఆరా తీస్తే ఉరి వేసుకుందని ప్రవీణ్ చెప్పాడని కవిత వెల్లడించింది. అనంతరం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని తెలిపారు. కాగా, ప్రవీణ్ ఉరి వేసి స్వాతిని హత్య చేసినట్లు తమకు అనుమానాలు ఉన్నాయని కవిత ఇచ్చిన ఫిర్యాదుతో శుక్రవారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఇవి చదవండి: కన్నతల్లి అంత్యక్రియలకు వెళ్లనివ్వకుండా నిర్బంధం -
హైదరాబాద్‌లో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీ ఛత్రినాక పీఎస్‌లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడింది. రెండు రోజుల క్రితమే కానిస్టేబుల్ సురేఖకు నిశ్చితార్థం జరిగింది. ఇష్టంలేని పెళ్లి కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానం వ్యక్తమవుతోంది. రంగారెడ్డి జిల్లా కందుకూరుకు చెందిన సురేఖ.. తన సోదరితో కలిసి అలియబాద్ ప్రాంతంలో నివాసం ఉంటుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సంఘటన స్థలానికి చేరుకున్న శాలిబండ పోలీసులు.. క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. చదవండి: నీలి చిత్రాల సీడీల నుంచి కిడ్నీ రాకెట్ వరకూ.. -
వరంగల్‌లో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య..
సాక్షి, వరంగల్ జిల్లా: నగరంలో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడింది. మహబూబాబాద్‌లో రైటర్‌గా పనిచేస్తున్న మౌనిక.. వరంగల్‌లోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త హత్య చేసి ఉరి వేసుకున్నట్లు సృష్టిస్తున్నాడని మృతురాలి తల్లిదండ్రుల ఆరోపిస్తున్నారు. బంధువుల ఫిర్యాదుతో మట్టవాడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మృతదేహాన్ని ఎంజీఎం మార్చురికి తరలించారు. చదవండి: ఎస్ఐ నా భార్యా పిల్లలను దూరం చేశారు.. సెల్ఫీ సూసైడ్ కలకలం.. -
కానిస్టేబుల్‌తో ఎస్సై ప్రేమాయణం.. పెళ్లి చేసుకొని..
సాక్షి, నెల్లూరు(క్రైమ్): భార్యను వేధించిన ఘటనలో ఓ ఎస్సైపై దిశ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు.. వేదాయపాళెం ఎస్సైగా షేక్ మహబూబ్ సుభాని పని చేస్తున్నారు. ఆయన సంతపేటలో విధులు నిర్వహించే సమయంలో కానిస్టేబుల్‌గా ఉన్న ఓ యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అదనపుకట్నం కోసం ఆమెను భర్త, అత్తింటివారు వేధింపులకు గురిచేయడం ప్రారంభించారు. గతనెల 9వ తేదీన ఆమెపై భర్త, అత్త దాడి చేశారు. ఈక్రమంలోనే ఎస్సై సెలవు పెట్టి తన స్వగ్రామానికి వెళ్లిపోయారు. బాధితురాలు ఆ నెల 28న దిశా మహిళా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై, అతని కుటుంబసభ్యులపై వేధింపులు, హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. దిశ మహిళా పోలీసుస్టేషన్ ఎస్సై కె.లేఖా ప్రియాంక కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఉన్నతాధికారులు గోప్యంగా విచారణ చేపట్టారు. చదవండి: (Hyderabad Doctor: పెళ్లికి ముందే మరొక యువతితో సంబంధం.. అయితే..) -
గాయపడ్డ మహిళా కానిస్టేబుల్.. పెద్ద మనసు చాటుకున్న సీఎం షిండే
సాక్షి,ముంబై: మహారాష్ట్ర నూతన సీఎం ఏక్నాథ్ షిండే మంచి మనసు చాటుకున్నారు. థానేలో బుధవారం ఓ సమావేశంలో పాల్గొని తిరిగివెళ్తుండగా అక్కడే గాయపడిన ఓ మహిళా కానిస్టేబుల్‌ను ఆయన గమనించారు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. దీంతో సిబ్బంది హుటాహుటిన ప్రత్యేక వాహనంలో కానిస్టేబుల్‌ను నగరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. థానే కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో బుధవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు సీఎం షిండే. జులై 10న ఆషాడి ఏకాదశి సందర్భంగా విఠలుడిని ఆరాధించే వార్కీల ఏర్పాట్ల విషయంపై సమీక్ష నిర్వహించారు. ఆ రోజు పండరీపూర్ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునే వార్కీల వాహనాలకు టోల్ రుసుం తీసుకోవద్దని ఆదేశించారు. దీని కోసం వారు తమ వాహనాలకు స్టిక్కర్లు అంటించుకని స్థానిక పోలీసుల వద్ద నమోదు చేసుకుంటే సరిపోతుందన్నారు. ఈ సమావేశం అనంతరం షిండే కార్యాలయాన్ని వీడుతుండగా.. ఆయనను చూసేందుకు అక్కడున్న వారు ఎగబడ్డారు. ఈ క్రమంలోనే ఆ సమూహంలో ఉన్న మహిళా కానిస్టేబుల్ గాయపడ్డారు. ఆమెను చూసిన షిండే.. కాసేపు ఆగి ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రేపై తిరుగుబావుటా ఎగురవేసి బీజేపీ మద్దతుతో షిండే సీఎం బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఉపముఖ్యమంత్రి పదవి తీసుకున్నారు. -
కరీంనగర్: మహిళా కానిస్టేబుల్ ఆడియో కలకలం
సాక్షి, కరీంనగర్: పోలీసు విభాగంలో స్పౌస్ బదిలీల విషయంలో ఇటీవల ఓ కానిస్టేబుల్ పోలీసు వాట్సాప్ గ్రూపుల్లో పంపించిన ఆడియో సంచలనమైంది. తాజాగా ఓ మహిళా కానిస్టేబుల్ బదిలీ అయ్యి, తన భర్తకు దూరంగా ఉంటూ చాలా ఇబ్బందులు పడుతున్నాననే ఆడియో ‘సాక్షి’కి అందింది. అందులో రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, డీజీపీ గారికి నమస్కారం సార్.. అంటూ మొదలుపెట్టి, 317 జీవోలో రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి జగిత్యాల జిల్లాకు ట్రాన్స్ఫర్ అయినట్లు.. తన భర్త ఒకచోట, తానొక చోట ఉంటున్నామని చెప్పింది. స్పౌస్ ట్రాన్స్ఫర్ దరఖాస్తు చేసి, నాలుగు నెలలవుతోందని.. తనకు మూడు సంవత్సరాల బాబు ఉన్నాడని.. బాబును పట్టుకొనే డ్యూటీకి వెళ్తున్నట్లు తెలిపింది. ఇటీవల భద్రాచలం బందోబస్తుకు తీసుకెళ్లడంతో అనారోగ్యానికి గురయ్యాడని వాపోయింది. పట్టుకునే వారు ఎవరూ లేరు సార్.. తాను తన కొడుకు ఏదో ఒకటి చేసుకొని, రెండు మూడు రోజుల్లో చచ్చిపోతామని ఆవేదన వ్యక్తం చేసింది. తన సమస్యకు పరిష్కారం చూపాలని ఆడియోలో వేడుకుంది. -
మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య.. సూసైడ్ నోట్ స్వాధీనం
చెన్నై: వేలూరు సమీపంలోని మూంజూరుపట్టుకి చెందిన ఇందుమది (30) వేలూరు రిజర్వ్ పోలీసు విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది. ఈమెకు 2010లో ప్రైవేటు ఉద్యోగి క్రిష్ణమూర్తితో వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. భార్య, భర్తలు ఇద్దరూ పనిచేస్తుండడంతో పిల్లలు ఇడయంబట్టు గ్రామంలోని క్రిష్ణమూర్తి తల్లిదండ్రుల వద్ద ఉన్నారు. ఈమె పోలీస్ క్యార్టర్స్‌లో ఉంటున్నారు. శుక్రవారం ఆమె విధులకు హాజరు కాకపోవడంతో అనుమానించిన సహ కానిస్టేబుళ్లు.. ఉన్నతాధికారులు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు రాత్రి పోలీస్ క్యార్టర్స్‌కు వచ్చి చూడగా ఇంటిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని ఉండటాన్ని గుర్తించి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. మృతదేహం వద్ద సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో తన మృతికి ఎవరూ కారణం కాదని రాసి ఉంది. కాగా పనిభారం, సెలవులు దొరక్కపోవడంతో పిల్లలను చూసే పరిస్థితి కూడా లేకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. చదవండి: (Hyderabad: కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారం) -
బావతో ‘పెళ్లి ఖాయం’.. ఉరికి వేలాడుతూ కనిపించిన మహిళా కానిస్టేబుల్
కోనేరుసెంటర్(కృష్ణా జిల్లా): కృష్ణా జిల్లా ఏఆర్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ గురువారం ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనపై మచిలీపట్నం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నందిగామ మండలం సామవరం గ్రామానికి చెందిన జిల్లేపల్లి ప్రశాంతి (23) ఆర్మ్డ్ రిజర్వు విభాగంలో కానిస్టేబుల్‌గా పని చేస్తోంది. మచిలీపట్నం పరాసుపేటలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది. పరాసుపేటలోని ఓ స్కూల్లో పని చేసే తన బావ రాజేష్‌తో ఇటీవల ఆమెకు వివాహం చేసేందుకు పెద్దలు నిర్ణయించారు. (చదవండి: అర్ధరాత్రి రోడ్డుపై ఒంటరిగా యువతి.. బిక్కుబిక్కుమంటూ..) ఈ క్రమంలో గురువారం ప్రశాంతి రూమ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన ఇంటి యజమాని మచిలీపట్నం పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బందరు డీఎస్పీ మాసూంభాషా, చిలకలపూడి సీఐ అంకబాబు వివరాలు సేకరించారు. మృతురాలి తండ్రి కోటయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన మచిలీపట్నం పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్సై నాగరాజు తెలిపారు. ఏఆర్ విభాగం అధికారులు, తోటి సిబ్బంది ఆసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని సందర్శించారు. చదవండి: జవాన్‌ను మింగేసిన మంచు -
మహిళా పోలీసు కానిస్టేబుల్ వీడియో.. కొంపముంచింది!
లక్నో: తుపాకీ చేతబట్టి డైలాగులతో హల్చల్ చేసిన మహిళా పోలీస్ కానిస్టేబుల్‌పై ఉన్నతాధికారులు వేటు వేశారు. ఘటనపై విచారణకు ఆదేశిస్తూ... పోలీస్ లైన్స్‌కు అటాచ్ చేశారు. కాగా ఆగ్రాలో తాను పనిచేస్తున్న పోలీస్ స్టేషనులో ప్రియాంక మిశ్రా అనే కానిస్టేబుల్ ఓ హిందీ డైలాగ్‌కు లిప్ సింక్ చేస్తూ వీడియో చిత్రీకరించారు. ‘‘హర్యానా, పంజాబ్ అనవసరంగా చెడ్డపేరు తెచ్చుకున్నాయి.. గానీ ఇక్కడికి రండి. ఇక్కడ ఐదేళ్ల పిల్లలకు కూడా తుపాకులు వాడటం తెలుసు’’ అంటూ వివాదంలో చిక్కుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్పందించిన ఉన్నతాధికారులు ఆమెను మందలించారు. ఆగ్రా పోలీస్ లైన్స్‌కు అటాచ్ చేశారు. దర్యాప్తు పూర్తయ్యేంత వరకు అక్కడే ఉండాలని ఆదేశించారు. ఈ విషయం గురించి ఆగ్రా ఎస్ఎస్పీ మునిరాజ్ ‘ది ప్రింట్’తో మాట్లాడుతూ... ‘‘ప్రవర్తనా నియమావళిని ఆమె ఉల్లంఘించారు. ఆ వీడియో మా దృష్టికి వచ్చిన వెంటనే చర్యలు తీసుకున్నాం. పోలీస్ లైన్స్‌కు ఆమెను పంపించాం. ఘటనపై దర్యాప్తు చేపట్టాం. నివేదిక వచ్చిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటాం’’ అని పేర్కొన్నారు. చదవండి: Viral: అత్తను గెంటేసిన కోడలు.. కొడుకును జవాను చాచి కొట్టడంతో.. -
చెట్టుకు ఉరివేసుకుని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
సాక్షి, చిత్తూరు : పెనుమూరు మండలం, కార్తికేయపురంలో విషాదం చోటుచేసుకుంది. సుకన్య అనే ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకుంది. తిరుమల టూటౌన్ పీఎస్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న సుకన్య ఆదివారం వ్యవసాయ పొలంలోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సుకన్య ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాలే కారణమని అనుమానిస్తున్నారు. -
మహిళా కానిస్టేబుల్‌పై టీఆర్ఎస్ కార్యకర్త దాడి
సాక్షి, ఖమ్మం : బందోబస్తు విధులు నిర్వర్తిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్‌పై టీఆర్ఎస్ కార్యకర్త దాడి చేసిన ఘటన శుక్రవారం కేటీఆర్ పర్యటన సందర్భంగా చోటుచేసుకుంది. టీఆర్ఎస్ కార్యాలయం వద్ద భూపాలపల్లి జిల్లాకు చెందిన డీఎస్పీ సంపత్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు. కేటీఆర్ కార్యాలయం చేరుకొనే సమయంలో పోలీసులు ఎవరినీ లోపలికి అనుమతించలేదు. దీంతో ఆగ్రహాంతో అక్కడ ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తల్లో ఒకరైన ఫ్రాన్సిస్.. మహిళా కానిస్టేబుల్ జ్యోత్స్నపై పుష్పగుచ్ఛంతో దాడి చేశాడు. దీంతో పుష్పగుచ్ఛం వెనుకవైపు ఉన్న కర్ర కానిస్టేబుల్ తలకు బలంగా తగలడంతో బిగ్గరగా రోదించింది. అక్కడే ఉన్న డీఎస్పీ సంపత్‌కుమార్ వెంటనే అతడిని అదుపులోకి తీసుకోవాలని ఆదేశాలు జారీచేయటంతో టూటౌన్ సీఐ గోపి అతడిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. (చదవండి: మహిళతో పరిచయం నిండు ప్రాణాన్ని బలితీసింది.) -
మహిళా కానిస్టేబుల్‌ను అసభ్యంగా తాకుతూ..
లైంగిక వేధింపులకు పాల్పడుతున్న నిందితులకు శిక్షపడుతున్నపటికి దేశవ్యాప్తంగా మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు ఆగడం లేదు. తాజాగా దేశ రాజధానిలో మిట్ట మధ్యాహ్నం ఓ మహిళా కానిస్టేబుల్ లైంగిక వేధింపులకు గురైంది. బస్సులో ప్రయానిస్తుండగా ఓ వ్యక్తి తనని అసభ్యంగా తాకుతూ వికృతంగా ప్రవర్తించాడు. దీంతో బాధితురాలు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అతడిపై కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని పోలీసు కంట్రోల్ రూంలో విధులు నిర్వర్తిస్తోన్న ఓ మహిళా కానిస్టేబుల్(29) బుధవారం విధులకు బస్సులో బయలుదేరింది. రద్దీగా ఉన్న బస్సులో ఆమె పక్కనే ఓ వ్యక్తి నిలుచుని ఉన్నాడు. ఈ క్రమంలో ఆ వ్యక్తిని తనని అసభ్యంగా తాకడం ఆమె గమనించింది. మొదట అనుకొకుండా తాకడేమో అనుకున్న ఆమె అతడిని వదిలేసింది. ఆ తర్వాత కూడా తన మెడ నుంచి వెనక వరకు అసభ్యంగా తాకుతుండంటంతో అతడిని వారించింది. అయినా అతడు వినకుండా ఆమెతో వికృతంగా ప్రవర్తిస్తూ కామవాంఛ తీర్చుకున్నాడు. ఆగ్రహనికి లోనైన ఆ మహిళ కానిస్టేబుల్ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని అతడిని బెదరించింది. అయినా ఈ ప్రబుద్ధుడు బయటపడలేదు. అందరూ చూస్తుండగానే బాధితురాలితో అసభ్యంగా ప్రవర్తించాడు. అయినా చూట్టూ ఉన్న జనం ఎవరూ కూడా నిందితుడి వారించేందుకు ప్రయత్నించలేదు. చివరకు బాధితురాలు అతడిని పట్టుకుని కొట్టేందుకు ప్రయత్నించగా నిందితుడు హల్మెట్తో కానిస్టేబుల్ తలపై కొట్టాడు. దీంతో బాధితురాలి తలకు తీవ్ర గాయమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసు అధికారి మాట్లాడుతూ.. బాధిత మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు నిందితుడిపై లైంగిక వేధింపులు, ఇతర కేసులు నమోదు చేశామని చెప్పారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్య పరిస్తితి నిలకడ ఉందని, ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. చదవండి: హవ్వ! ఈ కారణంతో కూడా పెళ్లి ఆపేస్తారా? కారు బాంబ్ పేలుడు.. 20 మంది మృతి -
మహిళ కానిస్టేబుల్ మృతి, పలు అనుమానాలు
సాక్షి, విశాఖపట్నం: నక్కపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. అదే స్టేషన్లో పనిచేస్తున్న భవాని అనే మహిళ కానిస్టేబుల్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ కేసును నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. భర్త నాగల సింహాద్రి ప్రమేయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. భవాని 2018లో నక్కపల్లి పోలీస్ స్టేషన్లో విధుల్లోకి చేరింది. భవానికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. చదవండి: దారుణం : బిడ్డల గొంతుకోసిన తండ్రి -
మంత్రి కొడుకు కారు అడ్డగింపు.. మహిళా పోలీస్‌ను
గాంధీనగర్ : లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి కర్ఫ్యూ సమయంలో ప్రయాణిస్తున్న మంత్రి కొడుకు కారును అడ్డగించినందుకు మహిళా పోలీసు అధికారిని బదిలీ చేశారు. ఈ ఉదంతం గుజరాత్ రాష్ట్రంలో వెలుగు చూసింది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో సూరత్‌లో కర్ఫ్యూ అమలులో ఉంది. ఈ క్రమంలో రాష్ట్ర ఆరోగ్య మంత్రి కుమార్ కనాని కొడుకు ప్రకాశ్ కనాని స్నేహితులు బుధవారం లాక్డౌన్ నిబంధనలు అతిక్రమించి కారుతో రోడ్డుపైకెక్కారు. మాస్క్ ధరించకుండా కర్ఫ్యూ సమయంలో బయటకు వచ్చినందుకు వారి కారును మహిళా కానిస్టేబుల్ సునీతా యాదవ్ అడ్డుకుది. దీంతో వారు ఎమ్మెల్యే కొడుకు ప్రకాశ్‌ను రప్పించారు. (టీచర్ నిర్వాకంపై తీవ్ర విమర్శలు) అనంతరం మరో కారులో అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే కొడుకు, అతని స్నేహితులతో కలిసి మహిళా కానిస్టేబుల్‌తో గొడవకు దిగారు. కానిస్టేబుల్‌ను అనుచిత వ్యాఖ్యలతో దూషించి, తమతో పెట్టుకుంటే ఆమెను 365 రోజులు అదే రోడ్డుపై నిలబెట్టేలా చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డారు. దీనిపై స్పందించిన కానిస్టేబుల్ ఆమె తమకు బానిసను కాదని బదులిచ్చారు. కాగా రాజకీయ ప్రోద్భలంతో అధికారులు మహిళా కానిస్టేబుల్‌ను మరో చోటుకు బదిలీ చేశారు. కాగా ఈ సంభాషణకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలవ్వడంతో ఈ సంఘటనపై సూరత్ పోలీస్ కమిషనర్ విచారణకు ఆదేశించారు. అంతేగాక ప్రకాశ్ కనాని, అతని ఇద్దరు స్నేహితులను పోలీసులు ఆదివారం అరెస్టు చేయగా.. అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. (ఫోటోగ్రఫీ ‘పిచ్చి’ : చివరికి కొడుకులకు) -
‘నా కొడుకు బాధ్యత.. ఉద్యోగం రెండూ ముఖ్యమే’
లక్నో : చిన్న పిల్లల ఆలన పాలన ఎంతో కష్టంతో కూడుకున్న పని. వాళ్లకు ఎప్పుడు.. ఏం అవసరం వస్తుందో చెప్పలేం. అందుకే పిల్లల వెంట ఎప్పుడూ తల్లి ఉండాల్సిందే. కానీ ఓ తల్లి తన కొడుకు సంరక్షణతో పాటు ఉద్యోగం కూడా ముఖ్యమే అని నిరూపించింది. భూజాన చంటి పిల్లాడిని వేసుకుని విధులకు హాజరయ్యారు ఓ మహిళా పోలీస్. ఈ దృశ్యాలు ఉత్తర ప్రదేశ్‌లో దర్శనమిచ్చాయి. ప్రీతి రాణి అనే మహిళా కానిస్టేబుల్ గ్రేటర్ నోయిడాలోని దాద్రి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. ఈమెకు ఏడాదిన్నర కొడుకు ఉన్నాడు. సోమవారం నోయిడాలోని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ పాల్గొన్న ఓ కార్యక్రమానికి ప్రీతికి అక్కడ సెక్యూరిటీగా డ్యూటీ వేశారు. ఉదయ 6 గంటలకే తప్పని సరిగా అక్కడికి హాజరవ్వాలి. అయితే అదే రోజు భర్తకు వేరే పని ఉండటంతో మరో మార్గం లేక తన కొడుకును వెంట పెట్టుకుని విధులకు హజరయ్యారు. మహిళా కానిస్టేబుల్ చంటి పిల్లవాడితో సభకు రావడంతో అందరి దృష్టి ఆమె వైపు మళ్లింది. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై మహిళ స్పందిస్తూ.. ‘‘బాబు వాళ్ల నాన్నకు ఈ రోజు ఎగ్జామ్ ఉంది. కావున ఆయన పిల్లావాడిని తీసుకెళ్లలేడు. ఏమి చేయలేని స్థితిలో ఇలా చేశాను. నా కొడుకు సంరక్షణ నాకు ముఖ్యం. అదే విధంగా ఉద్యోగం కూడా ముఖ్యమే. అందుకే నేను తనను ఇక్కడకు తీసుకు రావాల్సి వచ్చింది’’ అన్నారు. కాగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ రెండు రోజుల పర్యటన నిమిత్తం(ఆదివారం, సోమవారం) గౌతమ్ బుద్ద నగర్, గ్రేటర్ నోయిడాకు విచ్చేశారు. అక్కడ రూ. 1,369 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులను శంకుస్థాపన చేశారు. -
మహిళా కానిస్టేబుల్‌పై భర్త ఫిర్యాదు
ప్రకాశం, వేటపాలెం: వివాహేతర సంబంధం నడుపుతున్న మహిళా కానిస్టేబుల్‌పై ఆమె భర్త పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. గుంటూరు జిల్లా కర్లపాలెం మండలం ప్యార్లి గ్రామానికి చెందిన సునీల్‌రాజ్ ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నాడు. పదమూడేళ్ల క్రితం కంభం అనూషతో వివాహమయ్యింది. వీరికి ఇద్దరు సంతానం. మహిళా కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న అనూష మరొకరితో వివాహేతర సంబంధం కలిగి ఉండటంపై గతంలో పోలీసులకు ఫిర్యాదు చేయగా క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఆమెను సస్పెండ్ చేశారు. ఇటీవల తిరిగి వేటపాలెం పోలీస్ స్టేషన్లో విధుల్లో చేరిన అనూష వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా మంగళవారం రాత్రి ఇరువురిని రెడ్ హ్యండెండ్‌గా పట్టుకున్న సునీల్‌రాజ్ ఆధారాలతో సహా వేటపాలెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్న అనూషపై శాఖాపరంగా, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరాడు. -
పోకిరీని రఫ్పాడించిన చంచల్
కాన్పూర్: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం మైనర్ బాలికలు, మహిళలపై అత్యాచారాలు, దాడులతో అట్టుడికిపోతోంది. అయితే ఒక మహిళా కానిస్టేబుల్ మాత్రం బాలికలను వేధిస్తున్న ప్రబుద్ధిడికి తగిన శాస్తి చేసిన వైనం ఆకట్టుకుంటోంది. కాన్పూర్, బీతూర్ ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. స్థానిక బాలికలు పాఠశాలకు వెళుతున్న సమయంలో ఒక వ్యక్తి అనుచితంగా ప్రవర్తిస్తూ వేధింపులకు పాల్పడ్డారు. దీన్ని గమనించిన మహిళా కానిస్టేబుల్ ఆ పోకిరీని పట్టుకుని రఫ్పాడించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమే బీతూర్ పోలీస్ స్టేషన్‌లోని యాంటీ రోమియో స్క్వాడ్ మహిళా కానిస్టేబుల్ చంచల్ చౌరాసియా. రోమియోల భరతం పట్టే పనిలో ఉన్న చంచల్ అతగాడి కాలర్ పట్టుకుని మరోసారి ఇలాంటి వేధింపులకు గురి చేస్తే తాట తీస్తానని హెచ్చరించారు. అంతేకాదు బూటు తీసి ఒకటి కాదు రెండు కాదు 22 సార్లు వాయించి పడేసారు. అనంతరం నిందితుడిని పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. #WATCH A woman constable thrashes a man for allegedly harassing girls on their way to school in Bithur area of Kanpur. (10.12.19) pic.twitter.com/avQpgk73Va — ANI UP (@ANINewsUP) December 11, 2019 -
మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
సాక్షి, విశాఖపట్నం: లైంగిక వేధింపులు తాళలేక ఉరి వేసుకుని ఒక మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన విశాఖ నగరంలో చోటు చేసుకుంది. అదనపు కమాండర్ టీవీరావు, సబ్ ఇన్స్‌స్పెక్టర్ ఆనందరావులు తరుచూ లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని మల్కాపురం సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్ టెర్మినల్‌లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ లావణ్య ఫిర్యాదులో పేర్కొంది. మల్కాపురం హెచ్పీసీఎల్లో లావణ్యతో పాటు ఆమె భర్త కూడా సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. గత కొంతకాలంగా అధికారులు లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని లావణ్య పేర్కొంది. దిక్కుతోచక తనువు చాలించాలని నిర్ణయించుకున్నట్లు ఫిర్యాదులో తెలిపింది. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన లావణ్యను చికిత్స నిమిత్తం నగరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వర్గాల ద్వారా మల్కాపురం పోలీసులకు సమాచారం అందించారు. సీఐ ఉదయ్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కానిస్టేబుల్ దారుణ హత్య
-
మరో పోలీసు బలవన్మరణం
సాక్షి, చెన్నై: పోలీసు శాఖలో మళ్లీ ఆత్మహత్యల పర్వం మొదలైంది. తిరుచ్చి మహిళా జైలులో రెండో కేడర్ వార్డెన్‌గా ఉన్న మహిళా కానిస్టేబుల్ బలన్మరణానికి పాల్పడ్డారు. ఉన్నతాధికారుల వేధింపులా, లేక ప్రేమ వ్యవహారం కారణమా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.చెన్నైలో ఆదివారం మణికంఠన్ అనే యువ కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే మరో సంఘటన తిరుచ్చిలో చోటుచేసుకుంది. యువ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడం పోలీసు వర్గాల్లో కలవరాన్ని రేపింది. కడలూరు జిల్లా పెరియకాడు పాళయం గ్రామానికి చెందిన ముత్తు కుమార్తె సెంతమిళ్æ సెల్వి(23) తిరుచ్చి మహిళా జైలులో రెండో కేడర్ కానిస్టేబుల్ హోదాతో వార్డెన్‌గా పనిచేస్తున్నారు. ఆదివారం రాత్రి షిఫ్ట్‌కు సెంతమిళ్ సెల్వి విధులకు హాజరు కావాల్సి ఉంది. అయితే, ఎంతకూ రాలేదు. దీంతో సహచర సిబ్బంది ఆమె బసచేసిన క్వార్టర్స్‌కు వెళ్లి చూశారు. అక్కడ ఫ్యాన్‌కు ఉరివేసుకుని సెంతమిళ్ సెల్వి వేలాడుతుండడంతో సహచరులు ఆందోళన చెందారు. జైలు ఉన్నతా«ధికారులకు సమాచారం అందించి తిరుచ్చి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించినట్టు వైద్యులు తేల్చారు. చిక్కిన లేఖ సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు,తిరుచ్చి పోలీసులు అర్ధరాత్రి సమయంలో సెంతమిళ్ సెల్వి గదిలో సోదాలు జరిపారు. అక్కడ ఓ లేఖ చిక్కింది. అందులో తన మరణానికి కారకులు ఎవరూ కారని, తానే ఈ నిర్ణయానికి వచ్చినట్టు రాసి ఉండడం అనుమానాలకు దారితీసింది. ఏదేని ప్రేమ వ్యవహారం కారణంగా ఉండవచ్చని తొలుత భావించారు. ఆమె సెల్ నంబర్ ఆధారంగా ఆ దిశగా విచారణను వేగంతం చేశారు. అయితే, జైలులో సాగుతున్న కొన్ని వ్యవహారాలు బయటకు పొక్కి ఉండడం, స్థానిక అధికారుల వేధింపుల్ని సెంతమిళ్ సెల్వి ఎదుర్కొంటున్నట్టు తేలడంతో ఆదిశగా విచారణ వేగవంతం అయింది. జైలులో న్యాప్కిన్స్ తయారు చేస్తున్నారు. ఇందులో కొన్ని జైలు ఖైదీల అవసరాలకు పోగా, మిగిలిన వాటిని బయటి మార్కెట్లో విక్రయిస్తారు. ఈ గుట్టు ఇటీవల ఉన్నతాధికారుల దృష్టికి చేరడంతో విచారణ చేపట్టారు. ఈ వ్యవహారం ఎలా ఉన్నతాధికారుల దృష్టికి చేరిందో, దీని వెనుక ఉన్న వాళ్ల ఎవరో ఆరాతీసే దిశగా సెంతమిళ్ సెల్వికి స్థానికంగా వేధింపులు పెరిగినట్టు సమాచారం. ఇది కూడా ఆమె బలవన్మరణానికి కారణంగా ఉండవచ్చన్న అనుమానాలతో విచారణ వేగాన్ని పెంచారు. -
పోలింగ్ విధులకు హాజరైన కానిస్టేబుల్‌కు పాము కాటు
సాక్షి, పెద్దపల్లి : పంచాయతీ ఎన్నికల పోలింగ్ విధులకు హాజరైన మహిళా కానిస్టేబుల్ పాము కాటుకు గురైన ఘటన ధర్మారం మండలం నందిమేడారం గ్రామంలో చోటు చేసుకుంది. పోలింగ్ విధుల నిమిత్తమై బసంతనగర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన మహిళా కానిస్టేబుల్ వనిత నందిమేడారం గ్రామానికి వెళ్లారు. డ్యూటీలో ఉన్న వనిత మంగళవారం రాత్రి పాము కాటుకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన పోలింగ్ సిబ్బంది, స్థానికుల సాయంతో వనితను కరీంనగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వనిత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వనిత ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు పేర్కొన్నారు. -
స్తన్యమిచ్చి ఆదుకున్న మహిళా కానిస్టేబుల్ ..
కర్ణాటక, శివాజీనగర: మహిళా పోలీసు కానిస్టేబుల్ తల్లి మనసు అందరి ప్రశంసలను అందుకుంటోంది. రోడ్డు పక్కను విసరివేసిన నవజాత శిశువుకి ఆమె స్తన్యమిచ్చి ఆదుకున్నారు. బుధవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు యలహంక జీకేవీకే క్యాంపస్ రోడ్డు పక్కలో నవజాత ఆడశిశువును వదిలివెళ్లారు. విపరీతమైన చలికి బిడ్డ గుక్కపట్టి ఏడుస్తోంది. చీమలు పట్టిన్న నవజాత శిశువును చూసిన కొందరు స్థానికులు విద్యారణ్యపురం పోలీసులకు సమాచారం అందించారు. బిడ్డ లభించిన స్థలం తమ పరిధి కాదని విద్యారణ్యపుర పోలీసులు రాలేదు. దీంతో యలహంక పోలీసులు వెళ్లారు. చలించిన సంగీత వారిలోని మహిళా కానిస్టేబుల్ సంగీతా ఎస్ హలిమనికి ఆ బిడ్డను చూడగానే తల్లి మనసు తల్లడిల్లింది. పసిగుడ్డుకు రొమ్ము ఇచ్చి ఆకలి తీర్చారు. బిడ్డకు బట్టలు తొడిగి యలహంక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి, అక్కడ నుంచి వాణి విలాస్ ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్యంగా ఉన్న బిడ్డను పిల్లల సంక్షేమ శాఖకు అప్పగించేందుకు వైద్యులు నిర్ధారించారు. సంగీత చేసిన మంచిపనికి డీసీపీ కళా కృష్ణస్వామితో పాటు పలువురు సీనియర్ అధికారులు అభినందించారు. సకాలంలో పాలు త్రాగించి బిడ్డను కాపాడిన సంగీతను ఆసుపత్రి సిబ్బంది ప్రశంసించారు. సంగీతకు 10 నెలల ఆడకూతురు ఉంది. ఆమె గొప్పమనసుపై సోషల్ మీడియాలో కూడా మన్ననలు అందుకుంటోంది. -
ప్రేమించి పెళ్లాడాడు...ఆనక పొమ్మన్నాడు..!
విశాఖపట్నం, ఆనందపురం(భీమిలి): ప్రజలు మాన ప్రాణాల ను కాపాడడంతో పాటు దేశ రక్షణ చేపట్టవలసిన పోలీసు అతను. కానీ అతనిలో ఎక్కడో మానవ మృగం దాగి ఉంది. దీంతో తన విద్యుద్ధర్మాన్ని మరచి సహచర ఉద్యోగిని ప్రేమ పేరుతో ఉచ్చులోకి లాగాడు. శారీకంగా అనుభవించాడు. పెళ్లి విషయం ఎత్తేసరికి తప్పించుకో చూశాడు. కానీ ఆమె ఎదురు తిరగడంతో తప్పనిసరి పరిస్థితిలో వివాహం చేసుకున్నాడు. అనంతరం ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలని పన్నాగం పన్నాడు. ఆమెను నిత్యం శారీరకంగా, మానసికంగా వేధించడం మొదలు పెట్టాడు. దీంతో బంగారుమయం అవుతుందనుకున్న జీవితం చుక్కాని లేని నావ కావడం, అయిన వారికి కూడా దూరం కావడంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడింది. ఆనందపురంలో బుధవారం జరిగిన విషాధ సంఘటన ఇది. స్థానిక సీఐ సూర్యనారాయణ, స్థానికులు అందించిన వివరాలిలా ఉన్నాయి. ప్రేమగా మారిన పరిచయం తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా, పూడూరు మండలం, వెంకాపల్లి గ్రామానికి చెందిన మాల రాజేంద్ర (27)కు రెండేళ్లు క్రితం ఇండో టిబెటిన్ బోర్డర్ బెటాలియన్ (ఐటీబీపీ)లో కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. ఈ మేరకు మండలంలోని పందలపాకలో ఉన్న బెటాలియన్‌లో చేరిన రాజేంద్ర అప్పటి నుంచి అక్కడ విధులు నిర్వహిస్తున్నాడు. ఇదిలా ఉండగా విశాఖ జిల్లాలోని మునగపాక మండలం, నాగవరం గ్రామానికి చెందిన కరణం కళావతి, రమణ దంపతుల చిన్న కుమార్తె కరణం కుమారి(22) డిగ్రీ వరకూ చదువుకోగా 2017 మే 1న ఐటీబీపీలో కానిస్టేబుల్‌గా ఉద్యోగం వచ్చింది. ఈ మేరకు పందలపాకలో ఉన్ని బెటాలియన్‌లో చేరింది. అక్కడ కుమారికి రాజేంద్ర ఉద్యోగ రీత్యా పరిచయమయ్యాడు. ఇద్దరూ తెలుగు వారు కావడంతో చనువు పెరిగి ప్రేమకు దారి తీసింది. అయితే వీరివి వేర్వేరు కులాలు కావడంతో పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. సంఘటన స్థలం వద్ద కుమారి మృతదేహం పరిశీలిస్తున్న ఎస్ఐ శ్రీనివాస్, ఐటీబీపీ అధికారులు దీంతో కుమారి తనకు రక్షణ కావాలంటూ పట్టుబట్టడంతో నాలుగు నెలలు క్రితం సింహాచలంలో రాజేంద్ర వివాహం చేసుకున్నాడు. అనంతరం వారు ఆనందపురంలో ఇల్లు అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నారు. కానీ వారిరువురి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో రెండు నెలలు క్రితం కుమారి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా చికిత్స చేయించడంతో కోలుకుంది. ఈ విషయమై బెటాలియన్ అధికారులు వారిద్దరికీ కౌన్సిలింగ్ నిర్వహించి సర్ది చెప్పారు. అప్పటి నుంచి వారి మధ్య గొడవలు జరుగుతుండగా ఎడముఖం పెడముఖంగా ఉంటున్నారు. తీవ్ర మనస్తాపానికి గురై... ఇదిలా ఉండగా రాజేంద్ర శిక్షణ నిమిత్తం ఈ నెల 7న చంఢీఘర్ వెళ్లాడు. ఏమైందో తెలియదు కానీ కుమారి మంగళవారం ముందుగా రాజేంద్రకు ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నానని తెలిపినట్టు తెలిసింది. అయితే అటు నుంచి ఓదార్పు రాలేదు సరికదా నువ్వు చనిపోతే నేను కూడా చనిపోతానని చెప్పి రాజేంద్ర ఫోన్ పెట్టేసినట్టు పోలీస్ విచారణలో బయట పడింది. దీంతో ఇంకా మనస్తాపానికి గురైన కుమారి తన తల్లిదండ్రులైన కళావతి, రమణలకు ఫోన్ చేసి నేను జీవితంలో మోసపోయానని, చనిపోతున్నానని చెప్పింది. దీంతో ఎలాంటి అఘాయిత్యానికీ పాల్పడవద్దని తాము వస్తున్నామని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుండగానే... కుమారి ఫోన్ పెట్టేసింది. ఆమె నివాసం ఉంటున్న ఇంట్లో ఫ్యాన్ హుక్కుకు చీరతో ఉరి వేసుకుంది. ఈ విషయం బుధవారం ఉదయం బయట పడడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు ఈస్ట్ ఏసీపీ పూర్ణ చంద్రరావు, సీఐ సూర్యారావు, ఎస్ఐ శ్రీనివాస్‌లు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరిపారు. కుమారి సెల్ ఫోన్‌ని స్వాధీనం చేసుకొని అందులో ఉన్న ఫోన్ కాల్స్, ఇతర సమాచారాన్ని క్రోడీకరించి సేకరించారు. ఈ మేరకు అందులో ఉన్న ఫోన్ నంబరు ఆధారంగా రాజేంద్రకు ఫోన్ చేయగా తనకు ఏమీ తెలియదని తప్పించుకో చూశాడు. కానీ చంఢీఘర్ పోలీసులు అతడిని అక్కడ పట్టుకొని స్థానిక పోలీసులకు అప్పగించడానికి నిర్ణయించారు. ఐటీబీపీ కమాండెంట్ చంద్రమోహన్ మిశ్రా, ఎస్ఐ బాల నాయక్‌లు కూడా సంఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని భీమిలి ప్రభుత్వాస్పత్రికి తరలించి తహసీల్దారు మల్లా అప్పలరాజు ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసుని సీఐ సూర్యనారాయణ దర్యాప్తు చేస్తున్నారు. -
‘నా బిడ్డ అనుకునే పాలిచ్చా’
సాక్షి, బెంగళూరు: సోషల్ మీడియా మొత్తం ఇప్పుడు ఆ మహిళా కానిస్టేబుల్‌కు హ్యాట్సాఫ్ చెబుతోంది. కన్నతల్లికి దూరమైన ఓ పసికందుకు పాలిచ్చి.. ఆకలిని తీర్చిందామె. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలో ఈ ఘటన తాజాగా చోటు చేసుకుంది. స్థానికంగా నిర్మాణంలో ఉన్న ఓ భవనం వద్ద ప్లాస్టిక్ బ్యాగులో చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లిపోయారు. అది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఏఎస్సై నగేశ్ ఘటనాస్థలానికి చేరుకుని ఆ పసికందును పరిశీలించారు. బ్యాగ్‌లో రక్తం, బొడ్డు తాడు ఉండటంతో అప్పుడే పుట్టిన చిన్నారిగా నిర్ధారించారు. వెంటనే ఆ మగ శిశువును ఆస్పత్రికి తీసుకెళ్లగా వారు ఉచితంగా చికిత్స అందించారు. ఆపై కాస్త కోలుకున్నాక పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అయితే ఆకలితో ఆ పసిగుడ్డు గుక్కపట్టి ఏడ్వటం ప్రారంభించింది. అది గమనించిన కానిస్టేబుల్ అర్చన ఆ చిన్నారిని ఒళ్లోకి తీసుకుని పాలు పట్టించారు. అర్చన మూడు నెలల బాబుకు తల్లి. ఈ మధ్యే మెటర్నిటీ లీవ్ పూర్తి చేసుకుని తిరిగి విధుల్లో చేరారు. ‘ఏడుస్తుంది నా బిడ్డే అనిపించింది. చూసి తట్టుకోలేకపోయా. అందుకే ఆ బాబుకు పాలిచ్చా’ అని అర్చన ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. అర్చనపై ప్రశంసలు... ఈ విషయం తన దృష్టికి రావటంతో ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి.. ఆ మహిళా కానిస్టేబుల్‌పై ప్రశంసలు గుప్పించారు.‘ఈ ఉదంతం కదిలించింది. ఆ చిన్నారి ఆకలిని తీర్చిన ఆ తల్లికి వందనాలు’అని బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. బెంగళూరు సిటీ పోలీసులు కూడా ఫేస్ బుక్ పేజీలో ‘అర్చనకు సెల్యూట్’ పేరిట ఓ సందేశం ఉంచారు. మరోవైపు ఈ కథనం చూసిన ప్రజలు కూడా ఆ తల్లి హృదయానికి సలాం కొడుతున్నారు. అన్నట్లు ఆ బిడ్డకు కుమారస్వామి అన్న పేరు పెట్టిన ఏఎస్సై నగేశ్.. ఇకపై ఆ పసికందు బాధ్యత ప్రభుత్వానిదేనని ప్రకటించారు. బెంగళూరులోని శిశుమందిర్ నిర్వాహకులకు ఆ బాబును అప్పగించగా, ఆ శిశువు ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. -
కారు ఢీకొని మహిళా కానిస్టేబుల్ మృతి
తిరువొత్తియూరు: పుదుచ్చేరిలో ఆదివారం ఉదయం కారు ఢీకొని మహిళా కానిస్టేబుల్ ఒకరు మృతి చెందారు. పుదుచ్చేరి కూనిచం పట్టి ప్రాంతానికి చెందిన పూంకుళలి (23) రెడ్డియార్ పాళయం పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్. ఈమె అఅవివాహిత. ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో ఇంటి నుంచి బైక్‌లో విధులకు బయలుదేరారు. పిళ్లయార్ కుప్పం ప్రాంతంలో వెళుతుండగా వెనుక నుంచి వేగంగా వస్తున్న వాహనం బైక్‌ను ఢీకొట్టి ఆగకుండా వెళ్లింది. ఈ ఘటనలో పూంకుళలి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి పూంకుళలి మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అతనుగా మారబోతున్న మహిళా కానిస్టేబుల్!
ఇతని పేరు లలితా సాల్వే. వయస్సు 28 ఏళ్లు. మహారాష్ట్రలోని బీడ్ జిల్లా రాజేగావ్‌కు చెందిన వాడు. 2010 నుంచి కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఇందులో విశేషం ఏముంది అంటే.. అసలు విషయమంతా అక్కడే ఉంది. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిన ఘనత ఇతనిదే. ఇంతకీ అతను ఏం చేశాడు? ఎందుకు అతని విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం తల పట్టుకుంది? ఫొటో చూస్తే తెలుస్తోంది కదా లలితా సాల్వే పురుషుడని.. కానీ అక్కడే మిస్టరీ ఉంది. నిజానికి అతను పురుషుడు కాదు...అక్షరాలా మహిళే! కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరింది కూడా మహిళగానే. అయితే చిన్నప్పటినుంచీ లలితా సాల్వే.. ఆమెనా.. అతడా అన్నది పెద్ద కన్ఫ్యూజన్. శరీరమేకాదు.. హావభావాలు, ప్రవర్తన, అంతా డిఫరెంట్. డాక్టర్లకు కూడా పెద్ద పజిల్. చివరికి ఎన్నో టెస్ట్‌ల తర్వాత వైద్యులు అసలు విషయం తేల్చేశారు. లలితా సాల్వేలో స్త్రీ లక్షణాల కంటే పురుష లక్షణాలే ఎక్కువ ఉన్నాయని వెల్లడించారు. పురుషులకు ఉండాల్సిన అంగాలు వున్నప్పటికీ.. అవి సంపూర్ణం కావాలంటే 'సెక్స్ రీ-అసైన్మెంట్ సర్జరీ (ఎస్ఆర్ఎస్)’ చేయాలని తేల్చారు. నిజానికి స్త్రీగా కంటే పురుషుడిగా వుండాలనే కోరిక లలితా సాల్వేలో మొదటినుంచీ బలంగా వుండేది. డాక్టర్లు కూడా సర్జరీ చేయించుకుంటే పురుషుడిగా మారిపోవచ్చని గ్యారంటీ ఇచ్చారు. దీంతో సర్జరీ చేయించుకోవడానికి ఒక నెల రోజులు సెలవు కావాలంటూ మహారాష్ట్ర పోలీసు అధికారులకు ఓ దరఖాస్తు పెట్టుకుంది. అప్పటిదాకా తమ కానిస్టేబుల్ మహిళ అనుకున్న పోలీసులకు ఒక్కసారి షాక్ తగిలింది. అధికారులు కూడా ఏం చేయాలిరా బాబూ అని తలపట్టుకున్నారు. కుదరదంటూ ఆమెకు తేల్చిచెప్పారు. ఇక లాభం లేదనుకున్న లలిత ఏకంగా ముంబై హైకోర్టు మెట్లు ఎక్కింది. తాము తేల్చలేమని నేరుగా రాష్ట్ర పరిపాలనా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాలని హైకోర్టు సలహా ఇచ్చింది. విషయం కాస్తా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ దాకా వెళ్లింది. ఒకవైపు లలితకు మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో ఒత్తిడి పెరగడంతో ఆయన చివరికి ఓకే చెప్పేశారు. లలిత విషయంలో పాజిటివ్‌గా స్పందించాలంటూ హోంశాఖను ఆదేశించారు. అలా..అలా చివరికి పురుషుడుగా మారేందుకు లలితకు లైన్ క్లియర్ అయింది. సెలవు మంజూరైంది. ఇప్పుడు లలిత ఎంతో హ్యాపీ. ఒకటి రెండు రోజుల్లో జేజే ఆస్పత్రిలో ఆమె సర్జరీ చేయించుకోబోతున్నారు. ఆమె నుంచి అతడిలా ఈ కథ ఇలా సుఖాంతమవుతోంది. -
ఆమె అతడు
-
మహిళాకానిస్టేబుల్ ఆత్మహత్య
కృష్ణలంక(విజయవాడ తూర్పు): అనుమానాస్పదంగా మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కృష్ణలంక బాలాజీనగర్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సీసీఎస్ కానిస్టేబుల్‌గా గల్లా నాగమణి(28) పనిచేస్తోంది. భర్త నాగరాజు, ఇద్దరు పిల్లలు వర్షిత్(5), దీపేష్(2)లతో పాటు ఆమె తల్లిదండ్రులతో కలసి కృష్ణలంక బాలాజీనగర్‌లోని మొదటిలైన్‌లో నివాసముంటోంది. ఆదివారం రాత్రి డ్యూటికి వెళ్లిన నాగమణిని మరుసటిరోజు ఉదయం భర్త నాగరాజు ఆమెను ద్విచక్ర వాహనంపై ఇంటికి తీసుకొచ్చాడు. అనంతరం వారి పెద్ద కొడుకును స్కూల్లో దించి వచ్చేందుకు వెళ్లాడు. ఇటీవల ఆమె తల్లిదండ్రులు కూడా కొన్ని పనుల నిమిత్తం వారి సొంత ఊరు అవనిగడ్డకు చిన్నకొడుకును తీసుకుని వెళ్లడంతో ఇంట్లో ఎవరు లేరు. ఆ సమయంలో సుమారు 8.30 గంటలకు ఆమె బెడ్రూంలో చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై సమాచారం అందుకున్న ఏసీపీ శ్రీనివాసరావు, సీఐ చంద్రశేఖరరావు సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని స్థానికుల నుంచి వివరాలు ఆరా తీశారు. అయితే భర్త నాగరాజు ఇటీవల లారీలు కొనుగోలు చేయడంతో వ్యాపారంలో నష్టం వాటిల్లిందని, దీనిపై భార్యాభర్తల మధ్య స్వల్ప గొడవలు జరుగుతున్నాయని, సున్నిత మనస్తత్వంగల నాగమణి దీని కారణంగానే ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేన్నారు. పోలీసులు పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మనిషి కుక్కని కరిస్తే...
జీవన కాలమ్ అధికారం తలకెక్కినప్పటి కుసంస్కారం ఇది. ఒక్కక్షణంలో గతం మసకబారుతుంది. తాము ప్రత్యేకమైన పదార్థంతో మలిచిన మహానుభావులమనే భావం ఆకాశంలో నడిపిస్తుంది. కుక్క మనిషిని కరిస్తే అది వార్త కాదు. మనిషి కుక్కని కరిస్తే అది వార్త అన్నారెవరో. ఈ మధ్య ఓ సరదా అయిన సంఘటన సిమ్లాలో జరిగింది. రాహుల్‌గాంధీగారు ఎన్నికల ఫలితాల మీద జరిపే సమీక్షా సమావేశానికి మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగుగారి మేనకోడలు– ఈ మధ్యనే తాజాగా ఎమ్మెల్యేగా ఎన్నికయిన ఆషాకుమారి సభకి వచ్చారు. ఆమెని ఓ మహిళా కానిస్టేబుల్ ఆపారు. వాగ్వాదం పెరిగింది. అవతల కాంగ్రెసు మీటింగు జరిగిపోతోంది. ఎమ్మెల్యేగారికి కోపం పెరిగింది– తన పార్టీ మీటింగుకి హాజరు కావడానికి పోతుంటే ఓ కానిస్టేబుల్ తనని ఆపడమా! వెంటనే చాచి చెంపదెబ్బ కొట్టింది. సాధారణంగా ఈ కథ ఇక్కడితో ముగుస్తుంది. ఇలాంటి ముచ్చట్లు మన రాష్ట్రంలో చాలాసార్లు వింటూంటాం. పోలీసు స్టేషన్లోనే ఆఫీసర్లని కొట్టిన నాయకుల ‘పెద్దరికం’మనం చదివి మురిసిపోయాం. కానీ కథ ఇక్కడ ఆగలేదు. కానిస్టేబుల్ వెంటనే అంతే బలంగా ఎమ్మెల్యే చెంప పగలకొట్టింది. ఇప్పుడు లెక్క సరిపోయింది. ఇప్పుడు ఎవరు ఎవరి మీద ఫిర్యాదు చెయ్యాలి? ఎమ్మెల్యేగారు కొట్టారని కానిస్టేబులా? లెక్క అక్కడితో సరిపెట్టేసింది కదా! మరి ఎమ్మెల్యేగారు చెయ్యాలా? ‘మరి తమరు ముందు పీకారు కదా?’ఇదీ మీమాంస. ఈ కథ తర్వాత ఏమీ జరగలేదు. కాగా ఎమ్మెల్యే ఆషా కుమారే కాస్త ఎక్కువ బాధ పడ్డారు. ‘ఆవిడ నన్ను నానా మాటలూ అంది. అవమానపరిచింది. నేను ఆవిడ తల్లి వయసు దాన్ని. అయినా నేను ఆవేశపడకుండా ఉండాల్సింది. నేను క్షమాపణ చెప్తున్నాను.’అన్నారు ఆషాకుమారి. మన చోటా నాయకులు ఎన్నికలలో జయించగానే కాస్త గోరోజనం పెరగడం చూస్తాం. వారు సాధారణంగా నేల మీద నడవరు. వారి వెనుక చిన్న చేతి సంచి పట్టుకుని ఓ నౌకరు నడుస్తూంటాడు. వారికి చుట్టూ ప్రపంచం బొత్తిగా హీనంగా కనిపిస్తూంటుంది. వారి పక్కన నడిచే చెంచాలు వారి కంటే పెద్ద అంగలు వేస్తారు. అధికారం తలకెక్కినప్పటి కుసంస్కారం ఇది. ఒక్కక్షణంలో గతం మసకబారుతుంది. తాము ప్రత్యేకమైన పదార్థంతో మలిచిన మహానుభావులమనే భావం ఆకాశంలో నడిపిస్తుంది. ఇంగ్లీషులో ఒక వాక్యం ఉంది When you loose your temper, you loose more than temper అని.ఇది చదువుకున్న సంస్కారి అవగాహన. కానిస్టేబుల్ తల్లి వయసున్న, కొత్తగా ఎన్నికైన ఒక మాజీ ముఖ్యమంత్రిగారి మేనకోడలు– ఎంత సంయమనం, ఎంత మర్యాదని చూపించాలి! లోపలికి వెళ్లనీయని కారణంగా ఆ ఎమ్మెల్యే బయట అరగంట నిలిచిపోయిందని తెలిస్తే ఆ కానిస్టేబుల్ ఉద్యోగం ఏమయ్యేది? ఇప్పుడు ఎవరు ఎవరికి క్షమాపణ చెప్పవలసి వచ్చింది? మనకన్నా చిన్నవాళ్ల మీద మనం చూపే అధికారం– కుసంస్కారం. మనకన్నా పెద్దవాళ్ల మీద ఆ అధికారాన్ని చూపగలిగితే అది ‘నిజాయితీ’అనిపించుకుంటుంది. పెద్దవాళ్లు చిన్నవారి పట్ల చూపే ఆవేశం కన్నా చిన్నవాళ్లు పెద్దవారిని నిలదీసే ‘ధైర్యం’వెయ్యి రెట్లు బలమైనది. షిల్లాంగులో జరిగిన ఈ సంఘటన విశాఖపట్నంలో తుపాకీలాగ పేలింది. చిన్న ఉద్యోగి చేసిన సాహసం– పెద్ద ఉద్యోగి చేసిన అనౌచిత్యాన్ని తలదన్నింది. ఇదే– ’ loosing more than temper’అంటే. నిజమైన అధికారం తలొంచుతుంది. విర్రవీగదు. నిజమైన పెద్దరికం ‘చెప్పుకోదు’. తెలిసేటట్టు చేస్తుంది. ఒక్క ఉదాహరణ చెప్పడానికి నేనెప్పుడూ అలసిపోను. ఆఫీసులో పనివేళలు దాటిపోయాక– తప్పనిసరిగా పనిలో తలమునకలయిన ఉద్యోగి– నాలుగో ఫ్లోర్ లిఫ్టు దగ్గర నిలబడి ఉంది. మెట్లు దిగుతున్న అధికారి చూశాడు. ఆయన్ని చూసి ఈమె కాస్త కంగారుపడింది. ‘ఏమమ్మా! ఇంత ఆలస్యంగా వెళుతున్నావు?’అన్నారాయన. ఏదో నసిగింది. లిఫ్టు వచ్చేదాకా ఆయనా ఆమెతో నిలబడ్డారు– ఆమె అక్కరలేదంటున్నా. లిఫ్టులో ఆమెతో పాటు దిగి– ఆమెను కారు ఎక్కించి వెళ్లారు. ఆ ఉద్యోగి పేరు సుధ. తర్వాత ఇన్ఫోసిస్ నారాయణమూర్తిని పెళ్లి చేసుకుని ‘సుధా నారాయణమూర్తి’అయ్యారు. ఆ అధికారి జేఆర్డీ టాటా. ఈ దేశంలో ‘భారతరత్న’గౌరవాన్ని పుచ్చుకున్న ఒకే ఒక్క వ్యాపారి ఆయన. మన కంటే చిన్నవాడిమీద విరుచుకుపడే ఆవేశం ‘ఆవేశం’అనిపించుకోదు. ‘ఉడుకుమోతుతనం’అనిపించుకుంటుంది. 1990లో అహమ్మదాబాదు సమీపంలో జరిగిన రైలు ప్రయాణంలో ఒంటరిగా ప్రయాణం చేస్తున్న ఒక ప్రయాణికురాలి కోసం ఫస్టుక్లాసు కూపేలో ఉన్న ఇద్దరు నాయకులు– ఆమెకు బెర్తు ఇచ్చి– కంపార్టుమెంటులో నేల మీద దుప్పటి పరుచుకుని పడుకున్నారు. వారిద్దరు– శంకర్‌సింగ్ వాఘేలా, నరేంద్రమోదీ అనే కార్యకర్త. వారిద్దరిలో ఒకాయన రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. మరొకాయన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ దేశపు ప్రధాని అయ్యారు. ఈ విషయాన్ని వారిద్దరు చెప్పుకోలేదు. తర్వాత రైల్వే బోర్డు జనరల్ మేనేజర్ అయిన ఆ ప్రయాణికురాలు వ్రాశారు. గొల్లపూడి మారుతీరావు -
వేధింపుల వీడియోలు తీసి ఏఎస్పీకి షాకిచ్చింది!
సాక్షి, భోపాల్ : మహిళా కానిస్టేబుల్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డ అడిషనల్ ఎస్పీపై పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదుచేశారు. తనకు న్యాయం చేయాలంటూ లైంగిక వేధింపుల వీడియోలను ఉన్నతాధికారుకు పంపడంతో సస్పెండ్ చేస్తామంటూ తొలుత ఆమెను బెదిరించారు. చివరికి ఆమె విషయం మీడియాకు తెలియడంతో నిందితుడిపై కేసు నమోదు చేసి చర్యలకు సిద్ధమయ్యారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. ఓ మహిళా కానిస్టేబుల్‌కు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని పోలీసు ప్రధాన కార్యాలయంలో డ్యూటీ వేశారు. అయితే అక్కడ అదనపు ఎస్పీ రాజేంద్రన్ వర్మ ఆ మహిళా కానిస్టేబుల్‌తో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఎన్నిసార్లు హెచ్చరించినా ఆయన ప్రవర్తనలో మార్పురాలేదు. దీంతో బాధిత మహిళా కానిస్టేబుల్ ఎంతో తెలివిగా.. రాజేంద్రన్ వర్మ తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న సమయంలో వీడియో, ఫొటోలు తీశారు. వీటిని ఆధారాలుగా సమర్పిస్తూ.. అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌కు ఫిర్యాదు చేయగా ఆమెకు నిరాశే ఎదురైంది. ఆడియో, వీడియోలు చూసిన తర్వాత.. బాధితురాలికి న్యాయం చేయాల్సింది పోయి ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తానంటూ ఆ బాస్ హెచ్చరించారు. అయితే విషయం మీడియా దృష్టికి రావడంతో లాభంలేదని భావించిన ఉన్నతాధికారులు అడిషనల్ ఎస్పీ రాజేంద్రన్ వర్మపై విచారణకు ఆదేశించారు. దీంతో పోలీసులు ఐపీసీ సెక్షన్ 354 ఏ కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. -
పోలీస్ అకాడమీలో ట్రైనీ కానిస్టేబుల్ ఆత్మహత్య
సాక్షి, హైరాబాద్: పోలీస్ అకాడమీలో నవీన అనే ట్రైనీ కానిస్టేబుల్ ఆదివారం ఉదయం చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. నల్గొండ జిల్లా కేంద్రానికి చెందిన నవీన, మిర్యాలగూడకు చెందిన మాధవి స్నేహితురాళ్లు. అయితే... ఇష్టంలేని పెళ్లి కుదిర్చారని నవీన స్నేహితురాలు మాధవి మిర్యాలగూడలో శనివారం ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో మనస్థాపానికి గురైన నవీన పోలీస్ అకాడమీలో చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 2016లో పోలీస్ శాఖకు ఎంపికైన నవీన ప్రస్తుతం నార్సింగిలోని తెలంగాణ పోలీసు అకాడమీలో శిక్షణ తీసుకుంటోంది. నవీన తండ్రి నర్సింహ కూతురు ఆత్మహత్యపై స్పందించాడు. నవీన, మాధవిలు ప్రాణస్నేహితులని, ఒకే రకమైన దుస్తులు, చెప్పులు ధరించేవారని, ఎప్పుడు ఒకేలా ఉండేవారని చెప్పాడు. మాధవి ఆత్మహత్యతో మనస్తాపం చెందే నవీన ఈ దారుణానికి పాల్పడి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశాడు. దసరా పండుగకు ఇంటికి వచ్చిన నవీన తమతో చాలా సంతోషంగా గడిపిన నవీన ఇకలేదంటూ రోదించాడు. అయితే నవీన ఆత్మహత్యలో పోలీసు అధికారులపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మృతదేహాన్ని నార్సింగ్ పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా రాత్రి 2.45 గంటల ప్రాంతంలో ఉస్మానియా మార్చురీకి తరలించారు. అంతేకాదు మృతికి గల కారణాలపై టీఎస్పీఏ అధికారులు పెదవి విప్పడంలేదు. -
మహిళా కానిస్టేబుల్‌పై వేధింపులు.. ఏఎస్ఐ డిస్మిస్
పంజాబ్ పోలీసులలో నేరస్తుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. దోపిడీ కేసులో నిందితుడైన ఒక ఏఎస్ఐని వారం రోజుల క్రితమే డిస్మిస్ చేయగా తాజాగా మహిళా కానిస్టేబుల్‌ను లైంగికంగా వేధించిన కేసులో మరో ఏఎస్ఐ డిస్మిస్ అయ్యారు. తనకు వాట్సప్‌లో అసభ్య సందేశాలు పంపడంతో పాటు, మద్యం మత్తులో ఉండి ఒకసారి తనను బలవంతంగా కౌగలించుకున్నాడని కుల్దీప్ సింగ్ అనే ఏఎస్ఐ మీద ఆ మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు చేశారు. దాంతో కుల్దీప్ సింగ్‌ను డిస్మిస్ చేస్తూ పోలీసు కమిషనర్ ఆర్ఎన్ ఢోకే ఆదేశాలు జారీచేశారు. మొదట్లో ఆయన తన అందాన్ని పొగిడేవారని, తర్వాత తనను తనిఖీ చేసే నెపంతో హాస్టల్ వద్ద వదిలేవారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన అతిచేష్టలకు ఎదురు తిరిగినా, తనను కౌగలించుకున్నప్పుడు విదిలించుకున్నా కూడా తనను డిస్మిస్ చేయిస్తానని బెదిరించారని తెలిపారు. ఆమె ఫిర్యాదు చేసిన తర్వాత ఏసీపీ స్థాయి అధికారి ఈ విషయంపై దర్యాప్తు చేశారు. ఆమె చేసిన ఆరోపణలన్నీ నిజమేనని తేలడంతో ఏఎస్ఐని ఉద్యోగం నుంచి తొలగించడంతో పాటు ఆయన మీద కేసు నమోదు చేశారు. అది ఇప్పుడు దర్యాప్తులో ఉంది. కుల్దీప్ సింగ్ మీద గతంలో కూడా రెండుసార్లు కేసులు నమోదైనట్లు దర్యాప్తులో తేలింది. 2007లో లూధియానాలో నేరపూరిత విశ్వాసరాహిత్యానికి పాల్పడినందుకు ఆయన మీద ఒక కేసు నమోదైంది. 2015లో లూధియానాలోనే అవినీతి కేసు ఒకటి నమోదైంది. ఇలాంటి అధికారిని ప్రభుత్వ ఉద్యోగంలో కొనసాగించడం ఏమాత్రం సరికాదని సీపీ తన ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఆయనను కొనసాగిస్తే ప్రభుత్వ ప్రయోజనాలకు, ప్రజా ప్రయోజనాలకు కూడా భంగం వాటిల్లుతుందని తెలిపారు. -
మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
-
ఆపరేషన్ స్మైల్..!
నల్లగొండ : ఆపరేషన్ స్మైల్ మొదటి విడతను 2015 జనవరి 1న ప్రారంభిం చారు. ఆ తర్వాత ప్రతి ఏడు నెలలకో సారి స్మైల్ రెండు సార్లు, ముస్కాన్ పేరుతో రెండు సార్లు నిర్వహించారు. రెండేళ్లలో ఇప్పటి వరకు నాలుగు విడతలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో స్మైల్, ముస్కాన్ పేర్లతో నిర్వహించిన తనిఖీల్లో 1259 మంది బాలబాలికలను గుర్తించారు. దీంట్లో 1194 మంది పిల్లలను వారి తల్లిదండ్రులకు, సంరక్షులకు అప్పగించారు. మిగిలిన 65 మంది బాల, బాలికలను ప్రభుత్వ, ప్రభుత్యేతర సంస్థల్లో ఆశ్రయం కల్పించారు. బాల కార్మిక చట్టం ప్రకారం కార్మి క శాఖ ద్వారా 19 మంది యజమానుల నుంచి రూ.1.40 లక్షలు జరిమాన విధించి వసూలు చేశారు. నెల రోజుల ఆపరేషన్.. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో ఆపరేషన్ స్మైల్ పకడ్బందీగా అమలు చేసేందుకు సంబంధిత శాఖ అధికారులు, ఉద్యోగులతో పోలీస్ శాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొ ందించింది. దీనికోసం ఒక్కో డివిజన్‌కు ఒక్కో బృందం చొప్పున నల్లగొండ జిల్లాలో నల్ల గొండ, మిర్యాలగూడ, దేవరకొండ, సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట, కోదాడ, యాదాద్రి జిల్లాలో చౌటుప్పుల్, భువనగిరి డివిజన్లకు ప్రత్యేక టీమ్‌లను నియమిస్తున్నారు. ఒక్కో టీమ్‌లో ఒక ఎస్ఐ, నలుగురు కానిస్టేబుళ్లు, దాంట్లో మహిళా కానిస్టేబుల్ ఒకరు, జిల్లా బాలల పరిరక్షణ విభాగం నుంచి ఒక ఉద్యోగి, కార్మిక శాఖ నుంచి మరొకరు ఉంటారు. ఈ ఐదు టీమ్‌లు నెల రోజుల పాటు ఆయా డివిజన్ల పరిధిలోని పరిశ్రమలు, రైల్వే స్టేషన్లు, బస్స్టేషన్లు, కర్మాగారాల్లో విస్తృత తనిఖీలు చేస్తారు. ఎక్కడైనా అనాథలు, తప్పి పోయిన చిన్నారులు, బాల కార్మికులు కనిపిస్తే వారిని తమ అదుపులోకి తీసుకుని రక్షణ కల్పిస్తారు. అన్ని చోట్ల తనిఖీలు.. ప్రభుత్వ అనుమతి పొందిన అనాథ శరణాలయాలు, స్వచ్ఛంద సంస్థలు, ఇతర వసతి గృ హాల్లో కూడా స్మైల్ బృందాలు తనిఖీ చేస్తాయి. వివిధ కారణాలతో ఇక్కడ ఆశ్రయం పొం దుతున్న వారిని కూడా గుర్తించి వారి కుటుంబీకులకు అప్పగిస్తారు. పొరుగు రాష్ట్రాల నుంచి తప్పిపోయి వచ్చిన వారిని, పొరుగు జిల్లాల నుంచి వచ్చి ఇక్కడే ఉంటున్న బాల, బాలి కలను గుర్తించి తమ సొంత ఇళ్లకు పంపిస్తారు. బాల కార్మికులే అధికం.. ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ కింద గతంలో పట్టుబడిన వారిలో అధికంగా బాలకార్మికులే ఉ న్నారు. అనేక మంది చిన్నారులు బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల వద్ద భిక్షాటన చేయడం, మరికొంత మంది చిన్నారులు ఇంటినుంచి పారిపోయి రావడం, చిన్నా చితకా ఫ్యాక్టరీలు, కిరాణ దుకాణాలు, దాబాలు, హోటళ్లలో వెట్టిచాకిరీ చేస్తూ దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. ఇలాంటి వారందరినీ రక్షించి ఆశ్రయం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ స్మైల్ ప్రవేశపెట్టింది. రాష్ట్ర స్థాయిలో సీఐడీ అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్న ఈ కార్యక్ర మాన్ని జిల్లా స్థాయిలో పోలీస్ శాఖకు అప్పగించారు. దీంట్లో మిగిలిన శాఖలతో పోలిస్తే పోలీస్ శాఖ కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. -
భర్తే కడతేర్చాడు
తాండూరు: మహిళా కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి మిస్టరీ వీడింది. భర్తే ఆమెను కుటుంబీకులతో కలిసి చంపేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడు. తాండూరు రూరల్ పోలీసులు ఏడుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. భర్త అనుమానంతో అంతమొందించినట్లు పోలీసుల విచారణలో తేలింది. సోమవారం రూరల్ సీఐ సైదిరెడ్డితో కలిసి తన కార్యాలయంలో తాండూరు ఏఎస్పీ చందనదీప్తి కేసు వివరాలు వెల్లడించారు. మెదక్ జిల్లా సంగారెడ్డికి చెందిన దళిత సామాజిక వర్గానికి చెందిన మంజుల(24)కు గతంలో పెళ్లి అయింది. అనంతరం విభేదాలతో ఆమె భర్త నుంచి విడాకులు తీసుకుంది. 2014లో ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా ఎంపికైంది. సంగారెడ్డిలోని గణేష్‌నగర్‌కు చెందిన బీటెక్ చదివిన యాదవ గోటూరు మహేష్ కూడా 2014లో ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. శిక్షణ సమయంలో వీరికి పరిచయం ఏర్పడి ప్రేమించుకున్నారు. పెళ్లికి ఇరువర్గాల నుంచి అభ్యంతరం రావడంతో గతేడాది అక్టోబర్ 18న యాదగిరిగుట్టకు వెళ్లి వివాహం చేసుకున్నారు. పటాన్చెరువు ఇక్రిశాట్ సంస్థ సమీపంలో అద్దెకు ఉంటున్న దంపతులు పటాన్చెరువు ఎక్సైజ్ ఠాణాలో పనిచేస్తున్నారు. మంజులను ఇలా చంపేశారు.. మంజులపై అనుమానం పెంచుకున్న మహేశ్ ఎలాగైనా ఆమెను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఈక్రమంలో గత జూన్ 24న తెల్లవారుజామున 3 గంటలకు అతడు తన తమ్ముడు సతీష్(బీటెక్ విద్యార్థి), బావ మల్లేష్‌తో కలిసి ఇంట్లో నిద్రిస్తున్న మంజులను అంతమొందించాడు. పటాన్‌చెరువుకు చెందిన ఆటో డ్రైవర్లు యాదగిరి, నర్సింలు సాయం తీసుకున్నారు. ఆటోడ్రైవర్లను కాపాలాగా ఉండగా వీరు చంపేశారు. తమ్ముడు, బావ మంజుల కాళ్లు,చేతులు పట్టుకోగా మహేష్ టవల్‌తో మంజులకు ఊపిరి ఆడకుండా చేసి అంతమొందించాడు. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరణ అనంతరం మృతదేహాన్ని ఆటోలో రంగారెడ్డి జిల్లా పెద్దేముల్ మండలం గాజీపూర్ సమీపంలోకి తీసుకువచ్చి పడేశారు. ఆటోను మహేశ్‌తోపాటు ఇతరులు బైక్‌లపై అనుసరించారు. మంజుల రోడ్డు ప్రమాదంతో మృతిచెందినట్లు చిత్రీకరించారు. ఈక్రమంలో బైక్‌ను కింద పడేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఎస్ఐ ప్రిలిమినరీకి క్వాలిఫై.. మంజుల ఎస్ఐ ఉద్యోగం ప్రిలిమినరీ పరీక్షకు ఎంపికైనందున తాండూరులోని భూకైలాస్ దేవాలయానికి వెళుతుండగా అడవిపంది ఢీకొట్టడంతో ఆమె కిందపడి మృతిచెందిందని, తనకు గాయాలయ్యాయని మహేశ్ పోలీసుల విచారణలో తెలిపాడు. తన కూతురు మృతిపై అనుమానాలు ఉన్నాయని మంజుల తండ్రి పొట్టిపల్లి నర్సింలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో మంజుల, మహేశ్ దంపతుల మధ్య గొడవలు ఉన్నట్లు తేలింది. -
సహచరి కానిస్టేబుల్‌పై అత్యాచార యత్నం
నిందితుడి సస్పెన్షన్? తిరుపతి క్రైం: ఓ మహిళా కానిస్టేబుల్‌పై తోటి కానిస్టేబుల్ అత్యాచారానికి యత్నిం చిన సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. ఎంఆర్‌పల్లి సీఐ మధు కథనం మేరకు ... వైకుంఠపురంలో ఉన్న అర్బన్ ఎక్సైజ్ పోలీసు స్టేషన్లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్(27)కు శుక్రవారం రాత్రి సెంట్రీ డ్యూటీని కేటాయించారు. ఈ క్రమంలో కానిస్టేబుల్ సి.రామన్ ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. ఆమె కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని సి.రామన్ బెదిరించడంతో ఆమె మిన్నకుండిపోయింది. తర్వాత కుటుంబ సభ్యులకు తెలపడంతో వారు సోమవారం ఎంఆర్‌పల్లి పోలీసులను ఆశ్రయిం చారు. సి.రామన్‌పై కేసు నమోదు చేశారు. దీనిపై అర్బన్ ఎక్సైజ్ సీఐ ఇంద్రను వివరణ కోరగా తమకు ఫిర్యాదు అందిందన్నారు. దీనిపై ఉన్నతాధికారులకు సమాచారం అందించి చర్యలు తీసుకుం టామని చెప్పారు. ఇదిలా ఉండగా అధికారులు దర్యాప్తు చేపట్టి కానిస్టేబుల్ రామన్‌ను సస్పెండ్ చేసినట్టు తెలిసంది. -
మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
నకిరేకల్ (నల్లగొండ జిల్లా) : కట్టంగూర్ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడింది. నకిరేకల్ మండలం ఓగోలు గ్రామానికి చెందిన అక్కన పద్మజ(25) అవివాహితురాలు. కట్టంగూర్ పీఎస్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఆమె ఆదివారం తెల్లవారుజామున ఓగోలు గ్రామంలోని తన ఇంట్లో మెడకు ఉరి బిగించుకుంది. కుటుంబ సభ్యులు చూసేసరికి కొణ ఊపిరితో ఉండడంతో ఆమెను వెంటనే నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే కొద్దిసేపటికే ఆమె మృతి చెందింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. -
మహిళా కానిస్టేబుల్‌పై ఎస్ఐ దాడి
అనంతపురం క్రైం : మద్యం మత్తులో ఓ మహిళా కానిస్టేబుల్‌పై ఎస్ఐ దాడి చేశారు. ఈ ఘటన స్థానిక సీసీఎస్ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. బాధితురాలి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఓ కేసులో ఓ మహిళను సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెకు కాపలా ఉండేందుకు మహిళా కానిస్టేబుల్‌ను రాత్రి విధులకు రావాలని ఎస్ఐ కమ్మన్న ఆదేశించారు. ఆమె అలాగే హాజరై.. నిందితురాలి వద్ద విశ్రమించింది. రాత్రి 10.30 గంటల సమయంలో ఎస్ఐ.. మహిళా కానిస్టేబుల్‌ను నిద్రలేపారు. ‘నేను ఎన్ని గంటలకు డ్యూటీకి రమ్మన్నాను. నువ్వు ఎన్నిగంటలకు వచ్చావం’టూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘చెప్పిన సమయానికే వచ్చాను కదా సార్’ అని ఆమె సమాధానం చెప్పేలోపే ‘ఏయ్.. నాకే ఎదురు చెబుతావా? నేనంటే ఏమనుకున్నావం’టూ దాడి చేశారు. ఆమె బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా అప్పటికే ఎస్ఐ గేటుకు తాళం వేసి తాళం చెవి తన వద్ద ఉంచుకున్నారు. విధిలేని పరిస్థితిలో ఆమె గట్టిగా కేకలు వేయడంతో పక్కనే ఉన్న వన్‌టౌన్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వారు రాగానే సీసీఎస్ ఎస్ఐ గేటుకు తాళం తీశారు. వెంటనే బాధితురాలు వన్‌టౌన్ సీఐ రాఘవన్‌ను ఆశ్రయించింది. మద్యం మత్తులో తనపై దాడి చేసినట్లు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ తెలిపారు. -
గుండెపోటుతో మహిళా కానిస్టేబుల్ మృతి
హైదరాబాద్ : సంతోష్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్ గా పనిచేస్తున్న అమృత రెడ్డి సోమవారం మధ్యాహ్నం విధుల్లో ఉండగానే గుండెపోటుకు గురై మృతి చెందారు. గుండెపోటుకు గురైన ఆమెను సహచరులు వెంటనే సమీపంలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. -
మహిళా కానిస్టేబుల్‌పై ఖాకీల అఘాయిత్యం
-
మహిళా కానిస్టేబుల్‌పై ఖాకీల అఘాయిత్యం
లక్నో: సామాన్య మహిళలకే కాదు... మహిళా పోలీసులకు రక్షణ లేకుండా పోతోంది. అది కూడా పోలీసుల చేతిలో అత్యాచారానికి గురైన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. మహిళా కానిస్టేబుల్‌ను బెదిరించి, అనంతరం మత్తుమందు ఇచ్చిన ఇద్దరు ఖాకీలు, డ్రైవర్ కలిసి సాక్షాత్తూ పోలీస్ వాహనంలోనే అఘాయిత్యానికి పాల్పడ్డారు. . వివరాల్లోకి వెళితే యూనిఫాంలో ఉన్న ఇద్దరు ఖాకీలు, మరోవ్యక్తి తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఉత్తరప్రదేశ్ ఇటావాలోని ఝాన్సీకి చెందిన మహిళా కానిస్టేబుల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్థానిక మేళా సందర్భంగా విధుల్లో పాల్గొని తిరిగి తన తోటి మహిళా కానిస్టేబుల్‌తో కలిసి వెళుతుండగా, ఖాకీ దుస్తుల్లో పోలీసులు తమను బెదిరించి పోలీసు వాహనంలో ఎక్కించారని, మత్తు పదార్థం కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చారని ఆరోపిస్తోంది. అనంతరం తుపాకి గురి పెట్టి, చంపేస్తామంటూ అఘాయిత్యానికి పాల్పడి అనంతరం రోడ్డుపై విసిరేసి వెళ్లినట్లు తెలిపింది. ప్రస్తుతం మహిళా కానిస్టేబుల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అయితే హాస్పిటల్లో కూడా తన సోదరికి రక్షణ లేదనీ... తమకు భద్రత కల్పించాలని బాధితురాలి సోదరి విజ్ఞప్తి చేసింది. అనాధలమయిన తమకు న్యాయం జరగాలని... రక్షించాల్సిన పోలీసులే దాడికి పాల్పడితే ఎవరితో చెప్పుకోవాలంటూ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సంఘటనపై ఇటావా సీనియర్ పోలీస్ అధికారి మాంజీ సైని మాట్లాడుతూ ఈ సంఘటనపై స్థానిక మహిళా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామన్నారు. విచారణ చేపట్టినట్లు తెలిపారు. ఈ సంఘటతో షాక్‌కు గురైన ఆమె తిరిగి ఝాన్సీ వెళ్లడానికి భయపడుతోందన్నారు. కాగా ఈ దారుణానికి పాల్పడిన ఇద్దరిని బాధితురాలు గుర్తించినట్లు చెప్పారు. దుస్తులపై ఉన్న నేమ్ ప్లేట్స్ ద్వారా అజయ్ యాదవ్, రాజ భాయ్‌గా. మరొకరు డ్రైవర్‌గా గుర్తించిందన్నారు. -
కనికరమెందుకో..?
సాక్షి, గుంటూరు : ఫిర్యాదు చేసిన 24 గంటల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామంటూ ఓ ఐపీఎస్ అధికారి... గ్రీవెన్స్ ఫిర్యాదులపై అక్కడికక్కడే ఇన్స్టంట్ ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని మరో ఐపీఎస్ అధికారి.. బాధితుల ఇంటి వద్దకే ఎఫ్ఐఆర్ పంపుతానని ఇంకో ఐపీఎస్ అధికారి ఎవరికి తోచిన విధంగా వారు ప్రజలకు న్యాయం చేసేందుకు ప్రయత్నించడం హర్షణీయమే. మరో వైపు హోంశాఖా మంత్రి చినరాజప్ప ఇటీవల జిల్లాకు వచ్చిన సమయంలో మహిళలకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక యాప్‌లను ప్రవేశ పెడుతున్నట్టు సైతం ప్రకటించారు. అయితే పోలీసు శాఖలోనే ఒక మహిళా కానిస్టేబుల్‌ను సీఐ వేధించినా ఆయనపై ఎటువంటి చర్య తీసుకోకపోగా, ఆయనపై పోలీస్ ఉన్నతాధికారులు వల్లమాలిన కనికరం చూపుతుండడంపై మతలబు ఏమిటని మహిళా సంఘాలు నిలదీస్తున్నాయి. సీఐకు అధికారపార్టీ నేతల అండదండలు ఉన్నాయని, ఓ ముఖ్య నేత తనయుని అండతో సీఐ పైరవీలు చేస్తున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యావంతురాలైన ఓ మహిళా కానిస్టేబుల్‌పై తనకు జరిగిన అన్యాయాన్ని ధైర్యంగా బయటకు వెల్లడించినా సదరు సీఐపై ఎటువంటి చర్య తీసుకోకపోవడంతో పోలీస్‌శాఖలో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుళ్లు అంతర్మథనంలో పడ్డారు. ఇలాంటి వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోకపోతే మహిళా కానిస్టేబుళ్లు ఉద్యోగాలు చేసే పరిస్థితి కూడా ఉండదని వారు ఆందోళన చెందుతున్నారు. విచారణలో వెలుగు చూసిన వాస్తవాలు నరసరావుపేట రూరల్ సీఐ శరత్‌బాబు వేధింపులకు సంబంధించిన వాస్తవాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుండడంతో పోలీసు ఉన్నతాధికారులు అవాక్కవుతున్నారు. మహిళా కానిస్టేబుల్‌ను నాగశ్వేతను లోబర్చుకునేందుకు తన మాట వింటే ఇంక్రిమెంట్, వినకపోతే పనిష్మెంట్ అంటూ ఓపెన్ ఆఫర్ ప్రకటించారట. ఆమెకు రూ.10 లక్షలు ఉచితంగా ఇస్తానని, అవసరమైతే భవనం కట్టిస్తానని పలురకాలుగా ప్రలోభాలకు గురిచేసినట్లు చెబుతున్నారు. మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదులో ఎంతవరకు వాస్తవం ఉందనే దానిపై విచారణ చేపట్టిన మహిళా ఉద్యోగుల సంఘం చైర్మన్ టి.శోభామంజరి ఇప్పటికే నరసరావుపేట రూరల్ సర్కిల్ పరిధిలోని రొంపిచర్ల, నకరికల్లు, ఫిరంగిపురం ఎస్ఐలను పిలిపించి వారి పరిధిలో జరిగిన సంఘటనలు, తదితర అంశాలపై స్టేట్మెంట్లు కూడా నమోదు చేశారు. సీఐ లైంగిక వేధింపులకు పాల్పడింది నిజమేనని నిర్ధారించారు. ఇంత జరిగినా అధికారపార్టీకి చెందిన ఓ ముఖ్యనేత తనయుడు, పోలీస్‌శాఖలోని ఓ ఉన్నతాధికారి సీఐపై కేసు నమోదుకాకుండా కాపాడే యత్నం చేస్తున్నట్లు సమాచారం. -
సీఐ లైంగిక వేధింపులు: మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు
-
సీఐ లైంగిక వేధింపులు: మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు
గుంటూరు(నర్సరావుపేట): అసభ్య కరమైన ఎస్ఎంఎస్లు పంపడంతో పాటు లైంగికంగా వేధిస్తున్నాడంటూ గుంటూరు జిల్లా నర్సరావుపేట రూరల్ సీఐపై ఓ మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు చేసింది. నరసరావుపేట సీఐగా పనిచేస్తున్న శరత్ బాబు.. గత కొంతకాలంగా తనను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని రూరల్ ఎస్పీకి చేసిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఫిర్యాదుపై ఉన్నత స్థాయి విచారణ చేపట్టిన తర్వాత రూరల్ సీఐ శరత్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా లైంగికంగా వేధించడంతో పాటు అసభ్య ఎస్ఎంఎస్లు పంపడంపై ఎస్పీ ఆదేశాల మేరకు ఏఎస్పీ నేతృత్వంలోని కమిటీ విచారణ చేపట్టింది. -
మహిళా కానిస్టేబుల్‌పై మోడళ్ల దాడి
ఒక వ్యక్తి తమను వేధించాడని ఫిర్యాదు చేసేందుకు పోలీసు స్టేషన్‌కు వచ్చిన ఇద్దరు మహిళా మోడళ్లు.. అక్కడ మహిళా కానిస్టేబుల్ మీద దాడిచేసి.. బుక్కైపోయారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఆదివారం రాత్రి ముంబై నగరంలో టీవీలలో నటించే ఇద్దరు మోడళ్లు పోలీసు స్టేషన్‌కు వచ్చారు. సరిగ్గా అప్పుడే అక్కడ హైడ్రామా మొదలైంది. అక్కడ ఉన్న మహిళా కానిస్టేబుల్‌తో చాలాసేపు తీవ్ర వాగ్వాదానికి దిగిన ఆ ఇద్దరు మోడళ్లు.. ఆ తర్వాత ఆమెపై దాడి చేశారని పోలీసులు అంటున్నారు. దాంతో.. పోలీసు స్టేషన్లోనే పోలీసులపై దాడి చేసినందుకు వాళ్లపై కేసు నమోదైంది. ఎవరో వ్యక్తి తమను వేధిస్తున్నాడంటూ ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మోడళ్లు.. చివరకు తామే కేసులో ఇరుక్కున్నారు! -
మహిళా కానిస్టేబుల్‌పై లైంగిక వేధింపులు
పశ్చిమబెంగాల్ రాజధాని నగరమైన కోల్‌కతాలో గురువారం రాత్రి ఓ మహిళా కానిస్టేబుల్‌పై ఓ యువకుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. నగరంలోని తల్తలా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మహిళా కానిస్టేబుల్ తల్తలా సమీపంలో తన విధి నిర్వహణలో ఉండగా.. ఆ యువకుడు ఆమెను అడ్డుకోవడమే కాక.. లైంగిక దాడికి కూడా పాల్పడినట్లు పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. అనంతరం ఆ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. -
మహిళ పోలీసు వద్ద నగదు దోపిడి
తిరువొత్తియూరు: ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ వద్ద నగదు దోపిడీ చేశారు. చెన్నై కీల్పాకం లోటస్ కాలనీకి చెందిన కల్పన (39). ఈమె కీల్పాకం ట్రాఫిక్ పోలీసు విభాగంలో కానిస్టేబుల్. మంగళవారం రాత్రి పని ముగించుకుని సైకిల్‌పై ఇంటికి వెళుతూ మార్గమధ్యంలో ఓ ఏటీఎం సెంటర్లో రూ.14 వేలను డ్రా చేసుకున్నారు. తరువాత నగదును, ఏటీఎం కార్డును బ్యాగులో ఉంచి దాన్ని సైకిల్ ముందు స్టాండులో పెట్టి ఇంటికి బయలుదేరారు. డాక్టర్ మునియప్ప రోడ్డులో వెళుతుండగా వెనుక బైకులో వెంబడించిన ఇద్దరు యువకులు కల్పన సైకిల్‌పై ఉంచిన హ్యాండ్ బ్యాగ్‌ను లాక్కుని పారిపోయారు. దిగ్భ్రాంతి చెందిన కల్పన దీనిపై కీల్పాకం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. -
జార్ఖండ్‌లో మరో దారుణం
లాతేహార్ (జార్ఖండ్): ముంబైలో మహిళా ఫొటో జర్నలిస్టుపై జరిగిన సామూహిక అత్యాచారాన్ని మరువక ముందే జార్ఖండ్‌లో మరో అఘాయిత్యం జరిగింది. లాతేహార్ జిల్లాలో దోపిడీ దొంగలు ఏకంగా మహిళా కానిస్టేబుల్‌పైనే సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. బాధితురాలు కుటుంబ సభ్యులతో కలసి తన బావ మృతదేహాన్ని అంత్యక్రియల కోసం తరలిస్తుండగా ఈ సంఘటన జరిగిందని శనివారం పోలీసులు చెప్పారు. గురువారం వేకువజామున రాంచీ నుంచి తన బావ మృతదేహాన్ని కుటుంబ సభ్యులతో కలసి కారులో గర్వా తరలిస్తుండగా, లాతేహార్ జిల్లా జగల్దగా సమీపంలో 75వ నంబరు జాతీయ రహదారిపై కొందరు దోపిడీ దొంగలు అటకాయించారని తెలిపింది. వాహనంలో ఉన్న వారందరినీ దోచుకున్నారని, వారిలో ముగ్గురు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు ఎఫ్ఐఆర్లో ఆరోపించింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.