కానిస్టేబుల్‌తో ఎస్సై ప్రేమాయణం.. పెళ్లి చేసుకొని.. | SI Cheats Woman Constable after love Marriage in SPSR Nellore | Sakshi
Sakshi News home page

కానిస్టేబుల్‌తో ఎస్సై ప్రేమాయణం.. పెళ్లి చేసుకొని..

Published Tue, Oct 4 2022 12:28 PM | Last Updated on Tue, Oct 4 2022 12:37 PM

SI Cheats Woman Constable after love Marriage in SPSR Nellore - Sakshi

సాక్షి, నెల్లూరు(క్రైమ్‌): భార్యను వేధించిన ఘటనలో ఓ ఎస్సైపై దిశ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు.. వేదాయపాళెం ఎస్సైగా షేక్‌ మహబూబ్‌ సుభాని పని చేస్తున్నారు. ఆయన సంతపేటలో విధులు నిర్వహించే సమయంలో కానిస్టేబుల్‌గా ఉన్న ఓ యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు.

అదనపుకట్నం కోసం ఆమెను భర్త, అత్తింటివారు వేధింపులకు గురిచేయడం ప్రారంభించారు. గతనెల 9వ తేదీన ఆమెపై భర్త, అత్త దాడి చేశారు. ఈక్రమంలోనే ఎస్సై సెలవు పెట్టి తన స్వగ్రామానికి వెళ్లిపోయారు.

బాధితురాలు ఆ నెల 28న దిశా మహిళా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై, అతని కుటుంబసభ్యులపై వేధింపులు, హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. దిశ మహిళా పోలీసుస్టేషన్‌ ఎస్సై కె.లేఖా ప్రియాంక కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఉన్నతాధికారులు గోప్యంగా విచారణ చేపట్టారు. 

చదవండి: (Hyderabad Doctor: పెళ్లికి ముందే మరొక యువతితో సంబంధం.. అయితే..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement