సహచరి కానిస్టేబుల్‌పై అత్యాచార యత్నం | Constable companion on the rape | Sakshi
Sakshi News home page

సహచరి కానిస్టేబుల్‌పై అత్యాచార యత్నం

Published Tue, May 31 2016 9:46 AM | Last Updated on Tue, Mar 19 2019 5:57 PM

Constable companion on the rape

నిందితుడి సస్పెన్షన్?

 
తిరుపతి క్రైం: ఓ మహిళా కానిస్టేబుల్‌పై తోటి కానిస్టేబుల్ అత్యాచారానికి యత్నిం చిన సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. ఎంఆర్‌పల్లి సీఐ మధు కథనం మేరకు ... వైకుంఠపురంలో ఉన్న అర్బన్ ఎక్సైజ్ పోలీసు స్టేషన్‌లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్(27)కు శుక్రవారం రాత్రి సెంట్రీ డ్యూటీని కేటాయించారు. ఈ క్రమంలో కానిస్టేబుల్ సి.రామన్ ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. ఆమె కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని సి.రామన్ బెదిరించడంతో ఆమె మిన్నకుండిపోయింది.

తర్వాత కుటుంబ సభ్యులకు తెలపడంతో వారు సోమవారం ఎంఆర్‌పల్లి పోలీసులను ఆశ్రయిం చారు. సి.రామన్‌పై కేసు నమోదు చేశారు. దీనిపై అర్బన్ ఎక్సైజ్ సీఐ ఇంద్రను వివరణ కోరగా తమకు ఫిర్యాదు అందిందన్నారు. దీనిపై ఉన్నతాధికారులకు సమాచారం అందించి చర్యలు తీసుకుం టామని చెప్పారు. ఇదిలా ఉండగా అధికారులు దర్యాప్తు చేపట్టి కానిస్టేబుల్ రామన్‌ను సస్పెండ్ చేసినట్టు తెలిసంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement