హైదరాబాద్ : సంతోష్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్ గా పనిచేస్తున్న అమృత రెడ్డి సోమవారం మధ్యాహ్నం విధుల్లో ఉండగానే గుండెపోటుకు గురై మృతి చెందారు. గుండెపోటుకు గురైన ఆమెను సహచరులు వెంటనే సమీపంలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.