![Woman Constable Fornication Relation Husband Reveal Prakasam - Sakshi](/styles/webp/s3/article_images/2020/02/13/Ong.jpg1_.jpg.webp?itok=1dw6yrhF)
ప్రకాశం, వేటపాలెం: వివాహేతర సంబంధం నడుపుతున్న మహిళా కానిస్టేబుల్‌పై ఆమె భర్త పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. గుంటూరు జిల్లా కర్లపాలెం మండలం ప్యార్లి గ్రామానికి చెందిన సునీల్‌రాజ్ ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నాడు. పదమూడేళ్ల క్రితం కంభం అనూషతో వివాహమయ్యింది. వీరికి ఇద్దరు సంతానం. మహిళా కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న అనూష మరొకరితో వివాహేతర సంబంధం కలిగి ఉండటంపై గతంలో పోలీసులకు ఫిర్యాదు చేయగా క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఆమెను సస్పెండ్ చేశారు. ఇటీవల తిరిగి వేటపాలెం పోలీస్ స్టేషన్‌లో విధుల్లో చేరిన అనూష వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా మంగళవారం రాత్రి ఇరువురిని రెడ్ హ్యండెండ్‌గా పట్టుకున్న సునీల్‌రాజ్ ఆధారాలతో సహా వేటపాలెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్న అనూషపై శాఖాపరంగా, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరాడు.
Comments
Please login to add a commentAdd a comment