
సీఐ లైంగిక వేధింపులు: మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు
గుంటూరు(నర్సరావుపేట): అసభ్య కరమైన ఎస్‌ఎంఎస్‌లు పంపడంతో పాటు లైంగికంగా వేధిస్తున్నాడంటూ గుంటూరు జిల్లా నర్సరావుపేట రూరల్ సీఐపై ఓ మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు చేసింది. నరసరావుపేట సీఐగా పనిచేస్తున్న శరత్ బాబు.. గత కొంతకాలంగా తనను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని రూరల్ ఎస్పీకి చేసిన ఫిర్యాదులో పేర్కొంది.
ఈ ఫిర్యాదుపై ఉన్నత స్థాయి విచారణ చేపట్టిన తర్వాత రూరల్ సీఐ శరత్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా లైంగికంగా వేధించడంతో పాటు అసభ్య ఎస్‌ఎంఎస్‌లు పంపడంపై ఎస్పీ ఆదేశాల మేరకు ఏఎస్పీ నేతృత్వంలోని కమిటీ విచారణ చేపట్టింది.