కారు ఢీకొని మహిళా కానిస్టేబుల్‌ మృతి | Woman Constable Died In Car Accident Tamil Nadu | Sakshi
Sakshi News home page

కారు ఢీకొని మహిళా కానిస్టేబుల్‌ మృతి

Published Mon, Jun 4 2018 8:16 AM | Last Updated on Tue, Aug 14 2018 3:22 PM

Woman Constable Died In Car Accident Tamil Nadu - Sakshi

పూంకుళలి (ఫైల్‌)

తిరువొత్తియూరు: పుదుచ్చేరిలో ఆదివారం ఉదయం కారు ఢీకొని మహిళా కానిస్టేబుల్‌ ఒకరు మృతి చెందారు. పుదుచ్చేరి కూనిచం పట్టి ప్రాంతానికి చెందిన పూంకుళలి (23) రెడ్డియార్‌ పాళయం పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌. ఈమె అఅవివాహిత. ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో ఇంటి నుంచి బైక్‌లో విధులకు బయలుదేరారు.

పిళ్లయార్‌ కుప్పం ప్రాంతంలో వెళుతుండగా వెనుక నుంచి వేగంగా వస్తున్న వాహనం బైక్‌ను ఢీకొట్టి ఆగకుండా వెళ్లింది. ఈ ఘటనలో పూంకుళలి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి పూంకుళలి మృతదేహాన్ని  ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement