నకిరేకల్ (నల్లగొండ జిల్లా) : కట్టంగూర్ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడింది. నకిరేకల్ మండలం ఓగోలు గ్రామానికి చెందిన అక్కన పద్మజ(25) అవివాహితురాలు. కట్టంగూర్ పీఎస్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఆమె ఆదివారం తెల్లవారుజామున ఓగోలు గ్రామంలోని తన ఇంట్లో మెడకు ఉరి బిగించుకుంది. కుటుంబ సభ్యులు చూసేసరికి కొణ ఊపిరితో ఉండడంతో ఆమెను వెంటనే నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే కొద్దిసేపటికే ఆమె మృతి చెందింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.