Nakrekal
-
బీఆర్ఎస్ పాలనలో దోపిడీ తప్ప మరేమీ లేదు
-
నకిరేకల్ లో ఎంపీ కోమటిరెడ్డితో కలిసి వేముల వీరేశం ర్యాలీ
-
నకిరేకల్ బీఆర్ఎస్లో వర్గపోరు.. వీరేశంపై ఎమ్మెల్యే చిరుమర్తి ఫైర్..
నల్లగొండ: నకిరేకల్ బీఆర్ఎస్లో వర్గపోరు మరోసారి బయటపడింది. మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని టార్గెట్ చేస్తూ ప్రస్తుత ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్ర విమర్శలు చేశారు. నాలుగు సంవత్సరాలుగా ఆయనకు పార్టీలో సభ్యత్వమే లేదని వ్యాఖ్యానించారు. వీరేశం ఎక్కడ ఉంటున్నాడో, ఏం చేస్తున్నాడో ఎవరికీ తెలియదని ఎద్దేవా చేశారు. 'ఒకసారి ఎంపీగా పోటీ చేస్తా అంటావు. మరొకసారి ఇంకో నియోజకవర్గం పేరు చెప్తావు. ఇంకోసారి ఎమ్మెల్సీ, మంత్రి అంటున్నావు. గతంలో తొడలుకొట్టి ఓ పేపరు చూపించారు. ఇప్పుడు అది ఎటుపోయిందో ఎవరికీ తెలియదు. ప్రజల్ని అనుచరులని అయోమయానికి గురి చేస్తున్నావు. గతంలో జిల్లాలో ఎక్కడపడితే అక్కడ కబ్జాలు జరిగేవి. నకిరేకల్‌కు గతంలో కంటే ఎక్కువ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నా.' అని చిరుమర్తి వ్యాఖ్యానించారు. చదవండి: రాజకీయం రసకందాయం! సబిత పెత్తనం ఏమిటంటున్న తీగల -
కేసీఆర్ ప్రకటనే అసలు సమస్య.. మాజీ ఎమ్మెల్యే దారేటు?
గతంలో మాదిరిగా ఈసారి కూడా సిటింగ్‌లకే సీట్లిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అనేక స్థానాల్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు ఉన్నారు. గతం నుంచీ అక్కడ గులాబీ పార్టీకి సేవ చేస్తున్నవారి పరిస్థితి ఏంటి? గతం నుంచి సీటిస్తామంటూ హామీ పొందినవారి సంగతేంటి? ఇటువంటి వారంతా సీట్ల కోసం ఏం చేయబోతున్నారు? ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నేతలు ఏమంటున్నారు? నకిరేకల్‌లో రసవత్తరం ఈసారి టికెట్ వస్తుందో రాదో అన్న అనుమానం ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పార్టీ అధినేత ఇచ్చిన భరోసా వెయ్యి ఏనుగుల బలాన్నిచ్చింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ పట్టరాని సంతోషం కలిగించింది. కొందరిని మాత్రం తీవ్ర కలవరపాటుకు గురిచేస్తోంది. సిట్టింగులకే సీట్లు అంటే తమ పరిస్థితి ఏంటని పార్టీలో ఉన్న ఆశావాహులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల తర్వాత గెలిచిన పార్టీ ఫిరాయించి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలున్న స్థానాల్లో ఈ ఆందోళనలు కాస్త ఎక్కువే ఉన్నట్లు తెలుస్తోంది. అలాంటి నియోజకవర్గాల్లో నల్లగొండ జిల్లా నకిరేకల్ కూడా ఒకటి. ఇక్కడ గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన వేముల వీరేశంపై కాంగ్రెస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్లో చేరిపోయారు. ఈ ఫిరాయింపుతోనే అసలు సమస్య మొదలైంది. కారు నడిపేది నేనే..! ప్రత్యర్థులుగా పోటీ చేసి గెలిచిన, ఓడిన నాయకులు ఇద్దరు ప్రస్తుతం ఒకే పార్టీలో ఉన్నారు. ఇద్దరు కూడా వచ్చే ఎన్నికల్లో తమకే టికెట్ వస్తుందని ప్రచారం చేసుకున్నారు. కానీ అధినేత మాత్రం సిట్టింగులకే సీట్లు అని ప్రకటించడంతో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన అనుచరులతో సమావేశమైన సందర్భంలో కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎలా అయినా పోటీ చేస్తానని అందుకు మీరు కూడా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కేసులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొందామని... మన మౌనం పిరికితనం కాదని గోడకు వేలాడ దీసిన తుపాకీ లాంటిదని ఘాటు కామెంట్స్ చేశారు. ఎంత తొక్కాలని చూస్తే బంతిలా అంత పైకి ఎగురుదామని వీరేశం మాట్లాడిన తీరు చూస్తే ఆయన ఖచ్చితంగా పోటీలో ఉండటం ఖాయం అని తెలుస్తోంది. కమలం కొత్త వ్యూహం అయితే వీరేశం ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేది క్లారిటీ లేదు. ఇప్పటి వరకు టీఆర్ఎస్ లోనే కొనసాగినా.. మున్సిపల్ ఎన్నికల్లో తన వర్గానికి చెందిన వారిని ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ చేయించి సొంత పార్టీకి ధీటుగా కౌన్సిలర్లను గెలిపించుకున్నారు. అందువల్ల ఆయన కూడా ఫార్వర్డ్ బ్లాక్ గుర్తు మీద పోటీ చేస్తారా? లేక ఇతర పార్టీల నుంచి పోటీ చేస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే వేముల వీరేశంపై ఇటు కాంగ్రెస్ తో పాటు అటు బీజేపీ కూడా ఓ కన్నేసి ఉంచాయి. కాని ఇప్పటికే చెరుకు సుధాకర్ కాంగ్రెస్‌లో చేరి ఆయన భార్య లక్ష్మీని నకిరేకల్ నుంచి బరిలో దింపేందుకు ప్లాన్ చేశారు. ఇలాంటి సమయంలో వేముల కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది అనుమానమే. అదే సమయంలో బీజేపీలో చేరడానికి సిద్ధాంత వైరం అడ్డుగా ఉంది. వీరేశం మాజీ మావోయిస్టు. అలాంటి వ్యక్తి బీజేపీలో చేరుతారా అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. టికెట్ వచ్చినా రాకున్నా.. బరిలో ఉంటా.! వీరేశానికి టీఆర్ఎస్ టికెట్ రాకున్నా పోటీ చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో ఏ పార్టీ నుంచి బరిలో ఉంటారన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఆయన అనుచరులు మాత్రం ఇండిపెండెంట్ గా పోటీ చేయవద్దనే సూచిస్తున్నారు. పలు సంస్థలు చేసిన సర్వేల్లో ప్రస్తుత ఎమ్మెల్యే కంటే తనకే అనుకూలత ఎక్కువ ఉందని వీరేశం చెబుతున్నట్లు తెలుస్తోంది. ఈ సర్వేలతో పాటు టీఆర్ఎస్ చేయించిన సర్వేలో కూడా సానుకూలత తనకే ఉందని వీరేశం అంటున్నారని టాక్. తనకు టీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోతుందా అన్న నమ్మకం ఆయనకు ఏమూలనో ఉందని అంటున్నారు. నకిరేకల్‌లో వేముల వీరేశం, చిరుమర్తి లింగయ్య మధ్య మరోసారి రసవత్తర పోరు జరగనుందని అర్థం అవుతోంది. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
పిట్టపోరు.. హెల్మెట్లు లేకపోతే అంతే!
నకిరేకల్: ఓ ఇంటి పెరటిలో అరటి చెట్టు.. ఆ చెట్టు గెలపైన పిట్ట గోల.. ఒకటి కాదు, రెండు కాదు.. నాలుగు పిట్టలున్నవి. రెండు పెద్దవి, మరో రెండు పిల్లలు. గూడు చెదురుతుందనో, గోడు మిగులుతుందనో.. తెలియదు. కానీ, ఆ గూడు వైపు ఎవరైనా వస్తే చాలు అవి వెంటపడుతున్నాయి. ముక్కుతో పొడిచేస్తున్నాయి. వాటి పోరు భరించలేక ఆ ఇంటివారు తలకు హెల్మెట్లు పెట్టుకొని పెరటి వైపు వెళ్తున్నారు. వివరాలు .. నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని పన్నాలగూడెంలో నివాసముంటున్న సుద్దాల ఉమారాణి ఇంటి పెరట్లో అరటి చెట్టు ఉంది. అరటి గెలపైన పిట్టగూడు వెలిసింది. అరటికాయలు రోజురోజుకూ పెరగటం వల్ల పిట్టగూడు కిందపడిపోయే విధంగా ఒరిగింది. దీంతో ఉమారాణి భర్త ఓ రోజు ఆ గూడును సరిచేస్తుండగా పిట్టలు వచ్చి ఆయనను ముక్కులతో పొడవడం మొదలుపెట్టాయి. ఆయన వాటి బారి నుంచి తప్పించుకొని ఇంట్లోకి వెళ్లిపోయారు. అప్పటి నుంచి నెలరోజులుగా వారికి తిప్పలేతిప్పలు. ఇప్పటికీ ఎవరైనా ఆ ఇంటి పెరట్లోకి వెళ్తే చాలు పిట్టలు పరుగుపరుగున వచ్చి తలపై పొడుస్తున్నాయి. వాటి పోరు భరించలేక ఆ ఇంటివారు తలకు హెల్మెట్ పెట్టుకుని పెరట్లో పనులు చేసుకుంటున్నారు. పిల్లలు పెరిగి ఎగిరిపోయే వరకు తమకు ఈ బాధలు తప్పవని ఉమారాణి అంటోంది. -
మానవత్వం చాటుకున్న వ్యక్తికి హాట్స్ అఫ్
-
తీరనున్న నల్లగొండ నీటిగోస: మరో 3 ఎత్తిపోతలు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలను వినియోగించుకుంటూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మరో రెండు నియోజకవర్గాల్లో ఆయకట్టుకు నీరందించేలా మూడు ఎత్తిపోతల పథకాలకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. మిర్యాలగూడ, నకిరేకల్ నియోజకవర్గాల్లో సాగునీరందని ప్రాంతాలకు నీరు అందించేలా రూ.160 కోట్లతో ప్రతిపాదనలు తయారుచేసింది. నకిరేకల్ నియోజకవర్గంలో 8,058 ఎకరాల ఆయకట్టుకు నీరందించేలా కట్టంగూరు మండలం, చెరువు అన్నారం గ్రామ పరిధిలో అయితిపాముల ఎత్తిపోతల పథకాన్ని రూ.122 కోట్లతో నిర్మించనుంది. మొత్తం నాలుగు పంపులను వినియోగిస్తూ 80 క్యూసెక్కుల నీటిని తరలించేలా ఈ ఎత్తిపోతలను నిర్మించనున్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో దామరచెర్ల మండలంలోని వీర్లపాలెం గ్రామం వద్ద వీర్లపాలెం ఎత్తిపోతలను రూ.29.20 కోట్లతో ప్రతిపాదించగా, దీనిద్వారా 2,500 ఎకరాలకు నీరిస్తారు. ఇదే నియోజకవర్గంలోని వేములపల్లి గ్రామం సమీపంలో తోపుచెర్ల ఎత్తిపోతలను రూ.10.19 కోట్లతో ప్రతిపాదించగా, దీనిద్వారా 315 ఎకరాలకు నీరందనుంది. ఇప్పటికే నాగార్జునసాగర్, సూర్యాపేట నియోజకవర్గాల పరిధిలో నెల్లికల్, దున్నపోతుల గండి, బొంతపాలెం, కేశవాపురం, పొగిళ్ల, ముక్త్యాల, జా¯Œ పహాడ్, అంబాభవాని, కంబాలపల్లి, ఏకేబీఆర్ వంటి ఎత్తిపోతల పథకాలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఈ ఎత్తిపోతల పథకాలకు సంబంధించి మొత్తం రూ.2,500 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. -
‘మూసీ’ ఘటనపై విచారణ జరిపించాలి
సాక్షి, నకిరేకల్: మూసీ ప్రాజెక్టు గేటు విరిగిన ఘటనపై ప్రభుత్వం తక్షణమే విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన ఆదివారం మూసీ ప్రాజెక్టు సందర్శించారు. విరిగిపోయిన గేటను పరిశీలించి ప్రాజెక్టు నుంచి దిగువకు వెళ్తున్న నీటి పరిమాణం, ప్రాజెక్టులో నీటిమట్టం తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ఆలస్యంగా కురిసిన వర్షాలతో మూసీ నింకుకుండలా ఉండటంతో రైతులు అనందంగా ఉన్నారని, ఈ పరిస్థితుల్లో గేటు విరిగిపోవడం దురదృష్టకరమన్నారు.కాంట్రాక్టర్ పనులు చేస్తున్నప్పుడు అధికారుల పర్యవేక్షణ కొరవడంతోనే మూసీకి పెనుప్రమాదం వాటిల్లిందని విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నీటిపారుదల శాఖ రిటైర్డ్ ఇంజనీర్లు, మేధావులతో చర్చించి ప్రాజెక్టు గేటును పునరుద్ధరించాలని కోరారు. ఎంపీ వెంట నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్నా యక్, కేతేపల్లి ఎంపీపీ పెరుమాళ్ల శేఖర్, జెడ్పీటీసీ బి.స్వర్ణలత, కాంగ్రెస్ జిల్లా నాయకులు దైదా రవీందర్, మండల అధ్యక్ష,ప్రధా న కార్యదర్శులు కోట పుల్లయ్య, ఎం.ప్రవీణ్‌రెడ్డి, నాయకులు బోళ్ల వెంకట్‌రెడ్డి, జ టంగి వెంకటనర్సయ్యయాదవ్, జి.రవీందర్‌రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, బొప్పని సురేష్ ఉన్నారు. -
సెల్ టవరెక్కి మహిళ హల్చల్
సాక్షి, నల్లగొండ: భూ వివాదం పరిష్కరించాలంటూ ఓ మహిళ సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేసింది. వివరాలు.. జిల్లాలోని నకిరేకల్ మండలం కడపర్థికి చెందిన సోమయ్యకు ఇద్దరు భార్యలున్నారు. మొదటి భార్యకు పిల్లలు లేకపోవడంతో అంజమ్మ అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఎనిమిదేళ్ల క్రితం సోమయ్య మరణించాడు. అయితే చనిపోవడానికి ముందే సోమయ్య తనకున్న రెండెకరాల భూమిని ఇద్దరి భార్యలకు సమంగా పంచాడు. ఈ ఏడాది అంజమ్మ తన పొలంతో పాటు పక్కనే ఉన్న మొదటి భార్య పొలాన్ని కూడా దున్నింది. దాంతో ఇద్దరి మధ్య గొడవ ప్రారంభమయ్యింది. ఈ వివాదం ఎంతకి తెగకపోవడంతో తనకు న్యాయం చేయాలంటూ అంజమ్మ సెల్ టవర్ ఎక్కింది. విషయం తెలుసుకున్న పోలీసులు కడపర్థి చేరుకుని అంజమ్మను కిందకు దించడానికి ప్రయత్నం చేస్తున్నారు. -
కాంగ్రెస్‌కు మరో షాక్
-
కోమటిరెడ్డి బ్రదర్స్‌కు షాక్..!
సాక్షి, నల్గొండ : ఎమ్మెల్సీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి మరోషాక్ తగిలింది. ఇప్పటికే ఆ పార్టీ ఇద్దరు ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు(అసిఫాబాద్), రేగ కాంతారావు (పినపాక)లు అధికార టీఆర్ఎస్ పార్టీ చేరనున్నట్లు బహిరంగానే ప్రకటించారు. తాజాగా నకిరేకర్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కారెక్కనున్నట్లు తెలుస్తోంది. గురువారం రాత్రి ఆయన సీఎం కేసీఆర్‌ను కలిసినట్లు ప్రచారం జరుగుతోంది. నల్గొండ జిల్లాలో ముఖ్య నేతలైన కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రధాన అనుచరుడైన చిరుమర్తి.. కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్లో చేరనున్నాడనే ప్రచారం తీవ్రచర్చనీయాంశమైంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం చిరుమర్తికి టికెట్ నిరాకరించగా.. కోమటిరెడ్డి బ్రదర్స్ పట్టుబట్టి మరి టికెట్ ఇప్పించారు. ఈ వార్తల నేపథ్యంలో ఆయనను సంప్రదించడానికి మీడియా ప్రయత్నించగా.. ఆయన అందుబాటులోకి రావడంలేదు. చిరుమర్తి, ఆయన సిబ్బంది ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకున్నారు. ఇంతటి నమ్మకద్రోహమా? ఇక చిరుమర్తి పార్టీ మారుతున్నాడనే వార్తలపై మునగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందిచారు. ఇంతటి నమ్మకద్రోహం చేస్తారనుకోలేదని, పార్టీ మారే విషయం కనీసం తనకు కూడా చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను వార్తల ద్వారనే తెలుసుకొని ఆశ్చర్యపోయానన్నారు. రెండు సార్లు టికెట్ ఇప్పించి ఆయన గెలుపు కోసం కృషి చేశామన్నారు. ఇక చిరుమర్తి పార్టీ మారడంతో జిల్లాలో కొమటిరెడ్డి బ్రదర్స్‌కు రాజకీయంగా గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. అటు కాంగ్రెస్ అధిష్టానం కూడా ఈ వ్యవహారంపై కోమటిరెడ్డి బ్రదర్స్‌పై సీరియస్ అయ్యే అవకాశం ఉంది. -
వీఐపీల నియోజకవర్గం.. చేజారిన విజయం..!
జిల్లాలో నకిరేకల్ నియోజకవర్గానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఇక్కడ నుంచి టీఆర్ఎస్ పార్టీకి చెందిన అనేక మంది పెద్దపెద్ద పదవుల్లో ఉన్నారు. అంతా తలపండిన నేతలు.. వీరిలో ప్రస్తుతం ఎన్నికల్లో పోటీచేసి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు.. ఇతర నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించే బాధ్యతను విజయవంతంగా నిర్వహించిన వారూ ఉన్నారు. కానీ ఈ నియోజకవర్గంలో మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థి ఓటమిపాలయ్యాడు. ఇక్కడ కారును పోలిన ట్రక్కు గుర్తు ఓటమికి ఓ కారణంగా నేతలు విశ్లేషిస్తున్నా.. ఇంతమంది పెద్ద నేతలు కూడా ప్రభావం చూపలేకపోయారనే చర్చ సాగుతోంది. సాక్షిప్రతినిధి, నల్లగొండ : జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో నకిరేకల్ నియోజకవర్గ పరిధిలో ఉన్నంత మంది వీఐపీలు ఏ నియోజకవర్గంలో లేరు. చూస్తే.. అంతా అధికార టీఆర్ఎస్కు చెందిన వారే. ఈ సారి ఎన్నికల్లో వేర్వేరు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి విజయం సాధించిన మరో ఇద్దరు నేతలు కూడా ఇదే నియోజకవర్గానికి చెందిన వారు. ఇంకా చెప్పాలంటే అంతా సీనియర్ నాయకులే. ఇంత మంది ఉన్నా.. చివరకు నకిరేకల్‌లో టీఆర్ఎస్కు విజయం దక్కలేదు. ఈ అంశమే ఇపుడు టీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఎన్నికల్లో కొందరు నేతలు ఆయా నియోజకవర్గాలకే పరిమితం అయినా, తమ సొంత నియోజకవర్గంలో మాత్రం ప్రభావం చూపలేక పోయారా..? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నియోజకవర్గం నుంచి రెండోసారి విజయం కోసం బరిలోకి దిగిన టీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం.. కాంగ్రెస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య చేతిలో ఓటమి పాలయ్యారు. వీరి నడుమ ఉన్న ఓట్ల మెజారిటీ 8,259. అయితే.. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు, ఆ మరుసటి రోజు కూడా కారు గుర్తును పోలి ఉన్న సమాజ్‌వాదీ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ గుర్తు ట్రక్ వల్ల నష్టం జరిగిందన్న విశ్లేషణలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో ట్రక్ గుర్తుకు ఏకంగా 10,383 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చిన మెజారిటీ నుంచి ట్రక్కు వచ్చిన ఓట్లను తీసేస్తే ఆ వ్యత్యాసం 2,124 ఓట్లుగా ఉంది. దీంతో కారుకు పడాల్సిన ఓట్లలో అత్యధికంగా కారును పోలిన ట్రక్కు పడ్డాయన్న ఓ అభిప్రాయానికి వచ్చారు. మరోవైపు తమ అభ్యర్థి ఓటమిలో ట్రక్ గుర్తు చేసిన చేటు స్పష్టంగా కనిపిస్తున్నా, ముఖ్య నేతల మాట ఈ నియోజకవర్గంలో కానీ, వారి సొంత మండలాల్లో కానీ పెద్దగా ప్రభావం చూపలేదన్న చర్చ ఇపుడు నడుస్తోంది. వీఐపీల నియోజకవర్గం.. నకిరేకల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు వివిధ ముఖ్య పదవుల్లో ఉన్నారు. చిట్యాల మండలం ఉరుమడ్లకు చెందిన గుత్తా సుఖేందర్‌రెడ్డి నల్లగొండ ఎంపీగా, రాష్ట్ర సమన్వయ సమితి అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన ఈ ఎన్నికల్లో దేవరకొండ, మిర్యాలగూడెం నియోజకవర్గాల బాధ్యతలు చూశారు. నకిరేకల్ నియోజకవర్గం పరిధి లోని చిట్యాలలో కూడా ప్రచారం చేశారు. ఇదే గ్రామానికి చెం దిన ఆయన సోదరుడు జితేందర్‌రెడ్డి మదర్ డెయిరీ చైర్మన్‌గా ఉన్నారు. నల్లగొండ ఎమ్మెల్యేగా విజయం సాధించిన కంచర్ల భూపాల్‌రెడ్డి సొంత గ్రామం కూడా ఉరుమడ్లనే. ఈ గ్రామంలో టీఆర్ఎస్కు కాంగ్రెస్ కన్నా టీఆర్ఎస్కు 346 ఓట్ల మెజారిటీ వచ్చింది. నార్కట్‌పల్లి మండలం నక్కలపెల్లి గ్రామానికి చెందిన బండా నరేందర్‌రెడ్డి రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా పనిచేస్తున్నారు. నక్కలపెల్లిలో టీఆర్ఎస్కు కాంగ్రెస్ కన్నా కేవలం ఒక్క ఓటే అదనంగా పోలైంది. నకిరేకల్ మండలం పాలెం గ్రామానికి చెందిన మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఈ సారి నాగార్జునసాగర్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు. ఆయన సొంత గ్రామం పాలెంలో వేముల వీరేశానికి కేవలం 19 ఓట్ల అధి క్యం మాత్రమే వచ్చింది. ఇక శాసన మండలి డిప్యూటీ చైర్మన్, టీచర్స్ ఎమ్మెల్సీ పూల రవీందర్ సొంత గ్రామం కేతేపల్లి మం డలం చెరుకుపల్లిలో టీఆర్ఎస్కు అదనంగా పడిన ఓట్లు కేవలం 251. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ సొంత గ్రామం భీమారం కూడా కేతేపల్లి మండల పరిధిలోనిదే. ఈ ఎన్నికల్లో లింగయ్య యాదవ్ గ్రామంలో టీఆర్ఎస్కు 299 ఓట్ల లీడ్ వచ్చింది. ముఖ్య నాయకులు సొంత గ్రామాల్లో ఒకటీ రెండు చోట్ల మినహా కారుకు చెప్పుకోదగిన స్థాయిలో లీడ్ రాకపోవడం కూడా అభ్యర్థి ఓటమిలో ప్రభావం చూపిం దన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కచ్చితంగా గెలుస్తామని టీఆర్ఎస్ ధీమాగా ఉన్న నకిరేకల్ నియోకకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థి వేముల వీరేశం ఓటమిని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఈ కారణంగానే, వివిధ సమీకరణలతో ఓటమికి గల అన్ని కారణాలను విశ్లేషిస్తున్నారు. నకిరేకల్‌లో టీఆర్ఎస్ ఓటమిలో ప్రధానంగా నకిరేకల్, కట్టంగూరు, కేతేపల్లి మండలాల్లో కాంగ్రెస్‌కు వచ్చిన లీడే కనిపిస్తోంది. రామన్నపేట, నార్కట్‌పల్లి మండలాల్లో కాంగ్రెస్‌కు స్వల్ప మెజారిటీ రాగా, చిట్యాల మండలంలో టీఆర్ఎస్కు లీడ్ దక్కింది. మొత్తంగా ఎనిమిది మంది పార్టీ ముఖ్యులు, వీఐపీలు ఉన్న ఈ నియోజకవర్గం కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లడంపై బిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. -
నకిరేకల్ కోసం.. టీడీపీ పట్టు!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : జిల్లాలోని నకిరేకల్ నియోజకవర్గంపై టీడీపీ కన్నేసింది. ఉమ్మడి జిల్లాలో ఒకే కుటుంబంనుంచి ఇద్దరికి టికెట్లు ఉండవని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే కాంగ్రెస్ సిట్టింగులు అందరికీ టికెట్లు ఖాయమని ఏఐసీసీ నాయకత్వం తీసుకున్న నిర్ణయంతో కోదాడలో పద్మావతి అభ్యర్థిత్వం ఖరారు అయినట్లనేని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో కోదాడ టికెట్ కోసం ఆశ పెట్టుకున్న టీడీపీ నేత బొల్లం మల య్య యాదవ్‌కు ఈసారి నిరాశే మిగిలేలా ఉంద న్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక, గత ఎన్ని కల్లో తాము పోటీచేసి గౌరవ ప్రదమైన ఓట్లు సా« దించిన నియోజకవర్గాలపై దృష్టి పెట్టింది. సూ ర్యాపేట నుంచి పోటీ చేసిన పటేల్ రమేష్‌రెడ్డి (38,529 ఓట్లు), దేవరకొండ నుంచి బిల్యా నా యక్ (53,501 ఓట్లు) టీడీపీని వీడి కాంగ్రెస్ గూ టికి చేరారు. సుదీర్ఘ కాలం టీడీపీకి అండగా ఉన్న భువనగిరి నియోజకవర్గంలోనూ టీడీపీకి నాయకత్వం లేమి బాధిస్తోంది. గత ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి (24,560ఓట్లు), ఆమె తనయుడు టీడీపీని వీడి టీఆర్ఎస్లో చేరారు. ఈ మూడు నియోజకవర్గాల్లో టీడీపీకి ఇప్పుడు పెద్ద దిక్కుగా కనిపిసు న్న నాయకులు కనిపించడం లేదన్న అభిప్రాయంలో ఆ పార్టీ నాయకత్వం ఉంది. ఇక, గత ఎన్నికల్లో తుంగతుర్తిలో పోటీ చేసిన పాల్వాయి రజినీ కుమారీ (31,672 ఓట్లు) ఈసారి నకిరేకల్ టికెట్ కు కోరుతున్నారు. ఆమె గతంలో 2009 ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి పోటీ చేశారు. 2014 తుంగతుర్తి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి మా త్రం మళ్లీ నకిరేకల్ కావాలంటూ పట్టుబడుతున్నారని చెబుతున్నా రు. దీంతో ఉ మ్మడి జిల్లా వ్యా ప్తంగా పోటీచే యడానికి అవకాశాలు ఎక్కడా సానుకూలంగా లేకపోవడంతో టీడీపీ నాయకత్వం సైతం నకిరేకల్ కోసం పట్టుదలగా ఉన్నట్లు సమాచారం. దీంతో ఇక్కడినుంచి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తికి టికెట్ లభిస్తుందా లేదా అన్న అంశంపై భిన్నాభిప్రాయం వ్యక్తమవుతోంది. నకిరేకల్ ... ఎందుకు ? టీడీపీకి జిల్లాలో ఒకటి కంటే ఎక్కువ సీట్లు కేటా యించే అవకాశం లేదు. దీంతో మొదటి నుంచీ కోదాడను కోరారు. కానీ, అక్కడ కాంగ్రెస్ సిట్టింగ్ ఉండడం ప్రధాన అడ్డంకిగా మారింది. సిట్టింగుల రూపంలో నల్లగొండ, కోదాడ, హుజూర్నగర్, నాగార్జున సాగర్లను కోరలేదు. సూర్యాపేట, దేవరకొండ, భువనగిరి నియోజకవర్గాల్లో నాయకత్వం ఇతర పార్టీలకు వలస పోయింది. మునుగోడులో ఆ పార్టీకి కనీస నాయకత్వం కూడా లేదన్న అభిప్రాయం ఆ పార్టీలోనే వ్యక్తమవుతోంది. కూటమిలోని మరో భాగస్వామ్య పక్షం సీపీఐ కూడా మునుగోడును కోరుతోంది. దీంతో టీడీపీ ఆ స్థానాన్ని కోరలేదు. ఆలేరులో బీసీవర్గానికి చెందిన నాయకుడు కావడం, డీసీసీ అధ్యక్షుడు కావడం, ఉమ్మడి జిల్లాలోని పన్నెండు స్థానాల్లో కాంగ్రెస్‌కు ఉన్న ఒకే ఒక బీసీ కావడం వంటి అంశాల నేపథ్యంలో కాంగ్రెస్ ఆ స్థానాన్ని వదులుకునే పరిస్థితి లేదు. అంతే కాకుండా మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు పార్టీని వీడారు. తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు బండ్రు శోభారాణి ఉన్నా.. ఆ స్థానంపై పార్టీకి గురి లేదు. మిర్యాలగూడలో గత ఎన్నికలు, వచ్చిన ఓట్లను బట్టి సీటును కోరే అవకాశం లేదు. అంతేకాకుండా.. కోదండరాం నేతృత్వం వహిస్తున్న టీజేఏస్ బలంగా కోరుకుంటున్న స్థానాల్లో మిర్యాలగూడ కూడా ఒకటి కావడంతో టీడీపీ ఈ స్థానాన్ని కోరడం లేదు. ఇన్ని కారణాలతో టీడీపీ నకిరేకల్ కోసం పట్టుపడుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, ఇదే స్థానాన్ని తెలంగాణ ఇంటి పార్టీ కూడా కోరుతోంది. దీంతో ఈ నియోజకవర్గంనుంచి కాంగ్రెస్సే పోటీ చేస్తున్నందన్న విశ్వాసం కలగడం లేదని చెబుతున్నారు. మరోవైపు కాంగ్రెస్‌లోని ఒకవర్గం టీడీపీనుంచి పాల్వాయి రజినీ కుమారికి టికెట్ ఇస్తే గెలిపించి తీసుకువస్తామని పీసీసీ నాయకత్వం వద్దే ప్రతిపాదన పెట్టాయన్న ప్రచారం జరుగుతుండడం గమనార్హం. -
కేసీఆర్‌ది తుగ్లక్ పాలన : రాజగోపాల్ రెడ్డి
సాక్షి, నకిరేకల్ : ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు తెలంగాణలో తుగ్లక్ పరిపాలన చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. రైతులకు డబ్బులు ఇచ్చే రైతుబంధు పథకం వారిని మోసం చేయడానికే అని ఆరోపించారు. తన ఫామ్‌హౌస్ చుట్టూ ఆత్మహత్యలు చేసుకున్న రైతులను పరామర్శించడానికి కేసీఆర్‌కు సమయం లేదు కానీ ఆంధ్రప్రదేశ్‌లోని పరిటాల రవి కుమారుడి పెళ్లికి వెళ్లటానికి టైమ్ ఉంటుందని ఎద్దేవా చేశారు. తెలంగాణలోని 119 సీట్లలో మొదటగా గెలిచే సీటు నకిరేల్‌లో చిరుమర్తి లింగయ్య మాత్రమే అని రాజగోపాల్ రెడ్డి అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడం కోసమే రైతుబంధు పథకం ప్రవేశపెట్టారని వాఖ్యానించారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం రౌడీ రాజకీయానికి 2019లో ప్రజలే బుద్ధి చెప్పుతారని హెచ్చరించారు. -
యాసంగిలోపు నీళ్లు అందిస్తాం..
సాక్షి, నల్గొండ: వచ్చే యాసంగి నాటికి బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టు కింద నకిరేకల్, నల్గొండ నియోజకవర్గాలకు మొదటి దశలో నీళ్లు అందిస్తామని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి బ్రాహ్మణవెల్లెంల గ్రామంలో 100 డబుల్ బెడ్రూంల ఇళ్ల నిర్మాణాలకు భూమి పూజ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..తెరాస ప్రభుత్వంలో నకిరేకల్ నియోజకవర్గం అన్ని రంగాల్లో ముందంజలో ఉందని పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వంలో మారుమూల గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో డబుల్ బెడ్రూంల ఇళ్లు వేగంగా పూర్తి అవుతున్నాయని..మరి కొద్ది రోజుల్లో అన్నింటిలోకి గృహ ప్రవేశాలు చేస్తామని పేర్కొన్నారు. -
అధికారికి బెదిరింపు కాల్.. సమర్థించుకున్న ఎమ్మెల్యే
సాక్షి, నల్గొండ : నల్గొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తన అధికార జులుం ప్రదర్శించారు. డీసీసీబీ ఉన్నతాధికారిపై బెదిరింపులకు పాల్పడిన ఆడియో టేపు ఒకటి వైరల్ అవుతోంది. సస్పెండ్ అయిన మహిళా ఆఫీసర్‌ను విధుల్లోకి తీసుకోవాలంటూ ఆయన ఫోన్లో బ్యాంకు సీఈవో మోహన్‌రావును బెదిరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయనతోపాటు డీసీసీబీ చైర్మన్‌పై కూడా వీరేశం అసభ్యపదజాలం వాడారు. ముందుగా నార్కెట్‌పల్లి ఎంపీపీ ఫోన్‌ను సీఈవో అయిన మోహన్‌రావుకు కలిపి వీరేశంకు అందించారు. ఇక అక్కడ నుంచి వీరేశం తన వాగ్దాటిని ప్రదర్శించారు. చైర్మన్ సోమవారం వస్తారని చెబుతున్నా వినకుండా ఎమ్మెల్యే అధికారిని తిట్టడం అందులో గమనించవచ్చు. చైర్మన్ అందులో సంతకం పెట్టాలని అధికారి చెబుతున్న క్రమంలో.. ఇలాంటి విషయంలో సీఈవోదే తుది అధికారం అని జీవోలో స్పష్టంగా పేర్కొని ఉందంటూ ఎమ్మెల్యే వాదనకు దిగారు. వికలాండివనే సహిస్తున్నానని.. డ్రామాలు ఆడుతున్నావా అంటూ ఎమ్మెల్యే ఆ అధికారిపై మండిపడ్డారు. ఫైల్ నంబర్చెప్పాలంటూ అధికారిని బెదిరించటం... అధికారి ఛైర్మన్ ప్రస్తావన తేవటంతో ఆ సంగతి తనకు చెప్పొద్దని ‘నీ అయ్య జాగీరా’... అంటూ పరుష పదజాలం, ఆపై అసభ్య పదాలతో ఎమ్మెల్యే దూషించారు. చైర్మన్‌ని వెధవ అని సంభోదిస్తూ మధ్యలో సంపత్ రెడ్డి అనే వ్యక్తి ప్రస్తావన తీసుకొచ్చి దుర్భషలాడారు. ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడ పని చేస్తున్నావన్న విషయం గుర్తుంచుకోవాలని.. కావాలంటే లంచం ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నానంటూ ఎమ్మెల్యే చెప్పటం అందులో ఉంది. సోమవారం మల్లికార్జున్ అనే వ్యక్తిని పంపిస్తానని.. ఖచ్ఛితంగా పని జరగకపోతే పరిస్థితి మరోలా ఉంటుందని ఎమ్మెల్యే హెచ్చరించారు కాగా, పందొమ్మిది కోట్ల ప్రజాధనం కొల్లగొట్టి సస్పెండ్ అయిన మహిళా ఉద్యోగిని తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలంటూ వీరేశం బెదిరించినట్లు బాధిత వ్యక్తి మోహన్‌రావు చెప్తున్నారు. పని చేయనుందుకే బెదిరించా : ఎమ్మెల్యే కాగా, ఈ ఫోన్ కాల్ దుమారం పై ఎమ్మెల్యే వీరేశం స్పందించారు. డీసీసీబీ అధికారిపై తాను చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్ధించుకున్నారు. ‘‘నేను సీఈఓ ను బెదిరించలేదు. పనిచేయనందుకే ప్రశ్నించాను. ప్రజలతోనే ఉంటూ, అవినీతికి, అక్రమాలకు దూరంగా ఉంటాను కాబట్టే నాపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. తాను నియోజకవర్గ అధికారులతో స్నేహపూర్వకంగానే ఉంటానని ఎమ్మెల్యే వీరేశం స్పష్టం చేశారు. మళ్లీ చిక్కుల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే -
మళ్లీ చిక్కుల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే
-
‘మూసీ’ కష్టాలు తీరేదెప్పుడో..!
అర్వపల్లి(తుంగతుర్తి): మూసీ నదిలో వరద పారిందంటే చాలు.. అటు నకిరేకల్, ఇటు తుంగతుర్తి నియోజకవర్గాల ప్రజలకు రవాణా కష్టాలు వచ్చినట్లే. ఎగువ ప్రాంతాల నుంచి వరదలు వచ్చినప్పుడు నదిలో రాకపోకలు స్తంభిస్తాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షంతో మూడ్రోజులుగా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. అయినా ప్రజలు నడుముల్లోతు నీటిలోనే రాకపోకలు సాగిస్తున్నారు. ఈ రెండు నియోజకవర్గాలను కలుపుతూ 365వ నంబర్ జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా.. మూసీపై బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. టెండర్ ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. ఈ ప్రక్రియ పూర్తయితే జాజిరెడ్డిగూడెం – వంగమర్తి మధ్య మూసీపై కిలోమీటరున్నర దూరం వంతెన నిర్మించనున్నారు. వంతెన నిర్మాణం కోసం ఇప్పటికే ఇంజనీరింగ్ అధికారులు మట్టి నమూనాలు సేకరించి అంతా ఓకే చెప్పారు. కానీ పనులు ప్రారంభించలేదు. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయి తమ కష్టాలు ఎప్పుడు తీరుతాయోనని ప్రజల ఎదురుచూస్తున్నారు. -
దివ్యక్షేత్రంగా నెల్లిబండ గుట్ట
నకిరేకల్ : మండలంలోని నెల్లిబండ గుట్టపై వెలసిన శ్రీ లింగమంతుల స్వామి దేవాలయం రాబోయే రోజుల్లో ఒక దివ్యక్షేత్రంగా వెలుగొందనుందని నల్లగొండ సామిర్ పంచనన దివ్యపీఠం పీఠాధిపతి వేదాంతం రామకృష్ణమాచార్యులు పేర్కొన్నారు. గురువారం ఆయన గుట్టపై ఉన్న దేవాలయాన్ని, పరిసర ప్రాంతాలను పరిశీలించారు. గుట్టపై ఇరువైపులా ఆంజనేయస్వామి, శంకరుడు విగ్రహాలను, దేవాలయ ఆర్చి నిర్మాణం కోసం వాస్తు చూశారు. గుట్టపైకి దారి, మెట్ల మార్గంకోసం నిర్మాణం ఎక్కడి నుంచి చేపట్టాలో సూచించారు. నెల్లిబండ గుట్టకు చరిత్ర ఉన్నందున భవిష్యత్‌లో దివ్యక్షేత్రంగా మారబోతుందన్నారు. ఇక్కడ భక్తులు 40 రోజుల పాటు దీక్షలు పూనుకుని భక్తిభావం పెంపొందించాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ముస్కు పాపమ్మ, ఎంపిటిసి యానాల శేఖర్‌రెడ్డి, దేవాలయ చైర్మన్ యానాల శ్రీనివాస్‌రెడ్డి, వెంకటాచారి తదితరులు ఉన్నారు. -
ఫేర్వెల్ పార్టీ ఉందని చెప్పినా...
నల్లగొండ: బీటెక్ విద్యార్థిని ఝాన్సీ ఆత్మహత్యపై మిస్టరీ వీడింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఝాన్సి హత్యకేసులో పోలీసులు పురోగతి సాధించారు. బీటెక్ పరీక్షలు ముగించుకొని ఇంటికి వచ్చిన ఝాన్సికి బలవంతంగా పురుగుల మందు తాగించి హత్య చేసినట్లు ఆమె భర్త విజేందర్ రెడ్డి, తల్లి పద్మలే అని పోలీసుల విచారణలో తేలింది. దీంతో మూడు రోజులుగా అనేక మలుపులు తిరిగిన మర్డ్‌ర్ మిస్టరీ వీడినట్లైంది. ప్రస్తుతం ఝాన్సీ స్నేహితుడిని పోలీసులు విచరాణ చేపట్టారు. తల్లి, భర్త వేధింపుల కారణంగానే ఆమె మృతి చెందిందని ఆమె స్నేహితుడు సాయిరాం తెలిపారు. ఝాన్సీ ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని చెప్పాడు. గతంలోనూ ఆమెను తల్లి, భర్త వేధించారని.. ఆ విషయం తమతో చెప్పిందని వెల్లడించాడు. ఫేర్వెల్ పార్టీ ఉందని చెప్పినా కూడా వినకుండా బలవంతంగా హైదరాబాద్ నుంచి ఝాన్సీని తీసుకెళ్లారని, అదేరోజు ఆమె ఆత్మహత్య చేసుకుందని స్నేహితులకు సమాచారం ఇచ్చారని తెలిపాడు. ఝాన్సీ ఆత్మహత్య కేసులో విచారణ కొనసాగుతోందని నకిరేకల్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆమెను కుటుంబ సభ్యులు వేధించినట్టు ఆరోపణలు వచ్చాయన్నారు. ఆత్మహత్య చేసుకుందని చెబుతూనే గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు చేశారని తెలిపారు. ఫేర్వెల్ పార్టీ ఉందని స్నేహితులు చెప్పినా వినకుండా ఝాన్సీని నకిరేకల్ తీసుకొచ్చారని, అదే రోజు ఆమె చనిపోయిందని చెప్పారు. అయితే.. ఝాన్సీని ఇంటికి తీసుకొచ్చి చిత్ర హింసలు పెట్టి పురుగుల మందు తాగించి హత్య చేశారనీ.. అనంతరం ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించి నల్లగొండ మండలం దీపకుంటలో దహన సంస్కారాలు చేశామని నిందితులు పోలీసుల విచారణలో తెలపడంతో.. పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. వ్యభిచారం చేయమని తల్లి, భర్త ఒత్తిడి, సూసైడ్.. -
మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడని...
నకిరేకల్ : ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని ఓగోడు గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక సీఐ వెంకటేశ్వర్రావు తెలిపిన వివరాల ప్రకారం... నకిరేకల్ మండలం ఓగోడు గ్రామానికి చెందిన అక్కనపల్లి పిచ్చయ్య-సోమక్క దంపతులకు నలుగురు కుమార్తెలు. చిన్న కుమార్తె అయిన అక్కనపల్లి పద్మ (23) గత రెండు సంవత్సరాల క్రితం పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికైంది. మొదటి పోస్టింగ్ కట్టంగూర్ పోలీస్‌స్టేషన్‌కు కెటాయించారు. అక్కడ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆమె స్వగ్రామమైన ఓగోడులో తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. ఇదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో పద్మ ప్రేమలో పడింది. ఇద్దరు పెళ్లి కూడా చేసుకుందామని నిర్ణయానికి వచ్చారు. అయితే ఏమైందో ఏమోకాని సదరు యువకుడు నాలుగు రోజుల క్రితం మరో అమ్మాయితో వివాహం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన పద్మ ఆదివారం ఉదయం 6.30 గంటల సమయంలో ఇంట్లో ఉన్న పురుగులమందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఈ క్రమంలో వాంతులు చేసుకుని అపస్మారక స్థితిలో పడి ఆమెను కుటుంబ సభ్యులు నకిరేకల్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. మృతురాలి తండ్రి పిచ్చయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. అనంతరం పద్మ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. గ్రామంలో జరిగిన పద్మ అంత్యక్రియలలో నల్లగొండ డీఎస్పీ సుధాకర్, శాలీగౌరారం, నకిరేకల్ సీఐలు ప్రవీణ్‌కుమార్, వెంకటేశ్వరరావు, పోలీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు రామచంద్రు, మహిళా పోలీసు సంఘం జిల్లా ప్రతినిధి సైదాభి, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
నకిరేకల్ (నల్లగొండ జిల్లా) : కట్టంగూర్ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడింది. నకిరేకల్ మండలం ఓగోలు గ్రామానికి చెందిన అక్కన పద్మజ(25) అవివాహితురాలు. కట్టంగూర్ పీఎస్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఆమె ఆదివారం తెల్లవారుజామున ఓగోలు గ్రామంలోని తన ఇంట్లో మెడకు ఉరి బిగించుకుంది. కుటుంబ సభ్యులు చూసేసరికి కొణ ఊపిరితో ఉండడంతో ఆమెను వెంటనే నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే కొద్దిసేపటికే ఆమె మృతి చెందింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. -
పిచ్చి కుక్క స్వైర విహారం
నల్గొండ : నల్గొండ జిల్లా నకిరేకల్ మార్కెట్ వీధిలో ఓ పిచ్చికుక్క స్వైర విహారం చేసి... కనిపించినవారినల్లా కరిచింది. బుధవారం ఉదయం పిచ్చికుక్క దాడిలో 10 మంది గాయపడ్డారు. వారిలో ఓ మహిళ కూడా ఉంది. దీంతో స్థానికులు వెంటనే స్పందించి ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మెరుగైన వైద్య చికిత్స కోసం ఆమెను నల్గొడం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నకిరేకల్... ఆ సమీపం ప్రాంతంలో పిచ్చికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. దీనిపై స్థానికులు పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసిన.. వారు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో అధికారులపై స్థానికులు మండిపడుతున్నారు. -
లారీ ఢీకొని మహిళ మృతి
నకిరేకల్ (నల్లగొండ జిల్లా) : వేగంగా వెళ్తున్న ఇసుక లారీ మోపెడ్ వాహనాన్ని ఢీకొనడంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సంఘటన గురువారం నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం కడపర్తి గ్రామ సమీపంలో జరిగింది. వివరాల ప్రకారం.. శాలిగౌరారం మండలం వల్లారం గ్రామానికి చెందిన భిక్షమయ్య, వాణీ(35) దంపతులు రాఖీలు కొనేందుకు నకిరేకల్ వెళ్తున్నారు. కాగా మార్గ మధ్యంలో వీరు ప్రయాణిస్తున్న మోపెడ్ వాహనాన్ని లారీ ఢీకొట్టింది. దీంతో వాణి అక్కడికక్కడే మృతి చెందగా, గాయపడిన భిక్షమయ్యను మెరుగైన వైద్యం కోసం నకిరేకల్ తరలించారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా చేనేత కార్మికురాలైన వాణికి ఇద్దరు సంతానం ఉన్నట్లు సమాచారం. -
శీతలపానీయాల లారీ బోల్తా
నకిరేకల్ (నల్గొండ) : నకిరేకల్ మండల కేంద్రంలోని బైపాస్ రోడ్డు వద్ద గురువారం సాయంత్రం శీతలపానీయాలతో వెళ్తున్న లారీ పల్టీ కొట్టింది. లారీ ముందు టైరు పంక్చర్ కావడంతో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తూ ఎవరికీ పెద్ద గాయాలు కాలేదు. లారీలో ఉన్న ఇద్దరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే లారీలో ఉన్న సగం కూల్ డ్రింక్స్ సీసాలన్నీ పగిలిపోయాయి. లారీ హైదరాబాద్ నుంచి కోదాడ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.