జగదీశ్ రెడ్డి (పాత ఫోటో)
సాక్షి, నల్గొండ: వచ్చే యాసంగి నాటికి బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టు కింద నకిరేకల్, నల్గొండ నియోజకవర్గాలకు మొదటి దశలో నీళ్లు అందిస్తామని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి బ్రాహ్మణవెల్లెంల గ్రామంలో 100 డబుల్ బెడ్‌రూంల ఇళ్ల నిర్మాణాలకు భూమి పూజ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..తెరాస ప్రభుత్వంలో నకిరేకల్ నియోజకవర్గం అన్ని రంగాల్లో ముందంజలో ఉందని పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వంలో మారుమూల గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో డబుల్ బెడ్‌రూంల ఇళ్లు వేగంగా పూర్తి అవుతున్నాయని..మరి కొద్ది రోజుల్లో అన్నింటిలోకి గృహ ప్రవేశాలు చేస్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment