bhoomi puja
-
స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో చుట్టుపక్కల అనుబంధ రంగాల అభివృద్ధి : సీఎం వైఎస్ జగన్
-
స్టీల్ ప్లాంట్ భూమిపూజపై సీఎం జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: కడప స్టీల్ ప్లాంట్ భూమిపూజపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సజ్జన్ జిందాల్ తో కలిసి స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పాల్గొనడం ఆనందంగా ఉందని.. జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ టీమ్‌కి నా శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారాయన. It was a pleasure participating in the Bhoomi Puja of #KadapaSteelPlant today with @SajjanJindal garu. My best wishes to the entire team at @TheJSWGroup. pic.twitter.com/2ywGUZLSqC — YS Jagan Mohan Reddy (@ysjagan) February 15, 2023 -
స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సీఎం జగన్ భూమి పూజ
-
కడప స్టీల్ ప్లాంట్.. భూమి పూజకు సర్వం సిద్ధం
సాక్షి, అమరావతి: సీమవాసుల చిరకాల స్వప్నాన్ని నెరవేరుస్తూ రూ.8,800 కోట్లతో 30 లక్షల టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో జేఎస్‌డబ్ల్యూ గ్రూపు వైఎస్సార్ కడప జిల్లా సున్నపురాళ్లపల్లెలో ఏర్పాటు చేస్తున్న స్టీల్ ప్లాంట్ పనులను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం భూమి పూజ చేసి లాంఛనంగా ప్రారంభించనున్నారు. కార్యక్రమంలో జేఎస్‌డబ్ల్యూ గ్రూపు చైర్మన్ సజ్జన్ జిందాల్ కూడా పాల్గొంటారు. 2019లో ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ పేరుతో ముఖ్యమంత్రి స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన చేసిన తర్వాత కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేయడంతో రెండేళ్లు పనులు జరగలేదు. కోవిడ్ సంక్షోభానికి భయపడి పలు సంస్థలు పెట్టుబడి ప్రతిపాదనలను ఉపసంహరించుకున్నాయి. ఇప్పుడు రూ.1,76,000 కోట్ల (22 బిలియన్ డాలర్లు) మార్కెట్ విలువ కలిగి, ఏటా 27 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేస్తున్న జేఎస్‌డబ్ల్యూ కంపెనీ కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణం చేపట్టింది. దీంతో పనులు చకచకా జరగనున్నాయి. ఈ సంస్థకు ప్రభుత్వం దీర్ఘకాలిక లీజు ప్రాతిపదికన భూములు కేటాయించింది. జేఎస్‌డబ్ల్యూ సంస్థ తొలి విడతలో రూ.3,300 కోట్లతో ఏటా 10 లక్షల టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంతో యూనిట్ ఏర్పాటు చేస్తుంది. రెండో విడతలో మరో 20 లక్షల టన్నులు ఉత్పత్తి చేసేందుకు ప్లాంట్‌ను విస్తరిస్తుంది. మొత్తం 30 లక్షల టన్నుల సామర్థ్యంతో పరిశ్రమ అందుబాటులోకి తెస్తుంది. నిర్మాణం ప్రారంభించిన 36 నెలల్లో తొలి దశ అందుబాటులోకి తేవాలని జేఎస్‌డబ్ల్యూ లక్ష్యంగా నిర్దేశించుకుంది. రూ.700 కోట్లతో మౌలిక వసతుల కల్పన రాయలసీమ వాసులకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.700 కోట్లతో మౌలిక వసతులు కల్పిస్తోంది. ఈ ప్లాంట్‌ను జాతీయ రహదారి 67కు అనుసంధానిస్తూ 7.5 కిలోమీటర్ల అప్రోచ్ రోడ్డు నిర్మిస్తోంది. ప్రొద్దుటూరు – ఎర్రగుంట్ల రైల్వే లైన్‌కు అనుసంధానిస్తూ 10 కిలోమీటర్ల నూతన రైల్వే లైన్ ఏర్పాటు చేయనుంది. మైలవరం రిజర్వాయర్ నుంచి రెండు టీఎంసీల నీటిని సరఫరా చేసేలా ప్రత్యేక పైప్‌లైన్ నిర్మిస్తోంది. గ్రీన్ ఎనర్జీ రంగంలోనూ పెట్టుబడులు గ్రీన్ ఎనర్జీ రంగంలో కూడా జేఎస్‌డబ్ల్యూ పెట్టుబడులు పెట్టనుంది. 2.5 మెట్రిక్ టన్నుల డీఆర్ఐ ప్లాంట్, 1000 మెగావాట్ల ఎలక్ట్రోలైజర్ ప్లాంట్, 3,000 మెగావాట్ల సోలార్, విండ్, పంప్డ్ హైడ్రోస్టోరేజ్ వంటి ప్రత్యామ్నాయ ఇంధన ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. బ్యాటరీ స్టోరేజ్, హైడ్రోజన్ స్టోరేజ్ కేంద్రాలనూ ఏర్పాటు చేయనుంది. -
స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి వడివడిగా అడుగులు
సాక్షి ప్రతినిధి, కడప: అండగా నిలిచిన ప్రాంతం శాశ్వత అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పించారు. నిరుద్యోగం పారదోలి మెరుగైన జీవనోపాధి కల్పించాలనే ఆశయంతో సొంత జిల్లాలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో నాలుగులేన్లు రోడ్డు, ట్రైన్ కనెక్టివిటీ, నీటి వసతి, విద్యుత్ సరఫరా పనులు వేగవంతం అయ్యాయి. మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వం శరవేగంగా స్పందిస్తోంది. వైఎస్సార్ స్టీల్ కార్పోరేషన్ లిమిటెడ్ భూమిపూజకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. పట్టించుకోని టీడీపీ.. వెనుకబాటుకు గురైన రాయలసీమ నడిబొడ్డున కడప గడపలో స్టీల్ ప్లాంట్ నిర్మించాలని విభజన చట్టంలో పొందుపరిచారు. తద్వారా నిరుద్యోగులకు మెరుగైన జీవనం లభిస్తోందని అనుబంధ పరిశ్రమలు ద్వారా మరింత ఉపాధి లభిస్తుందని తలిచారు. అయితే గత టీడీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించింది. తీరా ఎన్నికలకు ముందు 2018లో ఓ పునాది రాయితో చంద్రబాబు సర్కార్ సరిపెట్టింది. బాధ్యతగా వైఎస్ఆర్సీపీ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్టీల్ ఫ్లాంట్ నిర్మించాలనే ఆశయాన్ని భుజానికెత్తుకుంది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019 డిసెంబర్ 23న స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు. ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ పేరిట నిర్వహణకు సన్నహాలు చేపట్టారు. కాగా 2020 ఫిబ్రవరి నుంచి కరోనా వైరస్ వ్యాప్తితో ప్రపంచమే అతలాకుతలమైంది. మానవుల జీవనం అస్తవ్యస్తంగా తయారయింది. రెండేళ్ల పాటు ఇలాంటి పరిస్థితి కొనసాగుతూ రావడంతో ప్లాంట్ నిర్మాణానికి ప్రతిబంధకంగా మారిందని నిపుణులు వివరిస్తున్నారు. జేఎస్‌డబ్లు్య స్టీల్స్ లిమిటెడ్‌కు భూమి అప్పగింత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల చేపట్టిన జిల్లా పర్యటనలో జేఎస్‌డబ్లు్య స్టీల్స్ లిమిటెడ్ ద్వారా జమ్మలమడుగు సమీపంలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ఈనెలలో భూమి పూజ చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. కాగా జీఓ ఎంఎస్ నంబర్ 751 ద్వారా ఎకరం రూ.1.65 లక్షలతో 3,148.68 ఎకరాలు కేటాయిస్తూ 2022 డిసెంబర్ 16న ఉత్తర్వులు జారీ చేశారు. ∙ఈ స్టీల్ ప్లాంట్ తొలివిడతలో ఏడాదికి 1 మిలియన్ టన్నులు (10 లక్షల టన్నులు) ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మాణం కానుంది. అందుకోసం ఫేజ్–1లో రూ.3,300 కోట్లు వెచ్చించనున్నట్లు అధికార యంత్రాంగం స్పష్టం చేస్తున్నారు. 36 నెలల కాలపరిమితిలో ఫేజ్–1 పనులు పూర్తి కానున్నాయి. తొలివిడతలో వైర్ రాడ్స్ మరియు బార్ మిల్స్ ఉత్పత్తి చేయనున్నారు. మరో రూ.5.500 కోట్లుతో ఫేజ్–2 నిర్మాణ పనులు పూర్తి కానున్నాయి. ఫేజ్–2 సైతం 2029 మార్చి నాటికి పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. మౌలిక వసతుల కల్పన స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి కావాల్సిన మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వం రూ.713 కోట్లు వెచ్చిస్తోంది. నాలుగులైన్లు రహదారి, రైల్వే కనెక్టివిటీ, నీటి వసతి కోసం పైపు లైన్ ఏర్పాటు, నిల్వ చేసుకునేందుకు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు, విద్యుత్ సరఫరా, కాంపౌండ్ వాల్, భవన సముదాయం నిర్మించనున్నారు. అందులోభాగంగా ఎన్‌హెచ్–67 నుంచి ముద్దనూరు టు జమ్మలమడుగు రోడ్డుకు అనుసంధానంగా రూ.145.3 కోట్లతో 12 కిలోమీటర్లు నాలుగు లైన్లు రహదారి నిర్మించనున్నారు. యర్రగుంట్ల టు ప్రొద్దుటూరు రైల్వేలైన్ నుంచి రూ.323.5 కోట్లతో 9.4 కిలో మీటర్లు రైల్వేలైన్ నిర్మాణం చేపట్టనున్నారు. మైలవరం జలాశయం నుంచి 2 టీఎంసీల నీరు సరఫరా చేయనున్నారు. అందుకోసం 15 కిలోమీటర్లు పైపులైన్ నిర్మించనున్నారు. ఇప్పటికే విద్యుత్ సరఫరాకు కావాల్సిన చర్యలు పూర్తయ్యాయి. రూ.76.42 కోట్లతో 27 కిలోమీటర్ల మేరకు విద్యుత్ లైన్ ఏర్పాటు, 33 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తి అయింది. 20 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన సంప్ నిర్మాణం ఫినిషింగ్ దశలో ఉంది. చుట్టూ ప్రహరీ, భవన సముదాయం వివిధ దశలలో నిర్మాణంలో ఉన్నాయి. ఇంటర్నల్ రోడ్డు పనులు వేగంగా జరుగుతున్నాయి. వైఎస్సార్ స్టీల్ కార్పోరేషన్ లిమిటెడ్ స్టీల్ ప్లాంట్ భూమిపూజ నాటికి కావాల్సిన మౌలిక వసతుల కోసం వడివడిగా పనులు చేస్తుండడం విశేషం. కాగా అధికారికంగా సీఎం వైఎస్ జగన్ పర్యటన ఖరారు కావాల్సి ఉంది. -
మున్నూరు కాపు ఐక్యత హర్షణీయం: గంగుల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మున్నూరు కాపు సామాజికవర్గం ఐక్యతతో ముందుకు రావడం హర్షణీయమని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మున్నూరు కాపుల కోసం ప్రభుత్వం కోకాపేటలో కేటాయించిన స్థలంలో ఆత్మగౌరవ భవనం నిర్మించనున్నట్లు చెప్పారు. ఈనెల 9న ఆ భవన నిర్మాణానికి భూమిపూజ చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో రాష్ట్రంలోని వివిధ మున్నూరు కాపు సంఘాల ప్రతినిధులంతా ఆదివారం సమావేశమయ్యారు. మున్నూరు కాపు సంఘాలన్నీ ఏకమైతే ఉండే ప్రయోజనాలను, ఐక్యతతో ఉండాల్సిన అవశ్యకతను ఈ సందర్భంగా మంత్రి వారికి వివరించారు. ఆత్మగౌరవ భవన నిర్మాణం, ఏకసంఘంగా ఏర్పడే ట్రస్ట్ విధి విధానాలు, భవిష్యత్తులో మున్నూరు కాపుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకోబోయే చర్యలపై చర్చించారు. అనంతరం మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. ఆత్మగౌరవ భవనం భూమి పూజకు రాష్ట్రంలోని మున్నూరు కాపు సంఘాలకు చెందిన జిల్లా అధ్యక్షులు, జిల్లా కమిటీలు, మండల అధ్యక్షులు, మండల కమిటీలు, గ్రామ స్థాయి అధ్యక్షులు, అన్ని గ్రామాల కమిటీలు, నియోజకవర్గాల కో–ఆర్డినేషన్ కమిటీలు హాజరవ్వాలని కోరారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కాచిగూడ మున్నూరు కాపు మహాసభ అధ్యక్షుడు మానికొండ వెంకటేశ్వరరావు, నాయకులు మంగళారపు లక్ష్మణ్, కొండూరి వినోద్, సునీల్ కుమార్ హాజరయ్యారు. -
తిరుమలలో హనుమాన్ జన్మస్థల అభివృద్ధికి భూమిపూజ
-
తిరుమలలో హనుమాన్ జన్మస్థల అభివృద్ధికి భూమిపూజ
తిరుమల: ఆకాశగంగ సమీపంలోని హనుమాన్ జన్మస్థలంలో అభివృద్ధి పనులకు బుధవారం భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతిస్వామి, శ్రీతులసీ పీర్ సేవాన్యాస్, చిత్రకూటం పద్మభూషణ్ శ్రీ రామభద్రాచార్య మహరాజ్, ఆయోధ్య, రామజన్మభూమి తీర్థ ట్రస్ట్ కోశాధికారి స్వామి గోవిందదేవ్‌గిరీజీ మహారాజ్, వీహెచ్‌పీ అంతర్జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి కప్పగంతుల కోటేశ్వరశర్మ పాల్గొన్నారు. అనంతరం విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతిస్వామి మాట్లాడుతూ.. 'తిరుమల వేంకటేశ్వరస్వామి పాదాల చెంత హనుమాన్ జన్మ స్థలానికి భూమిపూజ జరిగింది. వేదాలకు పుట్టినిళ్లు ఆంధ్రప్రదేశ్. తిరుమల శ్రీవారి ఆలయం ఆంధ్రప్రదేశ్ ఆస్థి. వేంకటేశ్వరస్వామి అనుగ్రహం అనుమతి లేనిదే ఏదీ జరగదు. అన్నమయ్య, పురందరదాసు, తరిగొండ వెంగమాంబ వేంకటేశ్వరస్వామిని సాక్షాత్కరించారు. అంజనాద్రే హనుమాన్ జన్మస్థలం అనేది సామాన్యమైన విషయం కాదు. అనేకమంది వేదపండితులు, శాస్త్ర పండితులు పరిశోధించి నిర్థారించారు' అని స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి అన్నారు. చదవండి: (సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి) టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. అంజనాద్రిలో అభివృద్ధి పనులకి భూమిపూజ చెయ్యడం గొప్ప కార్యక్రమం. ఆకాశగంగ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది. కోర్టులో దీనిపై స్టే వచ్చిందని అడిగారు. ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాము. ఆలయంలో ఎలాంటి మార్పులు చెయ్యడం లేదు. భక్తులకి సౌకర్యమైన వసతులు ఏర్పాటు చేస్తాము. వివాదాల జోలికి మేము వెళ్లడం లేదు. సీఎం జగన్ హిందూ ధర్మ ప్రచారం పెద్దఎత్తున చెయ్యాలని ఆదేశించాడు. అందుకే రెండు తెలుగు రాష్ట్రాలలో 502 ఆలయాలు నిర్మిస్తున్నాము. వెనుకబడిన, బలహీన వర్గాలున్న ప్రాంతాలలో ఆలయాలు నిర్మాణం చేస్తున్నాము. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు వేంకటేశ్వరస్వామి ఆలయాలు నిర్మిస్తున్నాము. స్వామి ఆశీస్సులు, ఆజ్ఞతోనే ఈ కార్యక్రమం చేస్తున్నాము' అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. -
9 ఆలయాల పునర్నిర్మాణానికి సీఎం జగన్ భూమి పూజ
-
ఆలయాల పునర్నిర్మాణానికి సీఎం జగన్ భూమిపూజ
సాక్షి, అమరావతి : గత ప్రభుత్వ హయాంలో విజయవాడలో కూల్చి వేసిన 9 గుడులను పునఃనిర్మించే పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం భూమి పూజ నిర్వహించారు. ఉదయం 11.01కి కృష్ణా నది ఒడ్డున సీతమ్మ పాదాల వద్ద ఆలయాల పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ నుంచి నేరుగా ఇంద్రకీలాద్రికి చేరుకొని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. తదుపరి వేద పండితులు ఘనాపాటీలు ఆంజనేయ శర్మ , వివిఎల్‌ఎన్ ఘనాపాటి, వెంకటేశ్వర రావు, రామకృష్ణ ఆశీర్వచనాలు అందచేశారు. అనంతరం దేవాదాయ శాఖ రాష్ట్రంలోని వివిధ ఆలయాలపై రూపొందించిన క్యాలండర్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు , బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, కొడాలి నాని, సీఎం కార్యక్రమాల సమన్వయ కర్త తలశిల రఘురాం, బ్రాహణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు, ఎమ్మెల్యేలు పార్ధసారధి, జోగి రమేష్, మేకా ప్రతాప్ వెంకట అప్పారావు, కైలే అనిల్ కుమార్, దేవాదాయ శాఖ కార్యదర్శి గిరిజా శంకర్, కమిషనర్ అర్జున రావు, కలెక్టర్ ఇంతియాజ్, సీపీ శ్రీనివాసులు, విఎంసి కమీషనర్ ప్రసన్న వెంకటేష్, జేసి మాధవీలత, సబ్ కలెక్టర్ ధ్యాన చంద్, దేవాదాయ అధికారి చంద్ర శేఖర్ ఆజాద్, ఆలయ ప్రధాన అర్చకులు దుర్గాప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. దేవాదాయ శాఖ క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో టెంపుల్ టూరిజంపై ప్రత్యేక దృష్టి సారించి అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలోని అన్ని ప్రముఖ ఆలయాలతో రూపొందించిన క్యాలెండర్‌ను ముఖ్యమంత్రి చూసి అధికారులను అభినందించారు. ఆయా దేవస్థానాల్లో నిర్వహించే వేడుకలను ప్రతిబింభించేలా క్యాలెండర్‌ను రూపొందించారు. పునర్నిర్మించే ఆలయాలు ఇవీ.. 1. రాహు – కేతు ఆలయం 2. సీతమ్మ పాదాలు 3. దక్షిణ ముఖ ఆంజనేయస్వామి ఆలయం (సీతమ్మ పాదాలకు సమీపంలో) 4. శనైశ్చర ఆలయం 5. బొడ్డు బొమ్మ 6. ఆంజనేయస్వామి ఆలయం (దుర్గగుడి మెట్ల వద్ద) 7. సీతారామ లక్ష్మణ సమేత శ్రీ దాసాంజనేయ ఆలయం 8. వీరబాబు ఆలయం (పోలీసు కంట్రోల్ రూమ్ సమీపంలో) 9. కనకదుర్గ నగర్లో శ్రీ వేణుగోపాలకృష్ణ మందిరం, గోశాల చదవండి: (చరిత్రలో తొలిసారిగా.. దేవాలయానికి ప్రభుత్వ నిధులు) -
నాలుగు అంతస్తుల్లో కొత్త పార్లమెంట్
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని సంసద్ మార్గ్‌లో నూతన పార్లమెంట్ భవన నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం భూమి పూజ చేయనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు పునాది రాయి వేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ వెంకటేశ్ జోషీ, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణసింగ్ తదితరులు పాల్గొంటారు. మొత్తం 200 మంది అతిథులు హాజరవుతారని అధికారులు చెప్పారు. ► 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగనున్న 2022 ఆగస్టు 15 నాటికి నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ► నాలుగు అంతస్తుల కొత్త పార్లమెంట్ భవనాన్ని రూ.971 కోట్ల అంచనా వ్యయంతో 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించాలని ప్రతిపాదించారు. ► త్రిభుజకారంలో ఉండే ఈ భవనాన్ని, పర్యావరణ హిత విధానాలను పెద్దపీట వేస్తూ, భూకంపాలను కూడా తట్టుకునేలా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తారు. ► ప్రస్తుత పార్లమెంట్ భవనంలో ఉన్న లోక్‌సభ, రాజ్యసభల కంటే ఇందులోని సభలు చాలా పెద్దవి. భవిష్యత్తు అవసరాల కోసమే విస్తీర్ణం భారీగా పెంచారు. ఈ భవనంలో 888 మంది లోక్‌సభ సభ్యులు, 384 మంది రాజ్యసభ సభ్యులకు సరిపడా చోటుంది. ► దేశ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా అంతర్గత అలంకరణ ఉంటుంది. ► విశాలమైన సెంట్రల్ కాన్స్టిట్యూషన్ గ్యాలరీని సామాన్య ప్రజలు సందర్శించవచ్చు. -
10న పార్లమెంటు కొత్త భవనానికి భూమి పూజ
న్యూఢిల్లీ: కొత్త పార్లమెంటు భవనానికి ఈ నెల 10న ప్రధాని మోదీ చేతుల మీదుగా భూమి పూజ జరగనుంది. రూ.971 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించ తలపెట్టిన ఈ కొత్త భవనం నిర్మాణం 2022 నాటికి పూర్తి అయ్యే అవకాశాలున్నాయని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా శనివారం తెలిపారు. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు నిర్వహిస్తున్న ప్రజాస్వామ్య దేవాలయం వందేళ్లు పూర్తి చేసుకుందని, ఆత్మనిర్భర్‌లో భాగంగా మనమే కొత్త భవనాన్ని నిర్మించుకోవడం దేశానికి గర్వకారణమని బిర్లా అన్నారు. కోవిడ్ నిబంధనల మ«ధ్య డిసెంబర్ 10 మధ్యాహ్నం ఒంటిగంటకి భూమి పూజ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించామని కొందరు స్వయంగా హాజరైతే, మరికొందరు ఆన్లైన్ ద్వారా తిలకిస్తారని బిర్లా చెప్పారు. 2022లో జరిగే దేశ 75వ స్వాతంత్య్ర దిన వేడుకల నాటికి కొత్త భవనంలోనే పార్లమెంటు సమావేశాలు జరుగుతాయని బిర్లా ఆశాభావం వ్యక్తం చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించే ఈ భవనాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేస్తూ పేపర్‌లెస్ కార్యాలయాలను నిర్మించనున్నారు. భవిష్యత్‌లో పార్లమెంటు నియోజకవర్గాలను పెంచే ఉద్దేశం ఉన్న కేంద్రం అందుకు అనుగుణంగా లోక్‌సభ కార్యక్రమాలు నిర్వహించే హాలుని 888 మంది సభ్యులు కూర్చోవడానికి వీలుగా, రాజ్యసభ సమావేశ మందిరాన్ని 384 సీట్ల సామర్థ్యంతో నిర్మించనున్నారు. లోక్‌సభలో 1,224 మంది (ఉభయ సభలు సమావేశమైనప్పుడు) కూర్చునేందుకు వీలుగా సామర్థ్యాన్ని పెంచుకునే అవకాశముంటుంది. ఈ భవన నిర్మాణంలో 2 వేల మంది ప్రత్యక్షంగా 9 వేల మంది పరోక్షంగా పాల్గొననున్నారు. 64.500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించే ఈ భవనం బయట నుంచి చూడడానికి ప్రస్తుతమున్న పార్లమెంటు మాదిరిగానే ఉంటుందని బిర్లా వివరించారు. -
వాగ్దానాన్ని నిలబెట్టుకోండి
సాక్షి, రంగారెడ్డి జిల్లా:/సంగారెడ్డి/పటాన్చెరు: వరంగల్‌లోని కాజీపేటలో రైల్‌కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామన్న వాగ్దానాన్ని కేంద్ర ప్రభుత్వం నిలుపుకోవాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు కోరారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం కాజీపేటలో రైల్‌కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామన్న హామీ ఇచ్చి ఆరేళ్లు గడుస్తున్నా.. ఇంత వరకు అతీగతీ లేదన్నారు. రాజకీయం చేయడం కోసం కాదని.. బాధతో ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నట్లు చెప్పారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కొండకల్లో సుమారు 106 ఎకరాల విస్తీర్ణంలో రూ.వెయ్యి కోట్ల వ్యయంతో మేధా సర్వో డ్రైవ్స్ సంస్థ స్థాపిస్తున్న మేధా రైల్‌కోచ్ ఫ్యాక్టరీకి మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డితో కలసి గురువారం ఆయన భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న మేధా సంస్థ ద్వారానే తెలంగాణకు రైల్‌కోచ్ ఫ్యాక్టరీ వచ్చిందన్నారు. ప్రైవేటు సెక్టార్లో మేధా సంస్థ.. భారతదేశపు అతిపెద్ద రైల్‌కోచ్ ఫ్యాక్టరీగా అవతరిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. 1984లో స్థాపించిన ఈ సంస్థ.. ప్రస్తుతం రూ.21 వేల కోట్ల వార్షిక టర్నోవర్‌కు చేరుకుందని వివరించారు. తెలంగాణ రాష్ట్రం పారిశ్రామిక రంగంలో గణనీయమైన అభివృద్ధి సాధిస్తోందని పేర్కొన్నారు. ఆదిబట్ల కేంద్రంగా విమానాలు, హెలికాప్టర్లు, వాటి విడి భాగాలు, జహీరాబాద్‌లో ట్రాక్టర్లు, బస్సులు తయారవుతున్నాయని తెలిపారు. తాజాగా రైల్‌కోచ్ తయారీ లోటూ తీరిందన్నారు.హ్యుందాయ్ రోటెమ్ వంటి అంతర్జాతీయ సంస్థలు పోటీ పడుతున్న ఈ రంగంలో తెలంగాణకు చెందిన మేధా సంస్థ ఉండటం ఈ ప్రాంత బిడ్డగా ఎంతో గర్వపడుతున్నానని కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్ మెట్రో విస్తరణ, వరంగల్ వంటి ద్వితీయ శ్రేణి నగరాల్లో మోనో రైళ్ల ఏర్పాటుకు అవసరమైన కోచ్ లను మేధా సంస్థ అందించాలని కోరారు. 18 నెలల్లో ఈ సంస్థ మొదటి యూనిట్ ద్వారా కోచ్‌లను ఉత్పత్తి చేస్తుందన్నారు. హై స్పీడ్ రైళ్ల రాక అవసరం ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ అవతరిస్తున్న సమయంలో ఈ ప్రాంతానికి పెట్టుబడులు రావనే అపోహలు, అనుమానాల నుంచి.. ప్రస్తుతం పారిశ్రామిక రంగంలో గర్వంగా చెప్పుకునే స్థాయికి రాష్ట్రం ఎదిగిందని కేటీ ఆర్ చెప్పారు. తెలంగాణ స్వయం సమృద్ధి సాధించిన రాష్ట్రంగా అవతరించాలని ఆయన ఆకాక్షించారు. హై స్పీడ్ రైళ్లను తీసుకురావాల్సి ఉందని, వాటితో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయన్నారు. గంట కు 160 కి.మీ. వేగంతో ప్రయాణించే రైళ్లతో హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు గంటలో, ఆదిలాబాద్‌కు గంటంబావులో చేరుకోవచ్చని అన్నారు. తద్వారా హైదరాబాద్‌లో పనిచేసే వ్యక్తి.. ఇక్కడే జీవించాల్సిన పనిలేకుండా ఇతర జిల్లాల నుంచి ట్రైన్ల ద్వారా రాకపోకలు సాగించవచ్చన్నారు. హై స్పీడు రైల్వే నెట్వర్క్ ఏర్పాటు దిశగా అడుగులు వేయాలని ఆయన కోరారు. స్థానికులకే 70 శాతం ఉపాధి కొత్తగా ఏర్పాటయ్యే కంపెనీల్లో 70 శాతం వరకు స్థానికులకే ఉపాధి అవకాశాలు ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం పాలసీని తీసుకొచ్చిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ స్థాయిలో ఉపాధి కల్పిస్తే.. పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఉంటాయని పేర్కొన్నారు. అలాగే వాయు కాలుష్యాన్ని తగ్గించి ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి ఎలక్ట్రిక్ వెహికిల్ పాలసీని తీసుకొస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు. ద్విచక్ర పాలసీని అధ్యయనం చేసి ఆ దిశగా కూడా ప్రయత్నించాలని మేధా సంస్థను కోరారు. రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల పరిధిల్లో కొండకల్, వెలిమలలో ఏర్పాటవుతున్న రైల్‌కోచ్ ఫ్యాక్టరీ.. ఈ రెండు గ్రామాలను దత్తత తీసుకోవాలన్నారు. అలాగే ఆయా పరిశ్రమల్లో ఉపాధి కల్పన కోసం ఎంపీ నిధులతో నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఎంపీలు రంజిత్‌రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డిని కేటీఆర్ కోరారు. మేధా రైల్‌కోచ్ ఫ్యాక్టరీ ఏడాదికి 500 కోచ్‌లు, 50 లోకోమోటివ్స్ చొప్పున తయారు చేస్తుందని ఆ సంస్థ ఎండీ యడవెల్లి కశ్యప్‌రెడ్డి తెలిపారు. ప్రత్యక్షంగా వెయ్యి, పరోక్షంగా 1,500 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో మేధా సంస్థ ఈడీ శ్రీనివాస్ రెడ్డి, ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, మెతుకు ఆనంద్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, టీఎస్ఐఐసీ అధ్యక్షుడు బాలమల్లు తదితరులు పాల్గొన్నారు. -
దళిత కుటుంబానికి భూమిపూజ తొలి ప్రసాదం
అయోధ్య: అయోధ్యలో రామ మందిర భూమి పూజకు సంబంధించిన ప్రసాదాన్ని తొలిగా ఒక దళిత కుటుంబం అందుకుంది. లడ్డూలు, రామచరిత మానస్ పుస్తకం, తులసిమాల ఉన్న ప్రసాదాన్ని యూపీ సీఎం ఆదేశాల మేరకు అయోధ్యలోని మేస్త్రీ వృత్తిలో ఉన్న మహావీర్ కుటుంబానికి అధికారులు పంపించారు. మహావీర్ అయోధ్యలోని సుతాటి ప్రాంతంలో కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. 2019 ఎన్నికల సందర్భంగా మహావీర్ ఇంట్లో ఆదిత్యనాథ్ భోజనం చేశారు. ‘అలి– బజరంగ బలి’ వ్యాఖ్యల కారణంగా అంతకుముందే సీఎం యోగిని మూడు రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ‘నన్ను గుర్తుంచుకుని ప్రసాదం పంపినందుకు ఆయనకు కృతజ్ఞతలు’ అని మహావీర్ పేర్కొన్నారు. -
‘ఆయన ప్రేమకు ప్రతిరూపం’
సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్యలో రామమందిర నిర్మాణానికి బుధవారం భూమి పూజ కార్యక్రమం నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రాముడిని కొనియాడుతూ ట్వీట్ చేశారు. రాముడు ప్రేమకు, న్యాయానికి ప్రతిరూపమని ప్రస్తుతించారు. రాహుల్ తన ట్వీట్లో ఎక్కడా బీజేపీని ప్రస్తావించలేదు. ‘మర్యాద పురుషోత్తముడైన రాముడు ఉత్తమ మానవ లక్షణాలను పుణికిపుచ్చుకున్నారు. అతను మన మనస్సు లోతుల్లో ఉన్న మానవత్వానికి ప్రతీక.. ప్రేమను చాటే రాముడు ఎన్నడూ ద్వేషాన్ని వ్యక్తపరచరు. కరుణామయుడైన రాముడిలో ఎప్పుడూ క్రూరత్వం కనిపించదు. న్యాయానికి ప్రతిరూపమైన రాముడు ఎన్నడూ అన్యాయం వ్యక్తీకరించర’ని రాహుల్ ట్వీట్ చేశారు. కాగా అయోధ్యలో జరిగే భూమిపూజ కార్యక్రమం జాతి ఐక్యతకు సంకేతంగా నిలిచే సాంస్కృతిక సమ్మేళనం కావాలని ఆకాంక్షిస్తూ రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ సోమవారం ట్వీట్ చేశారు. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అత్యంత వైభవంగా జరిగిన భూమిపూజ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానం లభించలేదు. రామాలయ నిర్మాణం ప్రారంభ సూచకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 40 కిలోల వెండి ఇటుకను అమర్చారు. ఈ కార్యక్రమంలో ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సహా దాదాపు 150 మంది పాల్గొన్నారు. చదవండి : డిగ్గీ రాజా సలహా : కాంగ్రెస్‌లో గగ్గోలు -
‘భిన్నత్వంలో ఏకత్వానికి కట్టుబడాలి’
కోల్‌కతా : భారత్‌లో ఎప్పటినుంచో అనుసరిస్తున్న ఏకత్వంలో భిన్నత్వాన్ని అదే స్ఫూర్తితో మనం తుదిశ్వాస విడిచేవరకూ కొనసాగించాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ బుధవారం పేర్కొన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ జరిగేందుకు కొన్ని గంటల ముందు ఆమె సోషల్ మీడియా వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు. తన ట్వీట్లో మమతా బెనర్జీ ఎక్కడా అయోధ్య, రామమందిరం అంశాలను ప్రస్తావించలేదు. దేశంలో హిందూ, ముస్లిం, సిక్కులు సహా అందరూ సోదరభావంతో మెలుగుతారని, మేరా భారత్ మహాన్..మహాన్ హమారా హిందుస్తాన్ అని దీదీ తన ట్వీట్లో పేర్కొన్నారు. రామ మందిర ఉద్యమంపై మమతా బెనర్జీతో పాటు తృణమూల్ కాంగ్రెస్ తొలినుంచీ ఆచితూచి వ్యవహరిస్తోంది. గత ఏడాది నవంబర్‌లో వివాదాస్పద స్ధలంలో మందిర నిర్మాణానికి అనుకూలంగా సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపైనా మమతా బెనర్జీ ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. మరోవైపు అయోధ్యలో రామాలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహిస్తున్న క్రమంలో బెంగాల్ అంతటా బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. రాజ్‌భవన్‌లో దీపాలు వెలిగించి వేడుక నిర్వహిస్తామని గవర్నర్ జగ్దీష్ దంకర్ తెలిపారు. ఇక అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అత్యంత వైభవంగా భూమిపూజ కార్యక్రమం జరిగింది. చదవండి : కరోనాపై పోరులో మహిళా అధికారి కన్నుమూత -
అయోధ్య: ‘జాతి ఐక్యతకు ప్రతీక’
జాతి ఐక్యతకు ప్రతీక: మోదీ శతాబ్ధాల నిరీక్షణ నేటితో పూర్తవుతోందని ప్రధాని మోదీ అన్నారు. అయోధ్యలో భూమి పూజ తర్వాత ఆయన మాట్లాడుతూ.. తమ జీవితకాలంలో ఈ కల సాకారమవుతుందని కోట్లమంది నమ్మలేకపోయారన్నారు. దేశం మొత్తం రామమయమైంది, దేశం మొత్తం భావోద్వేగంలో ఉందని వ్యాఖ్యానించారు. భూమి పూజకు తనను ఆహ్వానించడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం జాతి ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని ప్రధాని ఆకాంక్షించారు. జైశ్రీరామ్ నినాదాలతో ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూశాం రామమందిరం భూమి పూజలో పాల్గొనడం తమ అదృష్టమని, ఆలయం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూశామని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఈ సందర్భంగా అన్నారు. ప్రపంచంలోనే అయోధ్య విశిష్ట నగరంగా రూపుదిద్దుకోబోతుందని పేర్కొన్నారు. రామజన్మభూమి ఉద్యమంలో అద్వానీ పాత్ర ఎనలేనిదని ఆర్ఎస్ఎస్ అధిపతి మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. విశ్వమానవాళికి మార్గదర్శం చేయదగ్గ భవ్యమైన రామమందిరం రూపుదిద్దుకోబోతుందన్నారు. అపురూప ఘట్టం ఆవిష్కృతం దేశం యావత్తు ఆసక్తిగా ఎదురు చూసిన అపురూప ఘట్టం ఆవిష్కృతమైంది. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ ముగిసింది. రామ జన్మభూమిలో ఆలయ నిర్మాణానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వేద మంత్రోచ్ఛరణల నడుమ శంకుస్థాపన చేశారు. గర్భగుడి వద్ద వెండి ఇటుకతో శంకుస్థాపన చేశారు. భూమి పూజకు నక్షత్ర ఆకారంలో ఐదు వెండి ఇటుకలను ఉపయోగించారు. ప్రవిత్ర నదీ జలాలతో క్రతువు నిర్వహించారు. దేశం యావత్తు ఆ అపురూప ఘట్టాన్ని టీవీల్లో ప్రత్యక్షంగా వీక్షించింది. అయోధ్యలో భూమిపూజకు సమాంతరంగా.. దేశవ్యాప్తంగా రామాలయాల్లో ప్రార్థనలు, పూజలు జరిగాయి. శంకుస్థాపన క్రతువులో ప్రధాని మోదీ అయోధ్యలో రామ మందిర నిర్మాణ భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసిన ప్రధాని నరేంద్ర మోదీ రామజన్మభూమిలో రామ్‌లల్లా దర్శనం చేసుకున్నారు. ఆలయ ప్రాంగణంలో పారిజాత మొక్కను నాటారు. తర్వాత భూమిపూజ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఆయన శంకుస్థాపన క్రతువు నిర్వహిస్తున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందిబెన్ పటేల్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, రామానంద్ ట్రస్ట్ అధ్యక్షుడు, హిందూమత ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. భూమిపూజ కార్యక్రమాన్ని ప్రజలు వీక్షించేందుకు వీలుగా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. రామ నామ స్మరణతో అయోధ్య మార్మోగుతోంది. అయోధ్యలో రామ మందిర నిర్మాణ భూమిపూజ కార్యక్రమానికి విచ్చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముందుగా హనుమాన్ గడీని సందర్శించారు. హనుమాన్ ఆలయంలో ప్రత్యేకంగా హారతి ఇచ్చి పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఒక్కరే ఉన్నారు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ వీరిద్దరూ ఆలయంలో కలియ తిరిగారు. దాదాపు 5 నిమిషాల పాటు అక్కడ గడిపారు. అక్కడి నుంచి రామజన్మ భూమికి పయనమయ్యారు. అయోధ్యకు విచ్చేసిన ప్రధాని మోదీ ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో అయోధ్య చేరుకున్నారు. లక్నో విమానాశ్రయం నుంచి ప్రత్యేక సైనిక హెలికాప్టర్లో అయోధ్య చేరుకున్న ఆయనకు కోవిడ్ ప్రొటోకాల్ ప్రకారం ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఉన్నత అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి సుప్రసిద్ధ హనుమన్ ఆలయానికి ఆయన వెళ్లారు. ప్రముఖుల రాక ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందిబెన్ పటేల్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు ఉమా భారతి.. అయోధ్యలో రామజన్మభూమికి చేరుకున్నారు. యోగి ఆదిత్యనాథ్ ఏర్పాట్లను స్వయంగాపర్యవేక్షిస్తున్నారు. హిందూ మత పెద్దలు కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. యోగా గురువు బాబా రాందేవ్, స్వామి అవదేశానంద్ గిరి, చిదానంద్ మహరాజ్ తదితరులు రామజన్మభూమికి విచ్చేశారు. సీతమ్మధారలో ప్రత్యేక పూజలు విశాఖపట్నం: అయోధ్యలో రామమందిర నిర్మాణానికి శంఖుస్ధాపన సంధర్బంగా విశాఖలోని సీతమ్మధార అభయాంజనేయ స్వామి ఆలయంలో బీజేపీ మాజీ ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, చెరువు రామకోటయ్య, ఆర్ ఎస్ ఎస్ ఉత్తరాంధ్ర ఇన్ ఛార్జి జనార్ధన్, జిల్లా బీజేపీ అధ్యక్షుడు రవీంద్ర రెడ్డి తదితరులు ఆద్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ రోజు ప్రపంచంలో హిందువులు పండగ జరుపుకునే రోజని.. శతాబ్దాల హిందూ ప్రజల కోరిక నేరవేరుతున్న వేళ అని.. ప్రధాని మోదీ చేతుల మీదగా అయోధ్యలో రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన జరుపుకుంటుండటం శుభసూచకమన్నారు. భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా రాముడిని కొలుస్తారని, రాముడు మతాలకి అతీతంగా పూజించే దేవుడిగా తెలిపారు. కోఠిలో పండగ వాతావరణం హైదరాబాద్‌లోని కోఠి వీహెచ్‌పీ కార్యాలయం వద్ద పండగ వాతావరణం నెలకొంది. కార్యాలయం పరిసర ప్రాంతాలు కాషాయామయం అయ్యాయి. అయోధ్య రామాలయ శంకుస్థాపన సందర్భంగా వీహెచ్‌పీ కార్యాలయంలో రామయజ్ఞం చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ పూజలు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న వీహెచ్‌పీ కార్యాలయలలో శంకుస్థాపన అనంతరం సంబరాలకు ఏర్పాట్లు చేశారు. ప్రతి ఇంటిపై కాషాయ జెండా ఎగరవేయాలని వీహెచ్‌పీ పిలుపునిచ్చింది. ఢిల్లీ నుంచి బయలుదేరిన ప్రధాని అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో లక్నోకు బయలు దేరారు. రోజువారీ వస్త్రధారణకు భిన్నంగా పంచకట్టులో ప్రధాని మోదీ కనిపించారు. లక్నో విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత హెలికాప్టర్లో అయోధ్యకు ప్రధాని పయనమవుతారు. ముందుగా హనుమాన్ గర్హిలో ఆయన ప్రత్యేక పూజలు చేస్తారు. కోవిడ్–19 ప్రొటోకాల్ పాటించేలా... కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో అయోధ్య పట్టణాన్ని అధికారులు అణువణువునా శానిటైజ్ చేశారు. ముఖ్యంగా ప్రముఖులు సందర్శించనున్న ఆలయాలను క్రిమినిరోధక ద్రావణాలతో శుభ్రం చేస్తున్నారు. అయోధ్యలోని హనుమాన్ గఢీ ఆలయంతో పాటు పలు ప్రాంతాల్లో భారీ ఎత్తున శానిటేషన్ కార్యక్రమాలు చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ హనుమాన్ గఢీ ఆలయాన్ని సందర్శించనున్న నేపథ్యంలో భారీ బందోబస్తు పెట్టారు. కోవిడ్–19 ప్రొటోకాల్‌ను అందరూ పాటించేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. శోభయమానంగా అయోధ్య అయోధ్య: రామ నామ స్మరణతో అయోధ్య మార్మోగుతోంది. రంగు రంగుల పూల దండలు, కాషాయ తోరణాల అలంకరణలతో అయోధ్య శోభయమానంగా మారింది. అయోధ్యకు వెళ్లే రహదారులకు ఇరువైపులా రామ మందిర నమూనా చిత్రాలను, రామ్‌లల్లా చిత్రాలను అలంకరించారు. రామ మందిర నిర్మాణానికి జరిగే భూమి పూజ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో సహా ప్రముఖులు రానుండటంతో భారీగా మొహరించిన భద్రతా బలగాలతో అయోధ్య పట్టణం హడావుడిగా ఉంది. కరోనా ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో.. కార్యక్రమం జరిగే ప్రాంతానికి ఎవరూ రావద్దని స్థానికులకు అధికారులు విజ్ఞప్తి చేశారు. అలాగే, ఇతర ప్రాంతాల నుంచి కూడా ఎవరూ అయోధ్యకు రావద్దని కోరారు. మొత్తం శంకుస్థాపన కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం జరుపుతామని, ప్రజలంతా ఇళ్లలోనే ఈ ఉత్సవాన్ని జరుపుకోవాలని అభ్యర్థించారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ సందర్భంగా ప్రముఖులు సోషల్ మీడియా వేదికల్లో తమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. నేడు అయోధ్యలో శ్రీ రామ జన్మభూమిలో భారతీయుల చిరకాల కోరిక అయినటువంటి శ్రీరామ మందిర నిర్మాణానికి భూమి పూజ జరుగుచున్న సందర్బంగా ప్రతిఒక్కరు ఈ క్రింది కార్యక్రమాలను చేద్దాం..! జై శ్రీరామ్ ! భారత్ మాతా కీ జై !! pic.twitter.com/noWnlXZu3A — Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) August 5, 2020 పురుషోత్తముడు శ్రీరామచంద్రమూర్తి జన్మస్థలం సరయు నది తీరాన అయోధ్య నగరం లో శ్రీరామ మందిరం నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న సందర్భంగా దేశ ప్రజలందరికీ శ్రీ అయోధ్య రామమందిరం శంఖుస్థాపన శుభాకాంక్షలు . pic.twitter.com/5d7xL012ew — Somu Veerraju (@somuveerraju) August 5, 2020 -
అయోధ్య రామాలయం: అద్వానీ ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : హిందువుల చిరకాల స్వప్నం అయోధ్య రామాలయ నిర్మాణం శంకుస్థాపనకు కొద్ది గంటల సమయం మాత్రమే మిగిలింది. దేశమంతా ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్న చారిత్రాత్మక ఘట్టం బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆవిష్కృతం కానుంది. ఈ నేపథ్యంలో రామాలయ నిర్మాణ పోరాట చరిత్రలో ముందుభాగంలో ఉన్న బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆలయ శంకుస్థాపన నేపథ్యంలో మంగళవారం రాత్రి ఓ జాతీయ మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తన కల సాకారమైన రోజు ఇదని సంతోషం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భూమి పూజ చేయడం చరిత్రాత్మకమని అన్నారు. ‘అయోధ్యలో రామమందిర నిర్మాణం నాతో సహా భారతీయులందరికీ ఒక ఉద్వేగపూరిత క్షణం. రామజన్మభూమి లో మందిర నిర్మాణం బీజేపీ కల. రథయాత్ర ద్వారా రామజన్మభూమి ఉద్యమంలో పాల్గొనడం ద్వారా నా ధర్మాన్ని కర్తవ్యాన్ని నిర్వహించా. సుప్రీంకోర్టు తీర్పుతో సామరస్య వాతావరణంలో అయోధ్య రామమందిర నిర్మాణం జరగడం శుభపరిణామం. ఈ సామరస్యపూర్వక వాతావరణం భారతీయుల మధ్య కలకాలం నిలబడాలి. భారతీయ నాగరికత వారసత్వానికి రాముడు ఒక ఆదర్శం. రామమందిర నిర్మాణం రామరాజ్యానికి ఆదర్శంగా నిలవాలి. సుపరిపాలన, అందరికీ న్యాయం, సిరి సంపదలకు రామ రాజ్యమే ఒక ఉదాహరణ. రాముడి సద్గుణాలను అందరూ అలవర్చుకోవాలి’ అని వ్యాఖ్యానించారు. కాగా అద్వానీతో పాటు మురళీమనోహర్ జోషీతో పాటు మరికొందరు వీడియో కన్ఫరెన్స్ ద్వారా భూమి పూజ కార్యక్రమానికి హాజరుకానున్నారు. -
భూమిపూజకు అడ్వాణీ, జోషిలకు ఫోన్లో ఆహ్వానం
న్యూఢిల్లీ: అయోధ్యలో ఆగస్టు 5న నిర్వహించే రామ మందిరం భూమి పూజకు భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషిని తప్పనిసరిగా ఆహ్వానిస్తామని రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు వర్గాలు శనివారం వెల్లడించాయి. ఇతర నాయకుల తరహాలోనే వారిద్దరికీ ఫోన్ ద్వారా ఆహ్వానం పలుకుతామని పేర్కొన్నాయి. అడ్వాణీ, జోషి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భూమిపూజ కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం. కరోనా వైరస్ వ్యాప్తితోపాటు ఆరోగ్య కారణాల రీత్యా వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆహ్వానాల వ్యవహారాన్ని ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్ పర్యవేక్షిస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి ఉమా భారతి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్‌కు శనివారం ఆహ్వానాలు అందాయి. భూమి పూజకు తాము కచ్చితంగా హాజరవుతామని వారు పేర్కొన్నారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో అడ్వాణీ, జోషీ, ఉమా భారతి ప్రధాన నిందితులన్న సంగతి తెలిసిందే. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, బిహార్ సీఎం నితీశ్ కుమార్ కూడా అయోధ్యలో భూమిపూజ మహోత్సవానికి హాజరు కానున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వీఐపీ అతిథుల జాబితాను 50 మందికి కుదించినట్లు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు తెలియజేసింది. భవ్య రామ మందిరం భూమిపూజకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఘనమైన ఏర్పాట్లు చేస్తోంది. భూమిపూజ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మరో నలుగురు నాయకులు వేదికను పంచుకోనున్నారు. ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్, రామ జన్మభూమి న్యాస్ చీఫ్ నృత్యగోపాల్ దాస్తోపాటు మరో ఇద్దరు వేదికపై ఉంటారు. -
అయోధ్య: 4 లక్షల లడ్డూలు సిద్ధం
లక్నో (ఉత్తర ప్రదేశ్): రామ మందిర నిర్మాణం కోసం జరిగే భూమి పూజ కార్యక్రమానికి అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఈ వేడుకలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొననున్నారు. ప్రధానితోపాటు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, 50 మంది అతిథులు కూడా హాజరుకానున్నారు. అయోధ్య నిర్మాణాన్ని పర్యవేక్షించే ఆలయ పాలక మండలి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ భూమి పూజ వేడుకల సందర్భంగా ఢిల్లీలోని అన్ని విదేశీ రాయబార కార్యాలయాలకు లడ్డూలను పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకు నాలుగు లక్షల ప్యాకెట్ల లడ్డూలను ఆర్డర్ ఇచ్చినట్లు ట్రస్ట్ అధికారులు పేర్కొన్నారు. ఆగస్టు 5న జరిగే కార్యక్రమానికి మొత్తం 1,11,000 వేల లడ్డూలు సిద్ధమవుతునన్నాయని అధికారులు పేర్కొన్నారు. వీటిని రామ్ దాస్ చావ్ని అనే వ్యక్తి వద్ద తయారు చేస్తున్నట్లు తెలిపారు. (అయోధ్యలో హైఅలర్ట్) ఆగస్టు 3వ తేదీన గణేశుడి పూజతో కార్యక్రమాలు ప్రారంభం అవుతాయని ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రా తెలిపారు. ఆగస్టు 5వ తేదీన గర్భగుడిలో జరిగే పూజ కోసం 11 మంది పండితులు వేదమంత్రాలు చదవనున్నారు. ప్రధాని మోదీ చేత భూమిపూజ చేపట్టనున్నారు. పూజా కార్యక్రమానికి 600 మంది సాధువులను ఆహ్వానించాలని ట్రస్ట్ నిర్ణయించింది. అలాగే కరోనా పరిస్థితుల నేపథ్యంలో కేవలం 200 మందిని మాత్రమే వేడుకకు ఆహ్వానించాలని కూడా నిర్ణయించారు. పూజ నిర్వహించనున్న రామ మందిరం పూజారి ప్రదీప్ దాస్ తాజాగా కరోనా బారినపడిన విషయం తెలిసిందే. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. పూజారికి కరోనా సోకడంతో ఏం చేయాలనే దానిపై ఉన్నతాధికారులు సమీక్షలు నిర్వహిస్తున్నారు. (అయోధ్య పూజారికి కరోనా) -
అయోధ్యలో హైఅలర్ట్
అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో జరగనున్న భవ్య రామ మందిరం భూమి పూజపై ఉగ్రవాద శక్తులు కన్నేశాయని, ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించే అవకాశాలున్నాయని కేంద్ర నిఘా సంస్థలు హెచ్చరించడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అయోధ్య నగరంలో హైఅలర్ట్ ప్రకటించింది. భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసింది. భూమి పూజ సందర్భంగా అయోధ్యలో భారీగా దాడులు చేయాలని, తీవ్ర భయోత్పాతం సృష్టించాలని లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్ఐ ఆదేశాలు జారీ చేసినట్లు కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. ఉగ్రవాదులతో కూడిన ఓ బృందం పాకిస్తాన్ నుంచి భారత్‌లోకి చొరబడేందుకు వేచి చూస్తున్నట్లు అనుమానిస్తున్నాయి. ఈ విషయాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి చేరవేశాయి. అయోధ్యలో ఆగస్టు 5న నిర్వహించే భూమి పూజకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. అయోధ్యలో రామాలయం భూమి పూజకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. ఆయన సాకేత్ మహావిద్యాలయ ప్రాంగణంలో హెలికాప్టర్లో దిగుతారు. ఇక్కడి నుంచి రామ జన్మభూమి వరకు ప్రధానమంత్రి ప్రయాణించే మార్గాన్ని భద్రతా బలగాలు ఇప్పటికే తమ అధీనంలోకి తీసుకున్నాయి. స్థానికులు రాకపోకలు సాగించేందుకు పాసులు జారీ చేశారు. పాసులు ఉన్నవారినే అనుమతిస్తున్నారు. ప్రతి ఇంటినీ తనిఖీ చేస్తున్నారు. -
అయోధ్యలో ‘కాలనాళిక’
పట్నా: అయోధ్యలో భవ్య రామ మందిరం భూమి పూజకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మందిరం నిర్మాణంలో మరో విశేషం చోటుచేసుకోబోతోంది. రామ జన్మభూమికి సంబంధించిన సమస్త చరిత్రను అక్కడే భూగర్భంలో నిక్షిప్తం చేస్తామని రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యుడు కామేశ్వర్ చౌపాల్ చెప్పారు. భవిష్యత్తులో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా ఉండడానికే ఇదంతా అని తెలిపారు. ఆలయ నిర్మాణ స్థలంలో 2,000 అడుగుల లోతున ఒక కాల నాళిక(టైమ్ క్యాప్సూల్)ను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఇందులోనే ఆలయ చరిత్ర, కీలక పరిణామాల సమాచారం భద్రపరుస్తామన్నారు. రామ జన్మభూమి కేసు సుప్రీంకోర్టులో సుదీర్ఘ కాలం కొనసాగిందని, ప్రస్తుత, రాబోయే తరాలకు ఇదొక పాఠమని వెల్లడించారు. భవిష్యత్తులో ఈ రామాలయం గురించి ఎవరైనా అధ్యయనం చేయడానికి ఈ కాల నాళిక ఉపయోగపడుతుందన్నారు. వాస్తవాలు వక్రీకరణకు గురయ్యే అవకాశం ఉండదని, తద్వారా ఎలాంటి వివాదాలు తలెత్తవని చెప్పారు. కాల నాళికను తామ్ర పత్రంలో(కాపర్ ప్లేట్) ఉంచి భూగర్భంలో భద్రపరుస్తామని కామేశ్వర్ చౌపాల్ వివరించారు. శ్రీరాముడు నడయాడిన పుణ్య క్షేత్రాలు, పవిత్ర నదుల నుంచి మట్టి, నీరు తెప్పిస్తున్నామన్నారు. భూమి పూజలో వీటిని ఉపయోగస్తామని తెలిపారు. -
యాసంగిలోపు నీళ్లు అందిస్తాం..
సాక్షి, నల్గొండ: వచ్చే యాసంగి నాటికి బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టు కింద నకిరేకల్, నల్గొండ నియోజకవర్గాలకు మొదటి దశలో నీళ్లు అందిస్తామని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి బ్రాహ్మణవెల్లెంల గ్రామంలో 100 డబుల్ బెడ్రూంల ఇళ్ల నిర్మాణాలకు భూమి పూజ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..తెరాస ప్రభుత్వంలో నకిరేకల్ నియోజకవర్గం అన్ని రంగాల్లో ముందంజలో ఉందని పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వంలో మారుమూల గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో డబుల్ బెడ్రూంల ఇళ్లు వేగంగా పూర్తి అవుతున్నాయని..మరి కొద్ది రోజుల్లో అన్నింటిలోకి గృహ ప్రవేశాలు చేస్తామని పేర్కొన్నారు. -
అమరావతి అందరిది!
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి అంకురార్పణ జరిగింది. శనివారం భూమిపూజ నిర్వహించారు. ప్రధాని నరేంద్రమోదీ దసరా పర్వదినాన శంకు స్థాపన చేస్తారనీ, అప్పుడే నిర్మాణం ఆరంభం అవుతుందనీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. అమరావతికి నామబలం, వాస్తుబలం కలసి వచ్చాయని కూడా చెప్పారు. నిజంగానే అమరావతి అద్భుతమైన పేరు. అయిదుకోట్లకు పైగా ప్రజలకు రాజధాని కాబోతున్న అమరావతి అందంగా, శీఘ్రంగా ఆవిష్కృతం కావాలని తెలుగువారంతా ఆకాంక్షిస్తారు. ఇటువంటి శుభసందర్భంలోనైనా అన్ని పక్షాలవారినీ, అన్ని వాదాలవారినీ కలుపుకొని పోయే ప్రయత్నం జరిగి ఉంటే బాగుండేది. ప్రభుత్వ ప్రతినిధులు, వారి బంధువులు మినహా తక్కిన వర్గాల ప్రాతినిధ్యం లేకపోవడం శోచనీయం. కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ ఆత్మబంధువుగా వచ్చి ఉంటారు. బహుశా భూమిపూజ కార్యక్రమం లాంఛనంగా జరిపి దసరానాడు పెద్ద స్థాయిలో చేయా లని అనుకొని ఉండవచ్చు. కానీ మొదటి నుంచీ రాజధాని నిర్మాణం విష యంలో ముఖ్యమంత్రి ఏకపక్షంగానే వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ఎదుట ఉన్న అనేక సవాళ్ళలో రాజధాని నిర్మాణం ఒకటి. రాజధానికి అనువైన స్థలం ఏదో సూచించేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారి శివరామకృష్ణన్ నాయకత్వంలో అయిదుగురు సభ్యుల కమిటీని కేంద్ర హోంశాఖ నియమించింది. ఈ కమిటీ సభ్యులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలోనూ పర్యటించి నివేదిక సమర్పించారు. నివేదికను టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. కేంద్ర ప్రభుత్వమూ కల్పించుకో లేదు. ఈ కమిటీ పర్యటిస్తున్న సమయంలోనే చంద్రబాబునాయుడు సింగపూర్ మిత్రులతో సమాలోచనలు సాగించారు. దొనకొండ ప్రాంతంలో రాజధాని నిర్మించడం మంచిదనీ, అది అన్ని ప్రాం తాలకూ అందుబాటులో ఉంటుందనీ శివరామకృష్ణ కమిటీ సూచించింది. తన సూచనలను బుట్టదాఖలు చేయడం పట్ల నిరసన ప్రకటిస్తూ ఇటీవల ‘ది హిం దూ’లో ఒక వ్యాసం ప్రచురించారు. అనంతరం కొద్దిరోజులకే కన్నుమూశారు. కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య రాజధాని నిర్మించాలన్న చంద్రబాబు నాయుడు సంకల్పం వెనుక ఎవరున్నారో, ఎవరి ప్రయోజనాలు ఉన్నాయో తెలి యదు. కానీ ఆ ప్రతిపాదనను వ్యతిరేకించిన రాజకీయ పక్షం లేదు. 1953లో ఆంధ్ర రాష్ట్రం అవతరించినప్పుడే చాలామంది కాంగ్రెస్ నాయకులు విజయ వాడ రాజధానిగా ఉండాలని కోరుకున్నారు. కానీ అప్పటికే ఆంధ్రప్రదేశ్ ఏర్పడ బోతోందనీ, హైదరాబాద్ రాజధాని కాబోతోందనీ భావించినవారు తాత్కాలిక రాజధానిగా కర్నూలులోనే డేరాలలో విడిది చేశారు. ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత సొంత రాజధాని నిర్మించుకోవలసి రావడంతో విజయవాడను ఎంచు కోవడం సహజమే. ఇప్పటికే అభివృద్ధి చెందిన విజయవాడ, గుంటూరు పట్ట ణాలు కాకుండా మంగళగిరి ప్రాంతంలో కొత్త రాజధాని నగరాన్ని నిర్మించా లన్న నిర్ణయం ప్రభుత్వానిదే. అఖిలపక్షం ఏర్పాటు చేసి, సమాలోచనలు జరిపి తీసుకున్న నిర్ణయం కాదు. ఎవ్వరూ వ్యతిరేకించనంత మాత్రాన అందరూ ఆమోదించారని భావించనక్కరలేదు. మతలబు ఏమిటి? దొనకొండలో వద్దనుకుంటే, కృష్ణా జిల్లాలోనే కావాలనుకుంటే నూజివీడులో ప్రభుత్వ స్థలాలు వందల ఎకరాలలో ఉన్నాయి. మూడు పంటలు పండే సార వంతమైన భూములను సమీకరణ(పూలింగ్)ద్వారానో, సేకరణ (ఎక్విజిషన్) ద్వారానో తీసివేసుకోవడం ఎందుకు? రైతులు గగ్గోలు పెడుతున్నా బలవం తంగా భూములు స్వాధీనం చేసుకోవడం వెనుక మతలబు ఏమిటి? దీనికి సమాధానం చంద్రబాబునాయుడే చెప్పారు. అననుకూలమైన పరిస్థితులను అనుకూలంగా మార్చుకున్నామనీ, విన్-విన్ (ఉభయతారకం) పద్ధతిలో ఈ వ్యవహారం సాగిస్తున్నామనీ వివరించారు. ఆంధ్రప్రదేశ్ ద్రవ్య లోటు సుమారు రూ. 1,800 కోట్లు. కొత్త రాజధాని నిర్మించాలంటే హీనపక్షంలో 20 వేల కోట్ల రూపాయలు అవసరమని అంచనా. కేంద్ర ప్రభుత్వం ఇంత వరకూ ఇచ్చింది కేవలం రూ.1,500 కోట్లు. కట్టుకుంటూ పోతే తాము ఇచ్చు కుంటూ పోతామంటూ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు చెబుతున్నారు. ఇట్లా ఇచ్చుకుంటూ వస్తేనే పదిహేను సంవత్సరాల కిందట మొదటి ఎన్డీఏ ప్రభు త్వం హయాంలో ఏర్పడిన ఛత్తీస్‌గఢ్‌కు కొత్త రాజధాని నయారాయగఢ్ నిర్మా ణం ఇప్పటికీ అసంపూర్తిగానే ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వ నిధుల మీద ఆధారపడటం అనవసరమని చంద్రబాబునాయుడు నిర్ణయించుకున్నారు. తెలుగు సమాజానికి బాగా తెలిసిన మేధావి త్రిపురనేని హనుమాన్‌చౌదరి ఒక టీవీ గోష్ఠిలో నాతో చెప్పిన సూత్రం ఏమిటంటే మన దగ్గర డబ్బు లేనప్పుడు 5 వేల ఎకరాల ప్రభుత్వ భూమిని జీఎంఆర్కో, జీవీకేకో ఇచ్చేస్తే రాజధానికి అవసరమైన అసెంబ్లీ, కౌన్సిల్, హైకోర్టు, మంత్రుల, ఎంఎల్ఏల క్వార్టర్లూ, ఇతర హంగులన్నీ రెండున్నర వేల ఎకరాలలో నిర్మించి ఇస్తారు. తక్కిన రెండు న్నర వేల ఎకరాలను వారు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వినియోగించుకుంటారు. ప్రభుత్వం నయాపైసా ఇవ్వక్కరలేదు. నిధులు లేకుండా రాజధాని నిర్మించడం ఎట్లాగో ఆయన వివరంగా చెప్పారు. బహుశా చంద్రబాబునాయు డికి కూడా ఆయన చెప్పి ఉంటారు. ఆయన కాకపోయినా రియల్ ఎస్టేట్ అను భవం కలిగినవారు ముఖ్యమంత్రి సన్నిహితులలో చాలామంది ఉన్నారు. ఎవరు చెప్పినప్పటికీ, ముఖ్యమంత్రి ఈ సూత్రాన్ని బాగా విస్తరించారు. ప్రభు త్వమే ఎందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయకూడదని తలపోశారు. అయిదు వేలు కాదు యాభైవేలు కావాలని అన్నారు. రైతులు అమ్మడానికి సిద్ధపడినా కొనడానికి కూడా నిధులు అవసరం కనుక అమ్మడం, కొనడం కాకుండా రైతు లను రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగస్వాములను చేయాలన్న ఆలోచనను ఆయన ఏకపక్షంగా అమలు చేయడం ప్రారంభించారు. రైతులు ఇప్పుడు భూములను ప్రభుత్వానికి అప్పగిస్తే అభివృద్ధి చెందిన భూమిలో ఎకరానికి వేయి గజాలూ, వాణిజ్య భూమిలో రెండు వందల గజాలు ప్రభుత్వం సమీప భవిష్యత్తులో ఇస్తుందనీ, ప్రతి రైతూ కోటీశ్వరుడు అవుతాడనీ వివరించారు. ఈ కలను రైతులకు అమ్మడానికి జీవీకే, జీఎమ్మార్ల స్థాయి సరిపోదని భావించి సింగపూర్, జపాన్, చైనా వంటి అభివృద్ధి చెందిన దేశాల భాగస్వామ్యం ఉండా లని నిర్ణయించారు. సింగపూర్ కంటే అందంగా ‘అమరావతిని నిర్మిస్తానంటూ సింగపూర్ కన్సల్టెంట్లు చెప్పినప్పుడు నా హృదయం సంతోషంతో ఉప్పొం గింది’ అంటూ చంద్రబాబునాయుడు భూమిపూజ అనంతరం అన్నప్పుడు చాలా మందికి విస్మయం కలిగి ఉంటుంది. కన్సల్టెంట్లు కస్టమర్స్‌ని ఆనందింప జేయడానికి ఏమైనా చెబుతారు. అందుకు భారీ ఫీజు కూడా తీసుకుంటారు. గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందినవారు అమెరికాలో, యూరప్‌లో లక్షలాది మంది ఉంటున్నారు. వారిలో చాలా మంది అనేక రంగాలలో ఆగ్రశ్రేణి ప్రవీణు లుగా చలామణి అవుతున్నారు. అనేక నిర్మాణ సంస్థలలో సలహాదారులుగా ఉన్నారు. జీఎమ్మార్, జీవీకే వంటి తెలుగువారి కంపెనీలు ఢిల్లీలో, ముంబైలో విమానాశ్రయాలు నిర్మించాయి. హైదరాబాద్‌లో శంషాబాద్ విమానాశ్రయం ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిర్మించింది. అంతర్జాతీయ స్థాయిలో మెప్పించ గలిగిన ప్రావీణ్యం కలిగిన కంపెనీలూ, ఆర్కిటెక్టులూ, ఇంజనీర్లూ ఇంతమంది ఉండగా సింగపూర్‌ను ఆశ్రయించడంలోని ఔచిత్యం ఏమిటో చంద్రబాబు నాయుడు ఇంతవరకూ ప్రజలకు వివరించనేలేదు. ప్రజలకు చెప్పవలసిన బాధ్యత లేదని ఆయన భావిస్తూ ఉండవచ్చు. సింగపూరు ప్రైవేటు కంపెనీ అధికారులను ‘హిజ్ ఎక్సెలెన్సీ’ అంటూ ముఖ్యమంత్రి మన వాళ్ళకు పరి చయం చేస్తున్నారంటూ మీడియా ప్రతినిధులు కథలుగా చెప్పుకుంటున్నారు. విదేశీ వ్యామోహం విదేశాలలో పర్యటించడం, విదేశీ కంపెనీల అధినేతలను కలుసుకోవడం, రాష్ట్ర ప్రయోజనాల కోసం విదేశీయులతో సంబంధాలు పెట్టుకోవడం మంచిదే. నరేంద్రమోదీ సైతం గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేక దేశా లు సందర్శించి అక్కడి అభివృద్ధి నమూనాలను పరిశీలించేవారు. తనను కూడా ప్రపంచం అంతా తిరిగి అన్ని నగరాలూ చూసి మంచి రాజధాని నిర్మాణానికి అవసరమైన ప్రణాళిక సిద్ధం చేయవలసిందిగా మోదీ తనకు చెప్పారనీ, రాజ ధాని నిర్మాణానికి అయ్యే ఖర్చంతా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని కూడా తిరు పతి సభలో వాగ్దానం చేశారనీ చంద్రబాబునాయుడు గుర్తు చేశారు. దావోస్‌కు క్రమంతప్పకుండా ప్రతి సంవత్సరం సందర్శిస్తారనీ, ఆర్థిక సంస్కరణలకూ, మార్కెట్ ఎకానమీకీ అనుకూలంగా మాట్లాడతారనీ ‘ఎకనమిస్ట్’ వంటి ప్రతిష్ఠా త్మకమైన పత్రికలు చంద్రబాబునాయుడిని ప్రశంసించిన సందర్భాలు ఉన్నా యి. దావోస్ సమాలోచనలలో పాల్గొనే దేశాధినేతలు ఎవ్వరూ రాజధాని నిర్మా ణం కోసం సింగపూర్ వంటి చిన్న నగరరాజ్యంపైన ఆధారపడరు. అన్నిటినీ అవుట్ సోర్స్ చేయడం, కన్సల్టెన్సీలను మేపడం చంద్రబాబు నాయుడికి మొదటి నుంచి అలవాటే. తన విజన్-2020 తయారు చేయడానికి సైతం విదేశీ కన్సల్టెంట్లనే పురమాయించారు. తెలుగువారి ఆత్మగౌరవం, ప్రతిభ పట్ల ఎన్టీ రామారావుకు ఆపారమైన విశ్వాసం ఉంటే చంద్రబాబునాయుడికి విదేశీయుల ప్రతిభ పట్ల నమ్మకం అధికం. తాను అనుకున్నది చేయడం, ఎవ్వ రినీ సంప్రతించకపోవడం కూడా చంద్రబాబునాయుడికి కొత్తగా అబ్బిన లక్షణం కాదు. విద్యుత్ రంగ సంస్కరణలు అమలుపరచినప్పుడు కూడా మంత్రివర్గ సహచరులతో సమాలోచనలు జరిపిన దాఖలా లేదు. తాను అను కున్న సంస్కరణలను సంపత్, కుట్టీ వంటి ఉన్నతాధికారుల సహకారంతో అమలు చేయడమే కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ సంస్కరణ అయినా ప్రజలకు వివరించి, వారి సహకారం పొందినప్పుడే జయప్రదంగా అమలు అవుతుందనే మౌలిక సూత్రాన్ని సైతం ఆయన పాటించలేదు. ఇప్పుడు కూడా మంత్రివర్గంలో అందరితోనూ అన్ని విషయాలూ ముఖ్య మంత్రి మాట్లాడుతున్నారనే అభిప్రాయం ఎవ్వరికీ లేదు. తన చుట్టూ ఉన్న కూటమి, అందులోనూ నారాయణ, సుజనా చౌదరి, కుమారుడు లోకేశ్ వంటి కొద్ది మందితోనే ముఖ్యమంత్రి తన అభిప్రాయాలు పంచుకుంటారు. చంద్రబాబునాయుడు ఏడాది పాలన ఇటువంటి సంఘర్షణాత్మక వాతావ రణంలోనే గడిచింది. ఎన్నికలలో ఇచ్చిన హామీలను, ముఖ్యంగా రైతుల, డ్వాక్రా మహిళల రుణ మాఫీకి సంబంధించిన వాగ్దానాలను అమలు చేయడం లో దారుణంగా విఫలమైనారు. పైగా హామీలన్నీ సమైక్య రాష్ట్రంలో ఉంటామని భావించి ఇచ్చినవేనని అంటున్నారు. అమలు సాధ్యం కాదు కనుక విఫలం కావడం తథ్యం. అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపించడానికి సవర ణలూ, కోతలూ ప్రతిపాదించడంతో రైతులలో, మహిళలలో అసహనం పెరిగి పోతోంది. అయినా సరే తాను సంకల్పించినట్టు రాజధానికి అవసరానికంటే ఎక్కువ భూములను సమీకరించడం లేదా సేకరించడంలోనూ, పట్టిసీమకు నిధులు కేటాయించడంలోనూ పట్టుదలగానే వ్యవహరిస్తున్నారు. విలక్షణ వ్యక్తిత్వం చంద్రబాబునాయుడి వ్యక్తిత్వం ప్రత్యేకమైనది. ఆయనది పోటీ మనస్తత్వం. పరాజయాన్ని అంగీకరించరు. కిందపడినా తనదే పైచేయి అంటారు. ఒకరితో పోల్చుకొని వారికంటే తాను అధికుడినని అనుకుంటారు. ప్రజలు కూడా అను కోవాలని కోరుకుంటారు. ఈ పోలిక సంవత్సరానికి ఒకసారో, రెండు సంవత్స రాలకు ఒకసారో అయితే పర్వాలేదు. ప్రతినెలా, ప్రతివారం, ప్రతిరోజూ ఈ పోలిక ఉంటుంది. ప్రతిక్షణం తనదే పైచేయి కావాలనీ, తానే గెలవాలనీ తాప త్రయపడతారు. ఈ తత్త్వం కారణంగా అవసరంలేని సందర్భాలలో, అలవికాని రంగాలలో కూడా పోటీ పడతారు. తెలంగాణలో ఒక ఎంఎల్సీ స్థానం గెలి చినా, ఓడినా తెలుగుదేశం పార్టీకి కానీ ఆంధ్రప్రదేశ్‌లో తన ప్రభుత్వానికి కానీ వచ్చే నష్టం లేదు, లాభం లేదు. కానీ ఇక్కడ ఒక సీటు ఏ విధంగానైనా గెలిచి తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కంటే తాను అధికుడిననీ, ఎక్కువ రాజకీయ చాతుర్యం కలిగినవాడిననీ నిరూపించుకోవాలి. అందుకే రేవంత్‌రెడ్డి దుస్సాహసాన్ని అనుమతించడం. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో 15 స్థానాలు గెలుచుకుంది. చివరలో గెంతిన కూకట్పల్లి కృష్ణారావుతో సహా మొత్తం అయి దుగురు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో చేరిపోయారు. మిత్రపక్షమైన బీజేపీ సభ్యులను కలుపుకున్నప్పటికీ ఒక అభ్యర్థిని గెలిపించు కునే సంఖ్యా బలం లేదు. అటువంటప్పుడు ఒక అభ్యర్థిని నిలబెట్టడం, అతడిని గెలిపించడం కోసం అగచాట్లు పడటం ఎందుకు? కేవలం ఆధిక్య నిరూపణ కోసమే. మొన్న జరిగిన శాసనమండలి ఎన్నికలలో గెలుపొందిన టీడీపీ అభ్యర్థు లలో పరిపాలనలో అనుభవం ఉన్నవారు కొందరు ఉన్నారు. ప్రతిభ ఉన్న శాస నసభ్యులకు స్థానం కల్పించి మంత్రివర్గం శక్తిసామర్థ్యాలను పెంపొందించుకో వడానికి ఈ సందర్భాన్ని వినియోగించుకోవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా అనేక సమస్యలు మిగిలిపోయాయి. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయి. వాటిని పరిష్కరించుకోవాలన్నా, రాష్ట్రంలో అభి వృద్ధి పనులు నిరాటంకంగా సాగాలన్నా ఏకపక్ష ఎజెండాకూ, సంఘర్షణాత్మక వైఖరికీ, అనవసరమైన పోటీతత్త్వానికీ స్వస్తి చెప్పి సామరస్యంగా, సమతు ల్యంగా, సమంజసంగా వ్యవహరిస్తే తెలుగు జాతికి మేలు జరుగుతుంది. సాక్షి, ఎడిటోరియల్ డైరెక్టర్ - కె.రామచంద్రమూర్తి