దళిత కుటుంబానికి భూమిపూజ తొలి ప్రసాదం | CM Yogi Adityanath sends Ram temple bhumi puja prasad to Dalit family | Sakshi
Sakshi News home page

దళిత కుటుంబానికి భూమిపూజ తొలి ప్రసాదం

Published Fri, Aug 7 2020 6:13 AM | Last Updated on Fri, Aug 7 2020 6:13 AM

CM Yogi Adityanath sends Ram temple bhumi puja prasad to Dalit family - Sakshi

అయోధ్య:  అయోధ్యలో రామ మందిర భూమి పూజకు సంబంధించిన ప్రసాదాన్ని తొలిగా ఒక దళిత కుటుంబం అందుకుంది. లడ్డూలు, రామచరిత మానస్‌ పుస్తకం, తులసిమాల ఉన్న ప్రసాదాన్ని యూపీ సీఎం ఆదేశాల మేరకు అయోధ్యలోని మేస్త్రీ వృత్తిలో ఉన్న మహావీర్‌ కుటుంబానికి అధికారులు పంపించారు. మహావీర్‌ అయోధ్యలోని సుతాటి ప్రాంతంలో కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. 2019 ఎన్నికల సందర్భంగా మహావీర్‌ ఇంట్లో ఆదిత్యనాథ్‌ భోజనం చేశారు. ‘అలి– బజరంగ బలి’ వ్యాఖ్యల కారణంగా అంతకుముందే సీఎం యోగిని మూడు రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ‘నన్ను గుర్తుంచుకుని ప్రసాదం పంపినందుకు ఆయనకు కృతజ్ఞతలు’ అని మహావీర్‌ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement