నకిరేకల్ మండలం నోముల వద్ద మంగళవారం ఆటో బోల్తా పడిన ఘటనలో 12 మంది విద్యార్థినులు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే వారిలో నలుగురు పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. దాంతో క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. విద్యార్థినులంతా విహార యాత్రకు వెళ్లుతుండగా ఆ ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు తెలిపారు. ఆటో డ్రైవర్ అతివేగంగా నడపడంతోనే ఈ దుర్ఘటన చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.