నకిరేకల్ : నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం చందన్‌పల్లి వద్ద ఇసుక ట్రాక్టర్, కారు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే... హైదరాబాద్ నుంచి విజయవాడ వెళుతున్న ఓ కారు ఆదివారం ఉదయం చందన్‌పల్లి వద్ద జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న ఇసుక ట్రాక్టర్‌ను ఢీకొన్నట్టు సమాచారం. ఈ ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కామినేని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన ముగ్గురిలో ఈనాడు జర్నలిజం స్కూల్ ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.