సాక్షిప్రతినిధి, నల్లగొండ : జిల్లాలోని నకిరేకల్ నియోజకవర్గంపై టీడీపీ కన్నేసింది. ఉమ్మడి జిల్లాలో ఒకే కుటుంబంనుంచి ఇద్దరికి టికెట్లు ఉండవని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే కాంగ్రెస్ సిట్టింగులు అందరికీ టికెట్లు ఖాయమని ఏఐసీసీ నాయకత్వం తీసుకున్న నిర్ణయంతో కోదాడలో పద్మావతి అభ్యర్థిత్వం ఖరారు అయినట్లనేని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో కోదాడ టికెట్ కోసం ఆశ పెట్టుకున్న టీడీపీ నేత బొల్లం మల య్య యాదవ్‌కు ఈసారి నిరాశే మిగిలేలా ఉంద న్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇక, గత ఎన్ని కల్లో తాము పోటీచేసి గౌరవ ప్రదమైన ఓట్లు సా« దించిన నియోజకవర్గాలపై దృష్టి పెట్టింది. సూ ర్యాపేట నుంచి పోటీ చేసిన పటేల్ రమేష్‌రెడ్డి (38,529 ఓట్లు), దేవరకొండ నుంచి బిల్యా నా యక్ (53,501 ఓట్లు) టీడీపీని వీడి కాంగ్రెస్ గూ టికి చేరారు. సుదీర్ఘ కాలం టీడీపీకి అండగా ఉన్న భువనగిరి నియోజకవర్గంలోనూ టీడీపీకి నాయకత్వం లేమి బాధిస్తోంది. గత ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి (24,560ఓట్లు), ఆమె తనయుడు టీడీపీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరారు.
ఈ మూడు నియోజకవర్గాల్లో టీడీపీకి ఇప్పుడు పెద్ద దిక్కుగా కనిపిసు న్న నాయకులు కనిపించడం లేదన్న అభిప్రాయంలో ఆ పార్టీ నాయకత్వం ఉంది. ఇక, గత ఎన్నికల్లో తుంగతుర్తిలో పోటీ చేసిన పాల్వాయి రజినీ కుమారీ (31,672 ఓట్లు) ఈసారి నకిరేకల్ టికెట్ కు కోరుతున్నారు. ఆమె గతంలో 2009 ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి పోటీ చేశారు. 2014 తుంగతుర్తి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి మా త్రం మళ్లీ నకిరేకల్ కావాలంటూ పట్టుబడుతున్నారని చెబుతున్నా రు. దీంతో ఉ మ్మడి జిల్లా వ్యా ప్తంగా పోటీచే యడానికి అవకాశాలు ఎక్కడా సానుకూలంగా లేకపోవడంతో టీడీపీ నాయకత్వం సైతం నకిరేకల్ కోసం పట్టుదలగా ఉన్నట్లు సమాచారం. దీంతో ఇక్కడినుంచి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తికి టికెట్ లభిస్తుందా లేదా అన్న అంశంపై భిన్నాభిప్రాయం వ్యక్తమవుతోంది.
నకిరేకల్ ... ఎందుకు ?
టీడీపీకి జిల్లాలో ఒకటి కంటే ఎక్కువ సీట్లు కేటా యించే అవకాశం లేదు. దీంతో మొదటి నుంచీ కోదాడను కోరారు. కానీ, అక్కడ కాంగ్రెస్ సిట్టింగ్ ఉండడం ప్రధాన అడ్డంకిగా మారింది. సిట్టింగుల రూపంలో నల్లగొండ, కోదాడ, హుజూర్‌నగర్, నాగార్జున సాగర్‌లను కోరలేదు. సూర్యాపేట, దేవరకొండ, భువనగిరి నియోజకవర్గాల్లో నాయకత్వం ఇతర పార్టీలకు వలస పోయింది. మునుగోడులో ఆ పార్టీకి కనీస నాయకత్వం కూడా లేదన్న అభిప్రాయం ఆ పార్టీలోనే వ్యక్తమవుతోంది. కూటమిలోని మరో భాగస్వామ్య పక్షం సీపీఐ కూడా మునుగోడును కోరుతోంది.
దీంతో టీడీపీ ఆ స్థానాన్ని కోరలేదు. ఆలేరులో బీసీవర్గానికి చెందిన నాయకుడు కావడం, డీసీసీ అధ్యక్షుడు కావడం, ఉమ్మడి జిల్లాలోని పన్నెండు స్థానాల్లో కాంగ్రెస్‌కు ఉన్న ఒకే ఒక బీసీ కావడం వంటి అంశాల నేపథ్యంలో కాంగ్రెస్ ఆ స్థానాన్ని వదులుకునే పరిస్థితి లేదు. అంతే కాకుండా మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు పార్టీని వీడారు. తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు బండ్రు శోభారాణి ఉన్నా.. ఆ స్థానంపై పార్టీకి గురి లేదు. మిర్యాలగూడలో గత ఎన్నికలు, వచ్చిన ఓట్లను బట్టి సీటును కోరే అవకాశం లేదు. అంతేకాకుండా.. కోదండరాం నేతృత్వం వహిస్తున్న టీజేఏస్ బలంగా కోరుకుంటున్న స్థానాల్లో మిర్యాలగూడ కూడా ఒకటి కావడంతో టీడీపీ ఈ స్థానాన్ని కోరడం లేదు.
ఇన్ని కారణాలతో టీడీపీ నకిరేకల్ కోసం పట్టుపడుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, ఇదే స్థానాన్ని తెలంగాణ ఇంటి పార్టీ కూడా కోరుతోంది. దీంతో ఈ నియోజకవర్గంనుంచి కాంగ్రెస్సే పోటీ చేస్తున్నందన్న విశ్వాసం కలగడం లేదని చెబుతున్నారు. మరోవైపు కాంగ్రెస్‌లోని ఒకవర్గం టీడీపీనుంచి పాల్వాయి రజినీ కుమారికి టికెట్ ఇస్తే గెలిపించి తీసుకువస్తామని పీసీసీ నాయకత్వం వద్దే ప్రతిపాదన పెట్టాయన్న ప్రచారం జరుగుతుండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment