
సాక్షి, నకిరేకల్ : ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు తెలంగాణలో తుగ్లక్ పరిపాలన చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. రైతులకు డబ్బులు ఇచ్చే రైతుబంధు పథకం వారిని మోసం చేయడానికే అని ఆరోపించారు. తన ఫామ్‌హౌస్ చుట్టూ ఆత్మహత్యలు చేసుకున్న రైతులను పరామర్శించడానికి కేసీఆర్‌కు సమయం లేదు కానీ ఆంధ్రప్రదేశ్‌లోని పరిటాల రవి కుమారుడి పెళ్లికి వెళ్లటానికి టైమ్ ఉంటుందని ఎద్దేవా చేశారు.
తెలంగాణలోని 119 సీట్లలో మొదటగా గెలిచే సీటు నకిరేల్‌లో చిరుమర్తి లింగయ్య మాత్రమే అని రాజగోపాల్ రెడ్డి అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడం కోసమే రైతుబంధు పథకం ప్రవేశపెట్టారని వాఖ్యానించారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం రౌడీ రాజకీయానికి 2019లో ప్రజలే బుద్ధి చెప్పుతారని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment