Raithu bandhu scheme
-
రైతు భరోసాపై కీలక ప్రకటన
-
1.31 కోట్ల ఎకరాల నుంచి 2.38 కోట్ల ఎకరాలకు
తెలంగాణలో రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతో 2014–15లో 1.31 కోట్ల ఎకరాలుగా ఉన్న పంటల సాగువిస్తీర్ణం 2022–23 నాటికి 2.38 కోట్ల ఎకరాలకు పెరిగింది. అంటే పదేళ్ల కాలంలో కోటి ఎకరాల సాగు విస్తీర్ణం పెరిగింది. సాగు విస్తీర్ణం పెరగడంతో పంట ఉత్పత్తి కూడా అదే స్థాయిలో 1.50 కోట్ల టన్నుల నుంచి 3.62 కోట్ల టన్నులకు పెరిగింది. అంటే పంట ఉత్పత్తి 2014తో పోలి్చతే ఏకంగా 137 శాతం పెరగడం గమనార్హం.వరిసాగులో దేశంలో అగ్రగామిగా నిలిచింది. 2014–15లో 35 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగు కాగా, 2022–23లో ఇది ఏకంగా 121 లక్షల ఎకరాలకు పెరిగింది. అంటే తొమ్మిదేళ్ల కాలంలో 86 లక్షల ఎకరాల్లో వరి సాగు పెంపు కారణంగా, ధాన్యం ఉత్పత్తి కూడా భారీగా పెరిగింది. 2014–15లో 68 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి కాగా, 2022–23 నాటికి ఇది 2.60 కోట్ల టన్నులకు పెరిగింది. – సాక్షి, హైదరాబాద్రూ.75 వేల కోట్లు రైతుబంధు కింద జమ ⇒ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం కింద ప్రతి ఎకరాకు ఏడాదికి రూ.10 వేల చొప్పున రైతులకు అందించారు. ఈ పెట్టుబడి సాయాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలోనే జమ చేశారు. ప్రతి సీజన్లో సుమారు 65 లక్షల మందికి రూ.7,500 కోట్ల వరకు అందించేవారు. ఈ విధంగా ఇప్పటివరకు మొత్తం రూ. 75 వేల కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో జమ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని రైతు భరోసాగా మార్చింది. ⇒ కేసీఆర్ రైతుబీమా పథకాన్ని తీసుకొచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో వివిధ కారణాలతో మరణించిన సుమారు 1.15 లక్షల మంది రైతు కుటుంబాలకు రూ. 5,566 కోట్ల పరిహారాన్ని అందించింది. లక్ష రుణమాఫీఅప్పుల ఊబిలో కూరుకుపోతున్న రైతులకు రుణ విముక్తి చేయడమే లక్ష్యంగా గత ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించింది. ఇందులో భాగంగానే తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. లక్ష వరకు రుణమాఫీ చేసిన కేసీఆర్ సర్కారు.. 2018లో మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రూ.లక్ష మాఫీకి హామీ ఇచ్చింది. ఇందులో 2014లో తొలిసారి 35.31 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ. 16,144 కోట్ల రుణాలను మాఫీ చేసింది.ఇక రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 23 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.13 వేల కోట్ల రుణాలను మాఫీ చేయగా, మరో రూ. 6 వేల కోట్ల రుణాల మాఫీ పెండింగ్‌లో ఉంది. ఎన్నికల కోడ్ రావడంతో అడ్డంకి ఏర్పడింది. ఇప్పుడు రూ. 2 లక్షల రుణమాఫీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం దాదాపు రూ. 35 వేల కోట్లు అవసరమవుతాయని అంటున్నారు. -
Somesh Kumar: క్విడ్ ప్రోకోతో భూముల కొనుగోలు!
హైదరాబాద్: మాజీ సీఎస్, ధరణి రూపకర్తగా పేరున్న సోమేష్ కుమార్ ఆస్తుల చిట్టాలో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. పాతిక ఎకరాల భూమిని తక్కువ ధరలకు చెల్లించి ఆయన కొనుగోలు చేయడం.. అదీ ఫార్మా సిటీ ప్రాంతంలోనే కావడంతో కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో క్విడ్ ప్రోకో అంశంపై తెరపైకి వచ్చింది. ఫార్మాసిటీ వస్తుందని ముందే తెలుసుకుని.. ప్లాన్ప్రకారమే యాచారంలో భూములు కొన్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. 2018లో ఫార్మాసిటీ ప్రాంతం అయిన కొత్తపల్లిలో 25 ఎకరాల్ని నలుగురి దగ్గరి నుంచి ఆయన కొన్నారు. అందుకుగానూ ఎకరానికి రూ.2 లక్షలు చెల్లించారు. అయితే అది సోమేష్ భార్య పేరిట ఉన్నట్లు ధరణి రికార్డుల్లోనూ ఇది నమోదు అయ్యింది. లక్షల్లో రైతుబంధు సొమ్ము తక్కువ ధరకు కొనుగోలు చేసిన ఈ భూముల ద్వారా సోమేశ్ కుమార్ లక్షల్లో రైతుబంధు తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్తపల్లి విలేజ్‌లో కొనుగోలు చేసిన భూమిపై ఇప్పటివరకు 14 లక్షల 5 వేల 550 రూపాయల రైతుబంధు తీసుకున్నట్లు సమాచారం. భూమి సాగు చేయకపోయినా రైతుబంధు తీసుకున్నట్లు తెలుస్తోంది. 25 ఎకరాల 19 గుంటలు భూమి మొత్తం రాళ్లు, గుట్టలు మాత్రమే ఉన్నాయి. కానీ, సోమేశ్ కుటుంబం.. సాగు చెయ్యకుండానే రైతుబంధు పొందినట్లు తెలుస్తోంది. అదేకాకుండా ఆయన బంధువులు మొత్తం 150 ఎకరాలకు సంబంధించి భూమిపై రైతుబంధు డబ్బులు తీసుకున్నట్లు సమాచారం. ఇక.. ఏడాదికి రెండు దఫాల్లో 2 లక్షల 52,750 రూపాయల రైతుబంధు డబ్బును సోమేశ్ కుమార్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు భూముల కొనుగోలులో క్విడ్ ప్రోకో జరిగినట్లు పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉంటే రెరా సెక్రటరీగా పని చేసిన శివబాలకృష్ణ అక్రమాస్తుల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో సోమేష్‌కుమార్ కూడా రెరాలో పని చేయడంతో ఏమైనా లింకులు ఉన్నాయా? అనే కోణంలోనూ దర్యాప్తు నడుస్తోంది. -
నత్తనడకన ‘రైతుబంధు’.. రైతులకు తప్పని అప్పుల తిప్పలు!
నల్లగొండ అగ్రికల్చర్: రైతుబంధు పథకం డబ్బుల జమ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ప్రక్రియను ప్రారంభించి ఐదు రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు జిల్లాలోని 86 వేల మంది రైతుల ఖాతాల్లో రూ.20 కోట్లు జమ చేసినట్లు వ్యవసాయశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. అరెకరం, ఎకరం లోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో మాత్రమే రైతుబంధు డబ్బులను జమ చేసినట్లు గణాంకాలు చెపుతున్నాయి. యాసంగి సీజన్ ఆరంభమై నెల రోజులు దాటినా రైతుబంధు డబ్బులు అందకపోవడంతో రైతులు పెట్టుబడుల కోసం తిప్పలు పడుతున్నారు. గత ప్రభుత్వం మాదిరిగానే.. కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా కాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన విధంగానే ఈ సీజన్లో ఎకరానికి రూ.5 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయడానికి పచ్చజెండాను ఊపింది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురానున్న రైతు భరోసా పథకంపై ఇప్పటివరకు ఎలాంటి విధి విధానాలను రూపొందించలేదు. దీని కారణంగా పాత పద్ధతినే రైతులకు డబ్బు జమచేసే ప్రక్రియను ఈ నెల 12 నుంచి ప్రారంభించింది. రంగారెడ్డి ట్రెజరీ నుంచి రైతులు దశల వారీగా డబ్బులను జమ చేస్తామని పేర్కొంది. తొలుత ఎకరం లోపు వారికి.. ఆ తర్వాత దశల వారీగా రోజుకు ఎకరం చొప్పున పెంచుతూ రెండు ఎకరాలు, మూడు ఎకరాలు, ఆ తరువాత పై ఎకరాల వారికి రైతుబంధు డబ్బులను జమచేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రకటించింది. నల్లగొండలో జిల్లాలో 5.30 లక్షల మంది రైతులు రైతుబంధు పథకానికి అర్హులుగా ఉన్నారు. వారికి సంబంధించిన రూ.610 కోట్లు ఖాతాల్లో జమచేయాల్సి ఉంటుంది. పెట్టుబడులకు తప్పని తిప్పలు యాసంగి సీజన్ ప్రారంభమై నెల దాటింది. రుణమాఫీ సక్రమంగా కాకపోవడంతో బ్యాంకర్లు పంట రుణాలు ఇవ్వడానికి ఆసక్తి చూపించడం లేదు. దీంతో రైతులు పంటరుణాలు అందక, రైతుబంధు సాయం రాక పెట్టుబడల కోసం ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే రైతుబంధు డబ్బుల జమ ప్రక్రయను వేగవంతం చేయాలని జిల్లా రైతులు కోరుతున్నారు. వానాకాలంలో కూడా కొందరికి అందలే.. గత వానాకాలంలో సీజన్లో కూడా వేలాది మంది రైతుల వరకు రైతుబంధు డబ్బులు జమ కాలేదు. వివిధ సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ ఆ సీజన్ ముగిసే నాటికి కూడా డబ్బులు రాకపోవడంతో రైతులు నానా ఇబ్బందులు పడ్డారు. వ్యవసాయ శాఖ కార్యాలయాల చుట్టూ తిరిగినా వారికి సరైన సమాధానం రాలేదు. ప్రస్తుత యాసంగి సీజన్ కూడా డబ్బుల జమ ప్రక్రియ నత్తనడకన సాగుతుండడంతో వానాకాలం పరిస్థితి ఏర్పడుతుందోనన్న ఆందోళన రైతుల్లో నెలకొంది. దశల వారీగా జమ అవుతాయి రాష్ట్ర ప్రభుత్వం యాసంగి సీజన్ రైతుబంధు డబ్బులు జమ చేయడాన్ని ప్రారంభించింది. ముందుగా ఎకరంలోపు రైతులకు ఆ తరువాత రెండెకరాలోపు వారికి ఇలా దశవారీగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమవుతాయి. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతి రైతుకూ రైతుబంధు సాయం అందుతుంది. – పాల్వాయి శ్రవణ్‌కుమార్, డీఏఓ -
ఎన్నికల ముందు బిగ్ షాక్...రైతుబంధు ఎవరికి షాకిస్తుంది
-
కేసీఆర్ ఫామ్ హౌస్ సీఎం కాదు.. ఫామింగ్ సీఎం: హరీష్ రావు
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ దృష్టి అంతా రైతుల మీద ఉంటుందని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. కేసీఆర్ ఫామ్ హౌస్ సీఎం కాదు.. ఒక ఫామింగ్ సీఎం అని కొనియాడారు. రాష్ట్రంలో 24 గంటల కరెంట్, రైతుబంధుతో కేసీఆర్ వ్యవసాయం పండగ చేశారని పేర్కొన్నారు. కేసీఆర్ ఒక రైతు బిడ్డని గుర్తు చేశారు. ఇన్నాళ్లు నీళ్ళు లేక, పెట్టుబడి లేక రైతులు ఇబ్బందులు పడ్డారు. మళ్ళీ కాంగ్రెస్ చేతిలో పడితే రాష్ట్రం ఏమవుతుంది అనేదే భయమని అన్నారు. రిస్క్ తీసుకోవద్దు.. కారుకు ఓటేసి బీఆర్ఎస్ను గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రశ్న: బీఆర్ఎస్ కాకుండా వేరే పార్టీ వస్తే పరిస్తితి ఏంటి? హరీష్ రావు: పేదలకు బీజేపీ, కాంగ్రెస్‌లు చేసిందేమీ లేదు. అయిదు గ్యారంటీలతో కర్ణాటకలో కాంగ్రెస్ జనాన్ని మోసం చేసింది. రాహుల్, ప్రియాంక తమది గ్యారంటీ అన్నారు. ఆరు నెలలు అవుతున్నా ఎన్నికల హామీలు అమలు చేయటం లేదు. ఏడాదికి 2లక్షల ఉద్యోగాలు అన్నారు. ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. నిన్న నిరుద్యోగుల వద్దకు వెళ్లి రాహుల్ గాంధీ డ్రామాలు చేస్తున్నారు. కర్ణాటకలో 5 గ్యారెంటీలు ఏమో గానీ ఉన్న గ్యారంటీలు పోయాయి. నిరుద్యోగ భృతి కూడా ఇవ్వటం లేదు. 80 శాతం ఫీజుల్లో కోత పెట్టారు. అన్నింట్లో కోత పెట్టింది కర్ణాటక ప్రభుత్వం. రేవంత్ రెడ్డి 3 గంటల కరెంట్, కర్ణాటక డిప్యూటీ సీఎం 5 నుంచి 7 గంటల కరెంట్ చాలు అంటున్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే 3 గంటల కరెంట్, 5 గంటల కరెంట్ ఒప్పుకున్నట్టే. ప్రజలు ఆలోచించాలి. రైతు బంధు కాంగ్రెస్ పార్టీ రూ.15 వేలు ఇస్తామని చెప్తోంది. కానీ మేము రూ.16 వేలు ఇస్తామని చెప్తున్నాం. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కరెంట్ కష్టాలు ఉండే. మనం రిస్క్ తీసుకోవద్దు. ప్రశ్న: కర్ణాటక హామీల ప్రకటనలు ఇస్తోంది ఇక్కడ? హరీష్ రావు: కర్ణాటక ఇచ్చే యాడ్ అంత అబద్దం. యువశక్తి అని యాడ్ ఇచ్చారు. అక్కడ ఉద్యోగాలు ఇచ్చారా? బస్సులు కూడా లేకుండా చేశారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ కర్ణాటక యాడ్ ఇవ్వటం ఎందుకు? ప్రశ్న: బీఆర్ఎస్ పరిపాలనలో పాజిటివ్‌తో వెళ్లాల్సిన బీఆర్ఎస్ భయపడుతుంది కాంగ్రెస్ కు అనే వాదన వస్తోంది? హరీష్ రావు: మాకు భయం అనేదే లేదు. ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు. మేము 12 సార్లు రైతు బంధు ఇచ్చాం. కాంగ్రెస్‌లో అధికారంలోకి వస్తే 12 ముఖ్యమంత్రులు ఖాయం. ప్రశ్న: ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ కూడా సీఎంలను మార్చలేదు ఇక్కడ ఎందుకు మారుస్తాం అంటున్నారు? హరీష్ రావు: తెలంగాణ రాకముందు ఇక్కడ సీఎంలను మార్చలేదా మనం చూడలేదా? కర్ణాటక మోడల్ అంటే ఏంటి? కరెంట్ ఇవ్వక పోవడమా? రైతు బంధు ఇచ్చాము, కరెంట్ ఇచ్చాము.కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇవన్నీ రద్దు అవుతాయి. ప్రశ్న: కాంగ్రెస్ గాలి వీస్తుంది అనే వార్తలు వస్తున్నాయి? ఏమంటారు? హరీష్ రావు: మేము నిర్వహించిన మహబూబాబాద్, నర్సం పేట, పాలకుర్తి, భువనగిరిలో ఎక్కడ చూసినా ఇసుక వేస్తే రాలనంత జనం వస్తున్నారు. కానీ రాహుల్ సభకు, ప్రియాంక సభకు జనం లేక వెలవెలభోతున్నాయి. ఖాళీ కుర్చీలకు ఉపన్యాసం ఇస్తున్నారు. జనం ముమ్మాటికీ మా వైపే ఉన్నారు. ఇంటింటికి మంచి నీరు, 24 గంటల కరెంట్, సాగు నీరు అందిచాం. ప్రశ్న: 24 గంటల కరెంట్, మిషన్ భగీరథతో ఇంటింటికి నీళ్ళు ఇవ్వలేదు? వెళ్లి చూద్దామా? అని ప్రతిపక్షాలు అంటున్నాయి మంత్రి హరీష్: 'ఇవన్నీ రాకపోతే టీవీ లోనో, పేపర్ లోనో రావాలి కదా. కరెంట్, నీళ్ళు ఇస్తే కారుకు ఓటెయ్యండి. రాని వాళ్ళు కాంగ్రెస్‌కు ఓటెయ్యండి. రిస్క్ వద్దు అనేది మా అభిప్రాయం. సాఫీగా తెలంగాణ పాలన సాగుతోంది. సంక్షేమ రంగంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. అనేక రంగాల్లో మార్గదర్శకంగా తెలంగాణను దేశంలో.నంబర్ 1 స్థానంలో ఉంచాం. హర్ గర్ జల్ అని కేంద్రం మిషన్ భగీరథను కాపీ కొట్టింది. కేసీఆర్‌కు వాగు వంక, చెట్టు పుట్ట అన్ని తెలుసు. ప్రతిపక్ష నాయకులకు ఏది తెలియదు. కొన్ని పథకాలు తప్ప వేరే కనపడటం లేదు. చేసింది, చూసిందే గమనించాలి అంటున్నాం. అందుకే ఇవ్వన్నీ గమనించి ఓటేయాలి.' అని మంత్రి హరీష్ రావు చెప్పారు. ప్రశ్న: స్కూళ్ళు మూత పడుతున్నాయి? మంత్రి హరీష్: 'ఒక్క విద్యార్థి కూడా లేని చోట మూత పడ్డాయి అంతే' అని హరీష్ రావు సమాధామిచ్చారు. ప్రశ్న: ధరణి విషయంలో విమర్శలు ఎందుకు? ధరణి ప్లాప్ అంటోంది కాంగ్రెస్? మంత్రి హరీష్: 'మా బలం ఏందో ప్రతిపక్షాలకు తెలుసు. మా బలం మీద విమర్శ చేస్తేనే దుష్ప్రచారం చేస్తేనే జనం నమ్ముతారు అని వారి ఆలోచన' అని హరీష్ రావు అన్నారు. ప్రశ్న: తెలంగాణలో జనరేటర్లు, ఇన్వర్టర్లు లేవు.. ధరణితో భూములు లాక్కుంటున్నారు అంటున్నారు? మంత్రి హరీష్: 'ప్రజల్లో అపనమ్మకం సృష్టించి జనాన్ని ఇబ్బందులు పెట్టాలని కాంగ్రెస్ చూస్తోంది. 60 యేళ్లు పాలించిన కాంగ్రెస్ ఏనాడైనా రైతు గురించి ఆలోచించిందా. మా అధికారం అంత ప్రజలకు ఇచ్చాము.'అని హరీష్ రావు సమాధానమిచ్చారు. ప్రశ్న: కుటుంబ పాలన చేస్తున్నారని విమర్శ? మంత్రి హరీష్: 'ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వీరంతా ఎవరు? మేము ప్రజా క్షేత్రం నుంచి వచ్చిన వాళ్ళం. కుటుంబ పార్టీ ఎలా అవుతుంది. సంక్షేమ రంగంలో అద్భుతాలు చేశాం. ప్రతిపక్షాలు చెప్పడానికి ఏం లేక, పదే పదే సొల్లు చెప్తోంది. దళిత బంధు ఓట్ల కోసం కాదు, దళితులను ఆర్థికంగా ఎదగాలని తీసుకొచ్చాం' అని హరీష్ రావు చెప్పారు. ప్రశ్న: దళిత బంధు, డబుల్ బెడ్ రూం ఇల్లు బీఆర్ఎస్కు గుది బండలా మారుతుందా? మంత్రి హరీష్: 'దశల వారీగా ఈ పథకం అందరికీ అందిస్తాం. దళితులు ఆర్థికంగా ఆదుకోవటానికి ఇది తీసుకొచ్చాం. రైతు అందుబాటులో ఉన్న సమయంలో కరెంట్ తో నీళ్ళు పారించటానికి 24 గంటల కరెంట్ ఇస్తున్నాం. 24 గంటల కరెంట్ మధ్యలో అంతరాయం వస్తుంటేనే మళ్ళీ ఫోన్లు వస్తున్నాయి. ఇది చాలాదా అందరికీ నాణ్యమైన కరెంట్ ఇస్తున్నాం.' అని మంత్రి హరీష్ రావు చెప్పారు. ప్రశ్న: కాళేశ్వరం లక్ష కోట్లు అవీనీతి అంటున్నారు? మంత్రి హరీష్: 'ప్రాజెక్ట్ మొత్తం రూ.80 వేల కోట్లు అయ్యింది. లక్ష కోట్ల అవినీతి ఎలా అవుతుంది. ఆ ప్రాజెక్టుతో వ్యవసాయం సస్యశ్యామలం అయ్యింది.' అని హరీష్ రావు చెప్పారు. ప్రశ్న: డిజైన్ లో లోపాలు ఉన్నాయా? ఎందుకు కుంగిపోయింది.? మంత్రి హరీష్: 'ఇంత పెద్ద ప్రాజెక్టులో చిన్న పిల్లర్ కుంగింది. ఇది ఎల్ అండ్ టీ టేకప్ చేసిన ప్రొజేక్ట్. ప్రజలపై భారం పడకుండా మళ్ళీ మరమత్తులు చేస్తామని చెప్పారు. ఓట్ల కోసం ఇంత రాజకీయం అవసరమా. ప్రాజెక్టు కూలితే కేంద్రం ఊరుకుంటుందా?' అని హరీష్ రావు చెప్పారు. ప్రశ్న: భారీ వర్షాలు పడితే హైదరాబాద్ పరిస్తితి దారుణంగా ఉంది? మంత్రి హరీష్: 'హైదరాబాద్ విషయంలో కేటీఆర్ బాగా కష్టపడుతున్నారు.' అని హరీష్ రావు చెప్పారు. ప్రశ్న: ఓయూ వెళ్ళడానికి బీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారా? మంత్రి హరీష్: 'ఓయూ వెళ్ళడానికి భయపడేది మేము కాదు. రేవంత్ రెడ్డి భయపడుతున్నారు. విద్యార్థులను బీర్లు, బిర్యానీ ఇస్తే ఏమైనా చేస్తారు అని అన్నాడు. వచ్చే ప్రభుత్వంలో ఉద్యోగ కాలెండర్ ప్రకటిస్తాం. అత్యుత్తమ పారిశ్రామిక విధానం ద్వారా ప్రవేట్ ఉద్యోగాలు వచ్చాయి. మొత్తం ఉద్యోగాల్లో 3 శాతం మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటాయి. పేపర్ లీకేజీలు ఇతర రాష్ట్రాల్లో జరగటం లేదా? మేము దాన్ని ముందు పెట్టడం లేదు. కొన్ని లోపాలు జరిగాయి. మేమే దాన్ని గుర్తించాం. అత్యంత పారదర్శకంగా ఉద్యోగాలు భర్తీ చేస్తాం' అని హరీష్ రావు చెప్పారు. ప్రశ్న: బీజేపీకి ఓటేస్తే బీఆర్ఎస్ కు ఓటేసినట్టే. కాంగ్రెస్‌కు వేస్తే బీఆర్ఎస్కు వేసినట్టే అనే ఆరోపణ వస్తోంది? మంత్రి హరీష్: 'మేము ఎవరికీ బీ టీమ్ కాదు. వీళ్లు వాళ్ల మీద.. వాళ్ళు వీళ్ళ మీద చెప్పుకుంటూ మా మీద ఆరోపణ చేస్తున్నారు' అని హరీష్ రావు చెప్పారు. ప్రశ్న: కొంత వ్యతిరేకత ఉందని సర్వే లు చెప్తున్నాయి? మంత్రి హరీష్: 'అవన్నీ ఫేక్ సర్వేలు, పెద్ద పేరున్న ఛానళ్ళు చేస్తే ఓకే, పేపర్ల మీద సర్వే లు చేస్తే ఎలా?' అని హరీష్ రావు చెప్పారు. ప్రశ్న: మైనoపల్లి విమర్శలు ఎలా చూస్తారు? మంత్రి హరీష్: 'ఆయన మాట్లాడిన భాష ఆయన స్థాయికి నిదర్శనం. ఆయన విజ్ఞతకే వదిలేస్తాం. ప్రజలే తగిన బుద్ధి చెప్తారు. అలాంటి వారి గురించి మాట్లాడి నా స్థాయి తగ్గించుకోను.' అని హరీష్ రావు చెప్పారు. ప్రశ్న: కొంత మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది.కానీ అయిన వారికే టికెట్ల ఇచ్చారు అని వాదనపై మీ స్పందన? మంత్రి హరీష్: 'వ్యతిరేకత కాదు పాజిటివ్ కూడా ఉండొచ్చు కదా. సంక్షేమ పథకాల లబ్ధి ఎమ్మెల్యేల ద్వారానే వెళ్తుంది కదా. 80 సీట్లతో మేమే అధికారంలోకి వస్తాం. రేవంత్ రెడ్డి హెడ్ లైన్స్ కోసం సెన్సేషన్ కోసమో ఆయన ఆ భాషతో మాట్లాడుతున్నారు. మేము బాధ్యతాయుతంగా ఉండేవాళ్ళం. మేము పాలన సక్రమంగా అందించాలని అనుకునే వాళ్ళం. ప్రధాని ఎన్నో చెప్తాడు. నిజంగా కేటీఆర్ ను సీఎం చేయాలంటే మా ఎమ్మెల్యేలు కావాలి కానీ, ఎంపీలు ప్రధాని సపోర్ట్ ఎందుకు? మోడీ కేసీఆర్‌ను ఎన్ని సార్లు మెచ్చుకున్నారు. ప్రశ్న: కేటీఆర్ ను సీఎం చేయాలనడంపై హరీష్ రావు అభిప్రాయం ఏంటి? మంత్రి హరీష్: 'మా పార్టీ ఏది అనుకుంటే అది చేస్తుంది. మాకు కేసీఆరే సీఎం కావాలని అనుకుంటున్నాం. మా ఎమ్మెల్యేలకు తీరిక ఉండదు. అన్ని పనులు సక్రమంగా సాగుతున్నాయి' అని హరీష్ రావు చెప్పారు. -
పోడుదారులకు రైతుబంధు.. రైతులు వివరాలు అందించాలి
నర్సంపేటరూరల్/ఖానాపురం/నెక్కొండ/నల్లబెల్లి : పోడు రైతులకు పట్టాలు పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. హక్కుపత్రాలు పొందే రైతులకు రైతుబంధు సైతం అందించడానికి అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. జిల్లాలోని ఖానాపురం, నల్లబెల్లి, నెక్కొండ, నర్సంపేట మండలాల్లో పోడు భూముల కోసం 3,353 మంది దరఖాస్తు చేసుకున్నారు. సర్వే చేసిన అనంతరం 3,271 మంది లబ్ధిదారులు.. 7,333 ఎకరాల భూమిని అధికారులు గుర్తించారు. సాంకేతిక కారణాలతో 3,262 మందికి పట్టాలను సైతం తయారీ చేయించి పంపిణీకి సిద్ధం చేశారు. హక్కుపత్రాలు పొందే రైతులకు రైతుబంధు సైతం అందించనుంది. ఇప్పటికే ఇతర రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ అవుతున్నాయి. వీరితోపాటు గిరిజన రైతులకు సైతం అందించడానికి వివరాలు సేకరిస్తున్నారు. హక్కుపత్రాలు పొందిన గిరిజన రైతుల వివరాలను ఇప్పటికే ఆయా గ్రామ పంచాయతీల కార్యదర్శులు.. మండల వ్యవసాయ అధికారులకు అందించారు. వివరాల ఆధారంగా గిరిజన రైతుల వద్ద నుంచి ఆధార్, బ్యాంకు ఖాతాల జిరాక్స్ పత్రాలను స్వీకరిస్తున్నారు. ఖానాపురం మండలలో సుమారు 1,829 మంది గిరిజన రైతులు, సుమారు 700 ఎకరాల భూమిని గుర్తించారు. వీరిలో సుమారు 1200 మంది నుంచి గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఎఫ్ఆర్సీ కమిటీ సభ్యులు వివరాలు సేకరించి వ్యవసాయ అధికారులకు చేరవేస్తున్నారు. సుమారు మరో 629 మంది రైతులు ఆధార్, బ్యాంకు ఖాతాల వివరాలు అందించాల్సి ఉంటుంది. ఈనెల 30 లోపు వ్యవసాయ అధికారులకు అందజేస్తే జూలై 3 లోపు ఆన్లైన్లో నమోదు చేయడానికి అవకాశం ఉంటుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. కాగా, ఇప్పటి వరకు 560 దరఖాస్తులను వ్యవసాయ అధికారులు ఆన్లైన్లో నమోదు చేశారు. కాగా, ఇప్పటికే రైతుల వివరాలు ఆన్లైన్ చేయగా రైతు బంధు డబ్బులు సైతం ఖాతాల్లో జమ అవుతున్నట్లు రైతులు చెబుతున్నారు. నల్లబెల్లి మండలంలో 1083 మంది పోడు రైతులు హక్కుపత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కాగా, గ్రామస్థాయిలో 964 మంది రైతుల దరఖాస్తులు ఆమోదించారు. ప్రభుత్వం 906 దరఖాస్తులను ఆమోదించి, 2,700 ఎకరాలకు హక్కుపత్రాలు అందించనుంది. నెక్కొండలో 220 మంది రైతులకు 355 ఎకరాలకు, నర్సంపేట మండలంలో 120 మందికి 237 ఎకరాల భూమికి సంబంధించి హక్కుపత్రాలు అందించనుంది. ఈ మండలాల్లో కూడా అధికారులు పోడు రైతుల వివరాలు సేకరిస్తున్నారు. ఆన్లైన్ చేసేందుకు గడువు పొడిగించాలి రైతుబంధు కోసం గిరిజన రైతుల నుంచి వివరాలు సేకరించి ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఏఈఓలు ఉదయం నుంచి సాయంత్రం వరకు సుమారు 70దరఖాస్తులను ఆన్లైన్ చేస్తున్నారు. నమోదు సమయంలో సర్వర్ మొరాయిస్తోంది. ఉ దయం, రాత్రి వేళ నిత్యం కంప్యూటర్‌తో కుస్తీ పడి తే సుమారు 120 నుంచి 150 వరకు ఆన్లైన్ అవుతున్నాయి. సమయం తక్కువగా ఉండడంతో వ్యవసాయ అధికారులు సైతం ఒత్తిడికి గురవుతున్నారు. గడువు పొడిగించాలని రైతులు కోరుతున్నారు. రైతులు వివరాలు అందించాలి హక్కుపత్రాలు కలిగిన వివరాలు పంచాయతీ కార్యదర్శులకు అందాయి. వాటి ఆధారంగా గిరిజన రైతులు ఆధార్, బ్యాంకు ఖాతాల జిరాక్స్‌లను వ్యవసాయ విస్తరణ అధికారులకు లేదా పంచాయతీ కార్యదర్శులకు అందించాలి. సకాలంలో ఆన్లైన్ చేస్తేనే రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ అవ్వడానికి అవకాశం ఉంటుంది. వివరాలు అందించని రైతులు రైతుబంధును కోల్పోవాల్సి వస్తుంది. – బోగ శ్రీనివాస్, వ్యవసాయ అధికారి, ఖానాపురం -
సబ్సిడీ పథకాలకు మంగళం.. విత్తనాలు, పనిముట్లపై సబ్సిడీ ఎత్తివేత
ఇచ్చోడ(బోథ్): జిల్లాలోని అన్నదాతలు కోటి ఆశలతో వానాకాలం పంటల సాగు మొదలుపెట్టారు. మృగశిర కార్తె ప్రవేశంతో పొలం బాట పట్టారు. అయితే రైతులకు సర్కారు నుంచి ప్రోత్సాహం లభించడంలేదు. ప్రత్యామ్నాయ లాభాసాటి పంటలు వేయాలని ప్రభుత్వం సూచనలు చేస్తూనే రాయితీపై విత్తనాలు, రుణమాఫీ, వ్యవసాయ పని ముట్లు, అందించే పథకాలు క్రమంగా కనుమరుగు చేస్తోంది. రైతుబంధు పథకం వచ్చిన తర్వాత సబ్సిడీ పథకాలన్నీ ఎత్తేయడంతో రైతులు విత్తనాల నుంచి మొదలు వ్యవసాయ పనిముట్ల వరకు పూర్తి గా సొమ్ము చెల్లించి కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీంతో రైతన్నకు సాగు భారంగా మారుతోంది. రూ.8.5 కోట్ల అదనపు భారం జిల్లాలో పత్తి పంట తర్వాత అత్యధికంగా సాగయ్యే పంట సోయా. గతంలో ప్రభుత్వం సోయా విత్తనాలను రైతులకు 50 శాతం సబ్సిడీపై అందజేసేది. కానీ మూడేళ్లుగా సబ్సిడీ పూర్తిగా నిలిపేసింది. దీంతో పూర్తి ధర చెల్లించి రైతులు బహిరంగ మార్కెట్లో విత్తనాలు కొనుగోలు చేయాల్సివస్తోంది. సబ్సిడీ ఎత్తివేతతో జిల్లా రైతులపై రూ.8.5 కోట్ల అదనపు భారం పడుతోంది. జాడలేని పంటల బీమా వాతావరణ ఆధారిత పంటల బీమా పథకానికి రాష్ట్ర ప్రభుత్వం మంగళం పాడింది. కొన్నేళ్ల నుంచి పత్తి పండిస్తున్న రైతులు అతివృష్టి, అనావృష్టి కారణంగా దిగుబడులు రాక త్రీవంగా నష్టపోతున్నారు. వారికి లబ్ధిచేకూర్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఆరేళ్ల కిత్రం వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాన్ని ప్రవేశపెట్టాయి. పథకంలో 80 శాతం మంది రైతులు చేరారు. రెండేళ్ల క్రితం అతివృష్టితో నష్టపోయిన రైతులు ఎకరాకు రూ.12 వేల చొప్పున పరిహారం పొందారు. ఆతర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని నిలిపివేసింది. ఫలితంగా ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయిన రైతులు పరిహారానికి నోచుకోవడంలేదు. ‘యంత్రలక్ష్మి’కి మంగళం రైతులు ఆధునిక వ్యవసాయం చేసేందుకు సాగులో యాంత్రీకరణ పెంచేందుకు ప్రభుత్వం యంత్రలక్ష్మి పథకాన్ని ప్రవేశ పట్టింది. దీని ద్వారా చిన్న సన్న కారు రైతులకు సబ్సిడీపై ట్రాక్టర్లు, రొటోవేటర్లు, నాగళ్లు, పవర్‌స్ప్రేలు, యంత్రాలు రాయితీపై అందించేది. యంత్ర లక్ష్మి పధకాన్ని పూర్తిగా ఎత్తివేసింది. దీంతో రైతులు పనిముట్లు సైతం బయట మార్కెట్లో కొనుగోళ్లు చేయాల్సి వస్తోంది. రద్దయిన పావలా వడ్డీ పంటలపై తీసుకున్న రుణాలు మార్చి 30లోపు చెల్లించిన వారికి గతంలో పావలా వడ్డీ మాత్రమే వసూలు చేసేవారు. మిగితా వడ్డీ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేది. మూడేళ్ల కిత్రం పావలా వడ్డీని ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో రైతులకు పంట రుణాలపై వడ్డీ భారం తప్పడంలేదు. అటకెక్కిన రుణమాఫీ 2018 డిసెంబర్ 11 లోపు రైతులు తీసుకున్న రూ.లక్ష లోపు పంట రుణాలు మాఫీ చేస్తామని గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. నాలుగేళ్లు దాటినా ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. ఇప్పటి వరకు కేవలం 20 వేల మంది రైతులకు సంబంధించిన కేవలం రూ.39 వేలలోపు రుణాలు మాత్రమే మాఫీ చేశారు. మరో 80 వేల మంది రైతుల రుణాలు మాఫీ కావాల్సి ఉంది. విత్తనాలు సబ్సిడీపై అందించాలి విత్తనాలు సబ్సిడీపై అందించక పోవడంతో చిన్న సన్న కారు రైతులపై అదనపు భా రం పడుతోంది. రైతులకు సంబంధించిన పథకాలపై ప్రభుత్వం పునరాలోచించాలి. విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు సబ్సిడీపై అందించాలి. – బొర్రన్న, రైతు స్వరాజ్యవేదిక జిల్లా అధ్యక్షుడు -
తెలంగాణలో సోమవారం నుంచి రైతుబంధు సొమ్ము జమ...ఇంకా ఇతర అప్డేట్స్
తెలంగాణలో వానాకాలం సీజన్‌కు సంబంధించిన రైతుబంధు పథకం సొమ్మును ప్రభుత్వం సోమవారం నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయనుంది.
-
‘ఐదు ఎకరాల్లోపే’ రైతుబంధు ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: ఐదు ఎకరాలలోపు భూమి ఉన్న వారికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయంగా రైతుబంధు పథకాన్ని వర్తింపజేసేలా ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ, వ్యవసాయ, ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శులతోపాటు వ్యవసాయ శాఖ కమిషనర్లను ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి గతంలో రెండు పిటిషన్లు దాఖలయ్యాయని ప్రభుత్వ న్యాయవాది నివేదించారు. దీంతో ఈ వ్యాజ్యాన్ని వాటితో కలిపి విచారిస్తామని ధర్మాసనం స్పష్టం చేస్తూ తదుపరి విచారణను మార్చి 25కు వాయిదా వేసింది. హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది తల్లాడ నందకిశోర్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని (పిల్) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావలితో కూడిన ధర్మాసనం ఇటీవల విచారించింది. ‘రాష్ట్రవ్యాప్తంగా 1.43 కోట్ల ఎకరాల భూమి సాగులో ఉంది. ఇందులో మెజారిటీ వ్యవసాయ భూములను కౌలుదారులే సాగుచేస్తున్నారు. వారికి ప్రభుత్వం ఎటువంటి పరిహారం ఇవ్వడం లేదు. కొందరు రాజకీయ నాయకులకు వందలాది ఎకరాల వ్యవసాయ భూములున్నాయి. వీరికీ రైతుబంధు కింద ఆర్థికసాయం అందుతోంది. అర్హులైన ఐదెకరాలలోపు ఉన్న రైతులకు మాత్రమే ఆర్థిక సాయం అందేలా ఆదేశాలు జారీ చేయండి’ అని పిటిషన్లో కోరారు. -
రైతుబంధు.. అక్కడికెళ్తే సాయం బందు.. నిరాశగా వెనుదిరుగుతున్న రైతన్న
సాక్షి, హైదరాబాద్: యాసంగి సీజన్‌కు గాను పెట్టుబడి సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్న డబ్బులు రాష్ట్రంలో చాలామందికి అందడం లేదు. రైతులు తీసుకున్న రుణాల కింద, రుణాలకు సంబంధించిన వడ్డీల కింద ఆ మొత్తాన్ని బ్యాంకులు జమ చేసుకుంటున్నాయి. కొన్ని బ్యాంకులు రైతుబంధు నిధులు రైతులు తీసుకోకుండా వారి ఖాతాలను ముందే ‘హోల్డ్’లో పెట్టేస్తున్నాయి. అంటే వారెలాంటి లావాదేవీలు నిర్వహించడానికి వీల్లేకుండా చేస్తున్నాయన్న మాట. రుణం లేదా వడ్డీ చెల్లిస్తే కానీ ‘హోల్డ్’తీసివేయబోమని నిక్కచ్చిగా చెబుతుండటంతో.. ప్రభుత్వ సాయం కోసం ఎంతో ఆతురతతో బ్యాంకులకు వెళ్లిన రైతులకు తీవ్ర నిరాశే మిగులుతోంది. బ్యాంకర్ల వైఖరిపై కొందరు రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంట రుణాలు, వడ్డీలకు సంబంధించి కానీ, రుణాల రెన్యువల్‌కు సంబంధించి కానీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే.. సర్కారు సాయం తమకు అందకుండా ఎలా చేస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం నాటికి 57,60,280 మంది రైతులకు రైతుబంధు కింద రూ.5,294 కోట్లు పంపిణీ చేశారు. ఇందులో 10 శాతం వరకు అంటే రూ.500 కోట్లకు పైగా మొత్తాన్ని బ్యాంకులు ఈ విధంగా ‘హోల్డ్’చేయడం లేదా రుణాల కింద జమ చేసుకోవడం జరిగి ఉంటుందని వ్యవసాయ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత సీజన్లో ఇలాగే వ్యవహరించిన బ్యాంకులపై అప్పట్లో ప్రభుత్వం సీరియస్ అయినా, తీరు మార్చుకోకుండా వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు బ్యాంకర్లను పిలిపించి మాట్లాడటంలేదన్న ఆరోపణలూ విన్పిస్తున్నాయి. రూ.5,294 కోట్లు పంపిణీ పంటల సాగు సీజన్లో పెట్టుబడి సొమ్ము లేక ఇబ్బందులు పడే రైతుల్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ‘రైతుబంధు’పథకాన్ని ప్రవేశపెట్టింది. ఏడాదికి రెండుసార్లు యాసంగి, వానాకాలం సీజన్లకు ముందు ఎకరానికి రూ.5 వేల చొప్పున పెట్టుబడి సాయం కింద నిర్ణీత మొత్తాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. ఈ క్రమంలోనే యాసంగి సీజన్‌కు సంబంధించిన నిధుల పంపిణీని ప్రభుత్వం ఇటీవల ప్రారంభించింది. ఈ సీజన్లో 66.61 లక్షల మంది రైతులకు చెందిన దాదాపు 1.52 కోట్లకు పైగా ఎకరాలకు గాను రూ.7,645 కోట్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఇప్పటి వరకు 60,16,697 మంది రైతులకు రూ.6008.27 కోట్లు పంపిణీ చేశారు. అయితే తమ వద్ద రుణం తీసుకొని చెల్లించని రైతులకు బ్యాంకులు చుక్కలు చూపిస్తున్నాయి. ఆర్బీఐ చట్టం ప్రకారం రికవరీ చేయాల్సిందే: బ్యాంకు వర్గాలు రుణాలు తీసుకున్న ఖాతాదారుల నుంచి డబ్బులు తిరిగి రికవరీ చేయడం తాము సొంతగా తీసుకున్న నిర్ణయమేమీ కాదని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిబంధనల ప్రకారమే ఇది జరుగుతుందని బ్యాంకర్లు వివరిస్తున్నారు. తాము ప్రత్యేకంగా ఆపరేట్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉండదని, కంప్యూటర్ జనరేటెడ్ సిస్టమ్‌లో బ్యాంకులో ఎవరైనా ఖాతాదారుని రుణం పెండింగ్‌లో ఉంటే.. అకౌంట్లో ఏవైనా డబ్బులు జమ అయితే అవి అప్పు కింద జమ అవుతాయని అంటున్నారు. అయితే ప్రస్తుతం రైతుబంధు నిధులను రైతు రుణాల కింద జమ చేసుకుంటున్న బ్యాంకుల్లో ఎక్కువగా చిన్న బ్యాంకులే ఉన్నాయని తెలుస్తోంది. జాతీయ స్థాయిలో నడిచే పెద్ద పెద్ద బ్యాంకుల్లో ఇలాంటి సమస్యలు లేవని బ్యాంకర్లు చెపుతుండగా, వడ్ల కొనుగోలు కింద ప్రభుత్వం జమ చేసిన నిధులను కూడా అంతకుముందు తీసుకున్న అప్పుల కింద కొన్ని బ్యాంకులు బిగపడుతున్నాయని రైతులు లబోదిబోమంటున్నారు. బ్యాంకులకు గతంలోనే చెప్పాం: వ్యవసాయ శాఖ వర్గాలు రైతుబంధు నిధులను బ్యాంకర్లు రుణాల కింద జమ చేసుకోవడం సరైంది కాదని వ్యవసాయ శాఖ వర్గాలంటున్నాయి. ఆర్బీఐ నిబంధనలు ఏవైనా ఉండొచ్చు కానీ రైతులకు ప్రభుత్వం సాయం చేయడంలోని ఉద్దేశాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత బ్యాంకులపై ఉందని వారు చెబుతున్నారు. రైతుబంధు నిధులు బ్యాంకులు జమ చేసుకునే పక్షంలో, ప్రభుత్వం సాయం చేసినా ప్రయోజనం ఏముందని ప్రశ్నిస్తున్నారు. అవసరమైతే రైతులకు కొత్తగా రుణాలు ఇచ్చి, వాటిని గత రుణాల కింద జమ చేసుకోవాలని, కొత్త రుణాలను క్రమం తప్పకుండా చెల్లించేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఇదే విషయాన్ని ఇప్పటికే పలుమార్లు బ్యాంకులకు చెప్పామని, లేఖలు సైతం రాశామని తెలిపారు. తమ ఒత్తిడి కారణంగానే 2019–20లో బ్యాంకర్లు జమ చేసుకున్న రైతుబంధు సాయాన్ని తిరిగి ఇచ్చేశారని ఓ ఉన్నతాధికారి తెలిపారు. 'మహబూబ్‌నగర్ జిల్లా గండేడ్ పంచాంగల్ తండాకు చెందిన లావుడ్యా నాయక్‌కు నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. పంట రుణం కింద గతంలో గండేడ్ ఎస్బీహెచ్లో రూ.1.5 లక్షలు తీసుకున్నాడు. బ్యాంకు నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో రెన్యువల్ చేయలేదు. ప్రస్తుతం అందరి రైతుల మాదిరిగానే ఆయనకు కూడా ప్రభుత్వం నుంచి రైతుబంధు డబ్బులు రూ.20 వేలు బ్యాంక్ ఖాతాలో జమయ్యాయి. అయితే ఈ మొత్తాన్ని బ్యాంకు అధికారులు అప్పు కింద అట్టే పెట్టుకున్నారు. వారం క్రితం వరకు ఆయన బ్యాంకు ఖాతాను ‘హోల్డ్’లో (లావాదేవీల నిలిపివేత) పెట్టలేదు. కానీ రైతుబంధు పడుతోందని తెలియగానే హోల్డ్‌లో పెట్టేశారని నాయక్ తెలిపాడు. డబ్బులు తీసుకురావడానికి బ్యాంకుకు వెళ్తే పంట రుణం బాకీ చెల్లిస్తేనే రైతుబంధు డబ్బులు ఇస్తామని అధికారులు చెబుతున్నారని' వాపోయాడు -
ప్రతిరోజు లక్షలు సంపాదిస్తున్నాడు.. మళ్లీ రెండు సార్లు రైతుబంధు
హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కనకమామిడిలో భూమి కొని అందులో రిసార్ట్ నిర్వహిస్తున్నారు. పెళ్లిళ్లు, రిసెప్షన్లు, పుట్టినరోజు వేడుకల వంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రతిరోజు లక్షలు ఆర్జిస్తున్నాడు. అయితే రెవెన్యూ రికార్డుల్లో ఆ భూమి వ్యవసాయ భూమిగా నమోదై ఉండటంతో ప్రభుత్వం అందించే పంట పెట్టుబడి సాయం ‘రైతుబంధు’ఏడాదికి రెండుసార్లు అతని ఖాతాలో జమవుతోంది. మొయినాబాద్ మండలానికి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి తన వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చకుండానే మూడేళ్ల క్రితం క్రీడా మైదానం ఏర్పాటుచేసి రోజూ అద్దెకు ఇస్తున్నారు. సాధారణ సమయాల్లో రోజుకు రూ 2,000–4,000, వారాంతాల్లో రూ.8,000– 10,000 అద్దె వసూలు చేస్తున్నారు. ఇలా సంవత్సరం మొత్తం అద్దెకిచ్చే క్రీడా మైదానానికీ రైతుబంధు డబ్బులు అందుతున్నాయి. ఇదే తరహాలో జిల్లాలో వ్యవసాయేతర కార్యకలాపాలు నిర్వహించే చాలా భూముల యజమానులకు రైతుబంధు డబ్బు తేరగా వస్తోంది. మొయినాబాద్: రైతులకు ఆర్థికంగా చేయూతనందించడానికి ప్రభుత్వం 2018 మే 10న రైతుబంధు పథకాన్ని ప్రారంభించింది. పంట పెట్టుబడి సహాయం పేరుతో వ్యవసాయంచేసే ప్రతి రైతుకు ఎకరాకు ఏడాదికి రూ.8 వేల చొప్పున అందిస్తా మని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించి మొదటి విడతలో రైతుల పేరుతో చెక్కులు పంపిణీ చేసింది. ఆపై రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తోంది. 2019 నుంచి ఈ సహాయాన్ని వానాకాలం, యాసంగి పంటలకు ఎకరాకు రూ.5వేల చొప్పున ఎకరాకు సాలీనా రూ.10 వేలకు పెంచింది. తాజాగా యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతుబంధు డబ్బులను ప్రభుత్వం జమ చేస్తోంది. రికార్డుల్లో వ్యవసాయం.. క్షేత్రంలో వాణిజ్యం రైతులను ఆదుకునేందుకు ఇస్తున్న రైతుబంధు కొందరి స్వార్థం కారణంగా పక్కదారి పడుతోంది. పంటలు సాగుచేసే వ్యవసాయ భూములకు మాత్రమే ఈ సాయం అందాలనేది ప్రభుత్వ ఉద్దేశం. కానీ వ్యవసాయేతర కార్యకలాపాలు నిర్వహిస్తున్న భూములకూ రైతుబంధు డబ్బులు జమ అవుతున్నాయి. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఇటీవల క్రీడా మైదానాలు, ఫాంహౌస్‌లు, రిసార్ట్స్, ఫంక్షన్‌హాళ్లు, కన్వెన్షన్ సెంటర్లు ఎక్కువయ్యాయి. ఇవి వెలసిన భూములన్నీ రెవెన్యూ రికార్డుల్లో వ్యవసాయ భూములుగానే కొనసాగుతున్నాయి. నిబంధనల ప్రకారం పట్టా భూములకు రైతుబంధు ఇవ్వాలనే మార్గదర్శకాలకు అనుగుణంగా వీరికి యథావిధిగా సాయం అందుతోంది. దీంతో బడా వ్యాపారులు, సంపన్నవర్గాలు, సెలబ్రిటీలు, ఆ భూములను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తూ రైతుబంధును తీసుకుంటున్నారు. ఇలా రాజధాని శివార్లలోని రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో వ్యాపార కార్యకలాపాలు కొనసాగించే భూములు వేల ఎకరాల్లో ఉన్నాయి. వాటన్నింటికీ రైతుబంధు ఇస్తుండటంతో ఏటా కోట్ల రూపాయలు ‘పెద్ద’ రైతుల ఖాతాల్లోకి వెళుతున్నాయి. గుర్తించని అధికారులు రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయేతర కార్యకలాపాలు జరిగే పంట భూములను గుర్తించడంలో యంత్రాం గం విఫలమవుతోందనే విమర్శలున్నాయి. వ్యవసాయానికి కాకుండా ఇతర అవసరాలకు వాడే భూములను నాలా కింద మార్చాల్సి ఉంటుంది. కానీ చాలామంది నాలా మార్పిడి చేయకుండానే వ్యవసాయ భూములను వ్యాపార కార్యకలాపాలకు వాడుతున్నారు. ఇదిలావుండగా, 111 జీవో పరిధిలో వ్యవసాయేతర కార్యకలాపాలపై ప్రభు త్వం ఆంక్షలున్నాయి. మొత్తం విస్తీర్ణంలో కేవలం పదిశాతమే వ్యవసాయేతర అవసరాలకు విని యోగించుకోవాలనే నిబంధనలున్నాయి. దీంతో వ్యవసాయేతర భూముల మార్పిడి కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలో కొందరు బడాబాబులు, రియల్టర్లు తమ భూములను వ్యవసాయేతర అవసరాలకు మళ్లిస్తూ.. ప్రభుత్వం కళ్లుగప్పుతున్నారు. నిజమైన రైతులకు అందాలి ప్రభుత్వం ఇచ్చే రైతుబంధు నిజమైన రైతులకు అందట్లేదు. వాణి జ్య భూములకు రైతుబంధు ఇస్తున్న ప్రభు త్వం అసైన్డ్ భూములు సాగుచేసుకునే పేదరైతులకు ఇవ్వట్లేదు. వాణిస్య భూములకు రైతుబంధును నిలిపివేయాలి. పేదలకు అసైన్డ్ చేసిన భూములపై వారికే హక్కులు కల్పించి రైతుబంధు ఇవ్వాలి. – ఉప్పరి శ్రీనివాస్, అసైన్డ్ భూమి సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, మొయినాబాద్ 111 జీవో పరిధిలో నాలా కన్వర్షన్ లేదు వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే భూములను వ్యవసాయేతర భూములుగా మార్చుకోవాలి. కానీ 111 జీవో పరిధిలో నాలా కన్వర్షన్ లేదు. దీంతో ఈ ప్రాంతంలోని వ్యవసాయేతర భూములు కూడా రికార్డుల్లో వ్యవసాయ భూములుగానే ఉన్నాయి. దీనిపై ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోవాలి. – అనితారెడ్డి, తహసీల్దార్, మొయినాబాద్ -
టీ సర్కార్ గుడ్‌న్యూస్: పాస్‌బుక్ ఉన్న కొత్త రైతులకు రైతుబంధు
సాక్షి, హైదరాబాద్: పట్టాదారు పాసు పుస్తకం ఉన్న కొత్త రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ప్రస్తుత యాసంగి సీజన్లో వీరికి కూడా ‘రైతుబంధు’పథకం మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు వ్యవసాయశాఖ కమిషనర్ జిల్లా వ్యవసాయశాఖ అధికారులకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దరఖాస్తు సందర్భంగా రైతులు పాస్‌బుక్ లేదా తహసిల్దార్ డిజిటల్ సంతకంతో కూడిన పత్రం, ఆధార్‌కార్డు , బ్యాంక్ సేవింగ్ అకౌంట్ పాస్‌బుక్ జిరాక్స్‌లను జతచేయాలని తెలిపారు. (చదవండి: లక్షణాలు లేవు.. అలక్ష్యం వద్దు) -
ఈటల కావాలా? టీఆర్ఎస్ కావాలా? అన్నది చర్చ పెట్టాలి: హరీశ్ రావు
సిద్దిపేట: దళితులకు రూ.10 లక్షల నగదు సహాయం అందించే పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ దళిత బంధు పథకం’ అని పేరు ఖరారు చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై అధికార, ప్రతిపక్ష నేతలు విమర్షలు గుప్పించుకుంటున్నారు. దళితబంధు పథకానికి బండి సంజయ్ రూ.50 లక్షలు ఇవ్వాలంటున్నారని, కానీ తమ ప్రభుత్వం రూ.10 లక్షలు ఇస్తుందని హరీశ్ రావు అన్నారు. మిగతా రూ.40 లక్షలు కేంద్రం నుంచి బండి సంజయ్ తేవాలని అడిగారు. ఇక రైతు బంధు, దళిత బంధు దండగ అని ఈటల అంటున్నారని, ఈటల కావాలా? టీఆర్ఎస్ కావాలా? అన్నది చర్చ పెట్టాలని మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. హుజురాబాద్‌లో బీజేపీ ఓటు అడిగే ముందు.. రైతుబంధు, దళితబంధుపై బీజేపీ వైఖరి ప్రకటించాలని హరీశ్ రావు అన్నారు. హుజురాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని.. కేంద్ర ఎన్నికల సంఘంపై బీజేపీ ఒత్తిడి తేవాలని హరీశ్ రావు పేర్కొన్నారు. -
రైతుబంధు పథకం తరహాలో త్వరలో చేనేతబంధు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని నేత కార్మికుల సంక్షేమం కోసం రైతుబంధు తరహాలో త్వరలో చేనేతబంధు పథకాన్ని తీసుకొస్తామని సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో చేనేత, వస్త్ర పరిశ్రమ విభాగం కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు, ఈ రంగం అభివృద్ధిపై మరింత దృష్టిపెట్టేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం పరిశ్రమల శాఖకు అనుబంధ విభాగంగా ఉన్న చేనేత, వస్త్ర పరిశ్రమ విభాగాన్ని ప్రత్యేక శాఖగా ఏర్పాటు చేసి కార్యదర్శిని నియమించేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఈ శాఖకు కమిషనర్ హోదాలో ఉన్న అధికారి పనిచేస్తుండగా పరిశ్రమల శాఖ నుంచి విభజన తర్వాత కార్యదర్శి హోదాలో అధికారిని నియమించే అవకాశమున్నట్లు సమాచారం. తెలంగాణ టెక్స్టైల్ అండ్ అపెరల్ పాలసీ (టీ–టాప్)ను మరింత ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో ఈ తరహా మార్పులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. మరోవైపు చేనేత బంధు పథకం మార్గదర్శకాలకు చేనేత విభాగం తుదిరూపు ఇచ్చినట్లు తెలియవచ్చింది. 18 నుంచి 59 ఏళ్ల వయసుగల సుమారు 70 వేల మందికి ఈ పథకాన్ని వర్తింపజేసేందుకు ఇప్పటికే నేత కార్మికుల వివరాలను అధికారులు సేకరించారు. సహకార రంగంతోపాటు సహకారేతర రంగం వారికి కూడా చేనేతబంధు పథకాన్ని అమలు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. త్వరలో చేనేత బీమా పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారికంగా ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 1 నుంచి మళ్లీ ‘నేతన్నకు చేయూత’... జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ‘నేతన్నకు చేయూత’పథకాన్ని శనివారం తిరిగి ప్రారంభించనున్నారు. నేత కార్మికుల పొదుపు కోసం ఉద్దేశించిన ఈ పథకం కింద కార్మికులు తమ వంతు వాటాగా 8 శాతం నిధులు జమ చేస్తే పరిశ్రమలశాఖలోని చేనేత, వస్త్ర పరిశ్రమ విభాగం మరో 16 శాతం నిధులను జోడించనుంది. ఈ పథకం కోసం ప్రస్తుత వార్షిక బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం రూ. 338 కోట్లు కేటాయించగా నాలుగు రోజుల క్రితం ఈ పథకానికి మరో రూ. 30 కోట్లు అదనంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ పథకంపై ఆసక్తి ఉన్న కార్మికులు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి తమ వివరాలు నమోదు చేసుకొనేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో ఈ పథకం కింద 26 వేల మందికిపైగా కార్మికులు పేర్లు నమోదు చేసుకొని రూ. 31 కోట్లు పొదుపు చేయగా ప్రభుత్వం రూ. 62 కోట్లు తన వంతు వాటాగా చెల్లించింది. మూడేళ్ల తర్వాత కార్మికులు రూ. 50 వేల నుంచి రూ. 1.25 లక్షల వరకు రుణం తీసుకొనే వెసులుబాటు ఉండగా కరోనా నేపథ్యంలో గతేడాది మేలో రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలను సడలించి కార్మికులకు నిధులు విడుదల చేసింది. -
బతికున్న మహిళ పేరిట రైతు బీమా : కో ఆర్డినేటర్ లీలలు
-
ధరణి.. సంస్కరణ కాదు సంక్షోభం
సాక్షి, అదిలాబాద్: గత కాంగ్రెస్ ప్రభుత్వాలు రైతులకు ఇచ్చిన అనేక సబ్సిడీలకు కోత పెట్టి.. రైతుబంధు పేరుతో కేసీఆర్ అన్నదాతలను మోసం చేస్తున్నారని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క మండిపడ్డారు. భట్టి విక్రమార్క ఆధ్వర్యంలోని సీఎల్పీ బృందం బుధవారం రైతులతో ముఖాముఖీ కార్యక్రమాన్ని ఏర్రాటు చేసింది. ఈ కార్యక్రమంలో భట్టితో పాటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు, కిసాన్ కాంగ్రెస్ ఛైర్మన్ అన్వేష్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు భరత్ చౌహాన్, జిల్లా మహిళా కాంగ్రెస్ కార్యదర్శి దుర్గాభవానీ, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు లింగంపల్లి చంద్రయ్య, స్థానిక మండల ఇంఛార్జి పొద్దుటూరి సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కడెం రైతులతో సమావేశం అయ్యారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. రైతు బంధు పేరు మీద ప్రభుత్వం ద్వారా రావాల్సిన సహాయాన్ని, సబ్సిడీనికి కేసీఆర్ ప్రభుత్వం ఆపేసిందని రైతులకు వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న మోసాలు ప్రజలకు, రైతులుకు అర్థమవుతోందన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం కేవలం భూములున్న భూస్వాములకు, వందల ఎకరాల బీడు భూమి ఉన్న ఆసాములకు మాత్రమే ఉపయోగపడుతోంది తప్పా.. నిజంగా భూమిని దున్నే రైతులకు ఉపయోగపడడం లేదని పేర్కొన్నారు. భూమిని నమ్మి పంట పండించే రైతులకు మద్దతు ధరలేక.. పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదన్నారు. అంతేగాక గత ప్రభుత్వాలు ఇచ్చిన సబ్సిడీలు కూడా లేక... అన్నదాతలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారన్నారు. ఈ ప్రాంతంలో నాటి దివంగత కాంగ్రెస్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మొదలు పెట్టిన సదర్‌మఠ్ ప్రాజెక్టును కుట్రతోనే డిజైన్ మార్చి.. ఈ ప్రాంత వాసులకు నీళ్లు రాకుండా చేశారని భట్టి ఆరోపించారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పేద రైతుల కోసం నిర్మించిన కడెం ప్రాజెక్టు ద్వారా చివరి భూములకు నీళ్లు అందించేలా ప్రతి ఏడాది మెయింటెనెన్స్ చేయడం జరిగేదన్నారు. కానీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక మెయిటెనెన్స్ చేయకపోవడంతో కింది ప్రాంత రైతులకు నీళ్లు రావడం లేదని ఆయన ధ్వజమెత్తారు. కడెం ప్రాజెక్టు మెయింటెనెన్స్ కోసం మంజూరు చేసిన 130 మంది ఉద్యోగులను గత కాంగ్రెస్ ప్రభుత్వం నియమిస్తే.. కేసీఆర్ ప్రభుత్వం 101 మందిని తొలగించి.. కేవలం 29 మందితో ప్రాజెక్టు నిర్వహణ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 74 వేల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ అలసత్వం వహించడంపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కడెం ప్రాజెక్టును రైతులకు దూరం చేసే ఒక దుర్మార్గమైన ఆలోచన కేసీఆర్ చేస్తున్నారని మండిపడ్డారు. ధరణితో రైతులందరిని కేసీఆర్ ప్రభుత్వం సంక్షోభంలోకి నెట్టిందని భట్టి ధ్వజమెత్తారు. ధరణి అనేది సంస్కరణ కాదు.. సంక్షోభం అని ఆయన అన్నారు. రాష్ట్రంలో 95 శాతం మంది రైతులు 5 ఎకరాల్లోపు ఉన్నవారే.. వారంతా పండించిన పంటను సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లి ఎలా అమ్ముకుంటారని ప్రశ్నించారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు, ఐకేపీ సెంటర్లు కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన నల్ల చట్టాలు.. దేశ రైతాంగాన్ని వణికిస్తున్నాయని భట్టి విక్రమార్క పెర్కొన్నారు. -
మార్కెట్లో సీఎం కేసీఆర్..రందీ వడకుర్రి అంటూ..
గజ్వేల్: సిద్దిపేట జిల్లా ములుగు మండలం వంటిమామిడి కూరగాయల మార్కెట్‌ను దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. బుధవారం మార్కెట్ యార్డును ఆకస్మికంగా సందర్శించారు. మార్కెట్‌యార్డులో పంటను అమ్ముకోవడానికి వచ్చిన రైతులు, కమీషన్ ఏజెంట్లతో ఆయన మాట్లాడారు. అనంతరం సమీక్ష నిర్వహించారు. సమీక్షలో మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి, కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కూరగాయ రైతులకు భారీ ప్రయోజనం చేకూర్చేలా వంటిమామిడి మార్కెట్‌ను విస్తరించాల్సిన అవసరముందని చెప్పారు. ప్రస్తుతమున్న స్థలానికి అదనంగా మరో 14 ఎకరాలను సేకరించి 50 ఎకరాల విస్తీర్ణంలో మార్కెట్ ఉండేలా చూడాలని సూచించారు. అవసరమైతే ఢిల్లీ, కోల్‌కతాలోని కూరగాయల మార్కెట్లను సందర్శించి వాటికి దీటుగా వంటిమామిడిని తీర్చిదిద్దాలన్నారు. గజ్వేల్ ప్రాంతాన్ని ‘వెజిటబుల్ హబ్’గా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకోవాలన్నారు. 16 ప్రభుత్వ కౌంటర్లు.. ములుగు మండలం తున్కిబొల్లారం వద్ద 25 ఎకరాల భూమిని సేకరించి కోల్డ్ స్టోరేజీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. మార్కెట్లో కూరగాయల ధరలు నిలకడ లేక రైతులు నష్టపోయే పరిస్థితి ఉందని చెప్పారు. వంటిమామిడి మార్కెట్ యార్డులో ఖాళీగా ఉన్న 16 దుకాణాల్లో వెంటనే ప్రభుత్వం తరఫున కౌంటర్లు తెరిచి రైతుల వద్ద నుంచి కూరగాయలు కొనుగోలు చేయాలని, వీటిని కిలో రూ.14కు తగ్గకుండా రైతులకు చెల్లించాలని ఆదేశించారు. ఈ కూరగాయలను ప్రభుత్వ వసతి గృహాలకు, మెస్‌లకు, ఇతర సంస్థలకు పంపే ఏర్పాట్లు చేయాలని సూచించారు. అధిక కమీషన్‌పై సీఎంకు ఫిర్యాదు వంటిమామిడి మార్కెట్లో ఏజెంట్లు 8% కమీషన్ వసూలు చేస్తున్నారని పలువురు రైతులు సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు. మార్కెట్ సందర్శన సందర్భంగా పలువురు రైతులు తమ ఇబ్బందులను వివరించారు. 8 శాతం కమీషన్ వసూలుపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై 4 శాతం కమీషన్ మాత్రమే వసూలు చేయాలని ఆదేశించారు. కాగా, ఆలుగడ్డ ధర గణనీయంగా పడిపోయిన తీరుపై రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బిన్నీస్, టమాటా రైతులు కూడా తమ ఇబ్బందులను వివరించారు. సీఎం కేసీఆర్ వంటిమామిడి మార్కెట్ యార్డును సందర్శించిన సందర్భంగా రైతులతో ముచ్చటించారు. ఆ వివరాలు.. సీఎం: ఏం పెద్దమనిషి నీ పేరేంది? రైతు: మద్దికుంట కృష్ణమూర్తి. మాది తున్కిఖల్సా గ్రామం. వర్గల్ మండలం సీఎం: ఏ పంటలెక్కువ సాగు చేస్తవ్? రైతు: ఆలుగడ్డ ఎక్కువ సాగు చేస్త. సీఎం: గట్లనా.. నేను కూడా ఆలుగడ్డ సాగు చేసిన. విత్తనం ఎక్కడి నుంచి తెచ్చినవ్? రైతు: ఆగ్రా నుంచి తెచ్చిన సారూ.. 50 కిలోలకు రూ.3 వేల ధర పడ్డది. పోయినసారి వెయ్యి రూపాయలకే దొరికింది. సీఎం: అయ్యో గట్లనా.. నేను కూడా ఎక్కువ ధర పెట్టే విత్తనం కొన్న. ఆలుగడ్డ ధర ఎట్లుంది? రైతు: ఇన్నేండ్ల ఆలుగడ్డ సాగు లో నాకు లాసు ఎర్కలే. ఈ సారి మాత్రం లాసైతుంది సారూ.. 10 కిలోలకు రూ.80–110 అంటుండ్రు. గతంలో రూ.250 దాకా పలికేది. సీఎం: గంత తక్కువైందా..? అయితే లాసు కాకుండా ఏదైనా మార్గం ఆలోచిద్దాం. విత్తనాలు కూడా మీకు ఇక్కడే దొరికేటట్లు చేస్తా. మరో రైతుతో ఇలా.. సీఎం: నీ పేరేంది? ఏం చేస్తుంటవ్.. రైతు: పసుల స్వామి. మాది తున్కిమక్త, వర్గల్ మండలం. నేను రైతును, మార్కెట్లో కమీషన్ ఏజెంటును. సీఎం: ఆలుగడ్డ ధర ఎందుకు తగ్గింది? నీకేమైనా తెలుసా? రైతు: కొన్ని రోజుల దాకా ఈ మార్కెట్ నుంచి ఆలుగడ్డ విజయవాడ, ఖమ్మం, కర్ణాటకకు ఎగుమతి అయ్యేది. ఇప్పుడు ఎగుమతులు ఆగిపోయాయి. ధర తగ్గింది. సీఎం: ఇప్పుడు ధర ఎంత పలుకుతుంది ? రైతు: 10 కిలోలకు రూ.90–110 మాత్రమే పలుకుతుంది సార్. సీఎం: ఆలుగడ్డ ఎన్ని ఎకరాలల్ల సాగు చేసినవ్? రైతు: 16 ఎకరాలల్ల చేసిన సారూ.. ఈసారి నష్టం జరిగేటట్టుంది. సీఎం: ఏం రంది వడకుర్రి.. ఇబ్బందులు తీర్చే ప్రయత్నం చేస్తా. వంటిమామిడి మార్కెట్‌ను గొప్పగా తీర్చిదిద్దుతాం. దీనికి అనుబంధంగా తున్కిబొల్లారంలో కోల్డ్ స్టోరేజీని ఏర్పాటు చేస్తాం. సీజన్ ముందే తక్కువ ధరలో విత్తనాలు అందుబాటులో ఉండేలా చూస్తా. (సీఎం వీరిద్దరితోనే కాకుండా నెంటూరు గ్రామానికి చెందిన కిచ్చుగారి స్వామి, గజ్వేల్ మండలం బంగ్లా వెంకటాపూర్‌కు చెందిన మల్లేశంతోనూ సంభాషించారు) -
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్ : నియంత్రిత సాగు విధానంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో నియంత్రిత సాగు విధానం అవసరం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఆదివారం ప్రగతి భవన్లో వివిధ రకాల పంటల కొనుగోళ్లు సహా ఇతర సాగు అంశాలపై సమీక్ష జరిగిన సీఎం.. పంటల నియంత్రణ నిర్ణయంపై వెనక్కి తగ్గారు. రైతులు ఏ పంట వేయాలో ఇకపై వాళ్లదే నిర్ణయమని పేర్కొన్నారు. పంటల విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు ఉండవన్నారు. పంట కొనుగోలు ద్వారా మొత్తం రూ.7,500 కోట్లు నష్టం రావడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయం చట్టాకు అనుగుణంగా రైతులు పంటకు ఎక్కడ ఎక్కువ ధర వస్తే అక్కడే అమ్ముకోవచ్చని స్పష్టం చేశారు. గ్రామాల్లో పంట కొనుగోలు కేంద్రాలను కేంద్ర ప్రభుత్వం ఇటీవల రద్దు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా నియంత్రిత సాగు విధానం రాష్ట్రంలో తొలినుంచీ వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. దీనిపై విపక్షాలతో సహా.. రైతుల సంఘాల నేతలు సైతం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రేపటి నుంచి రైతుబంధు అలాగే తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు నగదు పంపిణీపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. రేపటి (సోమవారం) నుంచి నగదు పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 61.49 లక్షల మంది రైతులకు ఈ పథకం వర్తించనుంది. ఎకరాకు రూ.5వేల చొప్పున రూ.7,515 కోట్లు పంట సాయం అందించనున్నారు. -
రైతుబంధు సమితి కన్వీనర్‌పై హత్యాయత్నం
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): రైతుబంధు సమితి కాల్వ శ్రీరాంపూర్ మండల కన్వీనర్ నిదానపురం దేవయ్యపై మంగళవారం అర్ధరాత్రి హత్యాయత్నం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని తన ఇంట్లో దేవయ్య నిద్రిస్తున్నాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు ముసుగులు ధరించి, తలపులు తట్టారు. అన్న పిలుస్తున్నాడంటూ ఆయనను ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లారు. జమ్మికుంటకు వెళ్లే రహదారి పక్కన దేవయ్యను కొట్టి, గాయపరిచారు. అనంతరం తుపాకీతో కాల్చేందుకు ప్రయత్నించగా ఆయన దాన్ని లాక్కొని, సమీపంలోని పొలాల్లోకి విసిరేశాడు. దేవయ్య కూతురు అరవడంతో దుండగులు పారిపోయారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ఆర్అండ్బీ రహదారి పక్కన నూతనంగా ఇల్లు నిర్మించుకుంటున్నానని తెలిపారు. గ్రామానికి చెందిన కనకేశ్ అనే వ్యక్తితో భూ తగాదా ఉందని, అతనికి దారి ఎందుకు ఇవ్వడం లేదని కొందరు తనను తుపాకీతో కాల్చేందుకు ప్రయత్నించారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కూతురు సౌమ్య అరవడంతో చుట్టపక్కల వారు నిద్రలేచారని, ఇంతలో వారు పారిపోయారని పేర్కొన్నారు. మండలంలో చర్చనీయాంశమైన ఘటన నిందితులు దేవయ్యను కాలుస్తామని బెదిరించింది బొయ్య తుపాకీతోనని పోలీసులు తెలిపారు. నిజమైనదే అయితే దేవయ్య ప్రాణాలు పోయేవని కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆయనపై దాడి మండలంలో చర్చనీయాంశంగా మారింది. బాధితుడి ఫి ర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేశామని కాల్వ శ్రీరాంపూర్ ఎస్సై వెంకటేశ్వర్ తెలిపారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని, విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. -
రైతుల కళ్లలో ఆనందం
సాక్షి, మెదక్: ప్రస్తుతం కరోనా సమయంలో సైతం రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలను నిలిపివేయకుండా వాటిని కొనసాగిస్తోందని ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. రైతుబంధు కింద రూ.7,200 కోట్లు రైతుల ఖాతాల్లో జమయ్యాయని తెలిపారు. ప్రస్తుతం రైతుల కళ్లలో ఆనందం కనిపిస్తోందని.. రానున్న రోజుల్లో రైతే రాజు అనేది నిజం కానుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం చెరువులో మంగళవారం ఆయన చేప పిల్లలను వదిలారు. మెదక్ కలెక్టరేట్లో జిల్లాలో కోవిడ్ వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న చర్యలకు సంబంధించి వైద్యశాఖాధికారులతో సమీక్షించారు. అనంతరం వ్యవసాయ, విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పనుల ప్రగతిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని చెప్పారు. రైతులు మబ్బులు కాకుండా డబ్బులను చూసి సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. రైతులు పండించిన పంటను కొనుగోలు చేసి.. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. తమ ప్రభుత్వ హయాంలో రైతుబంధు, 24 గంటల ఉచిత కరెంట్ సరఫరా, ఎరువులు, విత్తనాలు సకాలంలో అందజేయడంతో పాటు ఎప్పటికప్పుడు వారి ఖాతాల్లో రైతులకు డబ్బులు జమ చేసి రైతు ప్రభుత్వం అనిపించుకున్నామని పేర్కొన్నారు. దేశంలోనే తెలంగాణ ఆదర్శ రాష్ట్రంగా నిలుపుతామని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. చేపలు, రొయ్యల ఎగుమతి దిశగా.. వర్షాకాలంలోనే కాకుండా ఎండా కాలంలో కూడా చెరువులు, కాల్వల్లో ఎల్లప్పుడూ నీరు ఉండేలా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని హరీశ్‌రావు పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మత్స్యకారులకు ప్రభుత్వం ఎంతగానో చేయూతనిస్తోందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో ఐదారు చెరువుల్లో చేప పిల్లలను వదిలే వారు.. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 80 కోట్ల చేప పిల్లలను వదిలేందుకు చర్యలు చేపడుతున్నామని వివరించారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి చేపలు, రొయ్యలను ఎగుమతి చేసే దిశగా తమ ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. కాళేశ్వరం ద్వారా ఓటీ పెట్టడం వల్ల మత్స్యకారుల ఆర్థికాభ్యున్నతితో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని ఆశాభావం వ్యసక్తం చేశారు. మత్స్యకారులు దళారులను నమ్మకుండా చేపలను సొంతంగా మార్కెటింగ్ చేసుకునేలా అవసరమైన చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. కాగా, ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణలో మెదక్ జిల్లా రోల్ మోడల్‌గా నిలిచిందని మంత్రి హరీశ్‌రావు ట్వీట్ చేశారు. -
‘రైతు బంధుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు’
సాక్షి, రాజన్న సిరిసిల్ల: రైతు బంధు ఎగ్గొడతారని ప్రతిపక్ష పార్టీల నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి కె.తారక రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ఆ ఆలోచన లేదని స్పష్టం చేశారు. రైతు బంధు పెట్టిన తరువాతనే దేశంలో ప్రధానమంత్రి పీఎం కిసాన్ యోజన పథకం ప్రవేశ పెట్టారని గుర్తు చేశారు. కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని సీఎం కేసీఆర్ ఆదుకుంటే కాంగ్రెస్ జాతీయ నాయకుడు అభిషేక్ సింగ్వీ అభినందించారని తెలిపారు. జిల్లా కేంద్రంలో మోడల్ రైతు బజారును ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ... (చదవండి: ఆహ్లాదం అంచున అగాధం!) ‘ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టాలంటే దశాబ్దాలు గడిచేవి. కాళేశ్వరం మూడేళ్లలో పూర్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌ది. ఏటికి ఎదిరీదినట్లు కాళేశ్వరం ప్రాజెక్టుతో 85 మీటర్ల నుంచి 618 మీటర్ల ఎత్తుకి నీటిని పంపింగ్ చేస్తున్నారు. ఈ ఏడాది ఆర్థికంగా ఇబ్బందులున్నా ప్రభుత్వం 12 వందల కోట్ల రుణమాఫీ చేసింది. 52 లక్షల ఖాతాల్లో రైతు బంధు జమ చేశాం. కరోన సమయంలో భౌతిక దూరాన్ని పాటిస్తూ వ్యాపారాలు చేసుకునే విదంగా రైతు బజార్ నిర్మించాం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగున్నప్పుడే తెలంగాణ బాగుంటుంది. నియంత్రిత సాగుకు కొందరు వక్ర భాష్యం చెప్తున్నారు. రాష్ట్రంలో అన్ని చోట్ల సమీకృత రైతు బజార్లు నిర్మిస్తాం. తెలంగాణ వ్యాప్తంగా మత్స్య పరిశ్రమ పెరుగుతోంది. నీలి విప్లవం రాబోతోంది. పౌల్ట్రీ రంగంలో అగ్రగామిగా ఉన్నాం. సిరిసిల్ల జిల్లాను ప్రయోగ కేంద్రంగా తీసుకోబోతున్నాం. సిరిసిల్లలో జరిగిన అభివృద్ధి అన్ని మున్సిపాలిటీల్లో జరుగుతుంది. సిరిసిల్ల నియోజకవర్గన్ని రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే అగ్రశ్రేణిలో నిలబెడతాను’అని మంత్రి పేర్కొన్నారు. (చదవండి: మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు వేయాలి: కేటీఆర్) -
చెప్పిన పంటలే వేయాలని సీఎం అనలేదు: కేటీఆర్
సాక్షి, సిరిసిల్ల : రాష్ట్రంలోని అన్ని చెరువులు, కుంటలు నింపాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని మంత్రి కేటీఆర్ అన్నారు. సిరిసిల్లలో గురువారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. యాభై ఏళ్లలో ఎన్నడూ చూడని అద్భుత దృశ్యం ప్రస్తుతం చూస్తున్నామన్నారు. ఎర్రటి ఎండల్లో చెరువులు మత్తడి దుంకుతున్నాయన్నారు. ఒకప్పుడు సిరిసిల్ల ఎడారిలాగా ఉండేదని, ఇప్పుడు ఎక్కడ చూసినా నీళ్లు దూకి పొలాలు పచ్చగా కనిపిస్తున్నాయన్నారు. అన్నం తెలియదని వెక్కిరిచ్చిన వాళ్ల చెంపపై కొట్టేలా దేశానికే అన్నం పెట్టేలా తెలంగాణ రైతులు ఎదుగుతున్నారని ప్రశంసించారు. దేశంలో తెలంగాణ రాష్ట్రం నుంచే అత్యధిక ధాన్యం కొనుగోళ్లు జరిగాయని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియానే చెప్పిందని మంత్రి గుర్తు చేశారు. (తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు నోటీసులు) దేశంలో 70 ఏళ్లలో రైతుబంధు ఇచ్చే ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని మంత్రి కేటీఆర్ అన్నారు. కరోనా కష్టకాలంలో రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా రైతులకు ఇబ్బందులు లేకుండా రైతు బంధు విడుదల చేశారని తెలిపారు. మిడ్ మానేరు నిండటంతో సిరిసిల్ల జిల్లాలో 6 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయని, దేశంలో ఇదే రికార్డు అని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ముస్సోరీలోని సివిల్ సర్వీస్ ఐఎఎస్ అధికారులకు శిక్షణలో పాఠాలుగా బోధిస్తున్నారని, ఇది తెలంగాణ రాష్ట్రానికే గర్వ కారణమని కేటీఆర్ కొనియాడారు. కరెంటు మీద ఆధారపడకుండా 2 పంటలు పండించి చూపిస్తామని తెలిపారు. తెలంగాణ వచ్చాక ఇంత త్వరగా నీళ్లొస్తాయని ఎవరూ ఊహించలేదని, సముద్రానికి 82 మీటర్ల ఎత్తులో ఉన్న మేడిగడ్డ నుంచి గోదావరి జలాలను 618 మీటర్ల పైన కొండపోచమ్మకు గోదావరి జలాలను ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చారని ప్రస్తావించారు. (తనకు వచ్చిన కష్టం మరొకరికి రాకూడదని) 1.25 కోట్ల ఎకరాల భూములకు సాగునీరిచ్చి రెండో హరిత విప్లవం తీసుకు వస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. గ్రామాల్లో రైతు బాగుంటే అన్ని కులవృత్తుల వారికి ఉపాధి దొరుకుతుందని, ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఒక రైతు బిడ్డ అని, ఆయనకు రైతుల సమస్యలు తెలుసని అన్నారు. రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి కూడా కేసీఆర్ పట్ల అపారమైన నమ్మకం ఉందన్నారు. ఏ ఒక్క పథకాన్ని ఎగ్గొట్టే ఆలోచన ప్రభుత్వానికి లేదని, ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచులు, ప్రతీ గ్రామపంచాయతీకి తిరిగి ప్రతీ రైతుకు రైతుబంధు అందేలా చూడాలని సూచించారు. (ముత్తిరెడ్డిని కలిసిన ఏపీ టీడీపీ ఎమ్మెల్యే) జులై 15 తేదీ లోపు జిల్లాలో ఏ భూమిలో ఏ పంట వేశారో అధికారులు, ప్రజాప్రతినిధులు సమగ్ర నివేదిక అందించాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. రైతు బంధు విషయంలో కొంత మంది దుష్ప్రచారం చేస్తున్నారని, వారి మాటలు నమ్మొద్దని హితవు పలికారు. రైతుల కోసం ఎన్నో పనులు చేసిన కేసీఆర్ మించిన ముఖ్యమంత్రి లేరని, రైతులకు మద్ధతు ధరకు మించి డబ్బులు రావాలన్నదే సీఎం ఆలోచన అని పేర్కొన్నారు. వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకే నియంత్రిత పంటల విధానం తెచ్చామని, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు వేయడం వల్ల రైతు ధనవంతుడు అయ్యే అవకాశం ఉందని తెలిపారు. తాను చెప్పిందే వేయాలని సీఎం కేసీఆర్ చెప్పడం లేదని, డిమాండ్ ఉన్న పంటలు వేసుకోవాలని చెబుతున్నారని పునరుద్ఘాటించారు. రైతు వేదికల ద్వారా అన్నదాతలను సంఘటితం చేసి బంగారు పంటలు పండేలా సమాలోచనలు చేసుకోవచ్చని రైతులకు కేటీఆర్ సూచించారు. -
రైతుబంధుకూ ‘లెక్కాపత్రం’
సాక్షి, హైదరాబాద్: రానున్న వానాకాలం, యాసంగి సీజన్లకు రైతుబంధు సొమ్ము విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. రెండు సీజన్లలో సీజన్‌కు ఎకరానికి రూ.5వేల చొప్పున ఇవ్వనున్న పెట్టుబడి సాయాన్ని నేరుగా రైతు ఖాతాల్లోకి ఈ–కుబేర్ ద్వారా జమ చేస్తామని, నిధుల లభ్యతను బట్టి తక్కువ విస్తీర్ణం ఉన్న రైతులకు తొలి ప్రాధాన్యమిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం జనవరి 23, 2020న భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) ఇచ్చిన పట్టాదారుల రికార్డుల ఆధారంగా రైతుబంధు పంపిణీ చేస్తారు. కాగా, రైతుల ఖాతాల్లో నగదు జమయిన తర్వాత రికార్డులను ఆడిట్ టీంలు పరిశీలిస్తాయి. వ్యవసాయ శాఖ నియమించిన ఆడిటర్లు లేదా కాగ్ ప్రతినిధులు ఆడిటింగ్‌లో పాల్గొంటారు. నాబార్డు, కాగ్, ఆర్బీఐ నిబంధనలకనుగుణంగా తనిఖీలుంటాయి. ‘రైతుబంధు’ అమలుకు మార్గదర్శకాలివే.. ► ఈ ఆర్థిక సంవత్సరానికి అవసరమైన బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించిన సమయంలో సీసీఎల్ఏ ఇచ్చిన రికార్డుల ఆధారంగా భూమి యజమానులకు మాత్రమే రైతుబంధు వర్తిస్తుంది. ఆ తర్వాత రికార్డుల్లో పేర్లు మారినా కొత్త రైతులకు మాత్రం మళ్లీ వానాకాలం నుంచే రైతుబంధు వర్తింపజేస్తారు. రబీలోనూ వీరిని పరిగణనలోకి తీసుకోరు. ► సీసీఎల్ఏ నుంచి ఏడాదికి ఒక్కసారే అర్హులైన రైతుల వివరాలు తీసుకుంటారు. అంటే జనవరి 23, 2020న తీసుకున్న రికార్డుల్లో మార్పులు చేయాలనుకుంటే ఏడాది వరకు ఆగాల్సిందే. ► గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ ఇచ్చిన జాబితా ఆధారంగా అటవీ భూములపై హక్కు పత్రాలు (ఆర్వోఎఫ్ఆర్)న్న రైతులకూ రైతుబంధు వర్తిస్తుంది. పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం పాలితం గ్రామ హామ్లెట్ కాసులపల్లిలో రంగనాయకస్వామి దేవాలయ భూములను దీర్ఘకాలికంగా సాగు చేసుకుంటున్న 621 మంది రైతులకు కూడా ఆర్వోఎఫ్ఆర్ తరహాలో ప్రత్యేక కేసు కింద పరిగణించి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఇచ్చే విస్తీర్ణపు అంచనా మొత్తానికి రైతుబంధు వర్తింపజేస్తారు. ► ఒక రైతుకు సంబంధించిన భూమి రాష్ట్రంలో ఎక్కడున్నా సదరు రైతు ఆధార్ వివరాల ఆధారంగా అన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటారు. ► గత మూడు సీజన్ల తరహాలోనే ఈ–కుబేర్ వ్యవస్థ ద్వారా నేరుగా రైతు ఖాతాల్లోకే నిధులు జమ చేస్తారు. ► ఆర్థిక శాఖ నుంచి రైతుబంధు నిధులు దశలవారీగా వస్తే.. తక్కువ విస్తీర్ణం ఉన్న రైతుల నుంచి ఎక్కువ విస్తీర్ణం ఉన్న రైతుల వరకు బిల్లులు ప్రాధాన్యతా క్రమంలో పాస్ అవుతాయి. ► ఎవరైనా రైతు పెట్టుబడి సాయం వద్దనుకుంటే మండల వ్యవసాయ విస్తరణాధికారి లేదా వ్యవసాయ అధికారికి ‘గివిట్ అప్’ దరఖాస్తు పూర్తిచేసి ఇవ్వాలి. తద్వారా రైతుబంధు పోర్టల్‌లో ఆ పట్టాదారు కాలమ్‌లో ‘గివిట్‌అప్’ అని నమోదుచేస్తారు. ► ఈ పథకం అమలు పర్యవేక్షణకు రాష్ట్రస్థాయిలో కమిటీ ఏర్పాటుచేశారు. కమిటీ చైర్మన్‌గా వ్యవసాయ శాఖ కార్యదర్శి, కన్వీనర్‌గా కమిషనర్, సభ్యులుగా ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి, రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ కన్వీనర్, రాష్ట్ర సమాచార అధికారి (ఎన్ఐసీ) ఉంటారు. ► కలెక్టర్ల మార్గదర్శనం మేరకు జిల్లాస్థాయిలో వ్యవసాయ అధికారులు పథకం అమలు బాధ్యతలు తీసుకుంటారు. ► మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో ఏర్పా టు చేసుకునే వ్యవస్థల ఆధారంగా, రెవెన్యూ శాఖతో సంప్రదింపులు జరుపుతూ జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో పథకం అమ లుకు సంబంధించిన ప్రతి వినతిని 30 రోజుల్లోగా పరిష్కరించాల్సి ఉంటుంది. -
చిన్న రైతుకే తొలి సాయం!
సాక్షి, హైదరాబాద్: పెట్టుబడి సాయాన్ని తక్కువ విస్తీర్ణం ఉన్న రైతులకు ముందుగా ఇవ్వాలని వ్యవసాయ శాఖ భావిస్తోంది. పట్టాదారుల వివరాలను ఏఈఓలు నమోదు చేసిన వెంటనే చిన్న కమతాల నుంచి మొదలుపెట్టి పెద్ద కమతాల రైతులకు రైతుబంధు సొమ్మును జమ చేయనుంది. సీసీఎల్ఏ ఇప్పటికే జనవరి వరకు డిజిటల్ సంతకాలు అయిన పట్టాదారుల వివరాలను రాష్ట్ర వ్యవసాయ శాఖకు సమర్పించింది. ఇందులో 59.30 లక్షల మంది పట్టాదారులుండగా, వీరికి 1.47 కోట్ల ఎకరాల విస్తీర్ణం ఉంది. ఆర్ఓఎఫ్ఆర్ రైతుల సంఖ్య, విస్తీర్ణం కలిపితే ఈ మొత్తం మరింత పెరుగుతుంది. సీసీఎల్ఏ ఇచ్చిన సమాచారంలో దాదాపు 8 లక్షల మంది రైతుల ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలు లేవు. ప్రస్తుతం వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్రస్థాయిలో వీటిని సేకరించే పనిలోఉన్నారు. ఒకట్రెండు రోజుల్లో ఈ ప్రక్రియ ముగియనున్నట్లు తెలుస్తోంది. పంటలు ఫ్రీజ్ చేసిన వివరాలతో రైతుబంధు సొమ్మును జమ చేయనుంది. తాజాగా సీసీఎల్ఏ మరో డేటాను వ్యవసాయ శాఖకు పంపినట్లు తెలిసింది. దీని ప్రకారం మునుపు ఇచ్చిన దానికంటే ఎక్కువ విస్తీర్ణం, ఎక్కువ పట్టాదారులు ఉన్నట్లు సమాచారం. సాగునీటి ప్రాజెక్టులకు, ఇతర వ్యవసాయేతర వాటికి బదలాయించిన భూములను ఇందులో నుంచి తీసివేసినట్లు తెలిసింది. ఈ వివరాలను వ్యవసాయ శాఖ ఏఈఓలకు అందుబాటులో ఉంచుతుందా లేదా అనేది తెలియాలి. -
వీఆర్ఓ ఆత్మహత్య
నార్కట్‌పల్లి: పని ఒత్తిడి భరించలేక ఓ వీఆర్ఓ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం నెమ్మాని గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పంగ కృష్ణయ్య (46) కట్టంగూర్ మండలం పరడ గ్రామంలో వీఆర్ఓగా విధులు నిర్వర్తిస్తున్నారు. పాసు పుస్తకాలు అందడం లేదని, రైతుబంధు పథకానికి దూరమవుతున్నామని పలువురు రైతులు ఇటీవల కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కలెక్టర్.. రైతుల సమస్యలను పరిష్కరించాలని ఇన్చార్జి తహసీల్దార్ మహ్మద్ అలీని ఆదేశించారు. దీంతో ఈ నెల 7న కృష్ణయ్యతో పాటు మరో ఐదుగురికి చార్జీ మెమోలు జారీ చేశారు. పని ఒత్తిడితో పాటు మెమో రావడంతో మనస్తాపానికి గురైన కృష్ణయ్య.. తన పొలం వద్ద పురుగుల మందు తాగాడు. చుట్టుపక్కల రైతులు గమనించి వెంటనే నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. పని ఒత్తిడితోనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని భార్య పుష్పలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విజయ్‌కుమార్ తెలిపారు. బదిలీ చేయాలని విజ్ఞప్తి గ్రామంలో పని ఒత్తిడి తీవ్రంగా ఉందని, తనను బదిలీ చేయాలని కృష్ణయ్య.. తహసీల్దార్‌ను కోరగా, ఈ నెల 20వ తేదీ తర్వాత చేస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈలోపే అతను ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. -
పట్టా.. పరేషాన్
సాక్షి, జనగామ: రైతులను పట్టాదారు పాస్‌బుక్కులు పరేషాన్ చేస్తున్నాయి. చట్టాల్లోని లొసుగులను ఆసరాగా చేసుకొని రైతుల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకోవడానికి అవినీతి అధికారులు ప్రయత్నిస్తుండడంతో ఇక్కట్లు తప్పడం లేదు. అర్హత ఉన్నప్పటికీ పట్టాలు మాత్రం అందించడం లేదు. పట్టాదారు పాస్ బుక్కులు రాక పోవడంతో నిత్యం కార్యాలయాల చుట్టూ రైతులు ప్రదక్షిణలు చేయక తప్పడం లేదు. పట్టాలు చేతికి రాకపోవడంతో ప్రభుత్వపరంగా రైతులకు అందాల్సిన సౌకర్యాలు రాక పోవడంతో అరిగోస పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 12మండల్లాల్లో 5,62,573 ఎకరాల భూ విస్తీర్ణం ఉంది. అందులో 3,42,635 ఎకరాల సాగు భూమి ఉంది. 193 రెవెన్యూ గ్రామాల్లో 1,50,847 సర్వే నంబర్లలో భూమి విస్తీర్ణం విస్తరించి ఉంది. బచ్చన్నపేట: పై ఫొటోలో కనిపిస్తున్న మహిళా రైతు బచ్చన్నపేట మండలం ఇటుకాలపల్లి గ్రామానికి చెందిన కాకల్ల పద్మ. 2011 సంవత్సరంలో తన భర్త (బాలయ్య) చనిపోగా పద్మ మామ అయిన కాకల్ల సాయిలు పేరు మీద ఉన్న నాలుగు ఎకరాల భూమిని తన ముగ్గురు కుమారుల పేరున 2017 సంవత్సరంలో రిజిస్ట్రేషన్ చేయించాడు. ఒక్కొక్కరికి 1.14 ఎకరాల చొప్పున పట్టేదార్ పాస్ పుస్తకాలు కూడా వచ్చాయి. కానీ ఇంత వరకు రైతుబంధు, ప్రధానమంత్రి కిసాన్ యోజన డబ్బులు రావడం లేదు. ఇదేమిటని వ్యవసాయ అధికారులను అడిగితే రికార్డులు సరిగా చేయలేదని, అందుకే డబ్బులు రావడం లేదని అంటున్నారు. వ్యవసాయ కార్యాలయానికి వెళితే తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లమని, అక్కడకు వెళితే ఇక్కడకు వెళ్లమని తిప్పించుకుంటున్నారు. మా బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. ఈ సమస్య ఒక్క పద్మదే కాదు జిల్లాలోని పలువురి రైతుల పరిస్థితి ఇలానే ఉంది. తప్పని తిప్పలు.. పట్టాదారు పాసుబుక్కుల కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. 2017, సెప్టెంబర్ 17వ తేదీ జిల్లాలో భూ ప్రక్షాళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లా వ్యాప్తంగా 1,50,847 సర్వే నంబర్లను పరిశీలన చేశారు. ఇప్పటి వరకు 1,45,993 పట్టాదారు పాసు పుస్తకాలను అందించారు. 4,854 పట్టాదారు పాసు పుస్తకాలను పార్ట్–బీలో పెట్టారు. పెండింగ్‌లో ఉన్న పట్టాదారు పాసుపుస్తకాల కోసం రైతులు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. వసూళ్ల దందా.. పట్టాదారు పాసుబుక్కులను రైతులకు ఇవ్వడానికి రెవెన్యూ అధికారులు బహిరంగంగానే డబ్బులను డిమాండ్ చేస్తున్నారు. పట్టాదారు పాసుబుక్కులను తీసుకోవడానికి సాదాబైమానా పత్రాలను అనుమతి ఇచ్చింది. దీంతో క్షేత్రస్థాయిలోని వీఆర్ఓలు చేతివాటానికి తెరతీశారు. పట్టాదారు పాసుబుక్కుల కోసం మీ సేవలో మ్యూటేషన్ చేసిన రైతులకు కేవలం 45 రోజుల్లో పట్టాను అందించాల్సి ఉంది. కాని విచారణ పేరుతో రెవెన్యూ అధికారులు తమకు డబ్బులు కావాలని కాలయాపన చేస్తున్నారు. ఎకరానికి రూ.10 నుంచి రూ. 20వేల వరకు తీసుకుంటున్నారు. వ్యవసాయ భూములకు ధరలు పెరగడంతో అధికారులు సైతం ఎక్కువ మొత్తంలో డిమాండ్ చేస్తున్నారు. ఎక్కువ ధర ఉన్న భూమలకు మరింత ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో అధికారులు అడిగినంత ముట్టచెప్పినప్పటికీ పట్టాలు మాత్రం చేతికి అంతక ఇక్కట్లు పడుతున్నారు. పథకాలకు దూరం... పట్టాదారు పాసుబుక్కులు రాకపోవడంతో రైతులు ప్రభుత్వ పథకాలను అందుకోలేక పోతున్నారు. రైతుబంధు, రైతుబీమా, కిసాన్ యోజన వంటి పథకాలకు అర్హులు కాలేక పోతున్నారు. ప్రభుత్వ పథకాలకు నోచుకోక పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తమకు భూములు ఉన్నప్పటికీ పట్టాదారు పాసుబుక్కులు లేని కారణంగా ప్రభుత్వ పథకాలకు అర్హులు కాకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. రెండేళ్లుగా తిరుగుతున్నా.. మా అమ్మ లచ్చవ్వ పేరు మీద ఉన్న బచ్చన్నపేట మండలం కట్కూర్ గ్రామ శివారులో ఏడు ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని నా కుమారుడి పేరుమీద పట్టా చేయాలని వీఆర్ఓను సంప్రదించాను. దీనికి ఆయన కొంత డబ్బులు అవసరమని తెలపడంతో అడిగిన డబ్బులు ఇచ్చా. నా పనిని గత రెండేళ్లుగా పెండింగ్‌లో పెట్టాడు. రైతుబంధు, కిసాన్ యోజన డబ్బులు ఇంత వరకు రాలేదు. రైతు బీమా బాండ్లు కూడా రాలేదు. ఏ అధికారికి చెప్పినా సమస్యను పట్టించుకోవడం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు.– గొడుగు సిద్ధిరాములు, రైతు తిప్పుకుంటున్నారు.. స్టేషన్‌ఘన్‌పూర్ మండలం నమిలిగొండ గ్రామ శివారులో దాదాపు 40 ఏళ్ల క్రితం రెండు ఎకరాల భూమి కొనుగోలు చేశాం. అప్పటి నుంచి సదరు భూమిలో మేమే కాస్తులో ఉన్నాం. పట్టాదారు పాసుపుస్తకం కోసం తిరుగుతున్నా.. ఇంతవరకు అధికారులు స్పందించడం లేదు. ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు, బ్యాంకులో అందించే క్రాప్లోన్లు రావడం లేదు. రెవెన్యూ రికార్డులో తప్పుగా మరొకరి పేరు ఉండటంతో రెవెన్యూ అధికారులు పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వడం లేదు. దీంతో ఏళ్ల తరబడి రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాం. అధికారులు స్పందించి విచారణ చేపట్టి పట్టాదారు పుస్తకం అందించి ఆదుకోవాలి.– నీల ఇంద్రమ్మ, శివునిపల్లి వీఆర్వోలు మారిన పట్టా రాలేదు.. పట్టాదారు పాసుబుక్ కోసం తిరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదు. 1బీ పహణీలో వస్తున్నది. ఫొటో తప్పుగా వచ్చింది. తప్పుగా వచ్చిన ఫొటోను సరిగా చేయాలని తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా. ఇప్పటికీ ఇద్దరు వీఆర్వోలు మారిన కొత్త పట్టా పాస్‌బుక్ రాలేదు.– అనపర్తి చంద్రయ్య, వావిలాల రైతు -
రైతుబంధును గల్ఫ్ కార్మికులకు కూడా వర్తింపచేయండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోన్న రైతుబంధు పథకాన్ని గల్ఫ్ వెళ్లిన రైతులకు కూడా వర్తింప చేయాలని తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నంగి దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. గల్ఫ్ దేశాలలో ఉన్న సుమారు ఒక లక్షమంది సన్నకారు, చిన్నకారు రైతులకు వర్తింపచేయాలని మాజీ దౌత్యవేత్త, రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి డా. బీ.ఎం.వినోద్ కుమార్, ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరమ్ (ప్రవాసి సంక్షేమ వేదిక) అధ్యక్షులు మంద భీంరెడ్డి, నంగి దేవేందర్ రెడ్డి ఆదివారం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి వినతిపత్రం అందించారు. దీనిపై గతంలోనే ముఖ్యమంత్రి కార్యాలయంలో వినతిపత్రం సమర్పించిన విషయం తెలిసిందే. వలస వెళ్లిన వారిలో వ్యవసాయం దెబ్బతిని, బోర్లు తవ్వించి అప్పులపాలై పొట్ట చేతపట్టుకుని గల్ఫ్ దేశాలకు వెళ్లినవారే ఉన్నారని వారు అన్నారు. భూమిని నమ్ముకుని బతికిన బక్క రైతులు వ్యవసాయం దెబ్బతినడం మూలంగానే విదేశాలకు వెళ్లారని, అలాంటి వారిని ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆదుకోవాలి కోరారు. ‘‘ప్రభుత్వం భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టి రైతులందరికీ కొత్త పాసుపుస్తకాలు, ఎకరాకు పంటకు రూ.4 వేల చొప్పున పెట్టుబడిసాయం, ప్రతీ రైతుకు రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నారు. కానీ విదేశాలకు వలస వెళ్లిన బడుగు రైతులకు ఈ సాయం అందక ముఖ్యంగా గల్ఫ్‌కు వెళ్లిన వలసకార్మికులు నష్టపోతున్నారు. స్వయంగా భూ యజమాని వచ్చి తమ పేరిట ఉన్న పాసుపుస్తకాన్ని, రైతుబంధు చెక్కు అందుకోవాలని, బీమా ఫారంపై సంతకం చేయాలనే నిబంధన వలసరైతుల పాలిట శాపమైంది. గల్ఫ్ దేశాల నుండి ప్రత్యేకంగా ఇందుకోసం రావాయాలంటే ఎంతో వ్యయంతో కూడుకున్న పని’’అని వారు అభిప్రాయపడ్డారు. ఈమేరకు ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారు. ‘‘రైతుబంధు పెట్టుబడిసాయం చెక్కులను గల్ఫ్ వెళ్లిన రైతుల ఎన్ఆర్ఓ (నాన్ రెసిడెంట్ ఆర్డినరీ) బ్యాంకు అకౌంట్లలో లేదా వారి కుటుంబ సభ్యుల అకౌంట్లలో జమచేయాలి. మండల వ్యవసాయ అధికారి లేదా తహసీల్దార్ ఎన్నారై రైతుల నుండి ఇ-మెయిల్ ద్వారా ఒక అంగీకార పత్రాన్ని తెప్పించుకోవాలి. ఎన్నారై రైతుల వ్యవహారాలను చూడటానికి వ్యవసాయ శాఖ కమిషనరేట్ లో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి’’ అని పేర్కొన్నారు. -
రైతు రుణమాఫీపై స్పష్టత ఇవ్వాలి : కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి 7 మాసాలు గడుస్తున్నా రైతులకు ఇప్పటి వరకు ఎలాంటి సహాయం చేయలేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో రైతులకు లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పిన టీఆర్ఎస్.. ఈ అంశంపై ఇప్పటి వరకు స్పందించలేదని మండిపడ్డారు. అసలు రుణమాఫీ ఒకేసారి చేస్తారా, విడతల వారీగా చేస్తారా అనే స్పష్టత ఇవ్వాలన్నారు. రైతు బంధు పథకం పై గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం ఇప్పవరకు కేవలం 50 శాతం రైతులకు మాత్రమే రైతు బంధు చెక్కులు అందాయన్నారు. రైతులు చెల్లించాల్సిన ఏడు శాతం వడ్డిలో ప్రభుత్వం నాలుగు శాతం చెల్లిస్తే మిగతా మూడు శాతం రైతులు చెల్లించి వడ్డీ లేకుండా లక్ష రూపాయల రుణం పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. గత రుణం చెల్లిస్తినే కొత్త రుణం ఇస్తామని బ్యాంకులు చెప్పటంతో రైతులు ఆందోళన చెందుతున్నారని, దీనికి చర్యగా ప్రభుత్వం బ్యాంకులు వెంటనే కొత్త రుణాలను జారీ చేసేలా ఆదేశించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం బ్యాంకర్స్‌తో మీటింగ్ ఏర్పాటు చేసి మిగతా నాలుగు శాతం కేంద్రం నాబార్డ్ ద్వారా చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని మండిపడ్డారు. -
పథకాలు బాగు.. ‘కారు’ సారే కావాలి
సాక్షి, నెట్వర్క్ : ‘ప్రభుత్వ పథకాలు బాగున్నాయి.. వీటిని అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించాలి. అప్పుడే అందరికీ న్యాయం జరుగుతుంది..’ ‘సంక్షేమ పథకాల అమలు బాగానే ఉంది.. అయితే, ఆ మేరకు ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించాలి. ఏటా నిధుల శాతం పెంచాలి. అప్పుడే లబ్ధిదారుల జీవన ప్రమాణాలు మారతాయి..’ ‘రైతుబంధు భేష్.. రైతుబీమా ఇంకా బాగుంది. అయితే, భూమి పట్టా సమస్యలున్నాయి. వీటిని కూడా పరిష్కరిస్తేనే రైతులందరూ సంతోషంగా ఉంటారు..’ ‘నిరంతర విద్యుత్, మిషన్ కాకతీయ పథకాలు గణనీయమైన మార్పు తెచ్చాయి. వ్యవసాయ రంగం స్థితిగతులనే మార్చేశాయి..’ ఇవీ ‘సాక్షి’ రోడ్డు షోలో వివిధ వర్గాల ప్రజల నుంచి వ్యక్తమైన అభిప్రాయాలు... తెలంగాణ రాష్ట్ర సమితి సర్కారు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు బాగున్నాయని కితాబిచ్చిన ప్రజలు.. వాటిని నిరంతరం మెరుగుపరుస్తూ కొనసాగించాలని ఆకాంక్షించారు. అప్పుడే సమాజంలోని అన్ని వర్గాలకూ న్యాయం చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్కే మద్దతునిస్తామని పలువురు ముక్తకంఠంతో చెప్పారు. అయితే, బీజేపీ పెద్దనోట్ల రద్దుతో రోడ్డున పడ్డామని పలువురు వాపోయారు. తమ డబ్బులు తాము బ్యాంకుల నుంచి తీసుకోవడానికి కూడా నానాపాట్లు పడ్డామని గుర్తు చేసుకున్నారు. రేణుకా చౌదరి (కాంగ్రెస్), నామా నాగేశ్వరరావు (టీఆర్ఎస్), వెంకట్ (సీపీఎం).. తలపడుతున్న ఖమ్మం లోక్‌సభ స్థానంలో జనం స్పందన తెలుసుకునేందుకు ‘సాక్షి’ రోడ్డు షో నిర్వహించింది. రాష్ట్ర సర్కారు పాలన ఎలా ఉంది? ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతునిస్తారు? కేంద్రంలో ఎవరు/ ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది?, పుల్వామా దాడులతో సహా ఇంకా ఏయే అంశాలు ఈ ఎన్నికల్లో ప్రభావం చూపుతాయని అనుకుంటున్నారు? అని ‘సాక్షి’ ప్రశ్నించగా, పలువురు భిన్నంగా స్పందించారు. అభివృద్ధికి బాటలు వేసుకుంటాం.. కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టి.. అమలు చేస్తున్న రైతుబంధు, రుణమాఫీ, నిరంతర విద్యుత్, మిషన్ కాకతీయ పథకాలు బాగున్నాయని, వీటి వల్ల వ్యవసాయ రంగంలో చాలా మార్పులు వచ్చాయని పలువురు చెప్పారు. ముసలిమడుగుకు చెందిన వ్యవసాయ కూలీ సీహెచ్.సెల్వరాజ్, తల్లాడకు చెందిన దినసరి కూలీ జి. లక్ష్మణ్‌రావు, అన్నారుగూడెంకు చెందిన వ్యవసాయ కూలీ ఎస్.వెంకటేశ్వరరావు, రెడ్డిగూడెంకు చెందిన కౌలు రైతు వెంకటరెడ్డి మాట్లాడుతూ ‘మిషన్ కాకతీయతో చెరువులు నిండాయి. దీంతో రైతులకే కాక మత్స్యకారులకూ ఉపాధి లభిస్తోంది’ అని తెలిపారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగిన రోడ్డు షోలో ‘సాక్షి’ బృందం పలకరించిన వారిలో ఎక్కువ మంది ‘ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్కే పట్టం కడతామని, అభివృద్ధికి బాటలు వేసుకుంటా’మని చెప్పడం విశేషం. పెద్దనోట్ల రద్దుతో మస్తు తిప్పలాయె.. ఈ లోక్‌సభ ఎన్నికల్లో అభివృద్ధి కాముకులకే పట్టం కడతామని జనం అంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు. జీఎస్టీ, పెద్దనోట్ల రద్దు, బ్యాంకు లావాదేవీల్లో నెలకొన్న సమస్యల కారణంగా బీజేపీ సర్కారుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. మోదీ హయాంలో శాంతిభద్రతల విషయంలో కొంతమేర బాగానే ఉన్నప్పటికీ.. ఆర్థిక వ్యవస్థ మాత్రం చిన్నాభిన్నమైందని, తాము తీవ్ర ఇబ్బందులపాలయ్యామని రైతులు చెప్పారు. బ్యాంక్‌లో దాచుకున్న సొమ్ము సమయానికి చేతికందక విసిగి పోయామని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ హయాంలో పాలన ఆశించినంత బాగా జరగలేదని కొంతమంది కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. మరికొందరు మాత్రం దేశంలోఎన్డీయే ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. రాహుల్‌గాంధీపై నమ్మకం లేదని కొందరు చెప్పగా, ఇంకొందరు మాత్రం కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే రావాలని, ప్రభుత్వం మారితే తప్ప సామన్యుడికి మేలు జరగదని అభిప్రాయపడ్డారు. ఎండిన పత్తి.. మిర్చి ‘సాక్షి’ బృందం ప్రయాణించిన వివిధ మార్గాల్లో భిన్న దృశ్యాలు కనిపించాయి. ఖమ్మం రూరల్ మండలం ఆరెంపుల, కొండాపురం, చింతపల్లి, తిరుమలాయపాలెం మండలం తిరుమలాయపాలెం, పిండిప్రోలు, దమ్మాయిగూడెంలో ప్రధానంగా మిర్చి, పత్తి పొలాలు నీళ్లులేక ఎండిపోయిన దృశ్యాలు కళ్లకు కట్టాయి. ఖమ్మం నుంచి వరంగల్ వెళ్లే ప్రధాన రహదారి వెంబడి ఎక్కడ చూసినా ఎండిన చేలే కనిపించాయి. పంటలు ఎండిపోయి ఆర్థికంగా నష్టపోయామని తమను పలకరించిన రైతులు తెలిపారు. ప్రభుత్వం త్వరితగతిన సీతారామ పథకం ద్వారా సాగునీరు అందించాలని పాలేరు నియోజకవర్గ ప్రజలు కోరారు. సాగర్ జలాల ప్రభావం ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ ప్రాంతం నాగార్జునసాగర్ రెండో జోన్ పరిధిలోకి వస్తుంది. ప్రభుత్వం యాసంగి పంటకు సాగర్ జలాలు అందటం లేదు. దీంతో రైతులు ఒకింత అసహనంతో ఉన్నారు. సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక దఫా, సండ్ర వెంకటవీరయ్య మరో దఫా సాగర్ జలాలను విడుదల చేయించారు. దీంతో చివరి దశలో పంటలకు జీవం పోసినట్లయింది. ‘సాగర్ జలాల విడుదల అంశం ఈ ఎన్నికల్లో తప్పకుండా ప్రభావం చూపిస్తుంది’ అని చెప్పాడు ఖమ్మం శివార్లలోని టేకులపల్లికి చెందిన చిలకల నారాయణ. ‘సాగర్ జలాలు అందిన కొందరు రైతులు సంతోషంగా ఉన్నారు. అందని రైతులు పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయారు’ అని ఆయన పరిస్థితిని వివరించారు. పాలన మస్తుంది.. కేసీఆర్ పాలనలో అధికారులు పనులు వెంటనే చేస్తున్నారు. అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కూడా బాగున్నాయి. కేంద్రంలో మాత్రం మోదీ ప్రభుత్వమే రావాలి. – టి.మురళి, దినసరి కార్మికుడు కేంద్రంలోనూ ‘కారే’ రావాలి.. చిన్నచిన్న దుకాణాలు నడుపుకునే మాలాంటి వాళ్లకు కేసీఆర్ ఎంతో సహాయం చేస్తున్నారు. కేంద్రంలో కూడా కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ వస్తేనే బాగుంటుంది. అనుకున్న పనులను ఒత్తిడి తెచ్చి చేయించుకోవచ్చు. – షేక్ షమీన్, ఆరెంపుల ఓట్లప్పుడే వచ్చుడు.. మా గురించి ఎవరూ పట్టించుకునే వారెవరూ లేరు. ఓట్ల సమయంలోనే ఉరుక్కుంటూ మా దగ్గరికి వస్తరు. ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే మంచిది. కాంగ్రెస్ వస్తే కేంద్రంలో బాగుంటది. – టి.వీరభద్రం, తిరుమలాయపాలెం కౌలు రైతులకు సాయం టీఆర్ఎస్ సర్కారు అందిస్తున్న పెట్టుబడి సహాయంతో రైతులు సంతోషంగా ఉన్నారు. అలాగే కౌలు రైతులకు కూడా సహాయం చేయాలి. ఎక్కువ సీట్లు టీఆర్ఎస్కు వస్తే మంచిది. – తోట సైదులు, తిరుమలాయపాలెం ‘కారే’ రాబడతది.. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. మోదీ పాలనలో బ్యాంకుల ముందు బారులు తీరినం. రాష్ట్రంలో టీఆర్ఎస్ గాలి వీస్తోంది. కేసీఆరే ఎక్కువ సీట్లు రాబడుతడు. – మిడియం లక్ష్మయ్య, ఆనందపురం ఆ పార్టీకే మొగ్గు.. గతంలో ఎన్నికలప్పుడు తండాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇంతవరకూ పనులు చేపట్టలేదు. ఈ ప్రభావం అధికార పార్టీ మీద తప్పకుండా ఉంటుంది. ఖమ్మంలో గెలుపు అవకాశాలు కాంగ్రెస్‌కే ఎక్కువ. కేంద్రంలో మాత్రం బీజేపీకే అవకాశం. – బి.రవి, వ్యాపారి. అధికారం మూడో ఫ్రంట్‌దే బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యింది. బ్యాంక్‌లో దాచుకున్న డబ్బు సమయానికి చేతికి అందక విసిగిపోయాం. కేసీఆర్ చెబుతోన్న ఫెడరల్ ఫ్రంట్కే అవకాశం కనిపిస్తోంది. – జి.సోమేశ్వరరావు, పాల్వంచ. అందరి సంతోషం కోసం.. అన్ని వర్గాల వారు సంతోషంగా ఉండాలంటే... అది కాం గ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం. బడుగు, బలహీన వర్గాల వారికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. నేను కాంగ్రెస్‌కే మద్దతునిస్తా. – కొరదల సరస్వతి, మహిళా రైతు, సుజాతనగర్ -
శరత్ తప్పుదోవ పట్టించాడు
నెన్నెల (బెల్లంపల్లి): మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం నందులపల్లికి చెందిన యువ రైతు కొండపల్లి శరత్ సీఎం కేసీఆర్‌కు అబద్ధాలు చెప్పి ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించాడని కొండపల్లి శంకరమ్మ కూతురు జ్యోతి ఆరోపిం చారు. మాభూమిని వీఆర్వో కరుణాకర్ తమకు తెలియకుండా కొండపల్లి శంకరమ్మ పేరిట పట్టా చేశారని శరత్ ఫేస్బుక్ పేజీలో లైవ్ వీడియో ఉంచడం, సీఎం స్పందించి రైతుతో మాట్లాడి సమస్య పరిష్కరించిన విషయం తెలిసిందే. ఈ విషయమై జ్యోతి మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లో విలేకరులతో మాట్లా డారు. భూవివాదంపై ఇరువర్గాలతో చర్చించి సమన్యాయం చేయాల్సి ఉండగా సీఎం ఏకపక్ష ఆదేశాలతో అధికారులు తమకు తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. తాము హైదరాబాద్‌లో ఉండడం లేదని, రైతుబంధు డబ్బులు తీసుకోలేదని స్పష్టం చేశారు. ఉద్యోగ రీత్యా శ్రీరాంపూర్‌లో నివసిస్తున్నామని తెలిపారు. ఫోన్లో భూమి ఎవరి పేరు మీద పట్టా మార్పిడి అయిందన్న కేసీఆర్.. పట్టా అయిన వారు మీకు ఏమవుతారని ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. కొండపల్లి శంకరయ్య సాగు చేస్తున్న 7.01 ఎకరాల భూమి, తామం తా సాగు చేస్తున్న 2.25 ఎకరాల భూమి ఉమ్మడి ఆస్తి అని, అందరికీ సమానంగా పంచి తమకు న్యాయం చేయాలని జ్యోతి కోరింది. ఈ విషయమై శరత్ స్పందిస్తూ.. 30 ఏళ్ల నుంచి సర్వే నం.271/1ఏ లో ఉన్న భూమిని తామే సాగు చేసుకుంటున్నామని, తమకు సొంత పట్టా ఉందని పేర్కొన్నాడు. అసలు జరిగింది ఇదీ సేత్వార్ రికార్డు ప్రకారం సర్వే నం.270 విస్తీర్ణం 2.25 ఎకరాల భూమికి కొండపల్లి రాజలింగు పట్టాదారు కాగా సర్వే నం.271 విస్తీర్ణం 8.1 ఎకరాల భూమికి కొండపల్లి మల్లయ్య తండ్రి చంద్రయ్య పట్టాదారుగా ఉన్నాడు. మల్లయ్య మరణానంతరం అతని కుమారుడైన కొండపల్లి శంకరయ్యకు వారసత్వంగా 8.01 ఎకరాల భూమి పట్టా అయింది. అనంతరం శంకరయ్య ఎకరం భూమిని ఇతరులకు విక్ర యించగా 7.01 ఎకరాల భూమి అతడి పేరుపై పట్టా, యాజమాన్య హక్కులు కొనసాగుతూ వచ్చాయి. భూప్రక్షాళనలో ఇట్టి భూమి అదే గ్రామానికి చెందిన కొండపల్లి శంకరమ్మ ఖాతాలోకి మార్చబడింది. ఇరువురి మధ్య తరచూ పంచాయితీలు నడుస్తూ వచ్చాయి. పట్టా మార్చిన తహసీల్దార్ సస్పెన్షన్ బెల్లంపల్లి: సంచలనం సృష్టించిన భూపట్టా మార్పిడి కేసులో తహసీల్దార్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. నెన్నెల మండల తహసీల్దార్‌గా పనిచేసి బదిలీపై వెళ్లిన రాజలింగును సస్పెండ్ చేస్తూ గురువారం చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్ఏ) నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాజలింగు 2018 జనవరి 26న ఉద్యోగ బాధ్యతలు స్వీకరించా రు. భూ రికార్డుల ప్రక్షాళనలో నందులపల్లికి చెందిన కొండపల్లి శంకరయ్య పేరు మీద ఉన్న సర్వే నంబర్ 271/1ఎలోని 7.01 ఎకరాల భూమిని అదే గ్రామానికి చెందిన కొండపల్లి శం కరమ్మ పేరుమీద పట్టా మార్పిడి జరిగింది. వీఆర్వో కరుణాకర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ పెద్దిరాజు కుమ్మక్కై పట్టా బదిలీ చేశారు. కలెక్టర్ విచారణ చేపట్టి తక్షణమే ఆర్ఐ, వీఆర్వోను సస్పెండ్ చేయగా తాజాగా తహసీల్దార్‌పై వేటు వేశారు. ప్రస్తుతం రాజలింగు కరీంనగర్ జిల్లా శంకరపట్నం తహసీల్దార్‌గా పని చేస్తున్నారు. కోర్టులో తేల్చుకోండి: కలెక్టర్ 2015 సంవత్సరం వరకు కొండపల్లి శంకరయ్య పేరు మీద భూమి ఉందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళీకేరి అన్నారు. వీఆర్వో చేసిన తప్పిదం వల్ల కొండపల్లి శంకరమ్మ పేరు మీద మారిందని చెప్పారు. దీనిని ఈ నెల 25న సవరించేందుకు ఏర్పాట్లు చేశారని. కానీ ధరణి వెబ్సైట్ ఇబ్బందుల కారణంగా కాలేదన్నారు. సీఎం ఆదేశాలతో మరోసారి 27న మార్చినట్లు తెలిపారు. గతంలో భూమి పేరు మీద ఉంటే కోర్టులో అప్పీల్ చేసుకోవాలి. కోర్టు ఆదేశాల ప్రకారం ఎవరి పేరు మీద వస్తే వారి పేరు మీద మార్చుతామని చెప్పారు. లేదా కుటుంబ సభ్యులంతా కలసి వారసత్వం, వీరాసత్ చేసుకోండని సలహా ఇచ్చారు. గతంలో రైతుబంధు చెక్కు ఎవరికీ ఇవ్వలేదని, రైతుబంధు చెక్కు, పాసుపుస్తకం కొండపల్లి శంకరమ్మకు ఇచ్చినట్లు శరత్ తప్పుడు సమచారం ఇచ్చాడని కలెక్టర్ పేర్కొన్నారు. -
పెద్ద రైతులకు రేషన్ బంద్..!
సాక్షి, నేలకొండపల్లి: తప్పుడు వివరాలతో రేషన్ పొందుతున్న పెద్ద రైతులకు రైతుబంధు పథకం కష్టాన్ని తెచ్చింది. వివరాలను రేషన్ సర్వర్‌తో అనుసంధానం చేయటంతో పదెకరాలు, అంతకంటే ఎక్కువ వ్యవసాయ భూములున్న రైతులకు రేషన్ నిలిచిపోతున్నాయి. ఇప్పటి వరకు తక్కువ భూమి ఉన్నట్లు చూపించి పలువురు పెద్ద రైతులు ఆహార భద్రత కార్డులు పొందారు. మరికొందరు భూమి ఉన్నా సేద్యంలో లేదంటూ తప్పుడు ధృవీకరణ పత్రాలు చూపించి రేషన్ తీసుకుంటున్నారు. అలాంటి రైతులకు పథకంతో తెరపడింది. రేషన్ సర్వర్‌కు దీనిని అనుసంధానం చేయటంతో ఎక్కువ భూములు ఉన్న రైతులకు రేషన్ నిలిచిపోయింది. పెట్టుబడి సాయం పొందేందుకు సాగులో లేని భూములను సైతం సేధ్యం చేస్తున్నామంటూ రైతులు తప్పుడు పత్రాలు చూపి రెండు పర్యాయాలు లబ్ధి పొందారు. దీంతో పౌరసరఫరాల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో రైతుబంధు లబ్ధిదారుల వివరాలను తెప్పించుకొని తమ శాఖ సర్వర్‌కు అనుసంధానం చేయడంతో పెద్ద రైతుల వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఫలితంగా ఫుడ్ సెక్యూరీటీ యాక్ట్ 2013 ప్రకారం వారిని రేషన్, రైతుబంధుకు అనర్హులుగా ప్రకటించింది. విచారించాలని డీఎస్‌ఓలకు ఆదేశాలు.. జిల్లాలో పది ఎకరాల పైన ఉన్న రైతులు ఎవరెవరు ఉన్నారో విచారించాలని జాయింట్ కలెక్టర్ల ద్వారా జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులకు లిఖిత పూర్వకంగా ఆదేశాలు అందాయి. పెద్ద రైతులు, వారి భూముల వివరాలు విచారించి నివేదికలను పంపాలని అన్ని మండలాల తహసీల్దార్లను ఆదేశించారు. ఇప్పటికే డీఎస్ఓ లకు లిఖిత పూర్వక ఆదేశాలు అందాయి. రైతు బంధుతో .. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా ఎకరాకు 8 వేల చొప్పున పంట పెట్టుబడి సాయం అందజేస్తోంది. దీంతో ఏ రైతుకు ఎంత భూమి ఉందో లెక్క తేలిపోయింది. పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఆకున్ సబర్వాల్ రైతుల ఆధార్ నంబర్‌ను పీడీఎస్ రైస్ ఈ పాస్ సర్వర్‌కు అనుసంధానం చేయటంతో అనర్హులు దొరికిపోయారు. ప్రస్తుతం రేషన్ దుకాణాలల్లో ఈ పాస్ విధానంలో బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో పెద్ద రైతులు రేషన్ దుకాణానికి వెళ్లి ఈ పాస్ మిషన్ పై వేలిముద్ర వేస్తు ఇన్వాలీడ్ అని వస్తోంది. దీంతో డీలర్లు రేషన్‌ను నిలిపివేస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం 669 దుకాణాలు ఉండగా వాటిలో 3,95,857 మందికి రేషన్ కార్డులు ఉన్నాయి. అర్హులకు ఇబ్బంది లేదు.. తక్కువ భూమి ఉన్న రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఒక వేళ రేషన్ ఆగిపోతే స్థానిక తహసీల్దార్‌కు దరఖాస్తు కోవాలి. విచారించి రేషన్ అందేలా చర్యలు తీసుకుంటాం. పది ఎకరాలు అంత కంటే ఎక్కువగా భూమి ఉన్న రైతులకు ఈనెల నుంచి రేషన్‌ను నిలిచిపోతుంది. ఇప్పటికే కమీషనర్ కార్యాలయంలో బ్లాక్ చేశారు. – కె.వెంకటేశ్వర్లు, ఇన్చార్జ్ డీఎస్ఓ, ఖమ్మం -
రైతుబంధులో కేంద్ర ‘పెట్టుబడి’ విలీనం!
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణలో రైతుబంధు పథకం అమలవుతోంది. ఇప్పటికే ఖరీఫ్, రబీలకు రెండు విడతలుగా సొమ్ము విడుదల చేశాం. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని (పీఎంకేఎస్‌ఎన్‌వై–పీఎం కిసాన్) ప్రవేశపెట్టింది. దాని ఉద్దేశం కూడా ఇదే. పైగా కేంద్రం కంటే తెలంగాణలోనే అధికంగా పెట్టుబడి సాయం చేస్తున్నాం. కేంద్ర లక్ష్యం ప్రకారం తెలంగాణలో 90% మంది ఐదెకరాలలోపు సన్న, చిన్నకారు రైతులకు రైతుబంధు సొమ్ము అందింది. ఈ నేపథ్యంలో కేం ద్రం తన పథకం కింద తెలంగాణకు రావాల్సిన సొమ్ము వాటాను రైతుబంధులో కలపాలి’అని కోరే ఆలోచన ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతస్థాయి అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. రైతుబంధు పథకం తెలంగాణలో తప్ప మరే రాష్ట్రంలోనూ అమలవట్లేదు. దీన్ని ఆధారం చేసుకొనే కేంద్రం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని తాజా బడ్జెట్లో ప్రవేశపెట్టడం తెలిసిందే. అయితే ఇప్పటికే తెలంగాణలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నందున కేంద్రం మళ్లీ వేరుగా రైతులకు సొమ్ము ఇవ్వడంలో అర్థంలేదని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. అలా చేస్తే ప్రభుత్వం ప్రజాధనాన్ని వృథా చేస్తోం దన్న తప్పుడు సంకేతాలు ఇతర వర్గాల ప్రజల్లోకి వెళ్లే అవకాశముందని చెబుతున్నాయి. అందువల్ల రాష్ట్రం లో ఐదెకరాలలోపు రైతుల సంఖ్యకు అనుగుణంగా కేంద్రం పెట్టుబడి సొమ్మును తమ ఖాతాలో వేస్తే సం బంధిత రైతులందరికీ రైతుబంధు కింద అందజేస్తామని, ఆ మేరకు యుటిలైజేషన్ సర్టిఫికేట్ (యూసీ) కూడా సమర్పిస్తామని పేర్కొంటున్నాయి. నేడు హైదరాబాద్కుకేంద్ర అధికారి... ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషితో చర్చించేందుకు కేంద్ర వ్యవసాయశాఖ అదనపు కార్యదర్శి వసుధ మిశ్రా మంగళవారం హైదరాబాద్ రానున్నారు. సీఎస్‌తో సమావేశానికి వ్యవసాయ, ఆర్థిక, రెవెన్యూ, ఐటీశాఖలకు చెందిన ఉన్నతాధికారులూ హాజరుకానున్నారు. తెలంగాణలో రైతుబంధు పథకాన్ని ఎలా అమలు చేశారన్న సమాచారంతోపాటు కేంద్ర ప్రభుత్వ పథకాన్ని ఎలా అమలు చేయవచ్చన్న అంశంపై ఆమె చర్చించే అవకాశమున్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో ఇప్పటికే రైతుబంధును విజయవంతంగా అమలు చేస్తున్నందున ఇక్కడి అనుభవాలను కూడా రాష్ట్ర ఉన్నతాధికారులు ఆమెకు వివరించే అవకాశముంది. మరోవైపు తెలంగాణలో కేంద్ర పెట్టుబడి పథకాన్ని వేరుగా అమలు చేయడం కాకుండా రైతుబంధులో విలీన అంశాన్ని కూడా రాష్ట్ర అధికారులు చర్చించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని భావిస్తున్నట్లు సమాచారం. కేంద్రం నిధులు ఇస్తున్నందున అవసరమైతే ఈ పథకాన్ని ‘రైతుబంధు– పీఎంకేఎస్‌ఎన్‌వై’గా (పీఎం కిసాన్) మార్చడానికి కూడా అభ్యంతరం లేదన్న ప్రతిపాదనను కూడా ముందుకు తేవాలని యోచిస్తున్నట్లు తెలిసింది. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు కేంద్ర పథకాన్ని రాష్ట్రంలో ఎలా అమలు చేయాలో నిర్ణయిస్తామని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో గత ఖరీఫ్, రబీ సీజన్లకు కలిపి తెలంగాణ ప్రభుత్వం రైతులకు రూ. 10 వేల కోట్లకుపైగా పెట్టుబడి సాయం చేయడం తెలిసిందే. అందులో 90 శాతం సన్నచిన్నకారు రైతులకే అందింది. ఈ నేపథ్యంలో కేంద్రం సాయం చేస్తే రూ. 2,800 కోట్లకుపైగా తెలంగాణ ప్రభుత్వానికి కలిసొచ్చే అవకాశముందని అంటున్నారు. అయితే తెలంగాణ ప్రతిపాదనలకు కేంద్రం అంగీకరిస్తుందా లేదా అన్న అంశంపై వ్యవసాయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తమ ప్రతిపాదనను కేంద్రం అంగీకరిస్తే అవసరమైన సాంకేతిక సహకారాన్ని కూడా ఇస్తామని అంటున్నారు. -
బ్యాంకుల చుట్టూ రైతన్నలు..రైతుబంధు సాయానికి కొర్రీలు.!
సాక్షి, కమాన్‌పూర్: రైతులకు పంట పెట్టుబడి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం రబీ సాగుకోసం ఎకరాకు రూ. 4 వేలు చెల్లిస్తుంది. ఖరీఫ్ సాగుకు మొదటి విడతలో రైతులకు ప్రభుత్వం నేరుగా చెక్కుల రూపంలో అందజేసింది. రబీసాగుకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం అంత సిద్ధం చేసింది కాని ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో పెట్టుబడి సాయం రైతులకు నేరుగా ఇవ్వరాదని, నగదును రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమచేయాలని ఎన్నికల కమిషన్ అదేశాలు జారీ చేసింది. పెట్టుబడి సహయాన్ని బ్యాంకు అధికారులు రైతులను ఏలాంటి ఇబ్బందులు పెట్టకుండా నేరుగా రైతులకు డబ్బులు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇటీవల పంట పెట్టుబడి సహయాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేశారు. డబ్బులు తీసుకునేందుకు బ్యాంకు వెళ్లిన రైతులకు బ్యాంకు సిబ్బంది లేని పోని కొర్రీలు పెడుతున్నారు. రైతులు గతంలో తీసుకున్న పంట రుణాలు రెన్యువల్ చేసుకోలేదని డబ్బులు తీసుకోకుండా ఖాతాలోని డబ్బులను హోల్డ్( తాత్కాలికంగా నిలిపివేత)లో పెట్టడంతో రైతుల చేతికి డబ్బులు రాకపోవడంతో బ్యాంకు చుట్టు తిరుగుతున్నారు. రబీసాగు ప్రారంభం కావడంతో పెట్టుబడి కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. మండలంలో పది రెవెన్యూ గ్రామాల పరిధిలో 4048 మంది రైతులకు పంట పెట్టుబడి సహాయం కోసం రైతులు వ్యవసాయాధికారి కార్యాలయంలో దరఖాస్తులు అందించారు. వ్యవసాయశాఖ అధికారులు దరఖాస్తులను ఆన్లైన్ చే యడంతో రైతులకు నేరుగా డబ్బులను మండల కేంద్రంలోని ఎస్బీఐ. కేడీసీసీలతో పాటు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. డబ్బులు జమ కావడంతో రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ డబ్బులు తీసుకోవడానికి కమాన్‌పూర్ ఎస్బీఐ బ్యాంకు వెళ్లి విత్ డ్రా చేద్దామనుకుంటే డబ్బులు హోల్డ్ చేశామని చెప్పడంతో ఇందేందని బ్యాంకులోని ఫీల్డ్ ఆఫీసర్ వద్దకు వెళ్లీ వివరాలు అడిగితే పంట రుణాలను రెన్యూవల్ చేసుకోలేదు అందుకు ఖాతాలోని డబ్బులను హోల్డ్ చేశామని అనడంతో రైతులకు దిక్కుతోచడం లేదు. గిదేంది ప్రభుత్వం రైతులు నేరుగా బ్యాంకులకు వెళ్లీ పెట్టుబడి సహయాన్ని తీసుకోండి అని అంటుంటే మీరు ఇలా అంటున్నారేంటి అంటే సదురు బ్యాంకు అధికారులు రైతులకు సరైన సమాధానం చెప్పడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. రబీసాగు మొదలైంది. నారుమడి దున్ని నారుపోసుకునేందుకు డబ్బులు తీసుకునేందుకు వస్తే బ్యాంకు అధికారుల తీరుతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. విషయంపై బ్యాంకు మేనేజర్‌ను వివరణ కోరగా రైతులు గతంలో తీసుకున్న పంట రుణాలను రెన్యూవల్ చేసుకోకపోవడంతో ఆటోమేటిక్‌గా రైతుల ఖాతాలోని డబ్బులు హోల్డ్ చేస్తున్నారని వివరణ ఇచ్చారు. -
రైతుబంధు దేశానికే ఆదర్శం...
మేడిపెల్లి : రైతుబందు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని మళ్లీ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే భూమిలేని వారికి కూడా రైతుబీమా వర్తింపజేసేలా సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారని వేములవాడ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి చెన్నమనేని రమేశ్‌బాబు అన్నారు. గురువారం మేడిపెల్లి మండల కేంద్రంతో పాటు కమ్మరిపేట, భీమారం, రంగాపూర్, కొండాపూర్, విలాయతబాద్ గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో మహిళలు మంగళహారతులు, బతుకమ్మలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం డప్పు చప్పుళ్ల మధ్య అన్ని గ్రామాలలోని ప్రధాన వీధులలో తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాలలో రమేశ్‌బాబు పార్టీ జెండాలను ఎగురవేసారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశాలలో ఆయన మాట్లాడుతూ రైతులను రాజుగా చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకొన్నట్లు చెప్పారు. దీని కోసం ఇప్పటికే రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తుండగా పంట పెట్టుబడి కింద ఏడాదికి ఏకరానికి రూ.8వేలు, రైతుభీమా కింద చనిపోయిన రైతు కుటుంబాలకు రూ.5లక్షల ప్రమాద భీమా ఇస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధిని చూసి మరోసారి అవకాశం కల్పిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్క్‌ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి, ఎంపీపీ కుందారపు అన్నపూర్ణ, జడ్పీటీసీ నెల్లుట్ల పూర్ణిమ, పార్టీ మండల శాఖ అధ్యక్షులు సుధవేని గంగాధర్‌గౌడ్, ఏనుగు మనోహర్‌రెడ్డి, యూత్ అధ్యక్షుడు నల్ల మహిపాల్‌రెడ్డి, సింగిల్ విండో చైర్మన్లు వొద్దినేని హరిచరణ్‌రావు, మిట్టపెల్లి భూమరెడ్డి, కాటిపెల్లి లింగారెడ్డి, ఎంపీటీసీలు, పాల్గొన్నారు. ఎన్ఆర్ఐలకు ప్రత్యేక ప్యాకేజీ ఎన్ఆర్ఐలకు ప్రత్యేక ప్యాకేజీ విషయమై టీఆర్ఎస్ తన మేనిఫెస్టోలో చేర్చనున్నట్లు వేములవాడ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి చెన్నమనేని రమేశ్‌బాబు అన్నారు. గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా మేడిపెల్లి మండలంలోని భీమారంకు వచ్చిన టీఆర్ఎస్ అభ్యర్థి చెన్నమనేని రమేశ్‌బాబును స్థానిక యువకులు ఎన్ఆర్ఐ పాలసీపై అడిగారు. ఈ విషయమై రంగాపూర్‌లో విలేకరులతో మాట్లాడారు. టీఆర్ఎస్ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్ఆర్ఐలకు ప్రత్యేక ప్యాకేజీ విషయం చేర్చినట్లు చెప్పారు. మేడిపెల్లి మండల కేంద్రంలోని పీఎన్ఆర్ గార్డెన్లో గురువారం నాయిబ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనంలో పలువురు నాయీ బ్రాహ్మణులు టీఆర్ఎస్లో చేరారు. మార్క్‌ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి, ఎంపీపీ కుందారపు అన్నపూర్ణ, జడ్పీటీసీ నెల్లుట్ల పూర్ణిమ, నాయకులు ఏనుగు మనోహర్‌రెడ్డి, నాయీబ్రాహ్మణులు పాల్గొన్నారు. -
రైతుబంధు..ఆర్ అండ్ బీకి నిధులు బందు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రోడ్లు భవనాల శాఖ (ఆర్అండ్బీ) నిధుల కటకటతో సతమతమవుతోంది. ఈ ప్రభావం వివిధ అభివృద్ధి పనులపై పడుతోంది.ఆర్అండ్ బీ నిధులను ‘రైతుబంధు’పథకానికి మళ్లించడంతోనే ఈ పరిస్థితులు తలెత్తాయని తెలుస్తోంది. ఆ విషయాన్ని సూటిగా చెప్పని ప్రభుత్వం రోడ్లు భవనాల శాఖను నిధుల కోసం బ్యాంకుల వద్ద అప్పు తీసుకోమని సూచించింది. ఆ యత్నానికి ముందస్తు ఎన్నికలు బ్రేకులు వేయడంతో ఆర్ అండ్ బీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కాంట్రాక్టర్లకు చెల్లింపులు ఆగడంతో వారు అధికారులపై ఒత్తిళ్లు పెంచుతున్నారు. చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని వారి చుట్టూ తిరుగుతున్నారు. కొత్త పనులు ప్రారంభించినా... ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్అండ్ బీకి కేటాయించిన రూ.5,600 కోట్ల నిధులు సకాలంలోనే వస్తాయని భావించిన ఆ శాఖ అధికారులు ఏప్రిల్‌లో ఆర్థిక సంవత్సరం మొదలవగానే.. పాత బిల్లులతోపాటు కొత్త పనుల అప్పగింతకు ముందుకెళ్లారు. ఇలా ఈ ఏడాది దాదాపుగా రూ.20వేల కోట్లకుపైగా విలువైన పనులను కాంట్రాక్టర్లు చేపట్టారు. అదే సమయంలో ఆర్అండ్ బీకి ప్రభుత్వం నుంచి నిధులు రాలేదు.ఈ నేపథ్యంలో ప్రభుత్వం.. ఆర్‌అండ్‌బీకి నిధులురావని, రూ.3000 కోట్లు బ్యాంకుల నుంచి రుణం కోసం ప్రయత్నించమని అధికారులకు సలహా ఇచ్చింది. దీనికోసం అధికారులు ప్రయత్నిస్తే... ఆంధ్రాబ్యాంకు నేతృత్వంలోని 4 బ్యాంకులు కన్సార్షియంగా ఏర్పడ్డాయి. ఈలోగా ముందస్తు ఎన్నికల వార్తల నేపథ్యంలో రుణం మంజూరుకు బ్యాంకులు వెనకంజవేశాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా వివిధ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు ఇబ్బందుల్లో పడ్డారు. దీంతో అక్టోబరు తొలి వారంలోనే తెలంగాణ బిల్డర్ల అసోసియేషన్ పనులు నిలిపివేసింది. వారిని చర్చలకు పిలిచిన ప్రభుత్వం రూ.5,600 కోట్లు మంజూరుకు హామీ ఇచ్చింది. ఆ మేరకు వారు పనులు మొదలు పెట్టినా, నవంబరు ఆరంభం వరకూ నిధులు అందలేదు. ఈ విషయమై వారు పలుమార్లు సీఎస్, మంత్రి తుమ్మల, కేటీఆర్‌ల వద్ద చర్చలు జరిపినా పురోగతి రాలేదు. దీంతో వారు రెండోసారి సమ్మె యోచన చేశారు. చివరికి ఇటీవల సీఎస్ రూ.10 కోట్లు మంజూరు చేసి, రూ.10 లక్షల్లోపు బిల్లులకు బకాయిలు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో సమ్మె వాయిదా వేశారు. సీఎం పేషీ నుంచే ఆదేశాలు..! వాస్తవానికి అక్టోబరులో ఆర్ అండ్ బీ అధికారులు ప్రభుత్వంతో పలుమార్లు సమావేశమయ్యారు. బ్యాంకులు రుణం ఇవ్వడం లేదని, ప్రభుత్వమూ నిధులు ఇవ్వకపోతే.. పరిస్థితి ఇబ్బందికరమని తేల్చిచెప్పారు. దీంతో సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం నిధుల మంజూరుకు హామీ ఇచ్చింది. చివరికి నవంబరు తొలి వారంలో నిధులు రావడం లేదంటూ సీఎం పేషీ నుంచి ఆర్ అండ్ బీ అధికారుల నెత్తిన పిడుగులాంటి వార్త వచ్చి పడింది. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఆర్ అండ్ బీ శాఖకు రావాల్సిన నిధులను ‘రైతు బంధు ’పథకానికి బదిలీ చేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. ఇలా రోడ్లుభవనాల శాఖ చెల్లింపులకు చేతులెత్తేయాల్సిన పరిస్థితిలో పడింది. ఆశ్రయించిన బ్యాంకులూ ఎన్నికల నేపథ్యంలో వెనుకడుగు వేశాయి. ప్రస్తుతం ఈ ప్రభావం వివిధ అభివృద్ధిపనులపై ప్రభావం చూపుతోంది.పనులు చేసిన కాంట్రాక్టర్లూ చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది. -
దేశం చూపు.. తెలంగాణ వైపు
సాక్షి సిద్దిపేట: కాళేశ్వరం ప్రాజెక్టుతో అన్ని కాలాల్లో ప్రతి గ్రామానికి గోదావరి నీటిని అందించే బృహత్తర పథకాన్ని చేపట్టిన తెలంగాణ వైపు దేశం మొత్తం చూస్తోందని నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు అన్నారు. బుధవారం సిద్దిపేట నియోజకవర్గంలో మంత్రి పర్యటించారు. జిల్లా కేంద్రంలో హజ్ యాత్రికులకు సన్మానం, పెద్దకోడూరులో రూ.3 కోట్లతో నిర్మించిన పాలిటెక్నిక్ హాస్టల్ భవనాన్ని ఆయన ప్రారంభించారు. గతంలో ప్రాజెక్టులు నిర్మించడానికి 30 ఏళ్లు పట్టేదని, తెలంగాణ వచ్చాక 20 నెలల్లో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేస్తున్నామని మంత్రి తెలిపారు. దసరా నాడు అటూ ఇటూ గోదావరి నీటి ని తరలిస్తామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుకు బీమా పథకంతో ధీమాను ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. రూ.వెయ్యి కోట్లతో రాష్ట్రంలోని ప్రతి మండలంలో గోదాంలను నిర్మించనున్నామని తెలిపారు. రాష్ట్రంలో సివిల్, ఎలక్ట్రికల్ కోర్సులకు మంచి డిమాండ్ ఉందని, ప్రభు త్వ, ప్రైవేటు రంగంలోనూ అవకాశాలున్నాయన్నా రు. మైనార్టీల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ పాటుపడుతున్నారని చెప్పారు. ఏడాదిలో ఎల్కతుర్తి జాతీయ రహదారి... ఇటీవల కేంద్ర మంత్రి గడ్కరీతో భేటీ సమయంలో వరంగల్–ఎల్కతుర్తి జాతీయ రహదారి నిర్మాణానికి రూ.500 కోట్లు ఖర్చుచేసే విధంగా కేంద్ర ప్రణాళికలో చేర్పించామని హరీశ్‌రావు వెల్లడించారు. సిద్ది పేట జిల్లాలో రైల్వే లైన్ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. జిల్లాకు రెండు జాతీయ రహదారులు మంజూరు కావడంతో పారిశ్రామికంగా సిద్దిపేట మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. సిద్దిపేట పరిసర ప్రాంతంలో ఇండస్ట్రియల్ కారిడార్‌ను ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. రంగనాయక సాగర్ ద్వారా లక్షా పది వేల ఎకరాలకు సాగు నీరు అందించేలా ప్రణాళిక రూపొందించామన్నారు. సమావేశం లో ఎమ్మెల్యే బాబూమోహన్, ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్‌రెడ్డి, ఫరూఖ్ హుస్సేన్ పాల్గొన్నారు. -
‘ముఖ్యమంత్రి బంధు’
ఇల్లందకుంట(హుజూరాబాద్): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం రైతులకు కాదని, ముఖ్యమంత్రి బంధువుల పథకమని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. మండల కేంద్రంతోపాటు సిరిసేడు, చిన్నకోమటిపల్లి తదితర గ్రామాల్లో శనివారం బూత్‌లెవల్ సమావేశా లు నిర్వహించారు. పొన్నం మాట్లాడుతూ తెలంగాణ వస్తే మా నీళ్లు, మా ఉద్యోగులు మాకు వ స్తాయని గొప్పలు చెప్పిన కేసీఆర్.. తర్వాత మాట మార్చారన్నారు. తెలంగాణ అమరుల కుటుంబాలను పట్టించుకోవడం లేదన్నారు. ఆర్థికశాఖ మం త్రి ఈటల రాజేందర్ ఇలాఖలోనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పూర్తికాకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. దళితులకు మూడెకరాలు భూమి పంపిణీ చేస్తామని చెప్పి మాట తప్పారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వరికి రూ.2 వేలు, మొక్కజొన్నకు రూ.2 వేలు, పత్తికి రూ.7 వేలు, మిర్చికి రూ.10 వేల మద్దతు ధర చెల్లిస్తుందన్నారు. టీపీసీసీ అధికార ప్రతినిధులు తుమ్మేటి సమ్మిరెడ్డి, ప్యాట రమేశ్, పాడి కౌశిక్‌రెడ్డి, పరిపాటి రవీందర్‌రెడ్డి, జిల్లెల తిరుపతిరెడ్డి, సర్పంచ్ పెద్ది స్వరూపకుమార్, పర్లపల్లి రమేశ్ పాల్గొన్నారు. -
కేసీఆర్ బంధువుల పథకంగా ‘రైతుబంధు’
చందుర్తి(వేములవాడ): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతుబంధు పథకం కేసీఆర్ బంధువుల పథకంగా మారిందని కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌గౌడ్ విమర్శించారు. చందుర్తి మండలం కట్టలింగంపేట, మల్యాల, చందుర్తి, మర్రిగడ్డ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ సమావేశాలు బుధవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పొన్నం ప్రభాకర్‌గౌడ్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుబంధు పథకంతో సమాన్య రైతులకన్నా భూస్వాములకే ప్రయోజనం చేకూరిందన్నారు. రెక్కల కష్టాన్ని నమ్ముకున్న రైతులకు ఒరిగిందేమి లేదన్నారు. రాష్ట్ర ఆవిర్భావ విషయమై సోనియాగాంధీని సీఎం కేసీఆర్ విమర్శించడం సరికాదన్నారు. తెలంగాణను తామే తెచ్చామని ఎంపీ కవిత, మంత్రి కేటీఆర్ చెప్పుకుంటే ప్రజలు బొందపెడతారని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం ప్రగతిభవన్, కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో బందీగా మారిందన్నారు. కేంద్రం లో నరేంద్రమోదీకి అధికారమిస్తే పెద్దనోట్లురద్దు చేసి పేదప్రజలను నిండా ముంచారని తెలిపారు. ఇప్పటి వరకు ఎంతమొత్తంలో నల్లధనం వెలికితీశారో లెక్కచెప్పాలని డిమాండ్ చేశా రు. కేంద్ర, రాష్ట్ర వైఫల్యాలను ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని జోష్యం చెప్పారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని 200 గ్రామాల్లో ఇప్పటి వరకు పర్యటించానని తెలిపారు. ఏ ఒక్క గ్రామంలో డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన లబ్ధిదారులకు పక్కనే మరోగది నిర్మించుకునేందుకు రూ.లక్ష ఇస్తామన్నారు. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ, మహిళ సంఘానికి రూ.లక్ష ఉచితంగా ఇస్తామన్నారు. ఈ సమావేశంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆది శ్రీనివాస్, టీపీసీసీ సభ్యులు ఏనుగు మనోహర్‌రెడ్డి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు ముకిడే చంద్రశేఖర్, యూత్ కాంగ్రెస్ నియోజక వర్గ ఇన్చార్జి నాగం కుమార్, జిల్లా నాయకులు చిలుక అంజిబాబు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు పొద్దుపొడుపు లింగారెడ్డి, వేములవాడ బ్లాక్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ముస్కు పద్మ తదితరులు పాల్గొన్నారు. -
అది ‘కౌలు రైతుబంధు’ కాదు
సాక్షి, హైదరాబాద్ : రైతులకు పంట పెట్టుబడి ఇవ్వడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ‘రైతుబంధు’పథకాన్ని అమలు చేస్తోందని.. కౌలు రైతుల కోసం ఎంత మాత్రం కాదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మరోసారి స్పష్టం చేశారు. ఇది రైతు బంధు పథకమే తప్ప, కౌలు రైతుబంధు పథకం కాదని పేర్కొన్నారు. సమాజంలో అనేక రకాల ఆస్తులను ఇతరులకు కొం త కాలం కోసం లీజుకు ఇస్తారని, అలా లీజుకు తీసుకున్న వారెవరూ ఆ ఆస్తులకు హక్కుదారులు కారని చెప్పారు. అలా ఇతర ఆస్తుల విషయంలో లేని నిబంధన కేవలం రైతులకే ఎందుకు ఉండాలని, రైతులను ఎందుకు ఇబ్బంది పెట్టాలని వ్యాఖ్యానించారు. రైతు బంధు పథకాన్ని కౌలు రైతులకు వర్తింపచేయాలనే డిమాండ్ అర్థరహితమైనదని, ఆ వాదన న్యాయ సమ్మతం కూడా కాదని పేర్కొన్నారు. శనివారం ప్రగతి భవన్లో ‘రైతుబంధు’పథకంపై కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆ డిమాండ్ సరికాదు.. రాష్ట్రంలోని రైతులందరికీ ఎకరానికి ఏటా రూ.8 వేల చొప్పున పంట పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని చేపట్టిందని సమీక్షలో సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ‘‘ఈ పథకం కేవలం రైతులకు ఉద్దేశించిందే తప్ప, కౌలు రైతులకు సంబంధించినది కాదు. రైతులకు పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకున్నది. బడ్జెట్లో రూ.12 వేల కోట్లు కేటాయించింది. శాసనసభ ఆమోదించిన బడ్జెట్ ప్రకారమే రాష్ట్రంలో భూమిపై యాజమాన్య హక్కులున్న రైతులకు, ప్రభుత్వం గుర్తించిన ప్రతి రైతుకు సాయం అందిస్తున్నాం. దీన్ని ఎవరూ తప్పుపట్టడానికి లేదు. కౌలు రైతులను ఎలా విస్మరిస్తారని, వారికి కూడా రైతుబంధు సాయం అందించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఆ డిమాండ్ అర్థరహితమైనది. ఆ వాదనలో న్యాయం లేదు. అసలు కౌలురైతులు ఎవరన్నది ఎవరూ స్పష్టంగా చెప్పలేరు. ప్రభుత్వం దగ్గరా కౌలు రైతుల వివరాలేవీ లేవు. ప్రభుత్వ రికార్డుల్లో ఎక్కడా కౌలు రైతులకు సంబంధించిన వివరాలు నమోదు కాలేదు. ఏ రైతు కూడా కౌలు రైతులను గుర్తిం చలేదు. కౌలు రైతులుగా పిలిచే వారికి భూమి పై ఎలాంటి హక్కు లేదు, ఉండదు. అలాంటి వారికి ఏ ప్రాతిపదికన పెట్టుబడి సాయం అందించాలి..’’అని కేసీఆర్ ప్రశ్నించారు. ఏ హక్కూ లేనివారికి ఎలా ఇస్తాం? కేవలం రైతులకే సాయం ఇవ్వాలన్నది ప్రభుత్వ విధానమని కేసీఆర్ చెప్పారు. ఇది ప్రజాధనంతో కూడుకున్న అంశమని, ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయికి అసెంబ్లీ ఆమోదం ఉండాలని.. ఆ ఖర్చుకు ఆడిట్ ఉంటుందని పేర్కొన్నారు. ఎవరికి పడితే వారికి డబ్బు పంచిపెట్టడం సాధ్యం కాదన్నారు. ఏ హక్కూ లేని వారికి, భూమిపై ఎలాంటి పత్రం లేని వారికి డబ్బులు ఇవ్వాలన్న వాదన న్యాయ సమ్మతం కాదని వ్యాఖ్యానించారు. అలా ఏ హక్కూ లేని వారికి ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు చెల్లిస్తే తప్పవుతుందని.. ప్రభుత్వం అలాంటి తప్పు చేస్తే ప్రశ్నించాలేగానీ, అంతా సవ్యంగా జరుగుతుంటే తప్పు పట్టడం సమంజసం కాదని వ్యాఖ్యానించారు. ఏ హక్కూ, ఆధారం లేని వారికి ప్రభుత్వం సాయం అందిస్తే, ఎవరు పడితే వారు తమకూ సాయం కావాలని అడిగే అవకాశముందని.. అలాంటి వారికి డబ్బులు ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. లీజుకు తీసుకుంటే హక్కు రాదు.. కేవలం రైతులు మాత్రమే కాకుండా.. చాలా మంది తమ ఆస్తులను ఇతరులకు కిరాయికి, లీజుకు ఇస్తారని.. పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, ఇళ్లు, ఆటోలు, కార్లు, ఫంక్షన్ హాళ్లు.. ఇలా చాలా రకమైన వాటిని నిర్ణీత సమయం కోసం కిరాయికి ఇస్తారని కేసీఆర్ పేర్కొన్నారు. ‘‘లీజుకు తీసుకున్న వారు ఎన్నటికీ యజమానులు కారు. ఆ ఆస్తులపై ఎన్నటికీ వారికి హక్కులు లభించవు. అలాంటి వాటి విషయంలో లేని డిమాండ్ కేవలం రైతుల విషయంలో మాత్రమే ఎందుకు వస్తుంది. సమైక్య పాలనలో రైతులు చితికిపోయారు. నష్టపోయి ఉన్నారు. అలాంటి రైతులకు పెట్టుబడి సాయం అందించి ఆదుకోవాలని ప్రభుత్వం రైతుబంధు అమలు చేస్తున్నది. దీనికి కొర్రీలు పెట్టడం సమంజసం కాదు. కౌలు రైతుల పేరుతో అసలు రైతుకు అన్యాయం చేయాలని చూడడం మంచిది కాదు. రైతులు ఒక్కో పంట కాలానికి ఒక్కొక్కరికి తమ భూమిని కౌలుకు ఇస్తారు. ఒకే ఏడాది ఇద్దరు ముగ్గురికి కూడా కౌలుకు ఇస్తారు. అలాంటప్పుడు ప్రభుత్వం కౌలుదారును ఎలా గుర్తిస్తుంది. అసలు ఏ రైతు అయినా తన భూమిని కౌలుకు ఇస్తున్నట్టు లిఖితపూర్వకంగా అంగీకరిస్తాడా? అలాంటప్పుడు ప్రభుత్వానికి కౌలు రైతును గుర్తించడం ఎలా సాధ్యమవుతుంది?..’’అని ప్రశ్నించారు. అందువల్ల రైతు బంధు పథకాన్ని కచ్చితంగా రైతుల కోసమే అమలు చేయాలని, కౌలు రైతులకు సాయం అందించాలనే డిమాండ్ నెరవేర్చడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. -
‘రైతుబంధు’ మాయం.!
అశ్వారావుపేటరూరల్ : అశ్వారావుపేటలో సుమారు 228 ఎకరాలకు సంబంధించిన 14 రైతుబంధు చెక్కులు మాయమయ్యాయి. ఈ విషయాన్ని బయటకు పొక్కనీయకుండా.. రెవెన్యూ అధికారుల వద్ద ఉన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ శాఖ వద్ద ఉన్నాయని రెవెన్యూ అధికారులు పేర్కొంటూ తప్పించుకుంటున్నారు. పెట్టుబడి సాయం కోసం రైతులు నెల రోజుల నుంచి తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. పాస్ పుస్తకాలిచ్చారు కానీ.. అశ్వారావుపేట రెవెన్యూలోని ఊట్లపల్లి సమీపంలో శీమకుర్తి సాయిబాబా అనే రైతుకు ఖాతా నంబరు 154లో.. సర్వే నంబరు 302/ఆ/1లో 2.03 ఎకరాలు, 303/ఆ సర్వే నంబర్లో 6.10 ఎకరాలు, 304అ/1 నంబర్లో 3–39 ఎకరాలు, 306 సర్వే నంబర్లో 2–16 ఎకరాలు, 307/ఆ నంబర్లో 1–12, 339/1 సర్వే నంబర్లో 2–39 ఎకరాలతోపాటు మరికొన్ని నంబర్లలో మొత్తం సుమారు 28 ఎకరాల వరకు వ్యవసాయ భూమి ఉంది. ఈ భూములకు సంబంధించిన రైతుబంధు చెక్కులు అందలేదు. శీమకుర్తి చక్రధరరావు, శీమకుర్తి రామలింగం, శీమకుర్తి కైలాస్‌నా«థ్, జల్లిపల్లి నారాయణరావు, జల్లిపల్లి లక్ష్మి, కొనకళ్ల నాగేశ్వరరావులకు చెందిన సుమారు 200వందల ఎకరాలకు సంబంధించి సుమారు రూ.7లక్షల పెట్టుబడి సాయం చెక్కులు గల్లంతయ్యాయి. వీళ్లందరికీ ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా పాస్ పుస్తకాలు, పెట్టుబడి సాయం కింద చెక్కులు మంజూరు కాగా వీటిని ఆయా రైతులు తీసుకునేందుకు గత నెల 10న అశ్వారావుపేటలో జరిగిన పంపిణీ కార్యక్రమానికి వెళ్లారు. ఆ సమయంలో పాస్ పుస్తకాలు, పెట్టుబడి సాయం చెక్కులు మంజూరైనట్లు అధికారులు రైతులకు చూపించి, పాస్ పుస్తకాల్లో పొలాలకు సంబంధించిన చిన్న పొరపాటు ఉందని చెప్పి పంపిణీ చేయకుండా నిలిపి వేశారు. దీంతో రైతులు తమ వద్ద ఉన్న పాత రికార్డులు, ఆధారాలతో స్థానిక రెవెన్యూ అధికారులకు లిఖిత పూర్వకంగా అందించారు. విచారణ చేసిన రెవెన్యూ అధికారులు ఎలాంటి పొరపాట్లు లేవని ధ్రువీకరిస్తూ పత్రాన్ని ఇచ్చారు. ఆ పత్రాన్ని వ్యవసాయ శాఖ అధికారులకు సమర్పించగా కేవలం పాస్ పుస్తకాలు పంపిణీ చేసి, పెట్టుబడి సాయం చెక్కులు మాత్రం ఇవ్వలేదు. అప్పటి నుంచి రైతులు అటు రెవెన్యూ, ఇటు వ్యవసాయ శాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఈ చెక్కులు మాయమయ్యాయని, అందుకే ఇరు శాఖల అధికారులు తేల్చిచెప్పడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. రైతుబంధు సాయాన్ని స్వాహా చేశారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. నెల రోజులుగా తిరుగుతున్నా నాకు పెట్టుబడి సాయం కింద చెక్కులు మంజూరయ్యాయి. వాటి కోసం గడిచిన నెల రోజులుగా కార్యాలయాల చూట్టు తిరుగుతున్నాను. వ్యవసాయ కార్యాలయానికి వెళ్తే, తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లమని, ఇక్కడికి వెళ్లితే అక్కడికే వెళ్లమని తిప్పుతున్నారు. గట్టిగా నిలదీస్తే చెక్కులు గల్లంతైనట్లు చెప్పారు. వికలాంగుడైన నేను 70 ఏళ్ల వయసులో ఇంకా ఎన్ని రోజులు తిరగాలి. –శీమకుర్తి సాయిబాబా, బాధిత రైతు, అశ్వారావుపేట చెక్కులు కనిపించడం లేదు కొందరు రైతులకు మంజూరైన పెట్టుబడి సాయం చెక్కులు కనిపించని మాట వాస్తవమే. తొలిరోజు పంపిణీ కార్యక్రమంలో ఈ చెక్కులు గల్లంతైనట్లు గుర్తించాం. ఉన్నతాధికారులకు లేఖ రాసి, ఆయా రైతులకు తిరిగి చెక్కులు వచ్చేలా చర్యలు తీసుకుంటాం. మరోసారి పూర్తిస్థాయిలో పరిశీలించి చెక్కుల గల్లంతుపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. – నవీన్, ఏవో, అశ్వారావుపేట మాకు సంబంధమే లేదు పెట్టుబడి సాయం చెక్కుల పంపిణీ బాధ్యత వ్యవసాయ శాఖదే. కనిపించకుండా పో యిన చెక్కులకు, రెవెన్యూ శా ఖకు సంబంధం లేదు. వ్యవసాయ శాఖ నుంచి కూడా ఎ లాంటి నివేదికా రాలేదు. చెక్కులు మాయమైన విషయం శనివారమే నా దృష్టికి వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేయాలని బాధ్యుడైన వ్యవసాయాధికారికి సూచించాను. –యలవర్తి వెంకటేశ్వరరావు, తహసీల్దార్, అశ్వారావుపేట -
అర్చకులకే ‘దేవాలయ’ పాస్ పుస్తకాలు
సాక్షి, హైదరాబాద్: దేవాలయాల భూములకు సంబంధించిన పాస్ పుస్తకాలను తమకే ఇవ్వా లని అర్చకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు ప్రోత్సాహకం కూడా వారికే ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం సచివాలయంలో రెవెన్యూశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేశ్వర్ తివారీ, దేవాదాయ శాఖ కమిషనర్ శివశంకర్‌ను కలిసి వారి సమస్యలను విన్నవించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల అర్చకుల పేర్ల పహాణీలో అనుభవదారు పేర్లు తొలగించడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. -
కాంగ్రెస్‌కు టీఆర్ఎస్, టీడీపీలు కవలలు
సదాశివపేట(సంగారెడ్డి): కాంగ్రెస్‌కు కవల పిల్లలుగా టీఆర్ఎస్, టీడీపీలు పనిచేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. బుధవారం సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో జరిగిన బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కర్ణాటకలో టీఆర్ఎస్, టీడీపీల పరోక్ష మద్దతుతోనే సీఎం పదవి చేపట్టినట్లు కుమారస్వామి వెల్లడించారని చెప్పారు. టీఆర్ఎస్కు ఓట్లు వేస్తే కాంగ్రెస్‌ను సమర్థించినట్లేనని, కాంగ్రెస్‌కు ఓట్లు వేస్తే టీఆర్ఎస్ను సమర్థించినట్లేనని చెప్పారు. కాంగ్రెస్ చేస్తున్న బస్సు యాత్రలతో టీఆర్ఎస్కే లాభం చేకూరుతుందన్నారు. సంగారెడ్డి జిల్లాకు కేంద్రం ఇప్పటి వరకు రూ.375.52 కోట్ల నిధులు కేటాయించిందని చెప్పారు. ప్రతీ గ్రామపంచాయతీకి 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.30 లక్షల వరకు కేంద్రం మంజూరు చేసిందన్నారు. రైతుబంధు పథకం మోతుబరి రైతులు, బినామీలకే ఎక్కువ ఉపయోపడుతుందన్నారు. రైతుబంధు పథకం కౌలు రైతులకు ఎందుకు అమలు చేయట్లేదని ప్రశ్నించారు. రైతుబంధు పథకం ఎన్నికల్లో ఓట్ల కొనుగోలుకే ఉపయోగపడుతుందని, ప్రజాధనంతో ఓట్లు కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2019లో కేంద్రంలో మళ్లీ బీజేపీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. త్వరలో రాష్ట్రంలో పల్లెబాట, పల్లెనిద్ర కార్యక్రమాలు నిర్వహించి టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్‌ల గురించి ప్రజలకు వివరిస్తామని చెప్పారు. ప్రాజెక్టుల పూర్తికి కేంద్రం కృషి సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరానికి టీఏసీ అనుమతులు లభించడంపై లక్ష్మణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ అనుమతుల మంజూరీలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలోని ప్రాజెక్టుల నిర్మాణానికి వెంట వెంటనే అనుమతులిస్తూ త్వరితగతిన పూర్తి చేయడానికి కేంద్రం విశేషంగా కృషి చేస్తోందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
బక్క ‘రైతు బంధు’ కాదు : జీవన్‌రెడ్డి
సాక్షి, జగిత్యాల: రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా కాకుండా అప్పుల నిలయంగా మార్చడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పూనుకున్నారని సీఎల్పీ ఉపనేత టి. జీవన్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ 5 ఏళ్ల పాలనలో 56 వేల కోట్లు అప్పు చేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగేళ్లలోనే లక్షా నలభై వేల కోట్లు అప్పు చేసిందని మండిపడ్డారు. ఆదివారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని ఊదరగొట్టిన కేసీఆర్ నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం 12 వేల ఉద్యోగాలిచ్చి చేతులు దులుపుకున్నారని ధ్వజమెత్తారు. ఇచ్చిన ఏ హామీ సక్రమంగా అమలు కావడం లేదని విమర్శించారు. అసాధ్యమైన హామీలివ్వడం కేసీఆర్‌కు అలవాటేనని జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న హామీని కేసీఆర్ నిలబెట్టుకోవాలని సవాల్ చేశారు. రైతు బంధు పథకం పేదల కన్నా వందల ఎకరాలు ఉన్న పెద్ద రైతులకే మేలు చేస్తోందని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా 62 శాతం మంది రైతులు 45 గుంటల కన్నా తక్కువ భూమి కలిగిన వాళ్లేనని, పెట్టుబడి సాయంతో బక్క రైతు బాగు పడేదెప్పుడని ఆందోళన వ్యక్తం చేశారు. -
అబ్బే.. వదులుకోం!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : రైతుబంధు పథకం కింద ప్రభుత్వం అందజేసే పెట్టుబడి సాయాన్ని వదులుకునేందుకు జిల్లాలోని బడా రైతులు పెద్దగా ఆసక్తి చూపడంలేదు. ఆర్థికంగా ఉన్న వారు పెట్టుబడి సాయం కింద అందుకునే చెక్కులను ‘గివ్ ఇట్ అప్’ ద్వారా తిరిగి ఇవ్వొచ్చని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. అలా వచ్చిన నగదును రైతు సమన్వయ సమితి ఖాతాలో జమ చేసి రైతుల సంక్షేమానికి వినియోగిస్తామని స్పష్టంగా పేర్కొంది. అయితే ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ప్రజాప్రతినిధులు, పెద్ద రైతులు పలు వేదికల మీద తమకు వచ్చే చెక్కులను తిరిగి ఇచ్చేస్తున్నట్లు ప్రకటిస్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితి చూస్తే అందుకు భిన్నంగా ఉంది. జిల్లాలో 3.36లక్షల మంది జిల్లాలో మొత్తం 3,36,131 మంది రైతులు ఉన్నారు. వీరి చేతుల్లో దాదాపు 8,90,387 వ్యవసాయ భూమి ఉంది. అయితే వీరిలో ఇప్పటి వరకు ప్రభుత్వానికి పెట్టుబడి సాయాన్ని తిరిగిచ్చిన వారు కేవలం 24 మంది మాత్రమే. ఇలా ఇప్పటి వరకు ప్రభుత్వానికి ‘గివ్ ఇట్ అప్’ కింద రూ.4,06,220 విలువైన చెక్కులే అందాయి. చెక్కులు తిరిగి ఇచ్చిన ప్రజాప్రతినిధుల్లో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి మాత్రమే ఉన్నారు. ఇప్పటి వరకు రూ.277 కోట్ల పంపిణీ... వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం కోసం పెట్టుబడి సాయం కింద ఎకరానికి రూ.4వేలు చొప్పున అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ మేరకు జిల్లాకు రూ.355 కోట్లు విడుదల చేసింది. ఈ విలువతో 3,40,764 చెక్కులు జారీ అయ్యాయి. మే 10 నుంచి 18 వరకు అన్ని గ్రామాల్లో చెక్కులు పంపిణీ చేసిన అధికారులు వివాదాస్పద భూములు, పార్ట్–బీలో ఉన్న భూములకు సంబంధించిన చెక్కులను మాత్రం నిలిపేశారు. ఈ మేరకు ఇప్పటి వరకు రూ.277 కోట్ల విలువైన 2,49,436 చెక్కులను పంపిణీ చేశారు. స్పందన కరువు పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం అందజేసే ఎకరానికి రూ.4వేలు వదులుకునే విషయంలో సర్కారు విజ్ఞప్తికి జిల్లాలో స్పందన కరువైంది. పెట్టుబడి కోసం రైతులు అప్పులు చేయకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం సాయం చేస్తోంది. అయితే ఆర్థికంగా బలంగా ఉన్న వారు, లేదా పెద్ద రైతులు పెట్టుబడి సాయాన్ని తిరిగి ఇవ్వొచ్చని ప్రభుత్వం పేర్కొంది. ఇలా అందే సొమ్మును రైతు సంక్షేమానికే వినియోగిస్తామని స్పష్టంగా పేర్కొంది. కానీ జిల్లాలో వదులుకునేందుకు పెద్దగా ఎవరూ కూడా ముందుకు రావడం లేదు. జిల్లాలో మొత్తం 3,36,131 మంది రైతుల్లో కేవలం 24 మంది మాత్రమే పెట్టుబడి సాయాన్ని ఇప్పటివరకు తిరిగిచ్చారు. జిల్లాలో మొత్తం రూ.277 కోట్లు పంపిణీ చేయగా.. ఇప్పటి వరకు కేవలం రూ.4లక్షలు మాత్రమే తిరిగి వచ్చినట్లు అధికార గణాంకాలు పేర్కొంటున్నాయి. ప్రజాప్రతినిధులు కూడా.. నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులు పెట్టుబడి సాయాన్ని వెనక్కి ఇచ్చే విషయంలో వెనకడుగు వేస్తున్నారు. ఎకరానికి రూ.4వేల చొప్పున వచ్చే సాయాన్ని వదులుకోవడంపై ఎవరూ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. బహిరంగసభల వేదికలపై ప్రకటనలు జారీ చేస్తున్నా వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. రైతుబంధు చెక్కులు తిరిగి ఇచ్చిన 24 మందిలో అతి తక్కువ మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు. చాలా వరకు సన్న, చిన్నకారు రైతులే చెక్కులను తిరిగిచ్చి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. జిల్లాలో ఆరుగురు ఎమ్మెల్యేలు, ఒక పార్లమెంట్ సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. ఇందులో చాలా మందికి వ్యవసాయ భూములు ఉన్నాయి. అయినా దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి రూ.51,200, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి రూ.32,900 విలువైన చెక్కులను తిరిగి ఇచ్చారు. మిగతా వారి నుంచి స్పందన కానరావడం లేదు. ఇక జిల్లాలో మొత్తం 26 మండలాలకు గాను ఏడు మండలాల నుంచి మాత్రమే చెక్కులు తిరిగొచ్చాయి. అత్యధికంగా జిల్లాలో కోయిల్‌కొండ మండలంలో ఎనిమిది మంది, భూత్పూరు మండలంలో ఐదుగురు, బాలానగర్, ధన్వాడ మండలాల నుంచి ముగ్గురు, అడ్డాకుల, దేవరకద్ర మండలాల నుంచి ఇద్దరు చొప్పున, మక్తల్ మండలం నుంచి ఒకరు మాత్రమే చెక్కులు తిరిగి ఇచ్చారు. -
25 రోజుల్లో 100%
సాక్షి, హైదరాబాద్: రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు, చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని 25 రోజుల్లో వంద శాతం పూర్తి చేయాలని ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. జిల్లాకు ఒకరు చొప్పున మంత్రులు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్లను ఇన్చార్జులుగా నియమిం చాలని నిర్ణయించారు. పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు జిల్లాకో ఐఏఎస్ అధికారిని స్పెషలాఫీసర్‌గా నియమించారు. ఈ నెల 24 నుంచి జూన్ 20 వరకు 25 రోజుల పాటు అధి కార యంత్రాంగమంతా ఇదే కార్యక్రమంలో నిమగ్నం కావాలని చెప్పారు. బుధవారం ప్రగతిభవన్‌లో బుక్కులు, చెక్కుల పంపిణీపై సీఎం కేసీఆర్ ఆరు గంటలపాటు సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. స్పీకర్ మధుసూదనాచారి, ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, ముఖ్య కార్యదర్శులు, అన్ని జిల్లాల కలెక్టర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ‘‘ఈ రోజు వరకు జరిగిన భూముల అమ్మకం, కొనుగోలు వివరాలన్నీ నమోదు చేయాలి. అన్ని రకాల మ్యుటేషన్లు చేయాలి. వారసత్వ హక్కులు తేల్చాలి. కొత్తగా నమోదైన వివరాలతో పాస్ బుక్కులు ముద్రించి పంపిణీ చేయాలి. ఇప్పటికే జారీ చేసిన పాస్ పుస్తకాల్లో తప్పులుంటే వెంటనే వాటిని సవరించి కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వాలి. గుంట భూమికి కూడా యజమాని ఎవరో తేల్చాలి. జరిగిన ప్రతీ అమ్మకం, కొనుగోలును నమోదు చేయాలి. వారసత్వ హక్కులను తేల్చాలి. భూ యాజమాన్యానికి సంబంధించిన అన్ని మార్పులను నమోదు చేయాలి. పెండింగ్‌లో పెట్టొద్దు. జూన్ 20 నాటికి వివరాల నమోదు కార్యక్రమం పూర్తి కావాలి. ఆ వివరాలను పొందు పరుస్తూ ‘ధరణి’వెబ్సైట్ రూపొందించాలి. భూమికి సంబంధించి ఇకపై ఒకటే లెక్క ఉండాలి’’అని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఆదేశించారు. ఆన్లైన్ ఫ్రీజింగ్ ఎత్తివేత భూమి వివరాలను నమోదు చేయడానికి ఆన్లైన్ ఫ్రీజింగ్‌ను ఎత్తివేయాలని సీఎం ఆదేశించారు. ఈ నెల 27 నుంచి ఫ్రీజింగ్ ఎత్తివేసి ఆన్లైన్లో వివరాలు నమోదు చేయడానికి తహసీల్దార్లకు అవకాశం కల్పించాలని అధికారులను ఆదేశించారు. వంద రోజుల పాటు భూరికార్డుల ప్రక్షాళన జరిగినప్పటికీ, కొన్నిచోట్ల రికార్డుల్లో తప్పులు దొర్లడం, అసమగ్ర వివరాలుండటం పట్ల సీఎం అసహనం వ్యక్తం చేశారు. సాంకేతిక కారణాలతోపాటు మానవ తప్పిదాలు కూడా ఉన్నాయని, దీనివల్ల రైతులకు కొంత అసౌకర్యం కలిగిందని, కొందరికి పాస్ పుస్తకాలు అందలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించినప్పుడు కొన్ని సమస్యలు తప్పవని, ఈ పరిస్థితిని సవాల్‌గా తీసుకుని, మరింత ప్రభావవంతంగా పనిచేయాలని సూచించారు. కొత్త జిల్లాలతో కలెక్టర్లకు పర్యవేక్షణ సులభమైందని, దీన్ని సానుకూలాంశంగా తీసుకుని మరింత చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలన్నారు. వచ్చేనెల నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విధానంతోపాటు రైతులకు జీవిత భీమా పథకం అమల్లోకి వస్తుందని, ఇవి సవ్యంగా సాగాలంటే భూరికార్డులు సరిగా ఉండాలని పేర్కొన్నారు. ప్రక్షాళన విజయవంతం భూముల సమస్యలను పరిష్కరించడానికి గత ప్రభుత్వాలు ఎన్నడూ శ్రద్ధ పెట్టలేదని సీఎం అన్నారు. ‘‘ప్రభుత్వ శాఖల మధ్య కూడా భూ వివాదాలున్నాయి. రెవెన్యూ, అటవీ శాఖ మధ్య గొడవలున్నాయి. భూరికార్డులు సరిగా లేకపోవడం వల్ల గ్రామాల్లో గొడవలు, ఘర్షణలు జరుగుతున్నాయి. వీటన్నింటికి చరమగీతం పాడాలనే ఉద్దేశంతోనే భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టాం. దేశంలో మరే రాష్ట్రం కూడా ఈ సాహసానికి పూనుకోలేదు. ఈ బృహత్తర కార్యక్రమం విజయవంతమైంది. అధికారులు ఎంతో శ్రమకోర్చి రికార్డుల ప్రక్షాళన చేశారు’’అని చెప్పారు. ప్రతి రైతుకు బీమా పట్టా ప్రతి రైతుకు బీమా పట్టా అందిస్తామని సీఎం చెప్పారు. ‘‘రైతులు భూమిని నమ్ముకుని బతుకుతున్నారు. చాలామంది చిన్న, సన్నకారు రైతులే. ఒక్క ఎకరం లోపు భూమి ఉన్న రైతులు 18 లక్షల మంది ఉన్నారు. అలాంటి పేద రైతు చనిపోతే వారి కుటుంబం ఉన్నట్టుండి అగాథంలో పడిపోతుంది. కాబట్టి మరణించిన రైతు కుటుంబానికి 5 లక్షల బీమా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎల్ఐíసీ ద్వారా బీమా సౌకర్యం కల్పిస్తాం. రైతుల తరఫున ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుంది. ప్రతి రైతుకు బీమా పట్టా అందిస్తాం. రైతులు కోరుకున్న వారినే నామినీగా చేర్చాలి. బీమా పథకం అమలుకు సంబంధించి ఎల్ఐసీ అధికారులతో చర్చలు జరుపుతున్నాం. రైతు చనిపోయిన వెంటనే ఆయన కుటుంబానికి పరిహారం అందేలా రూపకల్పన చేయాలి’’అని అధికారులకు సూచించారు. కల్యాణలక్ష్మికి కుల ధ్రువీకరణ వద్దు రంజాన్ పండుగ ఏర్పాట్లు, రాష్ట్రావతరణ వేడుకలు, కల్యాణలక్ష్మి, హరితహారం తదితర కార్యక్రమాలపై సీఎం కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. రంజాన్ సందర్భంగా నియోజకవర్గాల వారీగా ముస్లింలకు దుస్తుల పంపిణీ చేయాలన్నారు. పేదలందరికీ కల్యాణలక్ష్మి పథకం అమలు చేస్తున్నందును కుల ధ్రువీకరణ పత్రాలు అవసరం లేదని పేర్కొన్నారు. జూన్ 1 నుంచే పాఠశాలల ప్రారంభం అవుతున్నందున జూన్ 2న రాష్ట్ర అవతరణ వేడుకలను నిర్వహించాలని సూచించారు. సీఎం తీసుకున్న కీలక నిర్ణయాలివీ.. – అసైన్డ్ భూములు కొన్న వారు పేదలైతే వారి పేరిటే యాజమాన్య హక్కులు కల్పించాలి. వారికి రైతు బంధు పథకం వర్తింపచేయాలి – స్వస్థలానికి రాలేకపోతున్న ఎన్నారైలకు పాస్ పుస్తకాలు ఇవ్వడానికి ప్రత్యేక విధానం అనుసరించాలి – ఆధార్ నంబరు అనుసంధానం చేయడానికి ముందుకు రాని వారి పాస్ పుస్తకాలను పక్కన పెట్టాలి – భూమికి సంబంధించిన అన్ని వివరాలతో ‘ధరణి’వెబ్సైట్ నిర్వహించాలి – భూరికార్డులను నిర్వహించే విషయంలో అవినీతికి పాల్పడే వారిపట్ల అత్యంత కఠినంగా ఉండాలి. తప్పులు చేసిన వారిని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి – పాస్ పుస్తకాల పంపిణీ, చెక్కుల పంపిణీ కార్యక్రమం వంద శాతం పూర్తయ్యే బాధ్యతను కలెక్టర్లతో పాటు మంత్రులు స్వీకరించాలి – ప్రతీ మండలంలో వందశాతం బుక్కులు, చెక్కుల పంపిణీ కార్యక్రమం పూర్తయ్యే బాధ్యతను ఆయా మండలాల తహసీల్దార్లకు అప్పగించాలి. జిల్లాలో మంత్రి, నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలి. చెక్కుల పంపిణీకి స్పెషలాఫీసర్లు వీరే.. పాస్ పుస్తకాలు, చెక్కుల పంపిణీ పర్యవేక్షణకు ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రత్యేకంగా నియమించింది. ఆ వివరాలివీ.. ఆదిలాబాద్– వికాస్‌రాజ్, భద్రాద్రి కొత్తగూడెం–అధర్ సిన్హా, జగిత్యాల–సందీప్‌కుమార్ సుల్తానియా, జనగామ–అజయ్‌మిశ్రా, జయశంకర్ భూపాలపల్లి–అరవింద్‌కుమార్, జోగులాంబ గద్వాల–రజత్‌కుమార్ సైనీ, కామారెడ్డి–టి.కె.శ్రీదేవి, కరీంనగర్–స్మితా సబర్వాల్, ఖమ్మం– నీతూకుమారి ప్రసాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్–టి.చిరంజీవులు, మహబూబాబాద్–క్రిస్టినా చోంగ్తు, మహబూబ్‌నగర్–దానకిశోర్, మంచిర్యాల–నవీన్‌మిట్టల్, మెదక్–రంజీవ్ ఆర్.ఆచార్య, మేడ్చల్ మల్కాజ్గిరి–జయేశ్ రంజన్, నాగర్ కర్నూల్–వి.అనిల్‌కుమార్, నల్లగొండ–సోమేశ్‌కుమార్, నిర్మల్– శశాంక్ గోయల్, నిజామాబాద్–రామకృష్ణారావు, పెద్దపల్లి–ఎన్.శ్రీధర్, సిరిసిల్ల–సునీల్‌శర్మ, రంగారెడ్డి– శైలజ రామయ్యర్, సంగారెడ్డి–మాణిక్ రాజ్, సిద్దిపేట– చిత్రా రామచంద్రన్, సూర్యపేట– వై.శ్రీలక్ష్మీ, వికారాబాద్–ఎన్.శివశంకర్, వనపర్తి–అనితా రాజేంద్ర, వరంగల్ అర్బన్– ఎం.వీరబ్రహ్మయ్య, వరంగల్ రూరల్– ఎం.జగదీశ్వర్, యాదాద్రి భువనగిరి– శాంతికుమారి. -
ఫెడరల్ ఫ్రంటే గేమ్ చేంజర్: ఎంపీ కవిత
సాక్షి, న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్ దేశ రాజకీయాల్లో గేమ్ చేంజర్‌గా నిలుస్తుందని ఎంపీ కె. కవిత అన్నారు. ఢిల్లీలోని ఇండియన్ విమెన్స్ ప్రెస్ కార్ప్‌లో మంగళవారం జరిగిన చర్చాగోష్ఠిలో ఆమె పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో దేశంలో ఎలాంటి మార్పులు తీసుకురాలేకపోయిందని విమర్శించారు. ఎన్నికలకు ఏడాదే గడువు ఉండటంతో ఇప్పటికైనా రైతులకు మేలు చేస్తుందేమో చూడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలను పరిగణనలోకి తీసుకోకుండా మోదీ సర్కార్ విధానాలు రూపొందించడం సరైంది కాదని చెప్పారు. తమది బలమైన పార్టీ కాబట్టే బీజేపీ ఏజెంట్, కాంగ్రెస్ ఏజెంటూ అంటూ టీఆర్ఎస్పై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. వ్యవస్థలో మార్పులు రావాల్సిన సమయం ఆసన్నమైందని, విధానాలు నచ్చి తమతో కలసి వచ్చే వారందరినీ స్వాగతిస్తామని చెప్పారు. రైతులను అప్పుల ఊబి నుంచి గట్టెక్కించేందుకే సీఎం కేసీఆర్ రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టారని, ఇది రైతులను వడ్డీ వ్యాపారుల బారి నుంచి రక్షిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. -
కాంగ్రెస్ నేతలు పరిగలు ఏరుకోవాల్సిందే
సాక్షి, సిద్దిపేట: ‘సీఎం కేసీఆర్ స్వయానా రైతు బిడ్డ. అందుకోసమే రైతును రాజుగా చూడాలని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ప్రభుత్వం వర్షాకాలానికి ముందుగా ఎకరానికి రూ.4 వేల పెట్టుబడి సహాయం అందిస్తోంది. దీంతో రైతులు ఎరువులు, విత్తనాల కోసం వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేసే దుస్థితి తప్పింది. ఇంత మంచి పని చేసిన కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు సమర్థి స్తున్నారు. ప్రతిచోట బ్రహ్మరథం పడుతున్నారు. ఇక కాంగ్రెస్ నాయకులు వచ్చే ఎన్నికల్లో పరిగలు ఏరుకోవడం మినహా.. చేసేది ఏమీ లేదు’అని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. బుధవారం సిద్దిపేట నియోజకవర్గం రంగధాంపల్లి, గజ్వేల్ నియోజకవర్గం బూరుగుపల్లిలో రైతుబంధు పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. రైతుబంధు పథకంతో ప్రజలు గ్రామగ్రామాన పండగ జరుపుకుంటున్నారని, సాగుకు ముందే సహాయం అందడంతో రైతు లు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రభు త్వం మద్దతు ధర, నిరంతర విద్యుత్, పెట్టుబడి సహాయం అందించడంతో పాటు సాగునీరిచ్చేందుకు కష్టపడుతోందని చెప్పారు. -
బ్యాంకుల్లో బారులు
సాక్షి, నిర్మల్: ఈనెల 10న ప్రారంభమైన రైతుబంధు పథకం జిల్లాలో ప్రశాంతంగా సాగుతోంది. సోమవారం వరకు సుమారు 64వేల మంది రైతులు చెక్కులు పొందారు. ఇందులో 4,855మంది రైతులు సంబంధిత బ్యాంకుల్లో చెక్కుల ద్వారా రూ.5.70కోట్లు తీసుకున్నారు. గ్రామాల్లో చెక్కులు పొందిన రైతన్నలు బ్యాంకుల బాట పడుతుండగా అవి ఇప్పుడు కిటకిటలాడుతున్నాయి. బ్యాంకుల వద్ద టెంట్లు, తాగునీటి వసతి కల్పించినా.. తరచూ కొన్ని బ్యాంకుల్లో సర్వర్ సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో గంటలపాటు నిరీక్షించాల్సి వస్తోంది. బ్యాంకుల్లో సందడి షురూ.. రైతుబంధు పథకం ఈనెల 10న ప్రారంభమైంది. రైతులు చెక్కులు పొందినప్పటికీ డబ్బులు తీసుకునే అవకాశం సోమవారం వరకు రాలేదు. రెండో శనివారం, ఆదివారం బ్యాంకులకు వరుస సెలవులు వచ్చాయి. అధికారులు కూడా చాలా గ్రామాల రైతుల చెక్కులపై ఈనెల 14 తర్వాత తీసుకునే తేదీలను వేశారు. ఈనేపథ్యంలో సోమవారం నుంచే బ్యాంకుల్లో సందడి ప్రారంభమైంది. జిల్లాలో నిర్మల్ అర్బన్ మండలంలో కార్పొరేషన్ బ్యాంకు ద్వారా, తానూరు, కుంటాల, కుభీర్, దస్తురాబాద్, మామడ మండలాల్లో తెలంగాణ గ్రామీణ బ్యాంకు ద్వారా, లోకేశ్వరం, దిలావర్పూర్ మండలాల్లో ఆంధ్రాబ్యాంకు ద్వారా, మిగతా 11మండలాల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా రైతులకు చెక్కులను పంపిణీ చేస్తున్నారు. పొద్దున్నుంచే బారులు.. జిల్లాకేంద్రంతో పాటు వివిధ మండలాల్లో ఉన్న బ్యాంకుల వద్ద సోమవారం ఉదయం నుంచే రైతులు బారులుతీరారు. ఐదురోజులుగా పంపిణీ పూర్తిచేసిన గ్రామాలకు చెందిన రైతులు బ్యాంకులకు తరలివస్తున్నారు. బ్యాంకు అధికారులు టెంట్లతో పాటు, వారి కోసం తాగునీటి వసతులు ఏర్పాటు చేస్తున్నారు. క్యూలైన్ పాటిస్తూ.. వరుసక్రమంలో చెక్కులను అందజేస్తూ డబ్బులు తీసుకుంటున్నారు. జిల్లాకేంద్రంలోని సంబంధిత బ్యాంకులు కిక్కిరిసిపోతున్నాయి. రైతులతో పాటు రోజువారీగా వచ్చే ఖాతాదారులతో నిండిపోతున్నాయి. ఈక్రమంలో రైతులకు ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేసి చెక్కులను అందజేస్తున్నారు. కొన్ని బ్యాంకుల్లో మాత్రం సర్వర్ సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో గంటల పాటు రైతులు వేచిచూడాల్సి వస్తోంది. నమ్మి మోసపోవద్దు.. బ్యాంకుల వద్ద చెక్కులు డ్రా చేసుకునేప్పుడు రైతులు ఎవరి మాటలను నమ్మి మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. అన్నదాతల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారి వద్ద నుంచి డబ్బులు కాజేసే ప్రయత్నం చేసేవాళ్లూ ఉంటారని హెచ్చరిస్తున్నారు. జిల్లాకేంద్రంలోని పలు బ్యాంకులను సోమవారం పట్టణ సీఐ జాన్‌దివాకర్ పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా క్యూలైన్ల ద్వారా వెళ్లేలా సిబ్బందిని ఉంచామని చెప్పారు. అలాగే అపరిచిత వ్యక్తులను నమ్మి మోసపోవద్దని అవగాహన కల్పిస్తున్నామని సీఐ పేర్కొన్నారు. ప్రశాంతంగా సాగుతున్న పంపిణీ.. జిల్లావ్యాప్తంగా రైతుబంధు చెక్కులు, పాసుపుస్తకాల పంపిణీ ప్రశాంతంగా సాగుతోంది. కార్యక్రమంలో భాగంగా సోమవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్‌అలీ, మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి, వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్మోహన్ తదితరులు సారంగపూర్ మండలం జామ్ గ్రామానికి వచ్చారు. పలువురు రైతులకు చెక్కులు, పాసుబుక్కులు అందించడంతో పాటు స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. యాసంగికి సంబంధించి నవంబర్ నెలలో ఎకరాకు రూ.4వేల చొప్పున చెల్లించనున్నట్లు వెల్లడించారు. జిల్లాలో మొత్తం రైతులు : 1, 65, 670 మొత్తం చెక్కులు : 1,67,153 పెట్టుబడి సాయం : రూ.175.01కోట్లు ఐదురోజుల్లో చెక్కుల పంపిణీ : 64,000 డబ్బులు పొందిన రైతులు : 4,855 డ్రా చేసుకున్న మొత్తం : రూ.5,70,07,830 పైసల కోసం అచ్చిన సార్లు ఊరికి అచ్చి చెక్కు ఇచ్చిండ్రు. మా దగ్గర బ్యాంకు లేదు. పైసల కోసం నిర్మల్ అచ్చిన. సర్కారు చేస్తున్న సాయం మంచిగున్నది. కొంచెం పైసలు తీసుకునతందుకే తిప్పలైతుంది. – లింగన్న, గోపాల్పేట్, సారంగపూర్ మండలం వేచిచూడాల్సి వస్తోంది రైతుబంధు చెక్కులు డ్రా చేసుకునేందుకు వచ్చిన రైతుల కోసం బ్యాంకుల్లో ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. ఒక్కోసారి సర్వర్ పని చేయడం లేదని చెబుతున్నారు. దీంతో చాలాసేపు వేచిచూడాల్సి వస్తోంది.– లోకమాన్య, భాగ్యనగర్, నిర్మల్‌రూరల్ మండలం అపరిచితులను నమ్మవద్దు చెక్కులు డ్రా చేసుకునేందుకు వచ్చే రైతులు బ్యాంకుల వద్ద ఎవరినీ నమ్మవద్దు. గుర్తు తెలియని వ్యక్తులతో సంబంధం లేకుండా నేరుగా బ్యాంకు అధికారుల నుంచే డబ్బులు తీసుకోవాలి. ఏదైనా సమస్య ఉంటే పోలీసులను సంప్రదించాలి.– జాన్‌దివాకర్, పట్టణ సీఐ, నిర్మల్ -
అభివృద్ధిలో తెలంగాణ నంబర్‌వన్
సాక్షి, తలమడుగు(బోథ్) : అనతికాలంలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్ రాష్ట్రంగా అవతరించిందని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం పొన్నారి గ్రామంలో రైతుబంధు పథకంలో భాగంగా సోమవారం చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి రాష్ట్ర చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్నతో కలిసి ఆయన రైతులకు పెట్టుబడి చెక్కులు, పట్టాదారు పాస్‌పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో డిప్యూటీ సీఎం మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడే నాటికి 40 శాతం భూరికార్డులు వివాదాలతో ఉన్నాయన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమంతో 96శాతం వరకు ఎలాంటి వివాదాలు లేకుండా భూ సమస్యలు పరిష్కరించినట్లు పేర్కొన్నారు. నాలుగైదు నెలల్లోనే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు సహకరించిన రెవెన్యూ యంత్రాంగంతో పాటు ఇతర శాఖల అధికారులను అభినందించారు. ప్రస్తుతం పంపిణీ చేస్తున్న పాస్ పుస్తకాలను 17 రకాల సైక్యూరిటీతో రూపొందించినట్లు పేర్కొన్నారు. ఇక నకిలీ పాస్‌బుక్‌లకు కాలం చెల్లినట్లే అన్నారు. రాష్ట్రంలో 58 లక్షల పాస్ పుస్తకాలను రైతులకు అందిస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని అన్నారు. దేశంలో రైతు సంక్షేమానికి సుమారు రూ.50 వేల కోట్లు వరకు ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అన్నారు. వ్యవసాయాన్ని పండుగలా చేస్తాం: మంత్రి పోచారం వ్యవసాయం అంటే పండుగలా మారుస్తామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రైతు సమన్వయ సంఘాలు రైతులకు సాగులో అండగా ఉంటూ వారికి సంబంధిత అధికారుల ద్వారా సూచనలు, సలహాలు అందేలా కృషి చేయనున్నట్లు తెలిపా రు. అలాగే మార్కెట్లో గిట్టుబాటు ధర అందని పక్షంలో రైతు సమన్వయ సంఘాల ద్వారా పంట దిగుబడులను కొనుగోలు చేస్తామన్నారు. దేశంలో రైతులను పట్టించుకున్న నాయకుడు ఒక్క కేసీఆర్ మాత్రమే అన్నారు. వచ్చే జూన్ 2నుంచి రైతులకు బీమా పథకం అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రతీ రైతుకు రూ.5 లక్షల జీవిత బీమా సదుపాయం కల్పిస్తామన్నారు. ఇందుకు గాను ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. రైతుబంధు చెక్కులను పెట్టుబడి ఖర్చులకు వినియోగించుకోవాలని రైతులకు సూచించారు. రైతుకు అండగా సీఎం : మంత్రి రామన్న పెట్టుబడి కోసం రైతుల పడే ఇక్కట్లను గుర్తించిన సీఎం కేసీఆర్ అన్నదాతకు అండగా ఉండాలనే ఉద్దేశ్యంతో రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. ఇందులో భాగంగా ఎకరానికి ఏడాదికి రూ.8వేల చొప్పున పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించి రైతులకు తొలివిడత చెక్కులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. రైతుబంధు పథకం దేశానికే ఆదర్శం : ‘గుత్తా’ రైతుబంధు పథకం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని ఆ ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుం దని రైతు సమితి రాష్ట్ర చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. రైతు సమితీలు గ్రామాల్లో కీలకపాత్ర పోషించాలన్నారు. అనంతరం గ్రామంలోని రైతు లకు పట్టా పాస్ పుస్తకాలు, చెక్కలు పంపిణీ చేసి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీ గోడాం నగేశ్, మాజీ మంత్రి వేణుగోపాలచారి, వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్మోహన్, పాడి పరిశ్రమ సంస్థ చైర్మన్ లోక భూమారెడ్డి, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, కలెక్టర్ దివ్య దేవరాజన్, ఎస్పీ విష్ణువారియర్, జిల్లా రైతు సమన్వయకర్త అడ్డి భోజారెడ్డి, డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి, సహకార సంఘ చైర్మన్ కృష్ణారెడ్డి, ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మనీషా, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న, తహసీల్దార్ రాంరెడ్డి, ఎం పీపీ మంజుల శ్రీధర్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు శ్రీలత, ఎంపీడీవో భూమయ్య, సర్పంచ్ సంగీత, ఎంపీటీసీ లక్ష్మీరమణ, ఏడీఏ రమేశ్, వైద్యాధికారి రాజీవ్‌రాజు,మండల రైతు సమన్వయకర్తలు గోవ ర్ధన్‌రెడ్డి, కేదారేశ్వర్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. -
రాజశేఖర్ రెడ్డి సేవలు మరువలేనివి: పొన్నాల
సాక్షి, జనగామ: వైఎస్ రాజశేఖరరెడ్డి నాయకత్వంలో, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నేటికి 14 సంవత్సరాలు పూర్తైందని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య గుర్తు చేశారు. సోమవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజే ఉమ్మడి రాష్ట్రాన్ని ఆదుకోవడం కోసం ఉచిత విద్యుత్ ఫైలుపై సంతకం చేశారని తెలిపారు. రైతు సంక్షేమమే ప్రజల సంక్షేమం అని భావించి వ్యవసాయానికి లాభం చేకూర్చేలా పథకాలు ప్రవేశపెట్టారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలు మరవలేనివన్నారు. అత్యంత పొడవైన సొరంగ మార్గం గల శ్రీశైలం పాజెక్టును 30 సంవత్సరాలలో పూర్తి చేయనిది కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రెండేళ్లలోనే పూర్తి చేసిందన్నారు. సింగరేణికి 22 కిలోమీటర్ల భూసేకరణ చేసి విద్యుత్ ఉత్పాదనకు ఆటంకం రాకుండా చేశామని తెలిపారు. అయినా ప్రభుత్వం దృష్టి పెట్టాల్సింది పథకాల మీద కానీ ప్రచారం మీద కాదన్నారు. రైతులకు లక్ష రుపాయల రుణమాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ హామీయిచ్చి మాట తప్పిందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు విడతల్లో చేస్తామని చెప్పి, రైతులు అప్పుల ఊబిలోకి వెళ్లిపోయినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. 24 గంటల కరెంట్ వల్ల భూగర్భ జలాలు అడుగంటి రైతులు పంట నష్టపోయారని, ఇంతవరకు నష్టపోయిన పంటలను మీ అధికారులైనా.. రైతు సమితి సభ్యులైనా సందర్శించారా అని ప్రశ్నించారు. వెంటనే పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పండిన పంటకు మద్దతు ఇవ్వకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం ఆశ్చర్యకరమైన విషయం అన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రతి పంటకు మద్దతు ధరపైన బోనస్ ఇచ్చామని గుర్తు చేశారు. కౌలు రైతులు, దేవాదాయ భూములు చేసే రైతులు మీ కళ్లకు కనిపించడం లేదా? వారికి కూడా రైతు బంధు పథకాన్ని అమలు చేయమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
ఆ ఆలోచన నుంచే రైతుబంధు పథకం
సాక్షి, మహబూబ్‌నగర్: ‘కరెంటు కోసం ధర్నాలు చేసే పరిస్థితి నుంచి రైతులకు విముక్తి కల్పించాం. ఎవరు ఎన్ని కేసులు వేసినా భయపడాల్సిన అవసరం లేదు. ప్రాజెక్టులు పూర్తి చేసి పాలమూరు జిల్లాలో 14 లక్షల ఎకరాలకు సాగునీరందించి తీరుతాం’ అని మంత్రి కే తారకరామారావు అన్నారు. ‘ఒక్క దేవరకద్ర నియోజకవర్గంలో కర్వెన రిజర్వాయర్ కోసం 5,700 ఎకరాల భూసేకరణకు సహకరించిన రైతులకు శిరస్సు వంచి పాదాబివందనం చేస్తున్నానని తెలిపారు. భూత్పూర్ మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన సభలోరైతులకు మంత్రి చెక్కుల పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో పోలీసుల బందోబస్తు నడుమ ఎరువులు పంపిణీ చేసిన ఘటనలు కాంగ్రెస్ నేతలు మర్చిపోవద్దని అన్నారు. నకిలీ విత్తనాలు అమ్మేవారిపై పీడి యాక్ట్ ద్వారా కేసులుపెట్టి రైతుకు మేలు చేస్తున్న వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు. రైతులను రుణ విముక్తులను చేయాలనే ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే రైతుబంధు పథకమని అన్నారు. గత ప్రభుత్వాలు రాబంధులుగా రైతులను పీక్కుతింటే.. కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధువుగా ఈ పథకం చేపట్టిందన్నారు. కేంద్రప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ సహకారం లేకపోవడంతోనే ఏకకాలంలో పంట రుణమాఫీ చేయలేకపోయామని తెలిపారు. 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ నాయకులు రైతులకు నాలుగు రూపాయలైనా ఉచితంగా ఇచ్చారా? అని ప్రశ్నించారు. వలసలు వెళ్లినవారు సకాలంలో రాకపోయినా.. వారు ఎప్పుడొస్తే అప్పుడు చెక్కులు అందించాలని కలెక్టర్‌కు మంత్రి కేటీఆర్ ఆదేశించారు. కౌలురైతులకు, ప్రభుత్వానికి తగాదాలు పెట్టించే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేపట్టిందని, భూ యజమానులే స్వయంగా తమకు అందిన చెక్కులో సగం డబ్బులు కౌలు రైతులకు అందించి సమస్య పరిష్కారించుకోవాలని సూచించారు. -
గల్ఫ్ వెళ్లినవారికీ ‘రైతుబంధు’
సాక్షి, కోనరావుపేట(వేములవాడ) : ఉపాధి కోసం గల్ఫ్ బాట పట్టిన రైతులకు రైతుబంధు పెట్టుబడి చెక్కులు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ఈనెల 17 తర్వాత గల్ఫ్‌లో ఉంటున్నవారి కుటుంబాల వివరాలు సేకరించి సరైన ఆధారాలు చూపితే చెక్కులు, పట్టా పాస్ పుస్తకాలు అందిస్తామని పేర్కొన్నారు. కోనరావుపేట మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన రైతుబంధు కార్యక్రమంలో రైతులకు చెక్కులు, పాస్బుక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల, ప్రజల అభివృద్ధి కోసం చేస్తున్న ప్రతీ సంక్షేమ పథకాన్ని విమర్శించడం ప్రతిపక్షాలకు అలవాటుగా మారిందన్నారు. అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక కాంగ్రెస్ నాయకులు పిచ్చెక్కినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. రైతులు పెట్టుబడి కోసం అప్పులపాలు కావద్దన్న ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. రాష్ట్రంలో 38 లక్షల మంది రైతులకు సంబందించిన రూ.17 వేల కోట్ల రుణాలను మాఫీ చేయడం జరిగిందన్నారు. గత పాలకుల హయాంలో జిల్లాలో అతి ముఖ్యమైన వేములవాడ రాజన్న ఆలయాన్ని పట్టించుకోలేదని, పైగా ఈ దేవునిపై నిందలు మోపారని అన్నారు. అలాంటి ఆలయాన్ని అభివృద్ధి పరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ.400 కోట్లు కేటాయించిందని తెలిపారు. ఉపాధి హామీ పనులను వ్యవసాయంతో అనుసంధానం చేస్తే అటు రైతులకు, ఇటు కూలీలకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. పంటలబీమా పథకం లోపభూయిష్టంగా ఉందని, రైతు యూనిట్‌గా బీమా వర్తింపజేయాలని కోరారు. కార్యక్రమంలో కలెక్టర్ కృష్ణభాస్కర్, జెడ్పీ చైర్మన్ తుల ఉమ, కరీంనగర్ డెయిరీ చైర్మన్ రాజేశ్వర్‌రావు, ఆర్ఎస్ఎస్ జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, ఏఎంసీ వైస్ చైర్మన్ మల్యాల దేవయ్య, ఎంపీపీ సంకినేని లక్ష్మి, జెడ్పీటీసీ పల్లం అన్నపూర్ణ, సింగిల్‌విండో చైర్మన్లు మోతె గంగారెడ్డి, ఎదురుగట్ల చంద్రయ్యగౌడ్, సెస్ డైరెక్టర్ తిరుపతి, మండల నాయకులు శంకర్‌గౌడ్, ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు గోగు ప్రతాపరెడ్డి, అన్ని గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
మళ్లీ గెలవాలె..!
సాక్షిప్రతినిధి, కరీంనగర్ : గులాబీనేతలు పల్లెబాట పడుతున్నారు. ప్రజలతో మమేకమయ్యేందుకు ఈ మధ్యన ఎక్కువగా పల్లెల్లోనే గడుపుతున్నారు. ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో చురుగ్గా పాల్గొంటున్నారు. ‘ఆరు నూరైనా.. మళ్లీ ఎన్నికల్లో మనమే గెలవాలి.. మనం చేపడుతున్న అభివృద్ధి పనులు.. వాటి ఫలాలను ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీదే. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందేలా చూడండి. 2019 సాధారణ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయండి.. తస్మాత్ జాగ్ర త్త..’ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల పలు సందర్భాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు హితబోధ చేసిన విషయం తెలిసిందే. అధినేత ఆదేశాలను అందుకున్న ఎమ్మెల్యేలు, మంత్రులు పార్టీ పటిష్టంగా ఉన్న సమయంలోనే పట్టు కోల్పోకుండా ఉండేందుకు ప్రజలకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. స్థాని కంగా ఉంటూ ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యాచరణకు గులాబీ శ్రేణులు శ్రీకారం చుట్టారు. ఆసరా పింఛన్లు, తెలంగా ణ ను సస్యశ్యామలం చేసేందుకు చేపడుతున్న ప్రాజెక్టులు, మిషన్‌భగీరథ, మిషన్ కాకతీయ, డబుల్బెడ్రూం ఇళ్లు, కులవృత్తులకు చేయూత, విద్య, వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ వంటి ప్రభుత్వ కార్యక్రమాలపై విస్తృతంగా ప్రచారం కల్పిస్తున్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిపొందుతున్న ప్రతి కుటుంబంతో సంబంధాలు కలుపుకునేందుకు తంటాలు పడుతున్నారు. గ్రామాల్లో జరిగే చిన్న చిన్న కార్యక్రమాలను కూడా ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం వేదికగా మలుచుకుంటున్నారు. గులాబీ నేతల్లో ‘రైతుబంధు’ జోష్ ప్రజల వద్దకు వెళ్లాలంటే కారణం ఉండాలి. ఊరికే వెళితే ఎందుకొచ్చారనే ప్రశ్నలు తలెత్తుతాయి. ఎన్నికలు దగ్గర పడుతున్నారు. ఏడాదిముందునుంచే తమ ఉనికికి భంగం కలుగకుండా కాపాడుకోవాలి. ప్రజల వద్దకు ఎలా వెళ్లాలని తర్జనభర్జన పడుతున్న సమయంలోనే కేసీఆర్ రైతుబంధు పథకాన్ని తెరపైకి తెచ్చారు. ఇంకేముంది మంత్రులు, ఎమ్మెల్యేలకు చేతినిండా పనికల్పించినట్లయింది. ఎప్పుడు హైదరాబాద్‌కు, సొంత పనులకు నడిచే తమ కార్లను ఇప్పుడు గ్రామాల వైపు మళ్లిస్తున్నారు. గ్రామాల్లో 70 శాతంమంది భూమిని నమ్ముకున్న వారే ఉన్నారు. ఇంతకంటే మంచి కార్యక్రమం మరొకటి ఉండదని భావించిన గులాబీ శ్రేణులు కదనరంగంవైపు అడుగులు వేస్తున్నారు. రైతుబంధు పథకాన్ని వంద శాతం ఉపయోగించుకుంటూ ప్రజలకు చేరువయ్యేందుకు ఎత్తులు వేస్తున్నారు. ప్రతిపక్షాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా గడపగడపకూ తమ కార్యక్రమాలను తీసుకెళుతున్నారు. పెట్టుబడి సాయం చెక్కులు, పాస్ బుక్కులు పంపిణీ కార్యక్రమం ద్వారా ప్రజలతో మమేకమవుతూ నాలుగేళ్లలో తమ పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాల గొంతుక వినిపిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ ప్రజలను అంటిపెట్టుకుని ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ‘మీతోనే మేమంటూ’ ప్రజలతో జట్టు కడుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాపై ప్రత్యేక దృష్టి.. వరుస కార్యక్రమాలతో బిజీబిజీ టీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సెంటిమెంట్ జిల్లా అయిన ఉమ్మడి కరీంనగర్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. ఉద్యమాల ఖిల్లా, రాజకీయాలను శాసించే జిల్లాగా పేరున్న కరీంనగర్లో 2014 ఎన్నికల్లో 13 నియోజకవర్గాలకు గానూ జగిత్యాల మినహాయిస్తే 12 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేసింది. టీఆర్ఎస్కు కరీంనగర్ పుట్టినిల్లుగా బావిస్తున్న గులాబీ శ్రేణులు ఇంట గెలిచి రచ్చ గెలవాలనే భావనతో ఉన్నారు. ఇక్కడ అయితే ఈసారి అన్ని నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగురవేయాలని కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక్కడి నుంచే మరో మారు సెంటిమెంటు పండించాలని వ్యూహరచన చేస్తున్నారు. అధినేత ఆశయాలకు తగ్గట్టుగానే మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తూ కార్యకర్తలు, ప్రజల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు గ్రామాల్లో వరుస కార్యక్రమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. తమ తమ నియోజకవర్గాల్లోని రోజుకు నాలుగైదు గ్రామాల్లో రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపడుతూ ప్రజాక్షేత్రంలో గడుపుతున్నారు. శాసనసభ ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావించే పంచాయతీ ఎన్నికలు రేపోమాపో అంటున్న తరుణంలో గ్రామాల్లో రాజకీయ వేడి రాజుకుంటోంది. అధికారపక్షం నేతలు చెక్కుల పంపిణీ చేస్తున్నట్లు, ఇదంతా ఎన్నికల స్టంటేనంటూ ప్రతిపక్షాలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. తమది గెలుపు కోసం ఆరాటం కాదంటూ రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామంటూ అధికార పక్షం ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది. ఇలా అధికార, ప్రతిపక్ష పార్టీల ఆరోపణలు, ప్రత్యారోపణలతో గ్రామాల్లో రాజకీయ వాతావరణ నెలకొంటోంది. చెక్కులు వచ్చిన సంబురంలో రైతులుంటే, వాటిని ఓట్లుగా ఎలా మలుచుకోవాలని అధికార పార్టీ, ఎలా ఎదురుదెబ్బ తీయాలని ప్రతిపక్షాలు ఎత్తులకుపైఎత్తులు వేస్తున్నాయి. మొత్తం మీద రైతుబంధు పథకం రాజకీయ వేడిని రగుల్చుతోంది. -
‘రైతుబంధు’ బదిలీలు 22 మంది అధికారులకు పోస్టింగులు
సాక్షి, హైదరాబాద్: ‘రైతుబంధు’పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి వ్యవసాయ శాఖ బదిలీలు చేపట్టింది. పరిపాలనాపరమైన సౌలభ్యంకోసం ఈ ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది. ఐదో జోన్‌కు చెందిన 12 మంది, ఆరో జోన్‌కు చెందిన ఐదుగురుసహా మరో ఐదుగురిని బదిలీ చేస్తూ ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారధి ఉత్తర్వులు జారీచేశారు. ఏవో, ఏడీఏ స్థాయిలో బదిలీలు జరిగాయి. ఆదిలాబాద్ ఎఫ్‌టీసీలో ఏవోగా పనిచేస్తున్న భాస్కర్‌ను నేరేడుగొండ మండల ఏవోగా నియమించారు. కె.అరుణ (తాలమడుగు, ఆదిలాబాద్ జిల్లా), వికార్‌అహ్మద్ (కుబీర్, నిర్మల్ జిల్లా), ప్రవీణ్‌కుమార్ (తానూరు, నిర్మల్), బి.వనీల (జగిత్యాల అర్బన్), జె.అనూష (మంథని, పెద్దపల్లి జిల్లా), డీఎన్‌కే శ్రీనివాసరావు (మధిర, ఖమ్మం జిల్లా), సీహెచ్ అనిల్‌కుమార్ (భద్రాచలం), రూప (కల్లూరు, ఖమ్మం జిల్లా), జి.నర్మద (సుజాతనగర్, భద్రాద్రి జిల్లా), బి.రాజేశ్వరి (చుంచుపల్లి, భద్రాద్రి జిల్లా), పి.రాకేశ్ (లక్ష్మీదేవిపల్లి, భద్రాద్రి జిల్లా), కె.నవీన్‌కుమార్ (దుమ్ముగూడెం, భద్రాద్రి జిల్లా), కె.నగేష్‌రెడ్డి (వర్ని), కె.రాజలింగం (మద్నూర్), ఆర్.శశిధర్‌రెడ్డి (బిక్నూరు), జె.రాధ (వాడెపల్లి), డి.సౌమ్య (రుద్రూరు) బదిలీ అయిన వారిలో ఉన్నారు. అలాగే నలుగురు ఏడీఏలకూ బదిలీ ఇచ్చారు. వారిలో ఎం.చంద్రశేఖర్ (బాన్స్వాడ, కామారెడ్డి జిల్లా), ఎ.ఆంజనేయులు (బిచ్కుంద, కామారెడ్డి జిల్లా), బి.మంగీలాల్ (ఇచోడ, ఆదిలాబాద్ జిల్లా), జె.బాబు (బోథ్, ఆదిలాబాద్ జిల్లా) ఉన్నారు. -
గల్ఫ్‌లో ఉన్న రైతులకూ పెట్టుబడి సాయం
సిరిసిల్ల: గల్ఫ్‌లో ఉన్న రైతులకు కూడా ప్రభుత్వం రైతు బంధు పథకం ద్వారా పెట్టుబడి సాయం అందిస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆదివారం ఆయన ‘రైతుబంధు పథకంపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈనెల 10వ తేదీ నుంచి 17వ తేదీ వరకు స్థానికంగా ఉన్న రైతులకు పెట్టుబడి సాయం చెక్కులు పంపిణీ చేస్తామన్నారు. ఈనెల 17వ తేదీ తర్వాత గల్ఫ్‌లో ఉన్న వారికి.. చిన్నచిన్న సమస్యలతో ఆగిన వారికి చెక్కులను అందిస్తామని మంత్రి వెల్లడించారు. రైతులందరికీ రైతుబంధు పథకం వర్తిస్తుందన్నారు. ఇందులో ఆ పార్టీ, ఈ పార్టీ అనే భేదంలేదన్నారు. ఇంతపెద్ద కార్యక్రమంలో చిన్నచిన్న పొరపాట్లు ఉంటే.. సవరించేందుకు ప్రభుత్వం, యంత్రాంగం సిద్ధంగా ఉందని అన్నారు. ఎవరైనా గొడవలు చేసినా భయపడేది లేదని, ధర్నాలు చేయించినా.. ఆందోళన పడొద్దని మంత్రి కోరారు. అలాగే కేవలం చెక్కులు ఇచ్చి వెళ్లిపోకుండా ప్రతి రైతును కలవాలని కేటీఆర్ సూచించారు. టీఆర్ఎస్ నాయకులు బస్సుల్లో రావాలి. ఈనెల 10న హుజూరాబాద్‌లో జరిగే సీఎం సభకు జిల్లా నుంచి 25వేల మంది రైతులు రావాలని మంత్రి కోరారు. టీఆర్ఎస్ నాయకులు కార్లలో కాకుండా రైతులతోపాటు బస్సుల్లో రావాలన్నారు. ఏ ఊరి నాయకులు ఆ ఊరి రైతులతో కలసి రావాలని, బస్సులకు మామిడి తోరణాలు కట్టుకుని దసరా పండుగలాగా.. సంతోషంగా రావాలని సూచించారు. రెండురోజుల పాటు ఇసుక లారీలు, గ్రానైట్ లారీలను ఆపి వేయాలని ఎస్పీ రాహుల్‌హెగ్డేను కోరారు. అందరూ క్షేమంగా ఇల్లు చేరే విధంగా టీఆర్ఎస్ నాయకులు బాధ్యత తీసుకోవాలన్నారు. సీఎం సభను విజయవంతం చేయాలని కోరారు. ఎండల నేపథ్యంలో చెక్కుల పంపిణీని ఉదయం, సాయంత్రం వేళల్లో చేయాలని సూచించారు. ఈ సమావేశంలో కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్, ఎస్పీ రాహుల్‌హెగ్డే, టీఆర్ఎస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. -
చెక్కులివ్వకపోతే చిక్కులే..
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ‘రైతుబంధు’ పథకం కింద అర్హులైన ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందజేస్తామని రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. దేశ చరిత్రలోనే తొలిసారి పట్టాదార్ పుస్తకాలు, రైతులకు ఆర్థిక చేయూతనందిస్తున్న రాష్ట్రం మనదేనని అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన ‘రైతుబంధు’ పథకంపై అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్నివర్గాలను భాగస్వాములను చేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతానికి వివాదరహిత భూములకు చెక్కులను పంపిణీ చేస్తున్నప్పటికీ, మిగతా వాటికి దశలవారీగా సాయం అందజేస్తామన్నారు. వక్ఫ్, దేవాదాయ, భూదాన్ భూముల విషయంలో ప్రభుత్వంతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, యాదయ్య, అంజయ్యయాదవ్, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ పెంటారెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి కోఅర్డినేటర్ వంగేటి లక్ష్మారెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి, కలెక్టర్ రఘునందన్‌రావు, జాయింట్ కలెక్టర్ హరీశ్, వివిధ మండలాల రైతు సమన్వయ సమితి సమన్వయకర్తలు, బ్యాంకర్లు పాల్గొన్నారు. రైతు రావాలి.. ఆధార్ చూపాలి...కలెక్టర్ రఘునందన్‌రావు.. వ్యక్తిగతంగా రైతు వస్తేనే చెక్కు అందజేస్తాం. ఆధార్‌ను తప్పనిసరిగా చూపాలి. చెక్కులు, పాస్‌పుస్తకాల పంపిణీకి ప్రత్యేక బృందాలను నియమించాలి. రెవెన్యూ గ్రామం యూనిట్‌గా చెక్కులు పంపిణీ చేస్తాం. ప్రతి మండలానికి నోడల్ బ్యాంకును గుర్తించాం. 10వ తేదీ నుంచి 17వ తేదీ మధ్య ఉదయం 7 నుంచి 11 గంటలవరకు, సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల వరకు చెక్కులను నిర్దేశిత ప్రదేశంలో అందజేస్తాం. చెక్కుల జారీ, తేదీ, స్థలం తదితర వివరాలతో కూడిన స్లిప్పులను రెండు రోజలు ముందటే ఆయా గ్రామాల్లో రైతులకు పంపిణీ చేస్తాం. వక్ఫ్, దేవాదాయ భూములను సాగు చేసుకుంటున్న రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భూదాన్ బోర్డు అసైన్డ్ చేస్తే ఆ రైతులకు మాత్రం పెట్టుబడి సాయం దక్కుతుంది. పట్టాదార్లకు కాకుండా ఇతరులకు చెక్కుల పంపిణీ జరగదు. ఆధార్ వివరాలు ఇవ్వని 22 వేల మందికి చెక్కులు ఇవ్వడంలేదు. జిల్లావ్యాప్తంగా 93శాతం రికార్డుల ప్రక్షాళన జరిగింది. మిగతా 7 శాతంలో వివాదాస్పద, కోర్టు కేసులు ఇతరత్రా భూ వివాదాలున్నవి ఉన్నాయి. రైతు బంధు పథకం కింద రూ.283.05 కోట్ల సాయం అందజేస్తున్నాం. బ్యాంకుల్లో నగదును సమృద్ధిగా ఉంచుకోవాలని ఆదేశించాం. నగదు మార్పిడిలో ఇబ్బందులు తలెత్తకుండా బ్యాంకులకు పోలీస్‌బందోబస్తును ఏర్పాటు చేస్తాం. చెక్కులివ్వకపోతే చిక్కులే.. 1965లో భూదాన్ యజ్ఞబోర్డు నోటిఫికేషన్ జారీచేసింది. ఈ భూములను ఎన్నో ఏళ్లుగా సాగుచేసుకుంటున్న రైతులకు పెట్టుబడి సాయం అందించలేమనడం సరికాదు. కబ్జాలో ఉన్న ప్రతి రైతుకూ సాయం చేయాల్సిందే. అలా చేయకపోతే పథకం ఉద్ధేశం పక్కదారి పట్టి ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది. 93శాతం మందికి చెక్కులు పంపిణీ చేసి.. మిగతావారిని విస్మరించడాన్ని కొందరు అనుకూలంగా మలుచుకునే వీలు లేకపోలేదు. -
10న కాగజ్‌నగర్‌కు సీఎం కేసీఆర్?
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈ నెల 10వ తేదీన రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్‌కు వస్తున్నట్లుగా సమాచారం. చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు కరీంనగర్‌కు విచ్చేస్తున్న సీఎం, కాగజ్‌నగర్‌కు సైతం వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలిసింది. ఇటీవల మంత్రి కేటీఆర్ వస్తున్నట్లుగా ప్రచారం జరిగినా, చివరి నిమిషంలో మంత్రి కార్యక్రమం రద్దయ్యింది. దీంతో ఎలాగైనా 10న సీఎం కాగజ్‌నగర్‌కు విచ్చేసి రైతుబంధు చెక్కుల పంపిణీతో పాటు మిషన్ భగీరథ, ఇతరత్ర అభివృద్ధి పనులను ప్రారంభించనున్నట్లుగా తెలిసింది. ఇదే విషయమై ఎమ్మెల్యే కోనేరు కోనప్పను సాక్షి సంప్రదించగా, అధికారికంగా ఇంకా ధ్రువీకరణ జరగలేదని, సీఎం కేసీఆర్ వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, శనివారం పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందని చెప్పారు. -
కేసీఆర్‌ది తుగ్లక్ పాలన : రాజగోపాల్ రెడ్డి
సాక్షి, నకిరేకల్ : ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు తెలంగాణలో తుగ్లక్ పరిపాలన చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. రైతులకు డబ్బులు ఇచ్చే రైతుబంధు పథకం వారిని మోసం చేయడానికే అని ఆరోపించారు. తన ఫామ్‌హౌస్ చుట్టూ ఆత్మహత్యలు చేసుకున్న రైతులను పరామర్శించడానికి కేసీఆర్‌కు సమయం లేదు కానీ ఆంధ్రప్రదేశ్‌లోని పరిటాల రవి కుమారుడి పెళ్లికి వెళ్లటానికి టైమ్ ఉంటుందని ఎద్దేవా చేశారు. తెలంగాణలోని 119 సీట్లలో మొదటగా గెలిచే సీటు నకిరేల్‌లో చిరుమర్తి లింగయ్య మాత్రమే అని రాజగోపాల్ రెడ్డి అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడం కోసమే రైతుబంధు పథకం ప్రవేశపెట్టారని వాఖ్యానించారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం రౌడీ రాజకీయానికి 2019లో ప్రజలే బుద్ధి చెప్పుతారని హెచ్చరించారు. -
పగడ్బందీగా చెక్కుల పంపిణీ
సాక్షి, పెద్దపల్లి : జిల్లాలో రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ శ్రీదేవసేన అధికారులను ఆదేశించారు. రైతుబంధు పథకంలో భాగంగా చెక్కుల పంపిణీ, పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీపై గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ప్రత్యేక అధికారులు, రైతు సమన్వయ సమితి సభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ అత్యంత పారదర్శకంగా ‘రైతుబంధు’ నిర్వహించాలన్నారు. జిల్లాలోని 208 గ్రామాల్లో 1,27,733 మంది రైతుల వద్ద ఉన్న 2,56,730 ఎకరాలకు రూ. 100కోట్లకు పైగా విలువ గల 1,28,280 చెక్కులు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయన్నారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు మే 10న చెక్కుల పంపిణీ, పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం ప్రారంభించి 17వ తేదీకల్లా వారంరోజుల్లో పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వం ముద్రించిన పాస్ పుస్తకాలు అత్యంత భద్రత ప్రమాణాలతో ఉన్నాయన్నారు. చెక్కుల పంపిణీలో రైతు సమన్వయ సమితి సభ్యుల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ప్రభుత్వం అందించే పెట్టుబడి పథకం ప్రతి రైతుకి అందుతుందని, ఈ విషయంపై రైతులకు అవగాహన కల్పిస్తూ వారిలో విశ్వాసం పెంచాలన్నారు. పంపిణీ సమయంలో వచ్చే సమస్యలను అధిగమించాలన్నారు. పంపిణీ కేంద్రం వద్ద హెల్ప్‌డెస్క్, గ్రీవియెన్స్ సెల్ ఏర్పాటు చేయాలన్నారు. రైతులు తమ సందేహాలను, సమస్యలను గ్రీవియెన్స్ సెల్లో అందిస్తే రెండురోజుల్లో వారి సమస్య పరిష్కారమవుతుందన్నారు. అధికారులు వారికి వెంటనే సమాధానాలు అందించాలని, గ్రీవియెన్స్ సెల్లో విధులు నిర్వర్తించే వారికి ఉన్నతాధికారులు శిక్షణ ఇవ్వాలన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలని, టెంట్లు, కుర్చీలు వేయాలని, తాగునీరు, మజ్జిగ పాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. చెక్కుల పంపిణీ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యేలు, అధికార ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉండేలా సమన్వయం చేసుకోవాలన్నారు. ఆర్డీవోలు వ్యక్తిగతంగా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని, గ్రామాల్లో చెక్కుల పంపిణీ కోసం అనువైన వేదికలను అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి గుర్తించాలన్నారు. చెక్కుల పంపిణీ కార్యక్రమ తేదీ, సమయం, వేదిక, తదితర అంశాలతో కూడిన కరపత్రాలు ముద్రించి రైతులకు పంపిణీ చేయాలని, ఏ గ్రామంలో చెక్కులు పంపిణీ చేసేది వారికి ముందస్తుగా తెలియజేయాలన్నారు. సుదీర్ఘ అనుభవమున్న అధికారుల సేవలు వినియోగించుకోవాలన్నారు. 300 మంది రైతులకు చెక్కులు పంపిణీ చేసేందుకు ఒక బృందం ఏర్పాటు చేసుకున్నామని, ఆ బృందాల్లోని సభ్యులకు బాధ్యతలు అప్పగించి ఒక నమూనా తయారు చేయాలన్నారు. దాని ప్రకారం అంతా సవ్యంగా సాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. పట్టాదార్ పాస్ పుస్తకం నంబరు చెక్కుపై ఉంటుందని, ఆ వివరాలు, రైతుల ఆధార్ వివరాలు సరిచూసుకోవాలన్నారు. అధికారులు చెక్కు, పాస్ పుస్తకం పంపిణీ చేసేటపుడు లబ్ధిదారుని వద్ద నుంచి రెండు ప్రింటెడ్ రశీదులపై సంతకాలు తీసుకోవాలని, రూ. 50వేలలోపు వరకు ఒక్క చెక్కు, ఆపై పెట్టుబడి సాయానికి రెండు చెక్కులు అందిస్తామన్నారు. ప్రభుత్వం అందించే సహాయం వదులుకునే వారి చెక్కులను రైతు సమన్వయ సమితుల అకౌంట్‌కు అందజేయాలన్నారు. రైతుబంధు పథకం అమలుకోసం రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతగా బ్యాంకులకు రూ. 6వేల కోట్లు విడుదల చేసిందన్నారు. చెక్కుల అకౌంట్ బుక్‌ను బ్యాంకులు నిర్వహించాలన్నారు. చెక్కులపై ఉన్న పేర్లలో పొరపాట్లను పాస్‌పుస్తకం పరిశీలించి నగదు అందించాలని, లోన్, క్యాష్ కటింగ్ వంటివి పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని బ్యాంకర్లను హెచ్చరించారు. తహసీల్దార్లు ఆధార్ సీడింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని, సాదా బైనామా దరఖాస్తులు ఈనెల 28లోగా పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో జేసీ వనజాదేవి, రెతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు కోట రాంరెడ్డి, ఇన్చార్జి డీఆర్వో బైరం పద్మయ్య, ఆర్డీవో అశోక్‌కుమార్, డీఏవో తిరుమల్‌ప్రసాద్, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, బ్యాంకు ప్రతినిధులు, ప్రత్యేక అధికారులు, సభ్యులు పాల్గొన్నారు. -
పట్టాఉన్న ప్రతి రైతుకూ ‘పెట్టుబడి’
కేతేపల్లి (నకిరేకల్) : భూమి పట్టా ఉన్న ప్రతి రైతుకూ రైతుబందు పథకం కింద పెట్టుబడి సాయం అందిస్తామని రాష్ట్ర మార్కెటింగ్, భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు. కేతేపల్లిలో మండలంలోని ఇప్పలగూడెం శివారులో రూ.3కోట్ల నాబార్డు నిధులతో నిర్మించనున్న ధాన్యం గిడ్డంగుల నిర్మాణానికి మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత పాలకులు దండగన్న వ్యవసాయాన్ని సీఎం కేసీఆర్ పండగ చేస్తున్నారని అన్నారు. వ్యవసాయ పెట్టుబడి కోసం రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా సంవత్సరంలో రెండు పంటలకు సాయాన్ని అందిస్తామన్నారు. జిల్లాలోని నాగార్జునసాగర్, డిండి, మూసీ ప్రాజెక్టుల కింద ప్రతి నీటి చుక్కనూ వినియోగించుకుని రికార్డుస్థాయిలో రూ.650 కోట్ల విలువైన నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి సాధించామన్నారు. జిల్లాలో ఎక్కడ చూసినా ధాన్యం రాశులే కనిపిస్తున్నాయని అన్నారు. దిగుబడులు భారీగా రావడంతో.. ధాన్యం కొనుగోళ్లలో జిల్లా నంబర్‌వన్ స్థానంలో ఉందని పేర్కొన్నారు. ఉదయ సముద్రం ప్రాజెక్టు నిర్మాణ పనులు 98 శాతం పూర్తయ్యాయని, ప్రాజెక్టు కింద నకిరేకల్ నియోజకవర్గంలో 62వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని అన్నారు. రైతులు ఇబ్బందులు పడకూడదనే గోదాములను నిర్మిస్తున్నామని చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాత రూ.20 కోట్లతో మూసీ ప్రాజెక్టును ఆధునీకరించి 35వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామనని తెలిపారు. మూసీ కాల్వల ఆధునీకరించి.. చివరి ఆయకట్టు వరకు నీరందించేందుకు మరో రూ.65 కోట్లు మంజూరు చేశామన్నారు. నకిరేకల్‌లో నిమ్మ, నల్లగొండలో బత్తాయి మార్కెట్ నిర్మాణ పనులు పూర్తయ్యాయని, త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం చేసిన విజ్ఞప్తి మేరకు కేతేపల్లి మండలంలో స్థలం చూపించినట్లయితే సబ్‌మార్కెట్ మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. అంతకుముందుకు కేతేపల్లికి చేరుకున్న మంత్రికి ప్రజాప్రతినిధులు, అధికారులు టీఆర్ఎస్ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే వేముల వీరేశం, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ గౌరవ్‌ఉప్పల్, జేసీ నారాయణరెడ్డి, డీఆర్డీఏ పీడీ రింగు అంజయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నోముల నర్సింహ్మయ్య, పూజర్ల శంభయ్య, కేతేపల్లి ఎంపీపీ గుత్తా మంజుల, నార్కట్‌పల్లి ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, జెడ్పీటీసీ జటంగి లక్ష్మమ్మ, మార్కెట్ చైర్మన్ మొగిలి సుజాత, వైస్ చైర్మన్ ఎం.వెంకట్రాంరెడ్డి, జిల్లా నీటిపారుదల శాఖ ఎస్ఈ హమీద్‌ఖాన్, ఆర్డీఓ వెంకటాచారి, తహసీల్దార్ బి.కవిత, ఎంపీడీఓ కిషన్, పి.ఇందిర తదితరులు పాల్గొన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి కేతేపల్లి : ఆరుగాలం కష్టించి పంటలు పండించిన రైతులకు కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బంది లేకుండా చూడాలని రాష్ట్ర మార్కెటింగ్, బారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. మండలంలోని కొత్తపేటలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంలో ఏమేరకు ధాన్యం కొనుగోళ్లు చేపట్టారు.. రవాణా.. నిల్వ ఉన్న ధాన్యం రాశులు.. మద్దతు ధర తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వ ఉం చకుండా వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని సూ చించారు. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కొనుగో లు చేసేలా మిల్లర్లతో చర్చించాలన్నారు. డబ్బుల చె ల్లింపులో జాప్యం లేకుండా చూడాలని ఆదేశించారు. -
మాది ‘రైతుబంధు’ ప్రభుత్వం
సాక్షి, జగిత్యాల: తమది ‘రైతుబంధు’ప్రభుత్వమని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. ‘రాయితీ కాదు.. అప్పు కాదు.. నేరుగా పెట్టుబడి రూపంలో పంటకు రూ.4 వేల చొప్పున ఇచ్చి తిరిగి తీసు కోని ఏకైక ప్రభుత్వం మాదే’ అని అన్నారు. జగిత్యాల జిల్లాలో రూ.285.83 కోట్లతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు మంగళవారం ఆయ న శంకుస్థాపన, రూ.250 కోట్ల రుణాలు పంపి ణీ చేశారు. జగిత్యాలలో ఏర్పాటు చేసిన ‘రైతు బంధు’ అవగాహన సదస్సులో మాట్లాడారు. రైతుకు ప్రధానంగా కావాల్సింది పెట్టుబడని, అది త్వరలోనే ఇస్తున్నామన్నారు. పండించిన పంటకు మద్దతు ధర విషయంలో కూడా తమ ప్రభుత్వానికి స్పష్టత ఉందన్నారు. రైతు సమన్వయ సమితులకు రూ.500 కోట్లు కేటాయించామని, ఈ సమితులు రైతులకు మద్దతు ధర కల్పించే విషయంలో కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి పేర్కొన్నారు. వ్యవసాయ పెట్టుబడికి సంబంధించి మే 10 నుంచి ప్రారంభం కానున్న రైతుబంధు పథకం ఊరూరా పండుగ వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచిం చారు. దేశంలో ఎంతో మంది నాయకులు.. ఎన్నో ప్రభుత్వాలు పని చేసినా ఇప్పటి వరకు ఎవరికీ రాని ‘రైతుబంధు’ ఆలోచన కేవలం సీఎం కేసీఆర్‌కే సాధ్యమైందని చెప్పారు. నాడు శాపాలు పెట్టిండ్రు ‘సమైక్య రాష్ట్రంలో నాటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ వస్తే చీకట్లో మగ్గుతది.. బోర్ల పడ్తది అనే శాపాలు పెట్టిండు’ అని మంత్రి అన్నారు. అప్పట్లో మేం ప్రతిపక్షంలో ఉన్నం. ఎండిన కంకులు.. వరి చేలను పట్టు కుని శాసనసభకు వెళ్లినం, ధర్నాలు చేశామని తెలిపారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని వెంకటాపురానికి చెందిన మునిగె ఎల్లయ్య ఎరువుల కోసం క్యూ లో నిలబడి ఎండదెబ్బతో చనిపోయిన ఘటన ఇప్పటికీ మర్చిపోలేనని చెప్పారు. అలాంటి పరిస్థితులు తెలంగాణలో రావద్దనుకున్నామని, ఇప్పుడు అభివృద్ధిలో రాష్ట్రం దూసుకుపోతోందన్నారు. ఇప్పుడు కరెంట్ వద్దని రోడ్డెక్కుతున్నారు ఒకప్పుడు కరెంటు కావాలని రైతులు రోడ్డెక్కితే.. ఇప్పుడు అంత కరెంట్ వద్దని రోడ్డెక్కే పరిస్థితి నెలకొన్న విషయం వాస్తవం కాదా? అని మంత్రి ప్రశ్నించారు. అవసరం మేరకు నాణ్యమైన ఎరువులు.. విత్తనాలు రైతులకు అందిస్తున్నామన్నారు. జగిత్యాలలో మామి డికి అపార వనరులుండటంతో స్థానికంగా ఓ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఖమ్మం, కరీంనగర్లో ఐటీ టవర్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయని చెప్పారు. తెలంగాణలో రూ.18 వేల కోట్ల వ్యయంతో 3 లక్షల డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. దేశంలో మొత్తం 29 రాష్ట్రాలుంటే.. తెలంగాణకు మినహా మిగిలిన 28 రాష్ట్రాలు కలిపి హౌసింగ్ పాలసీపై చేస్తున్న ఖర్చు.. మన రాష్ట్రంలో డబుల్ బెడ్రూం నిర్మాణాల ఖర్చుకు సమానం కాదన్నారు. సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. పసుపు, మిర్చి, పత్తి రైతులకు పెట్టుబడి సాయం, గిట్టుబాటు ధర అందించే విషయమై ఆలోచించాలని మంత్రిని కోరారు. స్పందించిన కేటీఆర్ సీఎం, వ్యవసాయ శాఖ మంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. -
ఆధార్ నంబర్ ఇస్తేనే పెట్టుబడి సాయం
పాన్‌గల్: ఖాతా నెంబర్లు ఉన్న ప్రతిరైతు ఆధార్ నెంబర్లు అందిస్తేనే వారికి పెట్టుబడి సాయం అందుతుందని కలెక్టర్ శ్వేతామహంతి అన్నారు. సోమవారం సాయంకాలం పాన్‌గల్ ఎంపీడీఓ కార్యాలయంలో తహసీల్దార్ కార్యాలయం సిబ్బందితో మండలంలో రైతు ఖాతాలకు ఆధార్ నెంబర్ల అనుసంధానంపై ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మే 10వ తేదీ నుంచి అందించే ఎకరాకు రూ.4వేలు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రతిరైతు ఆధార్ నెంబర్లను సిబ్బందికి అందించాలన్నారు. ఆధార్ నెంబర్లను అందించని రైతుల ఖాతాలను బీనామీగా గుర్తిస్తామన్నారు. ప్రతి రైతు ఆధార్ నెంబర్లు అందించేలా సిబ్బంది గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించాలన్నారు. పెట్టుబడి సాయం అందించే విషయంలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అర్హులైన ప్రతి రైతుకు న్యాయం జరిగే విధంగా సిబ్బంది కృషి చేయాలన్నారు. దీంతోపాటు డబుల్ ఖాతాలు లేకుండా సరి చూసుకోవాలన్నారు. ఆధార్ నెంబర్ల ఆన్లైన్ అనుసంధానం వివరాలను ఆమె సెల్ఫోన్లో పరిశీలించారు. సమావేశంలో తహసీల్దార్ అలెగ్జాండర్, ఆర్ఐ బాల్‌రాంనాయక్, సీనియర్ అసిస్టెంట్ శంకర్, వివిధ గ్రామాల వీఆర్ఓలు పాల్గొన్నారు. -
రైతు బంధు అమలు చరిత్రాత్మకం..
సాక్షి, సంగారెడ్డి : రైతు బంధు పథకం అమలు చరిత్రాత్మక నిర్ణయమని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సంగారెడ్డి కలెక్టరేట్లో రైతు బంధు అమలుపై సోమవారం జరిగిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ‘రైతు బంధు పథకం అమలు చరిత్రాత్మక నిర్ణయం. రాష్ట్రం ఏర్పడిన మూడున్నర ఏళ్లలో స్పష్టమైన మార్పు వచ్చింది. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశాం. రాష్ట్రంలోని 58 లక్షల మంది రైతులకు ఆరువేల కోట్ల రూపాయలు ఇవ్వనున్నాం. అటవీ భూముల్లో పట్టాలున్న రైతులకు ఎకరాకు నాలుగు వేలు ఇస్తాం.రైతులు బ్యాంకులకు వెళితే డబ్బులు లేవనే సమస్య తలెత్తదు’ అని అన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజా ప్రతినిధులకు, రైతు సమన్వయ సమితి కో- ఆర్డినేటర్లకు రైతులకు పాసు పుస్తకాలు, చెక్కుల పంపిణిపై అవగాహన కల్పించారు. ఇంకా ఈ కార్యక్రమానికి డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, రాష్ట్ర రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. -
ఠాణాల్లో భద్రం!
సాక్షి, కామారెడ్డి: పంట పెట్టుబడి సాయంగా రైతులకు అందించేందుకు తయారు చేసిన చెక్కులు జిల్లాకు చేరాయి. వాటిని పోలీస్ స్టేషన్లలో భద్రపరిచారు. రైతాంగానికి పెట్టుబడి సాయంగా ఎకరాకు రూ.4 వేల చొప్పున రైతులకు ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించిన విషయం తెలిసిందే. పెట్టుబడి సాయం అందించడానికి జిల్లాలో తొలివిడతలో 156 రెవెన్యూ గ్రామాలను ఎంపిక చేశారు. ఆయా గ్రామాల్లోని 80,051 మంది రైతులకు అందించడానికి రూ. 62.85 కోట్లకు సంబంధించి 80,383 చెక్కులు తయారు చేశారు. ఈ చెక్కులు జిల్లాకు చేరాయి. వీటిని కలెక్టర్ సత్యనారాయణ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ అధికారులు ఠాణాల్లో భద్రపరిచారు. సర్కారు ఆదేశాలే ఆలస్యం.... మొదటి విడత ఎంపిక చేసిన 156 రెవెన్యూ గ్రామాల్లో చెక్కుల పంపిణీకి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. మొదట నిర్ణయించిన ప్రకారం ఈ నెల 20 నుంచి చెక్కులను పంపిణీ చేయాల్సి ఉంది. ప్రభుత్వం చెక్కుల పంపిణీని వాయిదా వేసింది. తేదీ ఖరారు చేయకపోవడంతో చెక్కులను భద్రంగా కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ఏ ఇబ్బంది తలెత్తకుండా ఉండాలన్న ఉద్దేశంతో పోలీసు స్టేషన్లలో భద్రపరిచారు. ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఆదేశాలు వస్తే అప్పుడు పంపిణీ చేయడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు. రెండో విడత చెక్కుల పంపిణీకి కూడా కసరత్తు జరుగుతోంది. జిల్లా యంత్రాంగం రికార్డుల ప్రక్షాళనలో భాగంగా డిజిటలైజేషన్ ప్రక్రిను వేగం పెంచింది. మరో వందకుపైగా గ్రామాలకు సంబంధించిన ప్రక్రియ త్వరలో పూర్తికానుంది. వీటికి చెక్కులు కూడా సిద్ధం అవుతున్నట్టు తెలిసింది. మొదటి విడత పంపిణీ పూర్తవకముందే రెండో విడతకు సంబంధించిన చెక్కులు జిల్లాకు చేరుతాయని భావిస్తున్నారు. మంత్రికి ప్రతిష్టాత్మకం దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా రైతులకు పంట పెట్టుబడి సాయంగా ఎకరాకు రూ. 4 వేల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది రైతులకు చెక్కులను అందించే అవకాశం వ్యవసాయ శాఖ మంత్రిగా పోచారం శ్రీనివాస్‌రెడ్డికి దక్కింది. దీనిని ఆయన ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. తన సొంత జిల్లాలో పంపిణీ ప్రక్రియ వేగంగా జరగాలని ఆయన ఆరాటపడుతున్నారు. చెక్కుల పంపిణీ నమూనా(మాక్) కార్యక్రమాన్ని ఇటీవలే జిల్లాలోని భిక్కనూరు మండలం గుర్జకుంట గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి హాజరై పంపిణీలో ఎదురయ్యే ఇబ్బందులు, సమస్యలను ఎలా అధిగమించాలి, సమస్యలు తలెత్తకుండా ఎలా వ్యవహరించాలన్న విషయాలపై అధికారులు, సిబ్బందికి అవగాహన కల్పించారు. చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఎలా మొదలుపెట్టాలి, ఎలా పూర్తి చేయాలన్న దానిపై ప్రయోగాత్మకంగా చూపించారు. కార్యక్రమాన్ని ఎలా సక్సస్ చేయాలన్న దానిపై అధికారులకు సూచనలు ఇస్తున్నారు. పోలీస్స్టేషన్లలోభద్రపరిచాం.. రైతు బంధు పథకం కింద పంపిణీ చేయడానికి ప్రభుత్వం చెక్కులను పంపించింది. వాటిని పోలీస్ స్టేషన్లలో భద్రపరిచాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే రైతులకు అందిస్తాం. – నాగేంద్రయ్య, జిల్లా వ్యవసాయశాఖ అధికారి -
‘రైతుబంధు’ చెక్కులొచ్చాయ్..!
నల్లగొండ అగ్రికల్చర్ : రైతులకు వ్యవసాయ పెట్టుబడి అందించాలన్న సదుద్దేశంతో సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం చెక్కుల పంపిణీకి రంగం సిద్ధమైంది. జిల్లా వ్యాప్తంగా సాగుకు యోగ్యమైన భూములు, రైతుల వివరాలు, ఖాతాల సేకరణ వంటి కార్యక్రమాన్ని ఆరెడు నెలలుగా రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహించారు. జిల్లాలో సుమారు 12 లక్షల ఎకరాల సాగుకు యోగ్యమైన భూమి ఉన్నట్లు గుర్తించారు. వారికి ఎకరానికి రూ.4 వేల చొప్పున ఖరీఫ్ సీజన్‌కు రూ.480 కోట్ల అవసరమవుతాయని నిర్ధారించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు. దాని కనుగుణంగా రైతులకు పెట్టుబడి కింద నగదు రూపంలో కాకుండా చెక్కులు అందించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యేకంగా చెక్కులను కూడా ముద్రించింది. జిల్లాలో మొత్తం 566 గ్రామాలు ఉండగా మొదటి దశలో 173 గ్రామాల్లోని రైతులకు ఖరీఫ్ పెట్టుబడి కోసం రైతుబంధు పథకం చెక్కులను పంపిణీ చేయనున్నారు. ఎకరానికి రూ.4వేల చొప్పున అందించేందుకు అవసరమైన రూ.117.78 కోట్ల విలువ గల చెక్కులను వ్యవసాయ శాఖ అధికారులు జిల్లాకు తీసుకువచ్చారు. ఆ చెక్కులను మొదటి దశలో 1,10,823 మంది రైతులకు అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాకు తీసుకువచ్చిన చెక్కులను ఆయా మండలాల్లోని పోలీస్స్టేషన్లలో వ్యవసాయ శాఖ అధికారులు భద్రపరిచారు.రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 20వ తేదీ నుంచి రైతులకు పంపిణీ చేయాలని నిర్ణయించినప్పటికీ అధికారికంగా తేదీని ప్రకటించిన వెంటనే ఆయా గ్రామాల్లో చెక్కులను పంపిణీ చేయడానికి అవసరమైన ఏర్పాట్లను జిల్లా రెవెన్యూ, వ్యవసాయ, పోలీసు శాఖలు ఏర్పాట్లు చేస్తున్నాయి. గ్రామ సభల్లో పంపిణీ రాష్ట్ర ప్రభుత్వం తేదీని ప్రకటించిన వెంటనే ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన గ్రామ సభల్లో చెక్కులను రైతులకు పంపిణీ చేయనున్నారు. అందులో రెవెన్యూ, వ్యవసాయ, పోలీసు శాఖ సిబ్బందితో పాటు ప్రజాప్రతినిధులు, రైతు సమన్వయ సమితి సభ్యులను భాగస్వామలను చేయనున్నారు. ఏ రైతు పేరున ఉన్న చెక్కును ఆ రైతుకు మాత్రమే అందజేయనున్నారు. ఒకేవేళ రైతు అనారోగ్యానికి గురై గ్రామ సభలకు రాని పరిస్థితి ఉంటే రైతు వద్దకే అధికారులు వెళ్లి చెక్కును అందజేయనున్నారు. వేరే వారికి ఎట్టి పరిస్థితులలో చెక్కులను అందించవద్దని ప్రభుత్వం స్పష్టం చేయడంతో అధికారులు ముందస్తు జాగ్రత్తలను తీసుకుంటున్నారు. మిగతా రైతులకు రెండు విడతల్లో.. మిగిలిన రైతులకు పది రోజులకు రెండవ దశలో, మరో పది రోజుల్లో మూడోదశలో రైతులకు చెక్కులను పంపిణీ చేయనున్నారు. మూడుదశల్లో జరిగే పంపిణీ కార్యక్రమాన్ని మొత్తం నెల రోజుల్లో పూర్తి చేయడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పారదర్శకంగా చెక్కుల పంపిణీ రైతుబంధు చెక్కులను పారదర్శకంగా పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఎక్కడ కూడా తప్పుదోవ పట్టడానికి అవకాశం ఉండదు. ఎవరి పేరున ఉన్న చెక్కును ఆ రైతుకు మాత్రమే అందజేస్తాం. గ్రామ సభలను ఏర్పాటు చేసి సభలో మాత్రమే చెక్కులను పంపిణీ చేస్తాం. చెక్కుల పంపిణీకి రెవెన్యూ, పోలీసు శాఖల సహకారాన్ని తీసుకుంటున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి తేదీని ప్రకటించమే తరువాయి.వెంటనే చెక్కులను పంపిణీ చేస్తాం.–బి.నర్సింహారావు, జిల్లా వ్యవసాయాధికారి -
‘పెట్టుబడి సాయం’ వాయిదా..
రైతులకు ఇప్పట్లో ‘పెట్టుబడి సాయం’ అందేలా కనిపించడం లేదు. ఈ నెల 20 నుంచే రైతులకు తొలి విడత చెక్కుల పంపిణీ ప్రారంభించాల్సి ఉండగా, సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ప్రభుత్వం నుంచి మౌఖిక ఆదేశాలు అందడంతో తాత్కాలికంగా వాయిదా వేశారు. ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు అందే వరకు రైతులకు ఎదురుచూపులు తప్పేలా లేవు. మోర్తాడ్(బాల్కొండ): రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఆదుకునేందుకుగాను సాగు ఖర్చుల కోసం ఎకరాకు రూ.8 వేల చొప్పున పెట్టుబడి సాయం అందించేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులకు ఎకరానికి రూ.4 వేల చొప్పున అందించేందుకు నిర్ణయించింది. ఖరీఫ్‌కు సంబంధించి మూడు విడతల్లో పంపిణీ చేయాలని నిర్ణయించిన సర్కారు.. ఈ నెల 20 నుంచి తొలి విడత చెక్కులు పంచాలని భావించింది. ఇందుకోసం ఇప్పటికే జిల్లాకు పెట్టుబడి సాయం కింద చెక్కులు కూడా చేరాయి. ప్రభుత్వం నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం చెక్కులు పంపిణీ చేసేందుకు వ్యవసాయాధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే, అయితే చెక్కుల పంపిణీలో కొంత జాప్యం నెలకొంది. ప్రభుత్వం నుంచి మౌఖిక ఆదేశాలు అందడంతో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. తదుపరి ఆదేశాలు అందిన తరువాతనే గ్రామాల్లో సభలను నిర్వహించి పెట్టుబడి చెక్కులను పంపిణీ చేయనున్నారు. జిల్లాకు చేరిన రూ.66 కోట్ల విలువైన చెక్కులు తొలి విడతలో జిల్లాలోని 77,889 మంది రైతులకు రూ.66 కోట్ల విలువ చేసే 78,059 చెక్కులను పంపిణీ చేయడానికి వ్యవసాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం ప్రత్యేకంగా ముద్రించిన చెక్కులను రాజధాని నుంచి తీసుకవచ్చి మండలాల వారీగా సరఫరా చేశారు. రైతు పేరుతో ముద్రించిన చెక్కులను సిద్ధంగా ఉంచినా, ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయాలని నిర్ణయించింది. ఇందుకు కారణాలు మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. భూ రికార్డుల ప్రక్షాళన అనంతరం రైతులకు డిజిటల్ పట్టాదారు పాసుపుస్తకాలను ముద్రించి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఇంతవరకు డిజిటల్ పట్టాదారు పాసుపుస్తకాల ముద్రణ ఇంకా పూర్తి కాలేదు. అయితే పాత పట్టాదారు పుస్తకాలను పరిశీలించి వాటి ఆధారంగానే చెక్కులను పంపిణీ చేయాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయంపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా పెట్టుబడి సహాయం చెక్కుల కార్యక్రమం వాయిదా పడటంతో రైతుల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. రబీ సీజన్ పూర్తి కావడంతో రానున్న ఖరీఫ్‌కు రైతులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో పెట్టుబడి చెక్కులు చేతికందితే కొంత ఊరట కలిగేదని రైతులు భావిస్తున్నారు. ఆదేశాలు అందిన తరువాతే.. పెట్టుబడి సాయం చెక్కులు జిల్లాకు చేరాయి. అయితే ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందడంతో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశాం. తదుపరి ఆదేశాలు అందిన తరువాతనే చెక్కులు పంపిణీ చేసేందుకు గ్రామసభల నిర్వహణకు షెడ్యూల్ ఖరారు చేస్తాం. – గోవింద్, జిల్లా వ్యవసాయాధికారి -
‘రైతుబంధు’ పకడ్బందీగా అమలు చేయాలి
ఆదిలాబాద్‌అర్బన్: రైతుబంధు పథకం ద్వారా పెట్టుబడి చెక్కులను పకడ్బందీగా గ్రామాల వారీగా పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్ అన్నారు. ఎకరానికి రూ.4 వేలు ఆర్థిక పెట్టుబడి కింద ప్రభుత్వం అందజేస్తోందని తెలిపారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి వివిధ మండలాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొదటి విడతగా జిల్లాలో 173 గ్రామాల్లో రూ.63.76 కోట్ల విలువైన 41,120 చెక్కులను రైతులకు అందజేస్తామని అన్నారు. గ్రామాల వారీగా షెడ్యూల్ సిద్ధం చేసుకోవాలని చెప్పారు. చెక్కుల పంపిణీ కార్యక్రమం వేదికను పాఠశాలల్లో ఏర్పాటు చేసుకోవాలని, స్థలాలు లేని ప్రాంతాల్లో టెంట్లు ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు. ఏయే గ్రామాల రైతులకు ఎక్కడెక్కడ చెక్కులను తీసుకోవాలో ముందుగా గ్రామాల్లో రైతులకు తెలపాలని అన్నారు. ఆయా చెక్కులను పట్టాదార్లకు మాత్రమే ఇవ్వాలని, ఎట్టి పరిస్థితుల్లో ఇతరులకు ఇవ్వకూడదని స్పష్టం చేశారు. పంపిణీ తీరును వీడియో చిత్రీకరించాలని, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. చెక్కులను ఆయా మండల పోలీస్‌స్టేషన్‌లో భద్రపర్చాలని, పంపిణీ కానీ చెక్కులను ఆయా పోలీస్‌స్టేషన్‌లో ఉంచాలని అన్నారు. వీఆర్వోలు, వీఆర్ఏలు ఆర్వోఆర్, వన్–బీలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. పంపిణీకి రైతు సమన్వయ సమితుల సభ్యులు, ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని పేర్కొన్నారు. వేసవి కాలం దృష్ట్యా ఆయా పంపిణీ స్థలాల్లో తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అందుబాటులో ఉం చుకోవాలని సూచించారు. మరిన్ని సూచనలకు ఈ నెల 17న సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాలు జారీ చేయనున్నట్లు వివరించారు. పంపిణీ చేసే చెక్కులకు నగదు సమకూర్చుకోవాలన్నారు. అనంతరం ఎల్డీఎం ప్రసాద్ మాట్లాడుతూ రిజర్వు బ్యాంకు సహకారంతో నగదు నిల్వలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సంబంధిత పట్టాదారుడికి మాత్రమే నగదు చెల్లిస్తామని, పాస్‌బుక్ జిరాక్స్, ఆధార్, ఓటర్ ఐడీ కార్డు తీసుకురావాలని తెలిపారు. ఎస్బీఐకి చెందిన చెక్కులు ఆదిలాబాద్‌లోని ఏదైనా ఎస్బీఐ బ్రాంచీలో నగదు పొందవచ్చన్నారు. ఈ సమావేశంలో ఆర్డీవో లు జగదీశ్వర్‌రెడ్డి, సూర్యనారాయణ, జెడ్పీ సీఈవో జితేందర్‌రెడ్డి, బ్యాంకు మేనేజర్లు, అధికారులు పాల్గొన్నారు. మరుగుదొడ్ల నిర్మాణాలు వేగవంతం చేయండి ఆదిలాబాద్‌అర్బన్: గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్ దివ్యదేవరాజన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి వివిధ మండలాల ఎంపీడీవోలు, ఇతర మండల స్థాయి అధికారులతో హరితహారం, మరుగుదొడ్ల నిర్మాణాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 78 గ్రామ పంచాయతీల్లో నిర్మించాల్సిన మరుగుదొడ్లను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు. మొదటి ఫొటోలను అప్లోడ్ చేయాలని సూచించారు. నిర్మాణాలకు కావాల్సిన రూ.40 లక్షల రివాల్వింగ్ ఫండ్‌ను మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. అనంతరం హరితహారం కార్యక్రమంపై సమీక్షించారు. గిరిజన ప్రాంతాల్లో గృహోపకరమైన మొక్కలు పెంచాలని, గ్రామాల్లో హరితహారం రిజిస్ట్రార్‌ను ప్రారంభించాలని, గ్రామాల పర్యటనలో భాగంగా పరిశీలిస్తామని తెలిపారు. మొక్కలు చనిపోతే వాటి స్థానంలో కొత్త మొక్కలు నాటాలని, ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ చేయాలన్నారు. గ్రామాల్లో పన్ను వసూళ్లు వందశాతం చేయాలని పేర్కొన్నారు. మండలాలు, గ్రామాల వారీగా మరుగుదొడ్ల నిర్మాణాలు, మొక్కల సంరక్షణ వంటి వాటిపై ఆయా గ్రామాల ఇన్చార్జిలు, ఎంపీడీవోలతో సమీక్షించారు. ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
మంత్రి పర్యటన: అధికారులపై వేటు
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం గుర్జకుంటలో గురువారం ‘రైతుబంధు’ పథకం పంపిణీ నమూనా సదస్సు జరిగింది. ఈ సదస్సులో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి , విప్ గంప గోవర్దన్, కలెక్టర్ సత్యనారాయణ, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టుతో కామారెడ్డి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు రెండు పంటలకు సాగునీళ్లిస్తామని తెలిపారు. మంత్రి లేదా ఎమ్మెల్యే చేతుల మీదుగా రైతులకు చెక్కులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రైతు బంధు పథకానికి రూ.6 వేల కోట్లు విడుదల చేసినట్లు మంత్రి వెల్లడించారు. అధికారులపై వేటు జిల్లాలో ఇద్దరు ప్రభుత్వాధికారులపై వేటు పడింది. బిక్నూర్ మండలం ఆర్ఐ, వీఆర్వోలపై సస్పెన్షన్ వేటు వేశారు. మంత్రి పోచారం జిల్లా పర్యటన సందర్భంగా.. సదరు అధికారులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినట్టు సమాచారం. దీంతో వారిని సస్పెండ్ చేస్తూ తహసీల్దార్‌కు ఛార్జ్ మెమో జారీ చేయాలని కలెక్టర్‌ను మంత్రి ఆదేశించారు. -
చెక్కులు రెడీ
మెదక్‌జోన్:తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు చెక్కుల పంపిణీకి సమయం ఆసన్నమైంది. నాలుగు విడతల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఈ నెల 20 నుంచి మొదటి విడత పంపిణీ కార్యక్రమం ప్రారంభంకానుంది. జిల్లాలో 80 వేల ఎకరాలకు సంబంధించి 65,153 మంది రైతులు మొదటి విడతలో చెక్కులు అందుకోనున్నారు. అవకతవకలు జరగకుండా రైతు సమన్వయ సమితి సభ్యులు అధికారులు, రైతులకు నడుమ అనుసంధానకర్తలుగా వ్యవహరించనున్నారు. మొదటి విడతలో రూ. 48 కోట్లు.. జిల్లాలో 20 మండలాలు ఉండగా, 381 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. 3.20 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి, 2.20 లక్షలమంది రైతులు ఉన్నారు. మొదటి విడతలో 130 రెవెన్యూ గ్రామాలకు చెందిన 80 వేల ఎకరాలకు సంబంధించి 65,153 మంది రైతులకు చెక్కులు పంపిణీ చేయనున్నారు. మొదటి విడతలో సుమారు రూ.48 కోట్లు పంపిణీ చేయనున్నట్లు జిల్లా స్థాయి అధికారి ఒకరు తెలిపారు. చెక్కుల పంపిణీలో ఎలాంటి అవకతవకలు జరగకుండా అధికారులు పక్కాగా ప్రణాళికలు చేస్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియలో రైతు సమితులు అధికారులకు, రైతులకు అనుసంధానంగా వ్యవహరించనున్నారు. అర్హులైన ప్రతీ రైతుకు ఎకరాకు రూ. 4 వేలు అందిస్తామనిఅధికారులు చెబుతున్నారు. తప్పనున్న పెట్టుబడి తిప్పలు.. ఇన్నాళ్లు సాగు ప్రారంభం అయ్యే సమయంలో పెట్టుబడికి చేతిలో పైసలు లేక రైతులు నానా అవస్థలు పడేవారు. అప్పుల కోసం వడ్డీ వ్యాపారులు, బ్యాంకుల చుట్టూ తిరుగాల్సిన పరిస్థితి ఉండేది. దీంతో సాగు ఆలస్యమయ్యేది. ఈ ఏడాది నుంచి ఎకరాకు రూ.4 వేల చొప్పున ప్రభుత్వం అందిస్తుండడంతో రైతులకు పెట్టుబడి తిప్పలు తీరనున్నాయి. సంతోషంగా ఉంది.. పంట పెట్టుబడికి ప్రభుత్వం ఎకరాకు రూ. 4 వేలు ఇవ్వడం సంతోషంగా ఉంది. ఇప్పటి దాక సాగు ప్రారంభంలో అప్పులు దొరకక అనేక అవస్థలు పడేది. పైసలు సకాలంలో దొరకక మందులు ఆలస్యంగా సల్లటంతో మంచి దిగుబడి రాకపోయేది. ఇక నుంచి ఆ బాధలు ఇక ఉండవు. ముందుగా పైసలు వస్తుండడంతో అదనులో సాగు ప్రారంభిస్తాం. మందులు ముందే తెచ్చుకుంటాం. –నర్సింలు, రైతు -
రైతుబంధుకు రూ.6 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: రైతుబంధు పథకం కింద అన్నదాతలకు పెట్టుబడి సొమ్ము అందించడానికి రూ.6 వేల కోట్లకు ప్రభుత్వం పరిపాలన ఉత్తర్వులిచ్చింది. ఖరీఫ్ సీజన్ కోసం ఈ నిధులు కేటాయిస్తూ వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 20 నుంచి చెక్కుల పంపిణీ ప్రారంభించేందుకు వ్యవసాయ శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. బ్యాంకులు ము ద్రించిన చెక్కులను గురువారం నుంచి మూడు రోజులపాటు జిల్లాలకు సరఫరా చేయనున్నా రు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు మినహా మిగిలిన 28 జిల్లాలకు మొదటి విడత చెక్కులను జిల్లా వ్యవసాయాధికారులకు పంపిణీ చేస్తా రు. వాటిని గ్రామసభలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా వారికే అప్పగించారు. చెక్కులిస్తే నగదెట్లా? చెక్కుల పంపిణీకి పెద్ద ఎత్తున ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నెల రోజుల్లో మూడు విడతలు గా రూ. 6 వేల కోట్లు పంపిణీ చేయనుంది. సొమ్మును రైతు ఖాతాలో జమ చేయకుండా ఎక్కడైనా చెల్లుబాటయ్యేలా ఆర్డర్ చెక్కులు ఇస్తోంది. వీటిని రాష్ట్రంలో సంబంధిత బ్యాంకు బ్రాంచీలో ఎక్కడైనా జమచేసి డబ్బులు తీసుకునే వీలుంటుంది. ప్రస్తుతం బ్యాంకుల్లో నగదు సమస్య తీవ్రంగా ఉంది. ఏ బ్యాంకుకెళ్లినా రూ.5 వేలకు మించి తీసుకునే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో చెక్కులు పొందిన రైతులకు ఇబ్బంది ఎదురవుతుందని వ్యవసాయాధికారులు ఆందోళన చెందుతున్నారు. కందుల సొమ్ములోనూ.. ఇటీవల ప్రభుత్వం 2.62 లక్షల మెట్రిక్ టన్నుల కందులు కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో రూ.1,420 కోట్లు జమ చేసింది. ఆ డబ్బుల కోసం వెళ్తే కరెన్సీ కొరత వల్ల ఎంతోకొంత ఇచ్చి బ్యాంకులు చేతులు దులుపుకుంటున్నాయి. పెట్టుబడి సొమ్ము తీసుకునే రైతులకూ ఇదే సమస్య ఉత్పన్నమవుతుందా అని చర్చ జరుగుతోంది. డబ్బుల కోసం రిజర్వు బ్యాంకు నుంచి అనుమతి తీసుకోవాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి ప్రభుత్వానికి విన్నవించిన విషయం తెలిసిందే. ఆర్బీఐకి ప్రభుత్వం విన్నవించినా ఇప్పటికీ స్పష్టత రాలేదని అధికారులు చెబుతున్నారు. -
‘రైతు బంధు’ ఆలస్యం!
ఇప్పటివరకు రెవెన్యూరికార్డుల సమాచారంప్రభుత్వానికి చేరని కారణంగానిర్ణీత వ్యవధిలో చెక్కుల పంపిణీ ఉండకపోవచ్చనితెలుస్తోంది. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి:‘రైతు బంధు’కు ఆదిలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి. భూ రికార్డుల అప్డేషన్ ప్రక్రియ ఇంకా కొలిక్కిరాకపోవడంతో చెక్కుల పంపిణీ ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఎకరాకు రూ.4వేల చొప్పున రైతాంగానికి పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 19 నుంచి దశలవారీగా గ్రామాల్లో రైతు బంధు పథకం వర్తింపజేయాలని సంకల్పించింది. భూ రికార్డుల ప్రక్షాళన పర్వానికి తెరపడిన అనంతరం ఆ సమాచారాన్ని అప్డేట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ సమాచారానికి అనుగుణంగా రైతులకు చెక్కులను పంపిణీ చేయాలని భావించింది. అయితే, రికార్డుల సమాచారం ఇప్పటివరకు ప్రభుత్వానికి చేరకపోవడంతో చెక్కుల ముద్రణ జాప్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా దాదాపు 7.10 లక్షల ఎకరాలకు పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించిన రెవెన్యూయంత్రాంగం.. ఈమేరకు 2,87,768 పట్టాదారు పాస్‌పుస్తకాల ముద్రణకు రంగం సిద్ధం చేసింది. వాస్తవానికి రెవెన్యూ రికార్డుల ప్రక్రియ పూర్తికాగానే సేకరించిన సమాచారాన్ని అప్డేట్ చేయాల్సివుంటుంది. ఈ సమాచారాన్ని సీసీఎల్ఏకు నివేదించి.. అక్కడినుంచి ఎన్ఐసీ(నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్)లో మరోసారి వివరాలను సరిచూసుకొని వాటిని బ్యాంకులకు పంపించాల్సివుంటుంది. ఈ మేరకు నిర్దేశించిన బ్యాంకులు చెక్కులు ముద్రించాలి. ప్రక్రియ ఇలా కొనసాగాల్సివుండగా మంగళవారం నాటికి జిల్లాకు సంబంధించిన సమాచారం సీసీఎల్ఏకు చేరలేదు. దీంతో చెక్కుల పంపిణీపై ప్రభావం పడుతోందని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. ఈక్రతువు నెల 15వ తేదీలోపు పూర్తయితే తప్ప ఖరారు చేసిన ముహూర్తం(19వ తేదీ) రోజున చెక్కుల పంపిణీ జరిగే అవకాశం లేదని అంటున్నారు. ఈ నెల 12 నుంచి 14వ తేదీల్లో మొదటి విడత చెక్కుల పరిశీలనకు రావాలని ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. అయితే, మన జిల్లాకు ఈ పిలుపు రాకపోవడం.. ఇప్పటివరకు రెవెన్యూ రికార్డుల సమాచారం ప్రభుత్వానికి చేరలేదనే సమాచారంతో నిర్ణీత వ్యవధిలో చెక్కుల పంపిణీ ఉండకపోవచ్చని తెలుస్తోంది. మరోవైపు రికార్డుల్లో వ్యవసాయ భూములుగానే నమోదైనా క్షేత్రస్థాయిలో అవి వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తుండడంతో పెట్టుబడి సాయం వర్తింపుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. వ్యవసాయేతర భూములను రైతుబంధు పథకం నుంచి మినహాయింపునిచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది. -
711 గ్రామాల్లో చెక్కుల పంపిణీ లేనట్లే!
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు చెందిన 711 గ్రామాల్లో మొదటి విడత రైతుబంధు చెక్కుల పంపిణీపై నీలినీడలు కమ్ముకున్నాయి. భూరికార్డుల సమాచారం సరిగా లేకపోవడమే ప్రధాన కారణమని అధికారులు అంటున్నారు. ఈ నెల 20న రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడత రైతుబంధు చెక్కుల పంపిణీ చేపట్టనున్న విషయం తెలిసిందే. మొదటి విడతలో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు మినహా మిగిలిన 28 జిల్లాలకు చెందిన 3,302 గ్రామాల్లో 16.36 లక్షలమంది రైతులకు రూ.1,602 కోట్ల చెక్కులను పంపిణీ చేస్తున్నట్లు వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి ఇటీవల కలెక్టర్లకు రాసిన లేఖలో పేర్కొన్నారు. దీని కోసం వ్యవసాయశాఖ మూడు విడతలుగా రైతుల సమాచారాన్ని బ్యాంకులకు అందజేసింది. వాస్తవంగా రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల సమాచారాన్ని వ్యవసాయశాఖకు రెవెన్యూశాఖ మొదట్లో పంపిందని, వాటిల్లో వ్యవసాయ భూములని పేర్కొన్న అనేకచోట్ల భవనాలు, ఇతరత్రా వాణిజ్య సముదాయాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ సమాచారం గందరగోళంగా ఉండడంతో రెవెన్యూశాఖకు తిప్పి పంపినట్లు సమాచారం. 12, 13, 14 తేదీల్లో జిల్లా అధికారులకు చెక్కులు ఈ నెల 12, 13, 14 తేదీల్లో మొదటి విడత చెక్కులను జిల్లాలకు చేరవేసేందుకు వ్యవసాయశాఖ ఏర్పాట్లు చేసింది. ఆయా తేదీల్లో బ్యాంకులవారీగా హైదరాబాద్‌లో నిర్ణీత ప్రదేశంలో చెక్కుల పరిశీలనకు రావాలని జిల్లా, మండల అధికారులను పార్థసారధి ఆదేశించారు. మూడో విడతకు చెందిన 2,064 గ్రామాల డేటాను సోమవారం ఆయన బ్యాంకులకు అందజేశారు. -
పట్టాదార్లకే పెట్టుబడి చెక్కులు
ఆదిలాబాద్‌అర్బన్ : రైతుబంధు పథకం కింద పెట్టుబడి చెక్కులను పట్టాదారులకే అందించాలని కలెక్టర్ దివ్యదేవరాజన్ అన్నారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి ఆయా మండలాల తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు పంట పెట్టుబడి కోసం ఎకరానికి రూ.4 వేలు చొప్పున ప్రభుత్వం ఇస్తుందని అన్నారు. రైతుబంధు పథకం కింద చెక్కులను గ్రామాల వారీగా భూములు కలిగిన పట్టాదారు రైతులకు అందించాలని, ఎట్టి పరిస్థితుల్లో ఇతరులకు ఇవ్వకూడదని పేర్కొన్నారు. స్థానికంగా ఉండి కదలలేని స్థితిలో ఉన్న పట్టాదారుని ఇంటికి రెవెన్యూ సిబ్బంది వెళ్లి చెక్కు అందించాలని సూచించారు. గ్రామాల వారీగా పట్టాదారుల చెక్కులను సరి చేసుకోవాలని, వాటిని భద్రంగా పోలీస్‌స్టేషన్, పోస్టాఫీసు స్ట్రాంగ్ రూమ్‌లలో ఉంచాలని తెలిపారు. చెక్కుల పంపిణీకి షెడ్యూల్ తయారు చేయాలని, ఇంగ్లిష్ అక్షర క్రమంలో తయారు చేయడానికి ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు. గ్రామాల్లోని వీఆర్వో, వీఆర్ఏ, ఏఈవోలను కార్యక్రమంలో భాగస్వాములు చేయాలని పేర్కొన్నారు. రైతు సమన్వయ సమితుల సహకారం తీసుకోవాలని, షెడ్యూల్ ప్రకారం చెక్కుల పంపిణీకి ఒక రోజు ముందే గ్రామాల్లో ఠాంఠాం విస్తృతంగా నిర్వహించాలని చెప్పారు. చెక్కుల పంపిణీ తీరును వీడియో చిత్రీకరణ చేయాలని పేర్కొన్నారు. ఏ గ్రామంలో ఏప్రాంతంలో చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారో ముందుగా ఆ గ్రామాల్లో ప్రచారం చేయాలన్నారు. కౌలు రైతులకు రుణ అర్హత కార్డులను తహసీల్దార్లు ఇవ్వాలని, రైతులు, సర్వేనంబర్ల వారీగా పంటల వివరాలు నమోదు చేయాలని చెప్పారు. జిల్లాలో శనగ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని, ప్రతి రైతు నుంచి రోజుకు 2 వేల క్వింటాళ్లు కొనుగోలు చేస్తామని రైతులకు వివరించాలని తెలిపారు. ఇచ్చోడ, బేల కొనుగోలు కేంద్రాలు సోమవారం నుంచి ప్రారంభమవుతాయని అన్నారు. ఆర్డీవోలు సూర్యనారాయణ, జగదీశ్వర్‌రెడ్డి, డీఎస్వో శ్రీకాంత్‌రెడ్డి, జేడీఏ ఆశాకుమారి, డీఎస్‌హెచ్‌వో నర్సింగ్‌దాస్, మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ పుల్లయ్య, తహసీల్దార్లు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. ఆసుపత్రుల్లో సదుపాయాలు కల్పించాలి ఆదిలాబాద్‌అర్బన్: వైద్యం కోసం ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే గర్భిణులకు సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ దివ్యదేవరాజన్ అన్నారు. శనివారం కలెక్టర్‌తన క్యాంప్ కార్యాలయంలో వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్యం కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, రిమ్స్ ఆసుపత్రికి వచ్చే గర్భిణులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని తెలిపారు. పౌష్టికాహార లోపంతో బాధపడే పిల్లలను రిమ్స్, ఉట్నూర్‌లలో ఉన్న పౌష్టికాహార కేంద్రాలకు పంపిస్తామని తెలిపారు. గ్రామాల్లోని పిల్లలను పోషకాహార పునరావాస కేంద్రాలకు ఎక్కువ మందిని పంపించే ఆశ, అంగన్వాడీ కార్యకర్తలకు నగదు ప్రోత్సాహకం అందించాలని పేర్కొన్నారు. ఆశలకు రూ.300 చొప్పున, అంగన్వాడీలకు రూ.100 చొప్పున అందించాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో డీఎంహెచ్‌వో రాజీవ్‌రాజ్, రిమ్స్ డైరెక్టర్ అశోక్, వైద్యాధికారులు పాల్గొన్నారు. -
మట్టపల్లి వంతెన
మట్టపల్లి (మఠంపల్లి), న్యూస్‌లైన్ : మట్టపల్లి వద్ద కృష్ణానదిపై రూ.50 కోట్లతో నిర్మిస్తున్న హైలెవల్ వంతెనకు శ్రీలక్ష్మీనృసింహుడి వారధిగా ప్రభుత్వ అనుమతితో నామకరణం చేయనున్నట్టు రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం మట్టపల్లి వద్ద వంతెన నిర్మాణ పనులకు ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడినుంచి భారీ ర్యాలీగా లక్ష్మీనృసింహస్వామి దేవాలయ సమీపంలోని బహిరంగ సభాస్థలికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ వారధి వల్ల ఫిబ్రవరి చివరి నాటికి ఏర్పడే రెండు రాష్ట్రాల మధ్య వ్యాపార, వాణిజ్య, వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు మెరుగైన సౌకర్యాలు సమకూరుతాయన్నారు. రాష్ట్రంలో మూడవ విడత రచ్చబండలో రూ.10,450 కోట్లతో 13లక్షల 65 ఇళ్లను ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించినట్లు తెలిపారు. హుజూర్నగర్ నియోజకవ ర్గంలోని అన్ని మండలాల్లో విద్యుత్, విద్య, వైద్యం, రహదారి, సాగు తాగునీరు పథకాలను కోట్లాది రూపాయలతో చేపట్టినట్లు వివరించారు. హుజూర్‌నగర్‌లో 112 ఎకరాలలో రూ.150 కోట్లతో నిర్మిస్తున్న హౌసింగ్ కాలనీ పరిశీలనకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని ఆహ్వానించనున్నట్టు వెల్లడించారు. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ సీమాంధ్ర నాయకులు ఎన్ని బెదిరింపులకు పాల్పడినా సోనియాగాంధీ తెలంగాణ ఏర్పాటుకే మొగ్గుచూపుతున్నారన్నారు. ప్రస్తుతం ఎన్టీపీసీలో సాంకేతిక లోపం కారణంగా తాత్కాలికంగా ఏర్పడిన విద్యుత్ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. అనంతరం రైతుబంధు పథకం కింద రూ.కోటి 70 లక్షల రుణాలను రైతులకు చెక్కు రూపంలో అందజేశారు. దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్‌లు, వివిధ వర్గాల వారు మంత్రి, ఎంపీలను శాలువాలు, పూలమాలలతో సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చిరంజీవులు, హౌసింగ్ సీఈ ఈశ్వరయ్య, ఆర్అండ్బీ ఎస్ఈ లింగయ్య, ఆర్డీఓ శ్రీనివాసరెడ్డి, ఐడీసీ డెరైక్టర్ శివారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నాగన్నగౌడ్, జిల్లా గ్రంథాలయ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ వెంకటేశ్వర్లు, బ్లాక్, మండల అధ్యక్షులు అరుణ్‌కుమార్‌దేశ్‌ముఖ్, మంజీనాయక్, నాయకులు నిజాముద్దీన్, మధిరప్రతాపరెడ్డి, వెంకటనర్సయ్య, వెంకటరెడ్డి, జి.వెంకటేశ్వర్లు, రామారావు, గడ్డిరెడ్డి,అప్పయ్య, ఎలియాస్‌రెడ్డి, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.