ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈ నెల 10వ తేదీన రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్‌కు వస్తున్నట్లుగా సమాచారం. చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు కరీంనగర్‌కు విచ్చేస్తున్న సీఎం, కాగజ్‌నగర్‌కు సైతం వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలిసింది. ఇటీవల మంత్రి కేటీఆర్ వస్తున్నట్లుగా ప్రచారం జరిగినా, చివరి నిమిషంలో మంత్రి కార్యక్రమం రద్దయ్యింది.
దీంతో ఎలాగైనా 10న సీఎం కాగజ్‌నగర్‌కు విచ్చేసి రైతుబంధు చెక్కుల పంపిణీతో పాటు మిషన్ భగీరథ, ఇతరత్ర అభివృద్ధి పనులను ప్రారంభించనున్నట్లుగా తెలిసింది. ఇదే విషయమై ఎమ్మెల్యే కోనేరు కోనప్పను సాక్షి సంప్రదించగా, అధికారికంగా ఇంకా ధ్రువీకరణ జరగలేదని, సీఎం కేసీఆర్ వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, శనివారం పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment