Kagajnagar
-
కాగజ్‌నగర్ కాటన్ మిల్లులో అగ్ని ప్రమాదం
రెబ్బెన(ఆసిఫాబాద్): కుమురంభీం జిల్లా రెబ్బెన మండలంలోని కాగజ్‌నగర్ కాటన్ మిల్లులో శుక్రవా రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రూ.2 కోట్ల విలువైన పత్తి అగ్నికి ఆహుతైంది. ఈ ఘనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. శుక్రవారం మధ్యా హ్నం తర్వాత మిల్లులోకి పత్తి లోడుతో వచ్చిన ట్రాక్టర్ ఇంజిన్ స్టార్ట్ చేసే క్రమంలో నిప్పురవ్వలు చెలరేగాయి. క్షణాల్లోనే మిల్లు ఆవరణలో ఉన్న పత్తితో పాటు బేళ్లకు అంటుకోవటంతో పెద్దమొత్తంలో మంటలు వ్యాపించాయి. అక్కడ ఉన్న వారు వెంటనే ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ పట్టణాల్లోని ఫైరింజన్లకు సమాచారం అందించగా.. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. అప్పటికే 2,300 క్వింటాళ్ల పత్తితోపాటు, 94 పత్తి బేళ్లు కాలిపోయాయని మిల్లు నిర్వాహకులు తెలిపారు. -
‘పేకాట’కు పహారా.. ఇలాంటివి ఎన్ని చూడలే..!
కుమరం భీం: జిల్లా పోలీసులంటే క్రమశిక్షణకు మారుపేరని.. విధుల్లో అంకితభావం ఉండేదని.. నిక్కచ్చిగా వ్యవహరించేవారని.. ఇక ప్రజల భద్రత కోసం నిరంతరం పనిచేస్తారని.. అసాంఘిక కార్యకలపాలపై ఉక్కుపాదం మోపేవారని ఒకప్పుడు ప్రజల్లో పేరుండేది.. ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితి పోలీసుశాఖలో నెలకొంది. మంగళవారం ‘సాక్షి’లో ‘దర్జాగా పేకాట!’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశం కాగా.. అధికారపార్టీ నేతల మెప్పు కోసం ‘పేకాట’కు అండగా నిలుస్తున్న కొందరు పోలీసుల్లో మాత్రం ‘ఆ.. ఏమైతది!?’ అనే నిర్లక్ష్య ధోరణి కనిపిస్తుంది. పనిష్మెంట్ ఇచ్చినా.. పోస్టింగ్ ఇస్తరు.. కాగజ్‌నగర్ పట్టణ, శివారు ప్రాంతాల్లో జోరుగా జరుగుతున్న పేకాటపై మంగళవారం ‘సాక్షి’లో వచ్చిన కథనంపై ఓ పోలీసు అధికారి నిర్లక్ష్య ధోరణిలో మాట్లాడడం.. పోలీసుశాఖపై అధికారపార్టీ నేతల ఒత్తిళ్లు ఏ మేరకు ఉంటాయన్న విషయాన్ని బట్టబయలు చే స్తోంది. ‘పేకాటపై కథనం వచ్చింది. ఆ.. ఏమైతది!? ఇట్లాంటి కథనాలు ఎన్ని చూడలే.. పోలీసుబాస్ చీవాట్లు పెడతారు. మహా అయితే బదిలీ చేస్తరు. అధికారపార్టీ నేతల ఆశీస్సులుంటే మళ్లీ కొన్నాళ్లకు ఇదే జిల్లాలో పోస్టింగ్ ఇస్తరు. అధికారపార్టీ నేతల్ని కాదని ఇక్కడ పనిచేయలేం’ అని పేర్కొనడం క్రమశిక్షణారాహిత్యానికి అద్దం పడుతోంది. పోలీసుశాఖలో ‘లెటర్ల’ వ్యవస్థ వెళితేనే మళ్లీ ఆ శాఖ పూర్వవైభవాన్ని సంతరించుకుంటుందని స్థానికులు అభిప్రాయపడతున్నారు. ‘సిర్పూర్’.. అన్నింటికీ అడ్డా..! సిర్పూర్ నియోజకవర్గం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ముఖ్యంగా కాగజ్‌నగర్ పట్ట ణం కల్తీకి కేరాఫ్‌గా నిలుస్తోంది. ఇక్కడ గుట్కా, పా న్ మసాలాలు, మద్యం ఇలా ఎన్నో కల్తీ ఉత్పత్తుల ను కొన్ని ముఠాలు మార్కెట్లో విక్రయిస్తూ భారీ గా అర్జిస్తున్నాయి. ఇక మట్కాకు ఈ నియోజకవర్గం ఓ డెన్‌గా మారిందంటే అతిశయోక్తికాదు. ఒకవైపు వరుస దాడుల్లో ఈ దందాలన్నీ మూతపడ్డాయని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్న మాటలకు.. ఇక్కడ జరుగుతున్న తీరుకు పొంతన ఉండడం లేదు. ఈ నియోజకవర్గానికి పొరుగున ఉన్న మహారాష్ట్రలోని జిల్లాలో ఒకప్పుడు మద్యపాన నిషేధం అమల్లో ఉండేది. ఆ సమయంలో ఇక్కడి నుంచి అక్కడకు భారీగా మద్యం సరఫరా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే అదనుగా కల్తీ ముఠాలు.. మద్యం బాటిళ్ల నుంచి కొంత మద్యాన్ని తీసి.. అంతే మొత్తంలో స్పిరిట్ కలిపి మళ్లీ యథాతథంగా బాటిళ్లను సీల్ చేసి మహారాష్ట్ర జిల్లాల్లో విక్రయించి భారీగా సొమ్ము చేసుకున్నట్లు పోలీసు వర్గాలే చెబుతున్నాయి. గుట్కా, పాన్మాసాలాల విషయంలోనూ అదే మాదిరి కల్తీ చేసి ‘దో నంబర్’ దందాకు తెరతీశారని సమాచారం. ఈ దందాలన్నీ నేటికీ కాగజ్‌నగర్ పరిసర ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతుండటం గమనార్హం. ‘పేకాట’కు పహారా.. కాగజ్‌నగర్‌లోని రెండు ప్రాంతాల్లో పేకాట జోరుగా సాగుతోందన్న విషయం నగ్న సత్యం. అధికారపార్టీ నేతల అనుచరులు ఈ రెండు శిబిరాలను నిర్వహిస్తుండడంతో పోలీసులు అటువైపు వెళ్లడానికి సాహసించడం లేదు. పైగా నేతల మెప్పు కోసం కొందరు పోలీసు అధికారులు ఆ జూద శిబిరాలకు పహారా కాస్తున్నారన్న ఆరోపణలున్నాయి. జూద శిబిరాల నిర్వాహకులు నెలానెలా వారికి పెద్దమొత్తంలో ము డుపులు ముట్టజెప్పుతుండటమే ఇందుకు కారణ మని తెలుస్తోంది. ముఖ్యంగా స్థానికంగా ఉన్న ఓ అధికారికి రూ.లక్ష.. సిబ్బందికి రూ.50 వేలు.. జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా దాడులు నిర్వహించే మరో టీం సభ్యులకు రూ.లక్షకు పైగా మామూళ్లు ఇస్తున్నామని ఆ నిర్వాహకులే బాహాటంగానే పేర్కొంటుండడం గమనార్హం. పోలీసుశాఖలోనూ అధికారపార్టీ నేతల చెప్పినట్లు నడుచుకుంటేనే పోస్టింగ్ పదిలమనే భావన నెలకొనడంతో విచ్చలవిడిగా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
భారీ చోరి..పది లక్షల బంగారు నగలు మాయం
సాక్షి, అసిఫాబాద్: కాగజ్ నగర్ మండలం ఈస్గాం మార్కెట్ లో భారీ చోరీ జరిగింది. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం రాత్రి స్నేహ జ్యువెలరీ దుకాణంలో కొందరు దుండగులు షట్టర్ పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. కాగా దుకాణంలో సుమారు పది లక్షల విలువైన నగలు దోచుకెళ్లారిని పోలీసులు తెలిపారు. ఈ ఘటనను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ బృందాలతో రంగంలోకి దిగిన అధికారలు దర్యాప్తు ముమ్మరం చేశారు. దోపిడీ జరిగిన ప్రాంతాన్ని ఎస్పీ సుదీంద్ర సందర్శించారు. ఈ సందర్బంగా దొంగలు దోపిడీ చేసిన తీరును స్థానిక పోలీసులను ఆయన అడిగి తెలుసుకున్నారు. పరిసరాల్లోని సీసీ కెమెరాల ద్వారా ఈ దొంగతనం రికార్డు కావడంతో ప్రస్తుతం అధికారులు ఆ వీడియోలను నిశితంగా పరిశీలిస్తున్నారు. అందులో ముగ్గురు వ్యక్తులు చోరిలో పాల్లొన్నట్టు కెమెరాలలో రికార్డైంది. సీసీ పుటేజీ ఆధారంగా దొంగలని పట్టుకోవడానికి పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
తాళాలేసి పని కానిస్తున్నారు...
సాక్షి, కాగజ్‌నగర్ : పట్టణంలోని కొంత మంది సా మిల్లు (కలప కటింగ్ కేంద్రం) యజమానులు అటవీ శాఖ నుంచి రెన్యూవల్ ప్రక్రియ పూర్తి కాకపోయినా దర్జాగా మిల్లులను నడిస్తున్నారు. ప్రతి సంవత్సరం సా మిల్లు నిర్వాహకులు అటవీ శాఖ నుంచి రెన్యూవల్ (అధికారిక అనుమతి) పొందాలి. ఈ సంవత్సరం 2020 మార్చి 31న సా మిల్లుల కాలపరిమితి ముగిసింది. ఉన్నతాధికారులు రెన్యూవల్ ప్రక్రియను పూర్తి చేయడానికి ఏప్రిల్ 30 వరకు గడువు ఇచ్చారు. గడువు ముగిసి 13 రోజులు గడుస్తున్నప్పటికీ కొంత మంది సా మిల్లు నిర్వాహకులు రెన్యూవల్ ప్రక్రియను ఇప్పటి వరకూ పూర్తి చేయించలేదు. సరికదా నిబంధనలకు నీళ్లొదిలి దర్జాగా మిల్లులను నడిస్తున్నారు. సా మిల్లు ముందు ఉన్న ప్రధాన గేట్లకు తాళాలు వేసి, లోపల కూలీల ద్వారా పనులు చేయిస్తున్నారు. వీరు కొందరు ఫారెస్ట్ అధికారుల ప్రోద్బలంతో ఇష్టారాజ్యంగా పనులు కొనసాగిస్తున్నారని ఆరోపణలు వినవస్తున్నాయి. గత 15 రోజుల నుంచి కొంత మంది యజమానులు సా మిల్లులను నడిస్తున్నప్పటికీ స్థానిక అధికారులు ‘మామూలు’గానే తీసుకుంటన్నారని ఫిర్యాదులున్నాయి. సా మిల్లుల్లో పని చేసే కూలీలకు కనీసం మాస్క్‌లు, శానిటైజర్లు ఇవ్వకుండా కూలీ పనులు చేయిస్తున్నట్లు సమాచారం. అధికారులు స్పందించి నిబంధనలు అతిక్రమించిన మిల్లుల యజమానులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయంపై కాగజ్‌నగర్ ఎఫ్‌డీవో విజయ్ కుమార్‌ను వివరణ కోరగా కొన్ని సా మిల్లులకు అనుమతి లభించలేదని, రెన్యూవల్ ప్రక్రియ పూర్తయిన తర్వాతే పనులు చేయాలని స్పష్టం చేశారు. -
10న కాగజ్‌నగర్‌కు సీఎం కేసీఆర్?
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈ నెల 10వ తేదీన రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్‌కు వస్తున్నట్లుగా సమాచారం. చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు కరీంనగర్‌కు విచ్చేస్తున్న సీఎం, కాగజ్‌నగర్‌కు సైతం వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలిసింది. ఇటీవల మంత్రి కేటీఆర్ వస్తున్నట్లుగా ప్రచారం జరిగినా, చివరి నిమిషంలో మంత్రి కార్యక్రమం రద్దయ్యింది. దీంతో ఎలాగైనా 10న సీఎం కాగజ్‌నగర్‌కు విచ్చేసి రైతుబంధు చెక్కుల పంపిణీతో పాటు మిషన్ భగీరథ, ఇతరత్ర అభివృద్ధి పనులను ప్రారంభించనున్నట్లుగా తెలిసింది. ఇదే విషయమై ఎమ్మెల్యే కోనేరు కోనప్పను సాక్షి సంప్రదించగా, అధికారికంగా ఇంకా ధ్రువీకరణ జరగలేదని, సీఎం కేసీఆర్ వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, శనివారం పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందని చెప్పారు. -
అలరించే అడవి అందాలు
చింతలమానెపల్లి(సిర్పూర్): జిల్లాలో అలరించే ప్రకృతి అందాలు ఎన్నో ఉన్నాయి. కాగజ్‌నగర్ అటవీ డివిజన్ పరిధిలోని కాగజ్‌నగర్, కౌటాల, చింతలమానెపల్లి, బెజ్జూర్, పెంచికల్పేట్, దహెగాం మండలాల్లోని దట్టమైన అటవీ ప్రాంతం ఎన్నో రకాల వన్యప్రాణులకు నెలవు. డివిజన్లోని అడవులలో ప్రవహించే ప్రాణహిత నది, పెద్ద వాగు (బీబ్రానది) అందాలు పర్యాటకంగా ప్రకృతి ప్రేమికుల మనసును దోస్తున్నాయి. వివిధ ప్రాంతాల్లో వన్యప్రాణులు సందడి చేస్తూ అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో చిక్కాయి. మరికొన్ని చిత్రాలను అధికారులు ప్రత్యేక కెమెరాలతో చిత్రీకరించారు. ఈ చిత్రాలను కాగజ్‌నగర్ అటవీ అధికారుల వద్ద నుంచి ‘సాక్షి’ సేకరించింది. -
మద్యం.. కల్తీ దందా..!
కాగజ్‌నగర్‌లో పడగ విప్పుతున్న మాఫియా మద్యంప్రియుల జీవితాలతో చెలగాటం మహారాష్ట్రకు తరలుతున్న కల్తీసరుకు చోద్యం చూస్తున్న అధికారులు కాగజ్‌నగర్ : కాగజ్‌నగర్ ప్రాంతంలో మద్యం మాఫియా కోరలు చాస్తోంది. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ మందుబాబుల జీవితాలతో చెలగాటమాడుతోంది. కాగజ్‌నగర్ ప్రాంతం మహారాష్ట్రకు సరిహద్దులో ఉండడం, ఈ ప్రాంతానికి ఆనుకుని ఉన్న చంద్రపూర్ జిల్లాలో మద్యపాన నిషేధం అమలులో ఉండడం కొందరు మద్యం అక్రమ వ్యాపారులకు కాసులు కురిపిస్తోంది. గత నెల 25న కాగజ్‌నగర్ రైల్వేస్టేషన్ వెనుక భాగంలో ఓ పాడుబడిన ఇంట్లో కల్తీ మద్యం తయారు చేసే కుటీర పరిశ్రమను అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. బ్రాండెడ్ కంపెనీలకు చెందిన మద్యం కల్తీ చేస్తూ నకిలీ సీళ్లు బిగిస్తూ ఇటు సిర్పూర్ నియోజకవర్గంలో అటు మహారాష్ట్రకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటుండగా, అధికారులు ఆలస్యంగా పట్టుకున్నారు. గత కొంతకాలంగా పట్టణంతోపాటు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కొందరు మద్యం వ్యాపారులు అధిక ధరలకు మద్యం విక్రయించడమే కాకుండా లూజ్ విక్రయాలు చేస్తూ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారని ఫిర్యాదులున్నాయి. ఇటీవల పట్టణంలోని రాజ్‌కుమార్ లాడ్జి సమీపంలోని మద్యం దుకాణంలో అధిక ధరకు బీర్లు విక్రయించగా.. కొనుగోలుదారుడు ప్రశ్నించినందుకు అతడిని షాపు నిర్వాహకులు చితక్కకొట్టారని ఫిర్యాదులు అందాయి. బ్రాండెడ్ మద్యం బాటిళ్లలో కల్తీ చేయడమే కాకుండా కొందరు స్పిరిట్ కలుపుతూ మద్యంప్రియుల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు. ఈ ప్రాంతంలో కల్తీ మద్యం ఏరులైపారుతోంది. అయినప్పటీకి ఎకై ్సజ్ అధికారులు అడ్డుకట్ట వేయలేకపోతున్నారనే ఆరోపణలున్నాయి. కల్తీదందా వ్యాపారులు కొందరు ఎక్సైజ్ అధికారులతో కుమ్ముకై దందా సాగిస్తున్నారనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి. గత మే, జూన్, జూలైలో ఎక్సైజ్ అధికారులు నాలుగు వైన్స్‌షాపులు సీజ్ చేశారు. నకిలీ మూతలు బిగించి అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. మద్యం కల్తీ దందా ఏ మేరకు సాగుతుందో దీన్ని బట్టే తెలుస్తోంది. రాయల్ స్టాగ్, మెక్డావల్, ఆఫీసర్స్ ఛాయిస్, ఎంపెరియల్ బ్లూ వంటి బ్రాండెడ్ కంపెనీలకు చెందిన నకిలీ మూతలను హైదారాబాద్ నుంచి కాగజ్‌నగర్‌కు తీసుకువచ్చి స్పిరిట్ కలిపిన కల్తీ మద్యం సీసాలపై బిగించి కోట్లాది రూపాయలు దండుకుంటున్నారు. స్పిరిట్ కలిపిన మద్యం కారణంగా ప్రజలు అనారోగ్యం బారినపడుతున్నారు. కాలేయ సంబంధిత వ్యాధిగ్రస్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతోందని వైద్యులు చెబుతున్నారు. గత ఆరు నెలల నుంచి ఇప్పటి వరకు కాగజ్‌నగర్‌కు చెందిన ఆరుగురు మద్యంప్రియుల కాలేయం పూర్తిగా దెబ్బతిని మృత్యువాతపడ్డారు. మద్యం సేవించడం వల్లే మరణించారని వైద్యులూ ప్రకటించారు. నియోజకవర్గంలోని సిర్పూర్, కౌటాల, బెజ్జూర్, దహెగాం, కాగజ్‌నగర్ పట్టణంతోపాటు మండలంలో లైసెన్సు మద్యంషాపులు నిర్వహిస్తున్నారు. లైసెన్స్‌దారుల నుంచి కొందరు అక్రమార్కులు అధిక ధరలకు దుకాణాలు లీజుకు తీసుకుని ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో కల్తీ, నకిలీ దందాకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులు స్పందించి కల్తీ దందా అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. కల్తీ మద్యంపై కాగజ్‌నగర్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మంగమ్మను సంప్రదించగా.. కల్తీకి పాల్పడుతున్న వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు. అధిక ధరలకు మద్యం విక్రయించే వారిపై కూడా జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. మహారాష్ట్రకు కల్తీ మద్యం రవాణా చేసే గుట్టును రట్టు చేసినట్లు తెలిపారు. కల్తీ, నకిలీలకు పాల్పడే వారిపై ప్రజలు తమకు సమాచారం అందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. -
సాక్షి హరితహారం
-
పులుల సంరక్షణకు చర్యలు
కాగజ్‌నగర్ రూరల్(సిర్పూర్(టి)) : కాగజ్‌నగర్ అటవీ శాఖ డివిజన్ పరిధిలో పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు డీఎఫ్‌వో శివప్రసాద్ తెలిపారు. సోమవారం కాగజ్‌నగర్‌లోని డీఎఫ్‌వో కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంగళవారం ప్రపంచ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలోని నవోదయ పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కాగజ్‌నగర్ అటవీ శాఖ డివిజన్ పరిధిలో పులుల సంరక్షణకు 40 సీసీ కెమరా లు అమర్చడంతో పాటు 30 మంది బేస్‌క్యాంప్ వాచ ర్లు, పది మంది స్ట్రైకింగ్ ఫోర్స్ సిబ్బంది ఎప్పటికప్పుడు అటవీ ప్రాంతంలో సంచరిస్తూ పులుల సంరక్షణకు కృషి చేస్తారని వివరించారు. ముఖ్యంగ పోడు వ్యవసాయం కారణంగా వణ్యప్రాణులు, మృగాలు అంతరించిపోతున్నాయని, పోడు వ్యవసాయం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దినోత్సవం అలా మొదలైంది 2010లో రష్యాలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో జులై 28వ తేదిని అంతర్జాతీయ పులుల దినోత్సవంగ పరిగణించాలని నిర్ణయించారని డీఎఫ్‌వో తెలిపారు. 1913లో ప్రపంచవ్యాప్తంగా లక్ష పులులు ఉన్నట్లు నిర్ధారించగా ఈ వందేళ్ల కాలంలో మూడు వేలకు తగ్గిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కేవలం మూడు వేల పులులు ఉండ గా భారతదేశంలోనే 1700 పులులు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. పులుల దినోత్సవాన్ని పురస్కరించుకొని అన్ని గ్రామాల్లో పులుల సంరక్షణపై గ్రామీణులకు అవగాహ కల్పిస్తామని చెప్పారు.