కాగజ్‌నగర్ అటవీ శాఖ డివిజన్ పరిధిలో పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు డీఎఫ్‌వో శివప్రసాద్ తెలిపారు.
కాగజ్‌నగర్ రూరల్(సిర్పూర్(టి)) : కాగజ్‌నగర్ అటవీ శాఖ డివిజన్ పరిధిలో పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు డీఎఫ్‌వో శివప్రసాద్ తెలిపారు. సోమవారం కాగజ్‌నగర్‌లోని డీఎఫ్‌వో కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంగళవారం ప్రపంచ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలోని నవోదయ పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
కాగజ్‌నగర్ అటవీ శాఖ డివిజన్ పరిధిలో పులుల సంరక్షణకు 40 సీసీ కెమరా లు అమర్చడంతో పాటు 30 మంది బేస్‌క్యాంప్ వాచ ర్లు, పది మంది స్ట్రైకింగ్ ఫోర్స్ సిబ్బంది ఎప్పటికప్పుడు అటవీ ప్రాంతంలో సంచరిస్తూ పులుల సంరక్షణకు కృషి చేస్తారని వివరించారు. ముఖ్యంగ పోడు వ్యవసాయం కారణంగా వణ్యప్రాణులు, మృగాలు అంతరించిపోతున్నాయని, పోడు వ్యవసాయం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
దినోత్సవం అలా మొదలైంది
2010లో రష్యాలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో జులై 28వ తేదిని అంతర్జాతీయ పులుల దినోత్సవంగ పరిగణించాలని నిర్ణయించారని డీఎఫ్‌వో తెలిపారు. 1913లో ప్రపంచవ్యాప్తంగా లక్ష పులులు ఉన్నట్లు నిర్ధారించగా ఈ వందేళ్ల కాలంలో మూడు వేలకు తగ్గిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కేవలం మూడు వేల పులులు ఉండ గా భారతదేశంలోనే 1700 పులులు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. పులుల దినోత్సవాన్ని పురస్కరించుకొని అన్ని గ్రామాల్లో పులుల సంరక్షణపై గ్రామీణులకు అవగాహ కల్పిస్తామని చెప్పారు.